పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 25, 2014

భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు లక్షణాలు


                వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల గురించి మనం వింటూ ఉంటాం. ఆయా దేశాల ఆర్థిక పరిస్థితు (ఆర్థిక వ్యవస్థ)లను బట్టే ఇలా పిలుస్తాం. భారతదేశం వివిధ రంగాల్లో ముందంజలో ఉన్నా, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. దీనికి ప్రధాన కారణం స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలనలో ఉన్న మన ఆర్థిక పరిస్థితులు. బ్రిటిషర్లు మనదేశానికి వర్తకానికి వచ్చి, మనల్ని పరిపాలించారు. ఇక్కడ ఉన్న సంపద, వనరులను వారి దేశానికి తరలించారు. మరోవైపు భౌగోళిక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, దేశంలోని ఆచారాలు, మూఢ నమ్మకాలు, భూస్వామ్య వ్యవస్థ.. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావాన్ని చూపాయి, చూపుతున్నాయి.



                మనదేశ ఆర్థిక వ్యవస్థ వివిధ రకాల పరిస్థితులపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా స్వాతంత్య్రానికి పూర్వం ఇక్కడి వాతావరణ పరిస్థితులు, భూస్వామ్య విధానాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 

                బ్రిటిషర్లు రాక ముందు మనదేశం ఎంతో సస్యశ్యామలంగా, సిరిసంపదలతో తులతూగుతూ ఉండేది. గ్రామాలు స్వయం ఉపాధికాలుగా, గణతంత్ర రాజ్యాలుగా ఉండేవి. ప్రజలు వ్యవసాయదారులు, వృత్తి పనివాళ్లు, దాసులు అని మూడు వర్గాలుగా ఉండేవారు. వీరంతా కలసికట్టుగా, పరస్పరం సహాయం చేసుకుంటూ ఉండేవారు. పండించిన పంటల్లో తమకు సరిపోగా మిగిలినదాన్ని విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఉదా: పట్టు, ఉన్ని వస్త్రాలు; దారుశిలా శిల్పాలు; కంచు, రాగి పాత్రలు; నగలు మొదలైనవి;

సుగంధ ద్రవ్యాల్లో యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, కుంకుమ పువ్వు మొదలైనవి. రంగులను తేలిగ్గా గుర్తించడానికి ఉపయోగించే నీలి, ఊదా వంటి సాంద్రకాలు, ఔషధాల్లో తియ్యదనం కోసం కలిపే నల్లమందు, ముసాంబరం లేదా అతిమధురం మొదలైనవి భారత వర్తకంలో ప్రధాన పాత్ర వహించాయి. వీటి ద్వారా లభించిన ఆదాయాన్ని గ్రామీణ అవసరాలు తీర్చడానికి ఉపయోగించేవారు. 

 17, 18 శతాబ్దాల్లో భారతదేశపు వస్తువుల కొనుగోలుదారుల్లో యూరప్ దేశాలు ముఖ్యమైనవి.

భారతదేశానికి బ్రిటిషర్ల రాక
            భారత్‌లో వ్యాపారం చేయడానికి అనేక దేశాల నుంచి వ్యాపారులు వచ్చేవారు. అలాగే బ్రిటిషర్లు కూడా మొదట మనదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చి, ఇక్కడ తమ సామ్రాజ్యాన్ని స్థాపించి, రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నారు. మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార కూటమిగానే ఉండేది. 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం భారతదేశంలో బ్రిటిష్ పాలన మొదలైంది.

 పారిశ్రామిక విప్లవం: వస్తువులను పరిశ్రమల్లో యంత్రాల సహాయంతో ఉత్పత్తి చేయడం, వస్తువుల ఉత్పత్తిలో ఇలాంటి సంచలనాత్మక మార్పును పారిశ్రామిక విప్లవం అంటారు. ఇంగ్లండ్‌లో 1780-1820 మధ్యకాలంలో పారిశ్రామిక విప్లవం జరిగింది. ఇదే సమయంలో బ్రిటిషర్లు వివిధ దేశాల్లో వలసలను ఏర్పరిచారు. దీంతో అనేక రంగాల్లో తీవ్రమైన మార్పులు సంభవించాయి. 
(ఉదా: వస్తువుల ఉత్పత్తి, వ్యవసాయ రంగంలో పశుపాలన, రవాణా మొదలైనవి).

           ఈ విప్లవం వల్ల యంత్రాల ద్వారా తయారైన వస్తువులకు డిమాండు పెరిగింది. ఈ వస్తువులను ఉత్పత్తి చేయడానికి కావలసిన ముడి సరుకులు, వనరులు వలస ప్రాంతాలైన భారత్‌లాంటి దేశాల్లో చవగ్గా లభించేవి. 

           ఇలా భారత ఆర్థిక వనరులను, వస్తు సంపదను, ప్రాకృతిక ఆవాసాన్ని (నేచురల్ హాబిటేట్) బ్రిటిష్ పాలకులు నిరంతరాయంగా దోచుకున్నారు. అందుకే భారతదేశ స్థూల జాతీయాదాయానికి, జాతీయ సంపదకు శాశ్వత నష్టం వాటిల్లింది. 

           డి.ఆర్.గాడ్గిల్ ఈ దోపిడిని 'ఆర్థిక పీల్చివేత' (ఎకనమికల్ డ్రైన్)గా, దాదాబాయ్ నౌరోజీ 'ఆర్థిక సంపదను కొల్లగొట్టడం' (ఎకనమికల్ ప్లండర్)గా వర్ణించారు.

               స్వాతంత్య్రానంతరం మనదేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి ప్రభుత్వం వివిధ రకాల పథకాలను, పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తోంది. ప్రజల జీవనస్థాయిని, తలసరి ఆదాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

వ్యవస్థీకృత - అవ్యవస్థీకృత రంగాలు
               ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని కొనసాగించడానికి ఏదో ఒక పని లేదా ఉద్యోగం చేయడం తప్పనిసరి. మనదేశంలో ప్రజలు వివిధ రకాల వృత్తిపనులు చేస్తారు. కర్షకులు, కార్మికులు, రోజువారీ కూలీలు ఇక్కడ ఉన్నారు. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలున్నాయి.

1. వ్యవస్థీకృత రంగం:   ఒక నిర్వచనీయమైన    పద్ధతిలో,    ఉత్పత్తి,       ఉపాధి కల్పనలున్న   భారీ పరిశ్రమలు, 

వ్యవసాయ రంగాలను వ్యవస్థీకృత రంగం అంటారు. ఈ రంగంలో ఉత్పత్తి భారీ మొత్తంలో జరుగుతుంది. పెట్టుబడులే కాకుండా, కార్మికుల వేతన రేటు కూడా అధికం. ఉదా: వాహనాలు, రసాయనాలు, యంత్ర పరికరాలు, ఇంజినీరింగ్ వస్తువులు, వస్త్రాలు, టీవీ, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమలు.

 2. అవ్యవస్థీకృత రంగం: చిన్నతరహా, కుటీర పరిశ్రమల్లో ఒక నిర్ణీత పద్ధతి, ఉద్యోగ విధానం లేకపోవడంతో ఆయా వ్యవస్థలను అవ్యవస్థీకృత రంగంగా పరిగణిస్తారు. మనం ఈ పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తాం. ఉదా: చేతి పనులు; వృత్తి కళాకారుల వృత్తులు; ఖాదీ, గ్రామీణ పరిశ్రమలైన చేనేత; బీడీల తయారీ; చేతి కాగితం. ప్రస్తుతం మనం చూస్తున్న స్వగృహ ఫుడ్స్ మొదలైనవి.

 వర్షాధారం: మనదేశ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ రంగం ప్రధానంగా వర్షపు నీటిపై ఆధారపడి ఉంది. మొత్తం పంట భూమిలో కొంత భాగాన్ని మాత్రమే కాలువలు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరుల ద్వారా సాగు చేస్తారు. మిగిలిన సాగు భూమంతా వర్షపు నీటిపైనే ఆధారపడి ఉంది. 

అందుకే మనదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో వర్షాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. రుతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి.

మనదేశంలో వ్యవసాయరంగం నైరుతి రుతుపవనాల వల్ల సంభవించే వర్షంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ రుతుపవనాలు జూన్-సెప్టెంబర్ మాసాల మధ్య వీస్తాయి. కొన్నిసార్లు ఇవి ముందుగా లేదా ఆలస్యంగా వస్తాయి. దీంతో రైతులకు కొంత నష్టం వాటిల్లుతుంది. రుతుపవనాలు సరైన సమయంలో వీచి వర్షాలు బాగా పడితే ఆ సంవత్సరాన్ని మంచి సంవత్సరం అని; వర్షాలు పడక, పంటలు పండకపోతే దాన్ని చెడ్డ సంవత్సరం అని అంటారు.

               దేశమంతటా వర్షపాతం ఒకేలా ఉండదు. (ఉదా: ఒక్కోసారి సికింద్రాబాద్‌లో వర్షం కురిస్తే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురవదు) ఇలా చాలా దగ్గరగా ఉన్న ప్రదేశాల్లోనే వర్షపాతంలో తేడాలుంటే మొత్తం దేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి? దీనికి కారణం మనదేశంలోని విభిన్న ఉష్ణదేశ పరిస్థితులు, వాతావరణ వ్యత్యాసాలు, నేలలో ఉండే భేదాలు (ఇసుక, రేగడి, చిత్తడి, రాతి మొదలైనవి). అందుకే రైతులు ఏ కాలంలో ఏ పంటలు పండించాలో ప్రణౄళిక సిద్ధం చేసుకుంటారు. ఖరీఫ్, రబీ, వేసవి అనే మూడు ప్రధానమైన పంటలు పండించే కాలాలున్నాయి. వరి, జొన్న, మొక్కజొన్న మొదలైనవి ఖరీఫ్ కాలంలో పండుతాయి. గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు రబీ పంటలు. వేసవిలో వరి, మొక్కజొన్న వేరుశెనగ పండిస్తారు.
              



గ్రామీణ-పట్టణ జనాభా: పట్టణాల్లో, గ్రామాల్లో నివసించే ప్రజల నిష్పత్తికి, ఆర్థికాభివృద్ధికి సన్నిహిత సంబంధం ఉంది. గ్రామీణ ప్రజలు పట్టణాలకు తరలుతున్నారు. దీనివల్ల పట్టణాల సంఖ్య పెరిగి పట్టణీకరణను సూచిస్తోంది. ఈ పట్టణీకరణ ఆర్థికాభివృద్ధితో ముడిపడి ఉంది. ఆర్థిక సంపదను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం 72% జనాభా గ్రామాల్లో నివసిస్తుంటే, 28% పట్టణాల్లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థపై మనదేశ ఆచారాలు, సంప్రదాయాలు, నిరక్షరాస్యత, భూస్వామ్య విధానాలు ప్రభావం చూపుతున్న మరికొన్ని అంశాలు. ఆర్థికాభివృద్ధి మందకొడిగా సాగడానికి వీటితో పాటు మూఢనమ్మకాలు, సంస్కృతి, కట్టుబాట్లు కూడా ప్రధానపాత్ర వహిస్తున్నాయి (కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల జ్వరాలకు వాతలు పెడతారు).

భూస్వామ్య వ్యవస్థ-రకాలు: స్వాతంత్య్రానికి ముందు మనదేశంలో అనేక రకాల భూస్వామ్య వ్యవస్థలు అమల్లో ఉండేవి. బ్రిటిషర్లు జమిందారీ, మహల్వారీ, రైత్వారీ అనే మూడు రకాలైన భూస్వామ్య వ్యవస్థలను ఏర్పరిచారు. లార్డ్ కారన్‌వాలిస్ జమిందారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. దీని ద్వారా సుంకర్లను భూ యజమానులుగా, నిజమైన యజమానులను కౌలుదార్లుగా మార్చాడు. దీంతో యజమానులు కౌలుదార్లను ఇష్టం వచ్చినట్లు దోపిడి చేసేవారు.
              మహల్వారీ వ్యవస్థలో భూమి చిన్న కుటుంబాల సమూహానికి చెంది ఉంటుంది. ప్రభుత్వానికి పన్నుకట్టే బాధ్యత వారిదే. రైత్వారీ వ్యవస్థలో భూమి వేర్వేరు వ్యక్తులకు చెంది ఉంటుంది. వీరు ప్రభుత్వానికి స్వయంగా పన్ను కట్టేవారు. 
              ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే మరో అంశం మనదేశ ప్రజల ఆదాయ సంపదల్లో అసమానతలు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆర్థికాభివృద్ధి జరగడానికి ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలను, అనేక పథకాలను రూపొందించింది. వీటి ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని కృషి చేస్తోంది.

కానీ, ఎన్ని పథకాలు రూపొందించినా ధనికులు ఇంకా ధనికులుగా, పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మిగిలిపోతున్నారు.

వ్యక్తుల మధ్య ఆదాయ అసమానతలకు కొన్ని ప్రధాన కారణాలు:

¤  వ్యక్తుల సంపాదన సామర్థ్యాల్లో ఉండే తేడాలు. ఉదా: రోజువారీ కూలీలుగా పనిచేసేవారి కూలీ రేట్లలో, జీతాలు తీసుకుంటూ ఉద్యోగం చేసేవారి ఆదాయంలో తేడాలు ఉండటం.

¤ ఆస్తిహక్కు, వారసత్వ హక్కుల చట్టాల వల్ల పిల్లలు తల్లిదండ్రుల సంపదను వారసత్వంగా పొందుతారు. దీనివల్ల ధనికులు తమ సంపదను తమ సంతానానికి అందిస్తున్నారు. ఉదా: టాటా, బిర్లా మొదలైన వంశాలకు చెందినవారు.

¤ విద్యాస్థాయిలో, శిక్షణలో, నైపుణ్యంలో వ్యక్తుల మధ్య స్పష్టమైన అంతరాలు; అవకాశాల్లో అసమానతలు; సామాజిక, సాంస్కృతిక హేతువులు; ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లలేకపోవడం వంటివి కూడా ఈ అంతరాలకు కారణాలు.

         ఒకవైపు భారత ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, మరోవైపు అభివృద్ధి చెందడానికి భారత ప్రభుత్వం 'మిశ్రమ ఆర్థిక వ్యవస్థ'ను అనుసరించింది. ఇది పెట్టుబడిదారీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థల లక్షణాలతో ఉంటుంది. 
సాధారణంగా ఆర్థిక వ్యవస్థ మూడు రకాలు.

¤     పెట్టుబడిదారీ  
¤     సామ్యవాద   
¤     మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు.


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again