పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 18, 2014

1857 తిరుగుబాటు హైదరాబాద్, ఆంధ్రలపై దాని ప్రభావం

  
            భారతదేశంలో 1857లో జరిగిన తిరుగుబాటును ఆంగ్లేయులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా పేర్కొంటే జాతీయ చరిత్రకారులు మాత్రం దీనిని ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా అభివర్ణించారు. ముఖ్యంగా వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఎందరో రాజులు రాజ్యాలు పోగొట్టుకున్నారు. మత, సాంఘిక కార్యకలాపాల్లో కంపెనీ జోక్యం వల్ల ప్రజల్లో రగిలిన అసంతృప్తి, సైన్యంలో అసంతృప్తి ఈ తిరుగుబాటుకు కారణాలుగా చెప్పవచ్చు. ఈ తిరుగుబాటు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో జరిగింది. దీని ప్రభావం దక్షిణ భారతంలోని హైదరాబాద్, ఔరంగాబాద్, కడప, మచిలీపట్నం మొదలైన ప్రాంతాల్లో కనిపించింది. తిరుగుబాటు ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని ఉద్యమకారులకు విజయం చేకూరడంతో హైదరాబాద్ రాష్ట్రంలోని ముస్లింలలో ఉత్సాహం పెరిగింది. సికింద్రాబాద్ బొల్లారంలోని కంపెనీ సైన్యాన్ని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఒక ఫకీర్ నగరమంతా తిరుగుతూ ప్రజల్ని బ్రిటిషర్లపై తిరగబడాలని రెచ్చగొట్టాడు. మసీదుల వద్ద మతాధికారులు ఉద్రేకపూరిత ఉపన్యాసాలిచ్చి బ్రిటిషర్లపై జీహాద్ (పవిత్రయుద్ధం) ప్రకటించాలని ప్రజలను రెచ్చగొట్టారు. అల్లాఉద్దీన్ లాంటి ముస్లిం మౌల్వీలు హైదరాబాద్ మక్కా మసీదు వద్ద ఇచ్చిన మతోపన్యాసాల్లో బ్రిటిషర్లను ఇస్లాం మత శత్రువులుగా పేర్కొన్నారు. వారిని దేశంనుంచి తరిమికొట్టాలని ప్రబోధించారు. 

ఔరంగాబాద్‌లో తిరుగుబాట్లు:  ఔరంగాబాద్‌లోని కంపెనీ సైన్యంలో ఎంతోకాలంగా ఉన్న అసంతృప్తి 1857 నాటికి తీవ్రరూపం ధరించింది. ఉత్తర భారతంలో తిరుగుబాటును అణచడానికి తమను ఢిల్లీకి పంపుతారేమోనన్న భయం వారిలో ఏర్పడింది. అసంతృప్తిని గ్రహించిన బ్రిటిష్ అధికారులు 1857 జూన్ 23న 90 మంది సిపాయిలను నిరాయుధులను చేసి జైలుకు పంపారు. దాంతో మిగతా సిపాయిల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. మీర్‌ఫైదాఅలీ అనే డఫేదారు కెప్టెన్ అబ్బాట్‌ను కాల్చిచంపేందుకు ప్రయత్నిస్తే అతడిని ఉరితీశారు. ఔరంగాబాద్‌లో చీదాఖాన్ అనే మరో జమేదారు బ్రిటిషర్లపై ధ్వజమెత్తి ప్రజల్లో జాతీయభావాలు రేకెత్తించి తీవ్ర అలజడి సృష్టించాడు. బ్రిటిషర్లు అతడిని అప్పగించినవారికి మూడువేల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. చీదాఖాన్ ఔరంగాబాద్ వదిలి హైదరాబాద్‌లో విప్లవ భావాలు సృష్టించాలని బయలుదేరాడు. సాలార్‌జంగ్ అతడిని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో బంధించి 1857 జులై 17న బ్రిటిష్ రెసిడెంట్‌కు అప్పగించాడు. చీదాఖాన్ నిర్బంధం గురించి నగరమంతా తెలిసి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెల్లుబికింది. వెంటనే మక్కా మసీదులో ఒకపెద్ద బహిరంగసభ ఏర్పాటుచేసి బ్రిటిషర్ల దమననీతికి వ్యతిరేకంగా ప్రసంగించారు. నిజాం వద్దకు రాయబారం పంపి చీదాఖాన్‌ను విడిపించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను హైదరాబాద్ దివాన్ సాలార్‌జంగ్ విఫలం చేశాడు. బ్రిటిషర్ల సహాయార్థం రెండు అశ్విక దళాలను ఢిల్లీకి పంపించాడు. ఆ దళాలు మార్గమధ్యంలో మనసు మార్చుకున్నాయి. యుద్ధంలో పాల్గొనబోమని, తమ దేశీయులతో కలిసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడతామని నినాదాలు చేస్తూ ప్రతిఘటించారు. ఈ సైన్యంలో అలజడి, తిరుగుబాటు రావడానికి ప్రధానంగా ప్రయత్నించింది అమీర్‌ఖాన్, వహీద్‌ఖాన్. 

రెసిడెన్సీపై తుర్రెబాజ్‌ఖాన్ దాడి:   రోహిల్లా వీరుడు సర్దార్ తుర్రెబాజ్‌ఖాన్ 5000 మంది రోహిల్లాలను తీసుకుని 1857 జులై 17న హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడిచేశాడు. రెసిడెన్సీకి సమీపంలో ఉన్న జయగోపాల్‌దాస్, డబ్బుసింగ్‌ల ఇళ్లపైకి ఎక్కి రోహిల్లాలు రెసిడెన్సీపై కాల్పులు జరిపారు. ఈ దాడిని గమనించి అధికారులు రెసిడెన్సీ ద్వారాలను మూసివేశారు. రోడ్డుపైన ప్రజలు రోహిల్లాలకు మద్దతు పలికారు. రోహిల్లాలు రెసిడెన్సీపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. కొన్ని గేట్ల ద్వారాలను పగులగొట్టారు. బ్రిటిష్ రెసిడెన్సీ లోపలనుంచి కర్నల్ డేవిడ్‌సన్ నాయకత్వంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఆ రోజు రాత్రంతా కాల్పులు కొనసాగాయి. దివాన్ సాలార్‌జంగ్ రెసిడెంట్‌ను కాపాడేందుకు తనకు నమ్మకస్తులైన అరబ్బుల పటాలాన్ని రోహిల్లాలపైకి పంపించాడు. తుర్రెబాజ్‌ఖాన్ తప్పించుకుని పారిపోయాడు. రోహిల్లాలు కాల్పులు విరమించారు. ఆ పోరులో 30మంది రోహిల్లావీరులు ప్రాణాలు కోల్పోయారు. తుర్రెబాజ్‌ఖాన్, అతడి అనుచరుడైన మౌల్వీ అల్లాఉద్దీన్‌ను నిజాం సైనికులు సాత్‌కాల్వా అనే గ్రామంలో బంధించి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తుర్రెబాజ్‌ఖాన్, అల్లాఉద్దీన్‌లకు ద్వీపాంతర శిక్ష వేశారు. తుర్రెబాజ్‌ఖాన్ కారాగారం నుంచి తప్పించుకుని పారిపోతుండగా కాల్చి చంపి అతడి శవాన్ని హైదరాబాద్ నగరంలో బహిరంగంగా వేలాడదీశారు. అల్లాఉద్దీన్ అండమాను జైల్లో శిక్ష అనుభవిస్తూ 1884లో మరణించాడు. 

షోలాపూర్ రాజా పోరాటం: షోలాపూర్ సంస్థాన అధిపతి అయిన వెంకటప్పనాయక్‌కు దేశభక్తి ఎక్కువ. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటానికి అనేకమంది జమీందార్లను పురికొల్పాడు. సిపాయిల తిరుగుబాటు సందర్భంగా ఆయన తన రాయబారియైన సుంకేశ్వర్‌ను పీష్వా నానాసాహెబ్ వద్దకు పంపి మంతనాలు సాగించాడు. ఖమర్అలీ అనే జమేదార్ వద్ద సైన్యాన్ని సమీకరించి అపారమైన మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నాడు. అనేకమంది వీరులైన అరబ్బులను తన సైన్యంలో చేర్చుకున్నాడు. వెంకటప్పనాయక్ సైన్య సమీకరణ నిరోధానికి ప్రయత్నించి బ్రిటిషర్లు విఫలమయ్యారు. ఆయన సైన్య సమీకరణకు భయపడిన బ్రిటిషర్లు 1858 ఫిబ్రవరి 7న షోలాపూర్‌పై దాడిచేశారు. బ్రిటిష్ అధికారులు చాలామంది బలయ్యారు. వెంకటప్పనాయక్ ఓడిపోయి తప్పించుకుని హైదరాబాద్ వెళ్లాడు. అతడిని సాలార్‌జంగ్ బంధించి బ్రిటిషర్లకు అప్పగించాడు. ఆ నిర్బంధంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

భీంరావు దేశాయి సాహస: పోరాటం భీంరావు దేశాయి కర్ణాటకలోని కొప్పల్ కోటను పాలించేవాడు. ఆయన తన సమీప గ్రామాల జమీందార్ల సైన్యాన్ని సమీకరించి బలం పెంచుకున్నాడు. దీంతో బ్రిటిషర్లు ఆయన కోటపై దాడిచేశారు. భీంరావు కలెక్టర్ మాన్సన్‌మీద మెరుపు దాడిచేసి అతడిని, అనుచరులను చంపాడు. హంగేరి, కొల్లూరు, రంబల్ తదితర పొరుగు గ్రామాల నుంచి సైన్యాన్ని పిలిపించి బ్రిటిషర్లతో వీరోచితంగా పోరాడి మరణించాడు. 

ఆదిలాబాద్ జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేకపోరాటం:   ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు సమీపంలోని అడవిలో రోహిల్లాలు, గోండులు కలిసి ఒక స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు. మధ్య భారత్‌లోని తాంతియాతోపే నుంచి వీరికి సహాయం లభించేది. రోహిల్లాలకు హాజీ అనే సర్దార్, గోండులకు రాంజీ అనేవారు నాయకులు. బ్రిటిష్ సైన్యం నిజామాబాద్ వరకు ఎటు బయలుదేరినా వీరు దెబ్బతీస్తూ తమ ఆచూకి తెలియకుండా కార్యకలాపాలు సాగించేవారు. మెరుపుదాడులకు పాల్పడేవారు. బ్రిటిషర్లు వీరిపైకి పెద్దసైన్యాన్ని పంపించారు. ఆ పోరాటంలో చాలామంది రోహిల్లాలు, బ్రిటిష్ సైనికులు చనిపోయారు. రోహిల్లాల నాయకుడు గాయపడటంతో బ్రిటిషర్లకు విజయం దక్కింది. గోండు నాయకుడు రాంజీ తప్పించుకున్నాడు. కాని కొంతకాలానికి ఆయనను పట్టుకుని ఉరితీశారు. 

పాలమూరులో కులకర్ణి నర్సింగరావు పోరాటం:  పాలమూరు అంటే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కులకర్ణి నర్సింగరావు బ్రిటిష్‌వారితో వీరోచిత పోరాటం జరిపాడు. ప్రథమ సంగ్రామ కారకులలో ముఖ్యుడైన నానాసాహెబ్ ఉత్తరం రాసి కులకర్ణిని ప్రోత్సహించాడు. దేశభక్తి మెండుగా ఉందని, ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాడాల్సిందిగా పిలుపునిచ్చాడు. దీంతో కులకర్ణి సైనికులను సమీకరించి బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించాడు. ఈ ఆకస్మిక దాడిని తట్టుకోలేని బ్రిటిషర్లు పలాయనం చిత్తగించగా ఆ ప్రాంతమంతా స్వాతంత్య్రం సాధించినట్లు ప్రకటించాడు. కొన్నాళ్ళ తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ అధునాతన ఆయుధాలతో వచ్చి నర్సింగరావును బంధించి వధించాడు. 

  హైదరాబాద్‌లో 1857లో జరిగిన పోరాటాలను అణచివేయడంలో అప్పటి నిజాం అఫ్జల్ ఉద్దౌలా, అతడి ప్రధానమంత్రి సాలార్‌జంగ్ కీలకపాత్ర పోషించారు. కంపెనీకి విధేయులుగా ఉండేవారు. 1861లో విక్టోరియా రాణి అప్పటి నిజాంకు 'స్టార్ ఆఫ్ ఇండియా' బిరుదును ప్రదానం చేసింది. 1857 తిరుగుబాటు సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో చిన్న చిన్న పోరాటాలు జరిగాయి.

 పర్లాకిమిడి తిరుగుబాటు: గంజాం జిల్లాలోని పర్లాకిమిడి ప్రాంతంలో సవరలు దండసేనుడు అనే ఆదివాసి నాయకత్వంలో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు చేశారు. బ్రిటిషర్లు దండసేనుడిని నిర్బంధించగా అక్కడనుంచి తప్పించుకు వచ్చాడు. తర్వాత సవరలను సమీకరించి బ్రిటిషర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎన్నో గ్రామాలు అగ్నికి ఆహుతయ్యాయి. కెప్టెన్ విల్లన్ ఆధిపత్యంలో బ్రిటిషర్లు తిరుగుబాటును అణచివేశారు. దండసేనుడిని ఉరి తీశారు. దాంతో ఉద్యమం ఆగిపోయింది. 

గోదావరి జిల్లాలో తిరుగుబాటు: గోదావరి జిల్లాలో కోరుకొండ సుబ్బారెడ్డి అనే గ్రామాధికారి గిరిజనులను సమైక్యపరిచాడు. నానాసాహెబ్ సైన్యంతో వస్తున్నాడని, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడేవారందరికి బహుమతులిస్తాడని ప్రచారంచేసి తిరుగుబాటు లేవదీశాడు. సుంకరస్వామి అనే గ్రామ మునసబు సుబ్బారెడ్డితో ఉన్న శత్రుత్వం మూలంగా ఆంగ్లేయులకు ఈ కార్యకలాపాలు తెలియజేశాడు. ప్రభుత్వం సుబ్బారెడ్డిని బంధించి ఉరితీయడంతో ఉద్యమం ఆగిపోయింది. 

1857 ఆగస్టు 28న కడపలో షేక్ పీర్‌సాహెబ్ అనే వ్యక్తి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జీహాద్ (పవిత్రయుద్ధం) ప్రకటించాడు. మొగల్ చక్రవర్తి విజయం కోసం కడప పట్టణంలోని మహ్మదీయులు మసీదుల్లో ప్రార్థనలు చేశారు. విశాఖపట్నంలో మొహరం పండుగ సందర్భంగా దానిపేరు మార్చాలని, మహమ్మద్ పట్నంగా పేరు పెట్టాలని తెలుగు పోస్టర్ వెలసింది. హైదరాబాద్ రాష్ట్రం నుంచి రోహిల్లాలు, సరిహద్దు రాష్ట్రాలపై అరబ్‌లు చేసిన ఆకస్మికదాడులు ఆంధ్రప్రాంతంలో ఆంగ్లేయ వ్యతిరేకోద్యమానికి కొంత ప్రేరణ కలిగించాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట తాలుకా ఖజానాపై రోహిల్లాలు దాడిచేసి దోచుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో పలు దాడులకు పాల్పడ్డారు. కోయలకుంట్ల తాలూకాలోని రుద్రవరంపై జరిగిన దాడి తీవ్రమైంది. చిత్తూరు జిల్లాలోని పాళేగార్లు కల్లూరు జమీందారు కుమారుడి నాయకత్వంలో 1857లో బ్రిటిషర్లపై తిరుగుబాటు చేశారు. కాని గుడిపాటి జమీందారు మోసంవల్ల ఆ సంగతి ఆంగ్లేయులకు ముందే తెలిసిపోయింది. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత పోరాటం:  బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని కర్నూలు జిల్లా పాళేగార్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆంగ్లేయులు పాళేగార్ పదవినుంచి తొలగించారు. దానితో ఆయన అయిదువేల మంది యోధులను తయారుచేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. వారు ఆంగ్ల పాలకులను, సైనికులను ముప్పుతిప్పలు పెట్టారు. కోయలకుంట్ల ప్రభుత్వ ఖజనాను దోచారు. ఆంగ్లేయులు ఆ పోరాటాన్ని అణచివేశారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఫలితంగా భారతదేశంలో కంపెనీ పాలన అంతమై బ్రిటిష్ రాణి విక్టోరియా పాలన మొదలయింది. 1858 నవంబరు 1న అధికారాన్ని స్వీకరిస్తూ విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది. 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again