పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

ప్రపంచ చరిత్ర ముఖ్యాంశాలు


ఫ్రాన్స్‌లో 1789లో సంభవించిన విప్లవం ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రధానమైంది. ఈ విప్లవం ప్రజాస్వామ్య పరిపాలనా విధానాలకు, మానవ హక్కులకు పునాది వేసింది. మానవాళికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందించడానికి బీజాలు వేసిన మహత్తర సంఘటన ఇది. చరిత్రకారులు 'రెండో సాంస్కృతిక పునరుజ్జీవనం' గా అభివర్ణించే ఫ్రెంచ్ విప్లవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 

ఫ్రెంచ్ విప్లవం
ఫ్రెంచ్ పార్లమెంటును 'ఎస్టేట్స్ జనరల్' అంటారు. ఫ్రెంచ్ చక్రవర్తులు క్రీ.శ. 1614 నుంచి 1789 వరకు సుమారు 175 సంవత్సరాలపాటు దీన్ని సమావేశపరచలేదు. ప్రజల స్వాతంత్య్రం, హక్కులను పాలకులు గౌరవించలేదు. దీంతో మధ్యతరగతి ప్రజలు విప్లవానికి నాంది పలికారు. ఫ్రెంచ్ విప్లవం హఠాత్తుగా సంభవించింది కాదు. దీనికి అనేక రాజకీయ, సాంఘిక, వైజ్ఞానిక, ఆర్థిక కారణాలున్నాయి.


రాజకీయ కారణాలు
        ఫ్రాన్స్‌ను బూర్బన్ రాజవంశం పాలించింది. బూర్బన్ల పాలన నిరంకుశత్వానికి, అవినీతికి, దుబారాకు, భోగలాలసకు నెలవైంది. పద్నాలుగో లూయీ (1643-1715) కాలంలో వీరి పాలన పరాకాష్టకు చేరింది. ఇతడు దీర్ఘకాలం పాలించాడు. అనేక సైనిక విజయాలు సాధించి, యూరప్‌లో ఫ్రెంచ్ ప్రతిష్టను ఇనుమడింపజేశాడు.

ప్యారిస్‌కు 12 మైళ్ల దూరంలో 'వర్సే' రాజప్రసాదాన్ని నిర్మించాడు. ఇతడు 'నేనే రాజ్యాన్ని' అన్నాడు. ముఫ్పై ఏళ్ల పాటు నిర్వహించిన యుద్ధాలు, వైభవోపేతమైన జీవితం వల్ల ప్రభుత్వ ఖజానాలోని ధనమంతా ఖర్చయ్యింది. చివరికి లూయీ అంత్యక్రియలకు కూడా డబ్బు లేకుండా పోయింది. 

        పద్నాలుగో లూయీ తర్వాత పదిహేనో లూయీ (1715-74) పాలించాడు. ఇతడి కాలంలో న్యాయ వ్యవస్థ అపవాదులకు, అన్యాయాలకు కేంద్రమైంది. ఇతడు ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, సప్తవర్ష సంగ్రామాల్లో పాల్గొని ఫ్రాన్స్‌ను ఆర్థిక సమస్యల్లోకి నెట్టాడు. స్త్రీలపై ఉన్న మోజుతో రాజ్యాన్ని తన ఉంపుడుగత్తెలైన మేడమ్ డి పాంపోడోర్, మేడమ్ డుబారీ లాంటి వారి చేతుల్లో పెట్టాడు. ఇతడు 'నా తర్వాత ప్రళయం వస్తుంది' అనేవాడు. ఇరవై రెండేళ్ల వయసులో ఫ్రాన్స్ చక్రవర్తిగా సింహాసనం అధిష్టించిన పదహారో లూయీ (1774-92) ఉత్తముడు, స్నేహశీలి. అయితే చురుకుదనం, స్థిరచిత్తం లేనివాడు. తన శిరసు మీద ఉంచిన కిరీటాన్ని భూగోళమంత భారంగా భావించాడు. పదహారో లూయీ భార్య మేరీ ఆంటోనైట్. ఈమె ఆస్ట్రియా మహారాణి, పవిత్ర రోమన్ సామ్రాజ్యాధినేత మేరియా థెరిసా కుమార్తె. అనుభవం లేకపోయినా మేరీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంది.ప్యారిస్ నగరాన్ని కరవు చుట్టిముట్టి ప్రజలు తినడానికి తిండి దొరక్క 'మాకు బ్రెడ్డు కావాలి' అని ఆందోళన చేసినప్పుడు 'వారికి బ్రెడ్డు దొరక్కపోతే కేకులు తినవచ్చు కదా' అని వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆమెకు ప్రజల మౌలిక అవసరాల పట్ల కనీస అవగాహన లేదని స్పష్టమవుతోంది. ఆమె విదేశీ వనితగా, శత్రురాజ్యమైన ఆస్ట్రియా రాకుమార్తెగానే ప్రజల మనసుల్లో ముద్రితమైంది. ఫ్రాన్స్‌లో రాజ కుటుంబం నివసించే భవనమైన 'వర్సే' విందులు, విలాసాలకు నిలయమైంది. రాజు ఉపయోగించే టేబుల్ ఖరీదు ఒకటిన్నర మిలియన్ డాలర్లు. అందుకే 'వర్సే రాజ ప్రసాదం దేశం మీద నిర్మించిన సమాధి'గా విమర్శకులు పేర్కొన్నారు.

సాంఘిక కారణాలు
          ఫ్రెంచ్ విప్లవం రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిందనడం కంటే సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా సంభవించిదనడం సముచితం. ఆనాటి ఫ్రెంచి సమాజం మూడు వర్గాలుగా ఉండేది. ఫ్రెంచ్ సమాజాన్ని ఎస్టేట్స్ అనేవారు. మొదటి ఎస్టేట్‌లో మతాచార్యులు, రెండో ఎస్టేట్‌లో భూస్వాములు, మూడో ఎస్టేట్‌లో సాధారణ ప్రజలు ఉండేవారు. ప్రజలకు లభించే సామాజిక గౌరవం వారి సామర్థ్యంపై కాకుండా పుట్టుకపై ఆధారపడి ఉండేది. మతాచార్యులు, భూస్వాములకు భూమి, ధనం, ఆస్తులు ఎక్కువగా ఉండేవి. వీరు భోగ విలాసాలతో కాలం గడిపేవారు. భూములు, ఆస్తులపై పన్నులు చెల్లించేవారు కాదు. 

          ఫ్రాన్స్ జనాభాలో 90% ప్రజలు మూడో ఎస్టేట్‌కు చెందినవారు. వీరిలో కర్షకులు, సెర్బ్స్, పట్టణ శ్రామికులు, వ్యాపారులు, వృత్తిపనివారు ఉండేవారు. వీరికి ఎలాంటి సౌకర్యాలు, ప్రత్యేక హక్కులు లేవు. వీరు రాజుకు, భూస్వామికి, చర్చికి పన్నులు చెల్లించేవారు. టెయిలీ అనే భూమి పన్ను; టైథీ, పీటర్స్ పెన్స్ అనే చర్చి పన్నులు; వింజ్‌టీమ్ అనే ఆదాయపు పన్ను; గాబెల్లె అనే ఉప్పు పన్ను; కార్వీ అనే రహదారి పన్నులు చెల్లించేవారు. అందుకే 'ఫ్రాన్స్‌లో భూస్వాములు యుద్ధాలు చేస్తారు. మతాచార్యులు ప్రార్థనలు చేస్తారు. ప్రజలు పన్నులు కడతారు' అనే నానుడి పుట్టింది. ఫ్రాన్స్‌లో తొంభై శాతం మంది తిండి లేక మరణిస్తే మిగిలిన పదిశాతం తిన్నది అరగక మరణించారనే వ్యాఖ్యానం కూడా ఉంది.

న్యాయ కారణాలు 
          ఫ్రాన్స్‌లో ఒకే న్యాయస్మృతి లేదు. రకరకాల శిక్షాస్మృతులు అమల్లో ఉండేవి. 'పార్లిమా' అనే న్యాయస్థానాలుండేవి. వీటిలో ఉన్నతమైంది ప్యారిస్ పార్లిమా. ఒక నేరానికి దేశమంతటా ఒకే శిక్ష ఉండేది కాదు. శిక్షలు అత్యంత కఠినంగా ఉండేవి. లెటర్ డి కాచెట్ అనే ఆజ్ఞాపత్రం ద్వారా ఎవరినైనా, ఏ కారణం చూపకుండా నిర్బంధించే అధికారం రాజుకు ఉండేది. న్యాయమూర్తి పదవుల విక్రయాలు జరిగేవి.

వైజ్ఞానిక కారణాలు 
          ఫ్రాన్స్‌లో విప్లవం సంభవించడానికి ఫ్రెంచ్ మేధావులు, తత్వవేత్తలు పోషించిన పాత్ర ప్రధానమైంది. వీరిలో మాంటెస్క్యూ, వోల్టేర్, రూసో ప్రముఖులు.
మాంటెస్క్యూ: ఇతడు రాచరికవాది. కేథలిక్ న్యాయమూర్తి. నిరంకుశ రాచరిక వ్యవస్థను తీవ్రంగా ఖండించాడు. చర్చిలోని లోపాలను విమర్శించాడు. ఫ్రెంచ్ రాచరిక మత సంప్రదాయాలను వ్యంగ్యంగా విమర్శించాడు. ఇతడు 'ది స్పిరిట్ ఆఫ్ లాస్' గ్రంథంలో బ్రిటిష్ వ్యవస్థ స్థిరంగా ఉండటానికి కారణాలను పేర్కొన్నాడు. ఆ దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య అధికార విభజన జరగడమే దీనికి కారణమని మాంటెస్క్యూ విశ్వసించాడు. ఇరవై సంవత్సరాల శ్రమ ఫలితంగా వెలువడిన 'స్పిరిట్ ఆఫ్ లాస్' గ్రంథం 18 నెలల వ్యవధిలో 22 సార్లు ముద్రితమైంది.

వోల్టేర్: వోల్టేర్ రాజ్యంగబద్ధ రాచరికాన్ని, ప్రాజ్ఞ నిరంకుశత్వాన్ని సమర్థించాడు. సహజ హక్కుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వోల్టేర్‌ను 'ఫ్రెంచ్ విప్లవంలో సగభాగం' అంటారు.

రూసో: ఇతడు ప్రపంచ ప్రఖ్యాత  ఫ్రెంచ్ తత్వవేత్త. కాల్పనికవాది, విప్లవవాది. 'సోషల్ కాంట్రాక్ట్' గ్రంథ రచయిత కూడా.ఈ పుస్తకంలో 'మానవుడు స్వేచ్ఛాజీవిగా జన్మించాడు. కానీ అతడి చుట్టూ సంకెళ్లు బిగుసుకున్నాయి' అని రూసో పేర్కొన్నాడు. ఇది ఫ్రెంచ్ విప్లవానికి ఊపిరులూది ఆధునిక ప్రజాస్వామ్యానికి అంకురార్పణ చేసింది.

ఫిజియోక్రాట్లు: నాటి అర్థశాస్త్ర భావాల్లో కొత్త మార్పులు తెచ్చిన ఆర్థికవేత్తలను ఫిజియోక్రాట్లు అంటారు. ఫ్రెంచ్ ఫిజియోక్రాట్లలో క్విస్‌నే, డిగూర్నే ముఖ్యులు. వీరిపై ఆర్థికవేత్త, 'వెల్త్ ఆఫ్ నేషన్స్' రచయిత ఆడం స్మిత్ ప్రభావం ఉంది. సహజ సంపదకు మానవ కృషిని జోడించినప్పుడే సంపద ఉత్పన్నమవుతుందని ఫిజియోక్రాట్లు ప్రతిపాదించారు.

డెనిస్ డిడిరో: ఇతడు గొప్ప రచయిత. ఇతర మేధావులు, రచయితలతో కలసి 28 సంపుటాల 'విజ్ఞాన సర్వస్వాన్ని' సంపుటీకరించాడు. ఇది రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, నైతిక, తాత్విక భావాలను ప్రచారం చేసింది.

ఆర్థిక కారణాలు 
        ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితులే ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణం. 1787 నాటికి ఫ్రెంచ్ ప్రభుత్వ ఖజానా దివాళా తీసింది. 1774లో పదహారో లూయీ ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి టర్గోను ఆర్థిక మంత్రిగా నియమించాడు. ఇతడు సుప్రసిద్ధ ఫిజియోక్రాట్. దుబారాను, ప్రభుత్వ ఖర్చులను తగ్గించి ఖజానా నిల్వను పెంచే ప్రయత్నం చేశాడు. స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రోత్సహించాడు. వెట్టిచాకిరిని రద్దు చేశాడు. విద్యను చర్చి నియంత్రణ నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు. టర్గో చర్యలు ప్రభువులు, మతాధికారులకు ఆగ్రహం కలిగించాయి. వారంతా మేరీ ఆంటోనైట్‌పై ఒత్తిడి తెచ్చారు. మేరీ పదహారో లూయీని ప్రభావితం చేయడంతో టర్గో ఉద్వాసనకు గురయ్యాడు. 1776లో నెకర్ ఆర్థికమంత్రి అయ్యాడు. ఇతడు ఫ్రాన్స్ దేశచరిత్రలో తొలిసారి ఆదాయ, వ్యయ పట్టికను ప్రకటించాడు.

చ్దీంతో నెకర్ కూడా పదవీచుత్యుడు అయ్యాడు. ఆ తర్వాత కలోన్ ఫ్రాన్స్ ఆర్థికమంత్రి అయ్యాడు. ఇతడు అందరినీ సంతృప్తిపరిచే విధానాన్ని అనుసరించాడు. అయితే మినహాయింపు లేకుండా అందరూ పన్నుచెల్లిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చేసిన సూచనతో కలోన్‌ కూడా పదవీచుత్యుడు అయ్యాడు.  నెకర్ మళ్లీ ఆర్థికమంత్రిగా నియమితుడయ్యాడు. 

        ఆర్థిక సంక్షోభం, జాతీయ రుణభారం వల్ల ఫ్రెంచ్ ప్రభుత్వం రుణాలపై వడ్డీ కూడా చెల్లించలేని దుస్థితికి దిగజారింది. గత్యంతరం లేక కొత్త పన్నులు వేయడానికి అనుమతిస్తుందనే ఉద్దేశంతో 175 సంవత్సరాల తర్వాత క్రీ.శ. 1789లో 16వ లూయీ ఫ్రెంచ్ పార్లమెంట్ అయిన ఎస్టేట్స్ జనరల్‌ను సమావేశపరిచాడు. 

        ఎస్టేట్స్ జనరల్‌లోని మూడో ఎస్టేట్స్ సభ్యులు జనసంఖ్య ఆధారంగా ఓటింగ్ జరగాలని పట్టుపట్టారు. దీన్ని మొదటి, రెండు ఎస్టేట్స్ సభ్యులు వ్యతిరేకించారు. జనాభాలో అత్యధిక సంఖ్యాకులకు తామే ప్రతినిధులమని భావించిన మూడో ఎస్టేట్స్ తమకు తామే 'జాతీయసభ' అనే నామకరణం చేసుకున్నారు. చట్టాలు చేసే హక్కు తమకు మాత్రమే ఉందని ప్రకటించారు. దీంతో కోపం వచ్చిన లూయీ సభా భవనాలకు తాళాలు వేయించాడు. అప్పుడు మూడో ఎస్టేట్స్ సభ్యులు 'టెన్నిస్ కోర్ట్‌'లో సమావేశమై తమదేశానికి నూతన రాజ్యాంగాన్ని నిర్మించే వరకు వెనక్కి తగ్గకూడదని ప్రతిజ్ఞ చేశారు. ఇది ఫ్రెంచ్ విప్లవానికి నాంది పలికింది. టెన్నిస్ కోర్టు సమావేశానికి 'బెయిలీ' అధ్యక్షత వహించాడు. 

        మూడో ఎస్టేట్స్ సభ్యులను బలప్రయోగం ద్వారా చెదరగొట్టాలని 16వ లూయీ ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ నాయకులను అరెస్ట్ చేస్తారనే వదంతులు వ్యాపించాయి. దీంతో రెచ్చిపోయిన ప్యారిస్ ప్రజలు ప్రభుత్వ కారాగారమైన బాస్టిల్ కోటను ముట్టడించారు. తలుపులు పగులగొట్టి, అక్కడి ఖైదీలను విడుదల చేశారు.

ఇది 1789 జులై 14న జరిగింది. బాస్టిల్ కోట పతనాన్ని 'నిరంకుశత్వ' పతనానికి గుర్తుగా పరిగణించి ఫ్రెంచ్ ప్రజలు దాన్ని జాతీయ దినంగా పాటిస్తున్నారు. 

        అనేకమంది మతాచార్యులు, భూస్వాములు విదేశాలకు పారిపోయారు. అక్కడ ఫ్రెంచ్ దేశ శత్రువులతో కలసి, విప్లవానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించారు. రాజు, రాణి మారువేషాలతో పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడ్డారు. వారిని దేశద్రోహులుగా గుర్తించి, 1793లో ఉరి తీశారు. అతివాదులైన జాకొబిన్‌లు అధికారాన్ని వశపరచుకుని విదేశీ శక్తులతో విజయవంతంగా పోరాడి వారిని తరిమేశారు. విప్లవాన్ని కాపాడుకోవడం కోసం వీరు పటిష్ట పాలన కొనసాగించారు. ప్యారిస్ మేయర్‌గా బెయిలీ, జాతీయ రక్షణ దళాధిపతిగా లపాయత్ నియమితులయ్యారు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again