పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 16, 2014

జన్మరాశులు - వాటి లక్షణాలు

మేష రాశి

Picture

రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి.  ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్త్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి. తి చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందున పురుషాహంకారంతో శక్తిమంతుడుగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. దీనివల్ల మొండితనం అబ్బుతుంది. మాట నెగ్గించుకోవడంకోసం క్రూరత్వం వహించే అవకాశం ఉంది.

మేష రాశిలో అశ్వని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక మొదటి పాదం ఉంటాయి.  

వృషభ రాశి

Picture

వృషభ రాశి స్థిరరాశి అయినందున స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఆలోచనలు, నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు. అనుకొన్న దానిగురించే ఎక్కువ ఆలోచన చేసే లక్షణం కలిగి ఉంటారు. ఈ రాశికి శుక్రుడు అధిపతి.

ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర నక్షత్రంలో తొలి రెండు పాదాలు ఉంటాయి. 


మిథున రాశి

Picture

మిధున రాశి స్వభావరీత్యా స్వభావరాశి. చరరాశిలా వేగంగా గమిస్తూనే, స్థిర రాశి మాదిరి స్థిరత్వంవైపు మొగ్గుచుండును. ఈ రాశివారు చురుకుదనానికి పెట్టింది పేరు అనవచ్చు. దుష్ట గ్రహ దోషం ఉంటే తప్ప, వీరి చురుకుదనం, లౌక్యాన్ని ఆపలేం. సమాకార రూపంతో అన్ని స్థితులయందు సమభావం చూపుతారు. ప్రకృతి రాశి అగుటయే కాక వాయుతత్వాన్ని సూచించును. దీనివల్ల ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి. చురుకుదనంతో కొత్త ఆలోచనల వైపు ఉరకలు వేయుట కద్దు. పంతాలకు తావివ్వకుండా సర్దుకొనే స్వభావం కలవారై ఉంటారు. అవకాశాలను సద్వినియోగపరచుకుంటూ ముందుకు సాగడానికి ఇష్టపడతారు.

మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. 

కర్కాటక రాశి

Picture

ర్ణాటక రాశి - రాశి చక్రంలో నాలుగవది. లక్షణ రీత్యా ఇది చర రాశి. ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి. నిర్ణయాలుకూడా చకచకా మార్పు సంతరించుకొంటాయి. ఆందోళనలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సమస్య ఎదురైనప్పుడు విభిన్న రకాల విశ్లేషణలు ముందుకు వస్తాయి. వాటిద్వారా కొన్ని సార్లు సమస్యలు జటిలం కావచ్చును. సమస్య పెద్దదైనప్పుడు ముడుచుకుపోయే లక్షణం ఉంటుంది. ఆలోచనలకు, కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు. ఈ రాశికి చంద్రుడు అధిపతి కావున మానసిక సంఘర్షణలు, మానసిక వేదన ఉంటుంది. తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది.

కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. 


సింహ రాశి -  సహజ నాయకత్వ లక్షణం

Picture

స్వభావ రీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది. జంతు సామ్రాజ్యానికి రాజు అయిన సింహం దీనికి సూచిక. అందుకే ఈ రాశిలో జన్మించినవారిలో సహజసిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది. కొత్త, పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు. ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. అభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు. స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు ఆశిస్తారు. ఏ వృత్తిలో ఉన్నా చాకచక్యం, సామర్థ్యం మేళవించి ముందుకు వెళ్లగలుగుతారు. లౌక్యాన్ని సైతం అలవరచుకొంటే అద్భుతాలు సాధించగలుగుతారు. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ముందుచూపుతోపాటు వెనుకచూపుకూడా అవసరం అని గుర్తుంచుకోవాలి. పొగడ్తలంటే ఇష్టపడతారు. ఇది బలం మాత్రమేకాదు, బలహీనత అనికూడా అనుకోవచ్చు.
లక్షణరీత్యా ఇది స్థిరరాశి. తీసుకొన్న నిర్ణయాన్ని స్థిరంగా అమలు పరచాలని కోరుకుంటారు. నాయకుడిగా తన స్థానాన్ని పదిలపరచుకోవాలంటే ఇది అవసరం అని భావిస్తారు. నిర్ణయాలకు ఆమోదం లభించాలని ఉవ్విళ్లూరుతుంటారు. దీనికోసం కొన్నిసార్లు మొండిపట్టు పడతారు. ఈ లక్షణం కొన్ని సమయాల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. లోపాన్ని గుర్తించినప్పుడు బయటపడాల్సి వస్తుంది.దీనిన్న జాగ్రత్తగా పరికించుకోవాలి. పురుష స్వభావం ఉన్న రాశి కావటంతో ఏ విషయం అయినా ముఖతః ఉండాలనుకొంటారు. జీవితంలో వెలుగు ఆశించే తత్వం. నాయకత్వంకోసం కష్టపడటానికి అయినా సిద్ధంగా ఉంటారు. శ్రమకు ఓరుస్తారు. సర్దుబాటు తత్వం కాస్త తక్కువ అనుకోవచ్చు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే మాత్రం అది నెరవేర్చుకొనేందుకు ప్రాధాన్యం ఇస్తారు. దీర్ఘకాలికంగా పనిచేయడానికి సైతం ఇష్టపడతారు. కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ గుర్తింపుకు పెద్ద పీట వేస్తారు. నలుగురు తన గురించి ఏమనుకొంటారో అన్న అంశాన్ని బాగా దృష్టిలో పెట్టుకుంటారు. చైతన్యవంతమైన రాశి కావటంతో ఉత్సాహంగా ఉంటారు. దూసుకెళ్లే సమయంలో చిన్న విమర్శ ఎదురైనా మనసులో పెట్టుకుంటారు.

సింహ రాశిలో మఖ నక్షత్రం నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు,   ఉత్తర మొదటి పాదం ఇందులో ఉంటాయి. 


కన్య రాశి -  లోగుట్టు, అతి జాగ్రత్త

Picture

 న్యా రాశి స్వభావరీత్యా 'ద్వి స్వభావ రాశి'.  అందుచేత రెండువైపులా ఆలోచిస్తుంటారు. ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలిస్తుంటారు. అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాల్ని పరికిస్తూ ఉంటారు. ఆలోచనకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంత తేలిగ్గా దేనినీ వదలరు. ప్రతిదాన్నీ ఒకటికి రెండుసార్లు తర్కిస్తారు.  అనుమానించడంకూడా కన్యారాశివారికి సహజ సిద్ధమైన లక్షణం. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ ఆలోచనలు అనుమానాల్ని మాత్రం పైకి రానీయరు. చాలావరకు మనసులోనే గణించుకుంటూ ఉంటారు.

స్త్రీలయితే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశివారికి ధైర్యం పాలు కాస్త తక్కువ. ఆహారం మీద ఆసక్తి ఉంటుంది. ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. శారీరక అవసరాలు, కుటుంబ ప్రాధాన్యతలకు పెద్దపీట వేస్తారు. భౌతిక విషయాలమీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు పదే పదే ఆలోచిస్తారు. పని మొదలెట్టాక మాత్రం పట్టువిడువకుండా పూర్తి చేస్తారు. సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ముందు జాగ్రత్త ఉంటుంది. కొన్ని సార్లు అతి జాగ్రత్త కూడా ఉంటుంది.

స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. దూకుడు తక్కువగా ఉన్ననూ, ఫలితం ప్రాధానంగా ఉంటుంది. లక్ష్యం మీద ఏకాగ్రచిత్తం నిలుపుతారు. దృష్టిని మరల్చకుండా కార్యసాధనకు ప్రాధాన్యమిస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి.

కన్యారాశిలో ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు మొత్తం నాలుగుపాదాలు, చిత్త నక్షత్రపు 1, 2 పాదాలు చేరి ఉన్నవి. 


తుల రాశి  -   'తుల'నాత్మక నిర్ణయాలు

Picture


తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితములో ప్రారంభములో ఎదురైన అపజయాలకు క్రుంగి పోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడములో నేర్పు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యొగ, వ్యాపార, వ్యాపకాలలొ రాణిస్తారు. ఆర్ధిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్థులని అభివృద్ధి చెస్తారు. అనువంశికముగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు. కళా, సాహిత్య, రాజకీయ రంగాలలో రాణిస్తారు. యవ్వన ప్రాయములో అదృష్టము కలసి వస్తుంది. జీవితములొ అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంముగా నిలుస్తారు. బంధు వర్గముతొ విబేధాలు దీర్గ కాలము కొనసాగుతాయి. ఏ విషయములో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురుకి మాత్రము అన్ని విషయాలలొ మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా పాత పద్దతులు పొవు. అత్మీయులతో విబెధాలు వస్తాయి. గతము మరిచారన్న విమర్శను ఎదుర్కొంటారు. విదేశీయానము లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది
తుల రాశిలో చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు ఉంటాయి. 


వృశ్చిక రాశి

Picture

లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది. ఆలోచనలు, అంచనాలు, నిర్ణయాలు కచ్చితంగా ఉంటాయి. ఊగిసలాట ధోరణి పెద్దగా కన్పించదు. దీర్ఘకాలిక అంచనాలు, దూరం ఆలోచించే తత్వం ఉంటాయి. ఆ సమయానికి ఏది అవసరం అనే దానిపై నిర్ణయాలు జరిగిపోతాయి. తత్వం రీత్యా జల స్వభావం అయినందున బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు. గుంభనంగా వ్యవహారాలు చక్కబెడతారు. జరిగిపోయినవి, జరగాల్సినవి అన్న స్పష్టత ఉంటుంది. ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నదీ మాత్రం బయటపెట్టబోరు.

వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ట 4 పాదాల్లో జన్మించిన జాతకులు ఉంటారు.


ధను రాశి

Picture

రాశి చక్రంలో తొమ్మిదో రాశి ధనురాశి. స్వభావరీత్యా ఇది ద్వి స్వభావ రాశి. కొన్నిసార్లు వేగంగానూ, మరికొన్నిసార్లు నిదానంగానూ స్పందించే లక్షణం ఉంటుంది. నిర్ణయాల విషయంలోకూడా ఇదే వైఖరి కనిపిస్తుంది. స్థిమితమైన ధోరణి తక్కువగా ఉంటుంది.

ధనూ రాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4  పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం ఉంటాయి.


మకరరాశి



మకరరాశి కాలపురుషుని కర్మ స్థానము. సూర్యుడు ఈ రాశి
లో ప్రవేశించినప్పుటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమౌతుంది. వెంఖటేస్వరస్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితములో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతము చేసుకుంటారు. ఇతరులు మొసము చెయ్యనంత వరకు ఇతరులను మోసము చెయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము బలహీనత కూడా. పక్కవాళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారి తీస్తుంది. తన లొపము తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. సాత్విక స్వభావము మాత మిద నిలబడే తత్వము ఉంటాయి. స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికముగా ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా స్రమిస్తారు. చిన్నతనము నుండి అధికముగా శ్రమపది చిన్నతనములోనే అధికముగా శ్రమించి అవి సాధించడానికి కృషిచేస్తారు. అనుకున్న దానిని ఎదొ ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక సక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచనా వ్యాసమ్గము, పరిశోధనా, నతన, కళాఅ సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది. వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు అనుసరించ లేరు. విరి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. విరి ప్రతిభ వెలుగులోకి రావడము కష్టము. ధన సంపాదనే ధ్యేయముగా జీవించరు. ఎదో విధముగా ధనము సర్ధుబాటు అయి అవసరాలు గడిచి పొతాయి. అభిమానించే నమ్మిన అనుచర వర్గము వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. స్త్రీల వలన అదృష్టము కలసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానముతో ఊన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటి వారి సహాయము అధికముగా అందుతుంది. అంచనాలు చక్కగా పొరబాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజము ఔతాయి.శని, శుక్ర, బుధదశలు యొగిస్తాయి. ఆధ్యతమక విషయాలలో అమ్కితభావముతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు. జివిత మధ్యకాలములో మోకాల్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి వస్తాయి.


కుంభరాశి


Picture

కుంభరాశి వారి గుణగణాలు

కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుభంధాలు ఎక్కువ. మేలు చెసిన వ్యక్తులను గుర్తుంచుకుంటాఆరు. కొత్త వారు ఎందరు పరిచయము అయినా పాత స్నెహాలను, బంధుత్వాలను మరువరు. ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నుతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కాని ఎక్కువ కాలము క్రమశిక్షన నిలవని పరిస్థితులు ఎదురౌతాయి. అవేశము, ఇతరులు రెచ్చగొదితే రెచ్చి పోయె స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు. బధను అధికముగా మనసులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మొహమాతముగా చెప్పడము వలన విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడనికి ప్రయత్నించి విఫలము ఔతారు. మధ్యవర్తిత్వానికి ముమ్దు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. సాంకెతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్రవిచిత్ర వ్యాపారాలు అనుభవము నెర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాలలో ధనము లభించక పొయినా అవసరము లెనప్పుదు ధనము అధికముగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనము సర్ధుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజములో ఉన్నత స్థానాలలో , గౌరవ స్థానాలలో ఉన్న వారి వలన అన్యాయానికి గురి ఔతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపొతారు. అకస్మాత్తుగా రాజకీయాధికారము చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. ఏకపక్షముగా పొరబాటుగా తిసుకున్న నిర్నయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చెస్తాయి. సమాజములో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి ఔతారు. తన సంతానము, ఆత్మీయులు, స్వంత వారు చెసే తప్పులు తప్పులుగా కనిపించవు. వారిని సమర్ధించడానికి రక్షించడానికి అధికముగా ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు. వ్యాపారములో అంచనాలు నిజమై లాభము పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి ఔతారు. భుములు విలువ పెరగడము వలన ధనవంతులు ఔతారు. వ్యాపారకూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానము అదృష్టము వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికము. జీవిత ప్రారమ్భములో తెలిసి తెలియక చెసిన నిర్ణయాలు మంచికి దారి తిస్తాయి. వీరు అందలము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్ధులైన చిన్నపాటి వ్యక్తులే విరికి ప్రత్యర్ధులు ఔతారు. పోటీ లేని చోట్ల కూడా వీరి మమ్చితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. అయినా స్వయంకృతాపరాధాన్ని సరి దిద్దుకోలేరు. మీరు కొల్పోయిన ధనము, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారని పేరు వస్తుంది. భాగస్వామ్యము కొంత కాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది.సొదర సోదరీ వర్గానికి సహాయము చేయడము వలన మరో వర్గము దూరము ఔతారు. పైస్థాయి మరియు కిమ్దస్థాయి వారి వలన ఏకకాలములో ఇబ్బందులు ఎదురౌతాయి. ఋణల విషయములో అసత్య ప్రచారాలు ఎదురౌతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయము ఎదురౌతుంది. ఆత్మీయ వర్గము ద్రోహము చెస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు.ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవము గడిస్తారు. ఎదుటి వారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. విరి కంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్గకాలములో వారిని వీరు అధిగమించగలరు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్థులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రు వర్గము మీద విజయము సాధిస్తారు వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులురాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికి ఏదిక్కూ దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్త్రోత్ర పారాయణము మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది.

మీనరాశి


Picture
మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపము త్వరగా రాదు.లా కొపము వాచ్చినప్పుడు అది విపరీతముగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్ధ్యము ఉంటుంది. స్థిరత్వము కొరకు కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా వస్తూంటాయి. ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు.ఎక్కువగా నీళ్ళు తాగుతుంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలలో బంధువులు కలిగి ఉంటారు. వారి సహాయసహకఅరాలు నామ మాత్రముగా ఉన్నా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగలో సాధన ఆరోగ్యము మీద ఆధార పడి ఉంటుంది. కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది. వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్ధ్యంగా వృద్ధి చేస్తారు. కాని ఆస్తులు దక్కడం అనుమానాస్పదం. బంధువర్గమ్ తండ్రిని మోసగించి నష్టపరుస్తారు. వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయము కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయములో విబేధాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది. ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికిగల సంగీతాభిమాం, క్రీడాభిమానం జీవితములో మంచి మలుపుకు దారి తీఇస్తాయి. ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలం విశ్వసిస్తారు. అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు. సామర్ధ్యం లేని మనుష్యులను ప్రోత్సహించడం ద్వారా సమయము శ్రమ వృధా ఔతాయి. అన్యభాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలసి వస్తాయి. ఎవరిని ఏపనికి నియమించాలో బేరీజు వేయడములో చాలా వరకు పొరబాటు పడతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకూంటారు. సభానిర్వహణ, సాంస్కృతిక కార్య నిర్వహణలో సామర్ధ్యము కలిగి ఉంటారు. సహజత్వానికి దగ్గరగా గదపాలన్న మీ ఆశయము నెరవేరుతుంది. ప్రచారసాధనఅలు, మీడియతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. స్వంతవారు, బంధువర్గం లెక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మనుష్యుల మనోభావాలను చదువగలరు. సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. గురు, శుక్ర, సని దశలు బాగా యోగిస్తాయి. ప్రకృతికి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న మీ ఆశ నెరవేరుతుంది. ధనం లేక పోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు,స్నేహితులు దగ్గరైనా అవసరాలు తీరిన తరువాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. ఆర్ధిక ప్రయోజనాలు, ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచి పోతాయి. అర్ధిక స్థిరత్వం పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించు కూంటారు. ముఖ్యవిషయాల మీద దృష్తి సారించడం అధికమైన ఆస లెక పొవడం వలన మానసిక ప్రశాంతత విజయము లభిస్తుంది. వివాద రహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కాని స్వంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయన మెలు చేస్తుంది. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్ధమౌతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యముగా అయినా అదృష్టం వరిస్తుంది.


తార నామందినాధిపతిఫలితం
జన్మ తారశనిశరీర శ్రమ
సంపత్తారగురువుధనలాభం
విపత్తారకుజుడుకార్యహాని
క్షేమ తారసూర్యుడుక్షేమం
ప్రత్యక్ తారరాహువుప్రయత్న భంగం
సాధన తారశుక్రుడుకార్యసిద్ధి, శుభం
నైత్య తారకేతువుబంధనం
మిత్ర తారచంద్రుడుసుఖం
అతి మిత్ర తారబుధుడుసుఖం, లాభం

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again