పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 08, 2014

సైన్స్ సమాహారం


చికెన్‌, చేపలు తింటే కాలేయ క్యాన్సర్‌ దూరం
వాషింగ్టన్‌: కోడిమాంసం వంటి వైట్‌ మీట్‌, చేపలు తినడం వల్ల కాలేయ క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వైట్‌ మీట్‌ తినడానికి హెపటోసెల్యులార్‌ కార్సినోమా (హెచ్‌సీసీ) ముప్పు తగ్గడానికి మధ్య సంబంధాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఇందుకోసం వారు 1956 నుంచి 2013 మధ్య ప్రచురితమైన అధ్యయనాలను విశ్లేషించారు. కోడి మాంసం తినడం వల్ల 31%, చేపలు తినడంవల్ల 22% మేర కాలేయ క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని తేల్చారు.
రాత్రివేళల్లోనే క్యాన్సర్‌ వ్యాప్తి అధికం!
* తాజా పరిశోధనల్లో వెల్లడి
జెరూసలెం: రాత్రి వేళల్లోనే క్యాన్సర్‌ వ్యాధి చురుగ్గా పెరిగి... సత్వరం వ్యాప్తి చెందుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఇజ్రాయెల్‌లోని 'వీజ్‌మన్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌'కు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ఈ విషయం గుర్తించారు. కణాల్లోని గ్రాహకాల స్పందనలను కూలంకషంగా పరిశీలించారు. కణాల ఉపరితలంపైన...లేదా లోపల ఉండే ప్రోటీన్‌ అణువులు చురుగ్గా ఇతర కణాలు స్రవించే జీవరసాయన సందేశాలను స్వీకరిస్తాయి. వాటిని లోలోపలి కణజాలానికి చేరవేస్తాయని వీరి పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే, తదనుగుణంగా వైద్య చికిత్సలు చేపడితే ఫలితం ఉండవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఇందులో కేవలం రెండు ప్రత్యేకమైన గ్రాహకాలపై మాత్రమే పరిశోధకుల బృందం ప్రధానంగా దృష్టి సారించింది. కణపై పొరపై సంభవించే పెరుగుదలను స్వీకరించే గ్రాహకాలు ప్రత్యేకంగా...క్యాన్సర్‌తో సహా అన్నిరకాల కణాల వృద్ధి, వలస ప్రక్రియను శీఘ్రతరం చేస్తాయి. ఇక, రెండోరకం గ్రాహకాలు.. గ్లూకో కార్టికాయిడ్‌ అనే స్టెరాయిడ్‌ హార్మోనుకు జతకూడి ఉంటాయి. పగటివేళల్లో గ్లూకో కార్టికాయిడ్‌లు శరీరశక్తి స్థాయులను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటి స్థాయులు మేలుకుని ఉన్నప్పుడు ఒకరకంగా.. నిద్రావస్థలోఉన్నప్పుడు మరోరకంగా ఉంటాయి.
గుండె వైఫల్యాన్ని తగ్గించే పరికరం
వాషింగ్టన్‌: గుండె వైఫల్యాన్ని నియంత్రించే ఇంప్లాంట్‌ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని సామర్థ్యాన్ని నిర్ధరించేందుకు కొందరు రోగులకు అమర్చగా.. ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. గుండె జబ్బుల్లో వేగంగా పెరుగుతున్న సమస్య.. గుండె వైఫల్యం. ప్రజలు ఆసుపత్రిపాలు కావడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటని వెక్స్‌నర్‌ మెడికల్‌ సెంటర్‌లోని హృద్రోగ విభాగం డైరెక్టర్‌ విలియం అబ్రహం తెలిపారు. ''దీనికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధ చికిత్స విధానాలు కొందరు రోగులకు సరిపోవడం లేదు. అందువల్ల కొత్త విధానాల కోసం అన్వేషిస్తున్నాం'' అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అబ్రహం.. అమెరికాలోని ఏడు వైద్య కేంద్రాలతో కలసి ఎక్స్‌ట్రా-అయోర్టిక్‌ కౌంటర్‌పల్సేషన్‌ సిస్టం (సి-పల్స్‌) అనే విధానాన్ని పరిశీలించారు. ఇది.. బృహద్దమని చుట్టేసి, రోగి గుండె స్పందనకు అనుగుణంగా పనిచేస్తుంది. చిన్నపాటి బెలూన్‌ను ఉబ్బెత్తుగా చేయడం, మళ్లీ మాములుగా చేయడం ద్వారా బృహద్దమని నుంచి రక్తాన్ని లాగేసి, శరీరమంతా ప్రవహించేలా చేస్తుంది. దీనికి శక్తిని అందించే బ్యాటరీ.. శరీరం వెలుపలే ఉంటుంది. ఇందుకోసం పొట్ట నుంచి వైరును బయటకు లాగుతారు. ఈ ఇంప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా కొందరు రోగులకు అమర్చినప్పుడు ఫలితాలు చాలా ఆశాజనకంగా వచ్చాయని అబ్రహం చెప్పారు. వారి జీవన నాణ్యత పెరిగిందని వివరించారు. ఏడాది కాలంలో కొందరు రోగులకు గుండె వైఫల్య సమస్య నయమైందని తెలిపారు.
చర్మ క్యాన్సర్‌ను పసిగట్టే కెమెరా
మనిషిని మొత్తం అత్యంత స్పష్టతతో చిత్రీకరించే హై రిజల్యూషన్‌ గిగాపిక్సెల్‌ కెమెరా ద్వారా చర్మ క్యాన్సర్‌ను ముందే పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉత్తర కరోలైనాలోని డ్యూక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. ఇది మూడు డజన్ల కెమెరాలతో సమానం. ప్రస్తుతమున్న చర్మ పరిశీలన విధానాలతో పోలిస్తే.. ఈ కెమెరా సాయంతో చర్మ క్యాన్సర్‌ను సూచించే గాయాన్ని చాలా ముందుగానే పసిగట్టవచ్చని పరిశోధనలో పాలుపంచుకున్న డేనియల్‌ మార్క్స్‌ తెలిపారు. ''సాధారణంగా చర్మ వ్యాధుల నిపుణులు.. చర్మంలోని చిన్న ప్రాంతాన్ని అధిక రిజల్యూషన్‌తో కాని పెద్ద ప్రాంతాన్ని తక్కువ రిజల్యూషన్‌తో కాని పరిశీలిస్తుంటారు. అయితే గిగాపిక్సెల్‌ చిత్రం మాత్రం రెండు అంశాల్లో రాజీపడే అవసరం లేకుండానే చర్మ క్యాన్సర్‌ను గుర్తిస్తుంది'' అని వివరించారు.
 సబ్బులు, షాంపూలతో పర్యావరణానికి హాని తక్కువే
లండన్‌: సబ్బులు, షాంపూలు, డిటర్జంట్లు వంటి సర్ఫాక్టెంట్లు మనజీవితంలో బాగా పెనవేసుకుపోయాయి. వీటివినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది.అయినావీటివల్లపర్యావరణానికి కలిగే ముప్పు చాలానామమాత్రమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మానవులు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల టన్నుల సర్ఫాక్టెంట్లను ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో వీటివల్ల పర్యావరణంపై పడే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడానికి ఆర్హస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. సర్ఫాక్టెంట్ల వినియోగం, పారవేయడం, శుద్ధి, జల వాతావరణానికి వాటి వల్ల కలిగే ముప్పు వంటి అంశాలపై ఇందులో దృష్టిసారించారు. గత 40-50 ఏళ్లలో 250 శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించారు. వీటిని ఉత్తర అమెరికాలో సాగించినా.. వాటి ఫలితాలు ప్రపంచమంతటికీ వర్తిస్తాయని పరిశోధనలో పాలుపంచుకున్న హాన్స్‌ శాండర్సన్‌ తెలిపారు. ఎందుకంటే సర్ఫాక్టెంట్లలోని మూలకాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయని వివరించారు. ఈ పదార్థాలను సరిగా, బాధ్యతాయుతంగా ఉపయోగించడం, వాడకం తర్వాత అవి కలసిన నీటిని సరిగా శుద్ధి చేస్తే పరిసరాలకు చాలా వరకూ ముప్పు తగ్గుతుందని తేలింది. ''ఈ పదార్థాలను చాలా వేగంగా క్షీణించేలా తయారుచేస్తున్నారు. ఫలితంగా అవి పర్యావరణానికి హాని కలిగించవు. మన నిత్య వినియోగం వల్ల వెలువడే మరే ఇతర పదార్థాలకు ఇలాంటి సౌకర్యం ఉందని నేను అనుకోను'' అని శాండర్సన్‌ చెప్పారు.
మధుమేహ మూలాలే లక్ష్యం
* కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
* ఎలుకలపై ప్రయోగాలు సఫలం

వాషింగ్టన్‌: టైప్‌-2 మధుమేహం మూలకారణాన్ని లక్ష్యంగా చేసుకునే ఔషధాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. పేగుల్లోని పరాన్నజీవులను తుదముట్టించడానికి వాడే ఒక మందులో మార్పులు చేసి, దీన్ని తయారుచేశారు. టైప్‌-2 మధుమేహంలో శరీరం.. సరిపడా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడమో లేక ఇన్సులిన్‌ను శరీరం ఉపయోగించుకునే సామర్థ్యం క్షీణించడమో జరుగుతుంది. కాలేయంలోని కణాల్లో, కండరాల కణజాలంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడమే ఇన్సులిన్‌ నిరోధకతకు ప్రధాన కారణమని రట్జర్స్‌ రాబర్ట్‌ వుడ్‌ జాన్సన్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన విక్టర్‌ షెంగ్కాన్‌ జిన్‌ పేర్కొన్నారు. ఈ కొవ్వు.. గ్లూకోజ్‌ (రక్తంలోని చక్కెర)ను శరీర కణాలు సరిగా గ్రహించి, ఇంధనంగా వాడుకునే ప్రక్రియను విచ్ఛిన్నం చేస్తుందని పేర్కొన్నారు. ఈ గ్లూకోజ్‌లో ఎక్కువభాగం రక్తంలోనే ఉండిపోతుంది. దీనిమోతాదు మించడం వల్ల అంధత్వం, మూత్రపిండాలు దెబ్బతినడం, గుండె జబ్బులు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో కాలేయంలో కొవ్వు పరిమాణాన్ని సురక్షితమైన, ఆచరణసాధ్య విధానం ద్వారా తగ్గించడానికి తాము పరిశోధన చేపట్టినట్లు విక్టర్‌ తెలిపారు. ఇందుకోసం ఎలుకలపై ప్రయోగం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ''కొవ్వును తొలగించడంలో మేం విజయం సాధించాం. అది ఇన్సులిన్‌ను వినియోగించే సామర్థ్యాన్ని మెరుగుపరచింది. రక్తంలో చక్కెర శాతం తగ్గింది'' అని వివరించారు. ఇందుకోసం నిక్లోసమైడ్‌ ఇథనోలమైన్‌ లవణం (ఎన్‌ఈఎన్‌) అనే మార్పిడి చేసిన మందును ఉపయోగించారు. ఇది మైటోకాండ్రియల్‌ అన్‌కప్లింగ్‌ అనే విధానం ద్వారా కాలేయంలోని కొవ్వు కణాలను దహింపచేసింది. దీనివల్ల మధుమేహం పూర్తిగా నయం కావడానికి వీలవుతుందని పరిశోధకులు తెలిపారు.
తల్లి ఇన్‌ఫెక్షన్ల దుష్ప్రభావంతో చిన్నారులకు మధుమేహం!
జెరూసలెం: గర్భంతో ఉన్న సమయంలో మహిళలకు వచ్చే ఇన్‌ఫెక్షన్లు మున్ముందు ఆమె బిడ్డకు మధుమేహం రావడానికి కారణమౌతాయి. పిల్లలకు మధుమేహం సమస్యకు అసలు కారణంపై శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో తీవ్రస్థాయిలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు.అయితే, టెల్‌అవీవ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో గర్భిణిగా ఉన్న సమయంలో తల్లికి వచ్చే ఇన్‌ఫెక్షన్లు ప్రసవానంతరం పిల్లల్లో టైప్‌-1 మధుమేహానికి కారణమౌతున్నట్లు స్పష్టమైంది. గర్భిణులకు సంక్రమించే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు గర్భస్థశిశువుపై సులువుగా దుష్ప్రభావాన్ని చూపుతాయి. దీంతో, పుట్టిన తర్వాత లేతవయసులోనే పిల్లలకు టైప్‌-1 మధుమేహం వస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆరోగ్యకరంగా ఉన్న ఎందరో గర్భిణులపై శాస్త్రవేత్తలు ప్రత్యేక వైద్య పరీక్షలను నిర్వహించారు. యాంటీ రోటావైరస్‌, యాటీ కోక్స్‌ బీ3 యాంటీబాడీస్‌ పరీక్షలను సైతం చేశారు. వివిధ రుతువుల్లో వీరిపై నిర్వహించిన పరీక్షల్లో శీతాకాలంలో వచ్చే అంటురోగాల తాలూకు ప్రభావం సుస్పష్టంగా కనిపించింది.
 సూదిమందులా పనిచేసే మాత్ర!
* ఎంఐటీలో సరికొత్త ఆవిష్కరణ
వాషింగ్టన్‌: సూదిమందు మాదిరిగానే పనిచేసే సరికొత్త మాత్ర(క్యాప్స్యూల్‌)ను ఓ శాస్త్రవేత్త తయారుచేశారు. మసాచ్యుసెట్స్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్త రూపొందించిన ఈ మాత్రలకు ఉండే అతి సూక్ష్మమైన సూదుల్లాంటివి ఔషధాన్ని నేరుగా జీర్ణకోశం పై పొరకు అందేలా చూస్తాయి. ఈ సూదుల్లాంటివి జీర్ణకోశానికి ఎలాంటి హానీ కలుగచేయవు. నేరుగా చర్మానికిచ్చే ఇన్సులిన్‌ సూదిమందు కంటే ఇలాంటి మాత్ర ద్వారా ఇవ్వడం వల్ల చక్కటి ఫలితం కనపడింది. అంతేకాదు, ఎక్కడా అత్యంత సునినతమైన కణజాలం దెబ్బతిన లేదు. ఒక్కసారి ఈ మాత్రను వేసుకున్న తర్వాత అది పూర్తిగా జీర్ణకోశాన్ని చుట్టిరావడానికి వారంరోజుల సమయం పట్టింది. ఇందులోని అతి సూక్ష్మమైన సూదులు అత్యంతసమర్ధంగా, సంపూర్ణంగా, సురక్షితంగా మందును అందించగలిగిందని తెలిపారు. పొట్ట, చిన్నపేగులు, పెద్దపేగు, తదితరాలకు ఈ తరహా మాత్ర ద్వారా ఇన్సులిన్‌ ఇస్తే...అది చక్కటి ప్రభావాన్నే చూపిందని వెల్లడించారు.
భూమిపై 11.7 కోట్ల సరస్సులు
న్యూయార్క్‌: భూమిపై ఉన్న సరస్సుల సంఖ్యను శాస్త్రవేత్తల ఎట్టకేలకు నిగ్గుతేల్చారు. ఈ జలాశయాలు 11.7 కోట్లు ఉన్నాయని నిర్ధరించారు. వీటిలో చాలా వరకూ.. మానవులు ఆవాసం ఉండని ప్రదేశాల్లో ఉన్నాయని స్వీడన్‌లోని ఉమియా విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డేవిడ్‌ సీకెల్‌ చెప్పారు. ''ఈ లెక్కింపు చాలాకాలం కిందట జరిగి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఏదైనా పాఠ్యపుస్తకంలో ఈ సంఖ్య ఉండి ఉంటుందని పొరబడుతుంటారు'' అని ఆయన పేర్కొన్నారు. లోగడ సరస్సులను ఒక్కొక్కటిగా లెక్కించడానికి బదులు గణాంకపరమైన అంచనాల ద్వారా వాటి సంఖ్యను పేర్కొనేవారు. 2006లో వేసిన ఇలాంటి అంచనాల ప్రకారం భూమిపై 30.4 కోట్ల సరస్సులు ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు హై రిజల్యూషన్‌ ఉపగ్రహ డేటా, సూపర్‌ కంప్యూటర్లను ఉపయోగించి భూమి మీదున్న సరస్సుల సంఖ్య 11.7 కోట్లని తేల్చారు. అయితే లోగడ వేసిన అంచనాల కన్నా ఈ సరస్సులు భూమిపై మరింత ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయని నిర్ధరించారు. భూ ఉపరితలంలో వీటి వాటా 3.7 శాతమ (50 లక్షల చదరపు కిలోమీటర్ల)ని పేర్కొన్నారు. మునుపటి అంచనాల్లో అనేక భారీ, మధ్య తరహా సరస్సులు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. చాలా సరస్సులు భూమి ఉత్తరార్ధగోళంలో 45 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 75 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నాయని గుర్తించారు.
ఈ దోమలు మంచివట!
ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: బ్రెజిల్‌ మంచి దోమలను తయారు చేసింది.. దోమల్లో కూడా మంచి దోమలు ఉంటాయా .. ఆశ్చర్యంగా ఉంది కదా..! డెంగీ లక్షణాలను తగ్గించే ఉపయోగకరమైన వోల్బాచియా అనే బాక్టీరియాను దోమల్లోకి పంపించి ఆ దోమలను జనాల్లోకి పంపించారట బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు. ఈ బాక్టీరియా ఉన్న దోమలు డెంగీని వ్యాపించకుండా కాపాడతాయట. వీటి వల్ల ప్రజలకు ఎలాంటి హాని కలగదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కేవలం డెంగీ వ్యాపించే లక్షణాలను ఈ బాక్టీరియా అరికడుతుందట. బ్రెజిల్‌లోని రియో డి జనీరియో నగరంలో పదివేల దోమలను విడుదల చేసినట్లు తెలిపారు. ఇవి పిల్లల ఉత్పత్తి చేయడం ద్వారా మంచి దోమలు మరింత పెరుగుతాయని వెల్లడించారు. ప్రపంచలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యేది బ్రెజిల్‌లోనే. 2009-14 మధ్య కాలంలో బ్రెజిల్‌లో 3.2 మిలియన్‌ కేసులు నమోదు కాగా, 800 మంది మరణించారు.
గౌట్‌కు చెర్రీ పండ్ల రసంతో ఉపశమనం
లండన్‌: గౌట్‌ జబ్బు బాధితులకు చెర్రీ పండ్ల రసం ఉపశమనం కలిగిస్తోందని తాజా అధ్యయనం పేర్కొంది. గౌట్‌ బాధితుల్లో కీళ్ల నొప్పికి కారణమయ్యే యూరిక్‌ యాసిడ్‌ జీవక్రియలో మాంట్‌మోరెన్సీ టార్ట్‌ చెర్రీ పండ్ల రసం మార్పులను కలగజేస్తున్నట్టు తొలిసారిగా బయటపడింది. రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయులు ఎక్కువగా ఉండటం గౌట్‌ జబ్బుకు దారితీస్తుంది. దీంతో కీళ్లలో యూరిక్‌ యాసిడ్‌ స్ఫటికాలు ఏర్పడి, వాపు తలెత్తుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని కలగజేస్తుంది. చెర్రీ పండ్ల రసం సారాన్ని నీటితో కలిపి తీసుకున్నవారి రక్తంలో యూరిక్‌ యాసిడ్‌, సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌ స్థాయులు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. మూత్రంలో యూరిక్‌ యాసిడ్‌ మోతాదు పెరిగినట్టు కనుగొన్నారు. యాంతోసియానిన్స్‌ స్థాయులు ఎక్కువగా గల మాంట్‌మోరెన్సీ టార్ట్‌ చెర్రీ పండ్లపై తాము చాలాకాలంగా పరిశోధన చేస్తున్నామని సహ అధ్యయన కర్త హోవాట్సన్‌ తెలిపారు.
ఆక్సీకరణ ఒత్తిడికి సమర్థ చికిత్స!
వాషింగ్టన్‌: క్యాన్సర్‌, అల్జీమర్స్‌, పార్కిన్‌సన్‌ వంటి ప్రమాదకర జబ్బులకు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడి అసమతుల్యతను సమర్థంగా ఎదుర్కోగల అణుసమ్మేళనాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆక్సీకరణ ఒత్తిడి అనేది మనకు అత్యవసరమైన శ్వాసక్రియలోంచి పుడుతుంది. శ్వాసక్రియలో ఉద్భవించే 'ఫ్రీ రాడికల్స్‌'.. కణాల్లోని ప్రోటీన్లకు, జన్యువులకు నష్టం చేకూరుస్తాయి. ఈ నష్టాన్నే ఆక్సీకరణ ఒత్తిడి అంటారు. ఇవే ఫ్రీ రాడికల్స్‌ క్యాన్సర్‌, ఆల్జీమర్స్‌, పార్కిన్‌సన్‌ వ్యాధుల్లోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. వీటిని నియంత్రణలో పెట్టి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటంపై మిస్సౌరీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హైపాయింట్‌ అనే ఔషధ తయారీసంస్థతో కలిసి పరిశోధన జరిపారు. ఈ క్రమంలో 'హెచ్‌పీపీ-4382' అనే అణుసమ్మేళనం సమర్థవంతంగా పని చేస్తుందని గుర్తించారు. ఈ సమ్మేళనం ఆక్సీకరణ ఒత్తిడి సమతుల్యతను కాపాడుతుందని తద్వారా శరీరంపై ప్రతికూల ఫలితాలు రాకుండా చూస్తుందని కనుగొన్నారు. 'హెచ్‌పీపీ-4382' ఆధారంగా ఔషధాన్ని తయారుచేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
వయసు పెరుగుదల, క్యాన్సర్‌ జన్యువు గుర్తింపు
వాషింగ్టన్‌: వయసు పెరుగుదలకు, క్యాన్సర్‌వ్యాధికి కారణమవుతున్న ఒక ఉమ్మడి జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి 'ఎస్‌పీఆర్‌టీఎన్‌' అనే సంకేతనామం ఉంది. దెబ్బతిన్న డీఎన్‌ఏకు కణాలు మరమ్మతు చేస్తున్నప్పుడు ఉత్పరివర్తనాలు ఏర్పడకుండా ఈ జన్యువు అడ్డుకుంటుంది. ఈ జన్యువు అడ్డుకోకపోతే ఉత్పరివర్తనాలు వేగంగా ఏర్పడతాయి. ఇవి వయసు పెరుగుదలకు కారణమవుతాయి. ఫలితంగా ఓ యాభై ఏళ్ల తర్వాత వచ్చే మార్పులు ముందే వస్తాయి. ఈక్రమంలోనే క్యాన్సర్‌ కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్‌ క్రిస్టిజన్‌ రమదాన్‌ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో పరిశోధకులు 'ఎస్‌పీఆర్‌టీఎన్‌' జన్యువును గుర్తించారు. చిన్నతనంలోనే కాలేయ క్యాన్సర్‌ బారిన పడి టీనేజీ వయసులో మరణించిన ముగ్గురు బాలలపై వీరు పరిశోధనలు జరిపారు. సాధారణంగా కాలేయక్యాన్సర్‌ హెపటైటిస్‌తోగానీ, మితిమీరిన మద్యపానంతోగానీ వస్తుంది. కానీ ఈ ముగ్గురికి ఆ వ్యాధిగానీ, అలవాటుగానీ లేవు. అయినప్పటికీ వారు కాలేయ క్యాన్సర్‌ కారణంగా ప్రాణాలు కోల్పోవటం గురించి పరిశోధించినప్పుడు.. ముగ్గురిలోనూ 'ఎస్‌పీఆర్‌టీఎన్‌' జన్యువు దెబ్బతిన్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల వారిలో బరువు తగ్గటం, కండరాలు క్షీణించటం, క్రోమోజోముల్లో అస్థిరత్వం ఏర్పడటం వంటి వయోవృద్ధ లక్షణాలు మొదలయ్యాయి. వయసు పెరుగుదలకు, క్యాన్సర్‌కు 'ఎస్‌పీఆర్‌టీఎన్‌' జన్యువుతో దగ్గరి సంబంధం ఉందని ఈ విధంగా వెల్లడైంది. దీనిద్వారా సమర్థవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
శిలాద్రవం వల్లే 'చందమామలో మనిషి'!
వాషింగ్టన్‌: చంద్రుడి ఉపరితలంపై మనిషిలా కనిపించే ఆకృతి.. భారీ శిలాద్రవం కారణంగా ఏర్పడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన గ్రెయిల్‌ ఉపగ్రహం అందించిన సరికొత్త డేటా ఆధారంగా ఈ నిర్ధరణకు వచ్చారు. చందమామ మీదున్న ప్రొసెల్లేరం ప్రాంతంలోని భారీ బేసిన్‌ను 'చంద్రుడిపై మనిషి'గా అభివర్ణిస్తుంటారు. అది భారీ గ్రహశకలం ఢీ కొట్టడం వల్ల ఏర్పడి ఉంటుందని భావించారు. ఈ ప్రొసెల్లేరం ప్రాంతం ఇంచుమించుగా వృత్తాకారంలో ఉంటుంది. దీని వ్యాసం 2,896 కిలోమీటర్లు. మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌, ఇతర సంస్థలు.. 'గ్రెయిల్‌' సాయంతో ప్రొసెల్లేరం ప్రాంతానికి సంబంధించి అత్యంత ఎక్కువ రిజల్యూషన్‌ కలిగిన మ్యాప్‌ను రూపొందించారు. దాని అంచులు వత్తాకారంలో లేవని, పదునైన కోణాలు కలిగిన బహుభుజిలా ఆ ఆకృతి ఉందని తాజాగా తేల్చారు. అది భారీ గ్రహశకలం ఢీ కారణంగా ఏర్పడే అవకాశమే లేదని వివరించారు. గ్రహశకలం వల్ల ఏర్పడి ఉంటే వృత్తాకార, లేదా దీర్ఘవృత్తాకారంలో ఉంటుందని చెప్పారు. అక్కడ అంతర్భాగంలో నుంచి వేడి శిలాద్రవం ఉబికి వచ్చిందని, దాని చుట్టూ ఉన్న క్రస్టు భాగం చల్లబడ్డాక ఈ కోణాలు ఏర్పడ్డాయని తేల్చారు. ఈ శిలాద్రవం అక్కడి చిన్నచిన్న బేసిన్లను నింపడంవల్ల నల్ల మచ్చలు ఏర్పడ్డాయని, అవే 'చంద్రుడిలో మనిషి'లా దర్శనమిస్తున్నాయని వివరించారు.
క్యాన్సర్‌ టీకాలకు 'రహస్య' నానోపార్టికల్స్‌ దన్ను
వాషింగ్టన్‌: టీకాలను విడుదల చేయటానికి శాస్త్రవేత్తలు 'రహస్య' నానోపార్టికల్స్‌ సాయంతో కొత్త పద్ధతిని రూపొందించారు. ఇది ఎలుకల్లో కణితి వృద్ధిని విజయవంతంగా నిర్మూలించటం గమనార్హం. క్యాన్సర్‌ కణాలు ఇతర భాగాలకు వ్యాపించక ముందే వాటిని చంపటానికి క్యాన్సర్‌ టీకాలు ఇటీవల బాగా పుట్టుకొస్తున్నాయి. అయితే చాలా టీకాలు అంత సమర్థంగా పనిచేయటం లేదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త నానోపార్టికల్స్‌ విధానం విజయవంతంగా పనిచేస్తున్నట్టు బయటపడింది. ఎలాంటి విద్యుదావేశం లేని ఈ పార్టికల్స్‌ను ఎలుకల్లోకి ప్రవేశపెట్టినపుడు రక్తంలో తిరిగే రోగనిరోధక కణాల దృష్టిని ఆకర్షించాయి. వాటి ద్వారా అవి ఎలుకల లింఫ్‌ వ్యవస్థలోకి దూరాయి. ఆ వెంటనే ప్రత్యేకమైన మ్యాక్రోఫేజ్‌ కణాలు వీటిని మింగేశాయి. నానోపార్టికల్స్‌ లోపల టీ కణాలను పెట్టటం మూలంగా అవి కణితి వృద్ధిని ఆపేలా చేయగలిగాయి.
 అంగారకుడిపై ఒకప్పుడు హిమానీ నదాలు
* ఖనిజపరమైన ఆధారాలను సంపాదించిన శాస్త్రవేత్తలు
వాషింగ్టన్‌: అంగారకుడిపై ఒకప్పుడు హిమానీనదాల ఉన్నాయనడానికి శాస్త్రవేత్తలు ఖనిజపరమైన ఆధారాలు సంపాదించారు. ఆ గ్రహంపైనున్న పెద్ద లోయ.. గ్రాండ్‌ కేనియాన్‌ గుండా ఇది ప్రవహించిందని వారు తెలిపారు. అంగారకుడిపై 3218 కిలోమీటర్ల పొడవైన లోయ (వేలెస్‌ మెరైనెరీస్‌) ఉంది. దీన్ని గ్రాండ్‌ కేనియాన్‌ ఆఫ్‌ మార్స్‌గా పిలుస్తారు. దీని గుండా హిమానీ నదాలు ప్రవహించి ఉంటాయని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అంచనా వేస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి, వారు ఒకప్పటి హిమానీనదాల కారణంగా ఏర్పడ్డఆకృతులను గుర్తించారు. అయితే వీటిపై వివాదం ఉంది. ఇప్పుడు అమెరికాలోని బ్రిన్‌ మార్‌ కళాశాల, బెర్లిన్‌లోని ఫ్రెయీ విశ్వవిద్యాలయ పరిశోధకులు పురాతన హిమానీనదాలకు సంబంధించి ఖనిజపరమైన ఆధారాలను సంపాదించారు. ఇక్కడ సల్ఫేట్‌ ఖనిజాలతో కూడిన మిశ్రమాన్ని కనుగొన్నారు. భూమి మీద ఆర్కిటిక్‌ మహాసముద్రంలోని స్వాల్‌బార్డ్‌లో ఉన్న హిమానీ నదాల్లో ఇదే రకమైన పరిస్థితి కనిపించిందని వారు తెలిపారు.
విశ్వంలో కృష్ణబిలాలు లేవు
* గణిత సిద్ధాంతం ఆధారంగా అమెరికా శాస్త్రవేత్త విశ్లేషణ
వాషింగ్టన్‌: కాంతిని కూడా స్వాహా చేసే కృష్ణబిలాలు అసలు ఉనికిలోనే లేవని అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త లారా మెర్సిని హౌటన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గణితశాస్త్ర పరంగా రుజువు చేశారు. స్వీయ గురుత్వాకర్షణ శక్తి కారణంగా భారీ తార కుప్పకూలి.. విశ్వంలో ఒకే బిందువు వద్దకు చేరితే కృష్ణబిలాలు ఏర్పడుతున్నట్లు చాలా దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు భావించారు. ఇది.. భూమి మొత్తం ఒక బఠాణీ గింజ పరిమాణంలోకి కుచించుకుపోవడం లాంటిదన్నమాట. దీన్నే సింగ్యులారిటీ అంటారు. దీని చుట్టూ ఈవెంట్‌ హొరైజాన్‌ అనే అదృశ్య పొర ఉంటుంది. దాన్ని దాటి వెళితే వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. అక్కడ కృష్ణబిలం తాలుకు గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా పనిచేస్తుంది. కృష్ణబిలాలకు సంబంధించి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఐన్‌స్టీన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతం వీటి ఆవిర్భావాన్ని సూచిస్తోంది. అయితే విశ్వం నుంచి ఏ సమాచారమూ మాయం కావడానికి అవకాశం లేదని క్వాంటమ్‌ సిద్ధాంతానికి సంబంధించిన ప్రాథమిక సూత్రం చెబుతోంది. రెండు సిద్ధాంతాలను కలగలిపితే గణితపరమైన అస్పష్టతకు దారితీసింది. 1974 ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ క్వాంటమ్‌ మెకానిక్స్‌ను ఉపయోగించి కృష్ణబిలాలు రేడియోధార్మికతను వెలువరిస్తాయని తేల్చారు. తాజాగా మెర్సినీ.. ఈ రేడియోధార్మికత అంశంతో ఏకీభవించారు. దీన్ని వెలువరించడం ద్వారా తార తన ద్రవ్యరాశిని కోల్పోతుందని సూత్రీకరించారు. ఫలితంగా అది కుంచించుకుపోయినప్పుడు కృష్ణబిలంగా మారేందుకు అవసరమైన సాంద్రత ఉండదని తెలిపారు. చనిపోయే తార చివరిసారిగా పెరిగిపెద్దదై, పేలిపోతుందని చెప్పారు. అందువల్ల సింగులారిటీ, ఈవెంట్‌ హొరైజాన్‌కు అవకాశమే లేదని సూత్రాలతో వివరించారు.
 'ఆహారం, భావోద్వేగాలతో జన్యు మార్పులు'
న్యూఢిల్లీ: అధిక రక్తపోటు, మధుమేహం వంటివి వంశపారంపర్యంగా వస్తుంటాయని భావిస్తుంటారు. అయితే ఈ వ్యాధులకు జన్యువులే కారణం కాదని వైద్యుడు, రచయిత అయిన దీపక్‌ చోప్రా పేర్కొన్నారు. జన్యువుల్లో ఎక్కువ శాతంపై మన జీవనశైలి ప్రభావం చూపుతుందని తెలిపారు. ''వ్యాధికి సంబంధించిన జన్యువుల్లో 5 శాతం ఉత్పరివర్తనాలు మాత్రమే పూర్తిగా తదుపరి తరాలకు వెళతాయి. వాటిని మనం నివారించలేం. మిగతా జన్యు ఉత్పరివర్తనలో 95 శాతం.. ఆహారం, మన భావోద్వేగాల తీరు వంటి అంశాలకు ప్రభావితమవుతాయి'' అని పేర్కొన్నారు. భారత్‌లో జన్మించిన చోప్రా.. మనస్సు-శరీర వైద్య విభాగంలో నిపుణుడు.
విమానాల శబ్దం తగ్గించే పరికరం
* బెంగళూరు శాస్త్రవేత్తల రూపకల్పన
న్యూఢిల్లీ: విమానాల శబ్దాన్ని తగ్గించడంతో పాటు ఇంజిన్ల పనితీరును మెరుగుపరిచే కొత్త రకం పరికరాన్ని(నాజిల్‌) శాస్త్రవేత్తలు రూపొందించారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ శాస్త్రవేత్తల బృందం దీనిని అభివృద్ధి చేశారు. రద్దీగా ఉండే విమానాశ్రయాలలో పెద్ద ఎత్తున వచ్చే శబ్దాలు ప్రయాణికులతో పాటు ఆ పరిసరాలలో ఉండే స్థానికులకు ప్రమాదకరం. ఈ పరికరాలు ఇంజిన్‌ నుంచి వచ్చే వేడి వాయువులను వెలుపల ఉండే చల్లటి వాయువులతో మిళితమయ్యే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇంజిన్‌నుంచి వెలువడే వేడి వాయువులు శబ్దంకంటే ఎక్కువ వేగంగా ప్రయాణిస్తాయి. తద్వారా విమానం నుంచి ఎక్కువ శబ్దం వెలువడుతుంది. బయట ఉన్న చల్లనివాయువులు వేడి వాయువులతో కలపడవల్ల శబ్దాన్ని తగ్గిస్తాయి. దీంతోపాటు విమాన ఇంజిన్ల పనితీరును మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తల బృందానికి చెందిన శ్రీషా రావ్‌ తెలిపారు.
 ఉద్యోగ అభద్రతతో ఆస్తమా
వాషింగ్టన్‌: ఉద్యోగాన్ని కోల్పోయే భయం ఉన్నప్పుడు ఆస్తమా వచ్చే ప్రమాదం ఉందని ఒక పరిశోధన తొలిసారిగా వెల్లడించింది. అభద్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా ఈ ప్రమాదం ఉంటుందని తెలిపింది. యూరప్‌లో 2008లో ఆర్థిక సంక్షోభం అలుముకున్నప్పుడు నిర్వహించిన సర్వేలో వెల్లడైన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. జర్మనీలో ఏటా జనాభా ప్రాతినిధ్య సర్వే జరుగుతుంది. 2009, 2011లలో జరిగిన ఇటువంటి సర్వేల్లో వెల్లడైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. దాదాపు ఏడువేలమంది చెప్పిన జవాబులను అధ్యయనం చేశారు. 2009-11 మధ్య కాలంలో వీరిలో 105 మంది కొత్తగా ఆస్తమా జబ్బుకు గురయినట్లు తేలింది. ఉద్యోగ అభద్రత 25 శాతం పెరిగితే ఆ మేరకు ఆస్తమా ప్రమాదం 24 శాతం వరకూ పెరిగిందనిగుర్తించారు. ఉద్యోగం తప్పనిసరిగా పోతుందని భావించే వారిలో ఈ ప్రమాదం 60 శాతం వరకూ పెరిగిందని తేలింది. ఉద్యోగ అభద్రతతో ఆస్తమా పెరగటానికి కారణం.. ఒత్తిడే కావచ్చని అభిప్రాయపడ్డారు.
స్వస్థత చేకూర్చే చిన్ని పరికరం
* శరీరంలో అమర్చితే అపరసంజీవనే!
న్యూయార్క్‌: ఇన్‌ఫెక్షన్‌కు గురైన....తీవ్ర గాయాలపాలైన అవయవాలకు చికిత్సనందించి ...స్వస్థత చేకూర్చే సూక్ష్మమైన పరికరాన్ని శరీరంలో అమర్చడానికి వీలుగా ఉండేలా అమెరికా శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నారు. ఈ సూక్ష్మమైన పరికరం విద్యుత్‌ ప్రకంపనల సాయంతో అవయవాల పనితీరును గమనించగలుగుతుంది. చురుగ్గా రూపకల్పన ప్రక్రియ సాగుతున్న ఈ పరికరాన్ని ఎలక్టరెక్స్‌గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనివల్ల కొన్నిరకాల రుగ్మతలకు అతిగా ఔషధాలపై ఆధారపడటం తగ్గుతుందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది. ఈ పరికరం నుంచి విడుదలయ్యే విద్యుత్‌ ప్రకంపనలు శరీరానికి సాంత్వన కలిగించి స్వస్థత చేకూర్చే నాడీ వ్యవస్థలను చైతన్యపరుస్థాయి. శరీరానికి సహజసిద్ధంగా ఉండే స్వస్థతశక్తి పుంజుకుంటుంది. దరిమిలా రోగం తగ్గి ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కంటి చూపుతో అనుసంధానమయ్యే హెడ్‌సెట్‌
బీజింగ్‌: కంటి చూపుతో ఎలక్ట్రానిక్‌ పరికరాలతో అనుసంధానమయ్యే కొత్త రకం హెడ్‌సెట్‌ను చైనాకు చెందిన త్సింగువా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 'ఐ గేజ్‌'గా పిలిచే ఈ హెడ్‌ సెట్‌లో కంటి చూపును పసిగట్టే కెమెరా ఉండి మనం ఎక్కడ చూస్తున్నామనేది గణిస్తుంది. సమీపంలో అంతర్జాల సదుపాయం ఉన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్టీరియోలు, టీవీలతో వైఫై ద్వారా అనుసంధానమవుతుంది.
కృత్రిమ తీపి కూడా హానికరమే!
జెరూసలెం: మన పేగుల్లోని బ్యాక్టీరియా కృత్రిమ తీపి పదార్థాల ప్రభావానికి గురైనప్పుడు జీవక్రియ మార్పులు తలెత్తుతున్నట్టు ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మధుమేహం, వూబకాయం వంటి సమస్యలకు దారితీయగలదని భావిస్తున్నారు. కృత్రిమ తీపిపదార్థాల్లో చక్కెర లేకపోయినా ఇవి శరీరం గ్లూకోజును వినియోగించుకునే సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నట్టు వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అధ్యయనంలో వెల్లడైంది. శరీరం చక్కెరను సరిగా వినియోగించుకోలేకపోవటం వల్ల జీవక్రియల్లో మార్పులు తలెత్తి రక్తంలో గ్లూకోజు మోతాదులు (గ్లూకోజు ఇంటాలరెన్స్‌) పెరుగుతుంటాయి. ఇది ఆహారంలో పెద్ద మొత్తంలో చక్కెరను తీసుకున్నప్పుడు జరుగుతుందని భావిస్తున్నారు. కానీ కృత్రిమ తీపి పదార్థాలు కూడా గ్లూకోజు ఇంటాలరెన్స్‌కు దారితీస్తున్నట్టు పరిశోధకులు తేల్చారు.
చిన్న నక్షత్ర మండలాలను మింగేస్తున్న భారీ గెలాక్సీలు
మెల్‌బోర్న్‌: విశ్వంలోని భారీ నక్షత్ర మండలాలు సొంత నక్షత్రాలను తయారుచేయటాన్ని ఆపేశాయని, దానికి బదులుగా సమీపంలోని నక్షత్ర మండలాలను మింగేస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఖగోళ శాస్త్రవేత్తలు 22వేలకు పైగా నక్షత్ర మండలాలను పరిశీలించగా.. గ్యాస్‌ నుంచి నక్షత్రాలను సృష్టించటంలో చిన్న నక్షత్ర మండలాలు చాలా సామర్థ్యాన్ని కలిగుంటున్నట్టు తేలింది. అదే భారీ నక్షత్ర మండలాలు కొత్త నక్షత్రాలను అంతగా సృష్టించటం లేదని వెల్లడైంది. ఇవి ఇతర నక్షత్ర మండలాలను తినేయటం ద్వారా విస్తరిస్తున్నట్టు బయటపడింది. ''అన్ని నక్షత్ర మండలాలు చిన్నగానే ఆరంభమవుతాయి. గ్యాస్‌ను పోగు చేసుకొని, దాన్ని నక్షత్రాలుగా మార్చుకొని పెరుగుతాయి. తర్వాత వాటన్నింటినీ కలిపేసుకొని పెద్ద నక్షత్ర మండలాలుగా ఏర్పడతాయి'' అని వెస్టర్న్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఆరోన్‌ రోబోథమ్‌ తెలిపారు. మన పాలపుంత ప్రస్తుతం చిన్న నక్షత్ర మండలాలను తినటం ద్వారా పెరగొచ్చని భావిస్తున్నామన్నారు. సుమారు వంద కోట్ల సంవత్సరాల్లో పెద్ద, చిన్న మాజెలానిక్‌ క్లౌడ్స్‌ను తినేయొచ్చని వివరించారు.
పొగతో 'మూత్ర' సమస్యలు కూడా
లండన్‌: పొగ తాగటంవల్ల సంతానలేమి, స్తంభన లోపం, మూత్రాశయ క్యాన్సర్‌ వంటి సమస్యల ముప్పూ ఉంటోందని నిపుణులు తెలిపారు. ఇది చాలామందికి తెలియటం లేదని వివరించారు. ''చాలా జబ్బులను నివారించదగిన ముప్పు కారకాల్లో పొగ ముఖ్యమైంది'' అని పరిశోధకులు తెలిపారు. క్యాన్సర్‌ నిర్ధరణ అయిన తర్వాత పొగ మానేసినా మంచి ఫలితం కనబడుతుందన్నారు.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే జన్యుమార్పు గుర్తింపు
లండన్‌: రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించే అరుదైన జన్యు మార్పును శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 4వేల మందికి సంబంధించిన సంపూర్ణ జన్యుచట్రాన్ని విశ్లేషించి, వారి రక్తంలో కొవ్వు మోతాదులతో దీన్ని పోల్చి చూశారు. ఏపీఓసీ3 జన్యుమార్పు గలవారిలో గుండెజబ్బు ముప్పును తెచ్చిపెట్టే ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. ఈ జన్యుమార్పు రక్షణ పనితీరు యంత్రాంగాన్ని అర్థం చేసుకుంటే గుండెజబ్బు ముప్పు గలవారికి ఉపయోగపడే కొత్త చికిత్సలను రూపొందించటానికి తోడ్పడగలదని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌కు చెందిన ప్రొఫెసర్‌ స్టీవ్‌ హంప్‌షైర్స్‌ తెలిపారు.
అధిక రక్తపోటు నివారణకు పాలు!
లండన్‌: పాలు తాగినట్లయితే అధిక రక్తపోటు ముప్పును నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 57,256 మంది వ్యక్తులు, మరో 15,367 మంది బీపీ రోగులపై జరిగిన తొమ్మిది అధ్యయనాల అనంతరం ఈ ఫలితాన్ని వారు తేల్చారు. పాల వినియోగం పెరుగుతున్న కొద్దీ అధిక రక్తపోటు ముప్పు తగ్గుతోందని వారు గుర్తించారు. రోజుకు రెండు కప్పుల పాలు తీసుకున్నా చాలని నెదర్లాండ్స్‌లోని వేజెనింజెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ సబిత ఎస్‌.ముత్తు చెబుతున్నారు. పాలు తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుందని తెలిపారు. పాలలోని కొవ్వు, ఇతర పోషకాలు మెదడు అభివృద్ధికీ దోహదపడతాయని పరిశోధకులు పేర్కొన్నారు.
 పని రాక్షసులకు గుండెజబ్బుల ముప్పు
సియోల్‌: వారానికి 40 గంటలకు మించి పనిచేస్తే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అధికంగా పనిచేయడం వల్ల పదేళ్లలో గుండెజబ్బులు వచ్చే.. హృదయానికి రక్తప్రసరణ చేసే నాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 61 నుంచి 70 గంటలు పనిచేసేవారికి మిగిలివారి కంటే 42 శాతం అధికంగా ఇలాంటి ముప్పు ఉందని.. 71 నుంచి 80 గంటలు పనిచేసేవారికి 63 శాతం, 80 గంటలు దాటితే 94 శాతం అధికంగా ప్రమాదముందని పరిశోధకుల్లో ఒకరైన యున్‌ చుల్‌ హాంగ్‌ తెలిపారు. కొరియాకు చెందిన 8,350 మందిపై ఈ అధ్యయనం జరిపారు.
వినికిడికి చేపల రక్ష!
వాషింగ్టన్‌: చెవుడు బారిన పడకూడదని అనుకుంటున్నారా? అయితే చేపలు తినండి. ఎందుకంటే వారానికి రెండు, అంతకన్నా ఎక్కువసార్లు చేపలు తినేవారికి.. ముఖ్యంగా మహిళలకు వినికిడి లోపం ముప్పు 20% తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. నిజానికి వయసు పెరుగుతున్నకొద్దీ వినికిడి కూడా తగ్గుతుంటుంది. అయితే మార్చుకోదగిన ముప్పు కారకాలను గుర్తించటం వల్ల ఈ సమస్యను నివారించుకోవటానికి లేదా ఆలస్యమయ్యేలా చేసే అవకాశముందని బ్రైగమ్‌ అండ్‌ వుమెన్స్‌ హాస్పిటల్‌కు చెందిన షరోన్‌ జి.కుర్‌హన్‌ తెలిపారు. ఎలాంటి చేపలను తిన్నా చెవుడు ముప్పు తగ్గుతోందన్నారు.
కళ్లకు ఇబ్బంది కలిగించని హెడ్‌లైట్ల రూపకల్పన
వాషింగ్టన్‌: రాత్రిపూట వాహనాలను నడుపుతున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్లు కళ్లు మిరుమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతాయి కదా. దీంతో చుట్టుపక్కల ఏముందో తెలియకుండా చీకటిగా అవుతుంది కూడా. ఇలాంటి ఇబ్బందిని తొలగించే కొత్తరకం హెడ్‌లైట్లను కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు. ఇవి మరింత ఎక్కువ కాంతిని వెదజల్లుతూనే.. ఎదుటి వాహనాల డ్రైవర్ల కళ్లు చెదిరేలా మెరుపును గానీ వారి కళ్లు కనబడనీయకుండా గానీ చేయవు. ఎందుకంటే ఈ లైట్లలో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించే వ్యవస్థ ఉంటుంది. ఇది కాంతి కిరణ పుంజంలోని కొన్ని భాగాలను పనిచేయకుండా చేసి, ఎదుటి వాహనాల డ్రైవర్ల కళ్లలో కాంతి పడకుండా నిరోధిస్తుంది. మంచు లేదా వర్షం కురుస్తున్నప్పుడు మంచు ముక్కలు, చినుకుల్లో పడిన కాంతి మిరుమిట్లు గొలపటాన్నీ ఇది తగ్గిస్తుంది. కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయంలోని రోబోటిక్స్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస నరసింహన్‌ తో పాటు రాబర్ట్‌ ట్యాంబురో, ఇతరలు కలిసి ఈ వ్యవస్థను రూపొందించారు. కొత్తరకం హెడ్‌లైట్లలో ఎల్‌ఈడీల సముదాయానికి బదులు డిజిటల్‌ లైట్‌ ప్రాసెసింగ్‌ ప్రొజెక్టర్‌ ఉంటుంది. అందువల్ల కాంతి లక్షలాది చిన్న చిన్న కాంతి కిరణాలుగా విభజన చెందుతుంది. ప్రతీ కిరణాన్నీ వాహనంలోని కంప్యూటర్‌ నియంత్రించి, ఏయే కిరణాలు ప్రసారం కావాలో అనేది నిర్ణయిస్తుంది.
దైవకణం.. రాకాసి కణమవుతుంది
* విఖ్యాత శాస్త్రవేత్త హాకింగ్‌ సూత్రీకరణ
లండన్‌: శాస్త్రవేత్తలకు కొరకరాని కొయ్యగా ఉన్న 'దైవ కణాని'కి ఏకంగా విశ్వం మొత్తాన్ని నాశనం చేసే శక్తి ఉందని విఖ్యాత సిద్ధాంత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ సూత్రీకరించారు. ఉనికిలో ఉన్న ప్రతి వస్తువుకూ ఆకృతి, పరిమాణం ఇస్తుందని భావిస్తున్న ఈ కణాన్ని హిగ్స్‌ బోసన్‌గానూ పిలుస్తారు. ఎలక్ట్రోవీక్‌ సిద్ధాంతాన్ని ఉపయోగించి పీటర్‌ హిగ్స్‌ అనే శాస్త్రవేత్త 1960లలో ఈ కణం ఉనికిని ప్రతిపాదించారు. 2012లో ఐరోపా అణు పరిశోధన సంస్థకు చెందిన లార్జ్‌ హాడ్రన్‌ కొలైడర్‌ (ఎల్‌హెచ్‌సీ)లో ప్రయోగాన్ని నిర్వహించి, దీన్ని నిర్ధరించారు. ఈ కణం కారణంగా పదార్థాలకు ద్రవ్యరాశి సమకూరుతోందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. దీని పాత్ర గురించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. 100 బిలియన్‌ గిగా ఎలక్ట్రాన్‌ వోల్ట్‌ల కన్నా ఎక్కువ శక్తి వద్ద ఈ దైవ కణం చాలా అస్థిరంగా మారుతుందని, దీనివల్ల తీవ్రస్థాయిలో శూన్యత తరగిపోయి విశ్వం, కాలం కుప్పకూలుతాయని హాకింగ్‌ సూత్రీకరించారు. 'స్టార్మస్‌: 50 ఇయర్స్‌ ఆఫ్‌ మ్యాన్‌ ఇన్‌ స్పేస్‌' అనే కొత్త పుస్తకానికి రాసిన ముందుమాటలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. అంతమాత్రన దీని గురించి భయపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇస్తున్నారు. ఆ పరిణామం సమీప భవిష్యత్‌లో జరిగే అవకాశం లేదని చెప్పారు. భూమి మీద అలాంటి పరిస్థితిని సృష్టించేంతటి భారీ పార్టికిల్‌ యాక్సిలరేటర్‌ కూడా లేదన్నారు. 100 బిలియన్‌ గిగా ఎలక్ట్రాన్‌ వోల్ట్‌లను మించిన శక్తిని ఉత్పత్తి చేసే యాక్సిలరేటర్‌ భూగోళం కన్నా పెద్దగా ఉంటుందని వివరించారు. పార్టికిల్‌ యాక్సిలరేటర్‌లో సబ్‌ అటామిక్‌ కణాల వేగాన్ని విద్యుత్‌, అయస్కాంత క్షేత్రాల సాయంతో పెంచి, పరస్పరం ఢీ కొట్టిస్తారు. హిగ్స్‌ బోసన్‌ ఆవిష్కారానికి కారణమైన లార్జ్‌ హాడ్రన్‌ కొలైడర్‌ కూడా యాక్సిలరేటరే.
మామిడిపండ్లతో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుదల
వాషింగ్టన్‌: శీతలీకరించి ఐస్‌ను తీసేసిన (ఫ్రీజ్‌ డ్రైయిడ్‌)మామిడిపండును ప్రతిరోజు పదిగ్రాములు తీసుకుంటేే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు దోహదపడుతుందని ఓ అధ్యయనంలో గుర్తించారు. ముఖ్యంగా స్థూలకాయుల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించిందని పరిశోధకులు తెలిపారు. మామిడిపండులోని మేంగీఫెరిన్‌, యాంటీఆక్సిడెంట్‌, ఫైబర్‌ తదితర జీవచైతన్య పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపిస్తాయని పరిశోధనకు నాయకత్వం వహించిన ఓక్లాహోమా స్టేట్‌ యూనివర్సిటీ న్యూట్రీషినల్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఇ.లూకస్‌ తెలిపారు. తాజాగా ఉండే వందగ్రాముల మామిడిపండుకు సమానమైన, పది గ్రాముల ఫ్రీజ్‌డ్రైయిడ్‌ మామిడిపండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల స్థూలకాయుల్లోని రక్తంలో చక్కెర స్థాయి తగ్గుదలకు సహాయపడుతుందని లూకస్‌ వివరించారు. 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న 20 మందిపై 12 వారాల పాటు పరిశోధన చేసి ఈ విషయాన్ని నిర్థరించారు.
సునామీని ముందుగా గుర్తించొచ్చు!
* ప్రాథమికంగా రుజువు చేసిన స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు
* సాంకేతికత అభివృద్ధి అవసరమంటున్న ఇన్‌కాయిస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తీర ప్రాంత వాసుల్ని వణికించే సునామీని ముందుగానే గుర్తించవచ్చని ప్రాథమికంగా రుజువు చేశారు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. జపాన్‌లో 2011లో సంభవించిన సునామీ సమయంలో సముద్ర ఉపరితలంపై జనించే ధ్వని తరంగాల ఆధారంగా జరిపిన అధ్యయనంలో సునామీలను ముందుగా గుర్తించవచ్చని ప్రాథమిక పరిశోధనలో తేలింది. సునామీ పుట్టినప్పుడు ఆ ప్రాంతంలో సముద్ర ఉపరితలం ఒక్కసారిగా పగిలినట్లుగా మారుతుంది. ఆ సమయంలో సునామీ తరంగాల కంటే ధ్వని తరంగాలు సముద్రజలాల ద్వారా 7-9 రెట్లు వేగంగా పయనిస్తాయి. అంటే ఆ రెండు తరంగాల మధ్య ప్రయాణ సమయంలో వ్యత్యాసం ఉంటుందని స్పష్టమైంది. దీన్ని బట్టి కొద్ది నిమిషాల ముందుగా సునామీ హెచ్చరికలు పంపేందుకు సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారని ఇటీవల కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ రాజ్యసభలో వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలను ప్రయోగాత్మకంగా ఉపయోగించుకోవాలంటే ధ్వని తరంగాల లక్షణాలు, వాటి విస్తరణ తదితరాలకు సంబంధించి ఇంకా లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. మరోవైపు సునామీ హెచ్చరికలు పంపేందుకు మరింత సాంకేతిక పరిజ్ఞానం అవసరమని నగరంలోని భారత జాతీయ మహాసముద్రాల సమాచార సేవా సంస్థ(ఇన్‌కాయిస్‌) శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇన్‌కాయిస్‌లోని సునామీ కేంద్రం ఇన్‌ఛార్జి తుమ్మల శ్రీనివాసకుమార్‌ మాట్లాడుతూ సునామీకి సంబంధించి ముందస్తు హెచ్చరికలు చేసే విషయంలో స్టాన్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు కొంత ముందడుగు వేసిన విషయం వాస్తవమే అయినా జపాన్‌ సునామీ సంభవించిన సమయంలో గుర్తించిన ఫలితాలు అన్నిసార్లు అలాగే ఉంటాయా అన్నదానిపై మరిన్ని అధ్యయనాలు జరపాల్సిన అవసరముందన్నారు.
గోడలోంచి చూడవచ్చు!
వాషింగ్టన్‌: శరీరం లోపల అవయవాలు ఎలా ఉన్నాయో చూడవచ్చు. గోడ అవతల ఏముందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మామూలు కంటికి కనిపించని ఇటువంటివాటిని.. ఒక అతిపలచటి డిటెక్టర్‌ సాయంతో చూడటం సాధ్యమేనని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు వాళ్లు గ్రాఫీన్‌తో పరిశోధనలు చేస్తున్నారు. గ్రాఫీన్‌ అనేది ఒక పరమాణు మందంతో ఉండే అతిపలచటి కార్బన్‌ ప్రతిరూపం. దీనితో రూపొందించే డిటెక్టర్‌ అసాధారణ తరంగధైర్ఘ్యాలను కూడా పసిగట్టగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కంటికి కనిపించని టెరాహెర్ట్జ్‌ కాంతి తరంగాలను కూడా గుర్తించే సామర్థ్యం ఈ డిటెక్టర్‌కు ఉంటుంది. టెరాహెర్ట్జ్‌ కాంతితరంగాలు చర్మం, ప్లాస్టిక్‌, వస్త్రం, కార్డుబోర్డు వంటివాటిలోంచి కూడా వెళ్లగలుగుతాయి. వీటికి ఉన్న ఈ లక్షణం వల్ల.. గ్రాఫీన్‌ డిటెక్టర్‌ను ఉపయోగించి శరీరంలోపలి అవయవాలను, ఒక గోడ వెనక ఉన్న వస్తువులను, మనుష్యులను కూడా స్పష్టంగా పరిశీలించటం సాధ్యమవుతుందని మేరీల్యాండ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈ డిటెక్టర్‌ తయారీకి వీరు కృషి చేస్తున్నారు.
చర్మక్యాన్సర్‌ కారక జన్యు ఉత్పరివర్తన
* కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు
వాషింగ్టన్‌: మానవుల్లో చర్మ క్యాన్సర్లకు ఒక ప్రధాన కారణాన్ని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అతినీలలోహిత కాంతి కారణంగా సంభవించే జన్యు ఉత్పరివర్తనతో ఈ వ్యాధికి దారితీస్తున్నట్లు కనుగొన్నారు. కేఎన్‌ఎస్‌టీఆర్‌ఎన్‌ అనే జన్యువులో ఈ ఉత్పరివర్తన జరుగుతున్నట్లు తేల్చారు. కణ విభజన సమయంలో డీఎన్‌ఏను సమానంగా పంచే ప్రక్రియలో ఈ జన్యువుకు పాత్ర ఉంది. ఉత్పరివర్తన చెందాక క్యాన్సర్‌ను కలిగించే జన్యువులను ఆంకోజన్యువులుగా పిలుస్తారు. అయితే మానవుల్లో క్యాన్సర్‌ కారకంగా ఇప్పటివరకూ కేఎన్‌ఎస్‌టీఆర్‌ఎన్‌ను గుర్తించలేదు. కుటేనియస్‌ స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా అనే చర్మ క్యాన్సర్‌కు జన్యు కారణాన్ని పరిశోధిస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు ఈ జన్యువు గుట్టును బహిర్గతం చేశారు. సదరు కణతి కణాల్లోని జన్యువుల డీఎన్‌ఏ క్రమాన్ని సాధారణ చర్మంతో పోల్చి చూశారు. కణతుల్లో మాత్రమే సంభవించిన ఉత్పరివర్తనల కోసం గాలించారు. వీటి ఆధారంగా 336 అనుమానిత జన్యువులను ఎంపిక చేసుకొని, తదుపరి అధ్యయనం జరిపారు. వీటిలో స్క్వామస్‌ సెల్‌ కార్సినోమాకు ప్రధాన కారణాల్లో సీడీకేఎన్‌2ఏ, టీపీ53 ఉత్పరివర్తిత జన్యువులు మొదటి రెండు స్థానాలను ఆక్రమిస్తున్నట్లు గుర్తించారు. ఇవి పాతవే. ఇప్పటికే వాటి పాత్ర వెల్లడైంది. మూడో స్థానంలో నిలిచిన కేఎన్‌ఎస్‌టీఆర్‌ఎన్‌ శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కణ విభజన సమయంలో కొత్తగా ఏర్పడ్డ క్రోమోజోమ్‌ ప్రతులను కణంలో చెరోవైపునకు లాగడంలో కైనెటోకోర్‌ అనే ఆకృతి కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని ఏర్పరిచే ప్రోటీన్‌కు సంబంధించిన సంకేతాన్ని కేఎన్‌ఎస్‌టీఆర్‌ఎన్‌ కలిగి ఉంటుంది.
త్రీడీ ప్రింటర్‌తో భవంతి
వాషింగ్టన్‌ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి: త్రీడీ ప్రింటింగ్‌ రంగంలో ఓ సరికొత్త ఆవిష్కరణకు అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రానికి చెందిన యాండ్రీ కుడెంకో తెరలేపారు. కాంక్రీటును ప్రింటు చేసే విధానం ద్వారా ఆయన 3x5 మీటర్లు ఉన్న భవంతిని రూపొందించారు. ఇప్పటి వరకు త్రీడీ ప్రింటర్ల రంగంలో పూర్తిస్థాయి భవనాన్ని నిర్మించిన ప్రథముడిగా ఆయన రికార్డులకెక్కారు. ఆర్డ్యూనో మైక్రోకంట్రోలర్‌ను వినియోగించి ఆయన ఈ ఘనత సాధించారు. భవన నిర్మాణ రంగ నిపుణలతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, దీన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే దిశలో అడుగులు వేస్తున్నట్లు యాండ్రీ తెలిపారు. అతి తక్కువ వ్యయంతో కూలీల అవసరం లేకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రింటర్లతో అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన అన్నారు.
ఆలుగడ్డలు...అరటిపండ్లతో గుండెపోటు ముప్పు నివారణ!!
వాషింగ్టన్‌: ఆలుగడ్డలు...అరటిపండ్ల వంటి పొటాషియం సమృద్ధిగా ఉండే కూరలు, పండ్లను రోజువారీ ఆహారంలో పుష్కలంగా స్వీకరించే నడివయసు....వయోవృద్ధులైన మహిళల్లో గుండెపోటు ప్రమాదం తక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 50-79 ఏళ్ల వయసున్న సుమారు 90వేల మందికి పైగా మహిళలను పరిశోధకులు తమ అధ్యయనం నిమిత్తం ఎంచుకున్నారు. మొత్తం 11 సంవత్సరాల పాటు వారి ఆరోగ్యాన్ని....ఆహారపుటలవాట్లను పరిశీలించారు. అధ్యయన కాలంలో మృతి చెందిన వారి ఆరోగ్య పరిస్థితిని, మరణానికి కారణాలను విశ్లేషించారు. రోజుకు సుమారు 2,611 మిల్లీగ్రాముల పొటాషియంను ఆహారం ద్వారా స్వీకరించిన మహిళలకు గుండెపోటు ముప్పు తక్కువనే విషయం ఈ సందర్భంగానే వెల్లడైంది.
 తగినంత నిద్రతో తక్కువ సిక్‌ లీవులు
వాషింగ్టన్‌: అదేపనిగా అనారోగ్య కారణాలతో సెలవులు (సిక్‌ లీవ్‌) పెట్టొద్దని అనుకుంటున్నారా? అయితే రాత్రిపూట 7-8 గంటల సేపు నిద్రపోయేలా చూసుకోండి. ఎందుకంటా ఇలా తగినంత సేపు నిద్రపోయేవారు ఆఫీసులకు తక్కువగా సెలవులు పెడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. రాత్రిపూట 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువ సేపు నిద్రపోయేవారు అనారోగ్య కారణాలతో ఎక్కువకాలం గైర్హాజరు అవుతున్నట్టు తేలింది. స్త్రీలు 7 గంటల 38 నిమిషాలు, పురుషులు 7 గంటల 46 నిమిషాల సేపు నిద్రపోవటం మంచిదని పరిశోధకులు గుర్తించారు. తగినంత సేపు నిద్రపోవటాన్ని ప్రోత్సహించాలని ఫిన్నిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌కు చెందిన టీ లలుకా సూచించారు. తగినంత సేపు నిద్రపోయేవారితో పోలిస్తే.. 5 గంటల కన్నా తక్కువ, 10 గంటలు లేదా అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారు ఏడాదికి 4.6 నుంచి 8.9 రోజుల వరకు ఎక్కువగా గైర్హాజరు అవుతున్నారని వివరించారు.
పాలపుంత గెలాక్సీకి కొత్త చిరునామా
* లానియాకియా సూపర్‌గెలాక్సీ అంచుల్లో నివాసం
వాషింగ్టన్‌: మన పాలపుంత గెలాక్సీకి కొత్త చిరునామా వచ్చింది. లానియాకియా అనే సూపర్‌ క్లస్టర్‌ అంచుల్లో ఇది ఉన్నట్లు తేల్చారు. హవాయ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన బ్రెంట్‌ టల్లీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన నిర్వహించింది.
హవాయ్‌ భాషలో లానియాకియా అంటే భారీ స్వర్గమని అర్థం. దీని వ్యాసం 50 కోట్ల కాంతి సంవత్సరాలు. ఇందులో 100 మిలియన్‌ బిలియన్‌ సూర్యల పరిమాణంలో ద్రవ్యరాశి ఉంది. లక్ష సమూహాలు ఉన్నాయి. విశ్వంలో భారీ నిర్మాణాల్లో సూపర్‌ క్లస్టర్లు ఒకటి. అందులో డజన్ల కొద్దీ గెలాక్సీలతో కూడిన స్థానిక విభాగాలు ఉంటాయి. వందలాది గెలాక్సీలతో కూడిన భారీ క్లస్టర్లు ఉంటాయి. ఇవన్నీ ఫిలమెంట్లతో పరస్పరం అనుసంధానమవుతాయి. అయితే వీటి సరిహద్దులను గుర్తించడం అంత తేలిక కాదు. అమెరికా నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన గ్రీన్‌ బ్యాంక్‌ టెలిస్కోప్‌ (జీబీటీ), ఇతర రేడియో టెలిస్కోపులను ఉపయోగించి మన స్థానిక విభాగంలోని గెలాక్సీల వేగాన్ని గుర్తించారు. తద్వారా సూపర్‌క్లస్టర్‌ ఆధిపత్యం వహించే ప్రాంతాన్ని నిర్వచించారు. దానికి లానియాకియా అని పేరు పెట్టారు. ఆ సూపర్‌క్లస్టర్‌ అంచుల్లో మన గెలాక్సీ ఉన్నట్లు గుర్తించారు. ఈ సూపర్‌ క్లస్టర్‌ విస్తృతిని కూడా తొలిసారిగా మ్యాప్‌ చేశారు.
త్రీడీ ముద్రణతో సంక్లిష్ట రాకెట్‌ భాగం తయారు
* విజయవంతంగా పరీక్షించిన నాసా
వాషింగ్టన్‌: త్రీడీ ప్రింటింగ్‌ పరిజ్ఞానంతో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అత్యంత సంక్లిష్టమైన రాకెట్‌ భాగాన్ని రూపొందించింది. దాన్ని విజయవంతంగా పరీక్షించడం ద్వారా సాంకేతిక పరిజ్ఞాన హద్దులను పునర్‌నిర్వచించింది. ఇంధనాన్ని ఇంజిన్‌లోకి పంపే 'రాకెట్‌ ఇంజిన్‌ ఇంజెక్టర్‌'ను ఈ విధానంలో తయారుచేశారు. తొలుత డిజైన్‌ను త్రీడీ ప్రింటర్‌కు సంబంధించిన కంప్యూటర్‌లోకి చొప్పించారు. ఈ ప్రింటర్‌.. లోహ పొడిని పొరలుపొరలుగా వెదజల్లడం, లేజర్‌ సాయంతో వాటిని అతికించడం (సెలెక్టివ్‌ లేజర్‌ మెల్టింగ్‌) ద్వారా ఇంజెక్టర్‌ భాగాలను రూపొందించింది. ఈ పద్ధతిలో డిజైనర్లు 40 స్ప్రే వ్యవస్థలతో కూడిన ఇంజెక్టర్‌ను తయారుచేశారు.
సంప్రదాయ విధానంలో 163 విడివిడి భాగాలను తయారుచేసి, ఆ తర్వాత వాటిని కూర్చడం ద్వారా ఇంజెక్టర్‌ను తయారు చేస్తారు. త్రీడీ ప్రింటింగ్‌ విధానంలో రెండు భాగాలు మాత్రమే అవసరమయ్యాయి. దీనివల్ల బోలెడు సమయం, డబ్బు ఆదా అయ్యాయని పరిశోధకులు తెలిపారు. ఇది విఫలమయ్యే ప్రమాదం కూడా చాలా తక్కువని చెప్పారు. ఈ విధానంలో రూపొందిన రెండు ఇంజెక్టర్లను అలబామాలో నాసాకు చెందిన మార్షల్‌ స్పేస్‌ ఫ్త్లెట్‌ సెంటర్‌లో విజయవంతంగా పరీక్షించారు. వీటిని 5 సెకన్ల పాటు మండించి 20వేల పౌండ్ల థ్రస్టును ఉత్పత్తి చేయగలిగారు.
ఎనర్జీ పానీయాలు గుండెకు యమపాశాలు!!
లండన్‌: వ్యాయామాలు చేసేటప్పుడు....డ్యాన్స్‌ క్లబ్‌లలోనూ ఎక్కువగా వాడుతూ కనిపించే ఎనర్జీ పానీయాల వల్ల గుండెకు తీరని నష్టం కలుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ పానీయాలను ఎక్కువగా తీసుకోవడంవల్ల హఠాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం అధికమని తెలిపింది. ఒక్క గుండెపోటు మాత్రమే కాదు...గుండె కొట్టుకోవడంలోనూ తేడాలు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి హఠాన్మరణమూ సంభవించవచ్చు. ఈ తరహా పానీయాల్లో కెఫీన్‌ శాతం అధికంగా ఉంటుంది. 0.2 లీటర్ల ఎనర్జీపానీయం క్యాన్‌లో కనీసం రెండు ఎస్‌ప్రెసో కాఫీల్లో ఉన్నంత కెఫీన్‌ ఉంటుంది. దీంతో, వ్యాయామాలు చేస్తూ వీటిని తీసుకున్న వారి గుండె కణాల్లోకి ఒక్కసారిగా భారీ పరిమాణంలో కాల్షియం విడుదలై గుండెకొట్టుకోవడంలో వ్యత్యాసాలు తలెత్తుతాయి. అంతేకాదు, గుండె సంకోచవ్యాకోచాల సామర్థ్యమూ సన్నగిల్లుతుంది. ఆక్సిజన్‌ వినియోగ శక్తీ తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఎనర్జీపానీయాల వల్ల 'కెఫీన్‌ సిండ్రోమ్‌'తో గుండెకు చాలా చికాకులు తప్పవని మరోమారు హెచ్చరించారు.
బరువు తక్కువగా గలవారికీ మధుమేహం ముప్పు!
లండన్‌: మధుమేహ నివారణకు బరువు తగ్గితే చాలని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదని తాజా అధ్యయనంలో బయటపడింది. మధుమేహం ముప్పునకు సంబంధించి కేలరీల మోతాదులే కాదు.. ఎలాంటి ఆహారం తింటున్నామన్నదీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడైంది. బరువు ఎక్కువగా, బక్కపలచగా ఉన్న కవలలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఫాస్ట్‌ఫుడ్‌ తిన్న తర్వాత వీరిద్దరి రక్తంలోనూ మధుమేహంతో సంబంధం గల మెటబాలైట్ల వంటి సూక్ష్మ అణువులు ఒకే తీరుగా ఉంటున్నట్టు గుర్తించారు. మధుమేహం రావటానికి జన్యుపరమైన అంశాలు లేదా పేగుల్లోని బ్యాక్టీరియా తీరుతెన్నులు కారణం అవుతుండొచ్చని పరిశోధకులు తెలిపారు.
మూత్ర సమస్యకు వ్యాయామ కళ్లెం
వాషింగ్టన్‌: రాత్రిపూట మూత్రం పోయటానికి నిద్రలోంచి లేవాల్సి వస్తోందా? అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఎందుకంటే వారానికి గంట, అంతకన్నా ఎక్కువసేపు వ్యాయామం చేసే పురుషులకు ఈ సమస్య ముప్పు 13% తక్కువగా ఉంటున్నట్టు లయోలా విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. ఇలాంటి మూత్ర సమస్య మగవారిలో ఎక్కువ. ప్రోస్టేట్‌ గ్రంథి వాపు, మూత్రం ఎక్కువగా తయారు కావటం, మూత్రాశయ సామర్థ్యం తగ్గటం, నిద్రా భంగం వంటివి దీనికి దోహదం చేస్తాయి. 45 ఏళ్లు పైబడిన పురుషుల్లో 50 శాతానికి పైగా ఈ సమస్య బారినపడుతున్నారని అంచనా. ఇలాంటి మూత్ర సమస్యను నియంత్రించటానికి ఇతర పద్ధతులతో పాటు శారీరక శ్రమ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యయన నేత కేట్‌ వోలిన్‌ తెలిపారు.







0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again