పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 21, 2014

కృష్ణదేవరాయల పండిత సభను ఏమనేవారు ?

మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ దక్షిణాన స్థాపించిన హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యం.
- క్రీ.శ 1336 లో తుంగభద్రా నది ఒడ్డున విద్యారణ్య స్వామి సహాయంతో హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
- వీరు సంగమ వంశస్థులు. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు పారిపాలించాయి.
- రాయచూర్‌ దోఆబ్‌ గురించి బహమనీ సుల్తానులకు విజయనగర రాజులకు నిరంతరం యుద్ధాలు జరిగేవి.
- సంగమ వంశంలో గొప్పవాడు. రెండో దేవరాయులు.
- ఇతడి కాలంలో అబ్దుల్‌ రజాక్‌ అనే సారశీక రాయబారి క్రీ.శ 1443లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు.
- సంగమ వంశం తర్వాత సాళువ వంశస్థులు పరిపాలించారు.
- సాళువ వంశం తర్వాత తుళువ వంశస్థులు పరిపాలించారు.
- తుళువ వంశంలో గొప్ప పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు.
శ్రీ కృష్ణదేవరాయలు (క్రీ.శ 1509-1529)
    విజయనగర సామ్రాజ్య పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు గొప్పవాడు.
- ఉమ్మత్తూరు, శివసముద్రాల పాలకులను ఓడించాడు.
- పోర్చుగీసు వారితో స్నేహసంబంధాలు పెంపొందించుకున్నాడు.
- క్రీ.శ 1510లో వారితో సంధి చేసుకుని మేలు జాతి అశ్వాలను పొందాడు.
- శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రలతో కటక్‌ను పరిపాలించే గజపతులను, బీజాపూరు సుల్తానులను ఓడించాడు.
- ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, బెజవాడ, రాజమండ్రి మొదలైన దుర్గాలను ఆక్రమించాడు.
- సింహాచలంలో విజయస్తంభాన్ని ఏర్పాటు చేశాడు.
- శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్‌ సుల్తాన్‌ ఇస్మాయిల్‌ ఆదిల్‌షాతో రాయచూరు దగ్గర యుద్ధం చేసి ఓడించాడు.
- శ్రీకృష్ణదేవరాయలు కాలంలో పోర్చుగీసు వర్తకుడు డోమింగ్‌ పేయిజ్‌ విజయనగరాన్ని సందర్శించాడు.
- రాయలు యుద్ధవీరుడు మాత్రమే కాదు పరిపాలనా దక్షుడు కూడా. ప్రజలను పన్నులతో బాధించలేదు.
- నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు.
- ఆముక్తమాల్యద కావ్యాన్ని రచించాడు. భువనవిజయం అనే పండిత సభను ఏర్పాటు చేసి పండితులను సత్కరించాడు.
- అష్టదిగ్గజాలనే కవులు రాయల ఆస్థానంలో ఉండేవారు.
- ఈయన కాలంలో హజార రామాలయం ప్రసిద్ధిచెందింది.
- రామాయణ గాథను శిల్పులు హజార రామాలయం గోడలపై చెక్కారు.
- క్రీ.శ 1529లో శ్రీకృష్ణదేవరాయలు మరణించాడు.
విజయనగర సామ్రాజ్య పతనం
- క్రీ.శ 1565లో తళ్లికోట యుద్ధం లేదా రాక్షస - తంగడి యుద్ధం జరిగింది.
- ఈ యుద్ధంలో బీజాపూర్‌, గోల్కొండ, అహ్మద్‌నగర్‌ సుల్తానులు ఒక కూటమిగా ఏర్పడి విజయనగరంపై దండెత్తి రామరాజును ఓడించి చంపారు.
- తళ్లికోట యుద్ధంలో ఓటమి చెందడంతో విజయనగర సామ్రాజ్య పతనం మొదలైంది.
- తిరుమల రాయలు పెనుకొండకు పారిపోయాడు.
- తర్వాత విజయనగరాన్ని అరవీటి వంశం పెనుకొండ నుంచి పరిపాలించింది.
విజయనగర రాజ్యపాలన - వైభవం
  మధ్యయుగంలో దక్షిణ భారత రాజ్యాల్లో ప్రసిద్ధి చెందింది విజయనగర సామ్రాజ్యం.
- ఈ సామ్రాజ్యంలో అబ్దుల్‌ రజాక్‌, న్యూనిజ్‌, నికోలో కాంటి, డోమింగ్‌ పేయిజ్‌ మొదలైన విదేశీ రాయబారులు సందర్శించారు.
- విజయనగర రాజులు సంప్రదాయబద్ధమైన రాచరికాన్ని అనుసరించారు.
- రాజుకు పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి మంత్రి పరిషత్తు ఉండేది.
- చక్రవర్తికి ప్రధానమంత్రి ముఖ్య సలహాదారుడు.
- విజయనగర సామ్రాజ్య కాలంలో రాష్ట్రాలతోపాటు సామంత రాజ్యాలు కూడా ఉండేవి.
- రాష్ట్రాలు గవర్నర్ల ఆధీనంలో ఉండేవి.
- సైన్యంలో అశ్వదళం, గజదళం, కాల్బలం ప్రధానమైనవి. ఫిరంగి దళం కూడా ఉండేది.
- సార్వభౌముల ఆధీనంలో, రాష్ట్ర గవర్నర్లు, నాయకుల ద్వారా కొంత సైన్యాన్ని పోషించేవారు.
- విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం.
- రాజ్యానికి ముఖ్య ఆదాయం భూమిశిస్తు. 1/3వ వంతు భూమిశిస్తును వసూలు చేసేవారు.
- వ్యవసాయాభివృద్ధికి చెరువులు, కాలువలను తవ్వించేవారు.
- పర్షియా, అరేబియా, ఈజిప్టు, ఇటలీ, పోర్చుగల్‌, సింహళం, చైనా, బర్మా మొదలైన దేశాలతో వర్తక వ్యాపారాలను కొనసాగించారు.
- సమాజంలో బ్రాహ్మణులను గౌరవించేవారు.
- హిందూ ధర్మ రక్షణకు పాటుపడ్డారు.
- శైవ, వైష్ణవాలు ఉండేవి.
- సాళువ రాజుల కాలం నుంచి వైష్ణవమతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
- తిరుపతి, శ్రీరంగం, అహోబిలం మొదలైనవి కొన్ని ప్రముఖ వైష్ణవ కేంద్రాలు.
- విజయనగర రాజులు విఠలస్వామి దేవాలయం, హజార రామ దేవాలయం, మొదలైన దేవాలయాలను నిర్మించారు.
- పద్మమహలు, రంగమంటపం మొదలైన వాటిని కట్టించారు.
- సంస్కృతం, కన్నడ, తమిళ భాషల కవులను పోషించారు.
మాదిరి ప్రశ్నలు...
1. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం ?

ఎ. క్రీ.శ 1347 బి. క్రీ.శ 1336
సి. క్రీ.శ 1364 డి. క్రీ.శ 1326
2. ఏ ఢిల్లీ సుల్తాన్‌ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ?
ఎ. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ బి. బాల్బన్‌
సి. మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌
డి. ఫిరోజ్‌షా తుగ్లక్‌
3. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నదిఒడ్డున స్థాపించారు ?
ఎ. కృష్ణా బి. గోదావరి
సి. కావేరి డి. తుంగభద్ర
4. సంగమ వంశంలో గొప్పవాడు ?
ఎ. హరిహరరాయలు బి. రెండో దేవరాయలు
సి. బుక్కరాయలు డి. సంగమ ముని
5. పారశీక రాయబారి అబ్దుల్‌ రజాక్‌ ఏ విజయనగర చక్రవర్తి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు ?
ఎ. శ్రీకృష్ణదేవరాయలు బి. రామరాయలు
సి. రెండో దేవరాయలు డి. హరిహర రాయలు
6. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల వరుస క్రమాన్ని గుర్తించండి ?
ఎ. సంగమ బి. తుళువ
సి. అరవీటి డి. సాళువ
ఎ. 1, 2, 4, 3 బి. 4, 2, 3, 1
సి. 1, 4, 3, 2 డి. 1, 4, 2, 3
7. శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో పోర్చుగీసువారితో సంధి చేసుకున్నారు ?
ఎ. క్రీ.శ 1510 బి. క్రీ.పూ. 1512
సి. క్రీ.శ 1511 డి. క్రీ.శ 1516
8. శ్రీకృష్ణ దేవరాయలు విజయస్తంభాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ. ఉదయగిరి బి. కొండవీడు
సి. సింహాచలం డి. కటక్‌
9. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీయుడు ఎవరు ?
ఎ. నికోలో కాంటి బి. డోమింగ్‌ పేయిజ్‌
సి. మార్కోపోలో డి. అబ్దుల్‌ రజాక్‌
10. ఆయుక్తమాల్యద రచయిత ఎవరు ?
ఎ. రెండో దేవరాయలు
బి. అల్లసాని పెద్దన
సి. ధూర్జటి
డి. శ్రీకృష్ణదేవరాయలు
11. శిల్పులు రామాయణగాథను ఏ ఆలయ గోడలపై చెక్కారు ?
ఎ. శ్రీరంగం బి. అహోబిలం
సి. హజార రామాలయం
డి. విఠల స్వామి ఆలయం
12. తళ్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ?
ఎ. క్రీ.శ 1556 బి. క్రీ.శ 1536
సి. క్రీ.శ 1564 డి. క్రీ.శ 1565
13. కృష్ణదేవరాయల పండిత సభను ఏమనేవారు ?
ఎ. వసంత మండపం బి. త్రివిజయ
సి. భువన విజయం డి. సంగం
14. శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో మరణించాడు ?
ఎ. క్రీ.శ 1509 బి. క్రీ.శ 1520
సి. క్రీ.శ 1529 డి. క్రీ.శ 1549
15. విజయనగర రాజ్య ముఖ్య ఉద్దేశం ?
ఎ. ఇస్లాం మత వ్యాప్తి నిరోధించడం
బి. భక్తి ప్రచారం
సి. ఢిల్లీ సుల్తానులను పారద్రోలడం
డి. హిందూ ధర్మరక్షణ
16. ఏ వంశం రాజుల కాలం నుంచి వైష్ణవం బాగా వాడుకలోకి వచ్చింది ?
ఎ. సంగమ బి. సాళువ
సి. తుళువ డి. అరవీటి
సమాధానాలు : 1.బి, 2.సి, 3.డి, 4.బి, 5.సి, 6.డి, 7.ఎ, 8.సి, 9.బి, 10.డి, 11.సి, 12.డి, 13.సి, 14.సి, 15.డి, 16.బి

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again