పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 17, 2014

భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవ్యాప్తి


          భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవ్యాప్తిలో భాగంగా- కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ, బక్సార్ యుద్ధాలు, ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆంగ్ల-మైసూర్ యుద్ధాలు - కారణాలు - ఫలితాలు - పోరాటాలలో విజయసాధనకు బ్రిటిష్‌వారి కుట్రలు - అవినీతి పాత్ర తదితర విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు:
¤    క్రీ.శ. 1769 నుంచి మూడు దశాబ్దాలపాటు ఆంగ్లేయులకు, మైసూర్ పాలకులకు మధ్య జరిగిన యుద్ధాలను ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు అంటారు.

¤    ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు మొత్తం నాలుగు జరిగాయి.

¤    దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులను ధైర్యంగా ఎదుర్కొన్న రాజ్యాలలో మైసూర్ ప్రముఖమైంది.

¤    మైసూర్ తరఫున హైదర్ఆలీ, టిప్పు సుల్తాన్ పోరాటపటిమ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయం.

¤    'ఔరంగజేబు మరణానంతరం 150 సంవత్సరాల భారతదేశ చరిత్రలో హైదర్ఆలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరే భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఏ సందర్భంగా కూడా విదేశీయుల సహాయాన్ని అర్థించనివారు అని ఆంగ్లేయులే పేర్కొన్నారు.

మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1766-1769)
కారణాలు :
¤    భారతదేశం నుంచి ఆంగ్లేయులను పారదోలాలనే హైదర్ఆలీ ఆశయం.

¤    హైదర్ఆలీ ద్వారా తమకు ప్రమాదం ఎదురవుతుందని ఆంగ్లేయులు గ్రహించారు.

¤    హైదర్ఆలీకి వ్యతిరేకంగా ఆంగ్లేయులు మరాఠాలతోనూ, హైదరాబాద్ నిజాంతోనూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు.

¤    హైదర్ఆలీ త్రైపాక్షిక ఒప్పందాన్ని విఫలంచేసి, ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించాడు.

యుద్ధ విశేషాలు :
¤    బ్రిటిష్‌వారి స్థావరమైన మద్రాసు సమీపం వరకు హైదర్ఆలీ పలు ప్రాంతాలు ఆక్రమించాడు. మద్రాసును ఆక్రమించుకునే సమయంలో ఆంగ్లేయులు నిస్సహాయులై హైదర్ఆలీతో సంధికి అంగీకరించారు.

¤    బ్రిటిష్‌వారు సంధికి అంగీకరించకుంటే హైదర్ఆలీ మద్రాస్‌ను ఆక్రమించేవాడు. ఒకవేళ మద్రాస్‌ను ఆక్రమించి ఉంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర ఎలా ఉండేదో ప్రశ్నార్థకం.

¤    భారతీయ సంప్రదాయాలను అనుసరించి, ఆంగ్లేయులు సంధికి వచ్చినప్పుడు అదే న్యాయమని హైదర్ఆలీ భావించాడు. అదే మద్రాస్ సంధి.

మద్రాస్ సంధి (1769)
ముఖ్యాంశాలు :
¤    యుద్ధానికి పూర్వం ఉన్న స్థితిని అంగీకరించాలి. అంటే యుద్ధకాలంలో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఎవరికి వారు ఇచ్చేయాలి.

¤    యుద్ధానికి అయిన ఖర్చులకు నష్టపరిహారాన్ని ఆంగ్లేయులు హైదర్ఆలీకి ఇవ్వాలి.

¤    ఈ రెండు పక్షాలలో ఎవరినైనా మూడోవారు ఎదిరిస్తే, ఇరుపక్షాలు పరస్పరం సహాయపడాలి.

ఫలితాలు :
¤    ఆంగ్లేయులను ఆజ్ఞాపించదగిన స్థానాన్ని హైదర్ఆలీ పొందాడు.

¤    ఇరుపక్షాలు ఆర్థికంగా నష్టపోయాయి.

రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1780-1784)
కారణాలు :
¤    బ్రిటిష్‌వారు మద్రాస్ సంధిని కేవలం తిరిగి యుద్ధం చేయడానికి వ్యవధి అవసరమని కుదుర్చుకున్నారు. 

¤    హైదర్ఆలీ కూడా ఆంగ్లేయుల ఉద్దేశం, నడవడిక గ్రహించాడు. పరస్పరం అపనమ్మకం పెంచుకున్నారు.

¤    మద్రాస్ సంధి షరతులను బ్రిటిష్‌వారు ఉల్లంఘించారు. ఉదా: హైదర్ఆలీపై మరాఠాలు దాడిచేస్తే మద్రాస్ సంధి ప్రకారం హైదర్ఆలీకి ఆంగ్లేయులు సహకరించాలి. కానీ ఆంగ్లేయులు తటస్థ వైఖరిని అవలంబించారు.

¤    ఆంగ్లేయులు - ఫ్రెంచివారి మధ్య యూరప్‌లో ఘర్షణల కారణంగా హైదర్ఆలీ రాజ్యపరిధిలోని ఫ్రెంచివారి వర్తక స్థావరమైన 'మాహేను బ్రిటిష్‌వారు ఆక్రమించారు.

¤    ఇంగ్లిష్‌వారికి వ్యతిరేకంగా హైదర్ఆలీ నైజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో పరిణామం.

యుద్ధ విశేషాలు :
¤    హైదర్ఆలీ యుద్ధం మొదట్లో ఘనవిజయాలు సాధించాడు. అయితే, అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ తన రాజకీయ చతురతతో నిజాం, మరాఠాలను తనవైపు తీసుకున్నాడు.

¤    1781లో పోర్ట్‌నోవా వద్ద బ్రిటిష్‌సేనాని సర్ఐర్‌క్యూట్ హైదర్ఆలీని ఓడించాడు. 1782లో హైదర్ఆలీ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. దీనితో హైదర్ఆలీ కుమారుడైన టిప్పుసుల్తాన్ యుద్ధనిర్వహణ బాధ్యతలను స్వీకరించాడు.

¤    1784నాటికి ఎవరూ గెలిచే స్థితిలో లేకపోవడంతో ఒప్పందం చేసుకున్నారు. ఇదే మంగుళూరు ఒప్పందం.

మంగుళూరు ఒప్పందం (1784)
ముఖ్యాంశాలు :
¤    ఇరుపక్షాలు తాము గెలుచుకొన్న ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయాలి.

¤    ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదు. ఎవరైనా దాడిచేస్తే ఒకరికొకరు సహకరించుకోవాలి.

¤    ఆంగ్లేయుల దగ్గర నుంచి హైదర్ఆలీ గెలుచుకున్న ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయాలి.

మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1790-1792)
కారణాలు :
¤    టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా ఆంగ్లేయులు హైదరాబాద్ నిజాం రాజులతోనూ మరాఠాలతోనూ ఒప్పందం కుదుర్చుకోవడం.

¤    టిప్పు సుల్తాన్ ఫ్రాన్స్, టర్కీ దేశాల సహాయం పొందడానికి రాయబారాలు చేయడం.

¤    బ్రిటిష్ పక్షపాతి అయిన ట్రావెన్‌కోర్ రాజుపై టిప్పు సుల్తాన్ దాడి చేస్తున్నారనే ఆరోపణ.

¤    ఈ కారణాలతో గవర్నర్ జనరల్ కారన్ వాలీస్, టిప్పు సుల్తాన్‌పై యుద్ధం ప్రకటించాడు. 

యుద్ధ విశేషాలు :
¤    కారన్‌వాలీస్ స్వయంగా యుద్ధానికి నాయకత్వం వహించాడు.

¤    మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్నంపై దాడిచేసి, ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు.

¤    టిప్పు సుల్తాన్‌తో సంధి చేసుకోవాల్సిందిగా మరాఠాలు, నిజాం రాజులు ఒత్తిడి తేవడంతో ఆంగ్లేయులు సంధి కుదుర్చుకున్నారు. అదే శ్రీరంగపట్నం సంధి.

శ్రీరంగపట్నం ఒప్పందం (1792)
ముఖ్యాంశాలు :
¤    టిప్పు సుల్తాన్ తన భూభాగాలలో దాదాపు సగభాగం ఆంగ్లేయులు వారి మిత్రులకు ఇవ్వాలి.
¤    యుద్ధ నష్టపరిహారంగా మూడు కోట్ల మొత్తాన్ని టిప్పుసుల్తాన్ ఆంగ్లేయులకు చెల్లించాలి. ఆ పైకం చెల్లించేవరకు టిప్పుసుల్తాన్ ఇద్దరు కొడుకులను ఆంగ్లేయుల చెరలో ఉంచాలి.
నాలుగో ఆంగ్లో- మైసూర్ యుద్ధం (1799)
కారణాలు :
¤    ఆంగ్లేయుల చేతిలో తమకు వాటిల్లిన అవమానకరమైన పరాజయానికి, ఆంగ్లేయులు తమపై విధించిన షరతులకు ప్రతీకారం తీర్చుకోవాలనే టిప్పుసుల్తాన్ బలమైన కోరిక.

¤    విప్లవాత్మక ఫ్రాన్స్, ముస్లిం దేశాలైన అరేబియా, కాబూల్, టర్కీ తదితర దేశాల సహాయం కోసం టిప్పుసుల్తాన్ రాయబారులను పంపడం.

¤    టిప్పుసుల్తాన్ నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ నిర్ణయం.

¤    వెల్లస్లీ సైన్య సహకార ఒప్పందానికి టిప్పుసుల్తాన్ అంగీకరించకపోవడం.

యుద్ధ విశేషాలు :
¤    టిప్పుతో పనిచేస్తున్న సైనికాధికారులు, ముఖ్య ఉద్యోగులు అతడికి సహాయం చేయకుండా తమవైపు చేరితేగాని విజయం సాధించలేమని వెల్లస్లీ భావించాడు. లంచమిచ్చి, అవినీతి మార్గాల ద్వారా తమవైపు తిప్పుకొనేందుకు అయిదుగురితో కమిషన్ ఏర్పాటు చేశాడు.

¤    బ్రిటిష్‌వారి దగ్గర లంచం తీసుకున్న సైన్యాధికారులు, టిప్పుసుల్తాన్‌కు వెన్నుపోటు పొడిచారు.

¤    పూర్ణయ్య, కమరుద్దీన్ అనే సైన్యాధికారులను పూర్తిగా నమ్మి బాధ్యతలు అప్పగించగా వారు టిప్పుసుల్తాన్‌ను మోసగించారు. వారు ఆంగ్లేయుల సైన్యం సంఖ్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు
.
¤    ఆంగ్లేయ సైన్యం దాడిచేసే మార్గంపై తప్పుడు సమాచారం ఇచ్చారు.

¤    శ్రీరంగపట్నం రక్షణ బాధ్యతను కమరుద్దీన్‌కు అప్పగించగా ఆంగ్లేయులకు అమ్ముడుపోయిన కమరుద్దీన్ మైసూర్ సైన్యంలో కల్లోలం సృష్టించాడు.

¤    ఈ విధంగా అవినీతికి పాల్పడి సొంతవారే మోసంచేయడంతో టిప్పుసుల్తాన్ ఓటమి పాలయ్యాడు. వీరమరణం పొందాడు.

యుద్ధ ఫలితాలు :
¤    యుద్ధంలో సహాయం చేసిన మైసూర్ ఉద్యోగులు ఆంగ్లేయుల నుంచి బహుమతులు పొందారు.

¤    టిప్పుసుల్తాన్‌కు చెందిన పుస్తక భాండాగారాన్ని ఇంగ్లాండుకు తరలించారు.

¤    మైసూర్ పాలకుడిగా ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ - 3ని నియమించారు. కృష్ణరాజ - 3 బ్రిటిష్‌వారితో సైన్య సహకార ఒప్పందంపై సంతకంచేశాడు.

¤    దుష్పరిపాలన కారణంగా 1831లో విలియం బెంటింక్ మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నాడు.

¤    1882లో లార్డ్‌రిప్పన్ వైస్రాయ్ కాలంలో వడయార్ రాజవంశీయులకు బ్రిటిష్‌వారు మైసూర్ రాజ్యాన్ని అప్పగించారు.

హైదర్ఆలీ (1761 - 1782)
¤    ఆధునిక భారతదేశ చరిత్రలో మైసూర్ రాజ్యానికి విశేష పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పాలకుడు హైదర్ఆలీ.

¤    విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత 'వడయార్ల వంశపాలనలో స్వతంత్ర రాజ్యంగా ఉన్న మైసూర్ రాజ్యంలో హైదర్ఆలీ సైనికుడిగా జీవితం ప్రారంభించాడు

¤    తక్కువ కాలంలోనే తన ప్రతిభతో 'దిండిగల్ ప్రాంతానికి ఫౌజుదార్ అయ్యాడు. ఫౌజ్‌దార్ అంటే శాంతిభద్రతలు చూసే అధికారి.

¤    ఫ్రెంచివారి సహాయంతో 'దిండిగల్‌లో ఆయుధ కర్మాగారం స్థాపించాడు.

¤    క్రీ.శ. 1761లో కృష్ణరాజ వడయార్‌ను రాజ్యం నుంచి తొలగించి మైసూర్ స్వతంత్ర పాలకుడయ్యాడు. శ్రీరంగపట్నంను రాజధానిగా చేశాడు.

¤    ఆంగ్లో-మైసూర్ మొదటి, రెండో యుద్ధాల్లో పాల్గొన్నాడు.

¤    హైదర్ఆలీ నిరక్షరాస్యుడు. అయినా అతడి జ్ఞాపకశక్తి అమోఘం. దేశీయులతోపాటు విదేశీయులు కూడా గొప్పగా మెచ్చుకునేవారు.

¤    పరమత సహనంగలవాడు. అవసరమైనప్పుడు శృంగేరి శంకరాచార్యుల సలహాలు తీసుకునేవాడు.

¤    సామాన్య ప్రజలకు, సైనికులకు ఆరాధ్యదైవంగా వెలిగాడు.

¤    ''రాజుకు, ప్రజలకు మధ్య సంబంధాన్ని తెంచివేయడానికి ప్రయత్నించడం అన్ని పాపాలకన్నా హీనమైంది. బలవంతులు బలహీనులను రక్షించాలి. దేవుడు రాజులను సృష్టించింది బలహీనులను కాపాడటానికే. తప్పుచేసినవారిని శిక్షించకపోయినా, ప్రజలను హింసించినవారిని రాజు వదలిపెట్టినా ప్రజలకు రాజుమీద నమ్మకం, ఆశలు నశిస్తాయి అని హైదర్ఆలీ చెప్పేవాడు.

¤    అవసరమైతే రాత్రనక, పగలనక రోజుల తరబడి వానలో కూడా గుర్రం మీద ఎక్కడా నిలవకుండా స్వారీ చేసేవాడు. పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు హైదర్ఆలీ.

¤    1782లో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు.

¤    భారతదేశ చరిత్రలో హైదర్ఆలీ మరువరాని వ్యక్తిగా మిగిలిపోయాడు.

టిప్పు సుల్తాన్ (1782 - 1799)
¤    2, 3, 4 ఆంగ్లో- మైసూర్ యుద్ధాలు చేశాడు.

¤    విదేశీ వర్తకాన్ని అభివృద్ధి చేసేందుకు ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, పెరూ దేశాలకు రాయబారులను పంపాడు.

¤    ఫ్రెంచి విప్లవంతో ప్రభావితమయ్యాడు. ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తిగా శ్రీరంగపట్నంలో స్వేచ్ఛావృక్షాన్ని నాటించాడు.

¤    ఫ్రెంచి విప్లవంలోని అతివాదుల సంఘం అయిన 'జాకోబియన్ క్లబ్‌లో సభ్యుడిగా చేరాడు.

¤    మైసూర్ రాజ్యమంతా ఒకే విధమైన ద్రవ్యవిధానం, తూనికలు, కొలతలు ప్రవేశపెట్టాడు.

¤    శ్రీరంగపట్నంలోని రంగనాథ ఆలయానికి భూదానాలు చేసి పరమత సహనం పాటించాడు. శంకరాచార్యులను జగత్ గురువుగా భావించాడు.

¤    యూరప్‌వారిని ఆదర్శంగా తీసుకుని ఆధునిక నౌకాదళాన్ని నిర్మించాడు.

¤    'టైగర్ ఆఫ్ మైసూర్ గా కీర్తిపొందాడు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again