పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

ఒక జాతిగా భారతదేశం


అద్భుతాల కూడలి
           కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించిన భారతదేశంలో ప్రజలు రకరకాల ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు. భాషలు, మతాలు, కులాలు, సంస్కృతి - సంప్రదాయాలు వేరైనా 'అంతా భారతీయులమే' అన్న భావనతో జాతి సమైక్యతను చాటుతున్నారు. అందుకేనేమో! భారత సమాజాన్ని అధ్యయనం చేసిన కొందరు దీనిని 'అద్భుతాల కూడలి'గా అభివర్ణించారు.

           ఆసియా ఖండానికి దక్షిణంగా ఉన్న భారతదేశానికి ఖండానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండటంతో దీన్ని ఉపఖండం అన్నారు. జనాభా దృష్ట్యా ప్రపంచంలో మనదేశం రెండోది. 2001 జనాభా లెక్కల ప్రకారం పురుషులు 53 కోట్ల 12 లక్షలు, స్త్రీలు 49 కోట్ల 58 లక్షలు. మొత్తం దేశ జనాభా 102.7 కోట్లుగా నమోదైంది.

భిన్నత్వంలో ఏకత్వం:
           భారతదేశం వివిధ ఆచార వ్యవహారాలకు, అనేక భాషలు, మతాలు, కులాలు, సంస్కృతులకు నిలయం. మన దేశంలో పలు ప్రాంతాల్లోని ప్రజలు మాట్లాడే భాషలు సుమారు 1652. అయితే మన రాజ్యాంగం 22 భాషలను మాత్రమే గుర్తించింది.

అవి: అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, సంథాలి, డోంగ్రీ, మైథిలీ మొదలైనవి. మన దేశంలో సుమారు 6748 కులాలున్నాయి.

ఒక సమాఖ్య
            ప్రస్తుతం మనదేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఢిల్లీ దేశ రాజధాని. ఇక్కడి హిందూమతం వైవిధ్య భరితమైంది. హిందువు అనే పదాన్ని నిర్వచించడం చాలా కష్టం. జనాభా గణన ప్రకారం మనదేశంలో హిందువులు 80.5%, ముస్లింలు 13.4%, క్రైస్తవులు 2.3%, సిక్కులు 1.9%, బౌద్ధులు, జైనులు, ఇతరులు 1.9% ఉన్నారు.

విశ్వసించిన ఆదర్శాలు
          స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారతదేశం విశ్వసించిన ఆదర్శాలు. 1949లో మన రాజ్యాంగ నిర్మాతలు లిఖించిన, ఉన్నతమైన, పవిత్రమైన ఆదర్శాలను సఫలం చేయడానికి అందరూ కృషి చేయాలి. సమకాలీన భారత జాతీయ జీవన స్రవంతిలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం అనే అంశాలను గుర్తించవచ్చు.

ప్రజాస్వామ్యం
          భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ప్రజలదే. నియమిత కాలంలో నిర్వహించే స్వేచ్ఛాయుత ఎన్నికల ద్వారా ప్రజా ప్రతినిధులను ప్రజలే ఎన్నుకుంటారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే. రాజ్యాంగం పౌరులందరికీ ఏ తారతమ్యం లేకుండా సార్వజనీన వయోజన ఓటు హక్కును ప్రసాదించింది. పౌరులందరూ జాతీయ, రాష్ట్ర శాసన సభలకు, రాజకీయ పదవులకు పోటీ చేయవచ్చు. నిర్ణీత కాలంలో శాసనసభలకు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపే ఏర్పాటు రాజ్యాంగం చేసింది. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి నిదర్శనాలు.

లౌకికతత్వం
          రాజ్యపాలన నిర్వహణలో మతాల ప్రమేయం లేకపోవడమే లౌకికతత్వం. శాసన వ్యవహారాలు, సిద్ధాంతాల కార్యక్రమాల్లో మత ప్రమేయం లేకుండానే పాలన వ్యవహారాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

సామాజిక న్యాయం
          భారతదేశం విశ్వసించే ఆదర్శాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం మరొకటి. శతాబ్దాల తరబడి అణచివేత, వివక్షకు గురైన ప్రజలకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం, భాగస్వామ్యం కల్పించడమే సామాజిక న్యాయభావన. రాజ్యాంగం భారతదేశాన్ని ఒక సామ్యవాద రాజ్యం (Socialist State) గా ప్రకటించింది.

జాతీయ సమైక్యత
        ఏ కుటుంబంలోనైనా, ప్రాంతంలోనైనా ఐకమత్యంగా ఉంటేనే అక్కడ విజయాలు సొంతమవుతాయి. అలాగే ఏ దేశంలోనైనా అక్కడ ప్రజలంతా ఐక్య భావనతో ఉంటేనే ఆ జాతి లేదా దేశం మనగలుగుతుంది. వివిధ వర్గాల ప్రజలను ఒకే తాటిపై తీసుకురావడమే జాతీయ సమైక్యత అంతరార్థం.

ఈ దేశం నాది అనే భావన దేశ ప్రజల్లో కలిగించడమే జాతీయ సమైక్యత పరమార్థం. మన దేశం మహత్తర వైవిధ్యాలతో కూడిన విశాల దేశం. అయితే భిన్నత్వంలో ఏకత్వ లక్షణాన్ని సంతరించుకుందని తెలుసుకున్నాం. అనేక మతాలు, కులాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులం అనే విషయాన్ని మరవకూడదు. అప్పుడప్పుడు చిన్న చిన్న విద్రోహ ఘటనలు జరుగుతున్నప్పటికీ భారతీయుల్లో ఉన్న సహనం, ఐకమత్యం వాటిని పారదోలుతాయి.

సమైక్యతను పెంపొందించే అంశాలు

చారిత్రక ఉత్తర దాయిత్వం:
            తరతరాల నుంచి మనం ఐకమత్య భావన ఉన్న సంస్కృతీ నాగరికతను అలవాటు చేసుకున్నాం. ఈ చారిత్రక నేపథ్యం జాతీయ సమైక్యతను పెంపొందించే అంశాల్లో ప్రధానమైంది.

సమాఖ్య రాజ్యం
            భారతదేశం ఒక సమాఖ్య రాజ్యం. ప్రభుత్వ అధికారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించారు. సమాఖ్య భావం వివిధ జాతుల మధ్య సమైక్యతను పెంపొందిస్తుంది.

రాజకీయ పార్టీలు
            ఇవి వివిధ ప్రాంతాలు, మతాలు, కులాలు తెగల ప్రజలను తమ సభ్యులుగా చేర్చుకోవడం ద్వారా జాతీయ సమైక్యతను పటిష్ఠం చేస్తాయి.

సామాజిక అవరోధాల తొలగింపు
            జాతీయ సమైక్యత అనేది సామాజిక, సాంస్కృతిక సమైక్యతల సమాహార రూపం. మత, కుల, ప్రాంతీయ, అసమానతలను తొలగించి జాతీయ సమైక్యతను సాధించాలి.

సంస్థాగత వ్యవస్థలు
            జాతీయ ఐక్యతను పెంపొందించడానికి మనదేశంలో కొన్ని సంస్థాగత వ్యవస్థలు ఉన్నాయి. ఆలిండియా సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు పరిపాలన నిర్వహణలో ఏకరూపతను సాధించడానికి ఏర్పాటయ్యాయి.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again