పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 17, 2014

ఇండియన్‌ ఎకానమీ పేదరికం - ప్రాక్టిస్ బిట్స్


1. ఈ కింది వానిలో ఏ పథకం పట్టణ పేదలకు సంబంధించినది?
1) ఐఆర్‌డిపి 2) ఎన్‌ఆర్‌ఇపి
3) ఆర్‌ఎల్‌ఇజీపి 4) నెహ్రూరోజ్‌గార్‌ యోజన
2. ఏ ప్రాంతంలో ఆకలి బాధకు గురవుతున్న కుటుంబాలను గుర్తించ డానికి 'హంగర్‌ ప్రాజెక్టు' పేరిట సర్వే జరిగింది?
1) ఉత్తరప్రదేశ్‌ 2) బీహర్‌
3) రాజస్థాన్‌ 4) పశ్చిమబెంగాల్‌
3. అంత్యోదయ అన్నయోజన పథకం ఎప్పుడు ప్రారంభించారు?
1) నవంబర్‌ 20, 2000
2) డిసెంబర్‌ 25, 2000
3) ఆగస్టు 20, 2000
4) సెప్టెంబర్‌ 20, 2000
4. పేదల్లో నిరుపేదలకు కిలోకు మూడు రూపాయల చొప్పున నెలకు 25 కేజీల బియ్యాన్ని పంపిణీ చేసే పథకం ఏది?
1) అంత్యోదయ 2) అంత్యోదయ అన్నయోజన
3) అన్నపూర్ణ 4) ఏదీకాదు
5. 2007 నాటికి పేదరికం నిష్పత్తిని ప్రస్తుతమున్న 26 శాతం నుండి ఎంతకు తగ్గించాలని లక్ష్యించారు?
1) 18 శాతం 2) 20 శాతం
3) 21 శాతం 4) 23 శాతం
6. హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌ను ప్రచురించేది ఎవరు?
1) ఐక్యరాజ్యసమితి
2) యునైటెడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌
3) ప్రపంచ బ్యాంక్‌
4) ఏదీకాదు
7. యుఎన్‌డిపి విడుదల చేసిన హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌లో ఏ సూచికలను పరిగణలోకి తీసుకుంటారు?
1) తలసరి ఆదాయం 2) సగటు జీవితకాలం
3) అక్షరాస్యత స్థాయి 4) పైవన్నీ
8. మానవాభివృద్ధి సూచిక (హెడ్‌డిఐ)లో చైనా కంటే పైనున్న మూడు రాష్ట్రాలు ఏవి?
1) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కేరళ
2) హర్యానా, పంజాబ్‌, మహారాష్ట్ర
3) కేరళ, పంజాబ్‌, మహారాష్ట్ర
4) గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళ
9. దేశంలో మానవాభివృద్ధి నివేదికను రూపొందించిన మొదటి రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర 2) మధ్యప్రదేశ్‌
3) ఒరిస్సా 4) గోవా
10. దేశాలు అభివృద్ధి చెందే క్రమంలో ప్రతి దేశం ఎన్ని దశలను దాటాల్సి ఉంటుందని రాస్టో అనే ఆర్థికవేత్త ప్రతిపాదించారు?
1) 7 దశలు 2) 4 దశలు
3) 3 దశలు 4) 5 దశలు
11. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా సర్వే ప్రకారం 2000-01 లో పేదరిక శాతం ఎంత?
1) 24.4 2) 26
3) 18 4) 19
12. జిల్లాలో ఆదాయం కల్పించే కార్యక్రమాలను రూపొందించి గ్రామీణ మహిళల పరిస్థితిని అభివృద్ధి పరచడానికి ఉద్దేశించిన
పథకం?
1) ఎస్‌.యు.ఎమ్‌ 2) ఐ.ఆర్‌.డి.పి
3) ఎస్‌.ఇ.పి.యు.పి 4) డి.డబ్ల్యూ.సి.ఆర్‌.ఎ
జనాభా
13. జనాభా సిద్ధాంతాన్ని (పాపులేషన్‌ థియరీ) ప్రతిపాదించినది?
1) రికార్డో 2) మార్షల్‌
3) మాల్థస్‌ 4) వాలేరస్‌
14. ది పాపులేషన్‌ బాంబ్‌ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు?
1) టి.ఆర్‌.మాల్థస్‌ 2) ఆడమ్‌స్మిత్‌
3) పాల్‌ఎల్‌రిచ్‌ 4) ఆమర్త్యసేన్‌
15. పుట్టే ప్రతిబిడ్డా శ్రామికుడే అన్నది ఎవరు?
1) మాల్థస్‌ 2) కార్ల్‌మార్క్స్‌
3) కానెస్‌ 4) పిగో
16. ది ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ పాపులేషన్‌ అనే గ్రంథం రాసినది ఎవరు?
1) మాల్థస్‌ 2) కార్ల్‌మార్క్స్‌
3) కానెస్‌ 4) పిగో
17. జనాభా పరిణామ సిద్ధాంతం రెండవ దశను ఏవిధంగా వర్ణించవచ్చును?
1) అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు
2) అధిక జననాల రేటు, తగ్గుతున్న మరణాల రేటు
3) తక్కువ జననాల రేటు, తక్కువ మరణాల రేటు
4) తగ్గుతున్న జననాల రేటు, తగ్గుతున్న మరణాల రేటు
18. పాశ్చాత్య దేశాలలో మాల్థాసియన్‌ అంచనాలు అమలు కాకపోతే కారణం?
1) కొత్త భూభాగాలు కనుగొనబడుట మరియు వనరుల వెలికితీత
2) ద్రవ్యకేంద్రీకరణ
3) సాంకేతిక పురోగతి మరియు కొత్త వాటిని కనుగొనుట
4) పైవన్నీ
19. భారతదేశం జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటానికి కారణం?
1) జననాల, మరణాల రేట్లు రెండూ ఎక్కువగా ఉండటం
2) ఆరోగ్య సేవలు మెరుగుపడటం వల్ల జననాల రేటు అధికమై
మరణాల రేటు పడిపోతూ ఉండటం వల్ల జనాభా పెరుగుతూ పోవడం.
3) మరణాల, జననాల రేట్లు బాగా పడిపోతూ ఉండటం
4) ఇవేవీ కారణం కాదు
20. జనాభా పెరుగుదల రేటును కింది మార్గాలలో దేని ద్వారా గణిస్తారు?
1) జనన రేటును, మరణ రేటులను వర్గీకరించడం ద్వారా
2) మరణా రేటును, జననాల రేటు ద్వారా గణించడం ద్వారా
3) మరణాల రేటును, జననాల రేటును కలపటం ద్వారా
4) జనాల రేటు నుంచి మరణాల రేటును తీసివేయడం ద్వారా
21. త్వరితంగా పెరుగుతున్న జనాభా పెరుగుదల రేటు అనేక వర్గాలుగా ఆర్థిక వృద్ధిని మందపరుస్తుంది. అయితే సకారాత్మకంగా చూస్తే కింది వాటిలో ఏది అసత్యం?
1) వినియోగించబడే వస్తువుల సంఖ్యను పెంచుతుంది. 2) ప్రతి వ్యక్తికి లభ్యమయ్యే తలసరి భూమిని మూలధనాన్ని, ఇతర ఉత్పాదనలను తగ్గిస్తుంది?
3) శ్రామికశక్తి సరఫరాని పరిమితం చేస్తుంది
4) అనుత్పాదక వినియోగదారుల భారాన్ని పెంచుతుంది.
22. దేశంలో జనాల రేటును సాధారణంగా కింది మార్గంలో
గణిస్తారు?
1) దేశంలో పుట్టిన పిల్లల సంఖ్యను లెక్కించడం ద్వారా
2) దేశంలో ఉన్న మహిళల సంఖ్యకు పుట్టిన పిల్లల సంఖ్యను శాతంలో నిర్ణయించడం ద్వారా
3) దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకి పుట్టిన పిల్లలను పరిగణించడం ద్వారా
4) దేశంలో ప్రతి వెయ్యిమంది మహిళలకు పుట్టిన పిల్లలను గణించడం ద్వారా
23. జననాల రేటులో తగ్గుదల వల్ల కింది వాటిలో దేనిలో పెరుగుదల కనిపిస్తుంది?
1) పొదుపు 2) పెట్టుబడి
3) ఉత్పత్తి 4) తలసరి ఆదాయం
24. శిశు మరణాల రేటును ఏ విధంగా లెక్కించడం వల్ల కింది వాటిలో దేనిలో పెరుగుదల కనిపిస్తుంది?
1) పాఠశాలకు వెళ్లే వయస్సు వచ్చేనాటికి మరణించిన పిల్లల
సంఖ్యను గణించడం ద్వారా
2) మూడు సంవత్సరాల వయస్సు, వచ్చేనాటికి మరణించిన పిల్లల సంఖ్యను గణించడం ద్వారా
3) పుట్టిన సంవత్సరంలోపే మరణించిన పిల్లలను గణించడం ద్వారా
4) పైవేవీకావు
25. ఏ కారణం వల్ల 1921 సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరంగా పరిగణిస్తున్నారు?
1) 1911-21 దశాబ్దంలో జాతీయ ఆదాయం పడిపోయి, తర్వాత నిదానంగా పెరగనారంభించింది.
2) 1911-21 దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదలరేటు ఋణాత్మ కంగా ఉంది, తర్వాత కాలంలో పెరగనారంభించింది.
3) వ్యవసాయ ఉత్పత్తి, ఒక సంవత్సరం పెరుగుతూ, మరొక సంవత్సరం తగ్గుతూ ఉండటం వల్ల
4) పైవేవీకావు
26. 1971 తర్వాత భారతదేశ జనాభా వేగంగా వృద్ధి చెందింది. దీనికి కారణమేమిటి?
1) మరణాల రేటు భారీగా తగ్గిపోవడం
2) జననాల రేటు భారీగా పెరగడం
3) విదేశాలలోని భారతీయులు స్వదేశానికి రావడం
4) భారతదేశం నుంచి బయటకు వలసవెళ్లే వారి సంఖ్య తగ్గిపోవడం
27. జనాభా పరిమాణం అభిలాషణీయ స్ధాయిని ఎప్పుడు చేరు కుంటుంది?
1) తలసరి ఆదాయం గరిష్ట స్థాయికి పెరిగినప్పుడు
2) కార్మికులకు సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు
3) జనాభా పెరుగుదల రేటు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు
4) జనాభా నిలకడగా ఉన్నప్పుడు
28. అభిలాషణీయ జనాభా అనే భావనను కింది వాటిలో ఏది ఖచ్చితంగా వివరిస్తుంది?
1) ఉత్పత్తి పెరుగుతుంది మరియు జనాభా తగ్గుతుంది.
2) ఉత్పత్తి నిలకడగా ఉండగా, జనాభా పెరుగుతుంది
3) జనాభా పెరుగుతుంది మరియు ఉత్పత్తి తగ్గుతుంది
4) జనాభా, ఉత్పత్తి రెండూ నిలకడగా ఉంటాయి
29. ఐక్యరాజ్యసమితి సంస్థ అయిన ''యుఎన్‌ఎఫ్‌పిఏ'' ప్రపంచ జనాభా, ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల జనాభా పెరుగుదల ధోరణులను అనునిత్యం తెలియజేసేందుకు ఒక గడియారాన్ని తయా రు చేసింది. దాని పేరు ఏమిటి?
1) జనాభా గడియారం
2) పాప్‌ రికార్డెక్స్‌
3) పీపుల్స్‌ స్కోర్‌
4) యు.ఎన్‌పీపుల్‌
30. భారత జనాభా 100 కోట్లకు చేరుకున్నది ఎప్పుడు
1) మే 11, 2000 2) జనవరి 1, 2001
3) ఫిబ్రవరి 28, 2000 4) ఆగస్టు 15, 1999
31. 2001 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో జనసాంద్రత
ఎంత?
1) 216 2) 324
3) 416 4) 516
32. ఏ ఆర్థిక కార్యకలాపం ఉన్నచోట అత్యధిక జనసాంద్రతలు ఉంటాయి?
1) వాణిజ్య వ్యవసాయం
2) పారిశ్రామికీకరణ, పట్టణీకరణ
3) పాడిపరిశ్రమ, పశువుల పెంపకం
4) గనుల తవ్వకం
33. భారతదేశంలో ఏ రాష్ట్రంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు?
1) కేరళ 2) తమిళనాడు
3) గోవా 4) ఢిల్లిd
34. కింది రాష్ట్రాలలో, జాతీయ, సగటు కంటే స్త్రీ పురుష నిష్పత్తి
తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) తమిళనాడు 2) ఒరిస్సా
3) పంజాబ్‌ 4) పై రాష్ట్రాలన్నీ
సమాధానాలు
1. 4 2. 3 3. 2 4. 2 5. 3 6. 2 7. 4 8. 3 9. 1 10. 3 11. 1 12. 4 13. 3 14. 3 15. 3 16. 1 17. 2 18. 4 19. 2 20. 4 21. 3 22. 3 23. 4 24. 3 25. 2 26. 1 27. 1 28. 4 29. 1 30. 1 31. 2 32. 2 33. 1 34. 3 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again