పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 22, 2014

ఆంధ్రప్రదేశ్ జనాబా లెక్కలు 2011

ఆంధ్రప్రదేశ్ వైశాల్యం 275.05 వేల చదరపు కిలోమీటర్లు. ఇది దేశ వైశాల్యంలో 8.37 శాతం. వైశాల్యం దృష్ట్యా దేశంలో నాలుగో స్థానం. రాష్ట్రంలో మొత్తం జిల్లాలు 23. 81 రెవెన్యూ డివిజన్లు, 1128 మండలాలు, 21,895 గ్రామ పంచాయతీలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27,800 గ్రామాలున్నాయి. పట్టణాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. పట్టణ పురపాలక సంఘాలున్న వాటిని చట్టబద్ధ పట్టణాలని పిలుస్తారు. అదేవిధంగా జనాభా లెక్కల రీత్యా కొన్ని అంశాలను తీసుకుని వాటిని జనాభా పట్టణాలుగా పిలుస్తారు. ఈ రెండు రకాల పట్టణాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 353 ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8.46 కోట్లు. పురుషులు 4.25 కోట్లు, స్త్రీలు 4.21 కోట్లు. రాష్ట్ర మొత్తం జనాభాలో పట్టణ జనాభా 33.49 శాతం. ఇది భారతదేశ పట్టణ జనాభా వాటా కంటే అధికం.

గ్రామీణ జనాభా 5.63 కోట్లు. గ్రామీణ జనాభాలో పురుషుల సంఖ్య 
2.82 కోట్లు, మహిళల సంఖ్య 2.80 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ
 జనాభా 2.83 కోట్లు. దీంట్లో పురుషులు 1.42 కోట్లు, మహిళల జనాభా
 1.40 కోట్లు. దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ వాటా ఏడు శాతం. జనాభా 
రీత్యా ఆంధ్రప్రదేశ్ దేశంలో అయిదో పెద్ద రాష్ట్రం. 1961లో ఆంధ్రప్రదేశ్ 
జనాభా 3.59 కోట్లు మాత్రమే.2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్
 జనాభా 7,62,10,007 కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 
8,46,65,533. రాష్ట్రంలో 2001లో జనసాంద్రత 277 ఉండగా 2011లో
 అది 308 కి పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లా 
హైద్రాబాద్.
ఇక్కడ 2011లో జన సాంద్రత 18,480. 2001లో 17,649. అప్పుడు కూడా జన సాంద్రతలో మొదటి స్థానంలో ఉన్నది హైద్రాబాదే.అతి తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లా ఆదిలాబాద్ (చదరపు కిలోమీటరుకు 170). 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ మహానగర జనాభా 77,49,334. దీంట్లో పురుషులు 39,85,240, స్త్రీలు 37,64,094.
తగ్గిన జనాభా వృద్ధిరేటు
గత దశాబ్దకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జనాభా వృద్ధిరేటు గణనీయంగా పడిపోయింది. జనాభా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. 1991 నుంచి 2001 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధిరేటు 14.59 శాతం. 2001 నుంచి 2011 మధ్యకాలంలో వృద్ధిరేటు 11.1 శాతానికి తగ్గింది. 2001 నుంచి 2011 మధ్యకాలంలో జనాభా అధికంగా (48.15 శాతం) పెరిగిన జిల్లా రంగారెడ్డి.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అతి తక్కువ జనాభా పెరుగుదల పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదైంది. ఈ జిల్లాలో గత దశాబ్దకాలంలో జనాభా పెరుగుదల కేవలం 3.45 శాతం మాత్రమే. దశాబ్దకాలంలో గ్రామీణ ప్రాంత జనాభా పెరుగుదలరేటు కేవలం 1.64 శాతం కాగా, పట్టణ జనాభా పెరుగుదల రేటు 36.26 శాతంగా ఉంది. మొత్తం మీద చూస్తే గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు 11.10 శాతం.
స్త్రీ, పురుష నిష్పత్తి
ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ, పురుష నిష్పత్తి 2001లో 978 ఉండగా 2011లో 992కు పెరిగింది. ఇదే కాలంలో భారతదేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి 933 నుంచి 940కి పెరిగింది. అంటే భారతదేశంలో మెరుగైన స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కేరళలో పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంది. మన రాష్ట్రం ఈ స్థాయికి చేరుకోవడానికి చాలాకాలం పడుతుంది. గత దశాబ్దకాలంలో దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో సాధించిన పెరుగుదల కంటే ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ, పురుష నిష్పత్తిలో పెరుగుదల మెరుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతంలో స్త్రీ, పురుష నిష్పత్తి 995 ఉండగా పట్టణ ప్రాంతంలో అంత కంటే తక్కువ (కేవలం 984)గా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఆరేళ్ల లోపు పిల్లల సంఖ్య 86,42,686. దీంట్లో బాలల సంఖ్య 44,48,330; బాలికల జనాభా 41,94,356 గా ఉంది. రాష్ట్రం మొత్తం జనాభాలో ఆరేళ్ల లోపు పిల్లల జనాభా 10.21 శాతం. రాష్ట్ర జనాభాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరేళ్ల లోపు పిల్లల సంఖ్య 58,52,284 కాగా, పట్టణ ప్రాంతాల్లో 27,90,402.
ఏపీలో బాలబాలికల నిష్పత్తి 943. ఇది కూడా దేశ బాలబాలికల నిష్పత్తి కంటే చాలా ఎక్కువ.
దేశం మొత్తం మీద బాలబాలికల నిష్పత్తి కేవలం 914 మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ బాలబాలికల నిష్పత్తి 942 ఉండగా, పట్టణ బాలబాలికల నిష్పత్తి 946గా ఉంది.

అక్షరాస్యతలో వెనుకంజ
2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత 67.66 శాతం 
మాత్రమే. మానవాభివృద్ధిలో ఒక అంశమైన స్త్రీ, పురుష నిష్పత్తిలో 
ఆంధ్రప్రదేశ్ దేశ సగటు కంటే మెరుగ్గా ఉండగా, అక్షరాస్యత విషయంలో 
తక్కువగా ఉండటం ఆందోళనకరం. 2001 జనాభా లెక్కల ప్రకారం 
రాష్ట్రంలో అక్షరాస్యతా రేటు 60.47 శాతం. ఇది 2011లో 67.66 శాతానికి
 పెరిగింది. పురుషుల అక్షరాస్యతా రేటు 2001 నుంచి 2011
 మధ్యకాలంలో 70.32 శాతం నుంచి 75.56 శాతానికి పెరిగింది.
 స్త్రీలలో 50.43 శాతం నుంచి 59.74 శాతానికి పెరిగింది. 2011 జనాభా
 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ అక్షరాస్యతా శాతం 61.44 కాగా,
 పట్టణ అక్షరాస్యతా రేటు 80.54 శాతం. 

చట్టసభల్లో ప్రాతినిధ్యం...ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు 
ఉండగా, రాష్ట్రం నుంచి రాజ్యసభలో 18 స్థానాలున్నాయి. రాష్ట్ర 
శాసనసభలో మొత్తం స్థానాల సంఖ్య 295. శాసనమండలిలో మొత్తం
 స్థానాలు 90.

రాష్ట్ర ఆర్థికస్థితి
ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 
2011-12లో ప్రస్తుత ధరల ఆధారంగా 
రూ. 6,76,234 కోట్లు. 2010-11 లో రూ.5,88,963 
కోట్లుగా ఉంది. 2004-05లో ఇది రూ.2,24,713 కోట్లు 
మాత్రమే. స్థూల రాష్ట్ర ఉత్పత్తిని ప్రస్తుత ధరల 
ఆధారంగా కాకుండా స్థిర ధరల ఆధారంగా 
(2004-05 ధరలు) కూడా లెక్కిస్తారు. ఈ ప్రకారం 
2011-12లో ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర ఉత్పత్తి 
రూ.4,07,949 కోట్లు. ఇది 2010-11లో 
రూ.3,81,942 కోట్లు, 2004-05లో రూ.2,24,713 కోట్లు
.ప్రస్తుత ధరల ఆధారంగా రాష్ట్ర తలసరి ఆదాయం 
2011-12లో రూ.71,540. 2010-11లో ఇది రూ.62,912 మాత్రమే.
స్థిర ధరల ఆధారంగా (2004-05 ధరలు) రాష్ట్ర తలసరి ఆదాయం 2011-12 లో రూ.42,710, కాగా ఇది 2010-11లో రూ.40,366. ఇది 2004-05లో రూ.25,321 మాత్రమే.
జిల్లాల స్వభావం:
2011 లో జనాభా రీత్యా రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాది మొదటిస్థానం. రాష్ట్ర జనాభాలో 6.26 శాతం ఈ జిల్లాలోనే ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా 6.43 శాతంతో మొదటి స్థానంలో ఉండేది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక స్త్రీ, పురుష
నిష్పత్తి ఉన్న జిల్లా నిజామాబాద్. ఇక్కడ స్త్రీ, పురుష నిష్పత్తి 1038. 2001లో కూడా నిజామాబాద్ జిల్లా 1017తో స్త్రీ, పురుష నిష్పత్తిలో రాష్ట్రంలో మొదటి స్థానంలోనే ఉంది. అక్షరాస్యత విషయంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో హైద్రాబాద్ ఉంది.

2011 జనాభా లెక్కల ప్రకారం హైద్రాబాద్‌లో అక్షరాస్యతా రేటు 80.96 శాతం. పురుషుల్లో అక్షరాస్యతా రేటు 83.35 శాతం కాగా, మహిళా అక్షరాస్యతా రేటు 78.42 శాతం.
రాష్ట్రంలో జననాల రేటు 2010లో 17.9 ఉండగా, మరణాల రేటు 7.6 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో శిశు మరణాల రేటు 2009లో 49 ఉండగా, 2010లో 46కు తగ్గింది. భారతదేశం మొత్తం మీద శిశు మరణాల రేటు 47గా ఉంది. దేశంలో జననాల రేటు 22.1 కాగా మరణాల రేటు 7.2గా ఉంది.
రాష్ట్రంలో మొత్తం భూమిలో 23.2 శాతం విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. మొత్తం అటవీ విస్తీర్ణం 63,814 చదరపు కిలోమీటర్లు. 2010-11లో రాష్ట్రంలో మొత్తం భూ వైశాల్యంలో పంటల విస్తీర్ణం 52.8 శాతం. రాష్ట్రంలోని మొత్తం పంటల విస్తీర్ణంలో 67.07 శాతం ఆహార పంటలున్నాయి. 32.93 శాతం విస్తీర్ణంలో ఆహారేతర పంటలున్నాయి. భారతదేశంలో రెండో అతి పొడవైన కోస్తా తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో మొత్తం 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది.
2011-12లో నైరుతి రుతుపవనాల ద్వారా రాష్ట్రంలో 539 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 624 మిల్లీమీటర్లు. అంటే వర్షపాత లోటు 13.6 శాతం. ఈశాన్య రుతుపవనాల వల్ల రాష్ట్రంలో కురిసిన వర్షపాతం 113 మిల్లీమీటర్లు. సాధారణ వర్షపాతం 224 మిల్లీమీటర్లు. అంటే లోటు 49.6 శాతం.2010-11 లో రాష్ట్రం మొత్తం మీద బడిలో చేరిన పిల్లల సంఖ్య 1.33 కోట్లు. దీంట్లో 54.64 లక్షల పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో, 23.30 లక్షల పిల్లలు ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 53.97 లక్షల మంది ఉన్నత పాఠశాలల్లో చేరారు
.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again