పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 31, 2014

ప్రజారోగ్యం - పారిశుద్ధ్యం - అంటువ్యాధులు - ఆరోగ్య పథకాలు


               గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల పోషక, జీవన స్థాయులను మెరుగుపరచాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్ 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని ప్రకటించింది. దీనికి 2002లో కొన్ని మార్పులు చేశారు. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థలతో పాటు ప్రైవేట్ ఆరోగ్య సేవలు కూడా పెరిగాయి. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ వైద్య సేవలపైనే ఆధారపడ్డారు. 

                దేశం మొత్తం జనాభాలో దాదాపు 68% గ్రామాల్లోనే ఉన్నారు. ఇందులో 50% పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే. మలేరియా నుంచి మధుమేహం వరకు, చిన్న గాయాలు మొదలుకుని క్యాన్సర్ వరకు సరైన చికిత్సా సౌకర్యాలు లేక గ్రామీణ భారతం సతమతమవుతోంది.

               గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో వైద్యులు నాలుగురెట్లు ఎక్కువగా ఉన్నారు. నర్సులు మూడు రెట్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నారు. 80% వైద్య కళాశాలలు దక్షిణ, పశ్చిమ భారతదేశంలోనే ఉన్నాయి. మధ్య, ఈశాన్య, ఉత్తర భారత దేశాల్లోని గ్రామాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో లేవు. జాతీయ కుటుంబ సర్వే - 3 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 63% కుటుంబాలు ప్రైవేట్ వైద్యంపైనే ఆధారపడ్డాయి.

గ్రామీణులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. సరైన సమయాల్లో వర్షాలు పడని కారణంగా గ్రామాల్లో పేదరికం ఎక్కువగా ఉంది. 37% మంది గ్రామీణులు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. 52% మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బాలికల జీవితాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 7% మంది బాలురకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పోషకాహారం లభిస్తోంది.

               తీవ్ర పోషకాహార లోపంతో ఎందరో బాలలు మృతి చెందుతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి 'సంరక్షణ కేంద్రాలను' ప్రారంభించారు. ఎక్కువ మంది చిన్నారుల మృతికి ప్రధాన కారణం సరైన పోషణ లేకపోవడం. దీని మూలంగా డయేరియా, న్యుమోనియా లాంటి రోగాలు సోకి బాలలు మృత్యువాత పడుతున్నారు. పోషణ కేంద్రాలను నెలకొల్పడం ద్వారా వారికి సరైన ఆహారాన్ని అందజేస్తారు. తల్లులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోషణపై అవగాహన కల్పిస్తారు.

               గ్రామీణ ప్రజలు నిరక్షరాస్యులు, పేదలు కావడం వల్ల 45% మంది బాలికలకు 18 సంవత్సరాల లోపే వివాహాలు చేస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పారిశుద్ధ్యం విషయంలో వారికి సరైన అవగాహన లేదు. 33% మంది ప్రజలకు మరుగుదొడ్లు లేవు. 50% మంది గ్రామీణులకు ఇప్పటికీ ఆరోగ్యంపై అవగాహన కలిగించే వ్యవస్థ అందుబాటులో లేదు.2009లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 43.9% మంది మహిళలు ప్రసవానంతరం 6 వారాల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులుగా ఉంటూ మృతి చెందుతున్న వారి సంఖ్య ప్రపంచంలో భారత గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ. భ్రూణ హత్యలు, బాలింతల ఆరోగ్యం చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాయి. 10% మంది చిన్నారులు ఏడాదిలోపే మృతి చెందుతున్నారు.

               వివిధ ఆరోగ్య సమస్యల వల్ల దేశంలో నవజాత శిశువుల మరణాలు 9.6%గా ఉంటున్నాయి. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 4% మంది మృత్యువాత పడుతున్నారు. టైమ్స్ గ్లోబల్ రిపోర్ట్ (2006) ప్రకారం దేశంలో ప్రతి 100 మంది శిశువుల్లో 6 నుంచి 7 మంది పిల్లలు పుట్టుకతోనే వివిధ లోపాలతో జన్మిస్తున్నారు. దేశం మొత్తం మీద ఏటా ఇలా జన్మించేవారి సంఖ్య 17 లక్షలు. సకాలంలో సరైన చికిత్సలు చేయకపోవడం వల్ల 10% మంది పిల్లల్లో దృష్టి, వినికిడి, మేథోపరమైన లోపాలు తలెత్తుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు
గ్రామీణ ప్రాంతాల్లో 3 స్థాయుల్లో వైద్య సేవలను అందిస్తున్నారు.
అవి   1) సబ్ సెంటర్లు   
         2) ప్రైమరీ హెల్త్ సెంటర్లు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)   
         3) కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు.

జాతీయ ఆరోగ్య విధానం - 2003
                 భారతదేశంలో మొదటి జాతీయ వైద్య విధానాన్ని 1983లో ప్రకటించారు. 2003లో రెండో జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించారు. ప్రజల జీవనం మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేస్తోంది. ప్రజారోగ్యం కోసం నిధులను పెంచింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి వివిధ జాతీయ ప్రజారోగ్య కార్యక్రమాలను రూపొందించింది.

 సార్వత్రిక శిశు ఆరోగ్య పరీక్షల పథకం (రాష్ట్రీయ బాల స్వాస్థ్య యోజన) 
                 సార్వత్రిక శిశు ఆరోగ్య పరీక్షల పథకాన్ని మహారాష్ట్రలోని థానే జిల్లాలోని పాల్ఘర్‌లో సోనియాగాంధీ 2013 ఫిబ్రవరి 6న ప్రారంభించారు.

            పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను, పోషకాహార లోపం వల్ల కలిగే అవలక్షణాలను సత్వరమే గుర్తించి సరైన చికిత్స అందించడం దీని లక్ష్యం. దీని ద్వారా దేశంలోని 27 కోట్ల మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు లోపాలను గుర్తించి సరిచేస్తారు.

  జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని దశల వారీగా దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. పిల్లలకు పౌష్ఠికాహార లోపం అతిపెద్ద సమస్య. దేశంలో 40% మంది పిల్లలు ఇప్పటికీ పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు.

                 సార్వజనీన శిశు ఆరోగ్య పరీక్షల పథకం కింద పిల్లల్లో తరచూ తలెత్తే 30 రకాలైన ఆరోగ్య సమస్యలను గుర్తించి, తగు చికిత్సలు చేస్తారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 8 సంవత్సరాల పిల్లలకు వివిధ దశల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ పథకం అమలు విధానం
               అంగన్‌వాడీలు, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే ప్రాథమిక పాఠశాలల్లో పేర్లు నమోదు చేసుకునే 6 ఏళ్లలోపు చిన్నారులకు సంచార వైద్య బృందాలు క్రమపద్ధతిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాయి. ఏడాదిలో ప్రతి చిన్నారికి కనీసం రెండుసార్లు వైద్య పరీక్షలు జరిగేలా చూస్తారు.

               దీనికోసం ఆయుష్ వైద్యబృందాల సేవలను వినియోగిస్తారు. నవజాత శిశువులకు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇంటింటినీ సందర్శించే 'ఆశా' ఆరోగ్య కార్యకర్తల ద్వారా వైద్య పరీక్షలు చేయిస్తారు.

               దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈ వైద్య పరీక్షల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటవుతున్నాయి. ఇవి వివిధ సాంక్రమిక వ్యాధులపై సమాచారాన్ని క్రోఢీకరిస్తాయి. భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలను అందించడానికి దీన్ని వినియోగిస్తారు.

ప్రజారోగ్య రంగంలో మైలురాళ్లు

1948
 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో)లో భారతదేశం సభ్యత్వం పొందింది.
 కార్మిక బీమా చట్టాన్ని ఆమోదించారు.

 'ఎన్విరాన్‌మెంటల్ హైజీన్' కమిటీ నివేదికను ప్రచురించారు.

1949
 భారత రాజ్యాంగ నిబంధన ప్రకారం ఆరోగ్య విషయాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర జాబితాల రూపకల్పన.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో నెలకొల్పారు.

1953
 మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా జాతీయ మలేరియా నియంత్రణ కార్యక్రమం, దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాల నిర్వహణ.

1954
 పార్లమెంటు కల్తీ నివారణ చట్టాన్ని ఆమోదించింది.

1959
 డాక్టర్ మొదలియార్ కమిటీ నియామకం.

 పోషకాహార పరిశోధనా సంస్థను కూనూరు నుంచి హైదరాబాదుకు తరలించారు.

 మశూచి వ్యాధిని నిర్మూలించాలని జాతీయ వైద్య మండలి సిఫారసు చేసింది.

బెంగళూరులో జాతీయ క్షయవ్యాధి సంస్థను నెలకొల్పారు.

1960
 పాఠశాల బాలబాలికల ఆరోగ్య పోషణకు సంబంధించిన స్థితిగతుల పరిశీలనకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.

 గణాంకాల విభాగాన్ని ఆరోగ్యశాఖ నుంచి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి బదిలీ చేశారు.

1961
 మూడో పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యానికి రూ.342 కోట్లు కేటాయించారు.

 'మొదలియార్ కమిటీ' నివేదిక సమర్పించింది.

1962
 కేంద్ర కుటుంబ నియంత్రణ సంస్థను నెలకొల్పారు.
 జాతీయ మశూచి నిర్మూలన కార్యక్రమం ఏర్పాటైంది.
 పాఠశాల ఆరోగ్య కార్యక్రమం, జాతీయ గాయిటర్ కార్యక్రమం, జిల్లా క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించారు.

1963
 ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ సహాయంతో యునిసెఫ్, 'అనువర్తిత పోషకాహార కార్యక్రమం'ను ప్రారంభించింది.

 జాతీయ ట్రకోమా నియంత్రణ కార్యక్రమం, జాతీయ విస్తృత కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించారు.

 చెడ్డా కమిటీ నివేదికను అనుసరించి ప్రతి పదివేలమంది జనాభాకు ఒక మౌలిక ఆరోగ్య కార్యకర్తను నియమించారు.

1964
 ఆరోగ్యపాలన విద్య కోసం జాతీయ సంస్థను నెలకొల్పారు. గర్భస్రావాలను చట్టబద్ధం చేసేందుకు వీలుగా 'శాంతీలాల్ షా' కమిటీని ఏర్పాటు చేశారు.

1969
 నాలుగో పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలకు రూ.840 కోట్లు, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు రూ.315 కోట్లు కేటాయించారు.

 హైదరాబాదులోని పోషకాహార సంస్థను 'జాతీయ పోషకాహార సంస్థ'గా పరిగణించారు.

 కేంద్ర జనన, మరణ చట్టాన్ని ఆమోదించారు.

1972
 1972 ఏప్రిల్ 1 నుంచి జనన, మరణాల చట్టం అమల్లోకి వచ్చింది.

1973
 గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోషకాహార కార్యక్రమాల నిర్వహణ కోసం బహుళార్థ ఆరోగ్య కార్యకర్తలను నియమించడానికి వీలుగా 'కర్తార్ సింగ్' కమిటీ నివేదికను సమర్పించింది.

1974
 అయిదో పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో ఆరోగ్య కార్యక్రమాలకు రూ.796 కోట్లు, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు రూ.516 కోట్లు కేటాయించారు.

 మలేరియా నియంత్రణ కోసం నూతన పథకాన్ని ప్రతిపాదించారు.

 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

1975
 1975 జులై 5 నుంచి దేశంలో మశూచి వ్యాధిని నిర్మూలించారు.

1976
 కేంద్రప్రభుత్వం ఆహార కల్తీ నివారణ చట్టంలో జాతీయ జనాభా విధానాన్ని ప్రతిపాదించింది.

 జాతీయ అంధత్వ కార్యక్రమాన్ని రూపొందించారు.

1977
 భారతదేశం మశూచి వ్యాధి నుంచి స్వేచ్ఛ పొందినట్లు అంతర్జాతీయ కమిషన్ ప్రకటించింది.

1992
 ఎయిడ్స్ వ్యాధి నివారణకు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ మొదటిదశ
(1992 - 99)ను ప్రారంభించారు.

2005
 గ్రామీణ ప్రజానీకానికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి కేంద్రం 'జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించింది.

2012
 2012 ఫిబ్రవరి 24న పోలియో పీడిత దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

2013
 శిశువుల్లో పుట్టుకతో వచ్చే లోపాల చికిత్సకు 2013 ఫిబ్రవరి 6న 'రాష్ట్రీయ బాల స్వాస్థ్య యోజనను ప్రారంభించారు.

జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్
 గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ను ప్రారంభించారు. అణగారిన వర్గాలకు ఈ సేవలు అందిచడమే దీని ప్రధాన లక్ష్యం.
 2005లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ పనిచేస్తుంది.


 మాతృ మరణాల రేటును 407 నుంచి 100కు తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. (ప్రతి లక్ష జననాలకు ఈ గణన ఉంటుంది.)

 శిశు మరణాల రేటును ప్రతి 1000 జననాలకు 60 నుంచి 30కు తగ్గించాలి.

 7 సంవత్సరాల్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 3.0 నుంచి 2.1 సాధించడమే మిషన్ లక్ష్యం.

 ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ 2005, ఏప్రిల్ 12న జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ను ప్రారంభించారు.

 తొలిదశలో 18 రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

పన్నెండో ప్రణాళిక కాలంలో జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ లక్ష్యాలు

 మాతృ మరణాల రేటును ప్రతి లక్షకు 100 కంటే తగ్గించడం.

 ప్రతి 1000 జననాలకు శిశు మరణాల రేటును 27 కంటే తగ్గించడం, టోటల్‌ఫెర్టిలిటీ రేటును 2.1కు తగ్గించడం.

 దేశంలో 250 జిల్లాల్లో ఫైలేరియాను పూర్తిగా తొలగించడం. కుష్ఠు వ్యాధిని దేశవ్యాప్తంగా లేకుండా చేయడంతో పాటు 514 బ్లాకుల్లో కాలా అజార్‌ను నిర్మూలించడం.

 మలేరియా సోకే పరిస్థితిని ప్రతి వెయ్యి మందిలో ఒకరి కంటే తక్కువ ఉండేలా చూడటం.

 డెంగీ జ్వరాన్ని 1% కంటే తక్కువ ఉండేలా చూడటం.

జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ లక్ష్యాల సాధనకు వ్యవస్థలు
కేంద్రస్థాయి వ్యవస్థ
 మిషన్ స్టీరింగ్ గ్రూప్, కార్యక్రమ సాధికారత కమిటీ (ఎంపవర్డ్ ప్రోగ్రాం కమిటీ)లను నెలకొల్పారు.

 మిషన్ స్టీరింగ్ కమిటీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తారు.

రాష్ట్ర స్థాయి వ్యవస్థ
 రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ఆరోగ్య మిషన్ పనిచేస్తుంది.

 పథకం అమలును రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది.

జిల్లాస్థాయి వ్యవస్థ
 జిల్లా స్థాయిలో జిల్లా ఆరోగ్యమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.

 జిల్లా పరిషత్తు ఛైర్మన్ దీనికి నేతృత్వం వహిస్తారు.

 సంబంధిత జిల్లా కలెక్టర్ సహాయకారిగా ఉంటారు.

 జిల్లా వైద్య అధికారి మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.

 ప్రతి జిల్లాలో సమీకృత ఆరోగ్య సొసైటీని ఏర్పాటు చేస్తారు.

 ఈ సొసైటీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలకు ప్రణాళికలను రూపొందించడంతో పాటు నిర్వహణ బాధ్యతలను కూడా చూస్తుంది.
                   
              జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ కింద ఏర్పాటైన పథకాలు
               గర్భధారణ సమస్యల మూలంగా దేశంలో ఏటా 56,000 మంది మహిళలు మృతి చెందుతున్నారు. సుమారు 13 లక్షల మంది చిన్నారులు సంవత్సరంలోపే మృత్యువాత పడుతున్నారు. ఇందులో 9 లక్షల మంది నెలలోపే మరణిస్తున్నారు. వీటిని తగ్గించడానికి జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌లో భాగంగా వివిధ పథకాలను ప్రారంభించారు.

జననీ సురక్షా కార్యక్రమం

 మాతా సంరక్షణ కోసం ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రసవాలను ఉచితంగా నిర్వహిస్తారు.

 గర్భిణులను ఆసుపత్రికి తీసుకువచ్చిన దగ్గర నుంచి ప్రసవానంతరం ఇంటికి సురక్షితంగా చేరుస్తారు.

 అవసరమైతే ఉచిత సిజేరియన్ ఆపరేషన్ చేస్తారు. ఔషధాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ఏడు రోజులు ఉచితంగా ఆహారం అందిస్తారు.

 సాధారణ ప్రసవం సందర్భంలో మూడు రోజుల పాటు ఉచిత ఆహారాన్ని అందజేస్తారు.

 1995లో ప్రారంభించిన జాతీయ మాతృ ప్రయోజన కార్యక్రమానికి కొన్ని మార్పులు చేస్తూ 2005, ఏప్రిల్‌లో జననీ సురక్షా యోజనను ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తున్నారు.

 మొత్తం ప్రసవాల్లో 25% కంటే తక్కువగా ఆసుపత్రుల్లో జరిగే రాష్ట్రాలను తక్కువ సామర్థ్య రాష్ట్రాలుగా వర్గీకరించారు.

 ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతినెలా 'ఆశా' ఆరోగ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తారు.

శిశు సంరక్షణ పథకాలు
 నవజాత శిశువుల సంరక్షణకు 'న్యూ బార్న్ బేబీ కార్నర్స్‌'ను ఏర్పాటు చేశారు.
 నవజాత శిశు సురక్షా కార్యక్రమాన్ని కూడా ఇదే లక్ష్యంతో ప్రారంభించారు.

 ప్రసవ సమయంలో అప్రమత్తంగా ఉంటారు. దీనికోసం ఎంపిక చేసిన సిబ్బందికి ముందుగానే రెండు రోజులు శిక్షణ ఇస్తారు.

 శిక్షణ పొందినవారు ప్రసవ సమయంలో అప్పుడే పుట్టిన చిన్నారులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధుల వైద్య చికిత్స కోసం ప్రారంభించబడినది.కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం వివరాలు ఆరోగ్య శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ అధ్వర్యములో పని చేయుచున్నది.

కేంద్రములు- సేవలు
భారతదేశంలో అన్నిరాష్ట్రముఖ్యపట్టణములలొ పనిచేయుచున్నవి. హైదరాబాదులొ 13 కేంద్రములున్నవి.ఇందులో 2 ఆయుర్వేదం, 2 యునానీ, 2 హోమియోపతి విభాగాలువున్నవి. ఇవికాకుండా బీగుంపేట లో ఒకపాలిక్లినిక్ కొన్నివైద్యపరీక్షలు జరిపే సదుపాయం కలదు.అలాగే ఎక్స్ రేకు ఆయాకార్ భవన్ కి వెళ్ళాలి. ఇదివరలో 24 గంటలు పనిచేయు వైద్యశాలలు మలక్ పేట, దోమల్గూడ లో వుండేవి. డాక్టర్ల కొరత సాకుగా చూపి వాటిని మూసివేశారు. ఇప్పటికీ ఢిల్లీలో 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు వున్నాయి. కేంద్రప్రభుత్వశాఖలలొపనిచేయువారికి వారికుటుంబ సభ్యులకు, పదవీవిరమణఛేసినవారికి, స్వాతంత్రనమరయోధులకు, పార్లమెంత్సభ్యులు(మాజీలతోసహా), హైకోర్టు జడ్జిలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి, అనారోగ్యులకుతగినమందులిచ్ఛుట అవసరంమేరకు ప్రయోగశాలలో పరీక్షచేయుంచి తగు నలహాలిచ్చుబాధ్యత వీటిలోపనిచేయువద్యులవంతు.హైదరాబాదులోప్రధానవైద్యాదికారికార్యాలయం బీగంపేటలోవున్నది. అన్నివైద్యకేంద్రములు వారీఆదేసశాలనుపాటించి రోగులనుపరీక్షించితగుచికిత్ఛచేయుదురు. సి‌జి‌హెచ్‌ఎస్ మొదట జూలై 1954 నా ఢిల్లీలో ప్రారంబించారు. ప్రస్తుతం 24 సిటీలలో విస్తరించివున్నది. సి‌జి‌హెచ్‌ఎస్ కు చెన్నై, ఢిల్లీలో స్వంతంగా ఆసుపత్రులు వున్నవి.హైదరాబాద్ లో కూడా 100 పడకల ఆసుపత్రి భవంతిని నిర్మించారు కానీ వివిధకారణాల వలన అప్పటి వైధ్యశాఖ మంత్రి తన రాస్త్రానికి (తమిళనాడు) కు తీసుకునిపోయారు. మన హైదరాబాద్ లో కట్టిన భవంతిని అపోలో ఆసుపత్రి యాజమాన్యం కవులుకు తీసుకుని అక్కడ ఆసుపత్రిని లాభసాటిగానడుపుతున్నారు.

అమలులో గల పట్టణాలు
ఈక్రింది పట్టణాలలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం అమలులో వుంది.
1.అహదాబాద్
2.అలహాబాద్
3.బెంగళూరు
4.భోపాల్
5.భుబనేశ్వర్
6.కోల్కత్త
7.చండీగర్
8.చెన్నై
9.డెహ్రాడూన్
10.డెల్లి
11.గౌవాహతి
12.హైద్రాబాదు
13.జబల్పూర్
14,జైపూర్
15.జమ్ము
16.కాన్పూర్
17.లక్నో
18.మీరట్
19.ముంబై
20.నాగపూర్
21.పాట్నా
22.పుణె
23.రాంచి
24.షిల్లాంగ్
25.తిరువనంతపురం

నేషనల్ వెక్టర్ బార్, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం
 మలేరియా, డెంగీ, ఫైలేరియా, కాలా అజార్, జపనీస్ ఎన్ సెఫలైటిస్, చికున్‌గన్యా లాంటి రోగాల నివారణకు ఈ పథకాన్ని రూపొందించారు.

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం
 హెచ్.ఐ.వి. బాధితులకు సరైన వైద్య సహాయం అందించడం, ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి నివారణా చర్యలను చేపట్టడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

నేషనల్ రివైజ్డ్ టి.బి. కంట్రోల్ ప్రోగ్రాం
 డైరెక్ట్ అబ్జర్వ్‌డ్ ట్రీట్‌మెంట్ (DOT) ద్వారా క్షయ రోగులకు చికిత్స అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2006 మార్చి నాటికి దేశం మొత్తం ఈ పథకం విస్తరించింది.

నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రాం
 పొగాకు సంబంధిత, నోరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను నివారించడానికి, ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం
 ఈ పథకాన్ని 1985లో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ట్యుబర్‌క్యులోసిస్, డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటనస్, పోలియో, మీజిల్స్ లాంటి 6 వ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు అందిస్తారు.

నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రాం
 1992లో నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రాంను నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రాంగా మార్చారు. అందరికీ అయోడిన్ ఉప్పు అందించడం లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. అయోడిన్ లోప నివారణలకు ఉద్దేశించిన పథకమిది.

అంటువ్యాధులు
               శారీరక లేదా మానసిక అస్వస్థతను వ్యాధి అంటారు. అంటువ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంటువ్యాధులు, పోషకాహార లోపం వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారు.

                   అంటువ్యాధులు వ్యక్తుల నుంచి వ్యక్తులకు లేదా జంతువుల నుంచి మనుషులకు సూక్ష్మజీవులు, కీటకాల ద్వారా వ్యాపిస్తాయి. రోగకారక క్రిముల ఉత్పత్తి స్థానాలను నిర్మూలించి, వాటి ప్రసార మార్గాలను ఆటంకపరచి, మానవుల వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టి పూర్తిగా నిర్మూలించవచ్చు.

ప్రత్యక్ష తాకిడి వాల్ల వ్యాపించే సంక్రమిత వ్యాధులు
               స్పర్శ; నోరు, ముక్కు నుంచి వచ్చే స్రావాల తుంపరను పీల్చడం; జంతువుల కాటు, గాయాల ద్వారా క్రిములు వ్యాపించడం ప్రత్యక్ష వ్యాపనం కిందకు వస్తాయి. కుష్ఠు, గజ్జి, ఇతర చర్మ వ్యాధులు స్పర్శ వల్ల వస్తాయి. క్షయ, మశూచి, జలుబు తుంపర పీల్చడం ద్వారా వ్యాపిస్తాయి.

  జలభయ వ్యాధి (రేబిస్) కుక్క కాటు ద్వారా వస్తుంది. ధనుర్వాతం గాయాల ద్వారా వ్యాపిస్తుంది. రోగి లేదా వాహకుడికి 120 - 150 సెం.మీ. దూరంలో ఉన్న వ్యక్తులకు అంటువ్యాధి సోకే అవకాశం ఉంది.

  రోగి మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం వల్ల వచ్చే తుంపరల ద్వారా ఇవి వ్యాపిస్తాయి.

గాలి ద్వారా వ్యాప్తి చెందే సంక్రమిత వ్యాధులు
               నోరు, ముక్కు నుంచి వెలువడిన తుంపరలు ఎండిపోయి గాలిలో తేలుతుంటాయి. వీటిలోని క్రిములు నేలపై పడి దుమ్ముతో కలిసిపోతాయి. అలాంటి గాలి పీల్చే వ్యక్తుల శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశించే అవకాశం ఉంది.
ఉదాహరణ: క్షయ, మశూచి, చిన్న అమ్మవారు.

నీటి ద్వారా వ్యాప్తి చెందే సంక్రమిత వ్యాధులు

               కలుషితమైన నీరు తాగడం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. పోలియో, కలరా, టైఫాయిడ్, జిగట విరేచనాలు, ఇతర వ్యాధులను వ్యాప్తి చేసే క్రిములు తాగే నీటి ద్వారా సంక్రమిస్తాయి. ముఖ్యంగా పల్లెల్లో తాగునీటికి నదులు, బావులు ప్రధాన ఆధారం. ఆయా స్థలాల్లో బట్టలు ఉతకడం, రోగులు స్నానాలు చేయడం, పశువులను కడగటం వల్ల నీరు కలుషితమవుతుంది. పట్టణాలు, మహానగరాల్లో తాగేనీటిని వడగట్టి, క్లోరినేషన్ ద్వారా ముందుగా శుభ్రపరచి కుళాయిల ద్వారా పంపిణీ చేస్తారు. ఈ పద్ధతిలో చాలావరకు నీటిలోని వ్యాధి కారక క్రిములు నశిస్తాయి.

జంతువుల ద్వారా సంక్రమించే అంటువ్యాధులు
               జంతువులు, మనుషుల మధ్య సహజంగా సంక్రమించే వ్యాధులను 'జూనోసిస్' అంటారు. దాదాపు 150 వ్యాధులు ఈ తరగతి కిందికి వస్తాయి. వీటివల్ల మనుషులు వ్యాధుల బారిన పడతారు. జంతు సంపద, వ్యవసాయానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again