పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 18, 2014

కార్మిక ఉద్యమం


      భారతదేశంలో అధునిక పరిశ్రమలు ఆవిర్భవించడంతో కార్మికులు, వారికోసం కార్మిక సంఘాలు అవసరమయ్యాయి. భారతదేశంలోని కార్మికుల్లో పేద రైతులు, ఉపాధి కోల్పోయిన చేతివృత్తుల వారే ప్రధానంగా ఉన్నారు. దేశంలో పరిశ్రమలు తగినంతగా లేకపోవడం, ఉన్నవి కూడా అంతగా అభివృద్ధి చెందకపోవడంతో నెమ్మదిగా కార్మిక ఉద్యమం ప్రారంభమైంది. 1918 తర్వాత దేశంలో కార్మిక ఉద్యమం క్రమంగా బలపడింది.

'సాధారణ, వృత్తిపరమైన ఉద్యోగులు, రోజూవారి కార్మికులు తమ పని పరిస్థితులను క్రమబద్దం చేసుకోవాలనే లక్ష్యంతో యాజమాన్యంతో చర్చలు జరపడానికి ఏర్పాటు చేసుకున్న సంస్థలనే కార్మిక సంఘాలు' అంటారు.

ఆధునిక కాలంలో కార్మిక సంఘాల లక్ష్యాలు:
1. కార్మికుల పని పరిస్థితులను, వేతనాలను పరిరక్షించడం, మెరుగుపరచడం.
2. పరిశ్రమకు, సమాజానికి చెందిన కార్మికుడి హోదా పౌరుడిగా పెంచడం.
3. దేశాల ఆర్థిక జీవనంలో సామాజిక నియంత్రణ పరిధిని విస్తరింపజేయడం. ఆ నియంత్రణలో భాగస్వామ్యమవడం.

      ప్రారంభంలో భారతీయ కార్మికులు పరిశ్రమల్లో, కర్మాగారాల్లో, గనుల్లో, తేయాకు తోటల్లో దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేశారు. వేతనాలు తక్కువగా ఉండేవి. పైగా ప్రమాదకర, అనారోగ్యకరమైన వాతావరణంలో పనిచేయాల్సి వచ్చేది. కార్మికులను బానిసల కంటే హీనంగా చూసేవారు. పారిశ్రామిక వేత్తలూ, వలస ప్రభుత్వం కార్మికుల పని పరిస్థితులను మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధిక లాభాలను ఆర్జించడంపైనే వారి దృష్టి ఉండేది. 

వలస ప్రభుత్వం రూపొందించే చట్టాలన్నీ వారికే అనుకూలంగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారత్‌లో ఓడల రవాణా సౌకర్యాలకు సంబంధించి కొరత ఏర్పడింది. ఫలితంగా దిగుమతులను పరిమితం చేశారు. అదే సమయంలో భారతదేశ ఉత్పత్తులకు వివిధ దేశాల్లో విపరీతమైన గిరాకీ ఉండేది. ఫలితంగా భారతీయ వాణిజ్యం, పారిశ్రామిక రంగం ఒక్కసారిగా పుంజుకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతుండగా, కార్మికుల వేతనాలు మాత్రం పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా పెరగలేదు. దీంతో కార్మికులు ఉద్యమాలను ప్రారంభించారు. మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవడంలో యజమానులు విఫలమయ్యారు. ఇలాంటి సమయంలోనే స్వాతంత్య్రోద్యమానికి కార్మికుల మద్దతును కూడగట్టుకోవాలని భావించిన కొంతమంది జాతీయోద్యమ నాయకులు, కార్మికుల ప్రయోజనాల కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొని, వారికి సరైన మార్గదర్శకత్వాన్ని అందించారు. 1917లో వచ్చిన రష్యన్ విప్లవం, సోవియట్ యూనియన్ ఆవిర్భవం కార్మికులకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. అంతర్జాతీయంగా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడానికి క్రియాశీల పాత్ర పోషించడం ప్రారంభించిన కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలోనూ విస్తరించడం, కార్మిక ఉద్యమ ఆవిర్భవానికి, వ్యాప్తికి మరింత దోహదపడింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఒ.) ఏర్పాటు కావడంతో భారతదేశంలో కార్మిక సంస్థలు విస్తరించాయి.

 మొదటిదశ
      కార్మిక ఉద్యమ మొదటి దశగా 1875 - 1918 మధ్య కాలాన్ని పేర్కొంటారు. 
ఈ దశను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: 
1) 1875 నుంచి 1891 వరకు మొదటిభాగం
2) 1891 నుంచి 1918 వరకు రెండో భాగం.

     భారత కర్మాగారాల్లోని మహిళలు, బాల కార్మికులను క్రమబద్ధీకరించడం తొలి భాగంలో లక్ష్యంగా ఉండేది. రెండో భాగంలో వివిధ దేశాల్లో, బ్రిటిష్ వలసల్లో ఉన్న భారతీయుల పరిస్థితులను మెరుగుపరచడం ప్రధానలక్ష్యంగా ఉండేది. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో భారతదేశంలో ప్రారంభమైన పారిశ్రామికీకరణ కొన్ని దుష్ట సంప్రదాయాలను తనతోపాటు తీసుకువచ్చింది. మహిళలను, పిల్లలను పనిలో పెట్టుకోవడం, సుదీర్ఘమైన పనిగంటలు, కార్మికుల స్థైర్యాన్ని దెబ్బతీసే విధానాలు, సరైన విద్య, గృహ వసతి లేకపోవడం, మరణ రేటు పెరగడం లాంటి కొన్ని పరిణామాలు ఈ కాలంలో చోటుచేసుకున్నాయి.

     1875లో బొంబాయిలో మొదటి కర్మాగార కమిషన్‌ను నియమించారు. అదేవిధంగా 1881లో మొదటి కర్మాగారాల చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టంలో బాల కార్మికుల రక్షణకు తప్ప మహిళా కార్మికుల ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కార్మికుల్లో ఈ చట్టంపై అసంతృప్తి పెరిగింది. 1884లో మరొక కర్మాగార కమిషన్‌ను నియమించారు.

      బొంబాయిలో లొఖాండే నాయకత్వంలో జరిగిన కార్మిక సమావేశం ఈ కర్మాగార కమిషన్‌కు వినతిపత్రాన్ని అందజేసింది. భారతదేశంలో కార్మిక సంఘాలు ఆవిర్భవించడానికి ఇదే నాంది పలికింది. వారానికి ఒక రోజు సెలవు, రోజుకు అరగంట విరామం ఉండాలని కార్మికులు తాము సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. 

ప్రతినెలా 15వ తేదీకంటే ముందే వేతనాలు చెల్లించాలని, పని గంటలను ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే పరిమితం చేయాలని, విధినిర్వహణలో ప్రమాదాల బారినపడి అంగవైకల్యం పొందిన కార్మికులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రెండో కర్మాగార కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన రెండో కర్మాగార చట్టం 1891 కూడా కార్మికులను పెద్దగా సంతృప్తి పరచలేదు. ఈ చట్టం వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడం, మహిళలకు, బాలలకు పనిగంటలు నిర్ణయించడం లాంటి చర్యలు తీసుకుంది.

 రెండో దశ 
      రెండో దశ (1918-1924) కాలంలో కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో ఆవిర్భవించాయి. భారతదేశంలోని ఆధునిక కార్మిక సంఘాల్లో మద్రాసు కార్మిక సంఘం (1918) మొదటిది. దీనికి అధ్యక్షుడు బి.పి.వాడియా. 1920లో అఖిల భారత కాంగ్రెస్ కార్మిక సంఘం (ఎ.ఐ.టి.యు.సి.) ఆవిర్భవించింది. లక్షా 40 వేలమంది కార్మికుల సభ్యత్వంతో, 64 కార్మిక సంఘాలు ఎ.ఐ.టి.యు.సి.కి అనుబంధంగా ఏర్పడ్డాయి. కార్మికులందరి ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎ.ఐ.టి.యు.సి. కృషి చేసింది. ఈ దశలో కొందరు స్వదేశీ అతివాద జాతీయ నాయకులు కార్ల్‌మార్క్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ప్రభావితులై కార్మికులను ఉత్తేజపరిచారు. ఆవిధంగా మొదటిసారిగా భారత కార్మిక పోరాటాల్లో కమ్యూనిస్టు ధోరణులకు బీజాలు పడ్డాయి. ఈ కాలంలోనే అనేక కార్మిక సంఘాలను స్థాపించారు. ఈ దశలో జాతీయోద్యమంతో ఏఐటీయూసీ సంబంధాలు ఏర్పరచుకొని దానిలో అంతర్భాగమైంది.

మూడోదశ 
       మూడోదశలో కమ్యూనిస్టుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కమ్యూనిస్టులు 1920 నుంచి కార్మిక సంఘాల్లో జోక్యం కల్పించుకుంటూ వచ్చారు. కార్మిక పోరాటాలన్నీ జాతీయ స్థాయిలో స్వతంత్ర కార్మికోద్యమంగా మారిన కాలం ఇది. ఈ దశలో జాతీయోద్యమకారులు కార్మిక సంఘ ఉద్యమాన్ని కమ్యూనిస్టులకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు. ఎ.ఐ.టి.యు.సి.లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోడానికి రెండు వర్గాలూ ప్రయత్నాలు చేశాయి.

ఎ.ఐ.టి.యు.సి.: 1929 డిసెంబర్‌లో నెహ్రూ అధ్యక్షతన నాగ్‌పూర్‌లో జరిగిన ఎ.ఐ.టి.యు.సి. సమావేశంలో ఎన్.ఎం.జోషి లాంటి మితవాద కార్మిక నాయకులు కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని ఖండిస్తూ బయటకు వచ్చేయడంతో ఎ.ఐ.టి.యు.సి.లో చీలిక అనివార్యమైంది. దీంతో ఎన్.ఎం.జోషి 1929లో 'అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య'ను స్థాపించారు. ఎ.ఐ.టి.యు.సి.లో మరోసారి చీలిక వచ్చి 'రెడ్‌టుక్' అనే సంస్థ ఏర్పడింది.

 గాంధీ పాత్ర
     మహాత్మాగాంధీ నాయకత్వంలో కార్మికులు అధిక సంఖ్యలో రౌలత్, ఖిలాపత్, సహాయ నిరాకరణోద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1921లో కాంగ్రెస్ ఇచ్చిన పిలుపునకు స్పందించి, బొంబాయి కార్మికులు వేల్స్ రాకుమారుడి భారతదేశ పర్యటనను బహిష్కరించారు. 1918లో అహ్మదాబాద్ మిల్లు సమ్మెలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా మహాత్మాగాంధీ కార్మిక సమస్యలపై పోరాడటం ప్రారంభించి, అనూహ్య విజయాలను సాధించారు. 1918లో ధర్మకర్తృత్వం మధ్యవర్తిత్వం ఆధారంగా 14000 కార్మికులతో గాంధీ అహ్మదాబాద్ వస్త్ర కార్మిక సంఘాన్ని స్థాపించారు. సుమారు 27 1/2 శాతం వేతన పెంపును సాధించగలిగారు. 

 నాలుగోదశ 
      భారత కార్మికోద్యమ చరిత్రలో నాలుగోదశను కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న కార్మిక పోరాటాల ఉచ్చదశగా పేర్కొనవచ్చు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపనతో దేశంలో కమ్యూనిస్టు శక్తులు బలపడి వామపక్ష కార్యకలాపాలు ఉద్ధృతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కార్మిక కాంగ్రెస్, ఇతర కార్మిక సంఘాల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం, ఆధిపత్యం విపరీతంగా పెరిగిపోయింది.

       మద్రాసులో సింగరవేలు స్థాపించిన లేబర్ కిసాన్‌పార్టీ, బొంబాయిలో గిర్నీ కాయ్‌గార్ యూనియన్, బెంగాల్‌లోని ముజఫర్ అహ్మద్, ఖాజీ నజీరుల్ ఇస్లాం, కుతుబుద్దీన్ అహ్మద్, హేమంత్‌కుమార్ సర్కార్ ఆధ్వర్యంలో రైతుల, కార్మికుల, పార్టీల కార్యకలాపాలు విస్తృత మయ్యాయి. దీంతో కార్మికోద్యమాల్లో కమ్యూనిస్టులు బలమైన శక్తిగా ఆవిర్భవించారు.

       కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల కార్యకలాపాల వల్ల వామపక్షాలు బలోపేతం అయ్యాయి. వర్కర్స్ అండ్ డీసెంట్స్ పార్టీ ఆధ్వర్యంలో కలకత్తా కార్మికులు 1928లో కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో ప్రవేశించి పూర్ణస్వరాజ్‌ను డిమాండ్ చేస్తూ తీర్మానాలను ప్రవేశపెట్టారు. కమ్యూనిస్ట్‌ల నాయకత్వంలో బొంబాయి వస్త్ర పరిశ్రమ కార్మికులు వేతన కోతకు వ్యతిరేకంగా ఆరు నెలల పాటు అతిపెద్ద సమ్మెను నిర్వహించారు. 1928 సంవత్సరం కార్మికుల అశాంతి, అలజడులతో నిండిపోయింది. 

కార్మిక ఉద్యమం బిట్స్ 
1. భారతదేశంలోని ఆధునిక కార్మిక సంఘాల్లో మొదటిది ఏది?
జ:   మద్రాసు కార్మిక సంఘం
2.  కార్మిక ఉద్యమంలో మొదటిదశ కాలం-
జ:   1875- 1918
3. మద్రాసు కార్మిక సంఘం అధ్యక్షుడు ఎవరు?
జ:   బి.పి.వాడియా
4. అఖిల భారత కాంగ్రెస్ కార్మిక సంఘం (ఎ.ఐ.టి.యు.సి.) ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
జ:   1920
5. కార్మిక సంఘ ఉద్యమంలో ఏ దశలో కమ్యూనిస్టుల ప్రభావం స్పష్టంగా కనిపించింది?
జ:   మూడోదశ
6. ఏ సంవత్సరంలో ఎ.ఐ.టి.యు.సి.లో చీలిక ఏర్పడింది?
జ:   1920
7. ఏ చట్టం కార్మిక నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది?
జ:   1935 చట్టం
8. కార్మికుల హక్కులకు రక్షణ కల్పించిన చట్టం ఏది?
జ:   1940 జాతీయ సేవా చట్టం
9. సరైన కారణాలు లేకుండా కార్మికులను పనిలో నుంచి తీసేయడాన్ని నిషేధించిన చట్టం ఏది?
జ:   1941 అత్యవసర సర్వీసుల చట్టం
10. పరిశ్రమల శాంతి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
జ:   1947
11. భారతదేశంలో మొట్టమొదటి నూలు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు?
జ:   బొంబాయి
12. రైల్వే కార్మికుల సంఘాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
జ:   1906
13. మొట్టమొదటి జూట్‌మిల్లును ఎక్కడ స్థాపించారు?
జ:   కలకత్తా
14. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించిందెవరు?
1జ:   లాలాలజపతిరాయ్
15. మూడో ఫ్యాక్టరీ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
జ:   1911 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again