పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

భారత ఆర్థిక వ్యసవ్థలో సమస్యలు


                  విద్య, ఆరోగ్యం, రవాణా, విద్యుత్, గృహ నిర్మాణం, నీటి పారుదల రంగాల్లో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించింది. మరోవైపు మన సమాజంలో కనీస అవసరాలయిన కూడు, గూడు, గుడ్డ సంపాదించుకోలేని నిరుపేదలూ ఉన్నారు. నిరంతరాయంగా సాధారణ ధరల స్థాయి పెరుగుతూనే ఉంది. మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.



                  ఒక దేశ అభివృద్ధికి కొలమానం ఆ దేశ తలసరి జాతీయాదాయం. ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం అంచనా ప్రకారం... ఏ ఆర్థిక వ్యవస్థ వాస్తవిక తలసరి ఆదాయం అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ యూరప్ దేశాల వాస్తవిక తలసరి ఆదాయం కంటే తక్కువగా ఉంటుందో ఆ ఆర్థిక వ్యవస్థను వెనకబడిన ఆర్థిక వ్యవస్థ అంటారు. 2002లో భారతదేశ తలసరి ఆదాయం 480 డాలర్లు. శ్రీలంక తలసరి ఆదాయం 840 డాలర్లు. చైనా తలసరి ఆదాయం 940 డాలర్లు. ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది. 

 భారత ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న ముఖ్య సమస్యలు 
1) పేదరికం 
2) నిరుద్యోగం.

దారిద్య్రరేఖ: మామూలు అర్థంలో కూడు, గూడు, గుడ్డ లాంటి మౌలికావసరాలను సైతం తీర్చుకోలేని వారిని దరిద్రులు అంటారు. కనీస జీవన ప్రమాణం లోపించిన వారినే భారతదేశంలో 'దరిద్రులు'గా పేర్కొంటారు
దీన్ని దారిద్య్రం అనే పదానికి అసలు నిర్వచనంగా పేర్కొంటారు. పేదరికాన్ని అంచనా వేయడానికి ఆర్థికవేత్తలు 'పేదరిక గీత' అనే భావనను ఉపయోగిస్తూ ఉంటారు. దేశ ప్రజల కనీస అవసరాల పరిమాణాలను నిర్ణయిస్తారు. వాటి విలువను అంచనా వేసి కనీస జీవనానికి అవసరమయ్యే వినియోగ వ్యయాన్ని నిర్థారిస్తారు. ఈ కనీస జీవనాధార స్థాయిని 'దారిద్య్రరేఖ' అంటారు. కనీస వ్యయాన్ని కూడా చేయలేని స్థితినే 'పేదరికం' అంటారు. కనీస జీవన వ్యయం కంటే తక్కువ వార్షిక ఆదాయం పొందేవారిని పేదరికంలో ఉన్నారని అంటారు
.
నిరుద్యోగం: ఉద్యోగం చేయగల శక్తి, ఆసక్తి ఉన్నప్పటికీ ఉద్యోగం లభించని స్థితిని 'నిరుద్యోగం' అంటారు. జనాభా పెరుగుదల వల్ల ఉద్యోగం కోసం ఎదురు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 

నిరుద్యోగం 2 రకాలు. 
) స్వచ్ఛంద నిరుద్యోగం 
2) అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం. 

అమల్లో ఉన్న వేతన రేటుకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పని లభించని స్థితిని 'అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం'' అంటారు. 

ధనవంతులు, విశ్రాంతి కోరుకునేవారు, మార్కెట్‌లో ఉన్న వేతనాల స్థాయి కంటే పెద్ద వేతనాలను ఆశించేవారు, పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తుల వల్ల ఏర్పడే నిరుద్యోగం 'స్వచ్ఛంద నిరుద్యోగం'.

ద్రవ్యోల్బణం - రకాలు: ఆర్థిక విధాన రూపకల్పనలో ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రధాన స్థూల ఆర్థిక అంశాల్లో ద్రవ్యోల్బణం ఒకటి. నిరంతరాయంగా సాధారణ ధరల స్థాయి పెరుగుతూ ఉంటే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ధరల స్థాయిలో నిరంతర పెరుగుదల, డబ్బు విలువ పతనమయ్యే స్థితిని 'ద్రవ్యోల్బణం' అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు వస్తుసేవల విలువ కంటే డబ్బు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. 
అందువల్ల 'డబ్బు ఎంత ఎక్కువైతే దాంతో కొనగల వస్తువుల సంఖ్య అంత తగ్గుతుంది' అనే నానుడి ద్రవ్యోల్బణ పరిస్థితిని చక్కగా వివరిస్తుంది. సాధారణంగా రెండు రకాల ద్రవ్యోల్బణ పరిస్థితులు గుర్తించవచ్చు

1) డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం
2) కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం.

                  పెట్టుబడి వ్యయం పెరిగినప్పుడు, వస్తుసేవల సాధారణ ధరలతో పాటు మొత్తం డిమాండ్ పెరిగే స్థితిని డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం అంటారు. అంతరంగిక 'లేదా' అంతర్జాతీయ కారణాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, ద్రవ్యోల్బణం ఏర్పడితే దాన్ని కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం అంటారు.

తక్షణ కర్తవ్యం: 1996లో భారత ప్రభుత్వం మానవాభివృద్ధికి అవసరమయ్యే కనీస సేవలను గుర్తించింది. ఇవి అమలయ్యేలా కృషి చేయాలి.

¤ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు రక్షిత నీటి సదుపాయాన్ని, ప్రాథమిక వైద్య సేవలను నూరు శాతం అందించడం.

¤ ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయడం.

¤ గృహ సదుపాయం లేని పేద కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సాయం చేయడం.

పేదరికం, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ పథకాలు:

¤ ఉపాధి కల్పనా కార్యక్రమాలు:
1) R.W.P. - Rural Works Programme (గ్రామీణ పనుల కార్యక్రమం)

2) M.F.A.L.S. - Marginal Farmers and Agricultural Labourers Scheme (సన్నకారు రైతుల, రైతు కూలీల పథకం)

3) S.F.D.A. - Small Farmers Development Agency (చిన్న రైతుల అభివృద్ధి సంస్థ)

¤ గృహ నిర్మాణ పథకాలు:
1) I.A.Y. - Indira Avaas Yojana (ఇందిరా ఆవాస్ యోజన)

2) U.B.S. - Urban Basic Services

3) N.H.B. - National Housing Bank

¤ నీటిపారుదల పథకాలు:
1) C.A.D. - కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్

¤ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు:
1) S.G.S.Y. - . స్వర్ణ జయంతి సమృద్ధి యోజన

2) J.G.S.Y. - . జవహర్ గ్రామ సమృద్ధి యోజన

3) N.R.E.P. - National Rural Employment Programme (జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం)

4) R.L.E.G.P. - Rural Labour Employment Generation Programme (గ్రామీణ కార్మిక ఉపాధి కల్పనా కార్యక్రమం)

5) S.G.R.Y. - . సంపూర్ణ గ్రామ రోజ్‌గార్ యోజన


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again