పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 22, 2014

ప్రణాళికలు- విజయాలు, అపజయాలు


                 దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం 1950లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటుచేసింది. దీనిద్వారా ప్రతి అయిదేళ్లకు ఆర్థిక ప్రణాళికలను అమలు చేస్తుంది. మొదటి పంచవర్ష ప్రణాళికను 1951 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటుచేయటంలో ప్రధాన ఉద్దేశాలు- వనరుల క్రమబద్ధీకరణ, ఉత్తత్తి సాధనాలు ఒకేచోట పోగుపడకుండా జాగ్రత్త వహించడం.

ఆర్థిక ప్రణాళిక-నిర్వచనం: 
                 నిర్దిష్ట కాలపరిమితిలో పెట్టుకున్న లక్ష్యాలను సాధించేందుకు హేతుబద్ధంగా కేంద్రీకృత ఆర్థిక నిర్ణయాధికారం ద్వారా సమన్వయం చేసే యంత్రాంగ వ్యూహాలను ఆర్థిక ప్రణాళిక అంటారు.

ప్రణాళిక లక్ష్యాలు:
           1) సాధారణ ప్రణాళిక లక్ష్యాలు
           2) నిర్దిష్ట ప్రణాళిక లక్ష్యాలు

1. సాధారణ ప్రణాళిక లక్ష్యాలు: 
                 సాధారణ ప్రణాళిక లక్ష్యాల్లో అన్ని రంగాల అభివృద్ధి ఉంటుంది. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా, వాణిజ్య రంగాల అభివృద్ధికి ప్రణాళికా కేటాయింపులు జరుగుతాయి.

¤ దేశంలో జాతీయాదాయాన్ని పెంపొందించి, జీవన ప్రమాణాలు మెరుగుపరచడం. 

¤ మౌలిక, భారీ ప్రరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చి పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం.

¤ ఆదాయ, సంపదల మధ్య అసమానతలు తగ్గించి న్యాయబద్ధంగా పంపిణీ చేయడం.

¤ ఉపాధి అవకాశాల వికాసం, విస్తరణలు. 

                 ఒక దేశ ఆర్థిక పరిస్థితికి, నవసమాజ స్థాపనకు ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, పెట్టుబడులు మూలాంశాలు అని భారత రాజ్యాంగంలోని నిర్దేశిక సూత్రాలు నిర్వచించాయి. ఇవి ప్రైవేటు వ్యవస్ధాపకుల గుప్పిట్లో కాకుండా ప్రజలందరికి అందుబాటులో ఉండాలని సూచించాయి.

                 భారత ప్రభుత్వం తన లక్ష్యాలను పంచవర్ష ప్రణాళికల ద్వారా నెరవేరుస్తోంది. ప్రస్తుతం మనం 11వ పంచవర్ష ప్రణాళికలో ఉన్నాం.



నిర్దిష్ట ప్రణాళిక - లక్ష్యాలు:
1) ప్రథమ పంచవర్ష ప్రణాళిక(1951-56): వ్యవసాయం, ఆహారంలో స్వయంసమృద్ధి.

2) రెండో ప్రణాళిక (1956-61): పరిశ్రమలు

3) మూడో ప్రణాళిక (1961-66): స్వయంసమృద్ధి సాధన

4) నాలుగో ప్రణాళిక (1969-74): పేదరిక నిర్మూలన, న్యాయసమ్మతమైన ఆర్థికాభివృద్ధి

5) అయిదో ప్రణాళిక (1974-78): పేదరిక నిర్మూలన, స్వయంసమృద్ధి

6) ఆరో ప్రణాళిక (1980-85): పేదరిక నిర్మూలన, స్వయంసమృద్ధి

7) ఏడో ప్రణాళిక (1985-90): ఆహారోత్పత్తి, ఉపాధికల్పన, ఉత్పాదకత 

8) ఎనిమిదో ప్రణాళిక (1992-97): ఎ) ఉపాధికల్పన బి) జనాభా నియంత్రణ సి) సార్వత్రిక విద్య డి) తాగునీరు ఈ) అవస్థాపనారంగాలు

9) తొమ్మిదో ప్రణాళిక (1997-2002): 7శాతం పెరుగుదల రేటు సాధించడం లక్ష్యంగా పెట్టుకోవడం

10) పదో ప్రణాళిక (2002-2007): ప్రైవేటు రంగాలను ప్రోత్సహించుట, అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం

11) పదకొండో ప్రణాళిక (2007-2012): వ్యవసాయ, సామాజిక రంగాల సమ్మిళిత సత్వర అభివృద్ధి, 10శాతం వృద్ధిరేటు సాధించుట

                 మూడో ప్రణాళిక కాలం (1961-1966)లో 1962లో చైనా, 1965లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధాలు చేయడంతో ద్రవ్యవనరుల కేటాయింపులు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో వెంటనే పంచవర్ష ప్రణాళికలను అమలు జరిపే సమయం లేకపోయింది. ఫలితంగా 1966-67, 1967-1968, 1968-69లో మూడు వార్షిక ప్రణాళికలు అమలుచేశారు. ఆ తరవాత 1990-1991, 1991-1992లో రెండు వార్షిక ప్రణాళికలు అమలయ్యాయి.

ప్రణాళికలు- వ్యవసాయ రంగం: 
                 మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి విశేష ప్రాధాన్యత కల్పించింది. ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే. తక్కువ సమయంలో ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

¤ మూడో ప్రణాళికా కాలంలో ఎగుమతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయోత్పత్తులను పెంచేందుకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని తలచారు. 

¤ ఏడో ప్రణాళిక కాలంలో రూ.39వేల 770 కోట్లను వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు కేటాయించారు.

¤ 1990 నాటికి ఆహారధాన్యాల ఉత్పత్తి ఏడు మిలియన్ టన్నులకు చేరింది.

¤ వ్యవసాయ రంగ సాలీనా ఉత్పత్తి 4.5శాతం వరకు ఉంది. తేయాకు, పొగాకు, చెరకు, నూనెగింజలు, గోధుమ, వరి దిగుబడులు పెరిగాయి. భూ సంస్కరణలు అమలుచేయడం వల్ల మిగులుభూముల పంపిణీ కొంతమేర జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ పెరిగింది. నూతన వ్యవసాయక వ్యూహం, హరిత విప్లవం, సాంద్ర వ్యవసాయ పథకాలు అమల్లోకి వచ్చాయి.

ప్రణాళికలు- విజయాలు- అపజయాలు
ప్రధాన విజయాలు:-
1. నికర దేశీయ ఉత్పత్తి:- 1950-51 నుంచి 1987-88 మధ్యకాలంలో నికర దేశీయ ఉత్పత్తి సగటున సాలీనా 3.6శాతం పెరిగింది. 1985-86 వరకు ఏటా 5.3 శాతం పెరిగింది.

2. వ్యవసాయ రంగాభివృద్ధి:- వ్యవసాయ రంగంలో సాలీనా ఉత్పత్తి 4.5శాతం వరకు ఉంది. హరిత విప్లవం, సాంద్ర వ్యవసాయ పథకాలు అమలయ్యాయి.
పారిశ్రామికాభివృద్ధి:- దేశంలో అనేక పరిశ్రమలు నెలకొల్పారు. మౌలిక ఉత్పాదక, వస్తు పరిశ్రమల్లో ప్రత్యే కంగా....భారీ యంత్రాలు, విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి, టెలివిజన్లు, వార్తా ప్రసార సాధనాలు మొదలైన వాటిలో స్వయంసమృద్ధి సాధించారు. ఇనుము, ఉక్కు, నూనెశుద్ధి కర్మాగారాలు, ఎరువులు, సిమెంటు, పత్తి, పంచదార, కాగితం తదితర కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. 

ఇతర విజయాలు:-
1) అవస్థాపనా సౌకర్యాలు ప్రత్యేకించి రవాణా, నీటిపారుదల, దూర ప్రసార విభాగాలు బాగా అందుబాటులోకి వచ్చాయి.

2) విద్యా, సాంకేతిక రంగాల్లో శిక్షణ పొందిన వారు పెరిగారు.

3) గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో గృహనిర్మాణ పథకాలు అమలయ్యాయి.

4) బడుగు వర్గాల సంక్షేమ పథకాలు పంచవర్ష ప్రణాళికల కాలంలో అమలు చేశారు.

5) ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కృషి జరిగింది.

అపజయాలు:-
1) పేదరికం, నిరుద్యోగ సమస్యలు తగ్గలేదు.

2) సంపద, ఆదాయ అసమానతల్లో మార్పులేదు.

3) దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు బాగా పెరిగారు.

4) విదేశీ రుణభారం ఎక్కువైంది. 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again