పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 23, 2014

ఖనిజ వనరులు, పరిశ్రమలు

               నిత్యావసరాలకు ఆహార, వ్యాపార పంటలు ఎంత అవసరమో ముడి పదార్థాలు పరిశ్రమలకు అంతే ముఖ్యం.ఈ ముడి పదార్థాల్లో ఖనిజాలు చాలా ప్రధానమైనవి.అధిక ఖనిజ సంపత్తి ఉన్న దేశాన్ని సంపన్నమైందిగా పరిగణిస్తారు. నేడు 100 కంటే ఎక్కువ ఖనిజాలు ఉత్పత్తి అవుతున్నా అవి దేశమంతటా విస్తరించి లేవు. విలువైన ఖనిజాలు ఉత్తర భారత దేశంలో లేవు. ద్వీపకల్ప భాగంలో అన్ని రకాల ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి.    
             ఖనిజం భూమి నుంచి లభించే సహజ సంపద. గనుల నుంచి తవ్వి తీయడం వల్ల వీటిని ఖనిజాలంటారు. ఈ సంపద ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే విధంగా లభ్యం కాదు.ఆయా దేశాల్లో ఉన్న భూగర్భ పరిస్థితులను బట్టి లభ్యమవుతుంటుంది. లభ్యత, వినియోగాల ఆధారంగా ఖనిజాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. దేశీయ వినియోగానికే కాకుండా, ఎగుమతి చేసేందుకూ సరిపడా ఖనిజాలు మనకు ఉన్నాయి. అవి ఇనుప ధాతువు, అభ్రకం, మాంగనీస్, క్రోమైట్, బాక్సైట్, సిలికా, టిటానియం, థోరియం తదితరాలు.

  2. స్వయం సమృద్ధికి సరిపడే పరిమాణంలో బొగ్గు, అల్యూమినియం, సున్నపురాయి, జిప్సం, బైరైటిస్, డోలమైట్, సిమెంటు ముడి పదార్థాలు ఉన్నాయి.

  3. దేశీయ వినియోగానికి సరిపోనివి, తప్పనిసరిగా దిగుమతి చేసుకునేవి పెట్రోలియం, రాగి, సీసం, తగరం, వెండి, జింక్, నికెల్, పాదరసం, గంధకం మొదలైనవి.

ఖనిజాలను స్థూలంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు.
1. లోహ ఖనిజాలు.    
2. అలోహ ఖనిజాలు.     
3. ఇంధన ఖనిజాలు.       
4. అణుశక్తి ఖనిజాలు.
క్ర.సంఖ్య     ఖనిజ రకాలు             ఖనిజం లభించే రాష్ట్రాలు  
1                లోహ              ఇనుము, రాగి, తగరం, బాక్సైటు,                                                               జింక్ (బీహార్), మాంగనీస్, క్రోమైట్ (ఒడిశా),                                                        బంగారం (కర్ణాటక), వెండి, సీసం, 
                                                            టంగ్‌స్టన్ (రాజస్థాన్) 

2             ఆలోహ              అభ్రకం, ఎపటైట్, క్రయలైట్, ఆస్బెస్టాస్ (బీహార్),                                              సున్నపురాయి, బైరైటిస్, గ్రాఫైట్ (ఆంధ్రప్రదేశ్),                                             జిప్సం (రాజస్థాన్), మాగ్నసైట్ (తమిళనాడు),                                              సిలిమలైట్ (మేఘాలయ), డోలమైట్ (ఒడిశా),                                                  ఉప్పు (గుజరాత్), వజ్రాలు పన్నా (మధ్యప్రదేశ్)  

3           ఇంధన           నేల బొగ్గు (బీహార్), లిగ్నైట్ (తమిళనాడు),                                                   పెట్రోలియం (అసోం), సహజ వాయువు (గుజరాత్) 
4           అణుశక్తి            యురేనియం (బీహార్), థోరియం (తమిళనాడు),                                                                      మోనజైట్ (కేరళ)
విస్తరణ ఇలా...
          మన దేశంలో ద్వీపకల్ప పీఠభూమి అత్యధిక ఖనిజాలు లభిస్తోన్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం ఎక్కువ ఖనిజాలకు నిలయమై ''రూల్ ఆఫ్ ఇండియా''గా పేరొందింది. అధిక ఖనిజ నిల్వలు ఉన్న జార్ఖండ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దామోదర్, సోన్, మహానది, గోదావరి నదీ లోయల్లో అత్యధికంగా బొగ్గు నిక్షేపాలున్నాయి. గుజరాత్, అసోం రాష్ట్రాల్లో, మహారాష్ట్ర తీర ప్రాంతంలో పెట్రోలియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. జార్ఖండ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆర్కియన్ శిలల్లో ఇనుప ధాతువు నిక్షేపాలున్నాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో సింగభమ్, కియోంజర్, బోనాయ్, మయూర్‌భంజ్ జిల్లాల్లో ఇనుప నిక్షేపాలున్నాయి.

శక్తిదాయక వనరులను పరిరక్షిద్దాం
          పారిశ్రామికీకరణ జరగాలన్నా, రవాణా, ప్రసార సాధనాల ద్వారా ఆర్థికాభివృద్ధి పెరగాలన్నా శక్తివనరుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది.భారతదేశంలో బొగ్గు నిల్వలు సమృద్ధిగా,పెట్రోలియం సహజవాయు నిక్షేపాలు స్వల్పంగాను ఉన్నాయి. వీటిని అధికంగా వినియోగిస్తే అవి తరగడమేగాక, భవిష్యత్‌లో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే మనం శక్తి వనరులను పొదుపుగా వాడాలి. అంతేగాక శక్తి ఉత్పత్తికి మరో మార్గాన్ని అన్వేషించాలి. ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి బయోగ్యాస్, బయోమాస్, సూర్యశక్తి, పవనశక్తి, చిన్న జలవిద్యుత్ కేంద్రాలను అభివృద్ధి పరచాలి. ఇలా చేయటం వల్ల శక్తి వనరుల నిల్వలు పెరగటమే గాక, వాయు కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని రక్షించవచ్చు.

పరిశ్రమలు
           భూమి నుంచి తీసే ఖనిజాలు, కొన్ని రకాల వ్యవసాయ పంటలు, అటవీ ఉత్పత్తులు వెంటనే వినియోగించుకోవడానికి ఉపయోగపడవు.ముడి పదార్థాలుగా పిలిచే వీటిని పరిశ్రమల్లో శుద్ధి చేసి మనకు ఉపయోగపడే వస్తువులుగా తయారు చేస్తారు.పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.వ్యవసాయమే ప్రధాన వృత్తి అయినప్పటికీ పారిశ్రామిక రంగంలోనూ మనం ప్రగతి సాధిస్తూనే ఉన్నాం.

ముడి సరుకును బట్టి మన పరిశ్రమలను మూడు విధాలుగా విభజించవచ్చు. అవి వ్యవసాయ, ఖనిజ, అటవీ ఆధార పరిశ్రమలు.  

వ్యవసాయాధార పరిశ్రమలు
            భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశమైనందున ప్రజలకు కావలసిన ఉత్పత్తులను సమకూర్చడంలో ఈ పరిశ్రమలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి ఉత్పత్తులతోపాటు ఉపాధి అవకాశాలనూ మెండుగా కల్పిస్తాయి. వ్యవసాయాధార పరిశ్రమల్లో వస్త్రాలు, పంచదార, పొగాకు, ఖాద్యతైలం, సహజ రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, తోళ్లు, పాడి పరిశ్రమలు ముఖ్యమైనవి.

ఖనిజాధార పరిశ్రమలు
          భారతదేశంలో ఆధునిక పరిశ్రమలు ప్రధానంగా ఖనిజాధారమైనవి. వీటిలో ఇనుము-ఉక్కు, సిమెంటు, ఎరువులు, పెట్రో రసాయనాలు, భారీ ఇంజినీరింగ్, యంత్ర పరికరాల పరిశ్రమలు ముఖ్యమైనవి. దేశం శీఘ్రంగా పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి ఇనుము-ఉక్కు పరిశ్రమ కీలకమైనది. టాటా ఇనుము-ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇనుము-ఉక్కు
కంపెనీ, విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు కంపెనీ, భిలాయి, దుర్గాపూర్, బొకారో, విశాఖపట్నం కర్మాగారాలు మన దేశంలో ముఖ్యమైనవి.

అటవీ ఆధార పరిశ్రమలు: కాగితం, అగ్గిపెట్టెలు, క్రీడా వస్తువులు, లక్క, కలప పరిశ్రమలు అటవీ ఆధారమైనవి.

పరిశ్రమల విస్తరణలో అసమానత: మన దేశంలోని పరిశ్రమల విస్తరణలో అసమానత ఉంది. నూలు వస్త్రాలు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనూ జనుము వస్తువులు పశ్చిమ బెంగాల్లోను, పంచదార పరిశ్రమ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాల్లోను ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. కాగితం, పొరచెక్క, అగ్గిపెట్టెలు, జిగురు, లక్క వంటి అటవీ ఆధార పరిశ్రమలు వివిధ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. చాలా చమురు శుద్ధి కర్మాగారాలు పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో ఉన్నాయి. అందువల్ల భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది.

ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు: హుగ్లీ, ముంబయి-పుణె, అహ్మదాబాద్-బరోడా, మధురై-కోయంబత్తూర్-బెంగళూరు, చోటానాగపూర్, మధుర-ఢిల్లీ-షహరాన్‌పూర్-అంబాలా ప్రాంతాలు మన దేశంలో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలు.

1 comment:

  1. నా ఇవి చాలాబాగా నచ్చాయి

    ReplyDelete

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again