పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 31, 2014

కరెంట్ అఫైర్స్ - డిసెంబర్ 2014 Current Affairs - December 2014

జాతీయం 
✿నాగాలాండ్‌లో ప్రతి ఏడాది భారీ ఎత్తున నిర్వహించే హార్న్‌బిల్ ఉత్సవాన్ని ప్రధాని మోదీ కిసామాలో ప్రారంభించారు.


✿ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కాసులపాడు గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మెరుపు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది జవాన్లు మరణించారు. మృతుల్లో 223 - బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ వర్మ, అసిస్టెంట్ డిప్యూటీ కమాండెంట్ రాజేష్ కపూడియా ఉన్నారు.


✿"సమాచార సాంకేతిక పరిజ్ఞాన సంస్థలన్నింటినీ ఒకే ఛత్రం కిందికి తీసుకురావడమే కాకుండా, విద్యార్థులు పట్టాలు పొందడంలో తోడ్పడే బిల్లు 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) బిల్లు - 2014'కు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
» ఈ విద్యాసంస్థల నుంచి బయటికొచ్చే విద్యార్థులు పట్టాలు పొందుతారనీ, ఇవి స్వతంత్ర హోదాతో పని చేస్తాయని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు."


✿ఖాయిలా పడిన జౌళి పరిశ్రమల పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.


✿"జమ్ము కశ్మీర్, ఝూర్ఖండ్ రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
జమ్ము కశ్మీర్‌లో 18 శాసన సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 71 శాతం ఓటింగ్ నమోదైంది.ఝూర్ఖండ్‌లో మావోయిస్టు ప్రభావిత 20 శాసనసభ నియోజక వర్గాల్లో 65.46 శాతం ఓటింగ్ నమోదైంది."


✿మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టిన రోజు (డిసెంబరు 25)ను జాతీయ 'సుపరిపాలన దినోత్సవం'గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


✿"భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 30 ఏళ్లు పూర్తయ్యింది.
» 1984, డిసెంబరు 2వ తేదీ రాత్రి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యూసీసీ) ప్లాంట్ నుంచి 40 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ బయటకు విడుదలై 3,707 మంది మరణించారు. 5,58,125 మంది క్షతగాత్రులయ్యారు. స్వచ్ఛంద సంస్థల అంచనా ప్రకారం విషవాయువు ప్రభావానికి 25 వేల మంది మరణించారు. లక్ష మంది ఇప్పటికీ వైకల్యంతో బాధపడుతున్నారు."


✿సామాజిక అంశాలపై ముఖ్యంగా మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాలకు సంబంధించిన కేసుల విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక సామాజిక న్యాయ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.


✿"90 కాలం చెల్లిన సవరణ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
» రద్దుకు ప్రతిపాదించిన చట్టాల్లో పార్లమెంటు సభ్యుల జీత భత్యాలు, అలవెన్సుల సవరణ చట్టం, సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సవరణ చట్టం-2008, వక్ఫ్ సవరణ చట్టం-2013, బ్యాంకింగ్ నిబంధనల సవరణ చట్టం మొదలైనవి ఉన్నాయి."


✿విమాన హైజాకర్లకు కఠిన శిక్షలు విధించే 2014 యాంటి హైజాకింగ్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం


✿భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, 3 డిసెంబర్ 2014న నల్లధనం దోషులను శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం నల్లధనాన్ని కలిగిన ఉన్న వారిని 31 మార్చి 2015 కల్లా శిక్షించాలని ఈ ధర్మాసనం తెలిపింది. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్ మరియు జస్టిస్ ఏకే సిక్రీ లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్, నల్లధనం కేసులను దర్యాప్తు చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది.


✿సూపర్ కంప్యూటర్ రంగంలో దేశ అవసరాలను తీర్చడంతో పాటు ప్రపంచానికి దీటుగా ఎదిగేందుకు 'జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌'ను ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


✿"ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 'సుకన్య సమృద్ధి ఖాతా' పథకాన్ని ఆరంభించింది. బ్యాంకులు లేదా తపాలా కార్యాలయాల్లో ఈ ఖాతాను తీసుకోవచ్చు.
 » 'సుకన్య సమృద్ధి ఖాతా' పథకం కింద పదేళ్ల లోపు ఆడపిల్లల పేరిట ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ పథకం ముగుస్తుంది. అయితే 14 ఏళ్లు పూర్తయ్యేంత వరకు డబ్బు జమ చేయాల్సి ఉంటుంది.
    » ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య, వివాహం కోసం ఖాతాలో జమైన దాంట్లో సగం మొత్తాన్ని తీసుకోవచ్చు.
    » చిన్న మొత్తాలను సేకరించడం; వాటిని అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం ఈ పథకం లక్ష్యం."



✿ముంబయి తీరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని నెలకొల్పేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది.


 ✿దోష నిరూపణ జరిగినవారు మినహా, జైల్లో ఉన్న ఇతరులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 'దోష నిరూపణ జరిగి, శిక్ష ఖరారైతే సరే. కానీ, ఎఫ్ఐఆర్ నమోదు కావడం, నిర్బంధంలో ఉండటం అనే కారణాలు ఒక వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడానికి సరిపోవు' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.


✿"పంజాబ్‌లో కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు (క్యాటరాక్ట్ సర్జరీ) వికటించి సుమారు 60 మంది చూపు కోల్పోయారు.
» పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా గుమన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది."
సరిహద్దు ఆవలి నుంచి వచ్చిన ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లో సైనికులను లక్ష్యంగా చేసుకుని నాలుగు చోట్ల దాడులు చేశారు. అవి: ఉరీలో సైనిక శిబిరం, శ్రీనగర్ శివారు సౌరా, త్రాల్ బస్టాండ్, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్.


 ✿రెండో జాతీయ లోక్ అదాలత్‌లో ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 1.25 కోట్ల కేసులకు పరిష్కారం లభించింది. మోటారు వాహన ప్రమాదాల్లో రూ.3000 కోట్లు పరిహారంగా చెల్లించారు.


✿"2014 నవంబరు 30కి దేశంలోని ప్రైవేటు టెలివిజన్ ఛానళ్ల సంఖ్య 821కి చేరినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
» గత డిసెంబరులో మొత్తం 784 ఛానళ్లు ఉండగా, ప్రస్తుత డిసెంబరుకి వీటి సంఖ్య 821కి చేరింది. అంటే ఒక ఏడాదిలో 37 ఛానళ్లు అందుబాటులోకి వచ్చాయి.
    » ఈ 821 ఛానళ్లలో 404 ఛానళ్లు వార్తలు, కరెంట్ అఫైర్స్ సంబంధ కార్యక్రమాల ప్రసారానికి ఉద్దేశించినవి కాగా, ఈ తరహా కార్యక్రమాల ప్రసారంతో సంబంధం లేనివి మరో 417 ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతితో దేశంలో ప్రసారాలను కొనసాగిస్తున్నాయి. "
అంతర్జాల ఆధారిత పాలనారీతులకు దర్పణం పట్టే విధంగా కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన 'మొబైల్ వన్ (ఎం-1)' సేవలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బెంగళూరులో ప్రారంభించారు. ఏక గవాక్ష మార్గం ద్వారా చరవాణి ఆధారంగా వివిధ రకాల ప్రజా అవసర కార్యక్రమాలు, సమాచార మార్పిడికి ఈ వ్యవస్థ అనుకూలిస్తుంది.



✿"జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
» మూడో దశలో జమ్మూకశ్మీర్‌లో 58%, ఝార్ఖండ్‌లో 61.78% పోలింగ్ నమోదైంది."



✿"గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో సౌలభ్యాన్ని కల్పించింది. ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులు ఏడాదిలో 14.2 కేజీల సిలిండర్లను పన్నెండు వరకు రాయితీపై పొందుతున్నారు. ఇక నుంచి 5 కేజీల సిలిండర్లను సబ్సిడీపై పొందేందుకు వారికి అవకాశం దక్కింది. దిల్లీలో ఈ సిలిండరు ధర రూ.155. అయితే ఏడాదికి వీటి సంఖ్య 34కి మించకూడదు. అంతకు మించి వినియోగిస్తే బహిరంగ విపణిలో అందుబాటులో ఉన్న ధర రూ.351ను చెల్లించాల్సి ఉంటుంది.
 » వినియోగదారులు గ్యాస్ డీలర్ల వద్ద 14.2 కేజీల లేదా 5 కేజీల సిలిండర్లలో ఏదో ఒకటే పొందొచ్చు. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలనుకుంటున్నారో ఏడాది ప్రారంభంలోనే డీలర్‌కు స్పష్టం చేయాలి. ఏడాది మధ్యలో ఒక సిలిండర్ నుంచి మరో సిలిండరుకు మారడానికి కుదరదు. డీలర్ వద్ద నమోదు చేయించుకోని వినియోగాదారులు పెట్రోల్ బంకుల వద్ద 5 కిలోల సిలిండర్లను పొందవచ్చు."



 ✿బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.



✿ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి పరిమితం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బాసెల్ 3 ప్రమాణాల మేరకు అదనపు మూలధనం కోసం అవసరమైన రూ.1.60 లక్షల కోట్లను ఈక్విటీ మార్కెట్ల నుంచి సమీకరించేందుకు అనుమతించింది.



✿పర్యావరణహిత, ఇంధన భద్రతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, సౌర పార్కులకు ఆమోదం తెలిపింది. 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 25 సౌరపార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ పార్కులను అయిదేళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.



✿రూ.3 లక్షలలోపు సల్పకాలిక పంట రుణాలు తీసుకున్న రైతులకు ఏడు శాతం వడ్డీరేటును, సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి మూడు శాతం వడ్డీరేటును కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.



✿తమిళనాడులో రూ.1593 కోట్ల వ్యయంతో విద్యుత్తు ప్రసార వ్యవస్థ (ట్రాన్స్‌మిషన్) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది.



✿మొండి బకాయిల వసూళ్లను వేగవంతం చేసేందుకు ఆరు రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. వీటిని ఛండీగఢ్, బెంగళూరు, ఎర్నాకుళం, డెహ్రాడూన్, శిలిగురి, హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారు.
లోక్‌పాల్ ఛైర్‌పర్సన్, సభ్యులను ఎంపిక చేసే కమిటీలో లోక్‌సభలో విపక్ష పెద్ద పార్టీ నేత మల్లికార్జున ఖర్గేను చేర్చుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 విదేశాల్లో పోగుపడిన నల్లధనం అంశంలో మరో ముందడుగు పడింది. నల్లధనంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పంచింది. ఈ నివేదిక ప్రకారం 339 మంది భారతీయులు స్విస్ బ్యాంకుల్లో రూ.4,479 కోట్ల నల్లధనాన్ని దాచినట్లు వెల్లడించింది. దేశీయంగా లెక్కల్లో చూపని ధనం రూ.14,958 కోట్లుగా తేల్చింది.



✿తూర్పు నావికా దళంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఐఎన్ఎస్ సర్కార్స్ 75 వసంతాలను పూర్తి చేసుకుంది.



✿"కొత్త కంపెనీల చట్టంలో 14 సవరణలు చేయడానికి 'కంపెనీల చట్టం (సవరణ) బిల్లు -2014'ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
» చట్ట విరుద్ధంగా పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టి, నిధులను సమీకరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి, దేశంలో వ్యాపారాన్ని మరింత సులభం చేయడానికి ఈ సవరణలు దోహదం చేస్తాయి."



 ✿అయిదేళ్లకు మించి పాతబడిన యంత్రాల దిగుమతులపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల దేశీయ తయారీ రంగంలో ఉత్పత్తి వ్యయం తగ్గి, కంపెనీల పోటీతత్వం పెరుగుతుంది.



✿'బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) బిల్లు-2014'ను మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది.



✿" కర్ణాటక అసెంబ్లీలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు.
» బీజేపీ సభ్యుడు ప్రభు చవాన్ తన సెల్‌ఫోన్‌లో ప్రియాంక గాంధీ ఫోటోను జూమ్ చేసి చూస్తూ టీవీ కెమెరాకు చిక్కిన ఘటన నేపథ్యంలో నిషేధం విధించారు."



✿" సామాజిక అంశాల కేసుల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక 'సామాజిక న్యాయ ధర్మాసనం' విచారణలు ప్రారంభించింది.
» తొలి రోజు నర్మదా ప్రాజెక్టు, ఇళ్లు లేనివారికి ఆశ్రయం, సర్కస్‌లలో పనిచేసే పిల్లల శ్రమను దోచుకోవడం తదితర కేసులను చేపట్టింది. "



✿"భారత పార్లమెంటుపై 2001 డిసెంబరు 13న చేసిన దాడి ఘటనకు 13 సంవత్సరాలు పూర్తయింది.
ఆ రోజున అయిదుగురు సాయుధులు పార్లమెంటు ఆవరణలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి తొమ్మిదిమందిని హతమార్చారు. ఈ కేసులో దోషి అఫ్జల్‌గురుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉరిశిక్ష అమలైంది."



✿జాతీయ అవార్డు సాధించిన హిందీ చిత్రం 'జల్' 87వ ఆస్కార్ అవార్డుల రేస్‌లో నిలిచింది. ఉత్తమచిత్రం, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీల్లో ఈ చిత్రానికి నామినేషన్లు దక్కాయి. ఈ సినిమాకి గిరీష్ మాలిక్ ‌దర్శకత్వం వహించగా, సోను నిగమ్, బిక్రమ్ ఘోష్ సంగీతమందించారు.



✿ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశవాణిలో మూడో విడత 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా యువతను ఉద్దేశించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు స్వస్తి పలకాలని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలతో త్రీ'డీ' సమస్యలు (డార్క్‌నెస్ - అంధకారం, డిస్ట్రక్షన్ - విధ్వంసం, డివాస్టేషన్ - వినాశనం) ఉన్నాయని ఆయన చెప్పారు.



✿జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నాలుగో దశ ప్రశాంతంగా ముగిసింది. కశ్మీర్‌లో 49% ఝార్ఖండ్‌లో 61.65% చొప్పున పోలింగ్ నమోదైంది.



✿బీహార్ రాష్ట్రం సహస్ర జిల్లాలోని పర్మినియా గ్రామంలో దహ్వాదేవి(65) అనే మహిళ మరణించిన తన భర్త చరిత్రాయాదవ్ (70) చితికి పెట్టిన మంటల్లోకి దూకి సతీసహగమనానికి పాల్పడింది.



✿ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కడా మత మార్పిడి లేదా తిరిగి అదే మతంలోకి వచ్చేవారిని ఆహ్వానించడం (ఘర్‌వాపసీ) లాంటి కార్య్రమాలను అనుమతించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.



✿వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధి నుంచి పెట్రోలియంను వేరుగా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిగా 2016 ఏప్రిల్ నుంచి ప్రతిపాదించిన కొత్త పన్ను వ్యవస్థలో ప్రవేశ పన్నును జోడించేందుకు రాష్ట్రాలు అంగీకరించాయి.



✿2జీ కుంభకోణం కేసులపై దర్యాప్తు బాధ్యతలు చేపట్టేందుకు సీబీఐ కొత్త సంచాలకులు అనిల్ సిన్హాకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.



✿ప్రభుత్వ భవనాల్లో అక్రమంగా నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించేందుకు ఉద్దేశించిన ఒక బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.



✿ఉగ్రవాద సంస్థ 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)'ను భారత్‌లో నిషేధించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు



✿మత పుస్తకాలు, పత్రికలను 90 ఏళ్లుగా ముద్రిస్తూ జనాదరణ పొందిన ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని చారిత్రక గీతా ప్రెస్ నిరవధికంగా మూతపడింది.



✿ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పై రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది.



✿ కంపెనీల చట్టంలో సవరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే కాక, వ్యాపార నిర్వహణ సులభతరమవుతుందని ప్రభుత్వం పేర్కొంది.



✿ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్థాన్ బెయిల్ మంజూరు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. బెయిల్ మంజూరును ముక్త కంఠంతో ఖండిస్తూ లోక్‌సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోని 5 కోట్ల మందికి పైగా ఖాతాదారుల డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 8.75% వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


 ✿కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజనను ప్రారంభించింది. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన స్థానంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.



✿జమ్ముకశ్మీర్‌లో అయిదు దశల్లో కలిపి అత్యధికంగా గత పాతికేళ్లలో ఎప్పుడూ లేని విధంగా 65% మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఝార్ఖండ్‌లో అయిదు దశల్లో కలిపి 66% మందికిపైగా ఓట్లు వేశారు.



✿"పునర్‌వ్యవస్థీకరించిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ)లో ముగ్గురు నిపుణుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 » విపత్తుల నష్టాల తగ్గింపు నిపుణుడు కమల్ కిషోర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్.సి.మార్వాహ్, బాబా అణు పరిశోధన కేంద్రంలో ఆరోగ్యం, భద్రత, పర్యావరణ గ్రూప్ డైరెక్టర్ డి.ఎన్.శర్మ పేర్లను ప్రధాని మోదీ ఆమోదించారు."



✿ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్‌బీ) అధీకృత మూలధనాన్ని 2,000 కోట్ల రూపాయలకు పెంచడంతోపాటు క్యాపిటల్ మార్కెట్‌ల నుంచి అవి నిధులు సమీకరించుకునే వెసులుబాటు కల్పిస్తూ ఒక బిల్లును లోక్‌సభ ఆమోదించింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56 ఆర్ఆర్‌బీలు ఉన్నాయి.



✿"లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి సవరణ చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపింది.
  » లోక్‌పాల్ అధ్యక్షుడు, సభ్యుల ఎంపిక కమిటీలో లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్షపార్టీ నేతను సభ్యుడిగా చేర్చేందుకు 'లోక్‌పాల్, లోకాయుక్త ఇతర సంబంధిత చట్టం సవరణ బిల్లు, 2014' వీలు కల్పిస్తుంది."



✿"ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబరు - 23 ప్రకటించారు.
» ఝార్ఖండ్‌లో మొత్తం స్థానాలు 81. భాజపా అత్యధికంగా 37 స్థానాలను గెలుచుకుంది. జేఎంఎం 19 స్థానాలు, జేవీఎం (పీ) 8 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, ఏజేఎస్‌యూ 5 స్థానాలు, ఇతరులు 6 స్థానాల్లో గెలిచారు.
» జమ్ముకశ్మీర్‌లో మొత్తం స్థానాలు 87. పీడీపీ అత్యధికంగా 28 స్థానాల్లో గెలుపొందింది. భాజాపా 25 స్థానాలు, ఎన్‌సీ 15 స్థానాలు, కాంగ్రెస్ 12 స్థానాలు, జేకేపీసీ 2 స్థానాలు, ఇతరులు 2 స్థానాలు, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు."



✿అసోంలోని సోనిట్‌పూర్, కోక్ర ఝార్ జిల్లాల్లో ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్) తీవ్రవాదులు నాలుగుచోట్ల జరిపిన దాడుల్లో 43 మంది మరణించారు. 



✿2005 కంటే ముందు ముద్రితమైన రూ.500, రూ.1000 సహా వివిధ కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బీఐ గడువును పొడిగించింది. జూన్ 30, 2015 వరకు అందుకు అనుమతించింది. డిసెంబరు 31, 2014కి నోట్లను మార్చుకోవాలని మార్చి 2014లో గడువును విధించింది. దాన్ని తాజాగా మరో 6 నెలలు పొడిగించింది.



✿ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారంలో మరోసారి మనకు నిరాశే ఎదురయింది. గీతూ మోహన్ దాస్ రూపొందించిన 'లయర్స్ డైస్' చిత్రం ప్రాథమిక వడపోతలోనే వైదొలగింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ చిత్రాన్ని ప్రతిపాదించారు. తదుపరి పరిశీలన కోసం నిలిచిన తొమ్మిది చిత్రాల్లో దీనికి చోటు దక్కలేదు.



✿"బనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దేశ విద్యారంగ దిశను మార్చిన దివంగత నేత మదన్ మోహన్ మాలవ్య; భారత మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయీకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను డిసెంబరు - 24ప్రకటించింది. రాష్ట్రపతి కార్యాలయం ఈ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
» తాజా ప్రకటనతో ఇప్పటివరకు 'భారతరత్న'ను పొందిన వారి సంఖ్య 45కు చేరింది."
"మదన్ మోహన్ మాలవ్య గురించి చర్చించుకుందాం 
 ✿మదన్ మోహన్ మాలవ్య 1861 డిసెంబరు 25న అలహాబాద్‌లో జన్మించారు. 1946 నవంబరు 12న వారణాసిలో మరణించారు.
 ✿భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ మితవాద భావజాలానికి మాలవ్య ప్రతీక. 1909, 1918, 1932, 1933 సంవత్సరాల్లో పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
 ✿ఆసియాలోనే అతిపెద్ద గురుకుల విశ్వవిద్యాలయమైన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం రూపకర్తగా మాలవ్య ప్రసిద్ధులు. 1911లో అనిబిసెంట్, మాలవ్యలు కలిసి ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనిబిసెంట్ 1898లో తాను ఏర్పాటు చేసిన హిందూ కళాశాలను ఈ విశ్వవిద్యాలయంలో విలీనం చేసేందుకు అంగీకరించారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 1915లో బ్రిటిష్ పార్లమెంట్ చట్టం చేసింది. 1916లో విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. నాటి నుంచి వీసీగా ఉన్న మాలవ్య 1939లో ఆ బాధ్యతలను సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు అప్పగించారు.

 ✿మాలవ్య హిందూస్థాన్ పత్రికకు సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. తర్వాత అలహాబాద్ వెళ్లి న్యాయవాద విద్యను అభ్యసించి, న్యాయవాద వృత్తిని చేపట్టారు. చౌరీ చేరా సంఘటనలో ఉరిశిక్ష పడిన 177 మంది ఖైదీల కోసం వాదించి 156 మందిని నిర్దోషులుగా విడిపించారు. న్యాయవాద వృత్తిని 1911లో విశ్వవిద్యాలయ స్థాపన లక్ష్యం కోసం వదిలేశారు. మాలవ్య 1912 నుంచి 1926 వరకు బ్రిటిష్ ఇండియా జాతీయ చట్టసభల్లో సభ్యుడిగా ఉన్నారు. సహాయనిరాకరణ ఉద్యమంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు. ముస్లింలను మెప్పించే క్రమంలోనే కాంగ్రెస్ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు పలికిందంటూ దాన్ని వ్యతిరేకించారు.

 ✿భారతదేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు వచ్చిన సైమన్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ 1928లో లాలా లజపతిరాయ్, జవహర్‌లాల్ నెహ్రులతో కలిసి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంప్రదింపులకు వెళ్లిన బృందంలో మాలవ్య కూడా ఉన్నారు. 1932లో 'బై ఇండియన్' ఉద్యమాన్ని ప్రారంభించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మాలవ్యను బ్రిటిష్‌వారు అరెస్టు చేశారు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు అంగీకరించిన కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, 'జాతీయవాద కాంగ్రెస్ పార్టీ'ని స్థాపించారు.

✿ 1924 నుంచి 1946 వరకు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఛైర్మన్‌గా పనిచేశారు.
 హిందూ మతంలో కులాల అంతరాన్ని మాలవ్య తీవ్రంగా వ్యతిరేకించారు. దళితవాడల్లో సామాజిక కార్యక్రమాలను ప్రారంభించి, వారికి ఆలయ ప్రవేశాల్ని కల్పించారు. 'సత్యమేవ జయతే' నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. 

✿ హరిద్వార్‌లో ఆయన ప్రారంభించిన గంగా హారతి కార్యక్రమం ఇప్పటికీ 'మాలవ్య ద్వీప' పేరుతో కొనసాగుతోంది. పార్లమెంటు ప్రధాన మందిరంలో మాలవ్య నిలువెత్తు చిత్ర పటాన్ని తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. 


అటల్ బిహారీ వాజ్‌పేయీ గురించి చర్చించుకుందాం 
 ✿మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న వాజ్‌పేయీ జన్మించారు. గ్వాలియర్‌లోని విక్టోరియా (ప్రస్తుతం లక్ష్మీబాయి) కళాశాల, కాన్పూర్‌లోని డీఏవీ కళాశాలలలో ఆయన విద్యనభ్యసించారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా 1942లో జైలుకెళ్లారు. ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) కార్యకర్తగా కూడా పని చేశారు.

 ✿భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా, పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా వాజ్‌పేయీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

 ✿వాజ్‌పేయీ పాత్రికేయుడిగానూ రాణించారు. హిందీ మాసపత్రిక రాష్ట్రధర్మ సంపాదకుడిగా పనిచేశారు. హిందీ వారపత్రిక పాంచజన్య, దినపత్రికలు స్వదేశ్, వీర్ అర్జున్ లకు కూడా సంపాదకుడిగా విధులు నిర్వర్తించారు.

✿ 9 సార్లు లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించారు. తొలిసారిగా రెండో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

 ✿మూడు సార్లు భారత ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 1996లో బీజేపీ ఆధ్వర్యంలోని తొలి సంకీర్ణ ప్రభుత్వం 13 రోజులకే పడిపోవడంతో ఆయన కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు. 1998-99 మధ్య రెండోసారి, 1999 అక్టోబరు 13 నుంచి 2004 మే 13 వరకు మూడోసారి ప్రధానిగా వ్యవహరించారు.
 1998 మే 11, 13న రెండుసార్లు సాహసోపేతమైన అణు పరీక్షలను నిర్వహించి సంచలనం సృష్టించారు.

✿ పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలను నెలకొల్పేందుకు అమిత చొరవ తీసుకున్నారు. 1999 ఫిబ్రవరిలో లాహోర్ బస్సు యాత్రను చేపట్టారు.

 ✿దేశంలోని నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ 'స్వర్ణ చతుర్భుజి' పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులను నిర్మించారు. వందల ఏళ్ల తర్వాత దేశంలో చేపట్టిన అతిపెద్ద రోడ్ల నిర్మాణం ఇదే.

 ✿'అందరికీ ప్రాథమిక విద్య' అనే భారీ లక్ష్యంతో సర్వశిక్షా అభియాన్‌ను ప్రారంభించారు.

✿ రాజకీయ ఏకాభిప్రాయంతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూడు కొత్త రాష్ట్రాలను (ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్) ఏర్పాటు చేశారు.

 ✿వాజ్‌పేయీ ప్రభుత్వం తెచ్చిన కొత్త టెలికం విధానం దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. అప్పటి వరకు టెలికం అందుబాటు రేటు 3 శాతం (1999లో) మాత్రమే ఉండగా, 2012 అక్టోబరు నాటికి 70 శాతానికి చేరింది.
 సుధీర్ఘ పాలన అందించిన కాంగ్రెసేతర ప్రధాని ఆయనే.

 ✿వాజ్‌పేయీ అత్యుత్తమ హిందీ కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన కవితలు అత్యంత సున్నితమైన ఆయన వ్యక్తిత్వాన్ని, అపారమైన దేశ భక్తిని, సామాన్యుల అవస్థలపై ఆందోళనను, ప్రజాస్వామ్యం పట్ల చిత్త శుద్ధిని ప్రతిబింబిస్తాయి.

✿వాజ్‌పేయీ రచనలు: 'మేరీ సంసదీయ యాత్ర'(నాలుగు సంపుటాలు), 'సంకల్ప్ కాల్', 'శక్తి సే శాంతి', 'ఫోర్ డెకేడ్స్ ఇన్ పార్లమెంట్' (మూడు సంపుటాల్లో ప్రసంగాలు 1957-95) 'లోక్‌సభా మే అటల్ జీ' (ప్రసంగాల సంకలనం), 'మృత్యు యా హత్య', 'అమర్ బలిదాన్', 'ఖైదీ కవిరాజ్ కీ కుండలియాన్' (అత్యవసర సమయంలో జైల్లో ఉండగా రాసిన కవితల సంకలనం), 'న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ' (1977-79 మధ్య విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ప్రసంగాల సంకలనం), 'జనసంఘ్ ఔర్ ముసలమాన్', 'సంసద్ మే తీన్ దశక్' (పార్లమెంటులో హిందీ ప్రసంగాలు 1957-92 మూడు సంపుటాలు), 'అమర్ ఆగ్ హై' (కవితల సంకలనం - 1994) అనే మొదలైన పుస్తకాలను రచించారు. ఆయన రచించిన 'ఇక్యావన్ కవితాయే' పుస్తకం భారీగా అమ్ముడైంది."
                                                   *   *   *

✿ అసోంలో ఎన్‌డీఎఫ్‌బీ (ఎస్) తీవ్రవాదుల హింస మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. తీవ్రవాదుల మారణకాండలో మృతి చెందిన వారి సంఖ్య 65కు చేరింది.



✿"మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ పుట్టినరోజుని 'సుపరిపాలనా దినం'గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 » ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుతో సహా అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా 'సుపరిపాలన'ను సాధించాలంటే ప్రధానంగా 8 సూత్రాలకు సమధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నాయి"



✿"స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమ ప్రచారంలో భాగస్వాములవ్వాల్సిందిగా రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, మరికొంత మంది ప్రముఖులను, సంస్థలను నామినేట్ చేశారు.
ప్రధాని ఆహ్వానించిన ప్రముఖులు, సంస్థలు
 పద్మనాభ బాలకృష్ణ ఆచార్య (నాగాలాండ్ గవర్నర్)

 కిరణ్ బేడీ (సామాజిక కార్యకర్త, మాజీ ఐపీఎస్)

 సౌరవ్ గంగూలీ (క్రికెటర్)

 కపిల్ శర్మ (టీవీ వ్యంగ్య కార్యక్రమాల ప్రయోక్త)

 సోనాల్ మాన్‌సింగ్ (ఒడిస్సీ నృత్యకళాకారిణి)

 రామోజీరావు (రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్)

 అరుణ్ పూరీ (ఇండియాటుడే గ్రూప్)

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌటెంట్స్ ఆఫ్ ఇండియా

 ఈనాడు గ్రూప్, ఇండియటుడే గ్రూప్, ముంబయి డబ్బావాలాలు"



✿బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా ఆయన పేరిట ఉపాధ్యాయ శిక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ వారణాసిలో ప్రారంభించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 'ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.



✿భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రముఖంగా చాటిచేప్పేలా ప్రధాని నరేంద్ర మోదీ అయిదు రోజుల సాంస్కృతికోత్సవం 'సంస్కృతి'ని వారణాసిలో ప్రారంభించారు. నృత్యం, నాటకం, సాంస్కృతిక అంశాలపై చలన చిత్రాలు మొదలైన అంశాలను ఈ సాంస్కృతికోత్సవంలో ప్రదర్శిస్తారు



✿భారత్-పాక్ సరిహద్దులోని నదీ ప్రాంతాల్లో కాపలా క్లిష్టతరంగా మారడంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సరికొత్త యోచన చేసింది. ఇలాంటి చోట ఉగ్రవాదులు సరిహద్దులు దాటి రాకుండా లేజర్ గోడల్ని ఏర్పాటు చేయడం ప్రారంభించింది. బీఎస్ఎఫ్ 'ఫర్హీన్ లేజర్ గోడ' లాంటి సొంత సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసింది.



 ✿గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ఝార్ఖండ్‌లో పద్నాలుగేళ్లుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయానికి భాజపా తెరదించింది. రాష్ట్రానికి తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్‌ను ఎంపిక చేసింది. ఇటీవల ఎన్నికల్లో 37 స్థానాల్లో విజయం సాధించిన భాజపా తమతో కలిసి ఎన్నికల బరిలోకి దిగి 5 సీట్లలో గెలుపొందిన ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.



✿"బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపునకు మార్గం సుగమం చేసే ఆర్డినెన్స్, రద్దు చేసిన బొగ్గు క్షేత్రాల పునః కేటాయింపులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు.
 » 'బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) బిల్లు- 2014' లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో మాత్రం ముందుకు కదలలేదు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు బొగ్గు క్షేత్రాలను ఈ-వేలం వేయడానికి, నేరుగా కేటాయించేందుకు వీలవుతుంది."



✿"దేశంలోని 16 ప్రధాన నగరాల్లో వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగదారులకు వివిధ సేవలు అందించడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పనున్నారు.
 » దిల్లీ, లక్నో, చంఢీగఢ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, పుణె, భువనేశ్వర్, పాట్నా, కోల్‌కతా, గువహతి, షిల్లాంగ్, రాయ్‌పూర్, భోపాల్ నగరాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు."



✿"డిసెంబరు - 26 : చెన్నై తీరాన్ని అతలాకుతలం చేసి సుమారు 7 వేల మందిని పొట్టన పెట్టుకున్న సునామి ఘటన జరిగి పదేళ్లు గడిచాయి.
 » హిందూ మహా సముద్రంలో సంభవించిన పెను భూకంపం కారణంగా ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ప్రారంభమై అండమాన్ మీదుగా 2004లో చెన్నై తీరాన్ని తాకిన జలప్రళయం ఎన్నో జీవితాలను కబళించింది."



✿ఝార్ఖండ్‌లో భాజపా ఏజేఎస్‌యూ ప్రభుత్వం కొలువుదీరింది. భాజాపా నేత రఘువర్ దాస్ (59 సంవత్సరాలు) రాష్ట్ర పదో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో రాష్ట్ర తొలి గిరిజనేతర సీఎంగా ఆయన అవతరించారు.



 ✿మన దేశంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మరణిస్తున్నవారి సంఖ్య ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉంది. 2013లో ఉత్తరప్రదేశ్‌లో 79,616 మంది క్యాన్సర్‌తో మరణించారు.



✿కర్ణాటక రాజధాని బెంగళూరులో బ్రిగేడ్ రోడ్డు సమీపంలోని చర్చి వీధిలో ఓ హోటల్ వద్ద బాంబు పేలుడు సంభవించి, ఒక మహిళ మరణించింది.



✿కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాన్ని దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.



✿ సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.


రాష్ట్రీయం 
✿ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని లోసరి కాలువపై తొలి సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


 ✿ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, సింగపూర్, వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ (ఇన్‌క్యాప్), సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ ప్రైజెస్ (ఎస్ఎస్ఈ) అధికారులు హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర బృహత్ ప్రణాళిక, నిర్మాణ ప్రణాళిక తయారీకి అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సింగపూర్ సహకారంతో ఆంధ్రపదేశ్‌కు స్మార్ట్ రాజధాని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.


✿"ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి ఐటీ శాఖ రూపొందించిన దార్శనిక పత్రానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
» 2020 నాటికి 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే లక్ష్యాన్ని సాధించడం; ఏపీని భారతదేశ సిలికాన్ కారిడార్‌గా తీర్చిదిద్దడం; ఎలక్ట్రానిక్ రంగంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ-పరిపాలన, ఐటీ ఎలక్ట్రానిక్ రంగం, కొత్త ఆలోచన అథారిటీలను ఏర్పాటు చేసింది. "


✿"తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు కొత్త మంత్రులు ప్రమాణ డిసెంబరు - 16 స్వీకారం చేశారు.
» రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం జిల్లా), అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), అజ్మీరా చందూలాల్ (వరంగల్), జూపల్లి కృష్ణారావు (మహబూబ్‌నగర్), తలసాని శ్రీనివాస యాదవ్ (హైదరాబాద్), చర్లకోల లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్)తో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
       » 2014 జూన్ రెండో తేదీన 12 మందితో కేసీఆర్ మంత్రివర్గం ఏర్పడింది. కొత్తగా చేరిన వారితో కలిసి, మంత్రివర్గ సభ్యుల సంఖ్య 18కి పెరిగింది.
నూతన మంత్రులు - శాఖలు
       » తుమ్మల నాగేశ్వరరావు - రోడ్లు, భవనాలు; స్త్రీ, శిశు సంక్షేమం

       » అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి - గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ

       » తలసాని శ్రీనివాస యాదవ్ - వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ

       » చర్లకోల లక్ష్మారెడ్డి - విద్యుత్

       » అజ్మీరా చందూలాల్ - గిరిజన సంక్షేమం, పర్యటక, సాంస్కృతిక

       » జూపల్లి కృష్ణారావు - పరిశ్రమలు, చేనేత, జౌళి, చక్కెర

       » వీరితో పాటు అబ్కారీ శాఖ మంత్రి టి.పద్మారావుకు అదనంగా క్రీడలు, యువజన సర్వీసులు శాఖను కేటాయించారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు తాజాగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖను కేటాయించారు."


✿"దేశ వ్యాప్తంగా కేంద్రం నిర్మిస్తున్న సౌర విద్యుత్ పార్కులకు ఆర్థిక చేయూతినిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చాయి.
 » సహాయం అందించేందుకు ఈ రెండు ఆర్థిక సంస్థలకు రాష్ట్రాలను కేటాయిస్తూ జాతీయ విద్యుత్ గ్రిడ్ సంస్థ (పీజీసీఎల్) తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంధన శాఖలకు లేఖలు రాసింది.
       » ఆంధ్రప్రదేశ్‌లో 2500, తెలంగాణలో 1000, మధ్యప్రదేశ్‌లో 750 మెగావాట్ల సౌర విద్యుత్ పార్కుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణసాయం అందుతుందని లేఖలో పేర్కొన్నారు.
       » పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నిర్మించే సౌర విద్యుత్ పార్కులకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సాయం చేస్తుంది.
       » ఈ పార్కుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 5500 ఎకరాలు; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 5,438 ఎకరాలను కేటాయించారు. "


✿" దేశ వ్యాప్తంగా సుమారు 1.17 కోట్ల మంది ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా లోక్‌సభలో వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 230 జిల్లాల్లో ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు.
 » ఫ్లోరోసిస్ సమస్య రాజస్థాన్‌లో అధికంగా ఉండగా, తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
       » తెలంగాణలోని 1174 ప్రాంతాల్లో 19 లక్షల మంది ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌లోని 745 ఆవాస ప్రాంతాల పరిధిలో సుమారు 11 లక్షల మంది ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు."
 గతేడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రాతిపదికగా 'తెలంగాణ రాష్ట్ర న్యాయబద్ధమైన పరిహారం హక్కు - భూసేకరణలో పారదర్శకత సహాయ, పునరావాస నిబంధనలు 2014'ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త విధానం ద్వారానే భూసేకరణ చేయాల్సి ఉంటుంది.


✿పంచారామాల్లో ఒకటైన గుంటూరు జిల్లా అమరావతిని వారసత్వ నగరం (హెరిటేజ్ సిటీ)గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.దేశ వ్యాప్తంగా 12 నగరాలను వారసత్వ నగరాలుగా ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతికి చోటు దక్కింది.


✿హుద్‌హుద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తి సహకారం అందించాలని కేంద్రానికి విన్నవిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.


✿హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) దాదాపు కాగిత రహిత కార్యాలయంగా అవతరించింది. దేశంలో మరే నగర పాలక సంస్థ చేపట్టని రీతిలో ఇది ఈ-కార్యాలయ (ఈ-ఆఫీస్) విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాలనకు సంబంధించి అన్ని పనులకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇస్తున్నారు. 


✿ఈ ఏడాది డిసెంబరు - 21 ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా లంబసింగిలో 0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతక ముందు 2012 జనవరి 14న ఇక్కడ సున్నా డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


✿ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ) బిల్లును ఆంధ్రపదేశ్ శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.


✿2015 గణతంత్ర వేడుకల్లో శకటాల ప్రదర్శనకు ఈసారి ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే 'సంక్రాంతి సంబరాలు' గణతంత్ర వేడుకల్లో దేశవ్యాప్తంగా అలరించనున్నాయి.2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య శకటం తర్వాత మళ్లీ ఇప్పుడే గణతంత్ర వేడుకల్లో ఏపీ రాష్ట్ర శకటానికి అవకాశం వచ్చింది.


✿తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పనున్న ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


✿మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది శివారులో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు.


✿సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి సంస్థకు చెందిన 10 ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించారు.


✿" ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో స్థానాల సంఖ్యను 58కి పెంచుతూ 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం -2014'లో సెక్షన్ 23ను సవరించడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.
» నవ్యాంధ్రప్రదేశ్‌లో శాసన సభ్యుల సంఖ్య 175. రాజ్యాంగం ప్రకారం ఈ సంఖ్యలో మూడోవంతుకు సమానమైనంత (58) మంది శాసనమండలిలో సభ్యులుగా ఉండవచ్చు. ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉన్నారు."


✿స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 20,000 మరుగుదొడ్లను నిర్మించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సత్తెనపల్లిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన స్థానిక శాసనసభ్యుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛ సత్తెనపల్లిని స్ఫూర్తిగా తీసుకుని నూరు శాతం మరుగుదొడ్లతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మస్తామని సీఎం ప్రకటించారు.


✿" సుదీర్ఘ కసరత్తు అనంతరం రాష్ట్రంలో అఖిల భారత సర్వీస్ (ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది.
 » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.
       » ఐఏఎస్‌లలో 166 మందిని ఏపీకి, 128 మందిని తెలంగాణకు కేటాయించింది. మరో అయిదుగురిని పని చేస్తున్న చోటే (నలుగురు తెలంగాణ, ఒక్కరు ఏపీ) కొనసాగించాలని ఆదేశించింది.
       » ఐపీఎస్‌లలో 119 మందిని ఏపీకి, 92 మందిని తెలంగాణకు కేటాయించింది.
       » ఐఎఫ్ఎస్‌లలో ఏపీకి 76, తెలంగాణకు 51 మందిని కేటాయించింది.
       » ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది."


✿హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న మొత్తం భూమి 76,92,614 హైక్టార్లు. ఇది 7,493 చదరపు కిలో మీటర్లకు సమానం. ఇందులో అటవీ భూముల విస్తీర్ణం కేవలం 70,315 హైక్టార్లు (మొత్తం భూమిలో 9.15 శాతం) మాత్రమే అని ప్రభుత్వం వెల్లడించింది.


✿రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలకు భారీగా ప్రవేశపెట్టిన కొన్ని ప్రత్యేక పథకాలకు అయిదేళ్లలో రూ.56,645 కోట్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది


 ✿విద్యార్థినుల ఆత్మరక్షణ శిక్షణ పథకానికి 'రాణి రుద్రమ సేన' అనే పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.


 ✿గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం  డిసెంబరు - 28 ముగిసింది.


✿హైదరాబాద్‌ను శాంతి భద్రతల పరంగా లండన్, న్యూయార్క్ తరహాలో తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1.10 లక్షల సీసీ కెమెరాలు, అనుబంధంగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, వీటన్నింటినీ పర్యవేక్షించడానికి రూ.200 కోట్లతో హైదరాబాద్‌లో అత్యాధునిక పోలీస్ కమీషనరేట్ భవనాన్ని నిర్మిచాలని నిర్ణయించింది.


ఆర్ధికం 
✿పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పై అధిక ప్రబావం చూపే 8 కీలక రంగాలు అక్టోబరులో 6.3 శాతం వృద్ధి సాధించాయి. గత 4 నెలల్లో ఇదే గరిష్ఠం. బొగ్గు వెలికితీత, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్తు రంగాల్లో అధిక వృద్ధి వల్లే ఇది సాధ్యమైంది.


✿ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణకు శుభారంభం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి పెట్టుబడుల ఉపసంహరణైన సెయిల్ (SAIL-స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) షేర్ల విక్రయానికి రెండు రెట్లకు పైగా అధిక స్పందన వచ్చింది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.1715 కోట్లు సమకూరాయి


✿ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుల్లో నలుగురు (నారాయణ మూర్తి, నందన్ నీలేకని, ఎస్.డి.శిబూలాల్, కె.దినేష్) 1 బిలియన్ డాలర్ల విలువ (రూ.6,484 కోట్లు) చేసే షేర్లను మూకుమ్మడిగా విక్రయించారు. ఈ తొలి ప్రమోటర్లందరూ యాజమాన్య నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగిన నెలల వ్యవధిలోనే ఈ లావాదేవీలు జరిగాయి.


✿దేశ కరెంటు ఖాతా లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో 10.1 బిలియన్ డాలర్లు (రూ.60,600 కోట్ల)కు చేరింది. దేశ జీడీపీలో ఇది 2.1 శాతానికి సమానం.


✿2014 నవంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 4.38 శాతానికి చేరింది. 2012 జనవరిలో కొత్త గణాంకాలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన అతి తక్కువ స్థాయి సీపీఐ ద్రవ్యోల్బణం ఇదే. 


✿"ధరల పెరుగుదల రేటు నిలిచిపోయింది. 2014 నవంబరు నెలకు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 'సున్నా'గా నమోదైంది. గత అయిదున్నరేళ్లలో ఇదే కనిష్ఠం.
» ఆహార, ఇంధన, తయారీ వస్తువుల ధరలు తగ్గడంతో ద్రవోల్బణం సున్నాకు చేరిందని, 2009 జులైలో (-) 0.3 ప్రతికూల ద్రవోల్బణం నమోదైన తర్వాత అతి తక్కువ ద్రవ్యోల్బణం (సున్నా) ఇదేనని ప్రభుత్వం పేర్కొంది. సున్నాగా నమోదు కావడం ఇదే తొలిసారి.
       » 2013 నవంబరులో ద్రవోల్బణం 7.52%, 2014 అక్టోబరులో ద్రవ్యోల్బణం 1.77 శాతం ఉంది."


✿"ఎగుమతుల్లో వృద్ధి నమోదైనప్పటీకీ, అధిక పసిడి దిగుమతుల కారణంగా నవంబరు 2014లో వాణిజ్య లోటు ఏడాదిన్నర గరిష్ఠానికి చేరింది.
 » కిందటేడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 957 కోట్ల డాలర్లు కాగా, ఈ నవంబరులో 1686 కోట్ల డాలర్లుగా నమోదైంది.
       » వాణిజ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబరులో మొత్తం దిగుమతులు 26.79 శాతం అధికమై 4282 కోట్ల డాలర్లకు చేరాయి. ఎగుమతులు 7.27% పెరిగి 2596 కోట్ల డాలర్లకు చేరాయి."


✿"నల్లధనం చలామణి, పన్ను ఎగవేతను అడ్డుకోవడానికి సెబీ తీవ్ర చర్యలు తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నాయని అనుమానించిన 260 సంస్థలు, సంబంధిత వ్యక్తులను సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
¤ నల్లధనం చలామణి, పన్ను ఎగవేతను అడ్డుకోవడానికి సెబీ తీవ్ర చర్యలు తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నాయని అనుమానించిన 260 సంస్థలు, సంబంధిత వ్యక్తులను సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
¤  కేంద్ర ఆర్థిక శాఖ తన అర్థ సంవత్సర ఆర్థిక సమీక్షను ప్రకటించింది.
ముఖ్యాంశాలు
 ✿స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5.5 శాతానికి పెరిగే వీలుంది. రానున్న కాలంలో 7-8 శాతం వృద్ధిరేటు సాధ్యమే. గత రెండేళ్లూ వృద్ధి రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది.

 ✿వచ్చే అయిదు త్రైమాసికాల్లో వినియోగ ద్రవ్యోల్బణం 5.1-5.8 శాతం మధ్య ఉండే వీలుంది.

 ✿భారీగా తగ్గిన ద్రవ్యోల్బణం, చమురు ధరలు కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)ని పరిమితం చేయనున్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో సీఏడీ దాదాపు 2 శాతానికి పరిమితం కాగలదు. బంగారం దిగుమతులు పెరుగుతున్నా, చమురు ధరల క్షీణత ఆ భారాన్ని తగ్గిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి పరిమితం చేయడం కీలకం."


✿"ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంస్థ ప్రైవేటు రంగ బ్యాంకుల ఐబీఏ కమిటీని పునర్‌వ్యవస్థీకరించింది.
» ఈ కమిటీకి 2014 - 15 ఏడాదికి ఛైర్మన్‌గా శ్యామ్ శ్రీనివాసన్ ఎంపికయ్యారు. ఈయన ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
       » ఈ కమిటీలో 13 ప్రయివేటు రంగ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌లు సభ్యులుగా ఉంటారు.
       » ఈ కమిటీ ఐబీఏలో సభ్యత్వం ఉన్న ప్రైవేటు బ్యాంకుల అవసరాలు, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ కాలవ్యవధి ఒక ఏడాది."



అవార్డులు 
✿"2014 - చైనా శాంతి బహుమతి' క్యూబా కమ్యూనిస్టు దిగ్గజం ఫిడెల్ క్యాస్ట్రోకు లభించింది.
 » నోబెల్ శాంతి పురస్కారానికి సమాంతరంగా 2010 నుంచి 'కన్ఫ్యూసియస్ శాంతి బహుమతి' పేరుతో దీన్ని ప్రకటిస్తున్నారు."


✿"వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న 'ఆరోగ్య శ్రీ' హెల్త్ కేర్ ట్రస్ట్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.
» వివిధ వర్గాలకు అందిస్తున్న వైద్య సేవల నేపథ్యంలో 2013-14 సంవత్సరానికి 'సీఎస్ఐ-నిహిలెంట్ ఈ గవర్నెన్స్ సస్టెయిన్‌బిలిటీ' అవార్డును 'ఆరోగ్య శ్రీ' హెల్త్ కేర్ ట్రస్ట్ గెలుచుకుంది. "


✿"కృష్ణాజిల్లా గుడివాడ ఏఎన్నార్ జూనియర్ కళాశాలలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని ప్రముఖులకు అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
» శాస్త్రసాంకేతిక రంగంలో డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి; చట్టం, న్యాయం అంశంలో జస్టిస్ ఎస్.పర్వతరావు; సమాజ అభ్యున్నతిలో ఐఏఎస్ అధికారి సంపత్‌కుమార్; విద్యారంగంలో ఎం.ఎన్.రావు; చలన చిత్ర విభాగంలో కె.రాఘవేంద్రరావు; రంగస్థలంలో గుమ్మడి గోపాలకృష్ణ; వైద్య సేవల్లో డాక్టర్ ఎం.గోపీచంద్; సామాజిక సేవలో వంశీరామరాజు; క్రీడల విభాగంలో వెన్నం జ్యోతి సురేఖకు అవార్డులు ప్రదానం చేశారు."


✿"కేంద్ర సాహిత్య అకాడమీ దిల్లీలో 22 భాషల్లో పురస్కారాలను ప్రకటించింది. తెలుగులో 'మన నవలలు - మన కథానికలు' రచనకు ప్రముఖ తెలుగు రచయిత, విమర్శకుడు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ఉత్తమ విమర్శకుడిగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
  » ఆయన కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులుగా పని చేస్తున్నారు.
      » ఈ పురస్కారాలను మార్చి 9న ప్రదానం చేయనున్నారు. "


✿మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని హైదరాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి అమితాబ్ బచ్చన్‌కు ప్రదానం చేశారు.


క్రీడలు 
✿అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా బంగ్లాదేశ్ బౌలర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం రికార్డు సృష్టించాడు.


✿ముంబయిలో నిర్వహించిన దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీలో ఈస్ట్‌జోన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 24 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై విజయం సాధించింది.


✿ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో 2015 లో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం జాతీయ సెలక్షన్ కమిటీ 30 మంది ప్రాబబుల్స్‌ను ప్రకటించింది
.» జనవరి 7న ఈ ప్రాబబుల్స్‌ను 15 మంది సభ్యుల జట్టుకు కుదిస్తారు. ఫిబ్రవరి 14న ప్రపంచకప్ ఆరంభమవుతుంది.


✿బంగ్లాదేశ్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాలెంజ్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సిక్కిరెడ్డి, ప్రద్య్న గాద్రె జంట మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది.


✿ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఓటమి పొందింది.


 ✿తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టు 39 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.


✿అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ తొలిసారి లండన్ క్లాసిక్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.


 ✿ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని తిరస్కరించిన భారత బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ఏడాదిపాటు నిషేధం విధించింది. ఇందుకు మద్దతుగా నిలిచిన భారత బాక్సింగ్ జట్టు విదేశీ కోచ్ ఫెర్నాండెజ్‌ను రెండేళ్లు నిషేధించింది.


✿క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్ 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడ ప్రపంచ కప్ ఫైనల్ జరగనుండటం అయిదోసారి. ఈ టోర్నీని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్వహించనుంది.


✿అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఇచ్చే 'ప్రపంచ ఛాంపియన్ అవార్డు - 2014'ను టెన్నిస్ తారలు నొవాక్ జకోవిచ్, సెరెనా విలియమ్స్ గెలుచుకున్నారు.ఈ పురస్కారం అందుకోవడం జకోవిచ్‌కు ఇది నాలుగోసారి.


 ✿బ్రిస్బేన్‌లో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది.


'కబడ్డీ ప్రపంచకప్ - 2014' విజేతలుగా భారత పురుషుల, మహిళల జట్లు నిలిచాయి. బాదల్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల జట్టు 45-42తో పాకిస్థాన్‌ను, మహిళల జట్టు 36-27తో న్యూజిలాండ్‌ను ఫైనల్లో ఓడించి వరుసగా పురుషుల జట్టు అయిదోసారి, మహిళల జట్టు నాలుగోసారి విజేతలుగా నిలిచాయి.


 ✿ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభ టైటిల్‌ను అట్లెటికొ డి కోల్‌కత కైవసం చేసుకుంది. ఫైనల్లో 1-0 తో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది.
» కోల్‌కత జట్టు యజమాని సౌరవ్ గంగూలి. కేరళ జట్టు యజమాని సచిన్ టెండుల్కర్.


✿వెస్టిండిస్ వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా పేసర్ జాసన్ హోల్డర్ నియమితుడయ్యాడు. ప్రస్తుత వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్న డ్వేన్ బ్రావో స్థానంలో ఈ నియామకం జరిగింది.


✿స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు క్లబ్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.


✿ బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో చెన్‌లాంగ్ (చైనా), తాయ్ జుయింగ్ (చైనీస్ తైపీ) వరుసగా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు.


✿భారత్ గోల్ఫ్ క్రీడాకారుడు అర్జున్ అత్వాల్ దుబాయ్ ఓపెన్ అంతర్జాతీయ గోల్ఫ్ టైటిల్‌ ను నెగ్గాడు.


✿ఆసియా ల్యూజ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు శివకేశవన్ రజతం సాధించాడు.


✿"భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ 2015 వన్డే ప్రపంచ కప్ ప్రచారకర్తగా ఎంపికయ్యాడు. ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డున్న సచిన్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
 » సచిన్ ఈ బాధ్యత చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. 2011 ప్రపంచకప్ ప్రచారకర్తగా కూడా ఆయనే వ్యవహరించాడు.
    » ప్రపంచకప్‌లో 56.95 సగటుతో అత్యధికంగా 2,278 పరుగులు చేసిన సచిన్ 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు."


✿అండర్ - 16 ప్రపంచ యూత్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ పసిడి పతకం సాధించింది. హంగేరీలో జరిగిన టోర్నీ ఫైనల్లో భారత్ 3.0 - 1.0 తో టర్కీని ఓడించింది.


✿"2014 - 15 సంవత్సరానికి కాంట్రాక్టులు పొందే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. గ్రేడ్ - ఏ లోని ఆటగాళ్లకు బీసీసీఐ ఏడాదికి కోటి రూపాయలు చెల్లిస్తుంది. గ్రేడ్ - బి ఆటగాళ్లకు రూ.50 లక్షలు, గ్రేడ్ - సి ఆటగాళ్లకు రూ.25 లక్షలు చెల్లిస్తుంది.
    » గ్రేడ్ - ఏ: ధోని, కోహ్లి, సురేష్ రైనా, అశ్విన్, భువనేశ్వర్.

    » గ్రేడ్ - బి: ప్రజ్ఞాన్ ఓజా, విజయ్, ఛటేశ్వర పుజారా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, రోహిత్ శర్మ, అజింక్య రహానె, అంబటి రాయుడు, మహ్మద్ షమి.
    » గ్రేడ్ - సి: వరుణ్ ఆరోన్, వృద్ధిమాన్ సాహా, స్టువర్ట్ బిన్నీ, పంకజ్ సింగ్, వినయ్ కుమార్, మోహిత్‌శర్మ, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, అక్షర్ పటేల్, మనోజ్ తివారీ, రాబిన్ ఉతప్ప, కర్ణ్‌శర్మ, సంజు శాంసన్, కుల్‌దీప్ యాదవ్, అమిత్ మిశ్రా, కేఎల్ రాహుల్." 


 ✿భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి వరుసగా రోండో ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నాడు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again