పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 18, 2014

1857 తిరుగుబాటు

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖ చారిత్రక సంఘటనల్లో విప్లవాత్మకమైంది, విశిష్టమైంది 1857 తిరుగుబాటు. బ్రిటిష్ పరిపాలనలో భారతదేశంలో చోటుచేసుకున్న హింసాకాండ, దోపిడీల పర్యవసానమే ఈ తిరుగుబాటు. బ్రిటిష్‌వారు భారతీయులను నీళ్లుతోడే కార్మికులుగానో, కలప కొట్టే కూలీలుగానో భావించడం, సగం నీగ్రోలుగా పిలవడం లాంటి అంశాలను ప్రజలు సహించలేదు. భారత ప్రజలు రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయిన దానికంటే, భారతీయులను తక్కువ చేసి చూడటం, అవమానించడం, కొట్టడం, చంపడం లాంటి కారణాలతో తిరుగుబాటు ఉద్ధృతమైంది. యూరోపియన్లు దీన్ని సిపాయిల తిరుగుబాటనీ, క్రైస్తవులకు వ్యతిరేకంగా కొందరు మత దురభిమానులు సాగించిన యుద్ధమని, జాతుల మధ్య పోరాటమనీ, నాగరికతకూ, ఆటవికతకు మధ్య జరిగిన సంఘర్షణ అనీ, అనేక విధాలుగా పేర్కొన్నారు. భారత జాతీయవాదులూ, చరిత్రకారులు 1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా అభివర్ణించారు.

కారణాలు
రాజకీయ కారణాలు: భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఆంగ్లేయులు అనేక పద్ధతులను అవలంభించారు. యుద్ధాలు, సైనిక సహాయ ఒప్పందాలు, అరాచకం ప్రబలిందనే నెపంతో రాజ్య విస్తరణ చేశారు. మహారాష్ట్రులు, మైసూరు పాలకులు, సిక్కులను ఓడించి వారి రాజ్యాల్ని ఆక్రమించుకున్నారు.

రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా డల్హౌసీ సతారా, నాగ్‌పూర్, ఝాన్సీ లాంటి రాజ్యాల్ని విలీనం చేశాడు. అయోధ్యను కంపెనీ పరిధిలోని రాజ్యంలో అంతర్భాగం చేశాడు. పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్‌కు భరణాన్ని నిరాకరించాడు. రెండో బహదూర్‌షా అనంతరం మొఘల్ పీఠం రద్దవుతుందని లార్డ్ కానింగ్ ప్రకటించాడు. అయోధ్య విలీనం మహ్మదీయుల అసంతృప్తికి ప్రత్యేక కారణమైంది. అయోధ్య తిరుగుబాటులో ముఖ్యపాత్ర వహించింది. అసంతృప్తికి లోనైన స్వదేశీ రాజులు 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు.
ఆర్థిక కారణాలు: బ్రిటిష్‌వారు బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల భారతదేశం ఆర్థికంగా దిగజారిపోవడం ప్రారంభమైంది. శాశ్వత భూమిశిస్తు విధానం, పెద్దమొత్తంలో చెల్లించాల్సిన పన్నులు, రుణభారం, శాసన వ్యవస్థ, వ్యవసాయంపై పెరిగిన అధిక ఒత్తిడి ఇవన్నీ రైతుల పరిస్థితిని దిగజార్చాయి. ఫలితంగా బ్రిటిషర్లపై ప్రజల్లో ద్వేషం పెరిగింది. యంత్రాలపై తయారైన వస్త్రాలు ఇంగ్లండ్ నుంచి దిగుమతి కావడం స్వదేశీ చేనేత కార్మికులను కోలుకోలేనంత దెబ్బతీసింది. బ్రిటిష్‌వారి పాలనలో భారతదేశం పారిశ్రామిక విప్లవానికే కాకుండా వాణిజ్యపరమైన దోపిడికి కూడా గురైంది. అవుద్ ఆక్రమణతో దాదాపు 60 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. స్వదేశీ రాజ్యాలు, రాజులు అంతరించడంతో ఉద్యోగులు, గాయకులు, కవులు, విద్వాంసులు నిరుద్యోగులై బ్రిటిష్‌వారిపై ద్వేషభావంతో తిరుగుబాటులో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.

సాంఘిక కారణాలు: ఈస్టిండియా కంపెనీ లార్డ్ బెంటింక్ కాలం నుంచి లార్డ్ డల్హౌసీ కాలం వరకు అనేక సాంఘిక సంస్కరణలను ప్రవేశపెట్టింది.
బెంటింక్ కాలం నాటి సతీసహగమన నిషేధ చట్టం, మతం మార్చుకున్నా ఆస్తిలో హక్కు కల్పించే చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, వితంతు పునర్వివాహ చట్టం లాంటి సంస్కరణలు సనాతన ధర్మానికి విరుద్ధమని ప్రజలు భావించారు. డల్హౌసీ కాలం నాటి ఆధునికీకరణ, రైల్వే, తంతి, తపాల ఏర్పాట్లు ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి. ఈ మార్పుల వల్ల తమ ఆచారబద్ధమైన ప్రాచీన సమాజం కూలిపోతుందని సనాతనులు ఆందోళన చెందారు.

మత కారణాలు: బ్రిటిష్‌వారు తమను క్రైస్తవ మతంలోకి మార్చడానికి కుట్ర జరుపుతున్నారనే అనుమానం భారతీయుల మనస్సులో నాటుకుంది. క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, చర్చిలు, మత సంస్థల ఏర్పాటు ఈ అనుమానాన్ని మరింత బలపరిచాయి. దేవాలయాలు, మసీదుల ఆస్తులపై పన్ను విధించడంతో ప్రజల మత విశ్వాసాలు మరింత దెబ్బతిన్నాయి. హిందూమత ఆచారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని మత మార్పిడులను ప్రోత్సహించి, భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తుందనే భావం ప్రజల్లో ఏర్పడింది. దీనికి కొందరు కంపెనీ అధికారుల మత పక్షపాత ధోరణి కూడా దోహదం చేసింది.

సైనిక కారణాలు: దేశాన్ని ఆక్రమించుకోవడానికి, తమ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి బ్రిటిష్ వారు భారతీయ సిపాయిలను నిచ్చెనగా ఉపయోగించుకుని కూడా వారిని చిన్నచూపు చూసేవారు. వీరికి అతి తక్కువ వేతనాలు, చాలీచాలని ఆహారం ఇచ్చేవారు. వీరికి కేటాయించిన గృహాల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండేవికావు. ప్రమోషన్లు కూడా ఉండేవి కావు. విదేశీసేవా భత్యాలు కూడా లభించకపోవడంతో భారతీయ సైనికులు అనేక ఇబ్బందులు పడ్డారు. కొత్త, సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి రావడం సైన్యంలో మరింత అసంతృప్తిని పెంచింది.

        గ్రంథాలు                                                         రచయితలు
¤ రివోల్ట్ ఆఫ్ 1857                                              ఆర్.సి.మజుందార్

¤ ద హిస్టరీ ఆఫ్ సిపాయి వార్ ఇన్ ఇండియా                    కేయె

¤ ద గ్రేట్ రెబెల్లియన్                                                 అశోక్‌మెహతా 

¤ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ                       టి.ఆర్.హోయ్స్ 

¤ ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్                     వి.డి.సావర్కర్
            జనరల్ సర్వీసెస్ ఎన్‌లిస్ట్‌మెంట్ చట్టాన్ని 1856లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ చట్టం ప్రకారం సిపాయిలు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేయాల్సి వచ్చేది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం సముద్ర ప్రయాణం నిషేధం. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన అసంతృప్తికి లోనైన సిపాయిలు 1849, 1850, 1852లలో తమ నిరసనను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి తీవ్రమైన స్థాయికి చేరుకుంది. మొదటి ఆఫ్ఘన్, సిక్కు యుద్ధాల్లో ఆంగ్లేయుల ఓటమితో వారు అజేయులనే భావం పోయింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించడం కష్టమేమీ కాదని నమ్మి 1857లో సిపాయిలు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు.
తక్షణ కారణం: కంపెనీ ప్రభుత్వం 1856లో కొత్త ఎన్‌ఫీల్డ్ తుపాకులను ప్రవేశ పెట్టింది. వీటిలో ఉపయోగించే తూటాలను సైనికులు నోటితో చివరి భాగం కొరికి తుపాకిలో అమర్చి పేల్చాల్సి ఉండేది. కానీ ఆ తూటాలకు ఆవు, పంది కొవ్వులతో పూత పూసినట్లు ఒక వదంతి వ్యాపించింది. ఆవు హిందువులకు పవిత్రమైంది, పంది ముస్లింలకు అపవిత్రం. ఆంగ్లేయులు తమ మతాలను కించపరచడానికే ఇలా చేశారని సిపాయిలు భావించారు. ఈ నేపథ్యంలో 1857 మార్చి 29న మంగళ్‌పాండే అనే సిపాయి బరక్‌పూర్‌లో కొవ్వు తూటాలను ఉపయోగించడాన్ని నిరాకరించి ఇంగ్లిష్ అధికారిని కాల్చి చంపాడు. దీంతో తిరుగుబాటు ఆరంభమైంది. 1857 మే 10న మీరట్‌లోని సిపాయిలు బహిరంగంగా తిరుగుబాటు చేసి తమ అధికారులను కాల్చివేసి ఢిల్లీ దిశగా ముందుకు సాగారు. తిరుగుబాటు దార్లు రెండో బహదూర్‌షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. బరేలీ దళాలను ఢిల్లీకి నడిపించిన జనరల్ భక్త్‌ఖాన్ ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఢిల్లీని పోగొట్టుకోవడంతో భారతదేశంలో బ్రిటిష్‌వారి ప్రతిష్ఠ దిగజారినట్టయింది.

             సర్‌జాన్ లారెన్స్ తమ ప్రతిష్ఠను ఢిల్లీలో నిలబెట్టుకోవడం కోసం జాన్ నికల్సన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్రిటిష్ సైన్యాన్ని ఢిల్లీకి పంపించాడు. 1857లో బ్రిటిష్‌వారు ఢిల్లీని తిరిగి ఆక్రమించుకుని రెండో బహదూర్‌షాను హుమాయూన్ సమాధివద్ద పట్టుకుని రంగూన్ జైల్‌కు పంపారు. రెండో బహదూర్‌షా 1862లో అక్కడే మరణించాడు.

¤ అవుద్ నవాబ్ వజీద్ఆలీషా అధికారం పొగొట్టుకున్నాడు. జనరల్ కొలిన్ కాంఫ్‌బెల్ స్వయంగా సైన్యాన్ని పంపి లక్నోను హస్తగతం చేసుకున్నాడు.

¤ మధ్య భారతంలోని తిరుగుబాటుదారులను అణచివేసే బాధ్యతను సర్ హ్యూరోస్‌కు అప్పగించారు.

¤ జనరల్ సర్ హ్యూరోస్ ఝాన్సీ రాణి లక్ష్మీభాయిని గ్వాలియర్‌లో జరిగిన యుద్ధంలో ఓడించాడు.
¤ గెరిల్లా పోరాటాన్ని కొనసాగించిన తాంతియాతోపేను 1859లో ఉరితీశారు.
¤ బీహార్‌లో తిరుగుబాటుకు జగదీష్‌పూర్ జమిందార్ కున్వర్‌సింగ్ నాయకత్వం వహించాడు. వృద్ధుడైనప్పటికీ తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించాడు. ఇతడు 1858లో మరణించాడు.

¤ మద్రాసు నివాసి 'మౌల్వీఅహ్మదుల్లా' పైజాబాద్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.

¤ కాన్పూర్‌లో పోరాటానికి నానాసాహెబ్ నాయకత్వం వహించాడు. 1858లో జనరల్ హావెలాక్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం నానాసాహెబ్‌ను ఓడించి కాన్పూర్‌ను ఆక్రమించింది.

¤ శివాజీనగర్, మోరార్‌లోని భారతీయ సిపాయిల్లో దేశభక్తిని పెంచడంలో తాంతియాతోపే విజయం సాధించాడు.

¤ నానాసాహెబ్, తాంతియాతోపేలు 1858 నవంబరులో కాన్పూర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. అయితే కాంఫ్‌బెల్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యాలు నానాసాహెబ్‌పై విజయాన్ని సాధించాయి. దాంతో నానాసాహెబ్ నేపాల్‌కు పారిపోయి అక్కడే మరణించాడు.

¤ తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం కఠినంగా అణచివేసింది.

తిరుగుబాటు విఫలమవడానికి కారణాలు: సరైన ప్రణాళిక లేకపోవడం, నాయకత్వం లోపించడం ప్రధాన కారణాలు.

¤ 1857 తిరుగుబాటు ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలకే పరిమితమవడం.
¤ నాభాలోని సిక్కు రాజులు, పాటియాలా, కపుర్తలా, హైదరాబాద్, గ్వాలియర్ పాలకులు బ్రిటిష్‌వారికి సైన్య, ధన రూపంలో పెద్దఎత్తున సహాయం చేసి ఉద్యమానికి ద్రోహం చేశారు.

¤ హూల్కార్, సింధియాలు బ్రిటిష్‌వారికి విశ్వాసపాత్రులుగా ఉండటం.

¤ గ్రామస్థుల దాడికి గురైన వడ్డీ వ్యాపారులు, బ్రిటిష్‌వారు ఫ్యూడలిజాన్ని అంతం చేయగలరని భావించిన విద్యావేత్తలూ తిరుగుబాటుకు మద్దతు ఇవ్వలేదు.

¤ తిరుగుబాటు దారులకు అధునాతన ఆయుధాలు లేకపోవడం.

తిరుగుబాటు ఫలితాలు: 1857 తిరుగుబాటు వల్ల భారతదేశంలో కంపెనీ పరిపాలన అంతమై, భారత పరిపాలనా బాధ్యతలు బ్రిటిష్ రాణి, పార్లమెంట్ చేతుల్లోకి వెళ్లాయి.

¤ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను రద్దుచేసి దాని స్థానంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ప్రవేశపెట్టారు.

¤ భారతదేశ పరిపాలన కోసం 15 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్‌తో పాటు సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ను నియమించారు.
¤ గవర్నర్ జనరల్ హోదాను వైశ్రాయిగా మార్చారు.
¤ వైశ్రాయి బ్రిటిష్ ఆధీనంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్ జనరల్‌గా వ్యవహరిస్తాడు. నవాబ్‌లు, రాజులు, స్వదేశీ పాలకులతో సంబంధాల విషయంలో వైశ్రాయిగా వ్యవహరిస్తాడు.

¤ సైన్యాన్ని పూర్తిగా పునర్ వ్యవస్థీకరించారు.
ప్రముఖుల వ్యాఖ్యలు:
¤ వి.డి.సావర్కర్: ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం.

¤ ఆర్.సి.మజుందార్: మొదటి జాతీయ లేదా స్వాతంత్య్ర సంగ్రామం.

¤ డాక్టర్ ఎస్.ఎస్.సేన్: తిరోగమన వాదుల ప్రయత్నం.

¤ టి.ఆర్.హోయ్స్: నాగరికులు, అనాగరికుల మధ్య సంఘర్షణ.

¤ జాట్రం టేలర్: హిందువుల కష్టాలను ఆసరాగా చేసుకుని ముస్లింలు చేసిన కుట్ర.

      1857 తిరుగుబాటులో భారతీయులు చేసిన త్యాగాలు భారతదేశంలో జాతీయవాద ఉద్యమానికి ఊపిరి పోశాయి.
                                       
నానాసాహెబ్, ఝూన్సీ లక్ష్మీభాయి, బహదూర్‌షాలను జాతీయ వీరులుగా, స్వాతంత్య్రం కోసం పోరాడిన చారిత్రక వ్యక్తులుగా గుర్తించారు. 1857 తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్‌వారి అధికారాన్ని సవాలుచేసి, స్వాతంత్య్ర పోరాటానికి ప్రేరణనిచ్చింది.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again