పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 18, 2014

ఆంగ్ల - మరాఠా యుద్ధాలు

 
              మొగల్ చక్రవర్తుల కాలం రాజకీయ, ఆర్థిక, సంస్కృతులపరంగా స్వర్ణయుగంగా చరిత్రకారుల మన్ననలు పొందింది. అలాంటి మొగల్ చక్రవర్తులను ధైర్యంగా ఎదుర్కొని వారిని ఓడించి, వారి పతనానికి ముఖ్య కారకులయ్యారు మహారాష్ట్రులు. మహారాష్ట్రులే తమతో సమానంగా యుద్ధం చేయగల బలవంతులు, సమర్థులని; వారిని పరాజితులను చేస్తే మిగిలిన వారిని గెలవడం కష్టం కాదని ఆంగ్లేయుల గట్టి నమ్మకం. అందువల్ల మహారాష్ట్రులను ఓడించడమే ధ్యేయంగా ఆంగ్లేయులు కృతనిశ్చయులై వారితో యుద్ధానికి తలపడ్డారు. ఇలా మరాఠాలు - ఆంగ్లేయుల మధ్య 3 యుద్ధాలు జరిగాయి. వీటినే ఆంగ్ల- మరాఠా యుద్ధాలు అంటారు. 
 ఆంగ్ల - మరాఠా యుద్ధాలు, పాల్గొన్నవారు - కారణాలు- ఒప్పందాలు- ఫలితాలు మొదలైన విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పీష్వా :   మహారాష్ట్రులకు భారతదేశ చరిత్రలో సమున్నత స్థానం కల్పించిన మహారాష్ట్ర జాతిపిత 'శివాజీ' మంత్రివర్గంలో అత్యంత ముఖ్యమైన పదవి పీష్వా. పీష్వా అంటే ప్రధానమంత్రి. పీష్వా రాజుకు కుడిభుజంలాంటి వాడు.

¤ శివాజీ మనవడైన 'షాహు' పరిపాలనకాలంలో (1707-1749) పీష్వా పదవికి ప్రాముఖ్యం పెరిగింది. ఛత్రపతి లేదా చక్రవర్తి అధికారం కేవలం నామమాత్రమైంది. వాస్తవ పరిపాలనా బాధ్యతలను పీష్వా చేపట్టారు. 
¤ వాస్తవ పరిపాలనా బాధ్యతలు చేపట్టిన మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. ఇతడి పరిపాలనా కాలం (1713-20) నుంచి పీష్వా పదవి శక్తివంతం, అనువంశికం అయింది.

మరాఠా సర్దార్ల కూటమి: బాలాజీ విశ్వనాథ్ తర్వాత పీష్వా అయిన బాజీరావు-1 కాలంలో మరాఠా సర్దార్ల కూటమి ఏర్పడింది. వీరంతా చక్రవర్తి విధేయులుగా పనిచేస్తూ మహారాష్ట్ర సమైక్యత కోసం కృషి చేసేవారు.

¤ ఈ కూటమి కింద ప్రముఖులైన మరాఠా నాయకులకు వారి ప్రభావ పరిధిలోని భూభాగాన్ని అప్పగించారు.

         ప్రాంతం          పాలకులు
         పూనా           పీష్వా 
       నాగపూర్         భోంస్లే 
      గ్వాలియర్        సింథియా 
       ఇండోర్          హోల్కర్
        బరోడా         గైక్వాడ్ 
¤ బాజీరావు-I తర్వాత బాలాజీ బాజీరావు, మాధవరావు మొదలైన వారు పీష్వాలుగా పనిచేశారు. 1772లో పీష్వా మాధవరావు మరణం తర్వాత ఆయన తమ్ముడు నారాయణరావు పీష్వా అయ్యాడు. అయితే ఆయన పినతండ్రి రఘునాథరావు నారాయణరావును హత్య గావించి పీష్వాగా ప్రకటించుకున్నాడు.    

ఈ చర్య గిట్టని నానాపడ్నావీస్ అనే ప్రముఖ మరాఠా సర్దార్ నారాయణరావు కుమారుడైన మాధవరావు-2 ని పీష్వాగా చేసి రఘునాథరావును పదవీచ్యుతుడిని చేశాడు. పదవీచ్యుతుడైన రఘునాథరావు చాలా అవమానకరంగా భావించి, ఆంగ్లేయుల సహాయం ఆర్థించాడు. ఇటువంటి సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆంగ్లేయులు వెంటనే రఘునాథరావుతో సంధి చేసుకున్నారు. ఇదే సూరత్ సంధి (1775).

సూరత్ సంధి (1775): 1775 లో సూరత్ సంధి బొంబాయి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ గోడార్డ్, మరాఠాలకు చెందిన రఘునాథరావు మధ్య జరిగింది.
ముఖ్యాంశాలు: ఆంగ్లేయులు రఘునాథరావును పీష్వాగా నియమించాలి. దీనికి ప్రతిగా రఘునాథరావు సాల్‌సెట్టి, బెస్సిన్ ప్రాంతాలను ఆంగ్లేయులకివ్వాలి.
¤ పీష్వాగా చేయడానికి అయిన సైనికఖర్చులు రఘునాథరావు భరించాలి.
పురంధర్ సంధి (1776): 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ ప్రభుత్వం అనుమతి లేకుండా బొంబాయి గవర్నర్ స్వదేశీ రాజులతో యుద్ధం చేయడం, సంధి చేసుకోవడం వీలుకాదని బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ స్పష్టం చేశాడు. సూరత్ సంధికి ప్రతిగా ఆంగ్లేయులతో (వారన్ హేస్టింగ్) నానాపడ్నావీస్ రఘునాథరావుకు వ్యతిరేకంగా పురంధర్ సంధి చేసుకున్నాడు.

ముఖ్యాంశాలు: రఘునాథరావుకు ఆంగ్లేయులు సహాయం చేయడం నిలిపివేయాలి.

¤ మాధవరావు-2 ను పీష్వాగా గౌరవించాలి.

¤ సాల్‌సెట్టి ద్వీపాన్ని ఆంగ్లేయులకివ్వాలి.     
 
అయితే ఇంగ్లండ్‌లోని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పురంధర్ సంధిని ఖండించారు. దీనికి కారణం పీష్వా మాధవరావు-2 కు ఫ్రెంచివారికి సంబంధం ఉందనే అనుమానం. ఫ్రెంచి వారు భారతీయ రాజులతో సంబంధాలు పెట్టుకోవడం ఆంగ్లేయులకిష్టంలేదు.

మొదటి ఆంగ్ల-మరాఠా యుద్ధం (1775-1782)
కారణాలు: పీష్వా పదవికోసం మహారాష్ట్రుల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు. నానాపడ్నావీస్ నాయకత్వంలో మరాఠా కూటమి మాధవరావు-2 ను బలపరచగా, బొంబాయి కంపెనీవారు రఘునాథరావును సమర్థించడం. రెండు వర్గాల్లో ఒక వర్గాన్ని సమర్థిస్తూ అవకాశాల్ని తమ స్వప్రయోజనాలకోసం అనుగుణంగా మలచుకోవాలనే బ్రిటిష్ వైఖరి.

యుద్ధవిశేషాలు: వారన్ హేస్టింగ్స్ సలహాలను తిరస్కరించి మరాఠాలపై బొంబాయి గవర్నర్ గోడార్డ్ యుద్ధం ప్రకటించగా, నానాపడ్నావీస్ నాయకత్వంలోని మరాఠా కూటమి ఆంగ్లేయులను ఓడించింది. దీనితో మరాఠా కూటమి, ఆంగ్లేయుల మధ్య వాడగాన్ సంధి జరిగింది.

వాడగాన్ సంధి (1779) ముఖ్యాంశాలు:
¤ మాధవరావు-2 ను పీష్వాగా అంగీకరించాలి

¤ రఘునాథరావును పీష్వాకు స్వాధీనం చేయాలి.

¤ నానా పడ్నావీస్ నాయకత్వంలో హైదర్ ఆలీ (మైసూర్), నైజాం, మరాఠాలు ఒక మిత్రకూటమిగా ఏర్పడి, ఆంగ్లేయులపై దాడి చేయాలని నిర్ణయించగా భారతీయుల బలహీనతలు అంచనా వేసి, మిత్రకూటమిని వారన్ హేస్టింగ్స్ విడదీశాడు.

¤ వారన్‌హేస్టింగ్, మహారాష్ట్రులను ఓడించడంతో మహారాష్ట్రులు 1782లో ఆంగ్లేయులతో సంధి చేసుకున్నారు. ఇదే సాల్బే సంధి.

సాల్బే సంధి (1782) - ముఖ్యాంశాలు: ఆంగ్లేయులు మాధవరావు-2 ను పీష్వాగా గుర్తించాలి.

¤ రఘునాథరావుకు ప్రతి సంవత్సరం 3 లక్షల పెన్షన్ ఇవ్వాలి.

¤ సాల్‌సెట్టి ద్వీపం బ్రిటిష్ వారికి ఇవ్వాలి.

సాల్బే సంధి తదనంతర పరిస్థితులు: సాల్బే సంధి మహారాష్ట్రులకు, ఆంగ్లేయులకు మధ్య రమారమి 20 సంవత్సరాలు సత్సంబంధాలు కల్పించడంతో, ఆంగ్లేయులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పాలనను స్థిరపరచుకుంటూ సైనికంగా పటిష్ఠం చేసుకున్నారు.

¤ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మహారాష్ట్రుల ఐక్యత నిలబెట్టడానికి ఆహర్నిశలు కృషి చేసిన నానా పడ్నావీస్ క్రీ.శ. 1800లో మరణించాడు. దీంతో మహారాష్ట్రుల మధ్య విభేదాలు, కలహాలు మొదలు కాగా ఆంగ్లేయులు జోక్యం చేసుకొనేందుకు అవకాశం కలిగింది.

¤ నానా పడ్నావీస్ మరణించే నాటికి పీష్వా బాజీరావు-2 బలహీనుడు కావడంతో, మహరాష్ట్ర సర్దార్ల కూటమిలోని సింథియా, హోల్కర్‌లు బాజీరావు-2 అధికారాన్ని దిక్కరించసాగారు. దీంతో బాజీరావు-2 సింథియాతో చేతులు కలిపి జస్వంత్‌రావ్ హోల్కర్ తమ్ముడిని హత్య చేయించాడు. దీంతో జస్వంత్‌రావు హోల్కర్ పీష్వా, సింథియాలను ఓడించగా, పీష్వా బేసిన్ పారిపోయి ఆంగ్లేయుల సహాయంకోరి ఆంగ్లేయులతో సంధి చేసుకున్నాడు. అదే బేసిన్ సంధి (1802).

1802 బేసిన్ సంధి - ముఖ్యంశాలు: బాజీరావు-2 సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని సంవత్సరానికి 26 లక్షల రూపాయలు లేదా అంతటి ఆదాయానిచ్చే ప్రాంతాన్ని బ్రిటిష్‌వారికి ఇవ్వాలి.

¤ బాజీరావు-2 ను పీష్వాగా చేసేందుకు బ్రిటిషర్లు అంగీకరించారు.

రెండో ఆంగ్ల- మరాఠా యుద్ధం (1803-1805)
               బేసిన్ ఒప్పందమే 2వ ఆంగ్ల - మరాఠా యుద్ధానికి కారణం. ఆంగ్లేయులతో పీష్వా కుదుర్చుకున్న బేసిన్ సంధికి వ్యతిరేకంగా మహారాష్ట్ర సర్దార్ల కూటమిలోని సింథియా, బోంస్లేలు తమ విభేదాలను విస్మరించి, ఏకమై అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెల్లస్లీపై యుద్ధం ప్రకటించారు.
యుద్ధ విశేషాలు: సింథియా, బోంస్లేలు ఆంగ్లేయులతో యుద్ధానికి తలపడితే, గైక్వాడ్స్ ఆంగ్లేయులకు సహాయం చేయగా, హోల్కర్, తటస్థంగా వ్యవహరించాడు. ఫలితంగా సింథియా, బోంస్లేలు యుద్ధంలో ఓడిపోయి విడివిడిగా ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకొన్నారు.

దేవ్‌గాన్ సంధి (1803): రాఘూజీ బోంస్లే, ఆంగ్లేయులతో సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నాడు.

¤ మరాఠా సర్దార్ల కూటమి నుంచి తప్పుకోవాలి. బాలాసోర్, కటక్, వార్ధా ప్రాంతాలను ఆంగ్లేయులపరం చేశారు.

సుర్జి అర్జన్‌గాన్ సంధి (1803): దౌలతరావ్ సింథియా ఆంగ్లేయులతో సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొన్నాడు.

¤ అహ్మద్‌నగర్, బ్రోచ్ ప్రాంతాలను ఆంగ్లేయులకివ్వాలి.

¤ ఆంగ్లేయులతో చెప్పకుండా ఇతర దేశీయులతో సంబంధాలు ఏర్పర్చుకోకూడదు.      

ఆంగ్లేయుల నుంచి తమకు సంభవించబోయే ప్రమాదాన్ని గుర్తించి హోల్కర్ ఆంగ్లేయులపై యుద్ధానికి దిగాడు (1804). అయితే యుద్ధంలో ఎవరూ సంపూర్ణ విజయం సాధించకముందే యూరప్‌లో జరుగుతున్న పరిణామాలవల్ల యుద్ధం నిలుపుదల చేశారు. యశ్వంత్‌రావ్ హోల్కర్, ఆంగ్లేయుల మధ్య 1805లో జరిగిన రాజ్‌ఘాట్ సంధితో రెండో ఆంగ్ల- మరాఠా యుద్ధం ముగిసింది.
మూడో ఆంగ్ల- మరాఠా యుద్ధం (1817-1818)
కారణాలు: బేసిన్ సంధి ద్వారా సైన్య సహకార పద్ధతిని అంగీకరించి, తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను బ్రిటిషర్ల పాదాక్రాంతం చేసిన బాజీరావు-2, బ్రిటిష్ అధికారం నుంచి విముక్తి పొందడానికి మిగిలిన మహారాష్ట్ర నాయకులతో రహస్య మంతనాలు జరపడం.

¤ తమ సామ్రాజ్య వ్యాప్తికి, అధికారానికి అడ్డంగా వచ్చినవారిని పూర్తిగా తొలగించివేయాలనే నిర్ణయం.

¤ పిండారీలను అణచివేసే కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలో ఆంగ్లేయ సైన్యం తిష్టవేయడం.

                పిండారీలు అంటే దారిదోపిడీ చేసేవాళ్లు అని అర్థం. వీరు ఒకప్పుడు సైనికులుగా ఉంటూ, స్వదేశీ రాజ్యాలు ఆంగ్లేయులు ఆక్రమించగా ఉద్యోగాలు కోల్పోయి, బాటసారులను అతిక్రూరంగా హింసించి ఆస్తిని, ధనాన్ని దోచుకునేవారు. వీరు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండగా వీరిని అణచివేయాలని, ఆంగ్లసైన్యం మహారాష్ట్రలో చేరింది. ఇలా మహారాష్ట్రులతో యుద్ధం చేయకుండానే పిండారీలను అణచివేసే నెపంతో మహారాష్ట్రలో ప్రవేశం పొంది, బ్రిటిషర్లు మహారాష్ట్రుల సైనిక రహస్యాలు, బలాలు, బలహీనతలు తెలుసుకున్నారు. ఆంగ్లేయులు పిండారీలను 1817-1818 మధ్య అణచివేశారు.

పూనా సంధిని పీష్వా అవమానకరంగా భావించడం: బేసిన్ సంధిని పీష్వా అతిక్రమించాడని పీష్వాపై నేరారోపణ చేసి, ఆంగ్లేయులు 1817లో బాజీరావు-2 తో పూనా సంధి చేసుకున్నారు.

పూనా సంధి (1817) - ముఖ్యాంశాలు: పీష్వా మిగిలిన మహారాష్ట్ర కూటమిలో చేరకూడదు. కూటమి ఏర్పాటు చేయరాదు.

¤ అహ్మద్‌నగర్‌ను శాశ్వతంగా ఆంగ్లేయులకివ్వాలి.

యుద్ధవిశేషాలు: పీష్వా బాజీరావు-2 తిరుగుబాటు చేసి 'కిర్కీ'లోని బ్రిటిష్ స్థావరంపై దాడిచేయడమే కాకుండా, పూనాలోని బ్రిటిష్ స్థావర కార్యాలయాన్ని తగలబెట్టాడు.

¤ పీష్వా బాజీరావు-2 ను ఆంగ్లసేనాని మాల్కమ్ బంధించడంతో మూడో ఆంగ్ల-మరాఠా యుద్ధం ముగిసింది.
ఫలితాలు: గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ పీష్వా పదవిని 1818లో రద్దు చేశారు.

¤ మరాఠాల అభిమానాన్ని సంతృప్తి పరిచేందుకు మహారాష్ట్ర సామ్రాజ్యానికి గుర్తుగా 'సతారా' రాజధానిగా చిన్న మహారాష్ట్ర రాజ్యాన్ని నిర్మించి, దాని పరిపాలకుడిగా శివాజీ కుటుంబానికి చెందిన ప్రతాప్‌సింగ్‌ను నియమించారు.
¤ పీష్వా అధీనంలోని ప్రాంతాలన్నింటిని బొంబాయి ప్రెసిడెన్సీలో కలిపివేశారు.
               ఈ విధంగా వారెన్ హేస్టింగ్స్ కాలంలో మొదలైన మహారాష్ట్రుల అణచివేతను లార్డ్ హేస్టింగ్స్ పూర్తిచేశారు.

గమనిక: మొదటి ఆంగ్ల-మరాఠా యుద్ధంలో వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్, రెండో ఆంగ్ల- మరాఠా యుద్ధంలో లార్డ్‌వెల్లస్లీ, మూడో ఆంగ్ల-మరాఠా యుద్ధంలో లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్‌లుగా పనిచేశారు.

సైన్య సహకార పద్ధతికి మహారాష్ట్రులు ఒప్పుకోవడం - పరిణామాలు: లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతికి మహారాష్ట్రులు అంగీకరించడం వల్ల పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి.
¤ మహారాష్ట్రులు తమ స్వాతంత్య్రాన్ని కోల్పోయారు. ఆంగ్లేయుల అడుగుజాడల్లో నడచుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

¤ సైనిక సహాయ దళాన్ని నిర్వహించడం వల్ల మరాఠాల ఖజానా ఖాళీ అయి పేదరికం పెరిగింది.

¤ సైన్య సహకార పద్ధతివల్ల మరాఠాల సైన్యాన్ని రద్దు చేయడంవల్ల ఎన్నో తరాల నుంచి సైనిక వృత్తికే అంకితమైన సైనికులు జీవనాధారం కోల్పోయి, మరాఠా సమాజం అథోగతి చెందింది.

¤ సైన్య సహకార పద్ధతి బ్రిటిష్ వారికి గొప్ప వరం అయింది. బ్రిటిషర్లు స్థానిక భారతీయుల ఖర్చులతో తమ వద్ద నున్న పెద్ద సైన్యాన్ని పోషించారు.

¤ రాజ్య అంతర్భాగాల్లో కీలక స్థావరాల్లో ఉన్న ఆంగ్లేయ సైన్యానికి రహస్య స్థావరాలు, బలహీనతలు బాగా తెలిశాయి.

¤ ఇతర యూరోపియన్లతో భారతీయ రాజులు, ఆంగ్లేయుల అనుమతి లేనిదే ఎలాంటి సంబంధాలు పెట్టుకోకపోవడంవల్ల ఆంగ్లేయులకు పోటీ లేకుండా పోయింది.

గమనిక: '1857 సిపాయిల తిరుగుబాటు' శీర్షిక కింద గతంలో సైన్య సహకార పద్ధతి లక్షణాల గురించి వివరించాం.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again