పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

పంచవర్ష ప్రణాళికలు బిట్స్


¤  ప్రపంచంలో ప్రణాళికలు అమలు చేసిన మొదటి దేశం - రష్యా
¤  'ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా' (1934) గ్రంథ రచయిత - మోక్షగుండం విశ్వేశ్వరయ్య

¤  జాతీయ ప్రణాళికా కమిటీ 1938 అధ్యక్షుడు - నెహ్రూ (కాంగ్రెస్ నియమించింది)

¤  "A Plan for Economic Development" పేరుతో తయారు చేసిన ప్రణాళిక - బొంబాయి ప్లాన్ (1943)

¤  గాంధీ ప్రణాళిక (1944) తయారుచేసింది - శ్రీమన్నారాయణ అగర్వాల్

¤  ఎం.ఎన్. రాయ్ రూపొందించింది - ప్రజా ప్రణాళిక (1945)

¤  సర్వోదయ ప్రణాళికను రూపొందించింది - జయప్రకాశ్ నారాయణ (1950)
¤  ప్రణాళికా సంఘం ఏర్పాటు - 1950 మార్చి 15

¤  ప్రణాళికా సంఘం అనేది - ఒక రాజ్యాంగేతర, శాసనేతర, సలహా సంస్థ

¤  ఆర్థిక ప్రణాళికలు - ఉమ్మడి జాబితాకు చెందినవి

¤  'జాతీయ అభివృద్ధి మండలి' (NDC) ఏర్పాటు - 1952 ఆగస్టు 6

¤  ప్రణాళికలను రూపొందించేది ప్రణాళికా సంఘం అయితే ఆమోదించేది - జాతీయ అభివృద్ధి మండలి

¤  సూచనాత్మక ప్రణాళికను అమలు చేసిన మొదటి దేశం - ఫ్రాన్స్ (1947-50)

¤  నిరంతర ప్రణాళికల రూపకర్త - గున్నార్ మిర్డాల్

¤ భారత్‌లో నిరంతర ప్రణాళికలను తయారుచేసింది - లక్డావాలా

¤  'ప్లానింగ్ ఫర్ ది పూర్' గ్రంథ రచయిత - బి.ఎస్. మిన్హాస్

మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)
¤  మొదటి ప్రణాళికకు ఆధారమైన నమూనా - హరడ్ డోమర్ నమూనా

¤  ఈ ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చిన రంగం - వ్యవసాయం

¤  వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు - 31%

¤  మొదటి ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం: 2.1% (సాధించింది 3.6%)

¤  కృష్ణమాచారి కమిటీ సిఫారసులతో ప్రారంభించిన పథకం - సమాజ అభివృద్ధి పథకం (1952)

¤  జాతీయ విస్తరణ సేవల పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం - 1953

¤ మొదటి ప్రణాళికలో ఏర్పాటైనవి: సేంద్రియ ఎరువుల కర్మాగారం (జార్ఖండ్), చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ (బీహార్), హిందుస్థాన్ షిప్‌యార్డ్ (విశాఖపట్నం), భారతీయ టెలిఫోన్ పరిశ్రమ (బెంగళూర్)

¤  పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టాన్ని చేసింది - 1951

¤  కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం - 1952

¤  జాతీయ అటవీ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం - 1952

¤  1955లో జాతీయం చేసిన బ్యాంకు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

¤  'భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ' (ICICI)ను ప్రారంభించిన సంవత్సరం - 1955

రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61)
¤  రెండో ప్రణాళికకు ఆధారమైన వ్యూహం - మహలనోబిస్ 4 రంగాల నమూనా

¤  రెండో ప్రణాళిక ప్రాధాన్యమిచ్చిన రంగం - భారీ పరిశ్రమలు

¤ ధైర్యంతో కూడిన ప్రణాళిక - రెండో ప్రణాళిక

రెండో ప్రణాళికలో ఏర్పాటైన నూతన ఉక్కు కర్మాగారాలు                 సహకరించిన దేశాలు

                              రూర్కెలా (ఒడిశా)                  పశ్చిమ జర్మనీ 
                      దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్)      ఇంగ్లండ్
                            భిలాయ్ (చత్తీస్‌గఢ్)                 రష్యా 

 ¤  రెండో ప్రణాళికలో అధిక కేటాయింపులు చేసిన రంగం - రవాణా, సమాచారం (28%)

¤  ఆర్థిక వ్యవస్థను ప్లవన దశకు చేర్చిన ప్రణాళిక - రెండో ప్రణాళిక

¤  అతి తక్కువ దేశీయ బడ్జెట్ వనరులున్న ప్రణాళిక - రెండో ప్రణాళిక (56%)

¤  అత్యధిక లోటు ద్రవ్యం ఉన్న ప్రణాళిక - రెండో ప్రణాళిక (20%)

¤  రెండో పారిశ్రామిక విధానం/ ఆర్థిక రాజ్యాంగం ప్రకటించిన సంవత్సరం - 1956

¤  'ఎల్ఐసీ'ని జాతీయం చేసిన సంవత్సరం - 1956

¤  వ్యవసాయ మార్కెటింగ్ కోసం 1958లో ఏర్పాటు చేసిన సంస్థ - మార్క్‌ఫెడ్

¤  1960లో ఆదాయ అసమానతలను పరిశీలించిన కమిటీ - మహలనోబిస్ కమిటీ

¤  సామ్యవాద స్థాపనకు తోడ్పాటు అందించిన ప్రణాళిక - రెండో ప్రణాళిక

మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66)
¤  లక్ష్యం - స్వయం సమృద్ధి, స్వావలంబన

¤  వృద్ధిరేటు లక్ష్యం: 5.6%, సాధించింది: 2.8%

¤  మూడో ప్రణాళిక వైఫల్యానికి కారణాలు - కరవు, 1962 లో చైనాతో యుద్ధం, 1965 లో పాకిస్థాన్‌తో యుద్ధం.

¤  అత్యధిక విదేశీ సహాయం పొందిన ప్రణాళిక - మూడో ప్రణాళిక (28%)

¤  బొకారో ఇనుము - ఉక్కు కర్మాగారం స్థాపనకు సహకరించిన దేశం - రష్యా (జార్ఖండ్ - 1964)

¤  'జాతీయ సహకార అభివృద్ధి సంస్థ'ను ఏర్పాటు చేసిన సంవత్సరం - 1963

¤  'జాతీయ విత్తన సంస్థ' (NSC) ను స్థాపించిన సంవత్సరం - 1963

¤  సాంద్ర వ్యవసాయ జిల్లా పథకాన్ని 1960-61 లో ప్రారంభించారు.

¤  సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమాన్ని ప్రారంభించింది - 1965
¤  'భారత ఆహార సంస్థ' (FCI)ను స్థాపించింది - 1965

¤  వ్యవసాయ ధరల కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం - 1965
వార్షిక ప్రణాళికలు (1966-69)

¤  ప్రణాళికా సెలవు ప్రకటించిన సంవత్సరాలు - 1966 నుంచి 69

¤  హరిత విప్లవాన్ని ప్రారంభించింది - 1966 ఖరీఫ్

¤  నారీమన్ కమిటీ సిఫారసులతో ప్రారంభించిన పథకం - లీడ్‌బ్యాంక్ పథకం (1969)

నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969-74)
¤  లక్ష్యం - స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన

¤ ఆధారమైన నమూనా: అశోక్‌రుద్ర - మనె

¤  ప్రణాళికా ముసాయిదాను తయారు చేసింది - గాడ్గిల్

¤  అధికంగా కేటాయింపులు చేసిన రంగం - వ్యవసాయం, నీటిపారుదల (24%)

¤ మిగులు వ్యాపార శేషం (BOT) కలిగిన సంవత్సరం 1) 1972-73లో (రూ.104 కోట్లు) 2) 1976-77లో (రూ.69 కోట్లు)

¤  ఎం.ఆర్.టి.పి. ని ఏర్పాటు చేసిన సంవత్సరం - 1969

¤  1969 జులైలో 14 బ్యాంకులను జాతీయం చేయాలని సిఫారసు చేసింది - హజరీ కమిటీ

¤  గ్రామీణ పనుల కార్యక్రమం (RWP) అమలు ప్రారంభమైంది: 1970-71

¤  1972-73లో 'ఉద్యోగితా గ్యారంటీ పథకం' ప్రారంభించిన రాష్ట్రం - మహారాష్ట్ర
¤  సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం - (1972-73)

¤  ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకాన్ని (CADP) ప్రారంభించిన సంవత్సరం: 1974-75

¤  SFDA, MFAL ప్రారంభించిన ప్రణాళిక - నాలుగో ప్రణాళిక

¤  విదేశీ మారక నియంత్రణ చట్టాన్ని (FERA) చేసిన సంవత్సరం - 1973

¤  భారత్‌లో శ్వేత విప్లవాన్ని (1970) ప్రారంభించింది - వర్గీస్ కురియన్
అయిదో ప్రణాళిక (1974-79)

¤  లక్ష్యం - పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన

¤  నాలుగేళ్లే అమలు చేసిన ప్రణాళిక - అయిదో ప్రణాళిక

¤  అతి తక్కువ లోటు ద్రవ్యం ఉన్న ప్రణాళిక - అయిదో ప్రణాళిక (3%)
¤  5వ ప్రణాళికలో అధిక కేటాయింపులు చేసింది - పరిశ్రమల రంగం (26%)
¤  పేదరికపు ప్రణాళికగా పేరొందింది - అయిదో ప్రణాళిక

¤  కనీస అవసరాల పథకం (1974-75) ప్రారంభించింది - అయిదో ప్రణాళిక

¤  20 సూత్రాల పథకం (1975) ప్రారంభించింది - ఇందిరాగాంధీ

¤  సమీకృత శిశు అభివృద్ధి పథకం (ICDS) ను ఆరంభించింది: 1975-76

¤  మొదటి జాతీయ జనాభా విధానం ప్రారంభం - 1976

¤  1977లో రాజస్థాన్ ప్రారంభించిన పథకం - అంత్యోదయ

¤  జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (NIRD-1977) ఉన్న ప్రదేశం - హైదరాబాద్

¤  కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం-1977ను ప్రవేశపెట్టింది: జనతా ప్రభుత్వం.

నిరంతర ప్రణాళిక (1978-80)
¤  నిరంతర ప్రణాళిక అనే భావనను ప్రవేశపెట్టింది - గున్నార్ మిర్డాల్ (స్వీడన్)

¤  నిరంతర ప్రణాళికలు అమలు చేసిన తొలి దేశం - నెదర్లాండ్స్
¤  భారత్‌లో నిరంతర ప్రణాళిక రూపకర్త - లక్డావాలా
¤  సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం (IRDP) ప్రారంభమైంది: 1978-79

¤  1979లో యువతకు, స్వయంఉపాధి శిక్షణ కోసం ఏర్పాటైన పథకం - ట్రైసం (TRYSEM)

ఆరో ప్రణాళిక (1980-85)
¤  రెండుసార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక - ఆరో ప్రణాళిక

¤  పేదరిక నిర్మూలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది - ఆరో ప్రణాళిక

¤  శక్తికి అధిక కేటాయింపులు చేసింది - ఆరో ప్రణాళిక

¤  ఆరో ప్రణాళికలో శక్తి రంగానికి కేటాయింపులు - 28%

¤  5% వృద్ధిరేటు సాధించిన మొదటి ప్రణాళిక - ఆరో ప్రణాళిక

¤  'జాతీయ గ్రామీణ ఉద్యోగితా పథకం' (NREP) ప్రారంభించింది - 1980

¤  1980లో జాతీయం చేసిన బ్యాంకులు - 6

¤  యునిసెఫ్ నిధులతో ప్రారంభమైన పథకం - డ్వాక్రా (1982)

¤  శివరామన్ కమిటీ సిఫారసుతో 1982లో ఏర్పాటైంది - నాబార్డ్

¤  EXIM బ్యాంక్ ఏర్పాటైంది - 1982

¤  సిక్ ఇండ్రస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ (SICA) ను సిఫారసు చేసింది - తివారీ కమిటీ (1985)

¤  RLEGP ప్రారంభమైంది - 1983

ఏడో ప్రణాళిక (1985-90)
¤  ప్రధాన లక్ష్యం - ఆహారం, పని, ఉత్పాదకత

¤  అధిక కేటాయింపులు చేసింది - శక్తి రంగం

¤  6% వృద్ధి సాధించిన మొదటి ప్రణాళిక - ఏడో ప్రణాళిక

¤  ఇందిరా ఆవాస్ యోజన (1985-86) ద్వారా గృహవసతి పొందేది - ఎస్సీ, ఎస్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు

¤  సమగ్ర పంటల బీమా పథకం ప్రారంభమైంది - 1985

¤  గ్రామీణాభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక సాయం అందించే CAPART ప్రధాన కేంద్రం - ఢిల్లీ

¤  గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏర్పాటైన సంస్థ - ట్రైఫెడ్ (1987)

¤  నేషనల్ ఈక్విటీ ఫండ్ (1987) చిన్నతరహా పరిశ్రమలకు రుణం అందిస్తుంది

¤  ఖాయిలా పరిశ్రమల గుర్తింపు కోసం ఏర్పాటైంది - BIFR(1987)

¤  మిలియన్ బావుల పథకం (1988) SGSY (1999)లో విలీనమైంది

¤  SEBI (1988) ని సిఫారసు చేసింది - షేర్వానీ కమిటీ

¤  సెబీ స్వయం ప్రతిపత్తి పొందింది - 1992

¤  గృహ నిర్మాణంలో శిఖరాగ్ర సంస్థ - NHB (1988)

¤  కుటీర్‌జ్యోతి పథకం ప్రారంభమైంది: 1988-89

¤  NREP (1980), RLEGP (1983) లో విలీనం కావడంతో ఏర్పడిన నూతన పథకం - JRY (1989)

¤  పట్టణ పేదల కోసం ప్రారంభించిన పథకం - నెహ్రూ రోజ్‌గార్ యోజన (1989). 
NRY ని స్వర్ణజయంతి సహరీ రోజ్‌గార్ యోజన (1997)లో విలీనం చేశారు.
వార్షిక ప్రణాళికలు (1990-92)

¤  నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది - 1991

¤  చిన్న పరిశ్రమలకు రుణాలిచ్చే శిఖరాగ్ర సంస్థ - SIDBI (1990)

¤  నూతన పారిశ్రామిక విధానం రూపొందించింది - 1991

¤  నరసింహం కమిటీ (1991) అధ్యయనం చేసింది - విత్త సంస్కరణలు

¤  పన్ను సంస్కరణలపై రాజా చెల్లయ్య కమిటీని నియమించింది - 1991

ఎనిమిదో ప్రణాళిక (1992-97)
¤  ప్రాధాన్య లక్ష్యం - మానవ వనరుల అభివృద్ధి

¤  సూచనాత్మక ప్రణాళికగా అమలైంది - ఎనిమిదో ప్రణాళిక

¤ అతి తక్కువ విదేశీ సాయం పొందింది - ఎనిమిదో ప్రణాళిక

¤  ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది - ఎనిమిదో ప్రణాళిక

¤  ఎనిమిదో ప్రణాళిక దేశ ఆర్థిక వ్యవస్థను మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మార్చింది.

¤  విద్యావంతులైన నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలిచ్చే పథకం - PMRY (1993)

¤  ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది - 1993
¤  గ్రామీణ మహిళల్లో పొదుపును ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం - MSY (1993)

¤  ఎంపీ ల్యాడ్స్ ప్రారంభించింది - 1993

¤  ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ. 5 కోట్లకు పెంచిన సంవత్సరం - 2011

¤  జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ ఏర్పాటైంది - 1993

¤  జాతీయ సామాజిక సహాయత పథకం (NSAP) -1995

¤  RIDF (1995) ని గ్రామీణ అవస్థాపన అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు

¤  సత్వర సాగునీటి లబ్ధి పథకం ప్రారంభమైంది - 1996-97

¤  భూగర్భ జలాల వెలికితీతకు సబ్సిడీ రుణాలిచ్చే పథకం - GKY (1997)

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again