పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 18, 2014

శాతవాహనులు - వారి పాలన - సామాజిక స్వరూపం - మతపరమైన పరిస్థితులు


          దక్షిణాపథ మహోజ్వల చరిత్రకు శ్రీకారం చుట్టింది శాతవాహన వంశీయులు. ఉత్తరాపథాన అరాచకం ప్రబలి ఉన్న కాలంలో దక్షిణ భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని శాంతిభద్రతలు కాపాడిన ఘనత శాతవాహనులకే దక్కింది. దాదాపు 30 మంది రాజులు నాలుగున్నర శతాబ్దాలు పాలించారు. శాతవాహనుల చరిత్రకు సంబంధించి చరిత్రకారుల మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. 

                                              శ్రీముఖుడు 
     మత్స్య పురాణాన్ని అనుసరించి శ్రీముఖుడు క్రీ.పూ. 230 ప్రాంతంలో శాతవాహన రాజ్యాన్ని స్థాపించినట్లు తెలుస్తోంది. శ్రీముఖుడి నాణేలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో దొరికాయి. జైన సారస్వతం ప్రకారం శ్రీముఖుడు జైనమతస్థుడై రాజ్యంలో జైన నిర్మాణాలు చేశాడు. తర్వాత, తన రాజ్యభద్రత దృష్ట్యా బ్రాహ్మణ మతాభిమాని అయినట్లు తెలుస్తోంది. 

                                          మొదటి శాతకర్ణి
     మొదటి శాతకర్ణి శ్రీముఖుడి కుమారుడు. మహారథి అంగీయ రాకుమారి నాగానికను వివాహమాడి, వారి సహాయంతో రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. శాతకర్ణి మరణానంతరం ఆయన భార్య నాగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. అందులో శాతకర్ణిని దక్షిణాపథపతిగా వర్ణించింది. చుళ్ల కళింగ జాతకం ప్రకారం శాతకర్ణి కళింగ రాజైన ఖారవేలుడిని ఓడించినట్లు తెలుస్తోంది. మౌర్య సామ్రాజ్యంలో చెలరేగిన అలజడులను ఆసరాగా తీసుకుని శాతకర్ణి తూర్పు మాళవను ఆక్రమించాడు. శాతకర్ణి రెండు అశ్వమేధాలు, ఒక రాజసూయం చేశాడు.

                                           రెండో శాతకర్ణి
       పురాణాల ప్రకారం రెండో శాతకర్ణి 56 సంవత్సరాల దీర్ఘకాలం పాలించినట్లు తెలుస్తోంది. మగధ సామ్రాజ్యాధిపత్యం వహించిన దక్షిణాపథ పాలకుల్లో ప్రథముడు. రెండో శాతకర్ణి ఆస్థానంలో ఉన్న వాశిష్టీపుత్ర ఆనందుడు సాంచీ స్తూప దక్షిణ ద్వారంపై ఒక శాసనం చెక్కించాడు.

                                             హాలుడు 
       శాతవాహనుల్లో 17వ రాజు. గొప్ప కవిగా సాహిత్య పోషకుడిగా కీర్తి పొందాడు. సింహళ రాజకుమారి లీలావతిని వివాహమాడాడు. గాథాసప్తశతి అనే గ్రంథాన్ని సంకలనం చేశాడు. కవివత్సలుడనే బిరుదుంది. లీలావతి కావ్యం, అబిదాన చింతామణి, దేశీనామ మాలాది గ్రంథాలు హాలుడి కీర్తి ప్రతిష్ఠలను చాటుతున్నాయి. 

                                    గౌతమీపుత్ర శాతకర్ణి
      శాతవాహనుల్లో గొప్పవాడు. ఆయన తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో శాతకర్ణి ఘనకార్యాలను వర్ణించింది. ఆ శాసనాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైన పులోమావి కాలంలో వేసింది. ఆయన క్షహరాటులపై దండెత్తి, ఆ వంశాన్ని నిర్మూలించాడు. 'క్షహరాట వంశనిరవశేషకర' అనే బిరుదు ధరించాడు. శకరాజు సహాపణుడిని ఓడించాడు. మూడు సముద్రాల పర్యంతం సామ్రాజ్యాన్ని విస్తరించి 'త్రిసముద్ర తోయపీత వాహన' అనే బిరుదు ధరించాడు. బ్రాహ్మణులను ఆదరించాడు. ఏక బ్రాహ్మణ, ఆగమనిలయ అనే బిరుదులు ధరించాడు. మాతృ సంజ్ఞలను వాడిన మొదటి శాతవాహన చక్రవర్తి. 

                                       యజ్ఞశ్రీ శాతకర్ణి
      శాతవాహనుల్లో చివరి గొప్పరాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. నాసిక్, కన్హేరి, చినగంజాముల్లో ఆ కాలంనాటి శాసనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిరార్, కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్రల్లో ఆయన నాణేలు లభించాయి. మహాయాన బౌద్ధశాఖకు చెందిన ఆచార్య నాగార్జునుడు విజయపురిలో నివసించినట్లు ఆయన కోసం యజ్ఞశ్రీ పారావత మహావిహారాన్ని నిర్మించి ఇచ్చినట్లు తెలుస్తోంది. టిబెట్ చైనా చారిత్రకుల ప్రకారం ధాన్యకటక, మహాస్తూప శిలాప్రాకారాన్ని నాగార్జునాచార్యుడు నిర్మించినట్లు తెలుస్తోంది. 

                                         పరిపాలన 
      శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. విశ్వాసామాత్య, రాజామాత్య, మహామాత్ర, మహాతరక, భాండాగారిక, హెరణిక, ప్రతీహార, లేఖక, నిబంధకార అనే ఉద్యోగులు రాజుకు పరిపాలనలో సహాయం చేసేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని అనేక ప్రాంతాలుగా విభజించారు. సామంత రాజ్యాలను మహాభోజ, మహారధ అనే ఉద్యోగులు పాలించేవారు. మిగిలిన రాజ్యాన్ని రాష్ట్రాలుగా, ఆహారాలుగా విభజించారు. రాష్ట్రాలను రాజపుత్రులు, ఆహారాలను అమాత్యులు పాలించేవారు. పట్టణాలను నిగమసభలు పాలించేవి. ఈ సభలోని సభ్యులను గహపతులనేవారు. గుల్మిక పేరున భూస్వాములున్నట్లు మ్యాకదోని శాసనం ద్వారా తెలుస్తోంది. గ్రామణి గ్రామాధికారిగా ఉండేవాడు. 

                                     ఆర్థిక పరిస్థితులు
ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. యంత్రాల ద్వారా నీటిని పంట పొలాలకు సరఫరా చేసేవారు. వరి, జనుము, చెరకు, నువ్వు పంటలుండేవని గాథాసప్తశతి ద్వారా తెలుస్తోంది. కులార (కుమ్మరి), తిలపిసక (తైలకులు), కొలిక (సాలి), కమర (కమ్మరి), కసకార (కంచరి), సువనక (స్వర్ణకార), మణిక (మణికారులు), వధిక (వండ్రంగి) మొదలైన వృత్తులవారుండేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రతి పరిశ్రమలోని పనివారు శ్రేణిగా ఏర్పడేవారు దీని కార్యస్థానం నిగమసభ. శ్రేణి అధ్యక్షుడిని శ్రేష్టీ అనేవారు. శ్రేణులు ధనాన్ని నిల్వచేసే బ్యాంకులుగా వ్యవహరించేవి. 12శాతం వరకు వడ్డీ చెల్లించేవి. తెరచాప పడవ గుర్తులున్న శాతవాహన నాణేలను బట్టి విదేశీ వాణిజ్యం విశేషంగా జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల్లో రోమన్ నాణేలు దొరికాయి. విదేశీ వాణిజ్యానికి తూర్పు తీరంలో కూడూరు, ఘంటశాల, కోరంగి రేవులుండేవి. పశ్చిమతీరంలో బరిగజ (బరుకచ్చ) సోపార్, కళ్యాణ అనే ముఖ్య రేవులుండేవి. రోమ్‌తో విదేశీ వాణిజ్యం జరిగేది. రోమ్‌తో వర్తకంవల్ల సాలుకు 11 వేల స్టెర్లింగుల బంగారం భారతదేశానికి వెళ్లిపోతోందని ప్లినీ తన రచనలో వాపోయాడు.

                                          సాంఘిక పరిస్థితులు
ఉమ్మడి కుటుంబాలుండేవి. కుటుంబానికి తండ్రి పెద్ద. స్త్రీలకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. భర్తల ఉద్యోగనామాలు ధరించేవారు. విద్యావంతులై చర్చల్లో, సభల్లో పాల్గొనేవారు. వివాహబంధాన్ని పవిత్రంగా భావించేవారు. స్త్రీపురుషులు ఉభయులు చాలా తక్కువ దుస్తులు ధరించేవారు. స్త్రీలకు ఎరుపు రంగు వస్త్రాల మీద, పుష్పాల మీద మక్కువ ఎక్కువ. నాట్యకత్తెలు ఆరదళమనే మైపూతను వాడేవారు. వీణ, వేణువు, మృదంగం, శంఖం మొదలైన వాద్యాలుండేవి. 

                                            మత పరిస్థితులు 
     యవనులు మొదలైన విదేశీయులు భారతదేశానికి వలస వచ్చి హిందూ, బౌద్ధ, జైన మతాల్లో విలీనమయ్యారు. శాతవాహనులు బ్రాహ్మణమతాన్ని అనుసరించారు. అశ్వమేద, రాజసూయ, హిరణ్యగర్భ, అగ్నిష్టోమ మొదలైన యాగాలు చేసి బ్రాహ్మణులకు భూరి దానాలు చేశారు. ఆగమనిలయ, ఏకబ్రాహ్మణ మొదలైన బిరుదులు ధరించారు. ప్రజలు శివుడు, విష్ణువులను పూజించేవారు. కృష్ణ లీలల గాథలు వ్యాప్తిలో ఉండేవి. శంకర్షణుడు, వాసుదేవుడు, కుబేరుడు, చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు మొదలైన దేవతలను ఆరాధించేవారు. 

                                                బౌద్ధమతం 
     శాతవాహనుల కాలం బౌద్ధమతానికి స్వర్ణయుగమని చెప్పవచ్చు. బౌద్ధం ఒక ప్రజా ఉద్యమంగా విస్తరించింది. రాణులు, వర్తకులు, పాటక, స్త్రీ జనం బౌద్ధ మతాన్ని పోషించినట్లు, స్తూప, చైత్య విహారాలు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. భదయనేయ శాఖకు చెందిన బౌద్ధ బిక్షువులకు గౌతమీ బాలశ్రీ ఒక గుహను తొలిపించి ఇచ్చింది. టెకెరపి కొండపై ఉండే సన్యాసులకు గౌతమీపుత్ర శాతకర్ణి 200 నివర్తనాల భూమిని ఇచ్చాడు. ఆంధ్రదేశం మహాయాన బౌద్ధానికి పట్టుకొమ్మ అయింది. వినయధర్మ పీటకం ఆంధ్రుల అభిమానాన్ని చూరగొంది. ధాన్యకటకం మహాసాంఘిక కేంద్రమయింది. ప్రజ్ఞాపారమితశాస్త్రం మహాయానానికి ప్రామాణికమైన గ్రంథంగా ఉండేది. దీని రచయిత ఆచార్య నాగార్జునుడు. ఆయన శ్రీపర్వతంలో ఉండేవాడు. తార్కికశక్తితో మాధ్యమిక వాదం, శూన్యవాదం ప్రతిపాదించి, మహాయానాన్ని స్వయం సంపూర్ణమైన సిద్ధాంతంగా రూపొందించాడు. రత్నావళి, సుహృల్లేఖ, మొదలైన గ్రంథాలు రాశాడు. అమరావతీ శాసనాల్లో చైత్యకుల ప్రస్తావన ఉంది. 

చైత్యకులు మొదటిసారిగా బుద్ధుడికి లోకోత్తర గుణాలను ఆపాదించారు. దీని ఫలితంగా బోధి వృక్షం, ధర్మచక్రం, సింహాసనం, త్రిరత్నం, చైత్యం మొదలైన బుద్ధ చిహ్నాలను ఆరాదించడం ప్రారంభమైంది. చైత్యాలంకరణ, చైత్యపూజ చైత్యకవాదుల ముఖ్యలక్షణాలు. పితృదేవతారాధన, విగ్రహారాధనలతో పూజాపురస్కారాలతో ఆకర్షణీయ మతంగా పరిణమించింది. చైత్యకులలో పూర్వశైల (ధాన్యకటక) అపరశైల, (శ్రీపర్వత), ఉత్తరశైల (జగ్గయ్యపేట), రాజగిరక (గుంటుపల్లి), సిద్ధార్థక (గుడివాడ) శాఖలేర్పడ్డాయి.

                                                    జైనమతం
జైనగాథల ప్రకారం జైనమతం క్రీ.పూ. నాలుగో శతాబ్దానికే ఆంధ్రదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. కళింగ రాజైన ఖారవేలుడి ఆదరణవల్ల కృష్ణానదికి ఉత్తరంగా తీరాంధ్రంలో జైనం ముందంజవేసింది. అశోకుడి పౌత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రావిడ దేశాల్లో జైన వ్యాప్తికి కృషిచేశాడు. అమరావతి సమీపంలోని వడ్డమాను కొండపై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడే ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాలవల్ల తెలుస్తోంది. క్రీస్తుశకారంభంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు కొనకొండ్ల (అనంతపురం జిల్లా)లో ఆశ్రమం నిర్మించుకుని మతప్రచారంచేస్తూ సిద్ధాంత గ్రంథాలు రచించాడు. వాటిలో సమయసార అనే గ్రంథం శ్వేతాంబర, దిగంబరశాఖలకు ఆదరణీయమైంది. 

                                          విద్యాసారస్వతాలు 
       బ్రాహ్మణ ఆశ్రమాల్లో, జైన, బౌద్ధ విహారాల్లో విద్యాబోధన జరిగేది. వృత్తిసంఘాలు కూడా విద్యావ్యాప్తికి తోడ్పడ్డాయి. ధాన్యకటక, శ్రీపర్వతాల్లో బౌద్ధ విశ్వవిద్యాలయాలుండేవి. ధాన్యకటక విశ్వవిద్యాలయం నమూనాగానే లాసాలోని విద్యాలయం నిర్మాణమైనట్లు టిబెట్‌లో ప్రచారంలో ఉండేది. బౌద్ధులు తర్క, శబ్ద, జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలను అభ్యసించేవారు. రత్నావళి-రాజపరికథ అనే గ్రంథంలో ఆచార్య నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతం ప్రతిపాదించాడు. ప్రాకృతం రాజభాషగా ఉండేది. వారి శాసనాలన్నీ ప్రాకృత భాషలో బ్రాహ్మీలిపిలో ఉన్నాయి. ప్రతి బౌద్ధ విహారంలో ధమ్మకథిక అనే ఉద్యోగి ఉండేవాడు. గుణాడ్యుడు అనే కవి బృహత్కథను, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణాన్ని, వాత్స్యాయనుడు కామసూత్రాలను రాశారని ప్రతీతి. 

                                            బౌద్ధ నిర్మాణాలు 
     శాతవాహనుల కాలంలో బౌద్ధమతానికి సంబంధించి చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మించారు. ఘంటసాల, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, అమరావతి మొదలైన చోట్ల స్తూపాలుండేవి. వాటిలో అమరావతి స్తూపం ప్రసిద్ధమైంది. బుద్ధుడి లేదా ప్రసిద్ధ ఆచార్యుల శారీరక అవశేషాలపై నిర్మితమైన స్మారక చిహ్నాలే స్తూపాలు లేదా చైత్యాలు. పూజా వస్తువుగా చైత్యం లేదా బుద్ధ విగ్రహం ఉండి నిత్యార్చనకు ఉపయోగించే ఆలయమే చైత్యగృహం లేదా చైత్యాలయం. నాసిక్, కన్హేరి, బేడ్స, కార్లా మొదలైన చోట్ల చైత్యాలయాలుండేవి. వర్షాకాలంలో బౌద్ధ భిక్షువుల నివాసానికి ఉద్దేశించినవే విహారాలు. గుంటుపల్లిలో గుహవిహారాలుండేవి. రామతీర్థం, శాలిహుండం, నాగార్జునకొండ మొదలైనచోట్ల సంఘారామాలుండేవి. శ్రీపర్వతంపై యజ్ఞశ్రీ తొలిపించిన ఏడు అంతస్తుల మహావిహారంలో 1500 గదులుండేవని పాహియాన్ రాశాడు. ఈనాటి ఆంధ్ర బౌద్ధశిల్పాలకు అమరావతి రీతి అని పేరు. అజంతా 10వ గుహలోని శ్వేతగజ జాతక చిత్రం శాతవాహన యుగానిదేనని తెలుస్తోంది. 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again