పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 14, 2014

నోబెల్ అందుకున్న భారతీయులు

నోబెల్ అందుకున్న భారతీయులు



భారత గ్రహీతలు: భారతదేశ పౌరసత్వం ఉన్న వారు, భారతదేశంలో జన్మించి విదేశీ పౌరసత్వం పొందిన మొత్తం పది మందికి నోబెల్ బహుమతి లభించింది.

భారతదేశ పౌరసత్వం ఉన్న నోబెల్ గ్రహీతలు

రవీంద్రనాథ్ ఠాగూర్: 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ అవార్డు లభించిన తొలి ఆసియా ఖండవాసి ఠాగూర్. 1861, మే 7న జన్మించిన ఠాగూర్ 1941, ఆగస్టు 7న మరణించారు. బెంగాల్‌కు చెందిన ఆయనను గురుదేవ్ అని సంబోధిస్తారు. ఆయన రచించిన గీతాంజలి విశ్వవిఖ్యాతి చెందింది. భారత జాతీయగీతం జన గణ మన, బంగ్లాదేశ్ జాతీయగీతం అమర్ శోనార్ బంగ్లా ఠాగూర్ రచనలే. 1915లో నైట్‌హుడ్‌తో సత్కరించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా 1919లో ఠాగూర్ నైట్‌హుడ్‌ను తిరస్కరించారు.

సర్ సి.వి. రామన్: 1930లో ఫిజిక్స్‌లో నోబెల్ లభించింది. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. చంద్రశేఖర వెంకటరామన్ 1888, నవంబర్ 7న తమిళనాడులో జన్మించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. అందువల్ల ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్‌‌స దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1929లో బ్రిటిషర్లు రామన్‌ను నైట్‌హుడ్‌తో సత్కరించారు. 1954లో భారతరత్న అవార్డు లభించింది. ఆయన 1970, నవంబర్ 21న బెంగళూరులో మరణించారు
.
మదర్ థెరిసా: 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరిసా 1910, ఆగస్టు 26న ఆప్పటి ఒట్టొమాన్ సామ్రాజ్యంలోని స్కోపేలో జన్మించారు. ఆమె అసలు పేరు ఏంజెజ్ గోంజె బొజాజియు. ఆమె 1929లో భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను 1950లో ఏర్పాటు చేశారు. మదర్ థెరిసాకు 1980లో భారతరత్న అవార్డు లభించింది. 1997 సెప్టెంబరు 5న కలకత్తాలో మరణించారు.

అమర్త్యసేన్: సంక్షేమ ఆర్థికశాస్త్రంలో చేసిన కృషికిగాను 1998లో నోబెల్ బహుమతి లభించింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఏకైక భారతీయుడు. ఆయన 1933 నవంబర్ 3న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం పశ్చిమబెంగాల్)లో జన్మించారు. 1972 నుంచి అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్‌లలోని పలు విశ్వవిద్యాల యాల్లో బోధించారు. ప్రస్తుతం బీహార్‌లోని నలందా విశ్వవిద్యాలయానికి చాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. 1999లో భారతరత్న లభించింది. అమర్త్యసేన్ పలు పుస్తకాలు రాశారు. డెవలప్‌మెంట్ యాజ్ ఫ్రీడమ్, ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, ఐడెంటిటీ అండ్ వయొలెన్‌‌స: ద ఇల్యూజన్ ఆఫ్ డెస్టినీ, ద ఐడియా ఆఫ్ జస్టిస్ వంటివి ప్రముఖ రచనలు.

కైలాష్ సత్యార్థి: 2014 నోబెల్ శాంతి బహుమతిని మలాలా యూసఫ్ జాయ్‌తో కలిసి గెలుచుకున్నారు. 1954, జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని విదిషలో జన్మించారు. బాలల హక్కులపై పోరాడుతున్నారు. 1980లో ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ సంస్థను స్థాపించి బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 144 దేశాల్లో 83,000 మంది బాలబాలికల హక్కు లను పరిరక్షించారు.

విదేశీ పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన నోబెల్ గ్రహీతలు

హర్‌గోబింద్ ఖొరానా: భారతీయ అమెరికన్ బయోకెమిస్ట్ అయిన హర్‌గోబింద్ ఖొరానాకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఆయన 1922, జనవరి 9న పంజాబ్‌లో జన్మించారు. 1966లో అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు. 2011 నవంబర్ 9న యునెటైడ్ స్టేట్స్‌లోని మసాచుసెట్స్‌లో మరణించారు.

సుబ్రమణ్యన్ చంద్రశేఖర్: 1983లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి లభించింది. 1910, అక్టోబర్ 19న బ్రిటిష్ ఇండియాలోని లాహోర్‌లో జన్మించారు. 1953లో యునెటైడ్ స్టేట్స్ పౌరస త్వాన్ని స్వీకరించారు. భారత ప్రభుత్వం 1968లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1995, ఆగస్టు 21న అమెరికాలోని చికాగో నగరంలో మరణించారు.

వెంకట్రామన్ రామకృష్ణన్: 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. 1952లో తమిళనాడులోని చిదంబరంలో జన్మించిన వెంకట్రామన్ రామకృష్ణన్‌కు అమెరికా, బ్రిటిష్ పౌరసత్వాలున్నాయి. రైబోజోమ్‌లపై పరిశోధనకుగాను నోబెల్ లభించింది. 2010లో పద్మవిభూషణ్‌ను ప్రదానం చేశారు.

భారతీయ మూలాలు కలిగిన విదేశీ నోబెల్ గ్రహీతలు

రొనాల్డ్ రాస్: 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. ఈయన భారతదేశంలో జన్మించిన బ్రిటిష్ పౌరుడు. 1857లో ఉత్తరాఖండ్‌లోని అల్మొరాలో జన్మించారు. మలేరియాపై పరిశోధనకు గాను నోబెల్ బహుమతి లభించింది.

రుడ్యార్డ్ కిప్లింగ్: 1907లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందారు. 1865లో అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బొంబాయిలో జన్మించారు. భారత్‌లో జన్మించినప్పటికీ ఈయన బ్రిటన్ పౌరుడు. ఇంగ్లీష్ భాషా సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి కిప్లింగ్.
�వ�� � � � �L �pn �‌ను ప్రదానం చేశారు.

భారతీయ మూలాలు కలిగిన విదేశీ నోబెల్ గ్రహీతలు
  • రొనాల్డ్ రాస్: 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు.
  •  ఈయన భారతదేశంలో జన్మించిన బ్రిటిష్ పౌరుడు. 1857లో 
  • ఉత్తరాఖండ్‌లోని అల్మొరాలో జన్మించారు. మలేరియాపై పరిశోధనకు 
  • గాను నోబెల్ బహుమతి లభించింది.
  • రుడ్యార్డ్ కిప్లింగ్: 1907లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందారు
  • . 1865లో అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బొంబాయిలో జన్మించారు. 
  • భారత్‌లో జన్మించినప్పటికీ ఈయన బ్రిటన్ పౌరుడు. ఇంగ్లీష్ భాషా                 సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి కిప్లింగ్.

  • -----------------------------------------------------------------

    2013 విజేతలు

    ఫిజిక్స్:బ్రిటన్‌కు చెందిన పీటర్ హిగ్‌‌స, బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్‌‌టలకు దైవకణంపై పరిశోధనకుగాను లభించింది.

    కెమిస్ట్రీ: అమెరికాకు చెందిన మార్టిన్ కార్‌ప్లస్, మైకెల్ లెవిట్, ఏరియా వార్షెల్‌లకు దక్కింది.

    వైద్యశాస్త్రం: అమెరికాకు చెందిన జేమ్స్ రాథ్‌మన్, రాండీషెక్‌మన్, జర్మన్- అమెరికన్ థామస్ సుధోఫ్‌లు పొందారు.

    లిటరేచర్: ప్రఖ్యాత కెనడా రచయిత్రి అలైస్ మన్రో సాహిత్య బహుమతిని గెలుచుకున్నారు. ఆమె 2009లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌ను కూడా సాధించారు. డ్యాన్‌‌స ఆఫ్ ది హ్యాపీ షేడ్‌‌స ఆమె ప్రముఖ రచన.

    ఎకనామిక్స్: అమెరికాకు చెందిన యుజీన్ ఫామా, లార్‌‌స పీటర్ హోన్‌సెన్, రాబర్‌‌ట షిల్లర్ అనే ముగ్గురు ఆర్థికవేత్తలకు సంయుక్తంగా లభించింది.

    పీస్: 2013 నోబెల్ శాంతి బహుమతిని ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్‌‌స (ఓపీసీడబ్ల్యూ) అనే సంస్థకు రసాయన ఆయుధాలను నిర్మూలించడంలో కృషి చేసినం దుకు ప్రదానం చేశారు. ఈ సంస్థ 1997, ఏప్రిల్ 29న నెదర్లాండ్‌‌సలోని ద హేగ్ నగరంలో ఏర్పడింది. టర్కీకి చెందిన అహ్మత్ ఉజుమ్‌చు ఓపీసీడబ్ల్యూ ప్రస్తుత డైరక్టర్ జనరల్.


    ------------------------------------------------------------

    అతి చిన్నవయసులో గ్రహీతలు
    వయసుపేరువిభాగంసంవత్సరం
    17మలాలా యూసఫ్ జాయ్శాంతి2014
    25లారెన్‌‌స బ్రాగ్భౌతికశాస్త్రం1915
    32ఫ్రెడరిక్ బ్యాంటింగ్వైద్యశాస్త్రం1923
    35ఫ్రెడరిక్ జోలియట్రసాయన శాస్త్రం1935
    42రుడ్‌యార్‌‌డ కిప్లింగ్సాహిత్యం1907
    51కెన్నత్ యారోఆర్థికశాస్త్రం1972

    అతి పెద్ద వయసులో గ్రహీతలు
    విభాగంపేరుసంవత్సరంవయసు
    ఫిజిక్స్రేమండ్ డేవిస్ జూనియర్200288
    కెమిస్ట్రీజాన్ ఫెన్200285
    మెడిసిన్పేటన్ రోస్196687
    లిటరేచర్డోరిస్ లెస్సింగ్200788
    శాంతిజోసెఫ్ రాట్ బ్లాట్199587
    ఎకనామిక్స్లియోనిడ్ హర్‌విచ్200790

    ----------------------------------------------------------------

    తొలి గ్రహీతలు (1901)

    ఫిజిక్స్ - విలియం రాంట్‌జెన్ (జర్మనీ)

    కెమిస్ట్రీ - జాకోబ్ వాంట్ హాఫ్ (నెదర్లాండ్‌‌స)

    మెడిసిన్ - ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ (జర్మనీ)

    లిటరేచర్ - సలీ ప్రధోమ్ (ఫ్రాన్‌‌స)

    శాంతి - హెన్రీ డ్యునాంట్ (స్విట్జర్లాండ్), ఫ్రెడరిక్ పాసీ(ఫ్రాన్‌‌స)

    1969లో ఎకనామిక్స్‌లో తొలి నోబెల్‌ను రాగ్నర్ ఫ్రిష్ (నార్వే), జాన్ టింబర్ జాన్ (నెదర్లాండ్‌‌స)లకు ప్రదానం చేశారు.

    1901 నుంచి 2014 వరకు నోబెల్ బహు మతులను 889 మంది వ్యక్తులు, సంస్థలు దక్కించుకున్నారు. ఇందులో భౌతికశాస్త్రంలో 199, రసాయన శాస్త్రంలో 169, వైద్యశాస్త్రంలో 207, సాహిత్యంలో 111, ఆర్థికశాస్త్రంలో 75 మంది గ్రహీతలున్నారు. శాంతి బహుమతిని 103 మంది వ్యక్తులు, 25 సంస్థలకు ప్రదానం చేశారు.

    ---------------------------------------------------------------

    మహిళా విజేతలు:

    ఇప్పటివరకు 46 మంది మహిళలకు నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి పొందిన మొదటి మహిళ మేరీ క్యూరీ (1903). మదర్ థెరిసా (1979), ఆంగ్‌సాన్ సూకీ (1991), షిరీన్ ఎబాదీ (2003), వంగరి మతాయ్ (2004), ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ (2011) వంటి వారు నోబెల్ బహుమతిని పొందారు.

    ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నవారు

    ద ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్‌క్రాస్ .. నోబెల్ శాంతి బహుమతిని మూడుసార్లు (1917, 1944,1963) గెలుచుకుంది.

    జె. బార్టీన్ ఫిజిక్స్‌లో రెండుసార్లు (1956, 1972) విజేతగా నిలిచారు. మేరీ క్యూరీ రెండు సార్లు (1903- ఫిజిక్స్, 1911- కెమిస్ట్రీ) నోబెల్ బహుమతులు సాధించారు. ఫ్రెడరిక్ సాంగర్ కెమిస్ట్రీలో రెండు సార్లు (1958, 1980)లో గెలుచుకోగా, యునెటైడ్ నేషన్‌‌స హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ సంస్థ (యుఎన్ హెచ్‌సీఆర్) నోబెల్ శాంతిని రెండుసార్లు (1954,1981) దక్కించుకుంది. లైనస్ పౌలింగ్ 1954లో కెమిస్ట్రీలో, 1962లో శాంతి బహుమతిని గెలుచు కున్నారు. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు వ్యక్తులు లేదా సంస్థలు ఒకటి కంటే ఎక్కువ సార్లు నోబెల్ బహుమతులు పొందారు.

    మరణానంతరం గ్రహీతలు:
    నోబెల్ బహు మతులను మరణానంతరం ఇవ్వరాదని 1974 లో నిర్ణయించారు. అంతకుముందు ఎరిక్ ఎక్సెల్ కార్‌‌ల ఫెల్డ్‌కు 1931లో సాహిత్యంలో, డాగ్ హామర్‌‌స జోల్డ్‌కు 1961లో శాంతి బహుమతి మరణానంతరం లభించాయి.

    0 comments:

    Post a Comment

     10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

    No    SUBJECT                                  Download

     

    1     SOCIAL STUDIES                         CLICK HERE

    2     TELUGU                                               CLICK HERE

    3     HINDI                                                   Click here

    4     ENGLISH                                            Click here

    5     MATHEMATICS                              Click here

    6     PHYSICAL SCIENCES                Click here

    7     BIOLOGICAL SCIENCES          Click here

    8     URDU                                                     Click here

    Heartly Welcome

    Heartly Welcome

    DA / HRA CALCULATOR

    DA / HRA Calculator
    Basic Pay:
    DA / HRA %:

    AP STATE UPDATES

    CTR BADI UPDATES

     

    Find Your Employee Id

    Employee Name (Without Initials):
         Date Of Birth(dd-mm-yyyy):     

                                                                 

    PRAN CARD STATUS

    Aadhaar Centers

    Sucessful Isro

    Thank You Visit Again

    Thank You Visit Again