పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

పరిశ్రమల స్థితిగతులు


పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి రాష్ట్రంలో అనేక పరిశ్రమల అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ:  ఈ సంస్థను 1956 నవంబరు, 1న స్థాపించారు. దీన్ని ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలకు సంబంధించిన 'ఆర్థిక సంస్థ చట్టం- 1951' ప్రకారం ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రంలో ప్రత్యేకంగా పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంస్థ.

ఉద్దేశం:  చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక రుణాలు అందించడం, రాష్ట్రంలో ఆర్థిక అసమానతల్ని తగ్గించడం, పరిశ్రమలను అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలను పెంచడం లాంటి లక్ష్యాల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 2007 మార్చి 31 నాటికి 80 వేలకు పైగా వివిధ పరిశ్రమలకు రూ.12,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.

పరిశ్రమల శాఖ:  కుటీర, చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడం, పరిశ్రమలను సహకార, ప్రైవేటు రంగాల్లో అభివృద్ధి చేయడం, పారిశ్రామిక ఎస్టేట్‌లను ఏర్పాటు చేయడం, చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం లాంటి లక్ష్యాలతో 1960లో పరిశ్రమల శాఖను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి సంస్థ: ఈ సంస్థను మధ్య తరహా, భారీ పరిశ్రమల అభివృద్ధి కోసం 1960 డిసెంబరు 16న స్థాపించారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెడుతుంది. 2007 మార్చి నాటికి ఈ సంస్థ వివిధ పరిశ్రమలకు రూ.5488 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.

ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: దీన్ని 1961 ఫిబ్రవరి 24న స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజాలను అంచనా వేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఈ సంస్థకు మన రాష్ట్రంలో 6 ముఖ్యమైన ప్రాజెక్టులున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్: పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ ద్వారా రైతులకు అందించడానికి 1969లో దీన్ని ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్:  దీన్ని 1970లో ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ): దీన్ని 1973లో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి స్థాపించారు. దీనికోసం ఈ సంస్థ పారిశ్రామిక పార్కులు, ఎస్టేటులు, ఆటోనగర్‌లను ప్రారంభించింది. 2006 సంవత్సరాంతానికి ఈ సంస్థ 272 పారిశ్రామిక ఎస్టేట్‌లను, 16 ఆటోనగర్‌లను ఏర్పాటు చేసింది. 32,932 ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా అభివృద్ధి చేసింది. ఈ సంస్థ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో మెగా ప్రాజెక్టులను చేపడుతుంది.

లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: దీన్ని 1973 అక్టోబరు 4న ప్రారంభించారు. తోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేయడం, అధునాతన యంత్రాలను అందించడం, పారిశ్రామిక నైపుణ్యాన్ని మెరుగుపరచడం లాంటివి ఈ సంస్థ లక్ష్యాలు. 2007 మార్చి నాటికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థ 94 లెదర్ పార్కులను ఏర్పాటు చేసింది.
ఏపీ ఇండస్ట్రియల్ టెక్నాలజీ కన్సల్టేషన్ ఆర్గనైజేషన్: పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కోసం దీన్ని 1976లో ఏర్పాటు చేశారు.

జిల్లా పారిశ్రామిక కేంద్రాలు: వీటిని 1978లో ఏర్పాటు చేశారు. కుటీర, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి, వాటికి అవసరమయ్యే సేవలను అందించడం వీటి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ఉపాధి పథకాలకు ఇవి నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తాయి.
పారిశ్రామికాభివృద్ధి నిధి: దీన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ తన వాటాగా రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టింది.

సింగిల్ విండో స్కీములు:  రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'ఇండస్ట్రియల్ సింగిల్ విండో క్లియరెన్స్ యాక్ట్' 2002 జూన్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. స్నేహపూర్వక పెట్టుబడులను ప్రోత్సహించడం, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఆమోదాలను వేగవంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. 2009 సెప్టెంబరు 30 నాటికి దీని ద్వారా, రూ.2,32,958 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే 40,129 పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన 70,302 క్లియరెన్స్‌లను ఇచ్చారు. ఈ పరిశ్రమల ద్వారా 9,40,869 మందికి ఉపాధి కల్పించవచ్చు.

2004-05 స్థిర ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీలో వివిధ రంగాల వాటాలు పట్టికలో చూపిన విధంగా ఉన్నాయి.

 జీఎస్‌డీపీ రంగాల వారి వాటా
రంగం                             2004 - 05                                       2010 -11
వ్యవసాయం                     25.1%                                             21.5%
పరిశ్రమలు                      24.3%                                              24.7%
సేవలు                            50.6%                                              53.8%
1955-56లో జీఎస్‌డీపీలో పరిశ్రమల వాటా 9% ఉండగా, 2010-11 నాటికి 24.7 శాతానికి పెరిగింది.

సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టింది.

ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏరియా: పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి 2003లో క్లస్టర్ ఏరియా భావనను ప్రవేశపెట్టారు. ఏదైనా ఒక పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతాన్ని క్లస్టర్ అంటారు.

హైదరాబాద్  - ఫార్మా ఇండస్ట్రీస్ క్లస్టర్, లెదర్ ఇండస్ట్రీస్ క్లస్టర్
విజయవాడ - ఆటో స్పేర్ పార్ట్ క్లస్టర్
భీమవరం    - మెరైన్ ఫుడ్ ప్రాసెసింగ్
సిరిసిల్ల        - పవర్‌లూమ్ క్లస్టర్
రంగారెడ్డి      - ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ క్లస్టర్

అభివృద్ధి కేంద్రాలు: వీటిని కేంద్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ సంయుక్తంగా 2006లో ఏర్పాటు చేశాయి. వెనుకబడ్డ జిల్లాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయడం వీటి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి, ఒంగోలు, హిందూపూర్, జడ్చర్ల లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి అభివృద్ధి కేంద్రంలో రూ.30 లక్షల పెట్టుబడి పెట్టారు. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడుల నిష్పత్తి 2 : 1 గా ఉంటుంది.

సమగ్ర అవస్థాపనాభివృద్ధి కేంద్రాలు (ఐఐడీసీ): వీటిని కేంద్రప్రభుత్వం 2006లో ఏర్పాటు చేసింది. గ్రామీణ, వెనుకబడ్డ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడం వీటి లక్ష్యం.

రాష్ట్రంలో ఏపీఐఐసీ ద్వారా 6 ప్రాంతాల్లో ఐఐడీసీలను ఏర్పాటు చేశారు. అవి
ఐఐడీసీ                                 వ్యయం (రూ. లక్షల్లో)
ఉడుములాపురం,
నంద్యాల, కర్నూలు                 235.99
సూరంపల్లి, విజయవాడ          370
తడ, నెల్లూరు                       404.69
కీలపట్టు, నగరి, చిత్తూరు
మడికొండ, వరంగల్
గాజులరామారం, రంగారెడ్డి
కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్: సహజవనరులను సమర్థంగా వినియోగిస్తూ పారిశ్రామికాభివృద్ధిని సాధించడానికి వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో రెండు భాగాలున్నాయి.
1. విశాఖపట్నం-రాజమండ్రి-కాకినాడ (పీసీఐపీఆర్)
2. విజయవాడ-నెల్లూరు

ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్ లు): సెజ్‌లపై చేసిన చట్టాన్ని 2005లో ఆమోదించారు. 2006లో నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇతర రాష్ట్రాల్లో లేనివిధంగా ఇప్పటివరకూ 113 సెజ్‌లకు అనుమతులు ఇచ్చారు.

చిన్న తరహా పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి: ఆదాయం, ఉపాధి కల్పనల్లో చిన్న తరహా పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో ప్రభుత్వం వీటి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించింది. 1985లో 'ఏపీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్' ను ఏర్పాటు చేశారు. 2006లో 'సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (ఎంఎస్ఎంఈడీ)' చట్టాన్ని చేశారు. 15% వార్షిక వృద్ధి రేటును సాధించడమే లక్ష్యంగా వీటి అభివృద్ధికి ఉత్తమ విధానాలను రూపొందించారు. ఈ పథకం ద్వారా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27%, మైనార్టీలకు 5%, వికలాంగులకు 3%, మహిళలకు 30% ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ పరిశ్రమల బకాయిల చెల్లింపుకు 'ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రివైవల్ అండ్ రిహాబిలిటేషన్ ఫండ్' ను ఏర్పాటు చేశారు.

ఎస్ఎస్ఐ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాల కింద గుర్తించిన పారిశ్రామిక ఎస్టేటుల్లో మౌలికావసరాలైన విద్యుత్, రోడ్లు లాంటి సదుపాయాల కల్పనకు 'క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్ బ్యాలెన్సింగ్ స్కీమ్ (సీఐబీఎస్)' ను ప్రవేశ పెట్టారు. ఖాయిలా పడ్డ పరిశ్రమలను మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కీమ్ ఇండస్ట్రీస్ రివైవల్ అండ్ రిహాబిలిటేషన్ స్కీమ్'ను 2006లో ప్రవేశ పెట్టారు.

రాష్ట్ర స్థాయి ప్రభుత్వ పారిశ్రామిక సంస్థలు: 2007-08 నివేదిక ప్రకారం మొత్తం ప్రభుత్వ పరిశ్రమల సంఖ్య 29. వీటి వార్షిక టర్నోవర్ మొత్తం రూ. 28,601.63 కోట్లు. వీటిలో లాభాలు అధికంగా ఉన్న 5 కంపెనీలు కింది విధంగా ఉన్నాయి.
పరిశ్రమ                  లాభం (రూ. కోట్లలో) 
సింగరేణి                      118.86
ఏపీ ట్రాన్స్‌కో               68.98
ఏపీ జెన్ కో                     344.96
ఏపీఐఐసీ                     312.88
ఏపీఎండీసీఎల్             135.67

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పారిశ్రామికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 2005 నుంచి 2009 సెప్టెంబరు వరకు రూ.16,178.95 కోట్ల విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వచ్చాయి.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again