పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 28, 2014

ఆర్థిక సంస్కరణలు

ఆర్థిక సంస్కరణలు

ఆర్థిక సంస్కరణలు/ సరళీకృత ఆర్థిక విధానాలు/  ఎల్‌పిజి విధానాలు
విదేశీ వస్తువులు, సేవలు, పెట్టుబడులు, ప్రైవేటురంగం పై 1991 నుంచి ప్రభుత్వం ఆంక్షలు, నియంత్రణలు ఎత్తి వేస్తూ వస్తోంది. ఈ ద్రవ్య విధానంలో చేస్తున్న మార్పులను ఆర్థిక సంస్కరణలు అంటారు. వాటిని కింది విధంగా విభజించవచ్చు.

    ఎ) పారిశ్రామికరంగ సంస్కరణలు
    బి) ప్రభుత్వరంగ సంస్కరణలు
    సి) విదేశీరంగ సంస్కరణలు
    డి) విత్తరంగ సంస్కరణలు       
    ఇ) ద్రవ్యరంగ సంస్కరణలు

పారిశ్రామికరంగ సంస్కరణలు
లైసెన్స్‌ విధానాల సరళీకరణ

-1991 జూలై 24న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు.
- 991 నూతన పారిశ్రామిక విధానంలో కేవలం 18 వస్తువులకు మాత్రమే లైసెన్స్‌ అవసరమని చెప్పారు.
ఆ సంఖ్యను   క్రమంగా తగ్గించారు.
-  ప్రస్తుతం అయిదు వస్తువులకు మాత్రమే లైసెన్స్‌ అవసరం ఎ) మత్తు పానీయాలు బి) పొగాకు ఉత్పత్తులు సి) ప్రమాదకర రసాయనాలు
    డి) పారిశ్రామిక పేలుడు పదార్థాలు ఇ) ఆయుధాలు -  మందుగుండు సామగ్రి.
పరిశ్రమల స్థల నిర్ణయంలో స్వేచ్ఛ
- 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో 10 లక్షల వరకు జనాభా నివసిస్తున్న ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం అనువుతి అవసరం లేదని తెలిపారు.
- పది లక్షల కన్నా ఎక్కువ జనాభా నివసిస్తున్న ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించడానికి అనుమతి అవసరం.
- 10 లక్షల కంటే ఎక్కువ జనాభా నివసిస్తున్న ప్రాంతాల్లో 35 కి.మీ. దూరంలో పరిశ్రమలు నెలకొల్పేలా అనుమతిస్తారు.
-10 లక్షల కన్నా ఎక్కువ జనాభా నివసిస్తున్నప్రాంతాల్లో కూడా కాలుష్యానికి కారణం కాని కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ లాంటి పరిశ్రమలను 25 కి.మీ. పరిధిలోనే స్థాపించవచ్చు.
ఎంఆర్‌టిపి చట్ట సవరణ (1991)
- ఎంఆర్‌టిపి చట్టాన్ని సవరించి 200 కోట్ల ఆస్తులు గల ఏకస్వావ్యు సంస్థలు విస్తరించడానికి, ఇతర సంస్థలతో కలిసిపోవడానికి, ఇతర సంస్థలు కొనుగోలు చేయడానికి కేంద్రప్రభుత్వ అనువుతి అవసరం లేకుండా చేశారు.
ప్రభుత్వరంగ సంస్కరణలు
ఎ) డి రిజర్వేషన్‌

- 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో 17 వస్తువులను ప్రభుత్వరంగానికి రిజర్వు చేయగా ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో కేవలం 8 వస్తువులను ప్రభుత్వ రంగానికి రిజర్వు చేశారు. ఆ సంఖ్యను కూడా క్రమంగా తగ్గించారు.
- ప్రస్తుతం రెండు వస్తువులు మాత్రమే ప్రభుత్వరంగ గుత్తాధిపత్యంలో ఉన్నాయి.  1) అణుశక్తి 2) రైల్వే రవాణా
బి) ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థలను బిఐఎఫ్‌ఆర్‌(1987)కు నివేదించడం
- ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థలను బిఐఎఫ్‌ఆర్‌ (బోర్డ్‌ ఆఫ్‌ ఇండస్ర్టియల్‌ ఫైనాన్షియల్‌ రీకన్స్‌స్ట్రక్షన్‌-1987)కు నివేదించాలని తీర్మానించారు.
- బిఐఎఫ్‌ఆర్‌ ఖాయిలా పడిన సంస్థలను అధ్యయనం చేసి సంస్థ పునర్‌ నిర్మాణానికి గల అవకాశాలపై సిఫార్సు చేస్తుంది.
సి)     ఎంఓయు కుదుర్చుకోవడం
-1986లో ‘అర్జున్‌ సేన్‌ గుప్తా కమిటీ’ సిఫార్సుల మేరకు ప్రభుత్వరంగ సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకోవడం ఆరంభించింది.
- ఎంఓయు పద్ధతి కింద ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలకు కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఆ లక్ష్యాల సాధన ఆధారంగా ఆ సంస్థ స్థాయిని నిర్ణయిస్తుంది.
-1987-88లో నాలుగు ప్రభుత్వరంగ సంస్థలు, 2010-11లో 202 సంస్థలు ఎంఓయు కుదుర్చు కున్నాయి. (2011 వూర్చి 31 నాటికి 248 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. 1950లో కేవలం అయిదు ఉండేవి.
- 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ఎంఓయు పద్ధతిని కొనసాగించాలని తెలుపుతూనే లాభాలతో నడిచే ప్రభుత్వరంగ సంస్థలకు మరింత స్వేచ్ఛను ఇవ్వాలని నిర్ణయించింది.
డి) స్వయం ప్రతిపత్తి
- ఆర్థిక సంస్కరణల్లో భాగంగా లాభాలను ఆర్జిస్తూ తమతమ రంగాల్లో నాయకత్వ పాత్ర పోషిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని నిర్ణయించారు.
-1997లో మొదటిసారి 9 సంస్థలకు స్వయం ప్రతిపత్తినిచ్చారు. దీనినే నవరత్న హోదా అంటారు.
-1997లో నవరత్న హోదా పొందిన సంస్థలు
    1) ఐఓసి 2) హెచ్‌పిసిఎల్‌ 3) బిపిసిఎల్‌  4) ఓఎన్‌జిసి 5) ఐపిసిఎల్‌ 6) విఎస్‌ఎన్‌ఎల్‌  7) ఎస్‌ఎఐఎల్‌ 8) ఎన్‌టిపిసి 9) బిహెచ్‌ఈల్‌ (ఎలక్ర్టానిక్స్‌)
- పైవాటిలో ఐపిసిఎల్‌, విఎస్‌ఎన్‌ఎల్‌లను ప్రైవేటీకరించారు. ఐపిసిఎల్‌ - రిలయన్స్‌కు విఎస్‌ఎన్‌ఎల్‌ను టాటాకు అమ్మారు.
- ఆ తరవాత మరికొన్ని సంస్థలకు నవరత్న హోదా కల్పించారు. అవి-
1)     GAIL 2) MTNL 3) NALCO 4) BEL 5) HAL 6) PFC (Power Finance Corporation) 7) NMDC 8) SCIL (Shipping Corporation of India Ltd) 9) PGCIL (Power Grid Corporation of India Ltd) 10) CIL 11) REC (Rural Electrification Corporation Ltd)
- 2010-11లో ఆయిల్‌ ఇండియా,  రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్ లిమిటెడ్‌లకు, 2011లో నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌కు నవరత్న హోదా కల్పించారు.
ఇ)     మహారత్న హోదా
-  మూడు సంవత్సరాల క్రమం తప్పకుండా రూ. 5000 కోట్ల కంటే ఎక్కువ వార్షిక లాభాలను ఆర్జించిన నవరత్న సంస్థలకు 2009లో  మహారత్న హోదా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం 2010 IOC Ltd, NTPC Ltd, ONGC Ltd., SAILలకు, 2011లో కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు  మహారత్న హోదానిచ్చారు. ఆ రకంగా ప్రస్తుతం  మహారత్న హోదా పొందిన నవరత్నాలు ఐదు ఉండగా కేవలం నవరత్న హోదాలో 16 సంస్థలున్నాయి.
ఎఫ్‌) మినీరత్న హోదా
- 1997లోనే మినీరత్న-1, మినీరత్న-2 కింద కొన్ని సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. మినీరత్న-1 కింద గతంలోని మూడు సంవత్సరాల్లో ఏదేని ఒక సంవత్సరం కనీసం రూ.30 కోట్ల వార్షిక లాభం ఆర్జించిన సంస్థలు, మినీరత్న-2 కింద గత మూడు సంవత్సరాలుగా లాభాలను ఆర్జిస్తున్న సంస్థలు.
-  2010-11లో బ్రిడ్జి అండ్‌ రూఫ్‌ కంపెనీ లిమిటెడ్‌, భారత్‌ పంప్స్‌ అండ్‌ కంప్రెషర్స్‌ లిమిటెడ్‌, నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు మినీరత్న హోదా ఇచ్చారు.
- 2010 డిసెంబర్‌ నాటికి 62 సంస్థలు మినీరత్న హోదాను కలిగి ఉన్నాయి. అందులో 47 మినీరత్న-1, 15 మినీరత్న-2గా ఉన్నాయి.
జి) పెట్టుబడుల ఉపసంహరణ
- 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రభుత్వ వాటాను ఉపసంహరిస్తామని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 1991-92 బడ్జెట్‌ లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2500 కోట్లు వనరుల సమీకరణ జరపాలని భావించారు.
- 1993లో పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని పరిశీలించడం కోసం డాక్టర్‌ సి.రంగరాజన్‌ కమిటీని వేశారు.
-1996లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్వహణ కోసం జి.వి.రావుకృష్ణ ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ ఏర్పాటు చేశారు.
- 1998-99 ఆర్థిక సంవత్సరం వరకు ప్రభుత్వరంగ సంస్థల్లో గరిష్ఠంగా 49 % వాటాను మాత్రమే అమ్మారు.
- 1999-2000 నుంచి 2000-01 వరకు గరిష్ఠంగా 74 % వాటాను మాత్రమే అమ్మారు. ఆ తరవాత అంతకంటే ఎక్కువ అమ్మడం ఆరంభించారు.
- 2003-04లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.14,500 కోట్లు కాగా ఉపసంహరించిన మొత్తం 15,545 కోట్లు (లక్ష్యాన్ని అధిగమించారు)
-  2011-12లో రూ.40,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం కాగా రూ.14,000 కోట్లు సాధించారు. 2012-13 సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.30,000 కోట్లు.
విదేశీ సంస్కరణలు
1) విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు తొలగింపు
- 1991 సంత్సరానికి పూర్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని గరిష్ఠంగా 40 % మాత్రమే దేశంలో అనుమతించే వారు.
- 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 34 % అధిక ప్రాధాన్యం గల పరిశ్రమ ల్లో 51 % పెంచారు.
- ఆ తరవాత క్రమంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని 100 % అనుమతించారు.
ప్రస్తుతం విదేశీ పెట్టుబడిని నిషేధించిన రంగాలు:
ఎ) అణుశక్తి బి) లాటరీ వ్యాపారం సి) గాంబ్లింగ్‌ అండ్‌ బెట్టింగ్‌ డి) చిట్‌ఫండ్‌ ఇ) నిధి ఎఫ్‌) ఏదైనా ప్రైవేటు రంగానికి అనుమతించని రంగం.
20 % విదేశీ పెట్టుబడిని అనుమతిస్తున్న రంగాలు:
ఎ) ఎఫ్‌ ఎం రేడియో (బ్రాడ్‌ కాస్టింగ్‌)
గరిష్ఠంగా 26 % విదేశీ పెట్టుబడిని అనుమతిస్తున్న రంగాలు
1) రక్షణ ఉత్పత్తులు
2) న్యూస్‌ టీవీ ఛానల్స్‌
40 % విదేశీ పెట్టుబడిని అనుమతిస్తున్న రంగాలు
ఎ) ప్రభుత్వరంగ రిఫైనరీలు (ప్రైవేటు రంగ రిఫైనరీలకు 100 % అనువుతి)
49 % విదేశీ పెట్టుబడిని అనుమతిస్తున్న రంగాలు
    ఎ) షెడ్యూల్డ్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసులు (కాలపట్టిక పాటించే వాయు రవాణా సర్వీసులు) (ఎన్‌ఆర్‌ఐలు అయితే 100 %)
    బి) Asset Reconstruction Company (ఆస్తుల పునర్‌ నిర్మాణ సంస్థలు)
    సి) కేబుల్‌ నెట్‌వర్క్‌ డి) డిటిహెచ్‌
    ఇ) క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ
    ఎఫ్‌) బీమా రంగం
51% అనుమతిస్తున్న రంగం
-    రిటైల్‌ (మల్టీ బ్రాండ్‌) వర్తకం
గరిష్ఠంగా 74 % విదేశీ పెట్టుబడిని అనుమతిస్తున్న రంగాలు
    ఎ) నాన్‌ షెడ్యూల్డ్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసులు (ఎన్‌ఆర్‌ఐలు అయితే 100 %)
బి)     రేడియో పేజర్స్‌
సి)    శాటిలైట్‌ స్థాపన, నిర్వహణ, బ్యాంకింగ్‌, టెలీ కమ్యూనికేషన్స్
100 % విదేశీ పెట్టుబడిని అనుమతిస్తున్న ప్రముఖ రంగాలు
1)     వ్యవసాయ రంగానికి సంబంధించి
    ఎ) ఫ్లోరికల్చర్‌ బి) విత్తనాల అభివృద్ధి
    సి) పాడి పశువుల పెంపకం డి) చేపలు, రొయ్యల పెంపకం
    ఇ) కూరగాయల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం. వీటికి తప్ప మిగిలిన ఏ వ్యవసాయరంగ ఉత్పత్తి లో విదేశీరంగ పెట్టుబడులను అనువుతించడంలేదు.
    2) టీ 3) ఖనిజాల తవ్వకం
    4) ఆల్కహాల్‌, సిగరెట్లు
    5) ప్రమాదకర రసాయనాలు
    6) ఔషధాలు, మందులు
    7) విద్యుత్‌ (అణు విద్యుత్‌ మినహా)
    8) గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ఫోర్ట్స్‌
    9) న్యూస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ కాని టీవీ ఛానల్స్‌
    10) రిటైల్‌ (సింగిల్‌ బ్రాండ్‌ వర్తకం)
2) దిగువుతి సుంకాల తగ్గింపు
-     ఆర్థిక సంస్కరణల్లో భాగంగా వ్యవసాయేతర దిగుమతులపై గల సుంకాలను క్రమంగా తగ్గిస్తున్నారు.
-     1990-91లో గరిష్ఠ దిగువుతి సుంకం 300ు ఉండగా 1991-92లో గరిష్ఠ దిగువుతి సుంకం 150 %కి తగ్గించారు.
-     ప్రస్తుతం విధానపరంగా ‘గరిష్ఠ దిగువుతి సుంకం 10%’
3) వ్యవసాయ వస్తువులు, జౌళి ఉత్పత్తుల దిగుమతులపై గల పరిమాణాత్మక ఆంక్షలు ఎత్తివేశారు.
4) విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేటప్పుడు ప్రభుత్వ అనువుతి తీసుకోవాలనే నిబంధనను తొలగించారు.
5) విదేశీ సాంకేతిక నిపుణులను వలస సంస్థల్లో నియమించుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాలనే నిబంధన తొలగించారు.
6) ప్రస్తుతి ఖాతాకు సంబంధించి స్వేచ్ఛా రూపాయి మార్పిడి పద్ధతిని ప్రవేశపెట్టారు.
-     విదేశీ కరెన్సీని వూర్కెట్‌లో నిర్ణయమైన రేటుకు దేశీయ కరెన్సీలోకి మార్పు చేసుకొనే అవకాశాన్ని కల్పించడమే ‘స్వేచ్ఛా రూపాయి మార్పిడి పద్ధతి’
    1991-92లో దృశ్య ఖాతాలోని 30 శాతానికి, 1992- 93లో దృశ్య ఖాతాలోని 60 శాతానికి, 1993-94లో దృశ్య ఖాతాలోని వంద శాతానికి,  1994-95లో మొత్తం ప్రస్తుత ఖాతాకు (దృశ్య+అదృశ్య) స్వేచ్ఛా రూపాయి మార్పిడి పద్ధతిని అనుమతించారు.
-     1991లో ఎగుమతులను పెంచి దిగుమతులను నియంత్రించే ఉద్దేశంతో రూపాయి విలువను కూడా తగ్గించారు.
మూల్యన్యూనీకరణ
-     ఒక దేశం తన కరెన్సీ విలువను విదేశీ కరెన్సీ విలువ తో పోల్చినప్పుడు ఉద్దేశపూర్వకంగా తగ్గించడం.
-     సాధారణంగా ఎగువుతులను పెంచి, దిగువుతులను తగ్గించే ఉద్దేశంతో ఒక దేశం తన కరెన్సీ విలువను తగ్గిస్తుంది.
మూల్యక్షయం తగ్గుదల: ఒక దేశం కరెన్సీ విలువ అంతర్జాతీయ మార్కెట్‌ శక్తుల కారణంగా తగ్గిపోవడం.
కరెన్సీ విలువ హెచ్చింపు: ఒక దేశం తన కరెన్సీ విలువను విదేశీ కరెన్సీ విలువతో పోల్చినప్పుడు పెంచడం.
మూల్యక్షయం పెరుగుదల: అంతర్జాతీయ మార్కెట్‌ శక్తుల కారణంగా ఒక దేశం కరెన్సీ విలువ పెరగడం.
7. మూలధన ఖాతా మార్పిడికి సంబంధించి ఎస్‌.ఎస్‌. తారాపోర్‌ కమిటీ 1996లో, 2006లోనూ నివేదికలు ఇచ్చింది. రెండుసార్లు కూడా మూలధన ఖాతా మార్పిడిని మూడు దశల్లో పూర్తిచేయాలని సూచించింది.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again