పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

పేదరికం

          భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యల్లో పేదరికం ఒకటి. పేదరికం దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక సమస్యగా ఉంది. సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితిని 'పేదరికం' అంటారు.

         స్వభావాన్ని బట్టి పేదరికాన్ని 'సాపేక్ష, నిరపేక్ష' అని రెండు రకాలుగా విభజించారు. ఇటీవలి కాలంలో యు.ఎన్.డి.పి. 'మాన పేదరికం' అనే నూతన భావనను ప్రవేశపెట్టింది.

సాపేక్ష పేదరికం: జనాభాను వివిధ ఆదాయ వర్గాలుగా విభజించి, అత్యధిక ఆదాయం పొందే 5% నుంచి 10% ప్రజల జీవనస్థాయితో, అతి తక్కువ ఆదాయం పొందే అట్టడుగు 5% నుంచి 10% ప్రజల జీవనస్థాయిని పోల్చి పేదరికాన్ని నిర్ణయిస్తారు. సాపేక్ష పేదరికం ద్వారా ఆర్థిక అసమానతలను లెక్కించవచ్చు.

నిరపేక్ష పేదరికం: ప్రజలకు కావలసిన కనీస అవసర వస్తువుల పరిమాణాన్ని నిర్ణయించి, దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగ వ్యయంగా నిర్ణయిస్తారు. ఈ తలసరి కనీస ద్రవ్య రూప వినియోగ స్థాయి కంటే తక్కువ ఉన్న జనాభాను 'నిరపేక్ష పేదవారు' అంటారు.

         భారతదేశంలో సాపేక్ష, నిరపేక్ష (రెండు రకాల) పేదరికం ఉంది. భారత ప్రభుత్వం నిరపేక్ష పేదరికాన్ని ప్రతి అయిదేళ్లకోసారి అంచనా వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను 'Glass Curtain' ఆర్థిక వ్యవస్థగా 'గాల్‌భ్రెత్' అనే ఆర్థికవేత్త వ్యాఖ్యానించాడు.

దేశంలో పేదవారి సంఖ్య చాలా అధికం. వాళ్లు ధనవంతులు అనుభవించే, విలాస వస్తువులను,వారి విలాసవంతమైన జీవితాన్ని చూడగలుగుతున్నారు కానీ, కొని అనుభవించే ఆర్థికశక్తి వారికి లేదు. అందుకే భారత్‌ను గ్లాస్‌ కర్టెన్ ఆర్థిక వ్యవస్థ అంటారు.

పేదరికానికి కారణాలు: భారతదేశంలో పేదరికం కింది కారణాలవల్ల స్వయంచాలకంగా వృద్ధి చెందుతోంది.

1. తక్కువ తలసరి ఆదాయం 
2. అల్పోద్యోగిత 
3. నిరుద్యోగిత 
4. ప్రచ్ఛన్న నిరుద్యోగిత 
5. అధిక జనాభా 
6. వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ఆర్థిక వ్యవస్థ 
7. ఆర్థిక అసమానతలు. 
8. వనరుల అల్ప వినియోగం 
9. అల్ప వేతనాలు 
10. శ్రామిక వర్గానికి వనరులపై యాజమాన్యం లేకపోవడం.

పేదరిక అంచనాలు: భారతదేశంలో 1952లో మొదటిసారిగా పేదరికాన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.ఓ.) అంచనా వేసింది. 1967లో ప్రణాళికా సంఘం పేదరిక అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీ అంచనాలు సాపేక్ష ధోరణులతో ఉండటం వల్ల ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.

          భారత ప్రభుత్వం 1950 నుంచి 1970 వరకు జాతీయాదాయ పంపిణీ కంటే ఆర్థికాభివృద్ధి రేటును సాధించడానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆర్థికాభివృద్ధి ద్వారా పెరిగే జాతీయాదాయం కింది స్థాయికి పాకి, పేదరికం తగ్గుతుందని భావించారు. అయితే అంచనాలను బట్టి పేదరికం తగ్గలేదని తెలుస్తోంది.

          డాక్టర్ వి.ఎం. దండేకర్, నీలకంఠరాత్‌ అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి రోజుకు 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీల పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. దీనికోసం ఒక వ్యక్తి 1968-69లో, 1960-61 ధరల్లో ఏటా గ్రామ ప్రాంతాల్లో రూ.180, పట్టణాల్లో రూ.270 చొప్పున ఆహారంపై ఖర్చు చేయాలి. దీన్నే 'కనీస తలసరి వినియోగ వ్యయం' అంటారు.
ఈ ఆదాయాన్ని కూడా సంపాదించలేని పేదవారు పట్టణాల్లో 50%, గ్రామాల్లో 40%, సగటున 41% ఉన్నారని అంచనా వేశారు.

          1989లో ప్రణాళికా సంఘం డాక్టర్ డి.టి.లక్డావాలా అధ్యక్షతన పేదరికాన్ని అంచనా వేయడానికి నిపుణుల సంఘాన్ని నియమించింది. ఈ కమిటీ 1973-74 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని పేదరికాన్ని అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి రోజుకు 2400 కేలరీలు, పట్టణాల్లో 2100 కేలరీలు, సగటున 2300 కేలరీల పోషక విలువలున్న ఆహారాన్ని పొందాలి. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు ఒక వ్యక్తి రూ.115, పట్టణాల్లో రూ.165 చొప్పున ఆహారంపై ఖర్చు చేయాలి. ఈ మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టలేని పేదవారు గ్రామాల్లో 39.1%, పట్టణాల్లో 40.2%, సగటున 39.1% ఉన్నట్లు అంచనా వేశారు.

          1999-2000 సంవత్సరంలో ఎన్.ఎస్.ఎస్.ఒ. అంచనాల ప్రకారం గ్రామాల్లో ఒక వ్యక్తి నెలకు రూ.211.30, పట్టణాల్లో రూ.454.11, సగటున రూ.365 చొప్పున ఆహారంపై ఖర్చు చేయాలి. ఈ మొత్తాన్ని వెచ్చించలేని పేదవారు గ్రామాల్లో 27.1%, పట్టణాల్లో 23.6%, సగటున 26.1% ఉన్నారు. 2004-05లో ఎన్.ఎస్.ఎస్.ఒ. 61వ రౌండ్ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి  నెలకు రూ.356, పట్టణ ప్రాంతాల్లో రూ.538 చొప్పున ఆహారంపై ఖర్చు చేయాలి. అలా చేయలేని వారిని పేదవారుగా గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో 28.3%, పట్టణ ప్రాంతాల్లో 25.7%, సగటున 27.5% జనాభా పేదరికంలో ఉందని లెక్కించారు.

పేద‌ర‌కం పున‌ర్‌నిర్వచ‌నం:  మోహ‌న్ గురుస్వామి,  అబ్రహం ప్రకారం 5గురు స‌భ్యులున్న కుటుంబంలో పౌష్ఠికాహారం, విద్యుత్‌, వినోదం, ర‌వాణా, వ‌స్త్రాలు మొద‌లైన‌వాటిపై నెల‌కు రూ.4200 ఖ‌ర్చు చేయాలి. దీని ప్రకారం భార‌త్‌లో 69%పేద‌రికం ఉంది.

ప్రపంచ‌బ్యాంకు అంచ‌నా:  రోజుకు $1 ఖ‌ర్చు చేయ‌నివారిని పేద‌రికంలో ఉన్నట్లు భావిస్తే, భార‌త్‌లో 34% పేద‌రికం ఉంద‌ని అంచనా వేసింది.

సురేశ్ టెండూల్కర్ క‌మిటీ: పేద‌రిక అంచ‌నా ప‌ద్ధతుల‌ను మార్చడానికి ప్రణాళికాసంఘం 2005 డిసెంబ‌ర్‌లో సురేశ్ టెండూల్కర్ అధ్యక్షత‌న ఒక క‌మిటీని నియమించింది. ఇది 2009లో నివేదిక‌ను స‌మ‌ర్సించింది. భార‌త్‌లో 37.2% పేద‌రికం ఉన్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ఎక్కువ పేద‌రికం ఉన్నరాష్ట్రం ఒడిశా(57%), బీహార్ (54%). త‌క్కువ పేద‌రికం ఉన్న రాష్ట్రం నాగాలాండ్.

2004-05లో ఎన్.ఎస్.ఎస్.ఒ. సేకరించిన గణాంకాల ప్రకారం, ప్రణాళికా సంఘం  Uniform Recalled Period (U.R.P), Mixed Recalled Period(M.R.P) ప్రకారం పేదరికాన్ని అంచనా వేసింది. యు.ఆర్.పి. ప్రకారం ఒక వ్యక్తి 30 రోజుల్లో కనీస పోషక విలువలున్న ఆహారాన్ని పొందడానికి, కనీసం ఖర్చు చేయవలసిన వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని లెక్కించారు. గ్రామాల్లో 28.3%, పట్టణాల్లో 25.7%, సగటున 27.5% జనాభా పేదరికంలో ఉంది.
2004-05లో యు.ఆర్.పి. ప్రకారం రాష్ట్రాల వారీగా పేదరిక స్థాయి కింది విధంగా ఉంది (శాతాల్లో):

జమ్ము అండ్ కాశ్మీర్ 5.4, 
పంజాబ్ 8.4, 
హిమాచల్‌ప్రదేశ్ 10, 
గోవా 13.8, 
హర్యానా 14, 
ఢిల్లీ 14.7, 
కేరళ 15, 
అసోం 19.7, 
రాజస్థాన్ 22.1, 
తమిళనాడు 22.5, 
ఆంధ్ర ప్రదేశ్ 15.8, 
గుజరాత్ 16.8, 
పశ్చిమబెంగాల్ 24.7, 
కర్ణాటక 25, 
మహారాష్ట్ర 30.7, 
ఉత్తరప్రదేశ్ 32.8, 
మధ్యప్రదేశ్ 38.3, 
ఉత్తరాఖండ్ 39.6, 
జార్ఖండ్ 40.3, 
చత్తీస్‌గఢ్ 40.9, 
బీహార్ 41.4, 
ఒరిస్సా 46.4, 
దేశంలో 27.5. (Source - Rudra-datta and Sundarm's Indian Economy).
          యు.ఆర్.పి. ప్రకారం అత్యల్ప శాతం జనాభా జమ్ము & కాశ్మీర్‌లో, అత్యధిక శాతం జనాభా ఒరిస్సాలో పేదరికంలో ఉంది. జనసంఖ్య ప్రకారం పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 4.73 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు. ఎం.ఆర్.పి. ప్రకారం పేదరికాన్ని లెక్కించడానికి రెండు ప్రాతిపదికలను తీసుకున్నారు. నెలరోజుల్లో అన్ని వస్తువులపై ఖర్చు పెట్టిన మొత్తం, ఒక సంవత్సరంలో అరుదుగా కొనుగోలు చేసే వస్త్రాలు, పాదరక్షలు, వినియోగవస్తువులు, విద్య, వైద్యంపై చేసిన వ్యయం ప్రాతిపదికలుగా పేదరికాన్ని లెక్కించారు.

         ఎం.ఆర్.పి. ప్రకారం గ్రామాల్లో 21.8%, పట్టణాల్లో 21.7%, సగటున 21.8% ప్రజలు పేదరికంలో ఉన్నారు. దేశంలోకెల్లా పేదరికం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఒరిస్సా (39.9%). సంఖ్యాపరంగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో సుమారు 4.58 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు.

పేదరికస్థాయి చండీగఢ్‌లో చాలా తక్కువగా ఉంది. తరువాత జమ్ము & కాశ్మీర్ 4.2%తో రెండో స్థానంలో ఉంది.

          ఎం.ఆర్.పి., యు.ఆర్.పి.ల ప్రకారం పేదరికం స్థాయిని పరిశీలిస్తే, గ్రామాలు, పట్టణాల్లో పేదరికం తగ్గుతోంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వేగంగా తగ్గుతోంది.

          యు.ఎన్.ఒ.లోని యు.ఎన్.డి.పి. అంచనాల ప్రకారం భారతదేశంలో పేదరిక స్థాయి 31.3%.

ప్రణాళికాసంఘం అంచ‌నా ప్రకారం 2009-10లో 32% పేద‌రికం ఉంది.
                             1998లో నోబెల్ బహుమతి పొందిన 'అమర్త్యసేన్' ఒక వ్యక్తి దారిద్య్రరేఖకు ఎంత కిందిస్థాయిలో ఉన్నాడు? అనేది తెలుసుకోవడానికి 'P-Index' ను రూపొందించాడు. దీన్నే 'సేన్' దారిద్య్ర కొలమానం అంటారు. ఈ సూచిక ద్వారా దారిద్య్రరేఖకు కింద ఉన్న ప్రజల ఆదాయస్థాయిని తెలుసుకోవడానికి వీలుపడుతుంది. ప‌ట్టణ ప్రాంతాల్లో బీపీఎల్ కుటుంబాలను గుర్తించ‌డానికి ఎస్‌.ఆర్‌. హ‌సీం క‌మిటీని నియ‌మించారు.

పేదరిక అంతరం: దారిద్య్రరేఖకు - పేదల వాస్తవిక తలసరి వినియోగ వ్యయానికి మధ్య ఉన్న తేడానే 'పేదరిక అంతరం' అంటారు. ఏ దేశంలోనైనా పేదరిక అంతరం ఎంత అధికంగా ఉంటే, పేదరికం తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది.
దారిద్య్రరేఖ: Indian Council of Medical Research ప్రకారం ప్రతిరోజు గ్రామాల్లో 2400, పట్టణాల్లో 2100 కేలరీల పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సూచనను 1969లో ప్రణాళికా సంఘం ఆమోదించింది. ఈ పోషక విలువలున్న ఆహారాన్ని పొందడానికి 1961 ధరల్లో ఒక వ్యక్తి నెలకు రూ.20 ఖర్చు చేయాలి. 1969లో దండేకర్-నీలకంఠరాత్ గ్రామాల్లో నెలకు రూ.15, పట్టణాల్లో రూ.22.50 (1960-61 ధరల్లో)ను కనీస తలసరి వినియోగ వ్యయంగా నిర్ణయించి, మొదటిసారిగా పేదరికాన్ని లెక్కించారు.

          1973-74 నుంచి ఇప్పటివరకు పేదరికాన్ని అంచనా వేయడానికి గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో, కనీస తలసరి వినియోగ వ్యయాన్ని కాలానుగుణంగా మార్చారు. 1973-74 నుంచి కాలానుగుణంగా తలసరి వినియోగ వ్యయం వివరాలు (రూపాయల్లో..)

సంవత్సరం             గ్రామీణ       పట్టణ 
1973-74                      49.09            56.96
1977-78                      56.84            72.5
1983                      89.45          117.64
1987-88                    115.43          165.58
1993-94                    211.3          274.88
1999-2000            327.56          454.11
2004                    368.00    559
(Source - Indian Economy - Dutta and Sundaram)

పేదరిక నివారణ చర్యలు: 1950 నుంచి 1970 వరకు భారత ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రత్యక్షచర్యలు చేపట్టలేదు. ఆర్థికాభివృద్ధిని సాధిస్తే పేదరికం దానంతట అదే తగ్గుతుంది అనే  Trickle down సిద్ధాంతాన్ని నమ్మింది.
          4వ ప్రణాళికలో భాగంగా పేదరికాన్ని తగ్గించడానికి ప్రత్యక్ష చర్యలు మొదలయ్యాయి. పేదరిక తీవ్రతను అంచనా వేసి 'గరీబీ హఠావో' అనే నినాదాన్ని ప్రభుత్వం చేపట్టింది. 1973 నుంచి అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టింది. అవి 1972-73లో మహారాష్ట్రలో ఉపాధి హామీ పథకం, 1973లో క్షామపీడిత అభివృద్ది కార్యక్రమం, 1973-74లో ఎం.ఎఫ్.ఎ.ఎల్.ను, 1974-75లో చిన్నకారు రైతుల అభివృద్ధి ఏజెన్సీ, ఆయకట్టు అభివృద్ధి పథకం, 1975లో ప్రధాని 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది.

          1977-78లో ఎడారుల అభివృద్ధి పథకం, పనికి ఆహార పథకం, అంత్యోదయ పథకాలను ప్రవేశపెట్టారు. 1979లో గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధిలో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టారు.

          6వ ప్రణాళికలో పేదరిక స్థాయిని తగ్గించడానికి 1980లో సమీకృత అభివృద్ది కార్యక్రమం, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాలను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించడానికి 1982లో DWCRA ను ప్రవేశపెట్టారు.

          7వ ప్రణాళికలో భాగంగా 1985లో సమగ్ర పంటల బీమా పథకం ప్రకటించారు. 1986లో పట్టణ పేదల స్వయం ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టారు. 1989లో గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ మౌలిక సదుపాయాల కల్పన కోసం జె.ఆర్.వై.ని, పట్టణ పేదల ఉపాధి కల్పనకు ఎన్.ఆర్.వై.లను ప్రకటించారు.

          8వ ప్రణాళికలో 1993లో ఇ.ఎ.ఎస్. కార్యక్రమాన్ని, ఎం.పి.ల్యాడ్స్‌ను, జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీని, మహిళా సమృద్ధి యోజన, పి.ఎం.ఆర్.వై.లను ప్రకటించారు. 1995లో జాతీయ సాంఘిక సహాయ పథకాన్ని ప్రారంభించి, గ్రామీణ పేదలకు సామాజిక భద్రత కల్పించారు.

9వ ప్రణాళికలో భూగర్భ జలాలను వెలికి తీసి, నీటి పారుదల సౌకర్యాల కల్పన కోసం గంగా కళ్యాణ్ యోజన (జి.కె.వై.) కార్యక్రమాన్ని, 1997లో స్వర్ణ జయంతి షహారీ రోజ్‌గార్ యోజనను ప్రకటించారు.

          9వ ప్రణాళికలో భాగంగా పేదరికాన్ని-నిరుద్యోగాన్ని తగ్గించడానికి అనేక గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. 1999లో అన్నపూర్ణ యోజన, స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన, సమగ్ర అవాస్ యోజన, జవహర్ గ్రామ సమృద్ధి యోజనలను ప్రవేశపెట్టారు. 2000 సంవత్సరంలో జనశ్రీ బీమా యోజన, అంత్యోదయ అన్న యోజన, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమాలను ప్రకటించారు. 2001లో సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన, 2002లో సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాలను ప్రకటించి, పేదరికాన్ని తగ్గించారు.
          10వ ప్రణాళికలో పేదరికాన్ని 21%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్య సాధనకు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారు. 2004లో జాతీయ పనికి ఆహార పథకాన్ని ప్రారంభించారు. 2005లో రూ.1,74,000 కోట్లతో నీటి పారుదల, మంచినీటి సరఫరా, గృహవసతి, గ్రామీణ రోడ్లు, టెలిఫోన్లు, విద్యుచ్ఛక్తి సదుపాయాలను కల్పించడానికి నాలుగేళ్ల కాల పరిమితితో 'భారత నిర్మాణ్' కార్యక్రమాన్ని చేపట్టారు.

          2006 ఫిబ్రవరి 2న పనిహక్కుకు చట్టబద్ధత కల్పిస్తూ, ప్రతి పేద కుటుంబంలో ఒకరికి సంవత్సరానికి 100 రోజులు ఉపాధిని కల్పించడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని 2009 అక్టోబ‌ర్ 2 నుంచి మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంగా మార్చారు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2005న జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ప్రారంభమయింది.

2005లో రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన, 2007లో భూమి లేని నిరుపేద కుటుంబ యజమానికి బీమా సౌకర్యాన్ని కల్పించడానికి ఆమ్ ఆద్మీ బీమా యోజన్‌ను ప్రారంభించారు.

          11వ ప్రణాళిక ముగిసే నాటికి పేదరికాన్ని 15% తగ్గించాలని నిర్ణయించి, తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు.

 పేద‌రిక నిర్మూల‌న ప‌థ‌కాల‌ను కింది విధంగా వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు.
 ఆదాయం, వ‌న‌రుల అభివృద్ధి ప‌థ‌కాలు:  ఇవి 1970లో ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో SFDA, MFAL, IRDP మొద‌లైన ప‌థ‌కాల ద్వారా గ్రామీణ ప్రజ‌ల ఆదాయ వ‌న‌రుల వృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి ప‌థ‌కాలు: దీనిలో DPAP, DDP, HDP మొద‌లైనవాటి ద్వారా ప్రత్యేక ప్రాంతాల‌ను వృద్ధి చేయ‌డానికి వీటిని ప్రవేశ‌పెట్టారు.

 ఉపాధి క‌ల్పన ప‌థ‌కాలు: ఉపాధి క‌ల్పన ప‌థ‌కాల్లో భాగంగా NREP, RLEGP, TRYSEM, FWP, PMIUPEP ప్రవేశ‌పెట్టడం ద్వారా పేదల ఆదాయాలు మెరుగ‌య్యేలా కృషి చేస్తున్నారు.

క‌నీస అవ‌స‌రాల ప‌థ‌కాలు: గ్రామీణ‌, ప‌ట్టణ ప‌్రజ‌ల‌ క‌నీస సౌక‌ర్యాలైన విద్య, వైద్యం, నీటి స‌ర‌ఫ‌రా, రోడ్లు, విద్యుత్‌, గృహం, పౌష్ఠికాహారం మొద‌లైన‌వాటిని అందించ‌డానికి 20 సూత్రాల ప‌థ‌కం లాంటివాటిని అమ‌ల్లోకి తెచ్చారు
పేద‌రిక నిర్మూల‌నకు తీసుకోవాల్సిన ఇత‌ర చ‌ర్యలు:
వ్యవ‌సాయాభివృద్ధి,  అసంఘ‌టిత‌రంగ వృద్ధి, ఉద్యోగిత పెంపు, వేత‌నాల పెంపు, విద్యా నైపుణ్యాలను పెంచ‌డం, వైద్య స‌దుపాయాలు మెరుగు పరచడం, గృహ వ‌స‌తుల క‌ల్పన, భూసంస్కర‌ణ‌లు, ఐటీ రంగాన్ని విస్తృతం చేయ‌డం, కుటీర‌, చిన్న ప‌రిశ్రమ‌ల అభివృద్ధి, ప‌ర‌ప‌తి సౌక‌ర్యాల పెంపు, స‌హ‌కార రంగ వృద్ధి, శాస్త్రీయ ప‌రిశోధ‌న‌ల‌పై ప్రభుత్వ పెట్టుబ‌డులను పెంచడం, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయ‌డం, సూక్ష్మ విత్త సౌక‌ర్యాలు పెంచ‌డం, స్వయం ఉపాధి ప‌థ‌కాలు, అవినీతి త‌గ్గించ‌డం, వ్యవ‌సాయ అనుబంధ రంగాల వృద్ధి, అక్షరాస్యత పెంచ‌డం, స‌హ‌జ వ‌న‌రుల స‌మ‌ర్థ వినియోగం.
            పై చ‌ర్యలు తీసుకోవ‌డం ద్వారా పేద‌రిక ర‌హిత భార‌త దేశాన్ని నిర్మించ‌వ‌చ్చు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again