పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 27, 2014

భారత జాతీయ స్వాతంత్య్రోద్యమం


¤ ప్రాచీన సంతతికి చెందిన మానవుల సముదాయాన్ని 'జాతి' అంటారు.

¤ భారతదేశంలో సాంఘిక, మత సంస్కరణోద్యమాలు ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చాయి.

¤ జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి.

పత్రికలు - సంపాదకులు
¤ అమృతబజార్ - శిశిర కుమార్ ఘోష్

¤ సంజీవని, బెంగాలీ - సురేంద్రనాథ్ బెనర్జీ

¤ ది హిందూ, స్వదేశీ - జి.సుబ్రహ్మణ్య అయ్యర్

¤ కేసరి, మరాఠా - బాలగంగాధర్ తిలక్

తొలి రాజకీయ సంఘాలు
¤ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ - 1851 - కలకత్తా

¤ బాంబే అసోసియేషన్ - 1852 - బొంబాయి

¤ పూనా సార్వజన సభ - 1870 - పూనా (గోవింద రనడె ముఖ్యుడు)

¤ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ - 1884 - మద్రాసు

¤ 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ కృషితో కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ ఏర్పడింది.

¤ 1884లో ఎం.వి.రాఘవాచారి, జి.సుబ్రహ్మణ్య అయ్యర్ మద్రాస్ మహాజనసభను ఏర్పాటు చేశారు.

¤ 1885లో ఫిరోజ్‌షా మెహతా, తెలంగ్ బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ను స్థాపించారు.

¤ 1883లో మొదటిసారిగా సురేంద్రనాథ్ బెనర్జీ కలకత్తాలో నేషనల్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు.

జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు
¤ ఎ.ఒ.హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కృషి చేశారు.

¤ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం 1885లో డిసెంబరు 28 నుంచి 31 వరకు బొంబాయిలో జరిగింది.

¤ ఈ సమావేశానికి డబ్ల్యు.సి.బెనర్జీ అధ్యక్షత వహించారు. 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

¤ ఈ సమావేశానికి హాజరైన తెలుగువాడు పి.ఆనందాచార్యులు.

రక్షణ కవాట సిద్ధాంతం
           విద్యావంతులైన భారతీయుల్లో పెరిగిపోతున్న అసమ్మతికి పరిష్కారంగా ఒక రక్షణ కవాటాన్ని లేదా సురక్షితమైన అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయడం ఎ.ఒ.హ్యూమ్ లక్ష్యం. చిన్నస్థాయి రాజకీయ ఉద్యమాన్ని ప్రోత్సహించడం ద్వారా భారీ రాజకీయ ఉద్యమ రూపాన్ని నివారించవచ్చని ఆయన భావించాడు.

స్వాతంత్య్రోద్యమ దశలు
భారత స్వాతంత్య్రోద్యమాన్ని స్థూలంగా మూడు దశలుగా విభజించారు.

ఎ) మితవాద జాతీయవాద దశ (1885 - 1905)

బి) అతివాద జాతీయవాద దశ (1905 - 1919)

సి) గాంధేయ దశ (1919 - 1947)

మితవాద జాతీయవాద దశ (1885 - 1905)
¤ మదన్‌మోహన్ మాలవ్య, గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ మొదలైనవారు ప్రముఖ మితవాద నాయకులు.

¤ మితవాదుల పద్ధతులు 'ప్రార్థన, అభ్యర్థన, నిరసన'.

¤ దాదాభాయ్ నౌరోజీ 'డ్రెయిన్ సిద్ధాంతాన్ని' ప్రతిపాదించాడు. ఇందులో బ్రిటిషర్లు భారతదేశ సంపదను తరలించుకుపోతున్న విధానాన్ని వివరించాడు.

¤ మితవాదులు 1906లో మహారాష్ట్రలో ఒక శక్తిమంతమైన స్వదేశీ ఉద్యమాన్ని నిర్వహించారు.

¤ 1897లో నూతన భారత శాసన సభల చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం అనధికార సభ్యుల సంఖ్యను పెంచింది

¤ ఆంగ్లేయులు కాంగ్రెస్ నాయకులను 'అవిధేయ బాబులు, రాజద్రోహులైన బ్రాహ్మణులు, హింసాయుత విలన్లు'గా పేర్కొన్నారు.

¤ 1887లో లార్డ్ డఫ్రిన్ ఒక బహిరంగ ప్రసంగంలో భారత జాతీయ కాంగ్రెస్‌ను 'మైక్రోస్కోపిక్ మైనారిటీ' ప్రతినిధిగా పేర్కొన్నాడు.

అతివాద జాతీయవాద దశ (1905 - 1919)
¤ లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్ ముఖ్యమైన అతివాద నాయకులు. వీరిలో మొదటి ముగ్గురూ లాల్, బాల్, పాల్‌గా ప్రసిద్ధులు.

అతివాదులను ప్రభావితం చేసిన ప్రపంచ సంఘటనలు
ఎ) 1896లో ఇథియోపియన్లు ఇటలీని ఓడించడం.

బి) 1905లో ఆసియాలో చిన్న దేశమైన జపాన్ ప్రపంచంలో పెద్దదైన రష్యాను ఓడించడం.

¤ 'స్వరాజ్యం లేదా స్వాతంత్య్ర సముపార్జన' అతివాదుల లక్ష్యం.

¤ బ్రిటిషర్లకు సహాయ నిరాకరణ, స్వదేశీ వస్తువుల స్వీకరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ వీరి పద్ధతులు

వందేమాతరం ఉద్యమం
¤ 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్‌ను విభజించినందుకు ప్రతిస్పందనగా వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. స్వదేశీ వస్తువుల స్వీకరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ లాంటి ఉద్యమాలు కూడా ఈ విభజన ఫలితమే.

¤ బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ పెద్ద రాష్ట్రం. దీన్ని విభజిస్తూ కర్జన్ 1905 జులై 20న ఉత్తర్వులు జారీ చేశాడు. తూర్పు బెంగాల్, అస్సాంను ఒక ప్రావిన్సు (రాష్ట్రం)గా; బీహార్, ఒరిస్సాను మరో ప్రావిన్స్‌గా ఏర్పాటు చేశారు. బెంగాల్‌లో ఎగసిపడుతున్న జాతీయవాదాన్ని అణిచివేయడమే కర్జన్ అసలు ఉద్దేశం.

¤ 1905 ఆగస్టు 7న విభజనకు వ్యతిరేకంగా అతివాదులు ఉద్యమాన్ని ప్రారంభించారు. జాతీయవాదులు 'వందేమాతరం' నినాదంతో ఉద్యమంలో పాల్గొన్నారు. వందేమాతరం నినాదం బంకించంద్ర ఛటర్జీ రాసిన 'మదర్ లాండ్‌'లోని ఒక గేయం.

¤ బెంగాల్ విభజన 1905 అక్టోబరు 16న అమల్లోకి వచ్చింది. ఆ రోజును జాతీయ నాయకులు 'జాతీయ సంతాప దినం'గా ప్రకటించారు. ఈ ఉద్యమం సమయంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు.

¤ ఈ ఉద్యమానికి అనుబంధంగా స్వదేశీ, బహిష్కరణ ఉద్యమాలు జరిగాయి. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం వీటి ముఖ్య లక్ష్యం.

¤ స్వదేశీ ఉద్యమం భారతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చింది. ఈ సమయంలోనే పి.సి.రాయ్ ప్రసిద్ధ 'బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్' ను ఏర్పాటు చేశాడు.

¤ ఆంధ్ర ప్రాంతంలో ఈ ఉద్యమానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వం వహించాడు.

¤ 1907లో లాలాలజపతిరాయ్, అజిత్‌సింగ్‌ను దేశం నుంచి బహిష్కరించారు. బాలగంగాధర తిలక్‌ను 1908లో ప్రభుత్వం నిర్బంధించింది.

¤ అప్పటి వైశ్రాయి మింటో ప్రోత్సాహంతో 1906లో 'ముస్లిం లీగ్' ఏర్పడింది. ముస్లిం లీగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి నమ్మకంగా ఉంటూ, మహమ్మదీయుల కోర్కెల సాధనకు కృషి చేసింది.

¤ 1909లో ఉద్యమకారులను సంతృప్తిపరిచేందుకు 'మింటో-మార్లే' సంస్కరణలను తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పడ్డాయి.

¤ 1911లో ఇంగ్లండ్ రాజు అయిదో జార్జ్ భారతదేశాన్ని సందర్శించి బెంగాల్ విభజనను రద్దు చేశాడు. అలాగే బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చుతున్నట్లు ప్రకటించాడు. దీంతో వందేమాతరం ఉద్యమం ముగిసింది.

విప్లవాత్మక ఉగ్రవాదం
¤ ప్రభుత్వపరమైన దమన నీతి, రాజకీయ పోరాట వైఫల్యంతో ఏర్పడిన నిరాశ ఫలితంగా విప్లవాత్మక ఉగ్రవాదం తలెత్తింది.

¤ 1907లో బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌పై హత్యా ప్రయత్నం జరిగింది. 1908 ఏప్రిల్‌లో ప్రపుల్లచకి, కుదిరామ్‌బోస్ న్యాయమూర్తి కింగ్స్‌ఫోర్డ్‌ను తీసుకెళుతున్న క్యారేజీపై బాంబు విసిరారు. కుదిరామ్‌బోస్‌పై విచారణ జరిపి ఉరి తీశారు.

హోమ్‌రూల్ ఉద్యమం
¤ హోమ్‌రూల్ ఉద్యమం 1916లో ప్రారంభమైంది.

¤ మొదటి ప్రపంచ యుద్ధ సమయం (1914 - 18)లో భారతీయులు బ్రిటిషర్లకు సహకరించారు. అయినప్పటికీ ఆంగ్లేయులపై ఉన్న సందేహంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.

¤ అనిబిసెంట్ ఐరిష్ మహిళ. దివ్యజ్ఞాన సమాజం కోసం కృషి చేయడానికి ఆమె 1893లో భారతదేశం వచ్చారు. 1916 సెప్టెంబరులో మద్రాస్‌లో 'హోమ్‌రూల్ లీగ్‌'ను ప్రారంభించింది. హోంరూల్ అంటే 'స్వపరిపాలన' అని అర్థం.


¤ మహారాష్ట్ర కేంద్ర ప్రావిన్సులో (పుణె) తిలక్ హోమ్‌రూల్ కార్యక్రమాలను నిర్వహించాడు. ఈ ఉద్యమ కాలంలో బాలగంగాధర తిలక్ 'స్వరాజ్యం నా జన్మ హక్కు' అని ఎలుగెత్తి చాటాడు.

¤ అనిబిసెంట్‌ను 1917 కలకత్తా సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.

జాతీయవాద ఉద్యమంపై బ్రిటిషర్ల ప్రతిస్పందన
¤ 1918లో బ్రిటిష్ ప్రభుత్వం మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను తీసుకొచ్చింది. ఇవి 1919లో భారత ప్రభుత్వ చట్టం రూపంలో అమల్లోకి వచ్చాయి.

¤ ఈ చట్టం ద్వారా ప్రావిన్సుల్లో 'ద్వంద్వ పాలన'ను ప్రకటించారు.

¤ ద్వంద్వ పాలనలో పరిపాలన అంశాలను 'రిజర్వ్‌డ్', 'బదిలీ' అనే రెండు వర్గాలుగా విభజిస్తారు. రిజర్వ్‌డ్ అంశాలైన విత్తం, శాంతి భద్రతలు గవర్నర్ ఆధీనంలో ఉంటాయి. విద్య, ప్రజారోగ్యం, స్థానిక స్వపరిపాలన లాంటి బదిలీ అంశాలు భారతీయ మంత్రుల ఆధీనంలో ఉంటాయి.

¤ మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ - 1919 చట్టం ప్రకారం కేంద్రంలో 'ద్విసభ విధానాన్ని' (ఎగువసభ, దిగువసభ) ప్రవేశపెట్టారు.

¤ 1916లో కాంగ్రెస్ పార్టీ, ముస్లింలీగ్ స్వపరిపాలన సాధించే వరకు ఉమ్మడిగా పోరాడతామని 'లక్నో ఒడంబడిక'పై సంతకాలు చేశాయి.

గాంధీ యుగం
¤ మహాత్మాగాంధీ గుజరాత్‌లోని పోరుబందర్‌లో 1869 అక్టోబరు 2న జన్మించారు. ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రం అభ్యసించి ప్రాక్టీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లారు.¤ 1893 - 1914 మధ్య దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై పోరాటం చేసి కొన్ని విజయాలు సాధించాడు. ఆయన 'సత్యాగ్రహం'ను ఆయుధంగా ఎంచుకున్నాడు.

¤ గాంధీజీ 46 ఏళ్ల వయసులో 1915లో భారతదేశానికి తిరిగివచ్చాడు. 1916లో అహ్మదాబాద్‌లో 'సబర్మతి' ఆశ్రమాన్ని స్థాపించారు.

¤ 1917లో బీహార్‌లోని 'చంపారన్' జిల్లాలో నీలిమందు రైతుల కోసం జరిపిన పోరాటంతో గాంధీజీ రాజకీయ జీవితం ప్రారంభమైంది.

¤ చంపారన్‌లోని నీలి మందు రైతులు 'తీన్ కతియా' అనే పద్ధతికి కట్టుబడి ఉండేవారు. ఈ పద్ధతిలో రైతులు పండించిన నీలిమందు పంటను ఫ్రెంచ్, బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన ధరకు, వారికే అమ్మాలి.

¤ 1917లో గాంధీజీ జరిపిన పోరాటం వల్ల ప్రభుత్వం ఈ 'తీన్ కతియా' పద్ధతిని రద్దు చేసింది.

¤ 1918లో కైరా జిల్లాలో రెవెన్యూ అధికారుల తీరుపై సత్యాగ్రహం చేసి విజయం సాధించారు. పంటలు పండకపోయినప్పటికీ పన్నులు చెల్లించమని రైతులను అధికారులు వేధించేవారు. గాంధీజీ వీరి బారి నుంచి రైతులను కాపాడారు.

¤ 1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల వేతనాల పెంపు కోసం గాంధీజీ సత్యాగ్రహం చేశారు. 35% వేతనాలు పెరిగేలా కృషి చేశాడు.

రౌలత్ చట్టం (1919)
¤ విప్లవ కార్యక్రమాలను అరికట్టడానికి ముందు జాగ్రత్తగా ప్రభుత్వం 1919లో 'రౌలత్ చట్టం' చేసింది.

¤ ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులను ఎక్కడైనా, ఎప్పుడైనా కారణం చెప్పకుండా నిర్బంధంలోకి తీసుకోవచ్చు. విచారణ చేయకుండానే ఎంత కాలమైనా జైలులో ఉంచవచ్చు.

¤ అణిచివేత చర్యలకు ఆస్కారమిచ్చిన ఈ చట్టాన్ని భారతీయులు 'నల్ల చట్టం'గా అభివర్ణించారు. దీన్ని ఖండిస్తూ 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా 'జాతిని అవమానించిన దినం' గా పేర్కొంటూ నిరసన తెలపడానికి గాంధీజీ పిలుపునిచ్చారు.

జలియన్‌వాలాబాగ్ దురంతం (1919)
¤ పంజాబ్‌లో డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అనే ప్రముఖ నాయకుల అరెస్టుకు నిరసన తెలిపేందుకు అమృత్‌సర్‌లోని 'జలియన్‌వాలాబాగ్' అనే తోటలో ప్రజలు సమావేశమయ్యారు.


¤ సైనిక కమాండర్ జనరల్ ఒ.డయ్యర్ (అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఒ.డయ్యర్) వారిపై కాల్పులు జరపగా దాదాపు 1000 మంది అక్కడికక్కడే మరణించారు. కొన్ని వేలమంది గాయపడ్డారు.

ఖిలాఫత్ ఉద్యమం
¤ టర్కీ సుల్తాన్‌ను 'ప్రపంచ ఇస్లాం మతాధికారి'గా గుర్తించారు. అతడిని 'ఖలీఫా' అని పిలిచేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోవడంతో మిత్రపక్షాలు ఖలీఫా పదవిని రద్దు చేశాయి. ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలని మహమ్మదీయులంతా ఉద్యమం లేవదీశారు. దీన్నే 'ఖిలాఫత్ ఉద్యమం' అంటారు.

¤ గాంధీజీ కూడా ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరిచారు. 1920 అక్టోబరు 17న అఖిల భారత ఖిలాఫత్ సమావేశం జరిపి, ప్రతి సంవత్సరం అక్టోబరు 17ను 'ఆల్ ఇండియా ఖిలాఫత్ డే'గా నిర్వహించాలని నిర్ణయించారు.

సహాయ నిరాకరణోద్యమం (1920 - 22)
            ప్రభుత్వ పన్నులు చెల్లించడానికి నిరాకరించడం, బ్రిటిషర్లు ఇచ్చిన బిరుదులను త్యజించడం, బ్రిటిష్ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలను బహిష్కరించడం, ఉద్యోగాలకు రాజీనామాలు చేయడం సహాయ నిరాకరణ ఉద్యమంలోని ముఖ్య కార్యక్రమాలు.

¤ బ్రిటిషర్లు తనకిచ్చిన 'కైజర్ - ఎ - హింద్' బిరుదును గాంధీజీ త్యజించారు. ఈ ఉద్యమానికి ఆర్థికంగా సహాయపడేందుకు తిలక్ 'స్వరాజ్య నిధి'ని ప్రారంభించి, 6 నెలల్లో కోటి రూపాయల చందా వసూలు చేశాడు.

¤ దేశంలో అనేక ప్రాంతాల్లో పన్నుల నిరాకరణ ఉద్యమాలను నిర్వహించారు. బెంగాల్‌లోని మిడ్నాపూర్, గుంటూరు జిల్లా పెదనందిపాడు, చీరాల-పేరాల, పల్నాడు ప్రాంతాల్లో రైతులు పన్నుల చెల్లింపులను తిరస్కరించారు.

¤ మలబార్ (కేరళ) మోప్లా రైతులు శక్తిమంతమైన జమిందారీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ అవధ్ ప్రాంతంలో కిసాన్ ఉద్యమం మొదలైంది.

¤ అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని నడపాలని గాంధీ ప్రజలకు సూచించారు. 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని 'చౌరీ చౌరా' అనే గ్రామంలో రైతులు శాంతియుతంగా ఊరేగింపు నిర్వహించారు. వీరిపై పోలీసులు కాల్పులు జరిపారు. కోపోద్రిక్తులైన ఉద్యమకారులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 22 మంది పోలీసులను చంపేశారు. దీంతో కలత చెందిన గాంధీజీ ఉద్యమాన్ని నిలిపివేశారు.

¤ 1922 డిసెంబరులో సి.ఆర్.దాస్, మోతీలాల్ నెహ్రూ 'కాంగ్రెస్ ఖిలాపత్ స్వరాజ్ పార్టీ'ని స్థాపించారు. దీనికి సి.ఆర్.దాస్ అధ్యక్షుడిగా, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

విప్లవాత్మక ఉగ్రవాదం
           సహాయ నిరాకరణోద్యమ వైఫల్యం ఉగ్రవాద ఉద్యమ పునరుద్ధరణకు దారితీసింది. 1924లో సాయుధ తిరుగుబాటు చేయడానికి 'హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్' అనే సంస్థ ఏర్పడింది. సచిన్ సన్యాల్, జోగేష్ ఛటర్జీ దీనిలో ముఖ్యులు.

¤ 1928లో 'హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ' అనే సంస్థ ఏర్పడింది. దీనిలో చంద్రశేఖర ఆజాద్, భగత్‌సింగ్ ముఖ్యులు.

¤ సైమన్ కమిషన్ లాహోర్ పర్యటనకు వచ్చినప్పుడు పౌరులు నిరసన తెలియజేశారు. ఆ కార్యక్రమంలో జరిపిన లాఠీఛార్జిలో లాలా లజపతిరాయ్ మరణించాడు. ఈ సంఘటనకు కారకుడైన 'సాండర్స్' ను భగత్‌సింగ్ 1928 డిసెంబరులో హత్య చేశాడు. చరిత్రలో ఇది 'లాహోర్ కుట్రకేసు'గా స్థానం పొందింది.

¤ 1929 ఏప్రిల్ 8న భగత్‌సింగ్, బతుకేశ్వర్‌దత్ న్యూఢిల్లీలోని అసెంబ్లీపై రెండు బాంబులు విసిరి, రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. భగత్‌సింగ్ తన అనుచరుడితో సహా పారిపోకుండా 'విప్లవం వర్ధిల్లాలి (ఇంక్విలాబ్ జిందాబాద్)' అని నినాదాలు చేస్తూ స్వచ్ఛందంగా అరెస్టయ్యాడు. 1931 మార్చి 23న భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురును ఉరితీశారు.

సైమన్ కమిషన్
           1919 మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల పనితీరును పరిశీలించి, సూచనలు ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1927లో 'సర్ జాన్ సైమన్' అనే ఆంగ్లేయుడి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దీన్నే 'సైమన్ కమిషన్' అంటారు. భారతీయులకు దీనిలో స్థానం కల్పించకపోవడం వల్ల వారు దీన్ని బహిష్కరించారు.

¤ 1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ బొంబాయిలో ప్రవేశించగానే దేశమంతటా హర్తాళ్లు జరిగాయి. ప్రజలు 'సైమన్ గో బ్యాక్' అనే నినాదాలు చేశారు.

¤ 1929లో భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య సాధన తమ లక్ష్యమని ప్రకటించింది.

¤ 1930 జనవరి 26న 'స్వాతంత్య్ర దినోత్సవం'గా జరుపుకున్నారు.

శాసనోల్లంఘన ఉద్యమం
¤ దీన్నే 'దండి సత్యాగ్రహం' లేదా 'ఉప్పు సత్యాగ్రహం' అంటారు.

¤ 1930 మార్చి 12న గాంధీజీ దండి యాత్రను ప్రారంభించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో కలిసి బయలుదేరారు. 200 మైళ్లు పాదయాత్ర చేసి 1930 ఏప్రిల్ 6న పశ్చిమ తీరాన ఉన్న 'దండి' గ్రామానికి చేరుకున్నారు. ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించి సముద్ర నీటితో ఉప్పు తయారుచేశారు. 

రౌండ్‌టేబుల్ సమావేశాలు (అఖిలపక్ష సమావేశాలు)
¤ 'సైమన్ కమిషన్ నివేదిక'పై జాతీయ నాయకులతో చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1930 నవంబరులో లండన్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

¤ భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) దీన్ని బహిష్కరించి, సమావేశానికి హాజరుకాలేదు.

¤ 1931లో గాంధీ - ఇర్విన్ ఒప్పందం జరిగిన తర్వాత గాంధీజీ రెండో అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.

¤ రెండో అఖిలపక్ష సమావేశం 1931 సెప్టెంబరులో లండన్‌లో జరిగింది.

¤ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ ప్రధాని మెక్‌డొనాల్డ్ ప్రకటించిన 'కమ్యూనల్ అవార్డు' కారణంగా ఈ సమావేశం విఫలమైంది.

¤ కులప్రాతిపదికపై ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనే 'కమ్యూనల్ అవార్డ్'. దీన్ని గాంధీజీ తిరస్కరించడంతో సమావేశం సఫలం కాలేదు.

¤ కమ్యూనల్ అవార్డుకు అనుకూలంగా ఉన్న అంబేద్కర్‌తో గాంధీజీ 'పూనా ఒడంబడిక' చేసుకున్నారు.

¤ మూడో అఖిలపక్ష సమావేశం 1932 నవంబరు 17న జరిగింది. దీన్ని కూడా కాంగ్రెస్ బహిష్కరించింది.

స్వాతంత్య్రోద్యమం - మతతత్వాలు
¤ 1906లో బ్రిటిషర్ల 'విభజించి పాలించు' విధానాన్ని అనుసరించి ముస్లీంలీగ్ ఏర్పడింది.

¤ 1915లో హిందూ మహాసభ ఏర్పడింది.

¤ 1932లో సిక్కులకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పడ్డాయి.

¤ 1924లో గాంధీజీ 21 రోజులు ఉపవాస దీక్ష చేసి హిందూ - ముస్లిం ఐకత్యకు కృషి చేశారు.

వెనుకబడిన వర్గాల ఉద్యమాలు
¤ అస్పృశ్యత నివారణకు గాంధీజీ 'అస్పృశ్యత నివారణ సంఘం'ను ఏర్పాటు చేశారు.

¤ అంటరానివారిని గాంధీజీ 'హరిజనులు' అని పిలిచారు.

¤ గాంధీజీ 'హరిజన్' అనే పత్రికను నడిపారు.

¤ ఈ ఉద్యమ నాయకుల్లో అంబేద్కర్ ముఖ్యుడు.

¤ 1934లో జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో 'కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ' ఏర్పడింది.

స్వదేశీ సంస్థానాల్లో స్వాతంత్య్రోద్యమాలు
¤ బ్రిటిషర్లు స్వయంగా పరిపాలిస్తున్న భారత భూభాగాలను 'బ్రిటిష్ ఇండియా' అని పిలిచేవారు. మిగిలిన భారతదేశం 562 చిన్న స్వదేశీ సంస్థానాలుగా ఉండేది. వీటిని స్వదేశీ రాజులు పరిపాలించేవారు.

¤ 1927లో ఈ సంస్థానాల్లో ఉన్న పోరాట సంఘాలన్నీ కలిసి 'ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్' అనే అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేశాయి. బల్వంతరాయ్ మెహతాను దీనికి కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 1939లో నెహ్రూ దీనికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

భారత ప్రభుత్వ చట్టం - 1935
¤ ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు 'స్వయం ప్రతిపత్తి' కల్పించారు.

¤ రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ప్రవేశపెట్టారు.

¤ 1937లో ఎన్నికలు జరిగాయి.

¤ 'బేసిక్ విద్య' విధానాన్ని గాంధీజీ రూపొందించారు.

రెండో ప్రపంచ యుద్ధం - భారతదేశం
¤ 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.

¤ 1940 ఆగస్టులో లార్డ్ లిన్‌లిత్‌గో 'ఆగస్టు ప్రతిపాదన' చేశాడు.

¤ ఆగస్టు ప్రతిపాదన ప్రకారం రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిషర్లకు సహకరిస్తే యుద్ధం ముగిసిన వెంటనే స్వాతంత్య్రం ఇస్తారు. దీన్ని కాంగ్రెస్ తిరస్కరించింది.

¤ 1940 అక్టోబరులో కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత సత్యాగ్రహాలు చేపట్టారు.

¤ వ్యక్తి సత్యాగ్రహం చేసినవారిలో ప్రథముడు వినోబాభావే.

¤ 1942లో బ్రిటిష్ ప్రభుత్వం 'సర్ స్టాఫర్డ్ క్రిప్స్' అనే మంత్రితో జాతీయ కాంగ్రెస్‌కు రాయభారం పంపింది. యుద్ధంలో భారతీయుల సహాయాన్ని కోరడం దీని సారాంశం.

క్విట్ ఇండియా ఉద్యమం
¤ క్రిప్స్ రాయభారం విఫలమైన తర్వాత కాంగ్రెస్ 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది.

¤ ఈ సందర్భంగా గాంధీజీ 'డు ఆర్ డై' (సాధించు లేదా మరణించు) అనే నినాదాన్ని ఇచ్చారు.

ముస్లిం లీగ్
¤ ముస్లిం లీగ్ 1906లో ఏర్పాటైంది.

¤ ఇది 1940 నుంచి ప్రత్యేక పాకిస్థాన్ కోసం డిమాండ్ చేయడం ప్రారంభించింది.

¤ లార్డ్ వేవెల్ వైశ్రాయిగా ఉన్నప్పుడు 1945లో 'సిమ్లా సమావేశం' జరిగింది. వైశ్రాయి కార్యనిర్వాహక మండలిలోని ముస్లిం సభ్యులందరినీ ముస్లింలీగ్ మాత్రమే నామినేట్ చేస్తుందని జిన్నా పట్టుపట్టాడు. దీంతో ఈ సమావేశం విఫలమైంది.

భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ)
¤ ఐఎన్ఏను 'ఆజాద్ హింద్‌ఫౌజ్' అంటారు.

¤ భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ)ను ఏర్పాటు చేసినవారు మోహన్‌సింగ్.

¤ 1943లో సుభాష్ చంద్రబోస్ చేరికతో ఇది బలమైన వ్యవస్థగా రూపుదిద్దుకుంది.

¤ సుభాష్ చంద్రబోస్ 1943 అక్టోబరు 21న సింగపూర్‌లో భారతదేశపు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు.

¤ 1946లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా భారత నౌకాదళం తిరుగుబాటు చేసింది.

¤ 1946లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి క్యాబినెట్ మిషన్‌ను పంపింది. దీనిలో పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్ సభ్యులు.

¤ ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్థాన్ కోసం పట్టుబట్టి 1946 ఆగస్టు 16 ను 'ప్రత్యక్ష చర్యా దినం' గా ప్రకటించింది.

¤ భారతదేశ విభజనకు ప్రణాళిక రూపొందించినవారు లార్డ్ మౌంట్ బాటన్.

¤ 1956లో ఫ్రెంచివారు శాంతియుతంగా 'పుదుచ్చేరి'ని భారతదేశానికి అప్పగించారు. 1961లో భారత సైన్యం పోర్చుగీసువారి నుంచి 'గోవా'ను ఆక్రమించుకుంది.

¤ భారతదేశానికి మొదట వచ్చిన యూరోపియన్లు, చివరిగా వెళ్లిన యూరోపియన్లు పోర్చుగీసువారే. 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again