పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

నూతన ఆర్థిక సంస్కరణలు


ప్రపంచ దేశాలతో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా ఆవిర్భవించడానికి భారత ప్రభుత్వం ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చింది. సత్వర పారిశ్రామికీకరణకు పారిశ్రామిక తీర్మానాలు 1948, 56, 91 లాంటివి ప్రవేశపెట్టింది. 1991 వరకు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం పాత్ర పరిమితంగా ఉండేది. ప్రాధాన్యం, ఏకస్వామ్యం ఉన్న రంగాల్లో ప్రైవేట్ రంగాన్ని మినహాయించి అనేక నియంత్రణలు విధించారు. ప్రధాన రంగాల్లో ప్రభుత్వ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ప్రైవేట్ రంగం పెద్ద వ్యాపారాల్లో ప్రవేశించడానికి, వృద్ధి చెందడానికి అనేక నియంత్రణలు విధించారు. అంతేకాక విదేశీ మూలధనంపై సాంకేతిక నియంత్రణలు విధిస్తూ ప్రైవేట్ పాత్రను పరిమితం చేశారు. అయితే ప్రైవేట్ రంగం, విదేశీ పెట్టుబడుల వల్ల వివిధ దేశాల్లో జరిగిన అభివృద్ధిని ప్రభుత్వం గుర్తించింది. ఆర్థికరంగంలో అప్పటి వరకు ఉన్న నిబంధనలను తొలగించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో మన దేశ ఆర్థిక వ్యవస్థను కలిపివేయడం లాంటి అంశాలను ఆర్థిక సంస్కరణలు అంటారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ మొదలైన అంశాలను సంస్కరణల్లో భాగంగా చెప్పవచ్చు.

సరళీకరణ
       ప్రభుత్వం గతంలో సాంఘిక, ఆర్థిక విధానాల్లో ఉన్న నిబంధనలు, నియంత్రణలను సడలించడాన్ని సరళీకరణ అంటారు. దీన్నే ప్రభుత్వం వివిధ దేశాల మధ్య వస్తుసేవల ప్రవాహంపై నిబంధనలు, నియంత్రణలు, సబ్సిడీలు తొలగించడంగా పేర్కొనవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని పి.వి. నర్సింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్ నూతన పారిశ్రామిక విధానాన్ని 1991 జులై 24న ప్రవేశపెట్టారు.

1991 పారిశ్రామిక తీర్మానం - ఆశయాలు
¤ భారత పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వ యంత్రాంగ ఉక్కు సంకెళ్ల నుంచి రక్షించడం.

¤ సరళీకరణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో సమ్మిళితం చేయడం.

¤ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకున్న అవరోధాలను తొలగించడం.

¤ దేశంలోని పెట్టుబడిదారులకు ఏకస్వామ్య వ్యాపారాల నియంత్రణ చట్టం (MRTP) నిబంధనల నుంచి విముక్తి కల్పించడం.

¤ ఖాయిలా పడిన ప్రభుత్వ సంస్థలను తగ్గించడం లేదా వాటిని విక్రయించడం.

లక్ష్యాలు
¤ పాలన నిబంధనలు సరళం చేయడం (Liberalisation).

¤ ప్రైవేట్ రంగం ద్వారా ఉపాధి కల్పన పెంపు (Privatisation).

¤ మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానించడం (Globalisation).

¤  అంతర్జాతీయ పోటీ ఎదుర్కొనేలా భారత ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం.

¤ ఆర్థిక అసమానతలను తొలగించడం.

¤ పారిశ్రామిక రంగ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం.

¤ భారత ఆర్థికాభివృద్ధి రేటును పెంచడానికి దోహదం చేయడం. 

1991 పారిశ్రామిక తీర్మానాన్ని సరళీకృత/ నూతన ఆర్థిక సంస్కరణ విధానాలు, రావు - మన్మోహన్ నమూనా లేదా ఎల్‌పీజీ నమూనా అంటారు.

ముఖ్యాంశాలు: 1991 పారిశ్రామిక విధానంలోని సంస్కరణలకు అనుగుణంగా ప్రభుత్వం కింది అంశాల ద్వారా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చింది
.
1. పారిశ్రామిక లైసెన్స్ విధానం: 18 రకాల పరిశ్రమలు ముఖ్యంగా రక్షణ, వ్యూహాత్మక, సామాజిక ప్రయోజనాలు, ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు తప్ప మిగిలిన వాటి విషయంలో లైసెన్సులు రద్దు చేశారు. వీటిని క్రమంగా ప్రభుత్వం తగ్గిస్తుంది. ఇందులో భాగంగా వీటి సంఖ్యను 8 పరిశ్రమలకు లైసెన్స్ అవసరం ఉండేలా 1997లో తగ్గించారు. తిరిగి 2002లో వీటిని 5కు తగ్గించారు. అవి- ఆల్కహాల్, పొగాకు, రక్షణ, హానికర రసాయనాలు, పారిశ్రామిక పేలుడు పదార్థాలు మొదలైనవి. ఇవి మినహాయించి మిగిలిన పరిశ్రమలను ప్రభుత్వ అనుమతి లేకుండా 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో తప్ప ఎక్కడైనా స్థాపించవచ్చు.

2. విదేశీ పెట్టుబడి విధానం: అత్యధిక ప్రాధాన్యం ఉన్న రంగాల్లో భారీ పెట్టుబడులు అవసరం. కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఏర్పడింది. విదేశీ పెట్టుబడులను వేర్వేరు రంగాల్లో 100%, కొన్ని రంగాల్లో పరిమితంగా ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే బ్యాంకింగ్, చిల్లర వర్తకం మొదలైన రంగాల్లో కూడా అనుమతించారు.

3. విదేశీ సాంకేతిక విధానం: భారత పారిశ్రామిక రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచడానికి ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట నియమాలతో అధిక ప్రాధాన్యం ఉన్న రంగాల్లో సాంకేతిక ఒప్పందాలకు అనుమతిచ్చింది. అయితే సాంకేతిక పరిజ్ఞాన దిగుమతి మొత్తం రూ.కోటికి మించకూడదు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అరువుకు, స్వతంత్ర సాంకేతిక అభివృద్ధి పరీక్షకు, విదేశీ సాంకేతిక నిపుణులను నియమించుకోవడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు.

4. ప్రభుత్వ రంగ విధానం: ప్రభుత్వ రంగంలోని భారీ పెట్టుబడులు సత్ఫలితాలు ఇవ్వకపోగా భారీ నష్టాలతో తెల్ల ఏనుగులా మారాయి. కాబట్టి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న వాటాను శ్రామికులు, ప్రజలు, విత్తసంస్థలు, మ్యూచువల్ ఫండ్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్ధరణ, పునర్నిర్మాణం బోర్డు (BIFR)కు అప్పగించాలని, ప్రభుత్వంలో మిగిలిన సంస్థలను MOU ద్వారా అత్యున్నత యాజమాన్య స్వయం ప్రతిపత్తి కల్పించి, వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

5. ప్రభుత్వ ప్రాధాన్యం క్రమంగా తగ్గించడం: 1956 పారిశ్రామిక తీర్మానం ప్రభుత్వ రంగానికి 17 పరిశ్రమలు కేటాయించగా 1991 పారిశ్రామిక విధానం వాటి సంఖ్యను 8కి తగ్గించింది. క్రమంగా ప్రభుత్వరంగానికి కేటాయించిన పరిశ్రమలను తగ్గించేస్తారు. అందులో భాగంగానే ప్రస్తుతం ప్రభుత్వ రంగ పరిధిలో కేవలం 3 రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. అవి: 1) అణుశక్తి 2) రైల్వేలు 3) రక్షణకు అవసరమైన ఆయుధాల తయారీ మొదలైనవి.

6. MRTP చట్టసవరణ: అంతర్జాతీయ మార్కెట్‌లో పారిశ్రామిక రంగానికి వచ్చే అంతర్గత, బహిర్గత ఆదాలు, అధిక ఉత్పాదకశక్తి, పోటీ ప్రయోజనాలు మొదలైన వాటిని ప్రభుత్వం MRTP చట్టం (1969) ద్వారా నియంత్రించింది. అయితే ప్రస్తుత నూతన సరళీకరణ విధానంలో భాగంగా MRTP చట్ట పరిధి, ఆస్తుల పరిమితి ఎత్తివేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా MRTP సంస్థలు తమ కార్యకలాపాల పరిధిని విస్తృతం చేసుకోవచ్చు. 2002లో రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు MRTP ని రద్దు చేసి దాని స్థానంలో పోటీ చట్టం (Competition) ప్రకటించి ప్రైవేట్ రంగ వృద్ధికి దోహదం చేశారు.

7. లైసెన్సుల విస్తృత ఏకీకరణ: లైసెన్సుల విస్తృత ఏకీకరణను 1985లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కొత్త యంత్రాలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. దగ్గరి పోలికలున్న ఉత్పత్తులకు వేర్వేరుగా లైసెన్సులు తీసుకోకుండా అన్నింటికి ఒకే లైసెన్సు తీసుకోవచ్చు.

8. విస్తృతమైన పరిశ్రమల నిర్వచనం: 1991 సరళీకరణ ద్వారా పరిశ్రమలకు సంబంధించిన నిర్వచన పరిధిని పెంచారు. ముఖ్యంగా పరిశ్రమల రంగానికి సంబంధించిన సేవలను, వ్యాపార సంస్థలను కూడా పరిశ్రమల పరిధిలోకి తీసుకువచ్చారు.

9. చిన్న, అతిచిన్న గ్రామీణ పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజి: చిన్న, అతిచిన్న గ్రామీణ పరిశ్రమల కోసం 1991 ఆగస్టులో ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. అతిచిన్న పరిశ్రమల పెట్టుబడి పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. అంతేకాక వీటికి ప్రభుత్వ సహాయం నిరంతరంగా ఉంటుంది. చిన్న పరిశ్రమలకు ప్రభుత్వ సహాయాన్ని ఒకసారికే పరిమితం చేశారు.

10. లఘు పరిశ్రమల్లో పెట్టుబడి: నూతన ఆర్థిక తీర్మానం లఘు పరిశ్రమల్లో పెట్టుబడి పరిమితిని రూ.10 లక్షలుగా నిర్ణయించింది.

11. పారిశ్రామిక స్థల నిర్ణయంపై ఆంక్షల రద్దు: పారిశ్రామిక స్థల నిర్ణయంపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను రద్దు చేశారు. 10 లక్షల జనాభా మించని ప్రాంతాల్లో లైసెన్సులు అవసరం లేని ఏ పరిశ్రమనైనా ప్రభుత్వ అనుమతి లేకుండా స్థాపించవచ్చు. పదిలక్షల జనాభా మించిన ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్యం కలిగించని పరిశ్రమలను 25 కిలోమీటర్ల దూరంలో స్థాపించవచ్చు.
   
ఇలా భారత ప్రభుత్వం పారిశ్రామికరంగ అభివృద్ధి కోసం నిబంధనలను సరళం చేసింది. విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తేలికగా సంపాదించేలా వాటిని సవరించింది. ప్రభుత్వరంగ సంస్థల సమర్థత పెంచేలా ప్రైవేట్ పెట్టుబడులకు, యాజమాన్యానికి ప్రాధాన్యం కల్పించింది. తద్వారా సత్వర, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసిందని చెప్పవచ్చు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again