పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

ఓడరేవులు మరియు పట్టణాలు, అంతర్జాతీయ వ్యాపారం


             మూడు వైపులా సముద్రం ఉండటం వల్ల భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉంది. ఇది విదేశీ వాణిజ్యానికి ఎంతో అనుకూలం. విదేశీ వ్యాపారం సముద్రాల ద్వారానే అధికంగా జరుగుతుంది. తయారయ్యే వస్తువులను మరో దేశానికి ఎగుమతి చేయడంలో, సరకులను దిగుమతి చేసుకునే ప్రక్రియలో మన ఓడరేవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.



                  సముద్రాలపై రవాణా ద్వారా వ్యాపారం చేయడం పురాతన కాలం నుంచి వస్తోంది. ఓడలపై జరిగే వాణిజ్యానికి ఎంతో చరిత్ర ఉంది. భూతల రవాణాకు అనువైన వాహనాలు, మార్గాలు లేని రోజుల్లో దూరప్రయాణాలు చేయడానికి జల రవాణాను ఆశ్రయించేవారు. సాగరయానం వల్ల మనిషి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాడు. కొత్త ప్రపంచాన్ని చూశాడు. అప్పటి వరకు చూడని భాషాసంస్కృతిని, జన జీవనాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. 

                  మార్కొపోలో, నికోలోకాంటె తదితర విదేశీ యాత్రికులు భారతీయుల నౌకా వాణిజ్య ప్రతిభను తమ గ్రంథాల్లో ప్రశంసించారు. రేవు ప్రాంతాలు పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. విద్య, కళలు, అపురూపమైన సంస్కృతీ సంప్రదాయాలకు ఆయువుపట్టుగా విలసిల్లాయి. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ మన దేశంలోని ప్రధాన ఓడరేవులే.   

దేశంలో తూర్పున ఆరు, పశ్చిమ తీరంలో ఆరు... మొత్తం 12 ప్రధాన ఓడరేవులు, 139 చిన్న ఓడరేవులున్నాయి. విదేశీ వాణిజ్యంలో 90% వ్యాపారం ప్రధాన ఓడరేవుల ద్వారానే సాగుతోంది. పశ్చిమ తీరంలో కాండ్లా, నవషేవ, ముంబయి, మార్మగోవా, మంగళూర్, కొచ్చి ఓడరేవులు ఉన్నాయి. తూర్పు తీరంలోని ట్యూటికోరన్, చెన్నై, విశాఖపట్టణం, పారదీప్, హల్దియా, కోల్‌కతా ప్రధాన ఓడరేవులు. వీటిని 'మేజర్ పోర్ట్స్ ట్రస్ట్ యాక్టు' కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. చిన్నఓడ రేవులను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తాయి.

నౌకాశ్రయం అంటే 
               సముద్రం నుంచి భూభాగాన్ని, భూభాగం నుంచి సముద్రాన్ని కలిపే ముఖ ద్వారమే ఓడరేవు. సరకుల ఎగుమతి, దిగుమతికి వీలుగా రేవుల నిర్మాణం, ఇతర సదుపాయాలు, కృత్రిమ జలాశయాలు ఉంటాయి. ఎగుమతి, దిగుమతి సౌకర్యాలకు వీలుకాని దాన్ని నౌకాశ్రయం అంటారు. నౌకలు వచ్చి ఆగడానికి మాత్రమే ఇది వీలుగా ఉంటుంది. నదీ ముఖ ద్వారం లేదా భూభాగంలోకి చొచ్చుకొచ్చిన సముద్రభాగం నౌకాశ్రయంగా ఏర్పడవచ్చు.

ముంబయి 
               పశ్చిమ తీరంలోని ఈ ఓడరేవు ముంబయికి తూర్పు వైపు ఉంది. ఓడలు నిలపడానికి కావలసిన బెర్తులు, ఎగుమతి, దిగుమతులకు, మరమ్మత్తులకు అవసరమైన జలాశయాలు, సదుపాయాలు, సొంత రైలు మార్గం, అతి పెద్ద చమురు టెర్మినల్ ఇక్కడ ఉన్నాయి. సముద్రాల మీదుగా జరిగే మన దేశ వ్యాపారంలో 4వ వంతు ఇక్కడ నుంచే నిర్వహిస్తున్నారు.

కోల్‌కతా 
               ఇది బంగాళాఖాతానికి 148 కి.మీ దూరంలో, హుగ్లీ నది ఎడమ ఒడ్డున ఉంది. భారతదేశ సముద్ర వ్యాపారంలో ఈ రేవు ద్వారా 11.3 శాతం వ్యాపారం జరుగుతోంది. ఇది నదీ ఆధార ఓడరేవు కావడంతో పూడిక, వేసవిలో నీళ్లు అడుగంటి లోతు తక్కువ కావడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే అఖాతం నుంచి రేవుకు స్వేచ్ఛగా నౌకలు తిరిగే వీలు లేదు.

చెన్నై 
               ఇది దక్షిణాదిన, తూర్పు తీరంలో ఉన్న అతి పెద్ద ఓడరేవు. సముద్రం ద్వారా జరిగే విదేశీ వ్యాపారంలో 15.1 శాతం ఇక్కడి నుంచే జరుగుతోంది. దేశంలోనే రెండో పెద్ద ఓడరేవు. దీనికోసం 80 హెక్టార్ల విస్తీర్ణంలో సముద్రంలో చుట్టూ గోడలు నిర్మించారు. దీన్ని 1859లో నిర్మించారు. తర్వాత అనేకసార్లు పునర్నిర్మించారు.

విశాఖపట్టణం
దేశంలోనే అగ్రగామిగా నిలిచిన విశాఖరేవు ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ముడి ఇనుము ఇక్కడి నుంచే జపాన్‌కు భారీగా ఎగుమతి అవుతుంది. ఈ రేవుకు సమీప ప్రాంతాల్లో జనుము, పంచదార, కాగితం, పెట్రోలు, మాంగనీస్, రసాయనాలు, ఎరువుల పరిశ్రమలున్నాయి. దీని ''పృష్టిభూమి'' లోతట్టు ప్రాంతాల నుంచి రేవును కలుపుతూ రోడ్డు, రైలు రవాణా సదుపాయాలున్నాయి

కొచ్చి 
               ఇది మలబారు తీర దక్షిణ భాగంలో ఉంది. ఏ అవరోధం లేకుండా ఏడాది పొడవునా నౌకల రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. లోతైన 20 కి.మీ. పొడవైన వెనుక జలాలు ఈ నౌకాశ్రయానికి అందుబాటులో ఉన్నాయి. ప్రాముఖ్యం ఉన్న నైరుతీ కోస్తా తీరంలో, పాక్- పశ్చిమ సముద్ర రహదారిలో ఉన్నత స్థితిలో ఉండటంతో ఇతర ఓడరేవుల కంటే ప్రముఖమైన స్థానంలో నిలుస్తోంది. ఈ రేవును ''అరేబియా సముద్ర రాణి'' అని పిలుస్తారు.

అంతర్జాతీయ వ్యాపారం 
               దేశ వ్యాపారంలో ఎగుమతి, దిగుమతి రెండూ ఉంటాయి. వివిధ దేశాల్లోని సహజ వనరులు, పారిశ్రామిక ఉత్పత్తుల లభ్యత, వ్యాప్తి ఒకే విధంగా ఉండవు. కాబట్టి అంతర్జాతీయ వ్యాపారం ఏ దేశానికైనా తప్పనిసరి. స్వాతంత్య్రానంతరం 'పారిశ్రామికాభివృద్ధి' పెరగడంతో మన విదేశీ వ్యాపారం పూర్తిగా రూపాంతరం చెందింది. నేడు మన వాణిజ్యం అనేక దేశాలతో సాగుతోంది.

ఎగుమతులు 
               ప్రస్తుతం మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులు 6,660కి పైగా ఉన్నాయి.

వీటిని:   1) వ్యవసాయ సంబంధ వస్తువులు
            2) ఖనిజాలు, ధాతువుల ఉత్పత్తులు 
            3) ఉత్పాధిత వస్తువులు     
            4) పెట్రోలియం ఉత్పత్తులు 
            5) ఇతరాలు అనే అయిదు తరగతులుగా విభజించవచ్చు. 

              రత్నాలు, విలువైన ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, నూలు వస్త్రాలు, దారాలు, హస్త కళాకృతులు, తోలు లాంటి ఉత్పాదిత వస్తువులు అధికంగా ఎగుమతి అవుతున్నాయి.

దిగుమతులు
              పెట్రోలియం, ప్రాజెక్టులకు సంబంధించిన వస్తువులు, రవాణా, విద్యుత్తు, యంత్ర పరికరాలు.

విదేశీ వాణిజ్య సరళి 
              ఎగుమతుల గమ్యాలను, దిగుమతుల ఆరంభాన్ని విదేశీ వ్యాపార సరళి తెలుపుతుంది. దేశంలో వ్యాపారం చేసే ముఖ్య ప్రాంతాలను ఇది సూచిస్తుంది. ఎగుమతిలో అధిక భాగం అభివృద్ధిలో వెనకబడిన దేశాలకు, అమెరికా, జపాన్, ఒపెక్, ఐరోపా, తూర్పు ఆసియా దేశాలకు జరుగుతోంది. ఒపెక్, అమెరికా, జర్మనీ, రష్యా ఇతర ఐరోపా దేశాలు, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియాలాంటి ఆసియా దేశాల నుంచి దిగుమతులు అధికంగా జరుగుతుంటాయి. 

              2000 నుంచి 2007 వరకు భారతదేశంలో ఎగుమతి, దిగుమతి కింది విధంగా ఉన్నాయి. 
                                భారత వాణిజ్యం (మిలియన్ డాలర్లలో)
                  సంవత్సరం               ఎగుమతి                    దిగుమతి
                  2000 2001                 2,03,571                   2,30,873 
                  2001 2002                 2,09,018                   2,45,200     

                  సంవత్సరం               ఎగుమతి                    దిగుమతి 
                  2002 2003                 2,55,137                   2,97,206 
                  2003 2004                 2,93,367                   3,59,108 
                  2004 2005                 3,75,340                   5,01,065 
                  2005 2006                 4,56,483                   6,35,013 
                  2006 2007                 5,63,800                   8,20,568

       2005 - 2006 నాటి మన ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రంగాలు 
                    రంగం                           మొత్తం ఎగుమతుల్లో వాటా       స్థానం 
       1 ఇంజినీరింగ్ వస్తువులు                        20.7 శాతం                     1 
       2. వజ్రాలు, ఆభరణాలు                          17.0 శాతం                      2 
       3. రసాయనాలు, అనుబంధ ఉత్పత్తులు  11.6 శాతం                      3 
       4. రెడీమేడ్, గార్మెంట్‌లు                         8.3 శాతం                       4
                    
2005 - 2006లో భారతదేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు (దేశాలపరంగా)

             1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు           -                      10.6 శాతం 
             2. చైనా                                           -                       7.0 శాతం 
             3. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్           -                       6.2 శాతం    
             4. జర్మనీ                                        -                        3.8 శాతం 
             5. యునైటెడ్ కింగ్‌డమ్                   -                         3.6 శాతం

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again