పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 23, 2014

భారతదేశ ఆర్థిక వ్యవస్థ


          ఈ విభాగంలో బ్రిటిష్ పాలన ప్రభావం మొదలు ప్రణాళికల ద్వారా నేటివరకు భారతదేశ ఆర్థిక పరిస్థితులు ప్రాధాన్యాంశాలుగా ఉంటాయి.
బ్రిటిష్ పాలన:
            ఈస్టిండియా కంపెనీ 1600లో ఏర్పాటయింది. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధ ఫలితంగా రాజకీయ అధికారం పొందింది. 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్షపాలన కిందికి వచ్చింది. 1793లో కారన్ వాలిస్ ప్రవేశపెట్టిన జమిందారీ విధానం, 1883లో సర్ మెకంజీ, విలియం బెంటింగ్‌లు ప్రవేశపెట్టిన మహల్వారీ విధానం వ్యవసాయ రంగ క్షీణతకు దారితీశాయి. 1792లో థామస్ మన్రో ప్రవేశపెట్టిన రైత్వారీ విధానం మాత్రం కొన్ని ప్రాంతాల్లో ప్రయోజనకరంగా ఉండేది.

          బ్రిటిషర్లు భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమివ్వలేదు. 'బ్రిటన్‌కు భారత్ ఎగుమతి మార్కెట్‌గా కంటే, దిగుమతి మార్కెట్‌గానే ఎక్కువగా ఉపయోగపడింది' అని హెలెన్ బి.లాంబ్ అభిప్రాయ పడ్డారు. బ్రిటిషర్లు అనుసరించిన విధానం వల్ల గ్రామీణ చేతివృత్తులు, హస్త కళలు క్షీణించాయి. 'Poverty and Unbritish Rule in India' అనే గ్రంథంలో (1868 దాదాబాయ్ నౌరోజీ భారతదేశ సంపదను హోం ఛార్జీల రూపంలో తరలించడం వల్ల డ్రైన్ ఏర్పడిందని సూత్రీకరించారు. భారతదేశ జాతీయాదాయం రూ.340 కోట్లు.

తలసరి ఆదాయం రూ.20 కావడంతో ప్రజల జీవన ప్రమాణ స్థాయి తగ్గి పేదరికానికి దారి తీసిందని దాదాబాయ్ నౌరోజీ అన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు - నిర్మాణం:
             ప్రపంచబ్యాంకు తలసరి ఆదాయం ప్రాతిపదికన 2005లో ప్రకటించిన గణాంకాల ఆధారంగా 875 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అల్ప ఆదాయ వర్గ దేశాలుగా పేర్కొంటారు. భారతదేశ తలసరి ఆదాయం 720 డాలర్లుగా లెక్కించడం గమనార్హం. అయినా మార్కెట్ పరంగా 4వ స్థానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో 5వ స్థానంలో ఉండి సంపన్న దేశాల సరసన నిలిచింది. భారత్ జనాభా పరంగా 2వ స్థానంలో, వైశాల్యపరంగా ఏడో స్థానంలో ఉంది. పేదరికం, నిరుద్యోగం ఇక్కడి ప్రధాన సమస్యలు.

పేదరికం:
          కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితిని పేదరికం అంటారు.

నిరపేక్ష పేదరికం:
          తలసరి వినియోగ వ్యయం ఆధారంగా కనీస వినియోగ వ్యయం చేయలేని వారిని నిరపేక్ష పేదరికంలో ఉన్నట్లు పేర్కొంటారు. 1993-94 ధరల ప్రకారం పట్టణాల్లో రూ. 538, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 356గా పేర్కొన్నారు. ఆహార ప్రమాణం గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాలవారికి 2100 కేలరీలుగా నిర్ధరించారు.

సాపేక్ష పేదరికం 'Relative Poverty':
        దారిద్య్ర రేఖకు పైనున్న 5%-10% ప్రజల ఆదాయాలతో, ఆ రేఖకు దిగువనున్న 5%-10% ప్రజల ఆదాయాలను పోల్చడాన్ని సాపేక్ష పేదరికం అంటారు.

       దేశంలో 6వ ప్రణాళిక సంఘం నిపుణుడు లక్డావాలా కమిటీ ఆధారంగా దారిద్య్ర రేఖను నిర్వచించారు. ప్రణాళిక సంఘం ప్రకారం 2000 నాటి గ్రామీణ పేదలు 27.10%, పట్టణ పేదలు 23.60% మొత్తంగా దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన 20% ప్రజలు ఉన్నట్లు పేర్కొంది. 2004-05 నాటికి మిక్స్‌డ్ రీకాల్డ్ పీరియెడ్ ప్రకారం 22% ప్రజలు దారిద్య్ర రేఖ దిగువన ఉన్నారు.

పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వం NREP, RLEGP, JRDP, NREAS, SGSY లాంటి పథకాలను అమలు చేస్తోంది.

నిరుద్యోగం:
     అమల్లో ఉన్న వేతన స్థాయి వద్ద పని చేయాలని ఆసక్తి ఉన్నా, పనిలేని స్థితినే నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. స్వచ్ఛంద నిరుద్యోగిత అంటే ఆశించిన దానికంటే తక్కువ వేతనస్థాయికి పనిచేయడానికి ఇష్టపడని స్థితి. ఈ రెండు రకాల నిరుద్యోగిత గురించి జె.ఎం.కీన్స్ పేర్కొన్నాడు.

ప్రచ్ఛన్న నిరుద్యోగిత (Disgussed unemployment):
       అవసరానికి మించి ఉన్న శ్రామిక జనాభాను ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. వీరి ఉపాంత ఉత్పాదకత శూన్యం. భారత్‌లో ఇది ఎక్కువగా వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత గురించి జోన్ రాబిన్సన్ పేర్కొన్నాడు.

NSS (National Sample Survey)నిరుద్యోగితను 3 రకాలుగా నిర్వచించింది.

1. సాధారణ స్థితి నిరుద్యోగిత (Usual Status Unemployment):
        సర్వే సంవత్సరానికి సంబంధించి మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్నవారు.

2. వారం వారీ స్థితి (Weekly Status Unemployment):
        నిరుద్యోగం గురించి సర్వే జరిపే నాటికి 5 రోజుల్లో ఏ ఒక్క రోజూ పని దొరకనివారు.

3. రోజువారీ స్థితి నిరుద్యోగిత (Daily Status Unemployment):
      నిరుద్యోగులకు సంబంధించి సర్వే చేసిన 7 రోజుల్లో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాలు ఎన్ని ఉన్నాయో లెక్కించి, మొత్తం రోజుల్లో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాల నిష్పత్తిని రోజువారీ స్థితి నిరుద్యోగిత అంటారు.

ఉదా: 7 రోజులకు గాను 6 శ్రమదినాలు అనుకుంటే 4 రోజులు నిరుద్యోగిగా ఉంటే  అన్నమాట.

NSS  ప్రకారం భారత్‌లో నిరుద్యోగం రేటు 3.06% (2004-05). గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో అధిక నిరుద్యోగం ఉన్నట్లు పేర్కొంది. నిరుద్యోగ నిర్మూలనకు NREGP, FFWS, MFAL, SFDA లాంటి పథకాలున్నాయి.

పేదరికం, నిరుద్యోగం సమస్యతో పాటు ప్రాంతీయ, ఆదాయ అసమానతలు, ద్రవ్యోల్బణాలను కూడా దేశం ఎదుర్కొంటోంది.

నిర్మాణాత్మక వ్యవస్థ:
        భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణ పరంగా 2001 నాటికి ప్రాథమిక రంగంలో సుమారు 57% ప్రజలు, ద్వితీయ రంగంలో 18%, తృతీయ రంగంలో 25% ఆధారపడి ఉన్నారు.

GNP  లో 2007 నాటికి ప్రాథమిక రంగం వాటా 19% కు తగ్గింది. పారిశ్రామిక రంగం వాటా బివిశి లో 28% వరకు ఉంది. సేవల రంగం వాటా 52% వరకు పెరిగింది. సంస్కరణల ఫలితంగా సేవల రంగం ఆదాయాలు పెరిగాయి, వ్యవసాయ రంగం వృద్ధి రేటు తగ్గింది.

ఆర్థికాభివృద్ధిలో ప్రణాళికల పాత్ర:
       భారతదేశంలో ప్రణాళికల ఆవశ్యకతను గురించి (Planned Economy for India - 1934) గ్రంథంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, 'ప్రజా ప్రణాళిక' పేరుతో ఎం.ఎన్.రాయ్ , 'బొంబే ప్లాన్' పేరుతో ముంబై పారిశ్రామిక వేత్తలు,Gradhiplar  పేరుతో ఎస్.ఎం.ఎన్. అగర్వాల్ వివరించారు. 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడింది. దాని అధ్యక్షుడిగా ప్రధాని వ్యవహరిస్తారు. దేశంలో ఇప్పటి వరకు పది పంచవర్ష ప్రణాళికలు అమలయ్యాయి. ప్రస్తుతం 11వ ప్రణాళిక అమల్లో ఉంది.
0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again