పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

ఉత్పత్తి మౌలికాంశాలు


ఉత్పత్తి ప్రక్రియలో వాడే కారకాలు లేదా వనరులు 5 రకాలు:
ఉత్పత్తి కారకాలు: 
1. భూమి 

2. శ్రమ 

3. మూలధనం 

4. వ్యవస్థాపనం 

5. సాంకేతిక పరిజ్ఞానం.

1. భూమి (Land) : అర్థశాస్త్రంలో ప్రకృతి ప్రసాదించిన వనరులన్నింటిని భూమిగానే పరిగణిస్తారు. ఉదా: భూమి, నదులు, గనులు, కొండలు. భూమి గమనశీలతలేని ఉత్పత్తి కారకం. ఇది పరిమితం కాబట్టి భూమికి ధర ఉంది. దేశంలో ఎక్కువగా వ్యవసాయ భూమి ఉంది. భూమిపై ఆధిపత్యానికి సంబంధించి భూస్వాములు, కౌలుదార్లు, భూమిలేనివారు అని మూడు రకాలుగా చెప్పవచ్చు.

2. శ్రమ (Labour) : మానవుల శారీరక, మానసిక చతురతను శ్రమ అంటారు. ఉత్పత్తిలో శ్రమ ముఖ్య ఉత్పత్తి కారకం. శ్రమను నిల్వ చేయలేం. శ్రామిక సప్లయ్ దేశ జనాభాపై ఆధారపడుతుంది. జనాభా పెరిగితే శ్రామిక సప్లయ్ పెరుగుతుంది. శ్రామికుల నైపుణ్యం, విద్య మీద శ్రమ ఆధారపడుతుంది.3. మూలధనం (Capital) :  ఉత్పత్తిలో వాడే ద్రవ్యాన్ని మూలధనం అంటారు. ఉత్పత్తికి కేటాయించిన ద్రవ్యాన్ని వినియోగానికి వాడరు. మూలధనం అనేది 'ఉత్పత్తి చేసిన ఉత్పత్తి సాధనం'. ఉత్పత్తిచేసే వనరులను కొనే ద్రవ్యం. మూలధన వస్తువులు ప్రత్యక్ష వినియోగ వస్తువులు కాదు. వాటిని ఉత్పత్తి చేస్తాయి. అందుబాటులో ఉన్న ద్రవ్యాన్ని మూలధన వస్తువులకు వాడాలా, వినియోగవస్తువులకు వాడాలా అనే ఎంపిక మూలధన నిర్మాణానికి దారి తీస్తుంది. గతంలో ఉన్న మూలధనానికి (Capital) మరికొంత మూలధనాన్ని చేర్చడాన్ని పెట్టుబడి (Investment) అంటారు. పెట్టుబడులు పెరగాలి అంటే పొదుపులు (S)  పెరగాలి. వినియోగం (C) తగ్గాలి.మనదేశంలో ప్రజల ఆదాయాలు తక్కువ. ఫలితంగా ---->  వినియోగం ఎక్కువ, -----> పొదుపులు తక్కువ, ----> పెట్టుబడులు తక్కువ

4. వ్యవస్థాపన/ ఉద్యమదారుడు (Organisation): ఉత్పత్తి కారకాలను ఒకచోటికి చేర్చి వస్తూత్పత్తి చేపట్టేవారిని వ్యవస్థాపకుడు అంటారు. ఉత్పత్తికి సంబంధించిన (నవకల్పనలు) కొత్తదనం తీసుకొచ్చేవారిని ఉద్యమదారుడు అంటారు. వ్యవస్థాపకుడన్నా, ఉద్యమదారుడన్నా ఒకరే అని పొరపడతారు. అర్థశాస్త్రపరంగా చూస్తే మాత్రం వీరిద్దరు ఒకరే కాదు.

ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడం, ఉత్పత్తితోసహా అన్నికార్యక్రమాలను కంపెనీయే వ్యవస్థీకరించడాన్ని ఆంతరంగిక వ్యవస్థాపనం అంటారు.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు వ్యాపారం ప్రారంభించడాన్ని వ్యాపార నిర్వహణం అంటారు.

5. సాంకేతిక పరిజ్ఞానం (Technology): ఉత్పత్తి కారకాలను ఏకీకృతం చేసి ఉపయోగకరమైన వస్తువులుగా మార్చేందుకు అవసరమైన జ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటారు.

ఎక్కువ సంఖ్యలో వస్తువులను అదే వనరులతో ఉత్పత్తి చేయడం, తక్కువ పరిమాణం వనరులతో అదే ఉత్పత్తిని చేయగలగడం 'సాంకేతిక పరిజ్ఞానం మార్పు' అని చెప్పుకోవచ్చు.

వ్యాపార నిర్వహణ రూపాలు: Types of Organisation

1. ఏక యాజమాన్యం: ఒకే వ్యక్తి పెట్టుబడి పెట్టి, ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలన్నీ తానే తీసుకుని వ్యాపారం నిర్వహించడం. ఇది చిన్న వ్యాపార సంస్థ. లాభ, నష్టాల బాధ్యత పూర్తిగా ఒక వ్యక్తి మీదనే ఉంటుంది. అందుకే దీనిని అపరిమిత బాధ్యత అంటారు.

2. భాగస్వామ్యం: ఇద్దరు లేదా ఎక్కువ మంది పెట్టుబడి పెట్టి మొత్తం పెట్టుబడిని వాటాలుగా కలిగి ఉంటారు. పెట్టుబడి మాత్రమే పెట్టి పనిచేయనివారిని (నిర్ణయాలు) మౌన భాగస్వాములు అంటారు. నిర్ణయాలు ఎవరివైనప్పటికి వాటాదారులందరూ సమాన బాధ్యులై ఉంటారు. కాబట్టి భాగస్వామ్యం కూడా అపరిమిత బాధ్యత అని చెప్పవచ్చు.

3. జాయింట్ స్టాక్ కంపెనీ/ కార్పొరేషన్: వ్యాపార నిర్వహణకు కావలసిన పెట్టుబడిని వాటాలుగా చేసి వాటిని ఎంపిక చేసిన ఏదో కొద్దిమందికి/ ప్రజలకుగాని అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం నిర్వహించడం. కొన్నవారిని వాటాదారులు అంటారు. కంపెనీ లాభాల్లో వీరికి తమ వాటా మేరకు లాభం చెందుతుంది. డైరెక్టర్ల బోర్డ్ కంపెనీ నిర్వహణ బాధ్యత చేపడుతుంది. వాటాదారు బాధ్యత ఏదైనా తన పెట్టుబడి (share) మేరకే ఉంటుంది. కాబట్టి పరిమిత బాధ్యత (లిమిటెడ్) అంటారు.
వీటిలో రెండు రకాలు ఉంటాయి.
   1.  ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
   2.  పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు.

1. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ: (Private Limited Company): వ్యాపార నిర్వహణలో ఇద్దరి కంటే ఎక్కువ ఏభై మంది కంటే తక్కువ ఉండాలి. చిన్న స్థాయిలో కుటుంబాలతో వ్యాపారం జరపడాన్ని ప్రైవేటు లిమిటెడ్ అంటారు. దీనిలో ఉన్నవారు ఎవరికంటే వారికి తమ వాటాలు అమ్మకూడదు.

2. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ: (Public Limited Company): దీన్ని అపరిమిత భాగస్వామ్యం అనికూడా అంటారు. వ్యాపార సంస్థ తనకు కావలసిన ద్రవ్యాన్ని Open Market లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రజలకు వాటాల రూపంలో అమ్మి సమకూర్చుకుంటుంది. ఎవరికైనా వాటాలను అమ్మవచ్చు. కొన్న వారిని వాటాదారులు (share holders),వారి పెట్టుబడిని (share)  అంటారు. వాటాదారులు తమ వాటాలను కంపెనీతో ఎలాంటి సంబంధం లేకుండానే కొనుక్కోవచ్చు. అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుంది.

ప్రైవేట్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల వల్ల లాభాలు: ఏక యాజమాన్యం, భాగస్వామ్యంతో పోల్చి చూసినట్లయితే ప్రైవేట్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల నుంచి కింది లాభాలు పొందవచ్చు.

1. స్వతంత్ర కార్పొరేటు అస్తిత్వం: ఏక యాజమాన్యం, భాగస్వామ్యం ద్వారా కంపెనీ నిర్వహణ ఆగిపోవచ్చు. కానీ ప్రైవేట్, పబ్లిక్ కంపెనీల్లో సభ్యులు మారుతుంటారు, కానీ కంపెనీ మారదు. ఉదా: సత్యం కంప్యూటర్స్.

2. పరిమిత బాధ్యత: వాటాదారులు తమ పెట్టుబడి మేరకే బాధ్యతను (లాభం/ నష్టం) కలిగి ఉంటారు. కంపెనీ రుణాలతో సంబంధం ఉండదు.

3. నిరంతరంగా కొనసాగింపు: కంపెనీ శాశ్వతం. ఉదా: రిలయన్స్.

4. వాటాల బదిలీ: పబ్లిక్ లిమిటెడ్‌లో వాటాదారులు కంపెనీతో సంబంధం లేకుండానే వాటాలు మార్చుకోవచ్చు. (అమ్మడం, కొనడం) ఏక యాజమాన్యంలో వాటాల ప్రసక్తే ఉండదు. భాగస్వామ్యంలో వాటాల బదిలీ చాలా క్లిష్టమైంది.

5. యాజమాన్య సమర్థత: కంపెనీ నిర్వహణలో మేనేజర్లు వేతనంతో పని చేస్తారు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

6. విత్తం సులభంగా లభ్యం: పెద్ద కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఇష్టం చూపుతాయి.

నష్టాలు: 1. ఎక్కువ వాటాలు ఉన్న వారికి ఓటింగ్ ప్రాధాన్యం ఎక్కువ. కాబట్టి కొన్ని సమయాల్లో వారి నిర్ణయాలు కంపెనీకి నష్టాలు తేవచ్చు.

2. మేనేజర్లు సంస్థ అస్తిత్వానికి, వాటాదార్లు లాభాల పట్ల ఆసక్తితో ఉంటారు. ఫలితంగా మేనేజర్ల, వాటాదారుల అభిప్రాయాలు కలువకపోవచ్చు.

ఉదా: ఒక వస్తువు ధర ఎక్కువ ఉంటే లాభాలు పెరుగుతాయి. వాటాదారులకు ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి వాటాదారులు ధర ఎక్కువగా ఉండాలని ఆశిస్తారు. కానీ కంపెనీ వస్తువు ధరను పెంచితే మార్కెట్‌లో పోటీ సంస్థల నుంచి తన వస్తువు డిమాండ్‌ను కాపాడుకోలేకపోవచ్చు. కాబట్టి ధరను పెంచడానికి మేనేజర్లు ఇష్టపడరు. ఇలా మేనేజర్లు, వాటాదార్ల మధ్య అభిప్రాయాలు ఏకీభవించకపోవచ్చు.

4. సహకార సంఘాలు (Co-Operative Societies): ఇవి స్వచ్ఛంద సంస్థలు. ''అందరి కోసం తాను, తన కోసం అందరూ'' అనే సూత్రంపై పనిచేస్తాయి. సభ్యుల వాటాల సంఖ్యతో సంబంధం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక సభ్యుడికి (వాటా ఎంత ఉన్నప్పటికి) ఒకే ఓటు నియమాన్ని పాటిస్తాయి. వీటి లక్ష్యం అధిక లాభాలు ఆర్జించడం కాదు, అధిక సంక్షేమమే. సహకార సంఘాలు స్నేహాన్ని, సౌభ్రాత్రాన్ని, సమానత్వాన్ని పెంపొందిస్తాయి. వ్యవసాయ రుణాలు, వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఇవి ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. వీటి నిర్వహణలో రాజకీయ జోక్యం నివారిస్తే ఇవి శక్తిమంతమైన సంస్థలుగా పనిచేస్తాయి.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again