పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

పారిశ్రామిక విధానాలు


ఎస్. దత్ కమిటీ(1969) సిఫార్సుల మేరకు 1970లో ప్రభుత్వం నూతన లైసెన్సింగ్ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం పరిశ్రమలను నాలుగు రకాలుగా విభజించారు. అవి.

       1. కోర్ రంగం, 
       2. అధిక పెట్టుబడి రంగం,
       3. మధ్య పెట్టుబడి రంగం, 
       4. చిన్న పరిశ్రమల రంగం.

కోర్ రంగం: రూ. 35 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న పరిశ్రమలను కోర్‌రంగమని అంటారు. తొమ్మిది రకాల పరిశ్రమలను కోర్ పరిశ్రమలుగా గుర్తించారు.

అధిక పెట్టుబడి రంగం: రూ. 5 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు పెట్టుబడి ఉన్న పరిశ్రమలు. ప్రయివేటు సంస్థలు, విదేశీ సంస్థలు ఇందులో పాల్గొనవచ్చు.
మధ్య పెట్టుబడి రంగం: రూ. ఒక కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు స్థిర మూలధనం ఉన్న పరిశ్రమలను మధ్య పెట్టుబడి రంగమంటారు.

రిజర్వు చేసిన చిన్న పరిశ్రమలు: రూ. 7.5 లక్షలకు మించని స్థిర మూలధనం ఉన్న పరిశ్రమలను రిజర్వు చేసిన చిన్న పరిశ్రమలని వర్గీకరించారు. రూ. ఒక కోటి అంతకంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న పరిశ్రమలు మాత్రం లైసెన్సింగ్ నిబంధనల పరిధిలోకి వస్తాయి.

1973 పారిశ్రామిక తీర్మానం: ఆర్.సి.దత్ కమిటీ సిఫార్సుల మేరకు 'సంయుక్తరంగం' అనే భావనను ప్రవేశపెట్టారు. ఒక పారిశ్రామిక సంస్థను ప్రభుత్వం, ప్రైవేటురంగం కలిసి స్థాపిస్తే దాన్ని సంయుక్తరంగం అంటారు. ఈ తీర్మానంలో 19 రకాలైన పరిశ్రమలను కోర్ రంగానికి కేటాయించారు.

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA): ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్యాన్ని నియంత్రించేందుకు 1947లో ఈ చట్టాన్ని ప్రకటించింది.
1973లో 1947 చట్టాన్ని సవరించి, విదేశీమారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రధాన లక్ష్యాలు విదేశీమారక నిల్వలను సమీకరించుకోవడం, విదేశీ పెట్టుబడులను, విదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని మౌలిక రంగాలకు తరలించడం. విదేశీ మారక ద్రవ్యంతోపాటు వ్యాపార వ్యవహారాలపై నియంత్రణలను విధించింది.  Foreign Exchange Regulation Act నిబంధనలను ఉల్లంఘించినవారికి కఠిన కారాగార శిక్ష విధిస్తారు. 1998లో FERA స్థానంలో విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ప్రకటించారు.

1977 పారిశ్రామిక తీర్మానం: 1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా భారీ కీలక పరిశ్రమలను స్థాపించారు. అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు ఆశించిన స్థాయిలో తగ్గలేదని భావించారు.కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ 1977లో జనతా ప్రభుత్వం పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించింది. 1977 పారిశ్రామిక తీర్మానంలో 'లఘు పరిశ్రమలు' అనే భావనను ప్రవేశపెట్టింది. లక్ష రూపాయలు, అంతకంటే తక్కువ పెట్టుబడి ఉన్న వాటిని లఘు పరిశ్రమలుగా గుర్తించారు. 

50 వేల జనాభా కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో వీటిని స్థాపిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు రిజర్వు చేసిన వస్తువుల సంఖ్యను 180 నుంచి 807కు పెంచారు.

         కుటీర, చిన్నతరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి, చిన్న ఉద్యమదారులకు అవసరమైన అన్ని సేవలను అందించడానికి, ఆర్థిక సహాయం చేసేందుకు 1978లో ప్రతి జిల్లాలో జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

1980 పారిశ్రామిక తీర్మానం: 1956 తీర్మానానికి అనుగుణంగా పారిశ్రామికీకరణను సాధించడానికి 1980 జులైలో మరో పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించారు.

         1980 పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగం సమర్థతను పునరుద్ధరించాలి. ఆర్థిక ఫెడరలిజాన్ని ప్రవేశపెట్టి, వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రతి జిల్లాను అభివృద్ధి చేయాలి. ప్రతి జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలను, అనుషంగిక పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను, లఘుపరిశ్రమలను అభివృద్ధి చేయాలి. 

         లఘు పరిశ్రమల్లో గరిష్ఠ పెట్టుబడిని రూ.ఒక లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. 28 రకాల పరిశ్రమలను లైసెన్సు పరిధి నుంచి మినహాయించారు. ఎం.ఆర్.టి.పి., FERA నిబంధనలను సడలించారు. సచార్ కమిటీ సిఫార్సుల మేరకు ఎం.ఆర్.టి.పి. చట్టపరిధి ఆస్తులను రూ.20కోట్ల నుంచి రూ.100కోట్లకు పెంచారు. 1984లో లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకాన్ని, 'న్యూక్లియస్ సంస్థలు' అనే భావనను ప్రవేశపెట్టారు. చిన్నతరహా పరిశ్రమలకు అవసరమైన ఉత్పాదకాలను తయారుచేసే పరిశ్రమలను,మార్కెటింగ్ సదుపాయాలను కల్పించే పరిశ్రమలను న్యూక్లియస్ సంస్థలు అంటారు. 

1980 పారిశ్రామిక తీర్మానంలో 82 రకాల మందులను లైసెన్సింగ్ పరిధి నుంచి మినహాయించారు. ప్రయివేటు రంగంలో రుగ్మతలకు గురైన పారిశ్రామిక సంస్థలను గుర్తించేందుకు, నియమ నిబంధనలను రూపొందించేందుకు కావలసిన సలహాలు సూచనల కోసం 'తివారీ కమిటీ'ని నియమించారు. 1985లో తివారీ కమిటీ సూచనల ప్రకారం పారిశ్రామిక ఖాయిలా కంపెనీల చట్టాన్ని (Sick Industrial Company Act-SICA)ను ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం రుగ్మతకు గురైన పారిశ్రామిక సంస్థలను గుర్తించడానికి కొన్ని నిబంధనలను సూచించారు. అవి:

1. పారిశ్రామిక సంస్థను స్థాపించి కనీసం ఏడేళ్లు పూర్త్తె ఉండాలి.

2. ఏ ఆర్థిక సంవత్సరం అంతానికైనా తమ నికర ఆస్తుల విలువకు మించి నష్టాలు పేరుకుపోయి ఉండాలి.

3. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో, నగదు నష్టానికి గురైన పరిశ్రమలను ఖాయిలా పడిన పరిశ్రమలంటారు.

         SICA చట్టం ప్రకారం 1987లో Board for Industrial and financial Reconstruction (B.I.F.R)ను ఏర్పాటు చేశారు.

         ప్రయివేటు రంగంలో రుగ్మతకు గురైన పారిశ్రామిక సంస్థలను పునరుద్ధరించడానికి కావలసిన ఆర్థిక సహాయం చేసేందుకు, విలీనం చేయడానికి లేదా మూసివేసేందుకు అవసరమైన సూచనలు చేయడానికి బి.ఐ.ఎఫ్.ఆర్.ను ఏర్పాటు చేశారు.

         1991లో ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఎస్.ఐ.సి.ఎ. చట్టపరిధిలోకి తెచ్చారు. 

1991లో పారిశ్రామిక తీర్మానం: 1991 పారిశ్రామిక తీర్మానంలో 1956 పారిశ్రామిక తీర్మానాన్ని సమూలంగా మార్చివేశారు. భారతీయ పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచి, ప్రపంచ దేశాలతో పోటీపడేలా చేయాలని, అనవసరమైన కంట్రోళ్లనన్నింటినీ తొలగించాలనీ ఈ పారిశ్రామిక విధానంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

1991 పారిశ్రామిక తీర్మానాన్ని సరళీకృత ఆర్థిక విధానాలు అని లేదా రావు-మన్‌మోహన్ నమూనా అని లేదా ఎల్.పి.జి. నమూనా అంటారు.

లక్ష్యాలు:
1. పారిశ్రామిక రంగానికి చట్టపరమైన పాలనాపరమైన విముక్తి కల్పించడం.
2. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మన ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయడం.
3. అంతర్జాతీయ పోటీ సామర్థ్యాన్ని సాధించడం.
4. ప్రయివేటు రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించడం.
5. ఆర్థిక అసమానతలను తొలగించడం.
6. ఆర్థికాభివృద్ధి రేటును పెంచడం.
7. పరిశ్రమల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం.

పై లక్ష్యాలను సాధించడానికి కొన్ని విధానాలను చేపట్టారు. అవి:

1. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం: 18 రకాల పరిశ్రమలను తప్ప, మిగతా పరిశ్రమలను పారిశ్రామిక లైసెన్స్ పరిధి నుంచి తొలగించారు. 1997లో లైసెన్సు పొంది తీరవలసిన పరిశ్రమల సంఖ్యను 8కి తగ్గించారు. 

2002లో 5కు తగ్గించారు. అవి
1. ఆల్కహాల్ పదార్థాలు.
2. పొగాకు ఉత్పత్తులు
3. రక్షణ ఉత్పత్తులు.
4. పారిశ్రామిక పేలుడు పదార్థాలు
5. హానికరరసాయనిక పదార్థాలు.

2. ప్రభుత్వరంగ ప్రాధాన్యాన్ని తగ్గించడం: 1956లో 17 రకాల పరిశ్రమలను ప్రభుత్వరంగానికి కేటాయించారు. 1991లో వీటిని 8 పరిశ్రమలకు తగ్గించారు. దశలవారీగా ప్రభుత్వరంగానికి కేటాయించిన పరిశ్రమలను తగ్గించారు. ప్రస్తుతం 3 రకాలైన పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి కేటాయించారు. అవి:
1. రైల్వేలు
2. అణుశక్తి
3. రక్షణకవసరమైన ఆయుధాల తయారీ.

3. విదేశీ పెట్టుబడులను అనుమతించడం: అధిక ప్రాధాన్యం ఉన్న 34 పరిశ్రమల్లో విదేశీ కంపెనీలు నేరుగా పెట్టుబడులు పెట్టడానికి అనుమతించారు. విదేశాల నుంచి యంత్ర పరికరాలను ప్రాజెక్టు పెట్టుబడిలో 51% వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. ఉదా: వాణిజ్య వాహనాలు, రసాయనిక ఎరువులు, ఔషధాలు, కాగితాలు. 

4. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం: ఈ 34 పరిశ్రమల్లో విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతిని సులభతరం చేశారు. అయితే సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించే మొత్తం కోటి రూపాయలకు మించకూడదు. విదేశీ సాంకేతిక నిపుణులను నియమించుకోవడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు.

5. ఎం.ఆర్.టి.పి. చట్ట సవరణ: ఎం.ఆర్.టి.పి. చట్టపరిధి, ఆస్తుల పరిమితిని ఎత్తివేశారు. ఎం.ఆర్.టి.పి. కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండా తమ కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు. 2002 ఆర్థిక సంవత్సరంలో ఎస్.వి.ఎస్.రాఘవన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎం.ఆర్.టి.పి. చట్టాన్ని రద్దుచేసి, దాని స్థానంలో కాంపిటీషన్ చట్టాన్ని ప్రకటించారు. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:

1. పోటీవ్యతిరేక ఒప్పందాలను రద్దుచేయాలి.
2. పెద్దకంపెనీలు, చిన్నకంపెనీలను విలీనం చేసుకోవడం, టేకోవర్ వంటివి అరికడతారు.
3. పారిశ్రామిక సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కల్పించి, వాటి అవస్థాపితాశక్తిని ఉపయోగించుకొనేలా చేయడం.

6. జాతీయ పునరుజ్జీవ నిధి: రుగ్మతకు గురైన పరిశ్రమలను మూసి వేయడం వల్ల లేదా ఆధునికీకరించడం వల్ల ఇబ్బందులకు గురయ్యే కార్మికులకు భద్రత కల్పించేందుకు 1992లో జాతీయ పునరుజ్జీవ నిధిని ఏర్పాటు చేశారు. 2000లో ఈ నిధిని రద్దు చేశారు.

7. లఘు పరిశ్రమల్లో గరిష్ఠ పెట్టుబడిని రూ.5లక్షలకు పెంచారు.

8. పరిశ్రమల స్థల నిర్ణయంపై ఉన్న ఆంక్షలు రద్దయ్యాయి. 

9. లైసెన్సుల విస్తృత ఏకీకరణ: 1985లో ప్రవేశపెట్టిన లైసెన్సుల విస్తృత ఏకీకరణ వల్ల కొత్త యంత్రాలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. దగ్గర పోలికలున్న ఉత్పత్తులకు వేర్వేరుగా లైసెన్సులు తీసుకోకుండా అన్నింటికీ ఒకే లైసెన్సు పొందవచ్చు.

10. పరిశ్రమ నిర్వచనాన్ని విస్తృతం చేశారు. పరిశ్రమలకు సంబంధించిన సేవలు, వ్యాపార సంస్థలు కూడా పరిశ్రమల పరిధిలోకి వచ్చాయి.

11. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం: 1973లో ప్రవేశపెట్టిన విదేశీమారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని 1998లో విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టంగా మార్చారు. ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తారు.

రెండో తరం ఆర్థిక సంస్కరణలు
1998 తరువాత ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను రెండో తరం ఆర్థిక సంస్కరణలు అంటారు.

1. 1999లో విద్యుత్తుపై రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు.

2. పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టాన్ని తొలగించారు.

3. మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రైవేటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించారు.

4. 2001-02లో ఔషధాలు, విమానయాన కేంద్రాలు, హోటళ్లు, పర్యాటక రంగం, పట్టణాభివృద్ధి మొదలైన రంగాల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించారు.

5. 2003-04లో బ్యాంకింగ్ రంగంలో 49% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించారు.

6. 2004-05లో టెలికాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49% నుంచి 74%కు పెంచారు.

7. పౌరవిమానయానంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 40% నుంచి 49% కు పెంచారు.

8. 2006-07లో కాఫీ తోటలు, తేయాకునిల్వలు మొదలైనవాటిలో 100% విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు.

9. బీమారంగంలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను 26% నుంచి 49%కు పెంచారు.

10. ప్రభుత్వరంగ నూనె శుద్ధి కర్మాగారాల్లో 49%; వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్లలో 26% విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు.

11. జూదం, పందెం, లాటరీ వ్యాపారం, అణుశక్తి, చిల్లర వ్యాపారాలు మొదలైన వాటిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించరు.

             మొత్తం మీద నూతన ఆర్థిక విధానంవల్ల విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడంతో దేశీయంగా ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again