పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

November 29, 2014

కరెంట్ అఫైర్స్ - నవంబర్ 2014 Current Affairs - Nov'14


జాతీయం 
నవంబరు - 1
తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో 2006 జనవరిలో ఏర్పాటు చేసిన నోకియా కంపెనీని మూసివేశారు. ఈ యూనిట్ కార్యకలాపాలను నవంబరు 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ఈ సంస్థ ప్రకటించింది.
 29 అక్టోబర్ 2014న అల్ ఇండియా రేడియో దేశప్రజలకు ఉచితంగా వార్తలు అందించడానికి  మరో నాలుగు భారతీయ భాషలలో ఉచిత SMS న్యూస్ సేవలను ప్రారంభించింది. కేంద్ర సమాచార మరియు ప్రచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, న్యూ ఢిల్లీ లోని ఒక కార్యక్రమంలో దీనిని ప్రారంభించారు.
 కేంద్ర ప్రభుత్వం 30 అక్టోబర్ 2014న 1984 సిక్కుల ఊచకోత బాధితులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఈ నష్టపరిహారాన్ని ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు అందుకోనున్నారు.
 లోక్‌పాల్‌ ఎంపిక పానెల్ లో, ప్రతిపక్ష నేత తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం 30 అక్టోబర్ 2014న ప్రకటించింది. అందుకోసం లోక్‌పాల్‌ మరియు లోకాయుక్తల యాక్టు, 2013కు సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణలకు సంబంధించిన బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు, లోక్‌పాల్‌ యాక్టు యొక్క  4(1)(సి) సెక్షన్ ను సవరించనుంది.
నవంబరు - 2 
  ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశవాణిలో 'మన్‌కీ బాత్' కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 20 నిమిషాలపాటు సాగిన ఈ ప్రసంగంలో నల్లధనంతోపాటు వికలాంగులైన చిన్నారుల కోసం చేపడుతున్న చర్యలు, స్వచ్ఛభారత్, మాదక ద్రవ్యాలు, పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం లాంటి అంశాలను స్పృశించారు.
  బహిరంగ మల విసర్జనకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈల పాటతో ఆ వ్యక్తి సిగ్గుపడేలా చేసి మళ్లీ అలాంటి చర్యకు పాల్పడకుండా నివారించాలని నిర్ణయించింది.
 దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దిల్లీ - చెన్నై రైలు మార్గంపై అధ్యయనం మొదలైంది. ఏడాది లోపు ఇది పూర్తవుతుంది.
 దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసిని స్మార్ట్ హెరిటేజ్ సిటీగా మార్చేందుకు రూ.11,800 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
» దేశంలోని వంద నగరాలను 2019 నాటికి స్మార్ట్ సిటీలుగా మార్చాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.
నవంబరు - 3
 ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించిన 'మేకిన్ ఇండియా' కార్యక్రమానికి సహకరించడం ద్వారా అధిక ఉద్యోగాల కల్పన కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)తో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందం చేసుకుంది.
✿ 3 నవంబర్ 2014న రిటైర్డ్ జస్టిస్ A P షా నేతృత్వంలోని లా కమిషన్ మరో 73 వాడుకచట్టాల రద్దుకు కేంద్రానికి సిఫారసు చేసింది. దీంతో, అలా రద్దుకు సిఫార్సు చేయబడిన చట్టాల సంఖ్య 258కు పెరిగింది.
✿ సమాచార హక్కు (సహ) చట్టం కింద సమాచారాన్ని 'ఎలక్ట్రానిక్' పద్ధతిలో అందజేసే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
 ప్రధాని, ఆయన నియమించే ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఈ ముగ్గురూ కలిసి సీఐసీని ఎంపిక చేయాలని సహ చట్టం చెబుతోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరినీ గుర్తించనప్పుడు ఏకైక పెద్ద కూటమి నేతను ప్రతిపక్ష నేతగా భావించవచ్చని సహ చట్టం చెబుతోంది. ఆ ప్రకారం ఖర్గేను పరిగణనలోకి తీసుకున్నారు.
✿ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)లో సమూల మార్పులు చేయాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకోసం ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేసింది.
నవంబరు - 4 
✿ దిల్లీ శాసనసభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సిఫార్సు మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
✿ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఫిబ్రవరి 14న రాజీనామా చేయడంతో ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు. 
నవంబరు - 5 
✿ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అక్టోబరు 31 నాటికి కేంద్ర సమాచార కమిషన్ వద్ద 24,150 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. సహచట్టం కార్యకర్త వెంకటేష్ దరఖాస్తు మేరకు ఈ విషయం వెల్లడైంది.
✿ నాలుగు రాష్ట్రాల్లో మూతపడే స్థితిలో ఉన్న 23 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ)కు జవసత్వాలు కల్పించేందుకు రూ. 2375.42 కోట్ల మూలధనం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ బంగలో ఒకటి, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్రల్లో మూడు, ఉత్తరప్రదేశ్‌లో 16 లైసెన్సు లేని డీసీసీబీలు ఉన్నాయి.
✿ యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఫిబ్రవరి 19న ప్రవేశపెట్టిన ఆహార రక్షణ, ప్రమాణాల (సవరణ) బిల్లు-2014 ను ప్రభుత్వం ఉపసంహరించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 ✿ భారత పునర్వినియోగ ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ)లో రూ.వెయ్యి కోట్లుగా ఉన్న అధీకృత మూలధనాన్ని రూ.6 వేల కోట్లకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అధీకృత మూలధనం ఎక్కువగా ఉంటే, మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం పొందొచ్చు.
✿ ఇతర దేశాలను సంప్రదించకుండానే భారత నౌకలు అంతార్జాతీయ నౌకా రవాణా కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు వీలు కల్పించే అంతర్జాతీయ ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ విషయంపై వాణిజ్య నౌకా రవాణా (సవరణ) బిల్లు - 2013కు ప్రతిపాదించిన మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
✿ భారత్, నైజీరియా మధ్య ఖైదీల బదలాయింపునకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు దేశాల జైళ్లలో ఉన్న ఖైదీలు వారి శిక్షా కాలంలో మిగిలిన కాలాన్ని సొంత దేశంలో అనుభవించేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తోంది. భారత్ ఇప్పటి వరకు బ్రిటన్, మారిషస్, బ్రెజిల్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, శ్రీలంక, యూఏఈ, మాల్దీవులు, రష్యా తదితర దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంది.
 దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అసెంబ్లీని రద్దు చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి అంగీకారం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 ✿ ఉత్తరప్రదేశ్‌లో 'సమాజ్ వాదీ పింఛను' పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లక్నోలో ప్రారంభించారు.
 ✿ ప్రధాని నరేంద్రమోదీ తన నేతృత్వంలోని ఉన్నతస్థాయి 'వాతావరణ మార్పుల మండలి'ని పునర్వ్యవస్థీకరించారు
నవంబరు - 6 
 ✿ గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధికి ఉద్దేశించిన 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన' పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
వివిధ సంక్షేమ పథకాల అమలుకు పింఛనుదారుల సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీపీపీడబ్ల్యూ) 'సంకల్ప్' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

✿ సంకల్ప్ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు పింఛనుదారులు www.pensionersportal.gov.in/sankalp/ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. 
నవంబరు - 7 
✿ పొగాకు, వాటి ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. జర్దా, పాన్ మసాలా సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంజీ నిషేధం విధించారు.
నవంబరు - 8
✿ ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో పురోహితుల వలసలను నిరోధించేందుకు వారికి నెలకు రూ.800 చొప్పున పింఛన్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్(58) ప్రమాణ స్వీకారం చేశారు. పర్సేకర్‌తోపాటు 9 మంది మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా రాజధాని పనాజీలో ప్రమాణం చేయించారు.
నవంబరు - 9
✿ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తప్పనిసరిగా ఓటేయాలంటూ గుజరాత్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ ఆమోదించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని విస్తరించి, పునర్‌వ్యవస్థీకరించారు.
✿ ఇప్పటివరకు 45 మంది మంత్రులు ఉండగా, తాజా విస్తరణలో ఆ సంఖ్య 66కి చేరింది. వీరిలో ప్రధాని సహా 27 మంది కేబినెట్ హోదాలో ఉన్నారు. 13మంది సహాయ మంత్రులకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. మిగిలిన 26 మంది సహాయ మంత్రులు.
 ✿ ఉత్రరప్రదేశ్‌లోని ఫతేపూర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ సాధ్వీ నిరంజన్ జ్యోతి(47)కి సహాయమంత్రిగా చోటు కల్పించడంతో మోదీ కేబినెట్‌లో మహిళా మంత్రుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.
✿ 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని గెలిచిన రాజ్యవర్థన్‌సింగ్ రాఠోడ్‌ను మంత్రి పదివి వరించింది. కల్నల్‌గా సైన్యం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి భాజపాలో చేరిన రాఠోడ్ జైపూర్ గ్రామీణ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
నవంబరు - 10
✿ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు విమానయాన ముసాయిదా విధానాన్ని దిల్లీలో విడుదల చేశారు.
ప్రాంతీయ కనెక్టివిటీ, హైదరాబాద్ సహ ఆరు ప్రధాన మెట్రో ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ హబ్‌లుగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో మరిన్ని విమానాశ్రయాలను నిర్మించడం, విమాన ఇంధన ధరలను హేతుబద్ధీకరించడం, వాయు రవాణాను ప్రోత్సహించడం, విమానాల నిర్వహణ, మరమ్మతు సేవలు, హెలికాప్టర్ కార్యకలాపాలు, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం లాంటివి ముసాయిదా విధానంలో ఉన్నాయి.
✿ కేంద్ర ప్రభుత్వం 10 నవంబర్ 2014న, విదేశీ పర్యటనలకు వెళ్ళే బ్యూరోక్రాట్ల (ఉన్నతాధికారులు) పై నూతన పరిమితులను విధించింది. కేంద్ర ప్రభుత్వం వారి అధికారిక విదేశీ పర్యటనల సంఖ్యను సంవత్సరానికి నాలుగుకు తగ్గించింది.
 ✿ భారత పశుసంవర్థక మండలి (వీసీఐ)ని కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది.
✿ 10 నవంబర్ 2014న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పెన్షనర్లకోసం జీవన్ ప్రమాణ్ అనే ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను ప్రారంభించారు. ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన పెన్షన్ అందుకునే కోట్ల పెన్షనర్లుకు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.
✿ అత్యాధునిక ఈ రిక్షా ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దిల్లీలో ప్రారంభించారు.
దేశ పరిశుభ్రత కోసం రూపొందించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై ఛత్తీస్‌గఢ్‌లో తయారుచేసిన 36 వేల చదరపు అడుగుల అతిపెద్ద బ్యానర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆవిష్కరించారు.
 ✿ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో 'జీవన్ ప్రమాణ్' అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం ప్రకారం పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగులు పెన్షన్ కొనసాగింపు కోసం ప్రతీ నవంబరులో తాము జీవించే ఉన్నామని ధ్రువీకరించే లైఫ్ సర్టిఫికెట్‌ను సంబంధిత అధికారులకు అందించాల్సిన అవసరం లేదు అలాగే స్వయంగా అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం కూడా లేదు.

✿ పెన్షన్ పొందుతున్న ఉద్యోగి మొదట తన స్మార్ట్‌ఫోన్/కంప్యూటర్ లో తన ఆధార్ నంబర్, వేలిముద్రలు, కనుపాపలు మొదలైన బయోమెట్రిక్ వివరాలను రికార్డు చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఆ పెన్షనర్ పూర్తి వివరాలను సెంట్రల్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తారు. అవసరమైనప్పుడు తన దగ్గరున్న బయోమెట్రిక్ యంత్రంపై తన బయోమెట్రిక్ వివరాలను ఆ రిటైర్డ్ ఉద్యోగి నమోదు చేసినప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను పెన్షన్ పంపిణీ చేసే సంస్థ పొందగలుగుతుంది. పెన్షన్‌ను కొనసాగిస్తుంది దీని వల్ల వృద్ధులైన పెన్షనర్లు ఇంటి దగ్గరి నుంచే పెన్షన్ కొనసాగింపు సదుపాయాన్ని పొందవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రాచీన వైద్య విధానాలకు పెద్దపీట వేసే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్‌లో 'ఆయుష్‌'కు విడిగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.

 ✿ ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వీటన్నింటినీ కలిపి 'ఆయుష్' గా వ్యవహరిస్తారు. గతంలో ఆరోగ్య మంత్రిత్వి శాఖలో ఇది ఉండేది
నవంబరు - 11 
✿ కేంద్ర ప్రభుత్వం యొక్క విభాగమైన కేంద్ర హోం మంత్రిత్వశాఖ 11 నవంబర్ 2014న అస్సాం మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మిలిటెంట్ కార్యకలాపాలను నెరిపే కామతపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (కేఎల్ఓ) గ్రూప్ పై నిషేధాన్ని విధించింది. ఈ గ్రూప్ సార్వభౌమత్వ అధికారాలున్న ప్రత్యేక కామాతపూర్ కోసం పోరాడుతుంది. 
✿ కుటుంబ నియంత్రణ (కు.ని.) శస్త్ర చికిత్సలు వికటించడంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలోని పెండారి గ్రామంలో 11 మంది మహిళలు మరణించారు.
✿ దేశ సాంస్కృతిక, సామాజిక వారసత్వాన్ని, రక్షణ బలాన్ని ప్రతిబింబించేలా దిల్లీలో రాజ్‌పథ్‌పై జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో శకటాన్ని ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశం లభించింది.
✿ నిర్బంధ ఓటింగ్‌పై ఇటీవలే బిల్లు తెచ్చిన గుజరాత్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో మరుగుదొడ్లు తప్పనిసరని, లేని వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని స్పష్టం చేసింది. ఈ తీర్మానాన్ని గుజరాత్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
నవంబరు - 12
✿ ఏఐడీఎంకే అధినేత జయలలిత పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హురాలని తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ లో వెల్లడించింది.

జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీరంగం అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ అయినట్లుగా పరిగణిస్తామని తెలిపింది.
✿ రైళ్లను శుభ్రం చేయడంతోపాటు రైలు బోగీల్లో బయో మరుగు దొడ్లు, ఆధునిక యంత్రాలతో దుస్తులను శుభ్రం చేసే లాండ్రీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), ప్రైవేటు పెట్టుబడులను 17 విభాగాల్లో అనుమతించాలని రైల్వే నిర్ణయించింది.
✿ బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ అగ్రవర్ణాల ప్రజలంతా విదేశీయులేనని, వారు ఆర్యవంశానికి వారసులని.. కేవలం దళితులు, గిరిజనులే దేశీయ ప్రజలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 ✿ మహారాష్ట్ర శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ (భాజపా) ప్రభుత్వం మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో నెగ్గిందని సభాపతి హరిబాబు బాగ్దే ప్రకటించారు.
 ✿ భారత్‌కు తక్కువ పన్నులున్న అనేక దేశాలతో 'నేర న్యాయపరమైన ఒప్పందాలు' లేకపోవడంతో అక్కడ ఉన్న భారతీయుల నల్లధనం వెలికతీతలో అవరోధాలు ఎదురవుతున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోలీసులను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు నిర్బంధంలో ఉన్నవారికి ఓటు వేసే హక్కు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇలా నిర్బంధంలో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. ముందస్తు నిర్బంధంలో ఉన్న ఓటర్ల వివరాలను రిటర్నింగ్ అధికారులకు సంబంధిత అధికారులకు తెలియజేయాలని పేర్కొంది.
నవంబరు - 13
✿ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తోపాటు మరో పది మంది రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 ✿ ఆహార భద్రత అంశంలో భారత్‌కు గొప్ప విజయం లభించింది. ఆహార భద్రతపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)తో ఉన్న సమస్యలకు సంబంధించి భారత్ ప్రతిపాదనను అమెరికా అంగీకరించింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
నవంబరు - 14 
 ✿ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ నియోజక వర్గాల్లోని రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.

✿ సోనియా గాంధీ రాయ్‌బరేలీలోని జగత్‌పూర్ ప్రాంతానికి చెందిన ఉద్వా గ్రామాన్ని, రాహుల్ గాంధీ అమేథిలోని జగదీష్‌పూర్ ప్రాంతానికి చెందిన దీహ్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
✿ మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూరదర్శన్ తన నేషనల్ ఛానల్‌ను కొత్త సొబగులతో పునఃప్రారంభించాలని నిర్ణయించింది.

'దూరదర్శన్ నేషనల్ - మన దేశ ఛానల్' పేరుతో ప్రజలకు పునరంకితం చేస్తున్నట్లు దూరదర్శన్ ప్రకటించింది.
✿ దేశ రాజధాని దిల్లీలో 34వ 'భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఐఐటీఎఫ్) - 2014' ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఇందులో అన్ని రాష్ట్రాల పెవిలియన్లతోపాటు విదేశీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి.
✿ కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్ స్థానంలో సంస్కృతాన్ని చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 ✿ జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా దిల్లీలోని ఆయన స్మృతి చిహ్నం శాంతి వనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ; మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు పుష్పాంజలి ఘటించారు.
 ✿ జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలను దిల్లీలో ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ప్రారంభించారు.
✿ అక్షరాస్యతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కేరళ మరో ఘనత సాధించింది. దేశ ప్రజలందరికీ బ్యాంకు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన' లక్ష్యాన్ని అందుకోవడంలోనూ అగ్రస్థానంలో నిలిచింది.
✿ దేశంలోనే మొదటిసారిగా బెంగళూరు, మల్లేశ్వరంలోని మంత్రిమాల్‌లో రిమోట్ ఎఫ్ఐఆర్ సెంటర్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు.
నవంబరు - 16 
✿ దేశంలోనే తొలిసారి మావోయిస్టుల ఏరివేతకు మహిళా టీమ్‌లు రంగంలోకి దిగాయి. నక్సల్స్ ఏరివేతకు మహిళా ప్రత్యేక దళాలు అడవుల్లో మోహరించాయి. దీంతో మహిళా కమాండోలు ఉన్న దేశాల సరసన భారత్ కూడా చేరింది.
నవంబరు - 17
✿ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన 'హ్యపీ న్యూ ఇయర్' చిత్రం అరుదైన ఘనత సాధించింది.ప్రఖ్యాత ఆస్కార్ లైబ్రరీలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ తన శాశ్వత జాబితాలోకి అధికారికంగా తీసుకుంది.
✿ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పధకం  (PMJDY) కింద 100 శాతం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించిన, దేశంలోని మొదటి రాష్ట్రాలుగా గోవా మరియు కేరళ గుర్తింపు పొందినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 14 నవంబర్ 2014న ప్రకటించింది.వీటితో పాటు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు చండీగఢ్, పుదుచ్చేరి, లక్షద్వీప్ లు కూడా 100 శాతం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించాయి.
నవంబరు - 18
✿ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే దిశగా ఏర్పాటు చేసిన 'డిజిటల్ హంపి' ప్రదర్శన కార్యక్రమాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి దిల్లీలో ప్రారంభించారు.
✿ పౌరులలో చిన్నమొత్తాల పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు కిసాన్ వికాస్ పత్ర పథకం (KVP)ను కేంద్ర ప్రభుత్వం, న్యూ ఢిల్లీలో 18 నవంబర్ 2014న పునఃప్రారంభించింది.ఈ పథకం, వెంటనే దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల నియమించబడిన శాఖలు ద్వారా అందుబాటులో ఉంటుంది.
✿ కిసాన్ వికాస్ పత్రాలను (కేవీపీ) కేంద్ర ప్రభుత్వం మళ్లీ విడుదల చేసింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కేవీపీలను కొందరు మహిళా రైతులకు అందజేశారు.మొదటి దశలో పత్రాలపై కొనుగోలుదారుల పేరు లేకుండానే కిసాన్ వికాస్ పత్రాలను విక్రయిస్తారు. రూ.1000, రూ.5,000, రూ.10,000, రూ.50,000 విలువైన పత్రాలను విక్రయిస్తారు. ఈ పత్రాల్లో మదుపు చేసిన వారికి ఎలాంటి పన్ను రాయితీలు ఉండవు. ముందుగా తపాలా కార్యాలయాల్లో లభ్యమవుతాయి. తర్వాత ఎంపిక చేసిన ప్రభుత్వరంగ బ్యాంకు శాఖల్లో విక్రయిస్తారు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.
✿ దేశంలోనే తొలిసారిగా ఎబోలా కేసు నమోదైంది. లైబీరియా నుంచి దిల్లీకి వచ్చిన భారత్‌కు చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. బాధితుడిని దిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. 
నవంబరు - 20
✿ 2జీ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మక ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తు నుంచి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగించింది. ఈ కేసులోని కొంతమంది నిందితులను రక్షించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని వచ్చిన ఆరోపణల్లో ప్రాథమికంగా విశ్వసనీయత ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. 2జీ కుంభకోణం దర్యాప్తు బృందంలో సిన్హా తర్వాత సీనియర్ అయిన అధికారికి కేసు బాధ్యతలను అప్పగించింది.
✿ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన' గ్రామీణ విద్యుదీకరణకు రూ.43,033 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ఉన్న రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్‌జీజీవీవై) స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నారు.
✿ అణుధార్మికత తీవ్రతను నమోదు చేసేందుకు 100 ప్రధాన నగరాల్లో రేడియో ధార్మికత (రేడియేషన్) గుర్తింపు పరికరాల (డిటెక్టర్ల)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ అణుధార్మికత నమోదు పరికరాలను హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) తయారు చేస్తోంది.
✿ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ జాతీయ రహదారుల నిర్మాణ వ్యయంపై రాష్ట్రాలకు ఉన్న పరిమితిని రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచింది. రూ.100 కోట్ల వ్యయ పరిమితికి మించిన రహదారుల ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం అనుమతి తప్పనిసరి అని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
✿ దక్షిణ కొరియా నుంచి రూ.2700 కోట్లతో రెండు యుద్ధ నౌకలను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని రక్షణ మంత్రిత్వశాఖ రద్దు చేసుకుంది. సముద్రంలో మందు పాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు ఈ నౌకలను ఉపయోగిస్తారు.
నవంబరు - 21
✿ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను అతలాకుతలం చేసిన హుద్‌హుద్ తుపాన్‌ను కేంద్ర ప్రభుత్వం 'తీవ్రమైన విపత్తు'గా ప్రకటించింది.
నవంబరు - 22 
✿ కుంభకోణం కారణంగా బోఫోర్స్ శతఘ్నల ఒప్పందం బెడిసికొట్టిన తర్వాత 30 ఏళ్లకు సైన్యం కోసం కొత్తగా శతఘ్నల కొనుగోలుకు కేంద్రం నిర్ణయించింది.
2015 జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా జల వారోత్సవాలు నిర్వహిస్తామని, వాటిలోనే 'మన జిల్లా - మన జలాలు' కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి వెల్లడించారు. ప్రతి జిల్లాలోనూ జల సంరక్షణ తప్పనిసరైన ప్రాంతాన్ని గుర్తించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి వెల్లడించారు.
నవంబరు - 24
✿ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దివంగతులైన ముగ్గురు సభ్యులకు నివాళులర్పించిన అనంతరం ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే ఉభయ సభలు మరుసటి రోజుకు వాయిదాపడ్డాయి.
✿ ప్రధాని భార్యగా ప్రభుత్వం నుంచి ఎంత భద్రత పొందడానికి తనకు హక్కు ఉందో తెలియజేయాలంటూ నరేంద్రమోదీ సతీమణి జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద మెహ్‌సానా పోలీసులకు దరఖాస్తు చేశారు.
నవంబరు - 25
 ✿ జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.జమ్ముకశ్మీర్‌లోని 15 నియోజక వర్గాల్లో 71.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.ఝూర్ఖండ్‌లోని 13 నియోజకవర్గాల్లో దాదాపు 62 శాతం పోలింగ్ నమోదైంది.
 సీబీఐ డైరెక్టర్ ఎంపికకు సంబంధించి దిల్లీ ప్రత్యేక 'పోలీసు సంస్థాపన (సవరణ) చట్టం - 2014'ను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు
✿ 40 మంది కంటే తక్కువ కార్మికులున్న సంస్థలకు వర్తించే కార్మిక చట్టాల సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
 ✿ అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీలను ఒకే సంస్థ కిందికి తీసుకువచ్చే బిల్లును కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
 ✿ దేశంలో మధుమేహ రోగుల సంఖ్య 6.3 కోట్లకు చేరిందనీ, చైనా తర్వాత మన దేశంలోనే ఎక్కువ మంది మధుమేహ రోగులున్నారని ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా రాజ్యసభలో తెలిపారు.
 ✿ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. 'స్వచ్ఛ భారత్ కోశ్' పేరిట దీన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలను కూడా పేర్కొంది.
శీతాకాల సమావేశాల్లో సభ సజావుగా సాగాలనే ఉద్దేశంతో రాజ్యసభలోని ప్రశ్నోత్తరాల సమయాన్ని మార్చారు.
నవంబరు - 26
✿ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధిపతి నియామకానికి సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది.
✿ 'అప్రెంటీస్ (సవరణ) బిల్లు 2014'ను రాజ్యసభ మూజువాణి ఓటింగ్ ద్వారా ఆమోదించింది.
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సహా 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని 11 గంటలకు బదులు 12 గంటలకు మార్చాలనే ప్రతిపాదనకు సభ ఆమోదం లభించింది.
✿ 2014 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆదేశాలు (సవరణ) బిల్లును 27 నవంబర్ 2014న లోక్ సభ ఆమోదించింది. ఈ బిల్లు, నాలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులాలు వర్గం కింద మరిన్ని కులాలను చేర్చడంతోపాటు సిక్కిం లోని నుండి మళీ (నేపాలీ) కమ్యూనిటీని మినహాయించింది.
ఈ బిల్లు ప్రకారం షెడ్యూల్డ్ కులాలుగా చేర్చబడిన కమ్యూనిటీల జాబితా:
కేరళ: పుల్లువన్, థాచర్(వడ్రంగి కాకుండా ఉన్నవారు)
మధ్యప్రదేశ్: దహియా
ఒడిషా: అమత, అమాత్, బజియా, జగ్గిలి, జగ్లి, బునా పనో
త్రిపుర: చామర్-రోహిదాస్, చామర్-రవిదాస్, దోబీ, ఝాలో-మాలో
నవంబరు - 27 
✿ సీబీఐ అధిపతి నియామకానికి సంబంధించిన సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ కూడా ఆమోదించింది.
భారత సందర్శనకు వచ్చే అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్ తదితర 43 దేశాలకు చెందిన పర్యటకుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఈ-వీసా 30 రోజులు చెల్లుతుంది. ఏడాదిలో రెండు సార్లు దీన్ని పొందే అవకాశం ఉంది. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కోచీ, తిరువనంతపురం, గోవా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ-వీసా కార్యకలాపాలను నిర్వహిస్తారు.
రాష్ట్రీయం 
నవంబరు - 1
 ✿ భారతీయ మహిళా బ్యాంకు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రారంభించారు.
 ✿ ఆంధ్రప్రదేశ్‌లో 'జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (ఎన్‌యూఎల్ఎం)' అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పాలక మండలి ఏర్పాటైంది.
✿ శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలులో శిల్పారామాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది.
నవంబరు - 3
✿ హుద్‌హుద్ తుపాను సృష్టించిన విలయానికి దెబ్బతిన్న ఉత్తరాంధ్ర కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.400 కోట్లు మంజూరు చేసింది
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యాంత్రిక బొగ్గు రవాణా వ్యవస్థ (మెకనైజ్డ్ కోల్ యాండ్లింగ్ ప్లాంట్)ను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాధాకృష్ణన్ ప్రారంభించారు.
నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా నెల్లూరు జిల్లాలో భారీ ఎరువుల కర్మాగారాన్ని నిర్మించాలని ప్రముఖ ఎరువుల తయారీ కంపెనీ క్రిభ్ కో (క్రిషిక్ భారతి కో ఆపరేటివ్ లిమిటెడ్) నిర్ణయించింది.
నవంబరు - 6 
 ✿ హుద్‌హుద్ తుపాను తాకిడికి నాలుగు జిల్లాల్లోని 120 మండలాలు ప్రభావితమైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం డివిజన్లలో 43 మండలాలు; శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజన్ల పరిధిలో 38 మండలాలు; విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో 34 మండలాలు; తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో 5 మండలాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు ప్రభుత్వం పేర్కొంది.
నవంబరు - 7
✿ వ్యవసాయాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'హార్మోనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఫర్ ఏ ట్రాన్స్‌ఫార్మేషన్ ఎజెండా (హరిత)' పేరుతో కొత్త పథకానికి రూపకల్పన చేసింది.
నవంబరు - 8
✿ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీశైలం నుంచి తిరుపతి వరకు సుమారు 800 కిలోమీటర్ల పొడవున 3.5 నుంచి 35 కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉన్న నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతాలను విలీనం చేసి దేశంలోనే అతిపెద్ద టైగర్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నవంబరు - 9
✿ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘాన్ని ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళికస్థాన సూచి (జీపీఎస్ - గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) అమలుకు ప్రయోగాత్మక (పైలట్) ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు.
నవంబరు - 15
✿ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగదు బదిలీ పథకం ప్రారంభమైంది.

 ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగదు బదిలీ పథకాన్ని రెండు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు. నివాస అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లకు కేంద్రం ఇచ్చే సబ్సిడీని నగదు బదిలీ పథకం ద్వారా వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు.

ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం, కడప, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలను; తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలను ఎంపిక చేశారు.
నవంబరు - 17
✿ తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఎంపికైంది. రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు.
 తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రాన్ని వాటికన్ సిటీ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
నవంబరు - 18 
✿ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని ప్రాంతాన్ని ప్రకటించే అధికారంతో కూడిన రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
✿ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్, 18 నవంబర్ 2014న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ‘ఎన్.టి.ఆర్ వైద్య సేవ పథకం’ గా పేరు మార్చుతూ, ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను 2 లక్షల రూపాయల నుండి 2.5 లక్షల రూపాయలుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

✿ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్.టి.ఆర్ వైద్య సేవ పథకంగా పిలిచే ఈ పథకంలో మరో 100 వ్యాధులను జతచేయడం ద్వారా, వ్యాధుల సంఖ్యను 938 నుండి 1038 వరకు పెంచింది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి పథకాన్ని ఎన్.టి.ఆర్ పేరు మీద ‘ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి’గా మార్చింది.
నవంబరు - 21
✿ శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ విమానాల రాకపోకల కేంద్రానికి 'ఎన్టీఆర్ టెర్మినల్' అని పేరు పెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ శాసనసభ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని తీర్మానం చేసింది.
✿ తెలంగాణలో పి.వి.నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం చట్టాన్ని సవరించి ఈ వర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తేదీ నుంచి ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్, పశువైద్య కళాశాలలు కొత్త విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయని ప్రకటించింది.
నవంబరు - 22 
 ఆంధ్రప్రదేశ్‌లో 'భారతీయ వినోద నగరం (ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ - ఐఈసీ)'ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఈరోస్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (ఈఐఎల్)కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే ప్రపంచంలో అయిదోది, దేశంలో మొదటి అతి పెద్ద వినోద నగరం అవుతుంది.
నవంబరు - 25
✿ పాశ్చాత్య దేశాల్లో అధికంగా పండిస్తున్న కీన్‌వా (ఓ రకం తృణ ధాన్యం) పంటను తెలంగాణలోనూ పండించవచ్చని హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) శాస్త్రవేత్తలు తేల్చారు.
నవంబరు - 26
✿ హుద్‌హుద్ తుపాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పునరావాస కార్యక్రమాల కోసం 'బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్' అయిదు లక్షల డాలర్లు మంజూరు చేసింది.
తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.మండలి ఛైర్మన్‌గా మంద సదానందం గౌడ్; సభ్యులుగా సి.హెచ్.నారాయణరెడ్డి, వెంకటేష్ నియమితులయ్యారు.
 ✿ ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమ పర్యవేక్షణ, అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ దీనికి ఛైర్మన్‌గా ఉంటారు.
నవంబరు - 27
 ✿ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజక్ట్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ విధాన (టీఎస్ - ఐపాస్ : తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు.'మేడ్ ఇన్ తెలంగాణ' బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించింది. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే దీని లక్ష్యం.
ఆర్థికం 
నవంబరు - 4 
 ✿ భారత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ 'అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ నేషనల్ కౌన్సిల్ (ఎన్‌సీఏఈఆర్)' 5 శాతానికి తగ్గించింది.
నవంబరు - 7
 ✿ దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ భారత ఆర్థికవృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5.6 శాతానికే పరిమితం కావచ్చని లెక్కగట్టింది. ఆగస్టులో ఇదే సంస్థ భారత జీడీపీ 5.7 శాతంగా నమోదు కాగలదని అంచనా వేసింది.
నవంబరు - 10 
✿  చిన్న, మధ్య తరహా సంస్థలు(ఎంఎస్ఎంఈ) తమ ఉత్పాదకతను పెంచుకోవడంలో తోడ్పడే దిశగా ప్రపంచ బ్యాంకుతో భారత్ 200 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధులతో టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
✿  టెక్నాలజీ సెంటర్ సిస్టమ్ ప్రోగ్రామ్ (టీసీఎస్‌పీ)గా పిలిచే ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం దిల్లీలో సంతకాలు చేశాయి.
నవంబరు - 11 
✿  ఇ - కామర్స్ దిగ్గజం అలీబాబా ఆన్‌లైన్‌లో రికార్డు విక్రయాలను సాధించింది.

చైనాలో 'సింగిల్స్ డే' షాపింగ్ బొనాంజాలో ఒక్కరోజులోనే 9.34 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 56,000 కోట్లు)కు పైగా విక్రయాలు చేసి సంచలనం సృష్టించింది.
నవంబరు - 12
✿  సెప్టంబరులో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధి మూడు నెలల గరిష్ఠానికి చేరి 2.5 శాతంగా నమోదైంది. తవ్వక, తయారీ రంగాలు రాణించడమే దీనికి కారణం. కిందటి ఏడాది ఇదే నెలలో ఐఐపీ 2.7 శాతంగా ఉంది.
ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.52 శాతానికి పరిమితమైంది. ఆహార ద్రవ్యోల్బణ రేటు ప్టెంబరులో 7.67 శాతం ఉండగా, అక్టోబరులో 5.59 శాతంగా నమోదైంది.
నవంబరు - 14 
✿  అక్టోబరు నెలకు ద్రవ్యోల్బణం 1.77 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ఠ స్థాయి. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరల్లో క్షీణత, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రధాన పాత్ర వహించాయి.
నవంబరు - 16 
 ✿  షేర్ల క్రయ విక్రయాల లావాదేవీల (ఈక్విటీ ట్రేడింగ్‌లు) పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా అమెరికాకు చెందిన నాస్‌డాక్ ఓఎంఎక్స్ అవతరించింది. 2014లో ఇప్పటి వరకు జరిగిన మొత్తం లావాదేవీల సంఖ్య పరంగా ఇది అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

మన దేశానికి చెందిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) రెండో స్థానానికి పరిమితమైంది.
నవంబరు - 17
✿  ఆరు నెలల తర్వాత తొలిసారిగా భారత ఎగుమతులు ప్రతికూలంగా నయోదయ్యాయి. ఇంజినీరింగ్, ఔషధ, రత్నాభరణాల లాంటి ప్రధాన రంగాల్లో ఎగుమతులు కలిసి రాకపోవడంతో అక్టోబరులో భారత ఎగుమతులు 5.04 శాతం తగ్గాయి. 26.09 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బంగారం దిగుమతులు ఏకంగా 4.17 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో వాణిజ్య లోటు అక్టోబరులో 13.35 బిలియన్ డాలర్లకు పెరిగింది. గతేడాది అక్టోబరులో వాణిజ్య లోటు 10.59 బిలియన్ డాలర్లు మాత్రమే. అయితే సెప్టెంబరులో వాణిజ్య లోటు 14.24 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది తక్కువే.
నవంబరు - 19 
✿  ఆస్ట్రేలియా తయారీ విమానాలను భారత్‌లో విక్రయించడానికి మహీంద్రా గ్రూప్‌నకు అనుమతి లభించింది.మహీంద్రా గ్రూప్స్ విమానాలుగా పిలిచే ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లలో 5-10 సీట్లు ఉంటాయి. భారత నిబంధనల ప్రకారం సిబ్బంది కాకుండా, నలుగురు ప్రయాణికులకే అనుమతి ఉంది. కానీ తొమ్మిది మంది ప్రయాణికులకు మహీంద్రా సంస్థ అనుమతి కోరుతూ వస్తోంది. ఇప్పటికి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నిబంధనలను సవరణ చేయడంతో మహీంద్రాకు మార్గం సుగమం అయ్యింది.
నవంబరు - 20
✿  భారత్‌లోనే అతి పెద్ద బ్యాంకింగ్ విలీనానికి తెర తీసింది. దాదాపు రూ.15,000 కోట్లతో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను కొనుగోలు చేయనున్నట్లు కొటక్ మహీంద్ర బ్యాంకు ప్రకటించింది.
నవంబరు - 24
✿  ఫ్యాప్సీ (ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ఎఫ్ఏపీసీసీఐ)లో మహిళా విభాగం ఏర్పాటైంది.
AWARDS
నవంబరు - 3
✿  మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జపాన్ అత్యున్నత జాతీయ అవార్డు 'ద గ్రాండ్ కార్డాన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద పాలోనియా ఫ్లవర్స్' కు ఎంపికయ్యారు. ఈ పురస్కారానికి ఎంపికైన మొదటి భారతీయుడు ఈయనే.భారత్ - జపాన్ సంబంధాల బలోపేతానికి దాదాపు 35 ఏళ్ల పాటు కృషి చేసినందుకు ఈ అవార్డుకు మన్మోహన్‌ను ఎంపిక చేశారు.
నవంబరు - 4 
✿  చేతికి గడియారంలా చుట్టుకుని అవసరమైనప్పుడు గాల్లోకి ఎగిరి మనల్ని అనుసరిస్తూ మన స్వీయ చిత్రాలు (సెల్ఫీలు) తీసే వినూత్న డ్రోన్ 'నిక్సీ' కి ఇంటెల్ నిర్వహించిన 'మేక్ ఇట్ వియరబుల్' పోటీలో ప్రథమ బహుమతి లభించింది. రూ.3 కోట్ల నగదు బహుమతిని గెలుచుకుంది.
✿  భారత్ కల్చరల్ అకాడమీ, కొమరం భీమ్ స్మారక పరిషత్, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, ఓం సాయితేజ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'కొమరం భీమ్ జాతీయ అవార్డు'ను హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజకు ప్రదానం చేశారు.
నవంబరు - 5 
✿  భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ఏటా ఇచ్చే ఎల్జీ 'పీపుల్స్ ఛాయిస్' అవార్డుకు ఈ ఏడాది భువనేశ్వర్ ఎన్నికయ్యాడు.
నవంబరు - 6 
 ✿  నాగాలాండ్‌లోని వోఖా జిల్లాలోని పంగ్తి గ్రామ కౌన్సిల్‌కు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్) అవార్డు దక్కింది.
నవంబరు - 10 
✿  ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిల్లీలో 49వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 
నవంబరు - 11 
✿  వ్యవసాయం, జంతు, మత్స్య సంబంధ రంగాల్లో అవిరళ కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే ప్రసిద్ధ ఎం.ఎస్.స్వామినాథన్ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుందర్‌లాల్ గోస్వామి ఎంపికయ్యారు.
నవంబరు - 12
✿  కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) కి ప్రతిష్ఠాత్మక ఇందిరాగాంధీ అవార్డు లభించింది.
నవంబరు - 13
✿  పాత్రికేయ రంగంలో విశేష ప్రతిభను చూపేవారికి అందజేసే ఐపీఐ ఇండియా పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ దినపత్రిక 'హిందుస్థాన్ టైమ్స్', వారపత్రిక 'ది వీక్' ఎంపికయ్యాయి.

✿  మహిళలపై యాసిడ్ దాడులు ఆపాలంటూ గతేడాది ప్రచురించిన కథనాల ఆధారంగా 'హిందుస్థాన్ టైమ్స్‌'ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
 ✿  చెన్నైలోని సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్ ఖండే యుంకెల్లాకు ప్రతిష్ఠాత్మక నాయుడమ్మ పురస్కారాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అందజేశారు.
ఇందిరాగాంధీ జాతీయ సేవ పథకం పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఆరు అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు లభించాయి.
నవంబరు - 14 
✿  బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిభాశీలురు, సాహసవంతులైన 20 మంది పిల్లలకు, చిన్నారుల సంక్షేమానికి పాటుపడిన ఆరుగురు వ్యక్తులకు, నాలుగు సంస్థలకు జాతీయ అవార్డులను దిల్లీలో ప్రదానం చేశారు.
నవంబరు - 15
✿  రాజభాష హిందీని పటిష్టంగా అమలు చేస్తున్నందుకు విశాఖ ఉక్కు కర్మాగారానికి (ఆర్ఐఎన్ఎల్) ఇందిరాగాంధీ రాజభాష పురస్కారంలభించింది.

✿  దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ పురస్కారాన్ని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి.మధుసూదన్‌కు ప్రదానం చేశారు.
✿  అధికారిక భాష అమలు చేయడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్ఠాత్మకమైన రిజర్వ్ బ్యాంక్ రాజభాష పురస్కారాన్ని గెలుచుకుంది.
✿  దేశానికి సేవలు అందించినందుకు ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్‌ను 2014 సంవత్సరానికి కె.ఆర్.నారాయణన్ పురస్కారానికిఎంపిక చేశారు.
✿  హైదరాబాద్‌లోని భారత రసాయన పరిశోధన సంస్థ (ఐఐసీటీ) ప్రధాన శాస్త్రవేత్త, ప్రకృతి ఉత్పత్తుల విభాగాధిపతి శ్రీహరి చంద్రశేఖర్ 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్ పురస్కారానికి ఎంపికయ్యారు.
నవంబరు - 16 
✿  లోహ పరిశ్రమల్లో కంపెనీ నిర్వహణలో మంచి నైపుణ్యం, పనితీరు ప్రదర్శించినందుకు సెయిల్ ఛైర్మన్ సి.ఎస్.వర్మకు 2014 ఏడాదికి ఐఐఎం - జేఆర్‌డీ టాటా అవార్డు లభించింది.
నవంబరు - 17
✿  ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడు పండిట్ జస్‌రాజ్‌కు 'సుమిత్రా చరత్ రామ్' జీవిత సాఫల్య పురస్కారాన్ని దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రదానం చేశారు.
నవంబరు - 18 
 ✿  ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, డా. సుద్దాల అశోక్ తేజకు గురజాడ విశిష్ట పురస్కారం (2014)ను ప్రదానం చేయనున్నట్లు గురజాడ సాంస్కృతిక సమాఖ్య (విజయనగరం) ఓ ప్రకటనలో తెలిపింది.
నవంబరు - 19 
✿  2014 - ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి అవార్డు'ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రకటించారు.మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంతో అద్భుతమైన విజయాన్ని సాధించడం, అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకు వినియోగించుకోవడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం లాంటి వాటికి గుర్తింపుగా ఇస్రోకు ఈ అవార్డును ఇస్తున్నట్లు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన ఏర్పడిన న్యాయనిర్ణేతల బృందం ప్రకటించింది. విస్తృతమైన, సుస్థిరమైన సామాజిక, ఆర్థిక అభివృద్ధిలోనూ, ముఖ్యంగా గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు అధునాతన పరిజ్ఞానాలను వినియోగించడంలోనూ ఇస్రో పోషించిన పాత్రను కూడా న్యాయ నిర్ణేతలబృందం ప్రత్యేకంగా పేర్కొంది. 
నవంబరు - 21 
✿  ప్రతిష్ఠాత్మక బీసీసీఐ అవార్డులను ముంబయిలో ప్రదానం చేశారు.
భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్‌కు ప్రదానం చేశారు.
పాలీ ఉమ్రిగర్ అవార్డును భువనేశ్వర్ కుమార్‌కు ప్రదానం చేశారు.
రంజీల్లో ఉత్తమ ఆల్‌రౌండ్ పదర్శనకు ఇచ్చే లాలా అమర్‌నాథ్ అవార్డు ను పర్వేజ్ రసూల్‌కు ప్రదానం చేశారు.
రంజీల్లో అత్యధిక పరుగులు సాధించినందుకు ఇచ్చే మాధవ రావ్ సింధియా అవార్డు ను కేదార్ జాదవ్‌కు అందించారు.
నవంబరు - 24
✿  లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం - 2015కు ప్రముఖ సాహితీ వేత్త, సినీనటుడు గొల్లపూడి మారుతీ రావు ఎంపికయ్యారు.ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జనవరి 18న విశాఖపట్నంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
నవంబరు - 26
✿  వ్యయాలను అదుపు చేయడంలో ఉన్నత ప్రమాణాలను సాధించినందుకు అమరరాజ బ్యాటరీస్‌కు 'ఎక్స్ లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్'జాతీయ అవార్డు లభించింది.
క్రీడలు 
నవంబరు - 1
✿  అర్థంతరంగా భారత పర్యటనను రద్దు చేసుకున్నందుకు రూ.250 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ లేఖ రాసింది.
నవంబరు - 3
✿  ఐపీఎల్ - 6 బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ పూర్తిచేసిన జస్టిస్ ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించింది.
నవంబరు - 4 
✿  ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో దక్షణాఫ్రికా ఆటగాడు ఫిలాండర్ రెండో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ క్రీడాకారుడు షకిబ్ అల్‌ హసన్ మూడో స్థానంలో నిలిచాడు.
✿  యూఏఈలోని అల్ అలిన్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షూటర్ రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్ తనయుడు మానవాదిత్య రాఠోడ్ స్వర్ణం నెగ్గాడు.
✿  జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు తొలి స్వర్ణం లభించింది.పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో కె.ప్రేమ్ కుమార్ విజేతగా నిలిచాడు.
✿  హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రాకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) 'ప్రెసిడెంట్స్' పురస్కారం లభించింది
నవంబరు - 5
✿  ఐసీసీ ఏటా ప్రకటించే వన్డే, టెస్టు వార్షిక జట్లను ప్రకటించింది.
నవంబరు - 7 
✿  శ్రీలంకపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానాన్ని పొందింది.
✿  బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో సెంచరీ, పది వికెట్లు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పౌలా రాడ్‌క్లిఫ్ 'దిల్లీ హాఫ్ మారథాన్‌'కు ఈవెంట్ అంబాసిడర్‌గా ఎంపికైంది.
నవంబరు - 8
✿  రష్యాలోని సోచిలో ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి.
జాతీయ సీనియర్ స్క్వాష్ పురుషుల టైటిల్‌ను హరిందర్ పాల్ సింగ్ సంధు కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో సౌరభ్ ఘోషల్‌ను ఓడించి, తన కెరీర్‌లో తొలి జాతీయ టైటిల్‌ను సాధించాడు.
 ✿  ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్ కప్‌ను సల్గావ్‌కర్ జట్టు సొంతం చేసుకుంది.
 దిల్లీలో జరుగుతున్న ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం ధూళిపాళ్ల బాలచంద్ర ప్రసాద్ అండర్ - 18 ర్యాపిడ్ విభాగంలో రజిత పతకాన్ని నెగ్గాడు.
నవంబరు - 9
✿  సోచిలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ రెండో గేమ్‌లో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి చెందాడు.
నవంబరు - 10 
✿  వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే వన్డే ప్రపంచ కప్ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 20 శాతం పెంచింది. దీంతో టోర్ని మొత్తం ప్రైజ్‌మనీ 11.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.71 కోట్లు) కు చేరింది.
నవంబరు - 11 
✿  ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మూడో గేమ్‌లో విశ్వనాథన్ ఆనంద్ డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)పై విజయం సాధించాడు ఈ విజయంతో ఆనంద్ 1.5 పాయింట్లతో కార్ల్‌సన్‌ను సమం చేశాడు.
 ✿  హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ సంఘంతో కలిసి భారత క్రికెటర్ యువరాజ్‌ సింగ్ బిలాస్‌పూర్‌లో 'యువరాజ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్' పేరిట క్రికెట్ అకాడమీని ఆరంభించాడు. 
నవంబరు - 12
✿  సోచీలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్, కార్ల్‌సన్ మధ్య జరిగిన నాలుగో గేమ్ డ్రాగా ముగిసింది.
నవంబరు - 13
✿  కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 153 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

 ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. రోహిత్ కెరీర్‌లో ఇది రెండో డబుల్ సెంచరీ, డబుల్ డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు

గతేడాది నవంబరు 2న ఆస్ట్రేలియాపై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ 209 పరుగులు చేసి తొలిసారి డబుల్ సెంచరీ కొట్టాడు.
నవంబరు - 14
✿  సోచిలో విశ్వనాథన్ ఆనంద్ (భారత్), మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అయిదో గేమ్ కూడా డ్రాగా ముగిసింది.
నవంబరు - 15
✿  రష్యాలోని సోచిలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఆరో గేమ్‌లో విశ్వనాథన్ ఆనంద్‌పై కార్ల్‌సన్ గెలిచాడు.
✿  చైనాలోని ఫిజౌలో జరుగుతున్న చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌కు చేరుకున్నారు.
నవంబరు - 16
✿  బ్యాడ్మింటన్ చరిత్రలో పెనుసంచలనం నమోదు అయ్యింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ ఛాంపియన్ చైనా దిగ్గజం ఆటగాడు లిన్‌డాన్‌ను ఓడించాడు. వరుస గేముల్లో 21 - 19, 21 - 17తో టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. శ్రీకాంత్ గుంటూరుకు చెందిన క్రీడాకారుడు.
 ✿  చైనా ఓపెన్ సూపర్ సిరీస్ మహిళల టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సైనా నెహ్వాల్ నెగ్గింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో సైనా 21 - 12, 22 - 20తో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిని ఓడించింది. ఆరుసార్లు చైనా ఓపెన్‌లో పాల్గొన్న సైనాకు ఇదే తొలి టైటిల్.
నవంబరు - 17
✿  ఆనంద్, కార్ల్‌సన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఏడోగేమ్ డ్రాగా ముగిసింది.
✿ ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన ముద్గల్ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఐసీసీ ఛైర్మన్, బీసీసీఐ మాజీ అధ్యక్షులు ఎన్. శ్రీనివాసన్‌కు ముద్గల్ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్‌కుంద్రా చట్ట వ్యతిరేకమైన బెట్టింగ్‌కు పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది.
నవంబరు - 18 
 ✿  రష్యాలోని సోచిలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆనంద్, కార్ల్‌సన్ మధ్య జరిగిన ఎనిమిదో గేమ్ డ్రా గా ముగిసింది.
నవంబరు - 20
✿  సోచిలో ఆనంద్, కార్లసన్‌ల మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ తొమ్మిదో గేమ్ డ్రా గా ముగిసింది.
నవంబరు - 21 
✿  దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య మహిళల ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్ నిలిచింది.
 ✿  రష్యాలోని సోచిలో విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పదో గేమ్ కూడా డ్రా గానే ముగిసింది.
భారత సైక్లింగ్ స్టార్ క్రీడాకారిణి డెబోరా ఆసియా కప్ టోర్నీలో స్వర్ణం సాధించింది
నవంబరు - 23
✿  రష్యాలోని సోచిలో విశ్వనాథన్ ఆనంద్ (భారత్), మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే) మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 11వ గేమ్‌లో ఆనంద్ ఓటమి పాలయ్యాడు. దీంతో నార్వే యువ సంచలనం మాగ్నస్ కార్ల్‌సన్ రెండోసారి జగజ్జేతగా నిలిచాడు.
 ✿  టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్‌కు తొలి డేవిస్ కప్ అందించాడు
 బ్రిటన్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ - 2014 ప్రపంచ ఛాంపియన్‌షిన్‌గా నిలిచాడు.
నవంబరు - 24
✿  2016 రియో డి జనీరో (బ్రెజిల్) లో జరిగే ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు మస్కట్లు సిద్ధమయ్యాయి. ఒలింపిక్స్ మస్కట్ బ్రెజిల్‌లోని జంతువుల జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటే, పారాలింపిక్స్ మస్కట్ బ్రెజిల్ దేశ వృక్ష సంపదకు ప్రతీకగా ఉంది.
 ✿  కొరియాలోని జిజులో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు సర్జుబాల (48 కేజీల విభాగం), స్వీటీ (81 కిలోల విభాగం) రజతాలు నెగ్గారు.
నవంబరు - 25
✿ కర్ణాటక జట్టు విజయ్ హజారే టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో కర్ణాటక 156 పరుగుల తేడాతోపంజాబ్‌ను చిత్తు చేసింది. ఈ టోర్నీని అహ్మదాబాద్‌లో నిర్వహించారు.
నవంబరు - 26
✿ అంతర్జాతీయ స్టార్లతో, కొత్త ఫార్మాట్‌తో భారత్‌లో ఆరంభమైన ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) తొలి అంచెను పుణె మారాఠాస్ కైవసం చేసుకుంది.
బాక్సర్ మనోజ్ కుమార్ ఎట్టకేలకు అర్జున అవార్డును అందుకున్నాడు. కేంద్ర క్రీడల మంత్రి శర్భానంద సోనోవాల్ ఈ అవార్డును దిల్లీలో మనోజ్‌కు ప్రదానం చేశారు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again