పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 29, 2014

విటమిన్‌లు


సాధారణంగా పిల్లలు తినెటప్పుడు   నాకు ఈ కూర వద్దనిఆ పండు వద్దని తల్లుల  దగ్గర మారాం చేస్తూంటారు.    క్రమంగా వాటిమీద  అయిష్టత పెంచుకొనిపెద్దైన తర్వాత వాటిని తినటం మానెస్తారు.  కొందరికి పాలంటే  ఎలర్జికొందరికి పెరుగుమజ్జిగా అంటే ఎలర్జీ.  కొంథమందికి కొన్ని రకాల పండ్లంటే ఎలర్జి.  కారియర్ పెట్టెటప్పుడు నాకు ఆ ఖూర పెత్తద్దునేను తినను.... అంటూ గొల చెస్తుంటారు.  సాధారణంగా  అన్ని రకాల ఆకు కూరలుకూరగాయలుపండ్లు మనకు అన్ని సీజన్లలో లభిస్తాయి.  కొన్ని పండ్లు మాత్రం కొన్ని సీజన్లలొ  మాత్రమే  లభ్యమౌతాయి.  కాబట్టి ఆయా  సీజన్లలొ లభించే పండ్లను మనం తీసుకొంటూ ఉండాలి.  ఆకుకూరలుకూరగాయలలోపండ్లలో,పాలలోధాన్యాలలో,  పప్పు ధాన్యాలలోచేపలలోకోడిగుడ్లలో,  మాంసాహారంలో,ఇలా అన్నింటిలో మనకు విటమిన్లు  లభిస్తాయి.  మన పూర్వికులు   ప్రకృతిలో  దొరికే వీటన్నిటిని ఎంపికచేసివాటిలోని పోషకాలను గుర్తించివాటిని పంటలగా పండించి మనకు ఒక క్రమపద్దతిలొ ఆహారన్ని అందించారు. ఈ రోజు ఒక్కొక్క ఆహార పదార్ధం మన శరీరానికి కావలసిన కార్బొహైడ్రైడ్ లువిటమిన్లుకొవ్వు పదార్ధాలను అందిస్తున్నాయి.  మనం తీసుకొనే ఆహారంలొ అన్ని పదార్ధాలు సమపాళ్ళలో అందాలి. సరైన  పాళ్ళలో మనకు అవి అందనప్పుడు  వివిధ జబ్బులకు లోనుకావలసి వస్తుంది. విటమిన్లు  శరీరంలొ వివిధ భాగాలు సక్రమంగా పనిచేయటానికి ఉపయోగపడతాయి. 

విటమిన్ '' :   కంటిలో "రోడాప్సిన్" అనే  రసాయన  పదార్ధం తయారుకావటానికి తోడ్పడుతుంది.  ఎ విటమిన్ లోపం వల్ల రేచీకటి  లేదా అంధత్వం సంభవించే ప్రమాదం ఉంది.

విటమిన్ డి ' :  డి విటమిన్ కాల్షియంతో కలసి పళ్ళుఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది.  డి విటమిన్ లొపం వల్ల ఎదిగే పిల్లలలో రికెట్స్ వంటి వ్యాధులు వస్తాయి.  దీనివల్ల పళ్ళుఎముకలు తేలికగా ఏర్పడతాయి లెదా సరిగా అభివృధ్ది చెందక పోవడం జరుగుతుంది. 

విటమిన్ కె ' : ఏవైనా గాయాలు తగిలినప్పుదు రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది.  విటమిన్ కె లొపంవల్ల గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డకట్టకుండా,  అధిక రక్త స్రావం జరిగే ప్రమాదం ఉంది. 

బి  కాంప్లెక్స్ :  బి 1 (థైమిన్),  బి 9 (ఫోలిక్ ఆసిడ్),  బి 12 ( కొబాల్మిన్ ).   ప్రతి రోజు శరీరానికి కావలసిన శక్తిని కణాలకు అందిస్తాయి.  ముఖ్యంగా గుండెమెదడు   నరాలకు శక్తిని ఇస్తాయి.  థైమిన్ లోపం వల్ల "బెరి - బెరి " అనె వ్యాధి వస్తుంది.  దీనివల్ల మెదడు నరాలు దెబ్బతింటాయి.   గుందె జబ్బులు సంభవిస్తాయి.  బె 9,బె 12లు బోన్ మెరొ లో ఎర్ర రక్త కణాలు  అభివృధికి తొడ్పడతాయి.  బె 9బె 12 వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. వీటి   లోపం వల్ల ఎర్ర రక్త కనాలు సరిగా వృధ్ది చెందకఊపిరితిత్తులనుండి ఆక్సిజన్ అన్నీ శరీర భాగాలకు  సరిగా చేరదు. 

విటమిన్  - సి  :  రక్త కణాల  గోడలలొ ఏర్పడే రంధ్రాలను పూడ్చడానికి సహయపడుతుంది.  వివిధ కణాలను ఒకటిగా  కలిపి ఉంచుతుంది.  విటమిన్ - సి లోపం వల్ల స్కర్వి వ్యాధి వస్తుంది.  విటమిన్ - సి  లోపం వల్ల పళ్ళ చిగుళ్ళ వ్యాధులు వస్తాయి.  చిగుళ్ళ నుండి రక్తం కారటం,  కొన్ని శరీర భగాలనుండి రక్తం శ్రవించడం ఈ వ్యాధి లక్షణం.  సాధరణంగా వచ్చే జలుబుకు కూడా  విటమిన్ - సి అవసరం అవుతుంది. 

విటమిన్ - ఇ   :  ఇ విటమిను శరీరం  తయారు చెసుకొనలేదు. కాబట్టి ఆహార పదార్దాల ద్వారా  మాత్రమే  దీనిని  గ్రహించలి. ఇ-విటమిన్ శరీరంలో   ఏర్పడే  ప్రి -రాడికల్స్ ను   నియంత్రిస్తుంది. గుండె  జబ్బులను నివారించడంలో   ప్రముఖ పాత్ర వహిస్తుంది. సరైన మోతాదులో  ఇ-విటమిన్ తీసుకోవడం  వల్ల కీళ్ళ నొప్పులు ,కాటరాక్ట్ ,క్యాన్సర్  లంటి  వ్యాధులను  నివారించవచ్చు. అయితే డాక్టరు  సలహా లేకుండా  అధిక మోతాదూలో  దీనిని  తీసుకొనకూడదు. ఆలివ్ అయిల్ ,కార్న్ సోయాబీన్ ,  కోకోనట్ క్యాబేజీ ,పాలుబటర్ఆల్మండ్  విట్ జర్మ్  అయిల్ వంటి వాటిలో  అధికంగా  ఉంటుంది.
                        ఏయే ఆహర పదార్దాలలో ఈ విటమిన్లు సమృద్దిగా ఉన్నాయో తెలుసుకుందాం అన్నీ రకాల ఆకు కూరల్లో ఎ విటమిన్ అధికంగా  ఇంకా మిగితా విటమిన్లన్నీ  (డి విటమిన్ తప్ప ) లభిస్తాయి. క్యరెట్ ,గుమ్మడివంటి కూరగాయల్లో ,మామిడి పనస బొప్పాయి   పండ్లలో  ఎ-విటమిను లభిస్తుంది.  మనం తీసుకొనే  ధాన్యాలు,  పప్పు ధాన్యాలు  ,ముఖ్యంగా థైమిన్ గింజలు నూనె గింజలులో సమృద్దిగా లభిస్తాయి. ఎ,డి విటమిన్ లు   చేప    కాలేయంలో  సమృద్దిగా మాంసం ,కోడిగుడ్లలో ఎ,డి విటమిన్లు  లభిస్తాయి.

               పాలల్లొ 'ఏ విటమిన్ లు, 'బి విటమిన్ లు, 'డి  విటమిన్ లు, 'శి 'విటమిన్ లు సమృధిగా లభిస్తాయి.  అందుకే  పాలను "సంపూర్న ఆహారం" గా పిలుస్తారు.  అధికంగా పాలను మరగించటంవల్ల  'సి విటమిన్ పాలల్లొ లోపిస్తుంది. కమలాఫినాఫిల్జామఉసిరిగనిమ్మటమటాలలో 'సి విటమిన్ సమృధ్ధిగా లభిస్తుంది.  మన చర్మం పై పొరలలొ ఉండే  ఒక రసాయనంసూర్యుడినుండి లభించే అతి నీలలొహిత కిరణాలను గ్రహించి విటమిన్ -డి  ను తయారు చేసి శరీరానికి అందిస్తుంది.  జీర్నకోశంలొ ఉండె కొన్ని రకాలైన సూక్ష్మ జీవులు కెబె 12 లను ఉత్పత్తు చేసి శరీరానికి అందిస్తాయి.

                గోధుమలుపప్పు దినుసులలోకోడిగుడ్డుమంసాహారంతాజా కాయగూరలుపండ్లలో బీ 12 అధికంగా లభిస్తుంది.   మనకు 2 మిల్లిగ్రాములు200 మైక్రొ మిల్లిగ్రాముల ఫోలిక్ ఆసిడ్ లు మాత్రమే అవసరమౌతాయి.   అది మనం తీసుకొనె ఆహారంలో లభ్యమౌతాయి. 

               అయితే మనం చేసె తప్పిదాల వల్ల కొన్ని విటమిన్ లు మనం తీసుకొనే ఆహార పదార్ధాలలొ నశిస్తున్నాయి.   ఉదాహరణకు  గోధుమ పై పొట్టులొ మనకు కావలసిన విటమిన్ లు  లభిస్తాయి.  అయితే మైదారవ్వకోసం వాటి  పై పొట్టును మిల్లుల్లో తొలగించి  మనకు అందిస్తున్నరు.  అదేవిధంగా మిల్లులలో ఆదించిన బియ్యం వల్ల బి విటమిన్ లోపిస్తుంది.  ఉప్పుడు  బియ్యంలో మాత్రం బి విటమిన్ అధికంగా లభిస్తుంది.  సాధారణంగా  ప్రతి ఇంట్లో బియ్యాన్ని ఒకటికి రెండు   సార్లు కడుగుతారు.   ఇలా కదగడం వల్ల అధికసాతం బి విటమిన్ నస్టపోతున్నాం.  కొన్ని పప్పు పధార్ధాలలో త్వరగా ఉడకడానికిరుచి కోసం సోడా  ఉప్పును కలుపుతూంటారు.      దీని వల్ల కూడ మనం విటమిన్ లను కోల్పొతున్నాము.  ఎక్కువగా వేయించటంవల్ల కూడా విటమిన్ లను నష్టపోతాము. 

                  ఇడ్లి,  దోశ,  పుంగళాలు వంటి వాటికి మనం పిండిని పులియ బెడతాం. దీనివల్ల  బిసివిటమిన్ లు అధికంగా లభిస్తాయి.  శనగపెసర వంటి మొలకెత్తిన ధాన్యాలలో అధికంగా ఈ విటమిన్ లు లభిస్తాయి.  మనదేశంలో  పిల్లలలో విటమిన్ ల లోపం ఎక్కువగా  ఉంది.  దీనికి ముఖ్య కారణం పేదరికం ఒకటిసరైన పొషక ఆహార పదార్ధాలు అందక పోవటం,  పోషక విలువలు కలిగిన  ఆహారం తిసుకొకపోవటంసైరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం. 

               మాత్రల రూపంలో ఈ విటమిన్ లు మార్కెట్ లో లభిస్తాయి.  డాక్టరు సలహ లేకుండా వీటిని వాడకూడదు.   జబ్బున పడినప్పుడుఆహారం సరిగా తీసుకోనప్పుడుయాంటి బయాటిక్స్ వాడినప్పుడు విటమిన్ లు డాక్టరు సలహపై తీసుకోవాలి.   ఆకుకూరలుకాయగూరలుపండ్లుపాలు సమృద్దిగా తీసుకొనేవారికి విటమిన్ టాబ్లెట్ లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

             కాలెయం (Liver), విటమిన్ లను కణజాలలో ఉపయొగించుకొనే  విధంగా సహాయ పడుతుంది.  అందుకే లివర్ జబ్బులులతో బాధపడేవారికి   విటమిన్లు శరీరానికి అందవు.  శరీరానికి కావలిసిన విటమిన్ లను ఉపయోగించుకొని మిగతా  వాటిని యూరిన్  ద్వార బయటకు పుంపేస్తుంది.  అధిక మోతాదులలో విటమిన్లను తీసుకోవటం కూడా ప్రమాదమే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రెసర్చ్ వారి సూచనల ప్రకారం ప్రతి రోజు మనం తీసుకొనే ఆహారంలో ఆకుకూరలు - 50 గ్రాములుకూరగాయలు - 60 గ్రాములు,  దుంపకూరలు - 50 గ్రాములు,  ఫైబర్స్ - 50గ్రాములు,  పాలు లేదా  పాల పాల పదార్ధాకు - 50  గ్రాములు ఉండాలి. 

సంతులిత ఆహారం  : 

                 పసుపు రంగులో ఉండే పండ్లు,  తాజా ఆకుకూరలలో ఉండే బీటకెరోటిన్పుల్లటి పండ్లలో ఉండే సి విటమిన్,  శాఖా తైలాలో ఉండే ఇ - విటమిన్పాలలో ఉండే జింకుపుట్టగొడుగులలో ఉండే కాపర్,  ధాన్యాలలోఎండిన పళ్ళలో క్రోమియం - వీటిని  సమతుల ఆహారం అంటారు.

మాల్ న్యూట్రిషన్ : 

                 సంతులిత ఆహారం శరేరానికి సమపాళ్ళలో లభించినప్పుడు శ్రీరం వివిధ జబ్బులకు లొనౌతుంది.  దేన్ని మాల్ న్యూత్రిషన్ అంటారు. 

ఒబేసిటి :

                 అధిక మొత్తంలో పొషక విలువలు శరీరానికి అందడం వల్ల లెదా సంపాళ్ళలో లెకపోవడం వల్ల ఒబేసిటిగుండె జబ్బులు వంటివి ఏర్పడతాయి.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again