పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 08, 2014

మంగళ్ యాన్ విజయం పై ప్రధాని మోడి ప్రశంసల వర్షం


అరుణిడిపై త్రివర్ణ విజయకేతనం...
తొలి ప్రయోగంలోనే అంగారక ప్రవేశం.
శాస్త్ర దిగ్గజదేశాల భారతదేశం
చంద్రయాన్‌ తరువాత ఇస్రో మరో దరహాసం
త్రివర్ణపతాకం అరుణ గ్రహ వర్ణశోభితం అయింది. తొట్టతొలి ప్రయత్నంలోనే భారతీయ అంతరిక్ష ప్రయోగం సఫలీకృతం అయింది. మన 'మామ్‌' నుంచి నింగివైపు పలు గ్రహాల ప్రభావాలను, అంతరిక్ష కక్ష్యలను చీల్చుకుంటూ, అనేక అవాంతరాలను అధిగమిస్తూ, వేలకొద్ది మైళ్లును దాటుకుంటూ అంగారక గ్రహ మజిలీని చేరుకుంది. ఇస్రో శాస్త్రజ్ఞులు అంకితభావంతో సాగించిన సంవత్సరాల ప్రయోగాలు ఫలించి ఇప్పుడు శతాధిక భారతీయుల ఖ్యాతి విశ్వాంతరాలను దాటింది. ఎక్కడా అపశృతి లేకుండా, విశ్వ శాస్త్రీయ దిగ్గజ దేశాలకు సవాలువిసురుతూ తొలి ప్రయత్నంలోనే హిట్‌గా నిలిచిన మామ్‌ ప్రపంచ దేశాలన్నింటితో వాV్‌ా మామ్‌ అన్పించుకుంది. మంగళం (అంగారకుడు) చేరిన భారత అంతరిక్ష ప్రయోగవాహక నౌక ఆద్యంతం ఇప్పుడు భారతదేశ శాస్త్ర సాంకేతిక సర్వ మంగళాలకు సన్నాయి వాయిద్యాన్ని మోగించేందుకు సమాయత్తం అయింది. ఇది భారతీయ చరిత్రలోనే అరుణవర్ణంతో లిఖించదగ్గ మరో చరిత్రగా సర్వసత్తాక భారత్‌కు ఇది ముందుగానే వచ్చిన విజయదశమిగా నిలుస్తోంది. మనకు ఏదీ దూరం కాదు. దూరాలు దగ్గరవుతాయి. మనం అనుకునే సౌభ్యాగ భారత తీరం దరిదాపుల్లోనే ఉందని చెప్పడానికి నినదించిందీ అంతరిక్ష విజయ ఘంటానాదం. ఈ ప్రస్థానంలో సాగించే అన్వేషణల ఫలితంగా దేశంలోని, ఈ నేలలోని పేదరికం అంతం అయిపోయ్యేందుకు వీలుగా మన శాస్త్రీయ సంపదకు బలం చేకూరుతుందనేది అందరి ఆశానినాదం. భారత్‌ సశాస్త్రీయ పవర్‌ అనేది నిర్వివాదం.

బెంగళూరు: తొట్టతొలి ప్రయత్నంలోనే, అతి తక్కువ ఖర్చుతోనే అంగారకుని (అరుణ గ్రహం, మంగళం)పైకి భారతదేశం సంధించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్‌) ఆద్యంతం విజయవంతం అయింది. అల్లంతదూరాన, అపరిచితగా ఉన్న మరో గ్రహంపైకి ఇప్పుడు భారతీయ శాస్త్రీయత, అంతరిక్ష పరిశోధనల ఘనతల మేలుకలయిక మామ్‌ ప్రవేశించింది. పలు కక్ష్యలు దాటుకుంటూ, అత్యంత వేగంగా, శాస్త్రీయ ఆదేశాల మేరకు అవసరమైనప్పుడు పరమ నిశ్చలంగా, అతి స్వల్పవేగాలతో సాగి దూరాల నుంచి మన భారతీయ అంతరిక్ష పరిశోధకులు ఇస్రో వర్గాలు అందించిన కమాండ్స్‌కు అనుగుణంగా ఇప్పుడు మామ్‌ ఆ అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. సెప్టెంబర్‌ 24. 2014 ఈ విధంగా భారతదేశ అంతరిక్ష ప్రయోగాలలో

కీలక శకంగా మారింది. దేశమంతా బుధవారం తెల్లవారుజాము నుంచే ఈ అంగారక ప్రయాణ ఘట్టం గురించి ఆసక్తిగా ఎదురుచూసింది. సరిగ్గా ఉదయం 7.17 నిమిషాల ప్రాంతంలోనే శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా మామ్‌ అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే అపురూప ఘట్టం మొదలైంది. రెండు రోజుల క్రితమే అంగారక గ్రహ గురుత్వాకర్షక ప్రభావంలోకి ప్రవేశించి, ఇక ఈ భూ కక్ష్యలు, వాటి ప్రయోగాలకు అతీతంగా నిలిచిన మామ్‌ ఇప్పుడు బుధవారం అత్యంత కీలక ఘట్టం నడుమ, ఇక్కడి ఇస్రో వర్గాలు ఆద్యంతం కనబర్చిన ఆత్మవిశ్వాసం నేపథ్యంలో, తుట్టతుది ప్రయోగాలను విలక్షణంగా పూర్తి చేసుకుని అంగారక కక్ష్యలోకి సజావుగా ప్రవేశించింది. దీనితో భారతీయుల ఆనందం అంబరచుంభితం అయింది. ఈ ప్రయోగ తుది విజయక్షణాలను ఇస్రోకు చెందిన ఇక్కడి కమాండ్‌ సెంటర్‌ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎందరో శాస్త్రజ్ఞులు, మరెందరో ప్రముఖులు తిలకించారు. అయితే కమాండ్‌ సెంటర్‌లో అనుక్షణం, సెకండ్లకు గంటలకు తేడా తెలియకుండా మామ్‌కు ఆదేశాలు ఇస్తూ, అంతకు మించి ఎలాంటి ధ్యాసలు లేకుండా గడిపిన భారతీయ అంతరిక్ష పరిశోధకులు, వారికి అడుగడుక్కీ అన్ని స్థాయిల్లో తోడ్పాటు అందించిన సాంకేతిక సిబ్బంది ఈ మహత్తర విజయంలో పాలుపంచుకున్నారు. తరతరాలకు వారి పేర్లు భారతీయ అంతరిక్ష చరిత్రలో తళుక్కుమనే నక్షత్రాలుగానే నిలుస్తాయి. అంతా ఉత్కంఠతో చూస్తుండగా ఇస్రో శాస్త్రజ్ఞులు తమ సాంకేతిక ఆదేశాల ద్వారా, అత్యంత సంక్లిష్టమైన తుది ప్రయోగానికి విజయవంతం గావించారు. దీనితో అంతటా యురేకా కేకలు మిన్నంటాయి. ఇంతకాలం అంతరిక్ష పరిశోధనలలో నేలబారు చూపులు చూస్తూ వచ్చిన భారతదేశం ఇప్పుడు మూడు అంతరిక్ష దిగ్గజదేశాల సరసన సగర్వంగా నిలిచింది. అందులోనూ తొట్టతొలి ప్రయత్నంలోనే విజయాంబరాన్ని చుంబించిన భారత్‌ విశ్వఖ్యాతినే దక్కించుకుంది. శాస్త్రజ్ఞులు మామ్‌ అంటెనాను విజయవంతంగా సాంకేతిక ఆదేశాలతో మళ్లించగలిగారు. 7.17 గంటల ప్రాంతం నుంచి వరుసగా 24 నిమిషాల పాటు అత్యంత కీలకమైన ఇంధన జ్వలిత ప్రక్రియ సాగింది. మామ్‌కు చెందిన ప్రధానమైన 440 న్యూటాన్‌ లిక్విడ్‌ అపోజీ మోటారు (లామ్‌)ను ఎనిమిది చిన్న థ్రస్టర్లను మండించడం ద్వారా మామ్‌ అంగారకుడి కక్ష్యలోకి అనువుగా ప్రవేశించే వేగాన్ని సంతరించుకుని, ఇక అనుకున్న విధంగా విజయతీరం చేరుకుంది. దీనితో అత్యంత క్లిష్టమైన పరీక్ష విజయవంతంగా ముగిసిన ఘట్టాన్ని మోడీతో పాటు అంతా తిలకించారు. 'నేడు మామ్‌ మంగళ్‌ (అంగారకుడిని) కలుసుకుంది. ఈ ప్రయోగానికి మంగళయాన్‌గా పేరు పెట్టినప్పటి నుంచీ, మామ్‌గా ముద్దుగా పిలుచుకుంటున్నప్పటి నుంచి కూడా తనకు ఇది ఆద్యంతం విజయవంతంగా, అమంగళంగా సాగుతుందనే నమ్మకం కుదిరింది. నిరుత్సాహానికి, ఆశాభంగానికి తావులేకుండా అంతా బాగా జరిగింది. ఇది దేశానికి మంగళకరం' అని మోడీ ఆనందంతో తెలిపారు. ఇస్రోలోని కమాండ్‌ సెంటర్‌లో తుది క్షణాలు సస్పెన్స్‌ సినిమాలోని క్లయిమాక్స్‌ను తలపించాయి. 1350 కిలోల బరువుండే స్పేస్‌క్రాఫ్ట్‌ నిర్ణీత లక్ష్యానికి చేరుకున్న క్షణంలో ఇస్రో శాస్త్రజ్ఞులు పరస్పరం అభినందనలు తెలియచేసుకున్నారు.

లక్షల కిలోమీటర్ల ప్రయాణం

గత ఏడాది నవంబర్‌ 5న మామ్‌ ప్రయాణం మొదలైంది. 666 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని అంగారకుడి లక్ష్యం చేరుకోవడం కోసం ఇన్ని రోజులుగా పలు కక్ష్యల మీదుగా మామ్‌ ప్రయాణించింది. అమెరికా ఇతర దేశాలు పలు ప్రయత్నాల తరువాతనే అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించగలిగాయని, అయితే భారత్‌ తొలి యత్నంలోనే ఈ విజయం సాధించిందని పరిశోధకులు తెలిపారు. ఇప్పటివరకూ 51 అంగారక ప్రయోగాలు జరిగాయి. అందులో కేవలం 21వరకూ విజయం సాధించాయి. ఇది మానవ మేథస్సుకు దక్కిన విజయమని మోడీ తెలిపారు. ఓ అంతుచిక్కని మార్గంలో మన నౌక పయనించింది, తీరం చేరిందని హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రజ్ఞులకు, భారతీయ ప్రజలకు తన అభినందనలు తెలియచేస్తున్నానని తెలిపారు. ఇస్రో ఛైర్మన్‌ కె రాధాకృష్ణన్‌ను ఆయన బృందాన్ని ఆయన అభినందించారు. రాధాకృష్ణన్‌ భుజం తట్టి మెచ్చుకున్నారు. ఓ హాలీవుడ్‌ సినిమాకు అయ్యే ఖర్చు కన్నా తక్కువ వ్యయంతో ఓ బ్రహ్మండమైన విజయం సాధించి ఈ ప్రపంచానికి భారత్‌ శక్తిని చవిచూపించామని కమాండ్‌ సెంటర్‌లో ఇంగ్లీషు, హిందీ భాషలలో చేసిన ప్రసంగంలో మోడీ తెలిపారు. గ్రావిటి అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాకు వందమిలియన్‌ డాలర్ల ఖర్చు అయింది. అయితే ఈ ప్రయోగానికి 70 మిలియన్‌ డాలర్ల వ్యయం అయింది. నాసా మావెన్‌ ప్రయోగం ఖర్చులో ఇది పదవ వంతు కూడా కాలేదు. రెండు రోజుల క్రితమే అమెరికా అంతరిక్ష నౌక మావెన్‌ అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. మోడీ ఈ ప్రయోగం విజయవంతం సందర్భంగా చేసిన ప్రసంగంలో విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ కవిత చరణాన్ని ఉటంకించారు. ఈ దేశం మరింత స్వేచ్ఛాయుత, విజయవీచికల మరో ఘట్టంలోకి పయనించేలా, మన ఆలోచనలు, మన కార్యాచరణలు ముందుకు సాగాలనే కవితాత్మక సందేశాన్ని మోడీ ప్రస్తావించారు. అసాధ్యాలను సాధ్యం చేస్తూ, విజయాన్నే తమ నిఘంటువుల అక్షరాలుగా మలుచుకుంటున్న ఇస్రోకు జాతియావత్తూ అపార అభినందనలు తెలియచేస్తోందని తెలిపారు.

మంగళయానం : రాష్ట్రపతి అభినందన

ఈ విజయం మరిన్ని శాస్త్రీయ ఘనవిజయాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ఈ చరిత్రను సృష్టించిన ఇస్రో శాస్త్రజ్ఞులు అభినందనీయులని భారత రాష్ట్రపతి తమ సందేశంలో తెలిపారు. ఇస్రో చైర్మన్‌కు ఆయన సందేశం పంపించారు. తొమ్మిది నెలల సుదీర్ఘ ప్రయాణం విజయవంతం కావడం దేశానికే గర్వకారణం అన్నారు. దేశ అంతరిక్ష సామర్థ్యం ఇప్పుడు ప్రపంచవిఖ్యాతంగా మారిందన్నారు. శాస్త్రజ్ఞుల అంకితభావం ఎనలేనిది, కొనియాడదగ్గది అన్నారు. ఈ అంతరిక్ష విజయం పట్ల ఎందరో ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు సోనియా గాంధీ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీలకు అతీతంగా నేతలు అభినందనలు తెలిపారు. ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట ఈ ప్రయోగంతో ఇనుమడిస్తుందని సోనియా గాంధీ తెలిపారు. ఆప్‌ అధ్యక్షులు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇది భారతీయులకు చిరస్మరణీయ ఘట్టం అన్నారు. అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన జాతీయ పరిణామం అని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again