పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

ప్రణాళికలు-2


1929-30లో సంభవించిన ఆర్థిక మాంద్య ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలకు గుర్తింపు లభించింది. భారతదేశంలో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే 'ప్రణాళికా సంఘం' అవసరమని సుభాష్‌చంద్రబోస్ వక్కాణించారు. 1934లో ఎం. విశ్వేశ్వరయ్య దేశంలో ఆర్థికాభివృద్దిని సాధించడానికి ప్రణాళికలు అవసరమని 'A Planned Economy for India' అనే గ్రంథంలో నొక్కి చెప్పారు.

           దేశంలోని ఆర్థిక పరిస్థితులను, ఆర్థిక వనరులను అధ్యయనం చేయడానికి కాంగ్రెస్‌పార్టీ వార్షిక సమావేశంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళికా కమిటీని నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 1948లో సమర్పించింది. 

           1944లో మహారాష్ట్రకు చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు రూ.10,000 కోట్లతో రాబోయే 15 సంవత్సరాల కాలంలో పారిశ్రామికాభివృద్ధిని 500 రెట్లు, వ్యవసాయ ఉత్పత్తిని 130 రెట్లు, తలసరి ఆదాయాన్ని రెండింతలు చేసే విధంగా బాంబే ప్రణాళిక నమూనాను రూపొందించారు. 

           1944 లో ప్రభుత్వం ఎ.డి.దలాల్ అధ్యక్షతన 'ప్రణాళికా - ఆర్థికాభివృద్దిశాఖను' నెలకొల్పింది. ఆర్థిక వికేంద్రీ కరణ వ్యవసాయ ప్రాధాన్యంతో, శ్రమసాంద్రత పద్ధతులతో వస్తూత్పత్తిని సాధించే విధంగా శ్రీమాన్ నారాయణ్ గాంధీయన్ ప్రణాళికను రూపొందించారు. ఎం.ఎన్.రాయ్ సామ్యవాద తరహాలో, వినియోగవస్తు పరిశ్రమలను స్థాపించాలనే వ్యూహంతో ప్రజాప్రణాళికను రూపొందించారు.

1946లో మధ్యంతర ప్రభుత్వం ప్రణాళికా సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 1950లో ప్రణాళికా సలహామండలి సూచనల మేరకు, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల లక్ష్యాల సాధనకు, కేంద్ర క్యాబినెట్ మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు ప్రణాళికా సంఘాన్ని ఒక 'సలహా సంఘంగా' ఏర్పాటు చేశారు.

ప్రణాళికా సంఘానికి పదవిరీత్యా దేశ ప్రధాని అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఆర్థిక, పరిపాలనా విషయాల్లో సుదీర్ఘ అనుభవమున్న వ్యక్తిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తారు. ఉపాధ్యక్షుడు ప్రధాని విశ్వాసమున్నంత వరకు పదవిలో కొనసాగుతాడు; ఆయనకు కేంద్ర క్యాబినెట్ హోదాను కల్పిస్తారు. వివిధ రంగాల్లో ప్రావీణ్యం ఉన్న వారిని ప్రణాళికా సంఘ సభ్యులుగా నియమిస్తారు. 

           ప్రణాళికా సంఘం ప్రణాళికా మంత్రిత్వ శాఖ అజమాయిషీలో పనిచేస్తూ కింది విధులను నిర్వహిస్తుంది. అవి:

1. దేశంలోని సహజ వనరులను అంచనావేస్తుంది.

2. దేశ ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తుంది.

3. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రణాళికా నమూనాలను తయారుచేస్తుంది.

4. ఎప్పటికప్పుడు ప్రణాళికా అమలును సమీక్షిస్తుంది. 

           భారత ఆర్థిక వ్యవస్థ, సమాఖ్య ఆర్థికవ్యవస్థ. ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. వాటిని రాష్ట్రాలు అమలుపరుస్తాయి. అయితే ప్రణాళికా నమూనాల తయారీలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం లేదు.

ఈ లోపాన్ని సవరించడానికి రాష్ట్రప్రభుత్వాలకు ప్రణాళికా నమూనా తయారీలో ప్రాతినిధ్యం కల్పించడానికి 1952 ఆగస్టు 6న 'జాతీయాభివృద్ధి మండలి'ని ఒక సలహా సంఘంగా ఏర్పాటు చేశారు. 

           జాతీయాభివృద్ధి మండలికి దేశ ప్రధాని అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తాడు. ప్రణాళిక సంఘ సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత పాలకులు, జాతీయాభివృద్ధి మండలిలో సభ్యులుగా ఉంటారు. 1967 నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రులందరు జాతీయాభివృద్ధి మండలిలో సభ్యులుగా ఉన్నారు.

           ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికా నమూనాను జాతీయాభివృద్ధి మండలి చర్చించి ఆమోదిస్తే ప్రణాళికలు అమల్లోకి వస్తాయి. ప్రణాళికల అమల్లో ఎదురయ్యే ఆటంకాలను రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయాభివృద్ధి మండలి ద్వారా ప్రణాళికా సంఘం, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లతాయి. 'జాతీయాభివృద్ధి మండలి' ప్రణాళికా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. 

           భారతదేశంలో ప్రణాళికా సంఘం కింది లక్ష్యాల సాధన కోసం పనిచేస్తోంది. అవి:

1. ఆర్థికాభివృద్ధిని సాధించడం

2. ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడం

3. ఆర్థిక వ్యవస్థలో స్వయం సమృద్ధి, స్వావలంబన సాధన

4. ప్రాంతీయ - ఆర్థిక అసమానతలను తగ్గించడం.

5. సామాజిక న్యాయంతో కూడిన వృద్ధిని సాధించడం.

   ప్రణాళికా సంఘ లక్ష్యాల్లో సామాజిక న్యాయంతో కూడిన వృద్ధిని సాధించడమే ప్రధాన లక్ష్యం. ప్రణాళికా నమూనాలను కాలం, లక్ష్యం, వనరుల కేటాయింపులను, వాటి అమలును బట్టి అనేక రకాలుగా వర్గీకరించారు. 

           అయిదు సంవత్సరాల స్థిర దృష్టితో మొదటి సంవత్సర ప్రణాళిక పునాదిగా రూపొందించి అమలుపరిస్తే వాటిని స్థిర ప్రణాళికలంటారు. ఒక నిర్ణీత కాలానికి వివిధ వస్తువుల భౌతిక ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా రూపొందించే ప్రణాళికలను భౌతిక ప్రణాళికలంటారు. 

           పై స్థాయి నుంచి ప్రణాళికా రచన చేయడం అంటే దేశం, రాష్ట్రం జిల్లా లాంటి వ్యవస్థలలో దేశమంతటికీ ఒకే ప్రణాళికను రూపొందించి అమలుపరిస్తే కేంద్రీకృత ప్రణాళికలంటారు. సాధారణంగా సామ్యవాద ఆర్థిక విధానంలో కేంద్రీకృత ప్రణాళికలను అమలుపరుస్తారు.

           ప్రణాళికలను కింది స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయి వరకు రూపకల్పన చేసి అమలుపరిస్తే వికేంద్రీకృత ప్రణాళికలంటారు. భారతదేశంలో వికేంద్రీకృత ప్రణాళికలు అమల్లో ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉంది. ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికా బోర్డు ఉంది. జిల్లాపరిషత్ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. జిల్లా ప్రణాళికా బోర్డు రాజ్యాంగబద్ధమైంది. జిల్లా ప్రణాళికా బోర్డు విధులను రాజ్యాంగంలో అధికరణం 243 ZDలో పేర్కొన్నారు. నిరంతర ప్రణాళిక కూడా ఒక పంచవర్ష ప్రణాళిక. ఈ భావనను గున్నార్ మిర్డాల్ అనే ఆర్థికవేత్త రూపొందించారు. నిరంతర ప్రణాళికలో వార్షిక ప్రణాళికలను రూపొందించేటప్పుడు ప్రతి సంవత్సరం అయిదు సంవత్సరాల భవిష్యత్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని లక్ష్యాలను నిర్దేశిస్తారు. భారతదేశంలో 1978-83 సంవత్సరాల మధ్య కాలానికి ప్రవేశపెట్టారు. అయితే రాజకీయ అనిశ్చితి వల్ల 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర ప్రణాళికను రద్దుచేసింది.      

ప్రణాళికా వనరులను, లక్ష్యాల ప్రాధాన్యాలను వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా నిర్ణయించి, రూపొందించి అమలుపరిస్తే వాటిని నిర్దేశాత్మక ప్రణాళికలంటారు. ఒకటి నుంచి ఏడో ప్రణాళిక వరకు నిర్దేశాత్మక ప్రణాళికలను అమలు చేశారు. మిశ్రమ ఆర్థిక విధానంలో స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక విధానం, ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థలోని మంచి గుణాల కలయికతో ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యమిస్తూ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికా లక్ష్యాలను, ప్రాధాన్యాలను నిర్దేశించి ప్రణాళికలను అమలుపరిస్తే సూచనాత్మక ప్రణాళికలంటారు. మనదేశంలో ఎనిమిదో ప్రణాళికాకాలం నుంచి సూచనాత్మక ప్రణాళికలను అమలు పరుస్తున్నారు. ప్రణాళికా లక్ష్యాలను 10 లేదా 5 సంవత్సరాల కాలానికి నిర్ణయించి రూపొందించి, అమలు పరిస్తే వాటిని 'దీర్ఘదర్శి' ప్రణాళికలంటారు. దేశంలో మూడో ప్రణాళికా కాలం నుంచి దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించి అమలు పరుస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 10 పంచవర్ష ప్రణాళికలను, 7 వార్షిక ప్రణాళికలను అమలుపరిచారు. 2007-2012 సంవత్సరాల మధ్య కాలానికి 11వ ప్రణాళిక అమల్లో ఉంది.

(వివిధ ప్రణాళికా ప్రాధాన్యాలను - సాధించిన ఫలితాలను  పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.) 

           2007-12 సంవత్సరాల మధ్యకాలానికి ప్రజల జీవన నాణ్యతను పెంచడానికి, సమ్మిళిత వృద్ధి- సత్వర ప్రగతి ప్రాధాన్యంతో 11వ ప్రణాళికను 27 ఉపలబ్దిలతో రూపొందించారు. ప్రణాళికా పెట్టుబడి రూ.35,44,718 కోట్లు.  

¤ సగటున 9% ఆర్థికాభివృద్ధిని, వ్యవసాయ వృద్ధి రేటును 4%, పెట్టుబడి రేటును 36.7%, స్థూల దేశీయ పొదుపురేటును 34.8% సాధించాలని నిర్ణయించారు.

¤ మూలధన ఉత్పత్తి నిష్పత్తి 4.1%గా నిర్ణయించారు.

¤ 58 మిలియన్ ఉపాధి అవకాశాలను కల్పించాలి.

¤ పట్టభద్రుల్లో నిరుద్యోగితారేటు 5%నికి తక్కువగా ఉండాలి.

¤ పేదరికాన్ని 15 శాతానికి తగ్గించాలి.

¤ మధ్యలో పాఠశాల మానివేసే నిష్పత్తిని 52.2% నుంచి 20% కి తగ్గించాలి.

¤ 2012కల్లా అక్షరాస్యతను 85%నికి పెంచాలి.

¤ శిశుమరణాలను 2012 నాటికి ప్రతి 1000కి 28కి తగ్గించాలి.

¤ బాలబాలికల్లో స్త్రీ, పురుష నిష్పత్తిని 2011-12 నాటికి 935, 2016-17 నాటికి 950కు పెంచాలి.

¤ 2009 నాటికి అన్ని గ్రామాలకు విద్యుచ్ఛక్తి, మంచినీటి సదుపాయాలను కల్పించాలి.

¤ అన్ని ప్రభుత్వ పథకాల్లో, సేవల్లో స్త్రీలకు 33% రిజర్వేషను కల్పించాలి.

¤ 2012నాటికి అన్ని గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యం

¤ దారిద్య్రరేఖ కంటే దిగువన ఉన్న కుటుంబాలకు 2012 నాటికి ఇళ్ల స్థలాలను కేటాయించాలి. 2016-17 నాటికి గృహ వసతిని కల్పించాలి.

¤ 2012 నాటికి అడవుల విస్తీర్ణాన్ని 5% పెంచాలి.

¤ 2012 నాటికి నగరాల్లోని వ్యర్థ జలాలను శుద్ధి పరచాలి.

¤ 11వ ప్రణాళికలో విద్యపై రూ.2,74,211 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కాబట్టి 11వ ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు.

 ¤ ప్రణాళికా పెట్టుబడిలో సుమారు 74% నిధులు ప్రాధాన్య రంగానికి కేటాయించారు.

¤ 11వ ప్రణాళిక పెట్టుబడి 10వ ప్రణాళిక కంటే 120% అధికం
.
¤ పారిశ్రామికాభివృద్ధి 10% నుంచి 11% వరకు, సేవా రంగ వృద్ధి రేటు 9% నుంచి 11% వరకు సాధించాలి.

¤ 11వ ప్రణాళిక ముగిసే నాటికి విద్యుచ్ఛక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని 92,577 మెగావాట్లకు పెంచాలి.



0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again