పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం


           స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థ అనేక మార్పులు పొందింది. ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆధునికీకరణ, జీవన ప్రమాణాల పెరుగుదల, మార్కెట్ పరిరక్షణలపై దృష్టి నిలిపింది. ఆర్థిక రంగంలో ద్వితీయ, తృతీయ రంగాల విధానాల రూపకల్పనకు ప్రత్యేక స్థానం కల్పించారు.



                                        ఆర్థిక వ్యవస్థ నిర్మాణం

వృత్తి వ్యవస్థ నిర్మాణం: ప్రజలు జీవనాధారం కోసం వివిధ రకాలైన వృత్తులను చేస్తూ ఆదాయం సంపాదించుకుంటారు. ఈ విధంగా వేర్వేరు వృత్తుల్లో పాలుపంచుకునే ప్రజల ఆధారంగా 'వృత్తివ్యవస్థ నిర్మాణం' జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో మూడు రకాలయిన వృత్తి రంగాలు ఉన్నాయి. అవి:
                  1) ప్రథమ రంగం
                  2) ద్వితీయ రంగం
                  3) తృతీయ రంగం

1. ప్రథమ రంగం:
వ్యవసాయం, మత్స్యకార వృత్తి, తోటల (ప్లాంటేషన్) పెంపకం, గనుల తవ్వకం మెదలయిన వాటికి సంబంధించిన పనులు ప్రథమ రంగానికి చెందినవి. ఉదా: ఆహార ధాన్యాల, ముడిసరుకుల ఉత్పత్తి. 

2. ద్వితీయ రంగం:
పెద్ద, చిన్నతరహా పరిశ్రమల్లో ఉత్పత్తి కార్యకలాపాలు ద్వితీయ రంగానికి చెందినవి. ఉదా: భవన నిర్మాణాలు.

3.తృతీయ రంగం: బ్యాంకింగ్, వాణిజ్యం, ప్రసార సాధనాలు, ఉపాధి అవకాశాలను తృతీయ ఆర్థిక రంగం అంటారు. ఉదా: బ్యాంకింగ్, వాణిజ్యం, ప్రసార సాధనాలు.

1970-80ల మధ్య వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పన క్రమేపీ తగ్గింది. అదే సమయంలో ద్వితీయ, తృతీయ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.

వ్యవసాయం:
అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం ద్వారా వచ్చే జాతీయాదాయం చాలా తక్కువ. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే ఉపాధి కోసం ప్రజలు వ్యవసాయ రంగంపై ఎక్కువ ఆధార పడతారు.

భూమి యాజమాన్యం సంబంధాలు, నిర్మాణం:
భూమి యాజమాన్య నియతి, నిర్మాణ సంబంధాలు రెండూ వ్యవసాయ పెరుగుదల రేటు నిర్ధారించడంలో కీలకంగా ఉంటాయి. భూ పరిమితి చట్టం సేకరించిన మిగులు భూముల పంపిణీ లాంటి సంస్కరణలు అశించిన ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల చాలా గ్రామీణ ప్రాంతాలు ఇంకా పేదరికంలోనే ఉన్నాయి.

వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత:
మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తి రుతుపవనాలు, వర్షపాతం, వాతావరణ స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. రైతులు ఉపయోగించే సాంకేతిక స్థాయి, కమతాల పరిమాణం కూడా ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. 
(వ్యవసాయ భూమిని కమతం అంటారు)
             చిన్న కమతాలు సాంద్ర వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఎకరాకు వచ్చే ఫలసాయం పెద్ద కమతాల కంటే ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. దాన్నే కమతం పరిమాణం, ఉత్పాదకతకు మధ్య ఉండే విలోమ సంబంధంగా గుర్తిస్తారు.

వ్యవసాయ ఉత్పత్తులను రెండు రకాలుగా విభిజించవచ్చు.
1) ఆహార ధాన్యాలు
వరి, గోధుమ, పప్పు దినుసులు, రాగులు సజ్జలు మొదలైనవి.
2) ఇతర పంటలు

ఇవి నూనె గింజలు, చెరకు, పత్తి, జనుము, సోయాబీన్స్, ఆలుగడ్డలు లాంటి వాణిజ్యపంటలు వీటి కిందకు వస్తాయి. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు మనదేశం ఆహారధాన్యాల, ఇతర పంటల దిగుబడిలో చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. మనదేశంలో హెక్టారుకు 17.5 క్వింటాళ్ల వరి పంట పండితే, చైనాలో హెక్టారుకు 55.1 క్వింటాళ్లు, ఉత్తర కొరియాలో 75 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గోధుమ ఉత్పత్తిలో సైతం మనదేశం వెనకబడే ఉంది. ఇక్కడ హెక్టారుకు 22.7 క్వింటాళ్ల దిగుబడి ఉండగా, చైనాలో 81.2 క్వింటాళ్లు, ఐర్లాండ్‌లో 74.5 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.

మనదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి చేసిన ప్రయత్నాల్లో 'హరిత వప్లవం' చెప్పుకోదగ్గది.

హరిత విప్లవం: 1966 లో నూతన వ్యవసాయక వ్యూహాన్ని భారతదేశం అనుసరించింది. 

దానిలో భాగమే హరిత విప్లవం. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పద్ధతులను అనుసరించడం, మెరుగైన జల నిర్వహణ పద్ధతులు మొదలైనవి హరిత విప్లవ లక్ష్యాలు.

హరిత విప్లవంలోని అంశాలు:
1) గోధుమ ఉత్పత్తి పెంచడానికి అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల వినియోగం.

2) సస్యరక్షణలో ఎరువుల, పురుగు మందుల ఉపయోగం.

3) పూర్తిస్థాయి ఉపయోగం కోసం విస్తృత వనరుల నిర్వహణ.

ఈ హరిత విప్లవం అన్ని ప్రాంతాలకు విస్తరించలేదు. హరిత విప్లవం వల్ల వ్యవసాయ పెరుగుదల రేటు పెరిగినప్పటికీ, పెరిగిన ఉత్పాదకత కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్తాయి.

పరిశ్రమలు: అభివృద్ధి చెందే దేశాల్లో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ ఒక దాని నుంచి మరొకటి విడదీయరానివి.

పరిశ్రమ నిర్మాణం: పరిశ్రమ నిర్మాణాన్ని పెట్టుబడి పరిమాణం, యాజమాన్యం, ఉత్పాదకత అనే అంశాలు ఆధారంగా 3 రకాలుగా విభజించారు.

యాజమాన్య విధానం:
దీని ప్రకారం భారతీయ పరిశ్రమలను 3 రంగాలుగా విభజించవచ్చు.

1. ప్రభుత్వరంగం: ప్రభుత్వం లేదా ప్రభుత్వాధిపత్యంలో కొన్ని కార్పొరేషన్లు, సంస్థలు పరిశ్రమలను నిర్వహిస్తాయి.
ఉదా: రైల్వేలు, విమానయానం, నౌకాయానం, ఇనుము, ఉక్కు, మందుల తయారీ పరిశ్రమలు.

2. ప్రైవేటు రంగం: ప్రైవేటు వ్యక్తుల మూలధనంతో నిర్వహించే సంస్థలు, పరిశ్రమలు ప్రైవేటు రంగంలోకి వస్తాయి. 
ఉదా: వినియోగ వస్తువులు, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలు మొదలైనవి.

3. విదేశీ రంగం: విదేశీ మారక క్రమబద్ధీకరణ చట్టం (FERA) ప్రకారం మొత్తం ఈక్విటీలో విదేశీయులవి 40% పైగా ఉంటే ఆ సంస్థను విదేశీరంగ సంస్థగా భావిస్తారు.

పెట్టుబడి పరిమాణం: పెట్టుబడి పరిమాణాన్ని అనుసరించి పరిశ్రమలను 3 రకాలుగా విభిజించవచ్చు.

1. భారీతరహా రంగం: రూ.35 లక్షలు, అంతకంటే ఎక్కవ పెట్టుబడితో నడిచే పరిశ్రమలను భారీతరహా పరిశ్రమలు అంటారు.

2. చిన్నతరహా రంగం: రూ.5లక్షల నుంచి రూ.35 లక్షల పెట్టుబడితో నిర్వహించే పరిశ్రమలను చిన్నతరహా పరిశ్రమలు అంటారు.

3. అల్ప/మరీచిన్నతరహా రంగం(టైనీ): రూ.5లక్షల లోపు పెట్టుబడి, మూలధనం ఉన్న పరిశ్రమలను టైనీ లేదా అల్పతరహా పరిశ్రమలు అంటారు.

ఉత్పాదక విధానం:
ఉత్పాదకత ఆధారంగా మనదేశంలో పరిశ్రమలను 4రకాలుగా విభజించారు. అవి:
1. మౌలిక పరిశ్రమలు: వ్యవసాయనికి, పరిశ్రమలకు అవసరమైన ఉత్పాదకాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు అంటారు.
ఉదా: ఇనుము, ఉక్కు, బొగ్గు, ఎరువులు మొదలైనవి. 

2. ఉత్పాదక వస్తువుల పరిశ్రమలు: ఈ పరిశ్రమలు వ్యవసాయ పరిశ్రమలకు అవసరమైన యంత్ర పరికరాలను సమకూరుస్తాయి.
ఉదా: యంత్రసాధనాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్స్ మొదలైనవి.

3. మధ్యతరహా వస్తువుల పరిశ్రమలు: ఈ పరిశ్రమలు ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులను తయారు చేస్తాయి.
ఉదా: పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, టైర్ మొదలగునవి.

4. వినియోగదారుల వస్తువుల పరిశ్రమలు: తుది వినియోగానికి ఉపయోగపడే వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను వినియోగదారుల వస్తువుల పరిశ్రమలు అంటారు.
ఉదా: పేపర్ ఉత్పత్తులు, సౌందర్య పోషక సాధనాలు, సైకిళ్లు, టీవీలు మొదలైన పరిశ్రమలు.

పారిశ్రామికాభివృద్ధి: రెండో పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి భారత పారిశ్రామిక నిర్మాణంలో అభివృద్ధి లేదు. వినియోగదారుల వస్తువులకు మాత్రం డిమాండ్ అధికంగా ఉంది. అందువల్ల ఇతర పరిశ్రమల్లోని అధిక పెట్టుబడి వినియోగించి ఈ పరిశ్రమల మధ్య సమతూకం చేయాల్సి వచ్చింది.

1950-51 సంవత్సరంలో నికర దేశీయ ఉత్పత్తిలో 11.8 శాతం ఉండే పరిశ్రమల వాటా 1990-91 నాటికి 24.6 శాతానికి పెరిగింది. అయినప్పటికీ మన దేశంలో జాతీయాదాయంలో పరిశ్రమల ఉత్పత్తి వాటా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. 

సేవారంగం: దేశాభివృద్ధికి వ్యవసాయం, పరిశ్రమ రంగాలతోపాటు సేవారంగం కూడా అవసరం. ఇది ఒక దేశ నవీకరణను సూచిస్తుంది.

రవాణా, సమాచార ప్రసారం, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్, బీమా, పౌరపాలన మొదలైనవి సేవారంగం కిందకు వస్తాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని, ఈ పరిస్థితిని తట్టుకునేందుకు ప్రభుత్వం ఎనిమిదో పంచవర్ష ప్రణాళికలో టెలీకమ్యూనికేషన్ రంగానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది.

ద్రవ్య సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు:
ద్రవ్య వ్యవస్థలో 3 భాగాలు ఉన్నాయి:

1. పారిశ్రామిక ద్రవ్యం : పరిశ్రమలకు, పారిశ్రామిక వేత్తలకు, పెద్ద కంపెనీలకు, ఉమ్మడి వాటా కంపెనీలకు ఇది నిధులను సమకూరుస్తుంది.

2. వ్యవసాయ ద్రవ్యం: వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ద్రవ్యాన్ని సమకూరుస్తుంది.

3. ప్రభుత్వ ద్రవ్యం: ప్రభుత్వ ఖర్చులకు, పరిపాలనా యంత్రాంగాన్ని నిర్వహించడానికి, దేశరక్షణ, అంతర్గత భద్రతకు నిధులు సమకూరుస్తుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఆర్‌బీఐని 1935లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది కింది విధులను చేపడుతుంది. 

1. కరెన్సీని ముద్రించి చలామణిలోకి తెస్తుంది.

2. ద్రవ్య సరఫరాను, క్రెడిట్‌ను క్రమబద్ధం చేస్తుంది.

3. ఇది బ్యాంకులకు బ్యాంక్, ప్రభుత్వబ్యాంక్.

4. విదేశీ ద్రవ్య సంబంధ వ్యవహారాలను నిర్వహిస్తుంది.

5. తన శాఖల ద్వారా గ్రామీణ పరపతిని కలిగిస్తుంది.

మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు:
జనాభా పెరుగుదల
నిరక్షరాస్యత
పేదరికం
నిరుద్యోగం
ద్రవ్యోల్బణం
విదేశీ మారక ద్రవ్య లోటు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again