పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 16, 2014

జన్మరాశి ఫలాలు 2014


మేషము - జయ

అశ్వని 1,2,3,4 పాదములు (చూ,చే,చో,లా) భరణి 1,2,3,4 పాదములు (లీ,లూ,లే,లో) కృతిక 1 వ పాదము (ఆ)
ఆదాయం - 14 వ్యయం - 2 రాజయోగం - 4 అవమానం - 5 ఈ సంవత్సరం గురువు మిధునంలో (తృతీయం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (చతుర్థం) సంచరిస్తాయి. శని తులలో (సప్తమమం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (అష్టమం) సంచరిస్తారు. రాహువు తులలో (సప్తమం) కేతువు మేషంలో (జన్మం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (షష్టం) కేతువు మీనంలో (వ్యయం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం రాహువు యొక్క అనుకూల సంచారం వలన ధైర్యయుక్తమైన బుద్ధిని అన్ని విషయాలలో ప్రదర్శిస్తారు. సమస్యాత్మక సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరం మీ వెంట ఉంటాయి. అక్టోబరు 18 వరకు కుజ సంచారం కూడా సరిగ్గా లేని దృష్ట్యా జూలై నుండి అక్టోబరు వరకు ఆరోగ్యవిషయాలందు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు మీ యొక్క స్థానమునకు ఇబ్బంది కలిగించే విషయాలు ఎన్నో ఎదురౌతాయి. గృహమునకు వృత్తికి సంభంధించిన ప్రతి ప్రయత్నము, వ్యవహారము చాలా గోప్యంగా ఉంచండి. అన్ని విషయాలలో విరోధ భావనలు పెరుగుతాయి. ప్రతి విషయంలోనూ యాచన భావన బాగా పెరుగుతుంది. తరచుగా బుద్ధి చాంచల్యమునకు గురి అవుతుంటారు.శరీరంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ వచ్చే సమస్యలకు దూరంగా ఒంటరిగా గడపాలనే భావన ఎక్కువ అవుతుంది. అయితే స్థిరబుద్ధిని ఈ సంవత్సరం ప్రదర్శింపగలిగితే మో యొక్క సమస్యలను కొంత దూరంగా ఉంచగలుగుతారు. ఆరోగ్య విషయాలందు జాగ్రత్తలు అధికంగా తీసుకోవలసిన కాలము అంతా సుఖంగానే ఉన్నత్లే ఉండి ఆకస్మాత్తుగా ఇబ్బందులకు గురిచేయు లక్షణాలు బయటపదతాయి. అపమృత్యు భయం వెంబడించడం ఒక ప్రత్యేకత. కుటుంబ విషయాలలో సోదరులతో, బంధువులతో వీలయినంత వరకు జాగ్రత్తగా సంచరించాలి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబపరమైన ఇబ్బందులు ఎక్కువరావనే చెప్పాలి. అన్ని కోణాలలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. తరచుగా కాళ్ళ చేతుల నోప్పులకు గురయ్యే అవకాశం ఉన్నది. తద్వారా ఇబ్బంది. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు ప్రతి నిత్యం ఒక యుద్ధంలాగా నడిచి చివరకు లాభాలు తీసుకొనే అవకాశం ఉన్నది. ఆర్థిక విషయములు పరిశీలింపగా, ఆదాయం క్రమేణా అనుకూలమె. అయితే కుజ సంచారం ఎక్కువకాలం అనుకూలంగా లేకపోవటం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి. వాటిని నిరోదించడం బహు శ్రమయుక్తము. అయితే ఋణ విషయాలలో చికాకులు తరచుగా వస్తాయి. కొత్త ఋణాలు కష్టం. ఈ రాశికి చెందిన స్త్రీల విషయంలోనూ పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం ఎక్కువ. కానీ కార్య నష్టం ఉండదు. ఉద్యోగులకు ఈ సంవత్సరం ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. అందువలన బాగా చికాకు పొందుతారు. మీయొక్క ఉద్యోగ ప్రమోషన్ పని బహు చికాకుతో కూడి ఉంటుంది. ఓర్పు అవసరం. రోజువారీ పనుల విషయంగా అవరోధములు అధికంగా వచ్చే అవకాశం ఉన్నది. స్థాన చలన ప్రయత్నాలు అధికారులను స్నేహంగా సరిచేసుకోకపోతే, బహు చికాకులు కలిగిస్తాయి.

శాంతి:
శని రాహు గురువులకు శాంతి చేయవలెను. నిత్యం సుబ్రమణ్య ఆరాధన చేయడం మరియు నవగ్రహ స్తోత్రముల పారాయణం చేయడం రావిచెట్టు క్రింద ఉన్న ఆంజనేయస్వామికి ’శ్రీరామశ్శరణంమమ’ అంటూ ప్రదక్షిణాలు చేయడం శ్రేయస్కరం. లలితా పట్టాభిషేకం ఘట్టం పారాయణం చేయండి.వృషభము - జయ

కృతిక 1,2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో)
ఆదాయం - 8 వ్యయం - 11 రాజయోగం - 7 అవమానం - 5 ఈ సంవత్సరం గురువు మిధునంలో (ద్వితీయం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (తృతీయం) సంచరిస్తాయి. శని తులలో (షష్టం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (సప్తమం) సంచరిస్తారు. రాహువు తులలో (షష్టం) కేతువు మేషంలో (వ్యయం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (పంచమం) కేతువు మీనంలో (లాభం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం సంఘంలో గౌరవమర్యాదలు పెంచుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. అయితే ప్రతి విషయంలోనూఅవరోధములు వస్తుంటాయి. తెలివిగా ఓర్పు బాగా ప్రదర్శిస్తారు. తద్వారా నవంబరు వరకు చాలా పనులకు సమస్యలు స్వతంత్ర్యంగా సమస్యా పరిష్కారాలు తెలుసుకుంటారు. నవంబరు వరకు ప్రతి పనిలోన చక్కటి ఆనందం పొందుతారు. అందరి నుండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి రోజూ అకాలంలో భోజనం చేయవల్సిన స్థితి ఉంటుంది. అయుతే మీకు ఇష్టమైన రీతిగా ప్రదర్శించడానికి తగిన రీతిగా మీ చుట్టూ వాతావరణం నెలకొని ఉంటుంది. అందరూ మీ యొక్క సలహాల కోసం ఎదురు చూస్తారు. అయితే నవంబరు దాటిన తర్వాత ప్రతిపనీ సమస్యాత్మకంగా ఒత్తిడితో ఉంటుంది. తరచుగా ప్రతిపనిలో తెలియని కష్టం అనుభూతిని పొందుతారు. ఏమీలేని విషయాలలో మానసిక ఒత్తిడి హృదయతాపం పొందడం జరుగుతుంది. మితభాషణ, స్నేహాభావం నవంబరు నుండి అలవరచుకొండి ఆరోగ్య విషయాలందు, అక్టోబరు, నవంబరు, డిశంబరు మాసాలలో సాధారణస్థాయు ఆరోగ్య చికాకులు ఉంటాయి. సంవత్సరం అంతా అనుకూల అంశాలె ఉన్నాయి. ఈ మూడు మాసాలలో దైనందిన కార్యములు కూడా సరిగా సాగవు. కుటుంబ విషయాలలో చాలా అనుకూల స్థితి నవంబరు వరకు ఉంటుంది. మరుయు సంవత్సరం మొత్తం పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవనే చెప్పాలి. బంధువులకు మీ వ్యవహారములలో జోక్యమునకు అవకాశం యివ్వద్దు. అంతేకాకుండా పిల్లల అభివృద్ది వార్తలు తరచుగా విని సంతోషిస్తారు. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు చాలా చక్కటి వ్యాపారం చేయు అవకాశం ఉన్న కాలము. అంతా బాగుంటుంది. ఆర్థిక ఋణ విషయములు పరిశీలింపగా ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ నుండి కొంచెం చికాకులు వచ్చిననూ వాటిని తెలివిగా సరి చేస్తారు. మీయొక్క ఋణ వ్యవహారములలో మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. కొత్త ఋణములు అవసరానికి తగినవిధంగా అందుతాయి. అది సంతోషం ఇస్తుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఓర్పు, ధైర్యం బాగా ప్రదర్శించి, వారి పనులు చక్కగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగులకు ఈసంవత్సరం అంతా శుభదాయకంగానే ఉంటుంది. వీరి విధి నిర్వహణ బాగా ఉండి, అన్ని కోణాలలో మంచిపేరు ప్రతిష్టలు పొందుతారు.అంతేకాకుండా నిత్యం వీరికి తోటివరి సహకారం బాగా అందుతుంది. కొన్ని సందర్బాలలో చేసిన పని మరలా చేయవలసి వచ్చినా ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉండడం సంతోషకరం. స్థాన చలన ప్రయత్నాలు చేయువారికి నవంబరు లోపుగా పనులు పూర్తి చేసుకోవాలి. లేకపోతే కష్టమే.

శాంతి:

రోజూ గోపూజ చేయడం మంచిది. అంతే కాకుండా నవంబరులో శనికి జపం చేయించడం. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి. ప్రదోషకాలంలో శివారాధన చేయడం ద్వారా శుభఫలితాలు పెరుగుతాయి. సుదర్శన నారసింహ కవచం పారాయణం చేయడం మంచిది. ప్రాతఃకాలములో ఆదిత్య హృదయం పారాయణం చేయండి.మిథునము - జయ

మృగశిర 3,4 పాదములు (కా,కి) ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ,ఖం,జ్ఞ, ఛ) పునర్వసు 1,2,3 పాదములు (కే,కొ,హా)
ఆదాయం - 11 వ్యయం - 8 రాజయోగం - 3 అవమానం - 1 ఈ సంవత్సరం గురువు మిధునంలో (జన్మం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (ద్వితీయం) సంచరిస్తాయి. శని తులలో (పంచమం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (షష్టం) సంచరిస్తారు. రాహువు తులలో (పంచమం) కేతువు మేషంలో (లాభం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (చతుర్థం) కేతువు మీనంలో (దశమం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం ప్రతి విషయం బహు అనుకూలమయున అయున అంశాలతో నడుచును. ప్రశాంతం అయున విషయాలలో ఎక్కువకాలం గడుపుతారు. కీర్తి ప్రతిష్ఠలు బాగా వృద్ది నొందుతాయి. గత సమస్యలకు కూడా పరిష్కారములు వెదకడంలో కృతకృత్యులు అవుతారు. పుణ్య కార్యములు శుభకార్యములు చేయు విషయంలో ఎక్కువ ఆలోచనలు చేస్తుంటారు.అందరి నుండి సహాయ సహకారములు బాగా పొందుతారు. గృహ నిర్మాణ యోచన అలాగే వాహనముల వంటి భోగ్యవస్తువులు కొనుగోలు చేయడం వంటివి చేస్తుంటారు. జూన్ తరువాత కీర్తి వృద్ది బాగా ఉంటుంది. అయితే జూన్ వరకు తెలివితేటలు నష్టపడే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం స్త్రీల విషయాలందు భయము బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయార్ధం మొత్తం కూడా మీకు కావలసిన సౌకర్యల స్థాయి పెరుగుతున్న అనవసర భయం కూడా పెరుగుతుంది. నవంబరు దాకా మీ ఇంటిలోనూ, వృత్తి విషయాలలోనూ, వర్కర్లవలన, తెలియని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయాలందు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కేవలం సీజనల్ ఇబ్బందులు మాత్రం రాగలవు. అయితే జులై తరువాత వాత సంబంద అనారోగ్యములు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రమాదాలు రావు. కుటుంబ విషయాలలో బహుజాగ్రత్తలు పాటించి చాలా సుఖంగా ఉంటారు. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మరియు పిల్లల యొక్క అభివృద్ది విషయంలో అనుకూలంగా ఉంటుంది. క్రమేణా ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఉంటాయి. శుభ సంభందమైన వ్యవహారములలో బంధువులు తరచుగా కలుసుకొంటారు. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు ప్రతి విషయంలో తెలివిగా ప్రవర్తించి అనుకూల ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక విషయములు పరిశీలింపగా ఆదాయం రావడానికి అడ్డంకులు ఉండవు కానీ ఖర్చులు ఎక్కువ అవుతాయి. వాటికి తగిన ఆదాయం అందుతుంది. కానీ ఋణముల విషయంగా బహుజాగ్రత్తలు తీసుకోవాలి. దైనందిన కార్యక్రమములు సంవత్సరం అంతా చక్కగా సాగుతాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం కుటుంబ ఉద్యోగం అంతా బాగా నడుపుకునే అవకాశం ఉన్నది. ఉద్యోగులకు ఈ సంవత్సరం ప్రతి పనీ అనుకూలంగా మార్పు చేసుకోగలుగుతారు. అధికారుల అండదండలు బాగా అందుతాయి. తోటివారి నుండి మరియు మీ క్రింద పని చేయు వర్కర్స్ నుండి మంచి సహకారం లభిస్తుంది. ప్రమోషన్ లు ఆశించడానికి తగిన కాలమే! స్థాన చలనం చేయు వారికి ఈ సంవత్సరం బాగా అనుకూలము. పనులు వేగం చేయండి

శాంతి:

దేవీ భాగవతం రీజూ పారాయణం చేయండి. సౌందర్యలహారి పారాయణం చేయండి. ఈ రాశివారికి శ్రేయస్కరము, జూలైలో రాహు కేతువులకు శాంతి చేయండి. ప్రతి రోజూ గోపూజ మరియు "ఓం నమశ్శివాయ" మంత్రంతో మెడిటేషన్ చేయుట ద్వారా వృద్ధి పెరుగుత్యుంది. రోజూ లక్ష్మీనృసింహ కవచం పారాయణం చేయండికర్కాటకము - జయ

పునర్వసు 4 వ పాదములు (హి) పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే,హో,డా) ఆశ్రేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)
ఆదాయం - 5 వ్యయం - 8 రాజయోగం - 6 అవమానం - 1 ఈ సంవత్సరం గురువు మిధునంలో (వ్యయం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (జన్మం) సంచరిస్తాయి. శని తులలో (చతుర్ధం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (పంచమం) సంచరిస్తారు. రాహువు తులలో (చతుర్ధం) కేతువు మేషంలో (దశమం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (తృతీయం) కేతువు మీనంలో (భాగ్యం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం శని రాహు కేతువుల సంచారం ఉపయుక్తంగా ఉండదు. అయితే ఇతర గ్రహచారం అధిక కాలం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ఇబ్బందులను తెలివిగా ఎదుర్కోవడం సుఖజీవనం చ్యడం జరుగుతుంది. శుభ కార్యాచరణం వలన ధనవ్యయం అధికం అవుతుంది. అలసత్వం, సోమరితనం ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. మీ యొక్క ప్రతి విషయము చాలా గోప్యంగా ఉంచాలి. నమ్మకద్రోహం చేయువారు ఎక్కువ అవుతారు. సుమారు 2014 అంతా కుజ సంచారం ప్రతిబంధకాలు సృష్టించని రీతిగా ఉన్నది. అందువలన సాధారణ జీవనశైలికి ఇబ్బంది రాదు. అనుకూలించే పనులు చేసుకుంటూ, అనుకూలం లేని పనులకు దూరంగా ఉంటూ, సమస్యలకు దూరం అవుతారు. మీకంటే తక్కువస్థాయి వారి వ్యవహారములలో కలుగచేసుకొని తరచుగా కలహములకు అవమానములకు గురి అవుతారు. మీరు కొత్త కొత్త ప్రయోగాలు చేయు విషయంలో కూడా పెద్దగా వేగంగా ఆలోచనలు చేయరు. ఆత్మరక్షణకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయాలందు జూన్ వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అయితే ఇప్పటికే మానసికంగా అనారోగ్యములతో ఉన్నవారు, వాతరోగులు మాత్రం ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాలలో ప్రతి విషయం కుటుంబ సభ్యులతో కలసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అందరూ కలహించరు కానీ వ్యతిరేఖ భావంతో ఉంటారు. పిల్లల అభివృద్ది విషయాలలో అనుకున్న రీతిగా ఫలితాలు ఉండవు. అలాగే కుటుంబ పెద్దలకు కావలసిన ఏర్పాట్లు కులచార పూజలు చేయుటలో సక్సెస్ అవుతారు. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు ఈ సంవత్సరం జూలై నుండి చక్కటి వ్యాపారం చేయు అవకాశం ఉన్నది. ఆర్థిక విషయములు పరిశీలించగా మీ యొక్క తెలివితేటలు సరిగ్గా పనిచేయక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఆదాయం వ్యయం సరిగా పరిశీలిస్తే మీ పరిధిలోనే ఉంటాయి. ద్వితీయార్థం ఇంకా బాగా ఉంటుంది. అలాగే ఋణములు విషయంగా వచ్చే సమస్యలు మీరు జూలై నుండి తెలివిగా దాటుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలు ప్రతి విషయం సమర్థవంతంగా సాధనచేయగలుగుతారు. ఉద్యోగులకు ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు వస్తాయి. అయితే అన్ని పనులు ఆలస్యంగా అవుతాయి. వర్కర్స్ తో నవంబరు నుండి కలహాలు తప్పవు. అందరితో కలహాలకు దూరంగా ఉండండి. బుద్ధిమాంద్యం తరచూ ప్రదర్శిస్తారు.ఉద్యోగవిధి నిర్వహణ, నిత్యకృత్యాలకు కూడా ఇబ్బందులు కలుగుతాయి.

శాంతి:

ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివపూజ చేయడం మరియు రోజూ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం మంచిది. అంతేకాకుండా భగవధ్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగము విభూతి యోగము అధ్యాయములు పారాయణ చేయుట ద్వారా ప్రశాంత చిత్తము లభింపగలదు. ప్రదోషకాలంలో శివుడుకి 11 చండీ ప్రదక్షిణాలు చేయండి.సింహము - జయ

మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే) పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ) ఉత్తర 1 వ పాదములు (టే)
ఆదాయం - 8 వ్యయం - 2 రాజయోగం - 2 అవమానం - 4
ఈ సంవత్సరం గురువు మిధునంలో (లాభం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (వ్యయం) సంచరిస్తాయి. శని తులలో (తృతీయం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (చతుర్థం) సంచరిస్తారు. రాహువు తులలో (తృతీయం) కేతువు మేషంలో (భాగ్యం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (ద్వితీయం) కేతువు మీనంలో (అష్టమం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం చాలా విచిత్రమైన కాలం. నవంబరు వరకు శని జూన్ వరకు గురువు యోగిస్తారు. మిగిల కాలం వారిరువురు యోగించరు అయితే రాహు సంచారం బాగా యోగంగా ఉన్నది. కేవలం మీ యొక్క మానసిక ధైర్యమే మీకు శ్రీరామరక్ష. ఈ సంవత్సరం అంతా బాగున్నట్లే ఉంటుంది కానీ ఏ పనీ సవ్యంగా సకాలంలో పూర్తి అవ్వదు. మీ యొక్క ప్రతి విషయం బాగా శోధించి నిర్ణయాలు తీసుకోవలసిన కాలము. ఇతరుల వ్యవహారములలో తలదూర్చవద్దు. మీ యొక్క విషయములు ముఖ్యులతో చర్చించకుండా ముందుకు వెళ్ళవద్దు. అంతా మనజాగ్రత్తల మీద ఆధారపడి, మంచి చెడులు నడిచే కాలము. నవంబరు వరకు మాత్రం మీరు స్వంతంగా చేయు ప్రతి అంశము బాగా మంచి ఫలితాలని ఇస్తుంది. వాహనాలు కొనుగోలు అమ్మకాలు, రిపేరులు విషయంగా చికాకులు ఉంటాయి. వాగ్థోరణి, కఠినతనం నుండి సున్నితమైన విధంగా మార్పులు చేసుకోవాలి. నూతన అలంకరణ వస్తు విషయాల మీద ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఆరోగ్య విషయాలందు ఈ సంవత్సరం అంతా చిన్న చిన్న సమస్యలు వెంబడిస్తూనే ఉంటాయి. ఏదీ పెద్ద సమస్యకాదు. అలాగని పరిధిలోకి తీసుకోకుండా ఉండలేరు. అలా ఇబ్బందిపడే సూచనలు ఉన్నాయి. కుటుంబ విషయాలలో బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. కానీ వారి విషయాలలో ఎక్కువ అంతరంగికంగా కలుగ చేసుసుకోవద్దు. మీ విషయాలు కూడా గోప్యంగా ఉంచవలసిన కాలము. భార్యాపిల్లలు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. పెద్దలకు సంబంధించి అంతా అనుకూల వాతావరణమే. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. తద్వారా నష్టాలు రాకుండా వ్యాపారం చేయగలరు. ఆర్థిక విషయములు పరిశీలింపగా ఆదాయం బాగా అందుతుంది. అదే విధంగా ఖర్చులు శుభసబంద మరియు ప్రయాణసంబంధంగా ఎక్కువ అవుతాయి. మీకు కొత్త ఋణాలు సకాలంలో అందుతాయి. పాత ఋణాలు ఇబ్బందికరం కాదు. దైనందిన కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించలేని స్థితి ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలు కుటుంబ విషయాలతో జులై నుండి ప్రోత్సాహం అందుకోలేరు. ఉద్యోగం బాగుంటుంది. ఉద్యోగులకు ఈ సంవత్సరం ప్రతిపనీ ఒత్తిడితో కూడి పూర్తి అవుతుంది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే కొన్ని సమస్యలు దాటవేయగలరు. కఠినమైన వాక్కులు ఉద్యోగ విషయంగా మీరు మాటలాడవద్దు. అందరితో స్నేహంగా ప్రవర్తించండి. మరియు మీరు ప్రదర్శించే స్నేహం మీకు శ్రీరామ రక్ష.కన్య - జయ

ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పి) హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా) చిత్త 1,2 పాదములు (పే, పో)
ఆదాయం - 11 వ్యయం - 8 రాజయోగం - 5 అవమానం - 4
ఈ సంవత్సరం గురువు మిధునంలో (దశమం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (లాభం) సంచరిస్తాయి. శని తులలో (ద్వితీయం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (తృతీయం) సంచరిస్తారు. రాహువు తులలో (ద్వితీయం) కేతువు మేషంలో (అష్టమం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (జన్మం) కేతువు మీనంలో (సప్తమం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం మంచి మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నది. క్రమంగా గతసమస్యలకు పరిష్కారాలు వెదకడం ప్రశాంత జీవనముకు దగ్గర అవ్వడం బాగా జరుగుతుంది. భవిష్యత్తు మీద ఆశ చిగురించే రోజులు ఉత్పన్నమవుతాయి. మీ యొక్క ప్రతి విషయం గోప్యంగా ఉంచండి. అయితే తెలియని భయం మీ వెంట ఈసంవత్సరంలో క్రమంగా పెరుగుతుంది. దానికి కారణం మీరే గుర్తించలేరు. జూన్ వరకు తరచుగా ప్రభుత్వ సంభంద విషయాలలో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉన్నది. తరువాత జులై మొదలు తరచుగా శుభప్రయత్నాలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. మీరు చాలా బిజీగా ఉంటారు. ఫలితాల మీద దృష్టి ఉంచుతారు. చాలా చక్కటి జీవనానికి నాంది అని చెప్పాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలందు జులై వరకు ఒక రకమైన చికాకులు ఉంటాయి. ఈ రీతిగా కుజ రాహువులు ఇబ్బంది పెడతారు. అయితే గురుబలం దృష్ట్యా రోగములు పెద్దవి రావు. కుటుంబ విషయాలలో గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉండడం దృష్ట్యా జూన్ కు మరియు, అక్టోబరు కు రెండు ధఫాలుగా మంచి మార్పులు, వృద్ది ఆరంబం అవుతుంది. అయితే మీరు రాహు సంచారం ప్రభావంగా ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు. అందరి నుండి సహకారం బాగా ఉంటుంది. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు గురుబలం బాగా ఉన్ననూ వ్యవహార ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తపడాలి. ఆర్థిక విషయాలు పరిశీలింపగా ఆదాయం అనుకూలంగా వస్తూ ఉంటుంది. కానీ ఖర్చులు మాత్రం అనుకూలంగా ఉండవు. శుభ సంబంధ ఖర్చులు, అలంకరణ వస్తు ఖర్చులు, వృధ్దాఖర్చులు ఎక్కువ అవుతాయి. పాత ఋణములు ఇబ్బందికరం కావు. అలాగే కొత్త ఋణములు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా దొరుకును. ఋణభయం ఎక్కువ అవుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు కుటుంబ విషయాలు, ఉద్యోగ విధి నిర్వహణ చాలా బాగుంటుంది. ఆనందంగా ఉంతారు. ఉద్యోగులకు ఈ సంవత్సరం తిరుగుడు అధికం అవుతుంది. ప్రతిపనీ స్వయంగా చేసుకోవలిసి వచ్చిన కారణంగానూ, అధికారులు వర్కర్స్ సరిగ్గా సహకరించకని కారణంగా బాగా ఇబ్బందులకు గురి అవుతారు. దైనందిన కార్యములు అన్నీ అకాలంలోనే పూర్తి అవుతాయి. ఇతరులు ఇబ్బంది పెడతారు. స్థాన చలన ప్రయత్నాలు చాలా తెలివిగా సరిచేసుకోవాలి. మీకు ఇబ్బంది కలిగించే దుష్ట శక్తులు ఉంటాయి.
శాంతి:
నిత్యం రాహుకాలంలో దుర్గార్చన చేయడం, దుర్గాసప్తశ్లోకీ స్తోత్రం పారాయణ నిత్యం ఎప్పుడూ పారాయణం చేస్తూ ఉండడం వలన ఒత్తిడి తగ్గుతుంది. సంవత్సరారంభంలో కుజ శని గ్రహ శాంతి జులైలో రాహుగ్రహ శాంతి చేయించండి. దత్త కవచం పారాయణ శాంతి చేకూరుస్తుంది.తుల - జయ
చిత్త 3,4 పాదములు (రా,రి) స్వాతి 1,2,3,4 పాదములు (రూ,రే,రో,తా) విశాఖ 1,2,3 పాదములు (తీ,తూ,టే)
ఆదాయం - 8 వ్యయం - 11 రాజయోగం - 1 అవమానం - 7 ఈ సంవత్సరం గురువు మిధునంలో (నవమం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (దశమం) సంచరిస్తాయి. శని తులలో (జన్మం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (ద్వితీయ) సంచరిస్తారు. రాహువు తులలో (జన్మం) కేతువు మేషంలో (సప్తమం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (వ్యయం) కేతువు మీనంలో (షష్టం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం ఏలినాటి రెండవ భాగంలో నవంబరులో పూర్తి అయ్యి మూడవ భాగం ప్రారంభం అవుతుంది. రాహు సంచారం కూడా బాగాలేదు. అధికకాలం సెప్టెంబరు నాల్గవ తేదీ వరకు కుజుడు బాగాలేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బాగా ఓర్పుగా నేర్పుగా కాలం వెళ్ళగట్టే ప్రయత్నం చేయాలి. దూకుడు అసలు పనికిరాదు. మన పనులలో ఇతరుల ప్రమేయం, ప్రాధాన్యం అలాగే ఇతరుల పనులలో మన జోక్యం అసలుపనికిరాదు. గౌరవం పొందవల్సిన చోట కూడా చికాకులు అవమానాలు పొందుతారు. మీరు కనుక చాలా క్రమ బద్ధమైన జీవనం చేయడం అలవాటు చేసుకుంటే ఈ సంవత్సరం సమస్యలలో కూడా సంతృప్తికరమైన జీవనం చేస్తారు. మీరు మీ ప్రాథమిక ధర్మం తప్పిన అంశాలలో ఇబ్బంధులు తప్పవు. ప్రతిపనికీ భయపడటం ఒక లక్షణం అవుతుంది. ఎవరినీ నమ్మి ఏవిధమైన హామీలు ఇవ్వవద్దు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. అయితే ఈ సంవత్సరం మీరు పుణ్యక్షేత్ర సందర్శనం, గురువులు, పూజ్యుల సందర్శనం ఎక్కువగా చేస్తారు. ఆరోగ్య విషయాలలో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయార్థంలో నేత్ర భాధలు పెరుగుతాయి. మీరు ముందు జాగ్రత్తలు తేసుకున్న ప్రతి అంశంలో ఇబ్బందులు చాలా చక్కగా దాటవేస్తారు. కుటుంబ విషయంలో స్వజన విరోధం ఎక్కువ అవుతుంది. కానీ మీరు చాలా తెలివిగా ప్రవర్తించి. ఇబ్బందులను దూరం చేసుకొనె ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయంలోనూ చికాకులు కలహాలు ఉంటాయి. కుటుంబ అవసరాలకు సంబంధించిన ప్రతిదీ మీరే స్వయంగా చేయవలసి రావడంతో శ్రమపడతారు. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు గురుబలం బాగా ఉండి మంచి ఆలోచనలు వచ్చినా ఫలితాలు శూన్యమే అని చెప్పాలి. ఆర్థిక విషయములు పరిశీలింపగా ఆదాయం అనుకూలంగా అందుతుంది. ఖర్చులు నియంత్రించలేరు. అలాగే పాత ఋణములు అవమానముల సృష్టించుచుండగా కొత్త ఋణములు మాత్రం అవసరానికి తగిన సమయానికి అందవు. నిత్యకృత్యాలకు శరీరం సహకరించదు. బద్ధకంగా బాగా ఇబ్బంది పెట్టును. ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ సంవత్సరం సోమరితనం వలన చాలా లాభాలు దూరం చేసుకుంటారు. ఉద్యోగులకు ఈసంవత్సరం బాగా స్రమతో నడిచే కాలము. ప్రతిపనీ విఘ్నములతో నడుచును. అధికారులు తరచు కలహించే విధానం నవంబరు వరకు మనము చూస్తాము. అలాగే వర్కర్స్ కూడా మీకు సహకరించని స్థితి వలన మీరు తరచు ఇబ్బందులకు గురి అవుతారు. జాగ్రత్తలు అవసరం. స్థాన చలన ప్రయత్నాలు చేయువారికి ధనవ్యయం అక్టోబరు వరకు ఎక్కువగా ఉంటుంది. పనులు సరిగ్గా సాగవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి పనులు పూర్తి అయ్యే మార్గం చూపే వ్యక్తులు పరిచయం అవుతారు.వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ. ఒత్తిడితో పనులు చేసినా మొత్తం మీద సంవత్సరం అంతా పరిశీలింపగా లాభదాయక వ్యాపారమే నడుచును. అయితే అవరోధములు వర్కర్స్ ప్రాబ్లమ్ ఉంటాయి,
శాంతి:
కుజ, శని, రాహువులకు తరచుగా శాంతి పారాయణం చేయించండి.అంతే కాకుండా సంక్షిప్త సుందరాకాండను రోజూ పారాయణం చేయడం వలన పనులు వేగం అవుతాయి. మీరు రోజూ రావి చెట్టు క్రింద ఆంజనేయస్వామి ప్రతిమను శ్రీరామ శరణం నమ్ః అంటూ 11 సార్లు ప్రదక్షిణం చేయుట వలన ఎంతో శుభం చేకూరును. సుదర్శన కవచం సమస్యగా ఉన్నప్పుడు చేయండి.వృశ్చికము - జయ
విశాఖ 4 వ పాదములు (తొ) అనురాధ 1,2,3,4 పాదములు (నా,నీ,నూ,నే) జ్యేష్ట 1,2,3,4 పాదములు (నో,యా,యీ,యూ)
ఆదాయం - 14 వ్యయం - 2 రాజయోగం - 4 అవమానం - 7 ఈ సంవత్సరం గురువు మిధునంలో (అష్టమం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (నవమం) సంచరిస్తాయి. శని తులలో (వ్యయం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (జన్మం) సంచరిస్తారు. రాహువు తులలో (వ్యయం) కేతువు మేషంలో (షష్టం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (లాభం) కేతువు మీనంలో (పంచమం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం గురువు కర్కాటక సంచారం ప్రారంభించాక పుణ్యకార్య శుభకార్య యోచనలు ఎక్కువ అవుతాయి. ఏలినాటి శని ప్రథమభాగం పూర్తి అయ్యి ద్వితీయభాగం ప్రారంభం అవుతుంది. అయినా గురు రాహు సంచారం అనుకూలం దృష్ట్యా జూలై 14 నుండి మంచి జీవనమే చేస్తారు అని చెప్పాలి. అంతేకాకుండా శని వలన పనుల వేగం తక్కువగా ఉంటుంది. జూన్ తర్వాత అన్న వస్త్రాలకు ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది.భవిష్యత్తు ప్రణాళికలు ఉపయోగించు స్నేహములు కొత్తవి ఏర్పడును. ఈ సంవత్సరం అంతా విద్యా విఙ్ఞాన వినోద పుణ్యకార్యములు, శుభకార్యముల నిమిత్తంగా ప్రయాణములు చేస్తుంటారు. ఏధైనా సాధించగలమ్ అనే ధీమా ఏ సంవత్సరం బాగా పెరుగుతుంది. మరొకవైపు పనులు ఆలస్యం అవుతుండటంతో ఆగ్రహావేశాలు కూడా పెరుగుతాయి. తరచుగా శ్రమ ప్రతిపనిలో ఎక్కువ అవుతుంది. అలాగే మతిమరుపుకులోనయ్యే సందర్బాలు ద్వితీయార్ధంలో ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి.ఆరోగ్య విషయాలందు నవంబరుకు దగ్గరలో హృద్రోగులు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. జూన్, జులై వరకు సాధారణ స్థాయి ఆరోగ్య స్థితి ఉంటుంది. శ్రమ వలన వచ్చే సమస్యలు ఉంటాయి. కుటుంబ విషయాలలో మీకు విచిత్ర సమస్యలు ఎదురౌతాయి. బంధువులు కలహములు పెంచుతారు. మీ యొక్క అంతరంగిక విషయాలలో బంధువుల కలయిక తగ్గించండి. అలాగే పిల్లల యొక్క అభివృద్ది వార్తలు మీరు తరచు వింటూ ఉంటారు. పెద్దలకు ఆరోగ్య స్థితి అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు జూలై నుణ్డి ఆర్థికంగా బాగా ఉన్ననూ, ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఆర్ధిక విషయాలు పరిశీలింపగా ఆదాయం జులై నుండి బాగా అందుతుంది. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు అధికం చేస్తారు. కొత్త పాత ఋనాలు ప్రతిబంధకం కావు అనే చెప్పాలి. కొత్త స్నేహాలు కలుగుతాయి. వారితో సంభాషణలలో ఆధాయం పెరిగే మార్గాలు తెలుసుకుంటారు. స్త్రీలు అలంకరణ వస్తువులు నష్టపోయే అవకాశం జులై నుండి ఎక్కువగా ఉన్నది. ఉద్యోగులకు ఏసంవత్సరం మంచి ఫలితాలే ఉన్నాయి. అయితే అధికంగా కాలయాపన ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలలో అవరోధాలు ఉంటాయి. వర్కర్స్ సహకారం బాగా ఉంటుంది. అధికారులు ప్రోత్సహిస్తారు. నిత్య కృత్యాలు సాగించే విషయంలో ఉద్యోగ విధి నిర్వహణ కొంచెం ఇబ్బంది పెడుతుంది. స్థాన చలన ప్రయత్నాలు చేయు వారికి జూన్ నుండి కాలం అనుకూలము. పనులు ఆలస్యం లాభదాయకం.
శాంతి:
మీయొక్క కులదేవతారాధన తప్పకుండా చేయండి. గురు శని రాహు కుజులకు సంవత్సరారంబంలో శాంతి అవసరం. అదే రీతిగా నవంబర్ లో మరలా శనికి శాంతి చేయించాలి. సుబ్రమణ్య స్తోత్రములు పారాయణం చేయండి. సెప్టెంబరు లోపు తరచుగా పొయ్యి, ఇస్త్రీ పెట్టే వంటివి దానం చేయడం మంచిదిప్రదోషకాలంలో శివపూజ అవసరం


ధనస్సు - జయ
మూల 1,2,3,4 పాదములు (యే,యో,బా,బీ) పూర్వాషాడ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా) ఉత్తరాషాడ 1 వపాదము (బే)
ఆదాయం - 2 వ్యయం - 11 రాజయోగం - 7 అవమానం - 7 ఈ సంవత్సరం గురువు మిధునంలో (సప్తమం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (అష్టమం) సంచరిస్తాయి. శని తులలో (లాభం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (వ్యయం) సంచరిస్తారు. రాహువు తులలో (లాభం) కేతువు మేషంలో (పంచమం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (దశమం) కేతువు మీనంలో (చతుర్థం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం నవంరు 1 నుండి ఏలినాటి శని ప్రారంభం. గురు సంచారం సరిగ్గా లేక పోవడం దృష్ట్యా నవంబరు నుండి చికాకులు ప్రారంభం అయ్యే కాలము. అయితే మానసిక దృఢ నిశ్చయాలతో ఉన్న కారణంగా మిమ్మల్ని గ్రహచారం ఇబ్బంది పెట్టదు అనే చెప్పాలి. అనుకోకుండా దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నవంబరు నుండి శుభకార్య ప్రయత్నాలలో అవరోధాలు ఉంటాయి. ప్రయాణ విఘ్నములు, వాహన చికాకులు అధికంగా ఉంటాయి. అధికారులు తరచుగా అనుకూలిస్తారు. గురువులు, పూజ్యులు సంఘంలో పెద్దలు మిమ్మల్ని తరచుగా కలసి మీ యొక్క కార్యా చరణ గూర్చి చర్చిస్తారు. మీ మాతా తీరు క్రమంగా క్రూరంగా మారుతుంది. శారీరికంగా ముందు జాగ్రత్తలు అధికంగా పాటిస్తారు. తరచు అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. చతుష్పాద జంతువులు ద్వారా లాభం ఉంటుంది. మనస్సుకు సుఖం అనిపించే పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. సమస్యలు ఎన్ని ఉన్నా ఈసంవత్సరం మీ మనస్సుకు ఇష్టమైన పనులు మాత్య్రమే చేసుకుంటూ ముందుకు వెళతారు. ఆరోగ్య విషయాలందు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కేవలం కుజసంచార దోషం వలన సెప్టెంబరు నుండి జ్వరభాధలు వంటివి ఇబ్బంధి పెడతాయి. భయపడవలిసిన అవసరం లేదు. కుటుంబ విషయాలలో అష్టమ గురువు ప్రభావం మరియు నవంబరు నుండి ఏలినాటి ప్రభావం చిన్న చిన్న చికాకులు ఉన్ననూ, వాటిని పట్టించుకోకుండా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆదాయం ప్రభావంగా కుటుంబంలో కలహాలకు అవకాశం ఉంటుంది. పిల్లల వలన ఇబ్బంది తప్పదు. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు చాలా విచిత్రమైన కాలము నవంబరు వరకు వ్యాపారం బాగా ఉండి సమస్యలు ఉంటాయి. ఆర్థిక విషయాలు పరిశీలింపగా, ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు మీరు ఇష్టపడని అంశాలలో చేయవలసి వస్తుంది. మరియు ఋణములు చేసిన చోట అవమానములు రాగలవు. అందువలన చికాఖులు ఉంటాయి. కొత్త ఋణము;లు అవసరానికి తగిన విఢంగా అందవు. ఈరాశికి చెందిన స్త్రీలు అక్టోబరు నుండి ప్రతిరోజూ ఒత్తిడితో కూడి పనులు అవుతాయి. ఇబ్బంది ఎక్కువ. ఉద్యోగులకు ఈ సంవత్సరం ప్రతిపనీ ఒత్తిడిని కలుగ చేస్తుంది. నవంబరు వరకు కాలము అనుకూలమే కానీ నవంబరు నుండి ప్రతిపనీ ఇబ్బందికరం అవుతుంది. అధికంగా తిరుగుడు ఉంటుంది. రోజువారీ పనులు మాత్రం అకాలంలో పూర్తి అవుతాయి. సహకారం చేయువారుండరు. స్థానచలన ప్రయత్నాలు స్వయంగా చేసుకోవాలి. జూన్ నుండి నవంబరు వరకు కాలం అనుకూలం కాదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు పూర్తి అయ్యే మార్గం గోచరించక చికాఖుపడే అవకాశం ఉన్నది.
శాంతి:
ఈ రాశివారు నిత్యం ఋణవిమోచన అంగారకస్తోత్రం పారాయణం చేయడం మంచిది. ప్రతి సోమవారం గంధం, పాలు, చక్కెర, తేనెలతో శివునికి అభిషేకం చేయించండి. గురువుకు సంవత్సరారంభంలోనూ నవంబరులోనూ శనికి శాంతి చేయవలసిన అవసరం ఉన్నది. శివారాదన బాగా చేయండి. గణపతికి గరికతో అర్చనచేస్తే కార్యములు వేగం అవుతాయి.


మకరము - జయ
ఉత్తరాషాడ 2,3,4 పాదములు (బో,జా, బీ) శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో,ఖా,ఖో) ధనిష్ట 1,2 పాదము (గా,గి)
ఆదాయం - 5 వ్యయం - 5 రాజయోగం - 3 అవమానం - 3 ఈ సంవత్సరం గురువు మిధునంలో (షష్టం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (సప్తమం) సంచరిస్తాయి. శని తులలో (దశమం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (లాభం) సంచరిస్తారు. రాహువు తులలో (దశమం) కేతువు మేషంలో (చతుర్థం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (భాగ్యం) కేతువు మీనంలో (తృతీయం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం బహు ఓర్పు నేర్పు ప్రదర్శించవలిసిన కాలము. దూకుడు తోదరపాటు నిర్ణయాలు మిమ్మల్ని పశ్చాతాపమునకు గురి చేస్తాయి. మీయొక్క వాగ్దోరణి బాగా నియంత్రీంచుకొని అందరితో స్నేహం ప్రకటింపవలసిన కాలం. ప్రయాణ చికాకులు అధికంగా ఉంటాయి. జులై తరువాత భోజనాధుల విషయంలో అనుకూలం బాగా కుదురుతుంది. అలాగే చేయు ప్రతి పనిలోనూ మంచి విషయ పరిశీలన్ చేకూరుతుంది.కొన్ని సందర్బాలలో మానసిక ధైర్త్యం మరియు అధైర్యం ఉంటాయి. నవంబరు నుండి ప్రతి పనీ అధిక ధనవ్యయంతో కూడుకొని వేగంగా పూర్తి అవుతాయి. సంఘంలో గౌరవ మర్యాధలు ఈసంవత్సరం జూన్ తర్వాత పెరుగును. శరీర రక్షణ యందు మంచి దృష్టి కేంద్రీకరిస్తారు. మనసుకుతోచిన విధంగా ప్రవర్తించేందుకు ఈసంవత్సరం క్రమంగా అనుకూలం పెరుగుతుంది. కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారాలు తేలికగా పొందుతారు.మీ ప్రతి పనీ ఇతరులతో కలసి సంప్రదించి చేయడం వలన ధైర్యంగా ఉంటారు. భవిష్యత్ బంగారమే. ఆరోగ్య విషయాలందు పెద్దగా ఇబ్బందులు ఉండవు. అంతా సజావుగానే సాగుతుందని చెప్పవచ్చు. దైనందిన కార్యక్రమములలో అకాలము బాగా చోటు చేసుకుంటుంది. అయితే పనులు వేగం ఆగదు. కుటుంబ విషయాలలోమీరు జూన్ తర్వాత మీ కుటుంబ సబ్యులకు ఇబ్బంది కలుగ చేస్తారు. అంతే కాకుండాస్వజన కలహాలు ఎక్కువ అవుతాయి. పెద్దల ఆరోగ్య విషయం పిల్లల అభివృద్ది విషయం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మీ గురించి మాత్రమే మీరు ఎక్కువ ఆలోచిస్తూ తద్వారా కలహాలు పెంచుతారు. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు ఇబ్బందులు లేని వ్యాపారం చేయుటకు అవకాశం ఉన్నది. ఆర్థిక విషయాలు పరిశీలింపగా ఆదాయం తగిన విధంగా సకాలంలోనే అందుతుంది. అదే విధంగా ఖర్చులు అదుపు చేయడంలో సక్సెస్ అవుతారు. ఈ విధంగా ఆర్థికంగా బాగా బలంగా ఉంటారు. పాత మరియు కొత్త ఋణాలు అనుకూలం కలుగ చేస్తాయి. ఈ రాశి స్త్రీలకు ఆర్థిక విషయంగా ఉద్యోగ విషయంగా సమర్థవంతమైన పరిపాలనా శక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు ఈ సంవత్సరం మార్పులకు అవకాశం ఎక్కువ. మంచి మార్పులు ఉంటాయి. మీరు చేయు శ్రమ అధికారులు గుర్తిస్తారు. తద్వారా మికు రావల్సిన ప్రమోషన్ అందించటంలో వారి సహకారం మరియు అధికారుల సహకారం బాగా ఉంటుంది. మీకు అన్ని కోణాలలోనూ వృత్తిరీత్యా అనుకూలమైన కాలము.
శాంతి:
నిత్యం విష్ణు సహస్ర పారాయణం చేయవలెను. మారేడు దళములు, తేనే, ఆవుపాలు ఉపయోగించి నిత్యం శివాభిషేకం చేయుట ఓం నమశ్శివాయ మంత్రం మెడిటేషన్ చేయుట ద్వారా సమస్యలు తగ్గుతాయి. రావి చెట్టు క్రింద లక్ష్మీ నారాయణ ప్రతిమ ఉంచి రోజూ 11 ప్రదక్షిణలు చేయుట ద్వారా సమస్యలు తగ్గుతాయి.కుంభము - జయ
ధనిష్ట 3,4 పాదములు (గూ, గే) శతభిష 1,2,3,4 పాదములు (గొ,సా,సీ,సు) పూర్వాభద్ర 1,2,3 పాదము (సీ,సా,దా)
ఆదాయం - 5 వ్యయం - 5 రాజయోగం - 6 అవమానం - 3
ఈ సంవత్సరం గురువు మిధునంలో (పంచమం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (షష్టం) సంచరిస్తాయి. శని తులలో (నవమం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (దశమం) సంచరిస్తారు. రాహువు తులలో (నవమం) కేతువు మేషంలో (తృతీయం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (అషష్టమం) కేతువు మీనంలో (ద్వితీయం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం అషష్టమ రాహువు జులై 14 నుండి మానసిక ఒత్తిడి బాఘా సృష్టిస్తాడు. ప్రతిపనిలోనూ ఉన్నత స్థాయి అనుకూల ఫలితాలు అందే అవకాశం ఉన్ననూ ఏదో తెలియని చికాకులకు గురి అవుతుంటారు. ప్రశాంతంగా పనులు చేసుకునే అవకాశం ఉండదు. కొన్ని సందర్బాలలో ఆనందంగా కొన్ని సందర్బాలలో చికాకుగా ప్రవర్తిస్తారు. మీరు మీకు సంబంధించిన ప్రతి పనీ స్వయంగా పర్యవేక్షించుకోవడం చాలా ఉత్తమం. తరచుగా చోరుల, దుర్మార్గుల, అగ్ని విషయంగా భయాందోళనలకు గురి అవుతారు.కానీ మీరు రాహు సంచారం ప్రభావంగా మోసపూరిత అంశాలకు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. మీ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే విధంగా కొన్ని పనులు ఉంటాయి. అందువలన ఇతరుల వ్యవహారములలో కల్పించుకోకుండా ఉండడం మీ పనులు మీరే చూసుకోవడం మంచిది. జూన్ తర్వాత శుభ, పుణ్య కార్యములలొ అవాంతరాలు వస్తాయి. తరచుగా కుటుంబంలోని పెద్దలను సందర్శిస్తారు. ఆరోగ్య విషయాలందు పెద్ద స్తాయి ఇబ్బందులు ఉండవు. కానీ చిన్న చిన్న సమస్యలు తరచూ రావడం వలన మీకు భయం పెరుగుతుంది. రోజువారీ పనులు కూడా సరిగ్గా సాగవు. కుటుంబ విషయాలలో భార్యా పుత్రుల కారణంగా చికాకులు తరచూ వస్తుంటాయి. వారికి కావల్సిన సపర్యలు చేయు విషయంగా ఎంతీ శ్రమ ఎదురౌతుంది. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలోనూ పిల్లల అభివృద్ది విషయంలో చికాకులు ఉంటాయి. భార్యకు ఆనారోగ్యప్రాప్తి అవకాశం ఉన్నది. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు జూలై నుండి అనేక రకాలైన సమస్యలు వస్తాయి. వీరికి కలహములు తప్పవు. ఆర్థిక పరంగా ఆదాయం, ఖర్చులకు పొంతన ఉండదు. ఋణములు ఇబ్బంది కరం. ఆదాయం జూన్ తర్వాత తగ్గుతుంది. జూన్ వరకు రైతులకు కాలం సానుకూలం. ఇతరులకు ఆర్థిక విషయాలలో హామీ ఇవ్వవద్దు. సలహాలు ఇవ్వవద్దు. అనవసర విషయాలలో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు మానసిక శారీరిక ఒత్తిడి అధికంగా ఉండును. ప్రతి పని నుండి తప్పించుకు తిరిగే ధోరణికి అలవాటు పడతారు. అధికారుల మందలింపులు పొందుతారు. ప్రమోషన్, స్థాన చలనం ఇబ్బందికరం. నూతన్ ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి సలహాలు సూచనలు కూడా అందవు. నిరుత్సాహపడవద్దు.
శాంతి:
సంవత్సరారంభంలో రాహువుకు జూన్ చివరలో గురువుకు శాంతి చేయండి. రాహుకాలంలో దుర్గా సప్తశ్లోకీ పారాయణాం చేయడం. లక్ష్మీ నరసింహ కరవాలంబ స్తోత్రం పారాయణం చేయడం వంటి వాటీ వలన దుష్ట ఫలితాలు చాలా వరకు దూరం అవుతాయి. గరికతో గణపతిని అర్చించండి.

మీనము - జయ
పూర్వాభద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభద్ర 1,2,3,4 పాదములు (దు,శ్య,ఝా,థా) రేవతి 1,2,3,4 పాదములు (దే,దో,చా,చి)
ఆదాయం - 2 వ్యయం - 11 రాజయోగం - 2 అవమానం - 6
ఈ సంవత్సరం గురువు మిధునంలో (చతుర్థం) జూన్ 18 వరకు ఉండి తరువాత కర్కాటకంలో (పంచమం) సంచరిస్తాయి. శని తులలో (అషష్టమం) నవంబరు 1 వరకు తర్వాత వృశ్చికంలో (నవమం) సంచరిస్తారు. రాహువు తులలో (అషష్టమం) కేతువు మేషంలో (ద్వితీయం) జూలై 14 వరకు ఉండి తరువాత రాహువు కన్యలో (సప్తమం) కేతువు మీనంలో (జన్మం) సంచరిస్తారు. గ్రహచారం సమీక్షించగా ఈ సంవత్సరం రాహు సంచారం పూర్తిగా బాగోలేదు. గురువు సంచారం ప్రభావంగా పనులు తెలివిగా చేయవలసిన చోటకూడా, ఒత్తిడిగా చేసుకుంటారు. మీకు అంతా లాభ సాటిగా నడుచుచున్ననూ, తెలియని మానసిక అధైర్యం వలన ఇబ్బంది పడుతుంటారు. మీ తోటి వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటారు.ఈ సంవత్సరం అంతా గురు సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా ఓర్పు ప్రదర్శించి నష్టాలు తగ్గించుకునే అవకాశం ఉన్నది. నవంబరు వరకు అష్టమ శని సప్తమ కార్యములలో విరోధము కలిగించే అవకాశం ఉన్నది. అనవసరంగా అపమృత్యు భయమునకు గురి అవుతారు. వ్యర్థ సంచారం ఈ సంవత్సరం అంతా అధికంగా చేస్తుంటారు. మీకు శని రాహుకుజ ప్రభావంగా వచ్చే భయాందోళనల దృష్ట్యా ఎక్కువగా వ్యర్థ కాలక్షేపము కూడా చేయు అవకాశం ఎక్కువ ఉన్నది. మాటలు చేరవేయు లక్షణాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయాలందు ముందు జాగ్రత్తలు పాటించి సమస్యలు దూరం చేయు ప్రయత్నాలు బాగా చేస్తారు. మీ ముందు జాగ్రత్తల ప్రభావం ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. హృద్రోగులకు ఇబ్బంది. కుటుంబ విషయంలో అంతా సానుకూలంగా సహకరిస్తారు. మీరు వారితో కలహంగా ప్రవర్తించే అవకాశం ఉన్నది. కుజ సంచారం సరిగా లేదు మీరు శాంతం వహించడం అవసరం. మీకు ఉన్న భయముల విషయంగా ఇతరులకు మీరు కలహాములు ఏర్పరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు గురు బలం బాగుంది. కావున దూకుడుగా వెళ్ళకుండా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు పరిశీలింపగా ఆదాయం బాగా ఉంటుంది. మీ ఆదాయం మీకు అందడానికి గానీ మీ దగ్గర వృద్దా అవ్వకుండ ఉండటానికి అవకాశం లెదు.ప్రణాళికలు లేను ఖర్చులు తరచూ వస్తాయి. ఋణాలు పాతవి అవమానం కొత్తవి సమయానికి అందకపోవడం జరుగును. మీకు రావలసిన ఇచ్చిన ఋణములు ఇబ్బంది కరమే. ఉద్యోగులకు ఈసంవత్సరం ఎన్ని సమస్యలు ఎలాగున్ననూ ప్రమోషన్ అవకాశం మాత్రం మిమ్మల్ని వదలదని చెప్పాలి. ఎన్నో రకాలైన ఒత్తిడి అవరోధాలు కలహాముల వాతావరణం చూస్తారు. అయితే అన్ని పనులు స్వయంగా పరిశీలించుకొని నష్టాలు దూరం చేసుకోగలరు. స్థాన చలన ప్రయత్నాలు స్వయంగా పరీక్షింపక పోతే అనుకూలం లేని స్థితి వస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి కాలం అనుకూలం. జూలై నూండి లేదా కొత్తవారికి మంచి సలహాలు అందుతాయి.
శాంతి:
శని రాహు కుజులకు తరచుగా శాంతి చేయించవలసిన కాలము. ’శ్రీ మాత్రే నమ్ః’ నామంతో మెడిటేషన్ చేయండి. శ్యామలా దండకం పారాయ, రామ నామం చెబుతూ ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణలు చేయండి. ప్రాతః కాలంలో ఆదిత్య హృదయం పారాయణం చాలా శుభాలను అందిస్తాయి.

శాంతి:
జూన్ 18 తరువాత గురువుకు శాంతి చేయించండి. హరుగ్రీవ కవచం పారాయణం చేయవలసిన కాలము. నిత్యం మీరు శ్రీ మద్భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టం పారాయణ చేయుట వలన సమస్యలు దూరం కాగలవు. ఓం నమశ్శివాయ మంత్రంతో మెడిటేషన్ చేయండి. తద్వారా శుభములు పెరుగుతాయి.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again