పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు - I


వ్యవసాయం: స్వాతంత్య్రానికి పూర్వం మనదేశ ఆర్థిక వ్యవస్థ స్వయం సంపూర్ణ గ్రామీణ సామూహిక ఆర్థిక వ్యవస్థ. మొత్తం సమాజం మూడు వర్గాలుగా ఉండేది. గ్రామప్రజలు వ్యవసాయదారులు, వృత్తిపనివాళ్లు దాసులు, గ్రామాధికారులు. భారతదేశ వర్తకంలో ప్రధాన పాత్ర వహించినవి నీలి, ఊదా లాంటి సాంద్రకాలు, నల్లమందు, లైకోరైస్ (ముసాంబరం). ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం 1780-1820 మధ్యలో సంభవించింది. దాని ఫలితంగా బ్రిటిషర్లు మనదేశాన్ని ఒక వలస దేశంగా (ముడిపదార్థాల కోసం) చేసుకున్నారు.


బ్రిటిషర్లు మనసంపదను ఎలా కొల్లగొట్టారో డి.ఆర్. గాడ్గిల్ 'ఆర్థిక పీల్చివేత (Economic drain)'; దాదాభాయ్ నౌరోజీ 'ఆర్థిక సంపదను కొల్ల గొట్టడం(Economic Plunder)' అనే గ్రంథాల్లో వివరించారు. బ్రిటిషర్లు అభివృద్ధి చేసిన వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యీ కరణ, తోటల పెంపకం, జనుము. దేశీయ పరిశ్రమలు దెబ్బతినడానికి కారణం వివక్షతో కూడిన పన్నుల విధానం. బ్రిటిషర్ల కాలంలో భారతీయుల వాస్తవ తలసరి ఆదాయం విపరీతంగా పడిపోయింది.

స్వాతంత్య్రానంతరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ: 1951 నాటికి మనదేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన జనాభా 70 శాతం. ఒక నియమిత పద్ధతిలో ఉద్యోగాలు, జీతాలస్థాయిలేని వ్యవసాయం, కుటీర, చిన్న - అల్ప తరహా పరిశ్రమలను అవ్యవస్థీకృత రంగం (unorganised sector) అంటారు.

» చేతి పనులు, కళాకారుల వృత్తులు, ఖాదీ గ్రామీణ పరిశ్రమలైన చేనేత, బీడీల తయారీ, అగరుబత్తీల తయారీ, చేతికాగితం మొదలైనవి అవ్యవస్థీకృత రంగానికి చెందినవి.

» ఒక నిర్వచనీయమైన పద్ధతిలో ఉపాధులు, ఉత్పత్తి ఉన్న భారీ పరిశ్రమలు, వ్యవసాయ రంగాలను వ్యవస్థీకృత రంగం (Organised sector) అంటారు.

» మనదేశంలో ఎక్కువమంది శ్రామికులు అవ్యవస్థీకృత రంగంలోఉన్నారు.

» రసాయనాలు, యంత్ర పరికరాలు, ఇంజినీరింగ్ వస్తువులు, వస్త్రాలు, టీవీ, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ వ్యవస్థీకృత రంగానికి చెందింది.

వర్షాధారం: భారతదేశ వ్యవసాయం ప్రధానంగా రుతుపవనాలపై ఆధారపడి ఉంది. మనదేశానికి వర్షపాతాన్నిచ్చేవి నైరుతి రుతుపవనాలు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వచ్చేవి నైరుతి రుతుపవనాలు. దేశంలో ప్రధాన ఆహార పంటలు వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న. వరి అధికంగా పండించే రాష్ట్రాలు - ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వీటి తరువాత బీహార్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ కొంత వరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. మనదేశంలో పంట కాలాలు మూడు. ఖరీఫ్, రబీ, వేసవి (జైద్). ఖరీఫ్ కాలం (వర్షాకాలం) లో పండే పంటలు - వరి, జొన్న, మొక్కజొన్న. రబీ కాలంలో (చలికాలం) పండే పంటలు - గోధుమ, జొన్న, మొక్కజొన్న. వేసవిలో (మార్చి-మే) పండే పంటలు - వరి, మొక్కజొన్న, వేరుశెనగ. అన్ని కాలాల్లో పండే పంట మొక్కజొన్న. రబీలో మాత్రమే పండే పంట గోధుమ (చలికాలం పంట) వేసవిలో మాత్రమే పండే పంట వేరుశెనగ.

గ్రామీణ - పట్టణ జనాభా: దేశంలో అధిక సంఖ్యాక ప్రజలు పట్టణ ప్రాంతంలో నివసించడాన్ని పట్టణీకరణ లేదా నగరీకరణ లేదా అర్బనైజేషన్ (Urbanisation) అంటారు. భారతదేశంలో నగరీకరణ శాతం (పట్టణ జనాభా) 26%. 1991 నాటికి భారతదేశంలో అక్షరాస్యుల శాతం 52.2 % (2001లో 65.38 %)

» బ్రిటిషర్ల కాలంలో భూయాజమాన్య పద్ధతులను కారన్‌వాలిస్ ప్రవేశ పెట్టాడు.

» గ్రామంలోని భూమి అంతా ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండటాన్ని జమిందారీ పద్ధతి అంటారు.

» గ్రామంలోని భూమి ఒక చిన్న కుటుంబాల, సమూహాలకు చెంది ఉండటాన్ని మహల్వారీ పద్ధతి అని పిలుస్తారు.

» భూమి విడివిడి వ్యక్తుల చేతుల్లో ఉండి ఆ వ్యక్తులే ప్రభుత్వానికి పన్ను చెల్లించే పద్ధతిని రైత్వారీ పద్ధతి అంటారు.

ఆదాయ - సంపదల్లో అసమానతలు: వ్యక్తులు సంపద, ఆస్తుల నుంచి పొందే ఆదాయాన్ని అసంపాదిత ఆదాయం లేదా అన్ఎర్న్‌డ్ ఇన్‌కాం అని పిలుస్తారు.

» వ్యక్తులు శ్రమ, కష్టించి పని చేయడం ద్వారా పొందే ఆదాయాన్ని సంపాదిత ఆదాయం లేదా ఎర్న్‌డ్ ఇన్‌కాం అంటారు. భారతదేశంలో ఆదాయ అసమానతలకు ముఖ్య కారణం ఆస్తి హక్కు ఉండటం. ఒకదేశ ఆదాయ పంపిణీ అసమానత్వాన్ని తెలియజేసే రేఖ లారెంజ్ వక్రరేఖ.

లారెంజ్ వక్రరేఖ: 1. ఈ రేఖను జాతీయదాయ సమ పంపిణీ రేఖ అని పిలుస్తారు. జాతీయాదాయం ఇలా పంపిణీ జరిగితే ఆదాయ అసమానతలు ఉండవు.

2. ఈ రేఖను జాతీయాదాయ వాస్తవ పంపిణీరేఖ లేదా లారెంజ్ వక్రరేఖ అంటారు. ఇది దేశంలోని ఆదాయ పంపిణీలను, అసమానతలను తెలుపుతుంది. 
 




» దేశంలో ఆదాయ అసమానతలు లేకపోతే ఆదాయ సమ పంపిణీ రేఖ, లారెంజ్ వక్రరేఖ ఒకటిగానే ఉంటాయి. (రెండూ కలిసి పోతాయి).

» ఆదాయ సమ పంపిణీ రేఖకు, వాస్తవ పంపిణీ రేఖకు అంతరం ఎంత ఎక్కువగా ఉండే దేశంలో ఆదాయ అసమానతలు అంత ఎక్కువగా ఉన్నట్లు చెప్పవచ్చు. పై చిత్రంలోని గీతల ప్రాంతం దేశంలో ఆదాయ అసమానతలు ఎంత ఎక్కువగా ఉన్నదీ తెలియజేస్తుంది. ఇది పేదరికానికి దారి తీస్తుంది. ఆర్థిక వ్యవస్థలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

1. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ (Capitalist Economy): ఇందులో ధర నిర్ణయాన్ని స్వేచ్ఛా మార్కెట్‌కు వదిలేస్తారు. ఆర్థిక కార్యకాలాపాల్లో ప్రభుత్వానికి పరిమిత జోక్యం మాత్రమే ఉంటుంది. దేశ రక్షణ, శాంతిభద్రతలు లాంటి ముఖ్యమైన బాధ్యతలు మాత్రమే ప్రభుత్వం చేపడుతుంది. ఇలాంటి లక్షణాలు ఉండే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు.
ఉదా: ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు.

2. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ (Socialist Economy): వస్తూత్పత్తి, సరఫరాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వరంగ సంస్థల ద్వారా మాత్రమే నిర్వహించడం. కేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థ ఉండటం. ప్రజలకవసరమైన మౌలిక వసతుల బాధ్యత ప్రభుత్వం స్వీకరించడం లాంటి లక్షణాలు ఉంటే దాన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు.
ఉదా: చైనా, తూర్పు యూరప్ దేశాలు.

3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ: ఆర్థిక కార్యకలాపాల్లో అటు ప్రభుత్వ రంగం, ఇటు ప్రైవేటు రంగం రెండూ పని చేయడాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు.
ఉదా: భారతదేశం

ప్రభుత్వరంగం: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలను ప్రభుత్వ రంగం (Public sector) అంటారు.
ఉదా: దేశరక్షణ, అణుశక్తి, రైల్వేలు, బ్యాంకులు, బీమా మొదలైనవి.

ప్రైవేటు రంగం: దేశంలో కొన్ని ఉత్పత్తులను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు వదలివేయడాన్ని ప్రైవేటు రంగం (Private sector) అంటారు.
ఉదా: వ్యవసాయం

ఉమ్మడి రంగం: దేశంలో కొన్ని వస్తువుల ఉత్పత్తులను (సంస్థలను) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి నిర్వ హించడాన్ని ఉమ్మడి రంగం (Joint sector) అంటారు.
ఉదా: టెలికమ్యూనికేషన్ (బి.ఎస్.ఎన్.ఎల్.).

» ఉమ్మడి రంగం ఉండటం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేక లక్షణం.

పంచవర్ష ప్రణాళికలు 
సాధారణ లక్ష్యాలు: జాతీయాదాయాన్ని మెరుగుపరచి జీవన ప్రమాణాన్ని పెంచడం; మౌలిక, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం; ఉపాధి అవకాశాల విస్తరణ, వికాసాలు; ఆదాయ, సంపదల అసమానతలు తగ్గించి పంపిణీలో న్యాయం చేకూర్చడం; ఆర్థిక అభ్యున్నతితోపాటు స్థిరత్వం, పంపిణీలో న్యాయం సాధించేందుకు దోహదం చేసేవిగా మన ప్రణాళికలు ఉన్నాయి

''భారత పంచవర్ష ప్రణాళికలు ప్రజాస్వామ్యం, సమానత్వం మార్గాల్లో కొనసాగుతున్నాయి."      -          ఎగాలిటేరియన్

విజయాలు: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం. మౌలిక, ఉత్పాదక వస్తు పరిశ్రమల్లో భారీ యంత్రాంగం, విద్యుత్ ఉపకరణాలు మొదలైన రంగాల్లోనూ దేశం స్వయం సమృద్ధిని సాధించింది. అవస్థాపన సౌకర్యాలు వృద్ధి చెందాయి. అక్షరాస్యత విషయంలో ప్రగతి సాధిస్తున్నాం.

అపజయాలు: పేదరికం, నిరుద్యోగం తగిన స్థాయిలో తగ్గలేదు. ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి. పంపిణీ న్యాయం అమల్లోనూ అపజయాలే. భూసంస్కరణల అమలు కూడా అసంతృప్తికరంగా ఉంది. 


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again