పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 30, 2014

మూలకాల వర్గీకరణ


         మొదటిసారిగా మూలకాలను లోహాలు, అలోహాలు అనే రెండు వర్గాలుగా విభజించారు. కానీ ఈ పద్ధతి కొన్నింటికి (Limited purpose) మాత్రమే వర్తించింది. అన్ని మూలకాలను కేవలం రెండు వర్గాలుగా మాత్రమే వర్గీకరించడటం వల్ల ప్రతీ గ్రూప్‌లోనూ మూలకాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది.
         కొన్ని మూలకాలు లోహా, అలోహ ధర్మాలను రెండింటిని ప్రదర్శించాయి. దాంతో వాటిని ఏ గ్రూప్‌లోనూ చేర్చడానికి వీల్లేకపోయింది. 1949లో హెన్నింగ్ బ్రాండ్ ఫాస్ఫరస్‌ను కనుక్కోవడంతో శాస్త్రీయంగా మూలకాల ఆవిష్కరణ జరిగింది. ఇప్పటికి దాదాపు 118 మూలకాలను కనుక్కున్నారు. ఈ మూలకాలు, వీటి వల్ల ఏర్పడిన అసంఖ్యాకమైన సమ్మేళనాల ధర్మాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వర్గీకరణ అవసరమైంది. పరమాణు నిర్మాణానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలను కనుక్కోడానికి మూలకాల వర్గీకరణ తోడ్పడింది.

         ఆ ప్రయత్నంలో శాస్త్రజ్ఞులు మూలకాల ధర్మాల్లో కలిగే మార్పులను గుర్తించి, మూలకాలను వాటికి అనుగుణంగా వర్గీకరించారు. వీటిలో కొన్ని పద్ధతులను తెలుసుకుందాం.

డాబర్‌నీర్ ట్రయాడ్‌లు: 1817లో డాబర్‌నీర్ అనే జర్మన్ శాస్త్రవేత్త మొదటిసారి మూలకాల వర్గీకరణకు నాంది పలికాడు. ఈయన మూడేసి మూలకాలను ఒక గ్రూప్‌గా చేసి దానికి ట్రయాడ్ (త్రికం) అని పేరు పెట్టాడు.

ట్రయాడ్‌లోని మూడు మూలకాలకు ఒకే రకమైన ధర్మాలున్నాయి
.
త్రిక సిద్ధాంతం: డాబర్‌నీర్ ట్రయాడ్‌లో మధ్య మూలకం పరమాణు భారం మొదటి, మూడో మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపుగా సమానంగా లేదా మూడు మూలకాల పరమాణు భారాలు దాదాపు సమానంగా ఉంటాయని పేర్కొన్నాడు.

       

న్యూలాండ్స్ అష్టక పరికల్పన: 1963లో జాన్ అలెగ్జాండర్ న్యూలాండ్స్ అనే ఇంగ్లండ్ రసాయన శాస్త్రవేత్త మూలకాలను వాటి పరమాణుభారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదటి, ఎనిమిదో మూలకాల ధర్మాలు ఒకే విధంగా ఉండటాన్ని గమనించాడు. న్యూలాండ్స్ రూపొందించిన ఈ ప్రతిపాదనను న్యూలాండ్స్ అష్టక పరికల్పన అంటారు. ఇది భారతీయ సంగీతంలోని స్వరాల (సప్తస్వరాల) మాదిరిగా మొదటి, ఎనిమిదో స్వరాలు (సా) ఒకేలా ఉన్నాయి. కింద చూపిన విధంగా, Li, Na, K ఒకే ధర్మాలను కలిగి ఉన్నాయి.  

      


          కానీ అప్పటి వరకు కనుక్కున్న 60 మూలకాల్లో కాల్షియం (Ca) పరమాణు సంఖ్య 16 వరకు మాత్రమే మూలకాలను పై విధంగా అమర్చగలిగాడు. భార మూలకాలకు వర్తింప చేసినప్పుడు సరైన పోలికలు లభించకపోవడంతో న్యూలాండ్ పరికల్పనను అన్ని మూలకాలకు వర్తింప చేయలేమని తెలిసింది.

మెండలీఫ్ ఆవర్తన నియమం: 1869లో డిమిట్రీ మెండలీఫ్ అనే రష్యన్ శాస్త్రవేత్త అప్పటి వరకు తెలిసిన మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో ఒక పట్టికలో అమర్చారు. వాటిలోని కొన్ని మూలకాల ధర్మాలు పునరావృతం (ఆవర్తనం) అవడాన్ని గమినించాడు. దీన్నే మెండలీఫ్ ఆవర్తన నియమం అంటారు.

                  

   
ఆవర్తన ప్రమేయం అంటే ఒక ప్రత్యేక అవధిలో (Certain Interval) తిరిగి పునరావృతమవడం.

ఈ రకంగానే మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు, మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు ప్రత్యేక అవధిలో తిరిగి పునరావృతమవుతాయి. దీన్ని అనుసరించి మెండలీఫ్ తన ఆవర్తన నియమాన్ని కిందివిధంగా నిర్వచించాడు.

''మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు'' 

          కొన్ని మూలకాలను అప్పటికి కనుక్కోనప్పటికీ మెండలీఫ్ వాటి ఉనికిని, ధర్మాలను ఊహించగలిగాడు. ఒకే రకమైన ధర్మాలున్న మూలకాలన్నింటినీ ఒక గ్రూప్‌లో చేర్చాడు. ఈ రకంగా మొదటి ఆవర్తన పట్టిక (First Periodic Table) ను మెండలీఫ్ తయారుచేశాడు.


పరమాణు భారం  -     68
మెండలీఫ్ ఊహించి పెట్టిన పేరు   -  ఎకా అల్యూమినియం 
అసలు పేరు  -    గాలియం 
కనుక్కున్నవారు   -   డెబోస్బాడ్రన్ (De Boisbandran)


పరమాణు భారం  -       44
మెండలీఫ్ ఊహించి పెట్టిన పేరు   -    ఎకా బోరాన్ 
అసలు పేరు  -    స్కాండియం
కనుక్కున్నవారు   -   నిల్సన్
          
   

                     
మెండలీఫ్ ఆవర్తన పట్టికలో లోపాలు: 

1) హైడ్రోజన్ స్థానం: 
     హైడ్రోజన్ రెండు వేర్వేరు గ్రూపుల లక్షణాలను ప్రదర్శిస్తుంది. అవి:

     (i) I గ్రూపులో క్షార లోహమైన Na, Naఅయాన్‌ను ఏర్పరిచినట్లే, హైడ్రోజన్, H+  అయాన్‌ను ఏర్పరచడం.

    (ii) VII వ గ్రూపులోని హాలోజన్‌ల మాదిరి Cl, Cl - అయాన్‌ను ఏర్పరచినట్లే హైడోజన్, H- అయాన్‌ను ఏర్పరచడం.

2) ఐసోటోపుల స్థానం:
     (i)  ఒకే మూలకానికి చెందిన వివిధ ఐసోటోపులు వివిధ పరమాణుభారాలు కలిగి ఉండటం వల్ల, ఆవర్తన పట్టికలో వాటి స్థానం వేర్వేరుగా ఉండాలి.

    (ii) వాటి రసాయనధర్మాలు ఒకేరకంగా ఉండటం వల్ల వాటిన్నింటిని ఒకేస్థానంలో ఉంచాలి.

3) అసంగతమైన అమరిక: ఆవర్తన పట్టికలో ఎక్కువ పరమాణు భారం ఉన్న కొన్ని మూలకాలను, తక్కువ పరమాణుభారం ఉన్న మూలకాల కంటే ముందుగా ఉంచారు. 

     ఉదా: Ar (39.91), K(39.1)

నవీన వర్గీకరణ: మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని లోపాలను సవరించి 1913లో హెన్రీమోస్లే అనే ఇంగ్లిష్ భౌతిక శాస్త్రవేత్త పరమాణు సంఖ్య ప్రాతిపదికగా నవీన లేదా విస్త్రత ఆవర్తన పట్టికను రూపొందించారు. ఈ పట్టికను 7 పీరియడ్‌లు(అడ్డంగా ఉన్న వరుసలు), 18 గ్రూపులు (నిలువు వరుసలు)గా విభజించారు.

         మూలకాలను వాటి పరమాణుసంఖ్యల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి భౌతిక, రసాయన ధర్మాలు వాటి ఎలాక్ట్రాన్ విన్యాస పరంగా ఒక క్రమమైన అంతరంలో పునరావృతమవడాన్ని మోస్లే గమనించి ఆధునిక ఆవర్తన నియమాన్ని ఈ విధంగా నిర్వచించాడు.

''మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు''

నవీన (విస్త్రత) ఆవర్తన పట్టిక లక్షణాలు: నవీన ఆవర్తన నియమం ఆధారంగా రూపొందించిందే నవీన ఆవర్తన పట్టిక.

గ్రూపులు: విస్త్రత ఆవర్తన పట్టికలోని నిలువు వరుసలను గ్రూపులు అంటారు. దీనిలో 18 గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలతో ఉంటాయి.

ఆవర్తన పట్టికలో ఎడమవైపు చివర IA గ్రూపు మూలకాలైన క్షారలోహాలు (Li, Na, K, Rb, Cs, Fr) దాని పక్కన IIA గ్రూపు మూలకాలైన క్షారమృత్తిక లోహాలు అమరి ఉంటాయి. IA, IIA గ్రూపు మూలకాలను కలిపి s-బ్లాకు మూలకాలు అంటారు. 

ఆవర్తన పట్టికలో కుడివైపున 13 నుంచి 17 వరకు గల గ్రూపులను p బ్లాకు మూలకాలు అంటారు.

ప్రాతినిథ్య మూలకాలు: s, p బ్లాకు మూలకాలను కలిపి ప్రాతినిథ్య మూలకాలు అంటారు.

జడవాయువులు: వీటినే 'O' గ్రూపు మూలకాలు అంటారు. 18వ గ్రూపులోని He, Ne, Ar, Kr, Xe, Rn లు ఎలాంటి రసాయన చర్యల్లో పాల్గొనవు కాబట్టి వీటిని జడవాయువులంటారు.

పరివర్తన మూలకాలు: ఆవర్తన పట్టిక మధ్యలో ఉన్న d-బ్లాకు మూలకాలను పరివర్తన మూలకాలు అంటారు.

అంతర పరివర్తన మూలకాలు: పరమాణుసంఖ్య 57 నుంచి 71 (La to Lu) ఉన్న 14 మూలకాలను లాంథనైడ్లు, పరమాణు సంఖ్య 89 నుంచి 103 (Ac to Lr) వరకు ఉన్న మూలకాలను ఆక్టినైడ్లు అంటారు.

ఇవి ఆవర్తన పట్టిక కిందిభాగంలో అమరి ఉంటాయి.

పీరియడ్‌లు: ఆవర్తన పట్టికలోని 7 అడ్డు వరుసలను పీరియడ్‌లు అంటారు.
మొదటి పీరియడ్‌ని అతిపొట్టి పీరియడ్ అంటారు. దీనిలో 2 మూలకాలు మాత్రమే ఉంటాయి.

   ¤ రెండు, మూడు పీరియడ్లను పొట్టి పీరియడ్‌లు అంటారు. వీటిలో ఒక్కొక్కదానిలో 8 మూలకాలుంటాయి.

   ¤ 4, 5 పీరియడ్‌లను పొడవు పీరియడ్‌లు అంటారు. వీటిలో ఒక్కొక్క పీరియడ్‌లోను 18 మూలకాలుంటాయి.

   ¤ 6వ పీరియడ్‌ను అతి పొడవు పీరియడ్ అని అంటారు. దీనిలో 32 మూలకాలు ఉంటాయి.

   ¤ 7వ పీరియడ్ అసంపూర్ణంగా నిండి ఉంటుంది.

   ¤ ప్రతి పీరియడ్ క్షార లోహంతో ప్రారంభమై జడవాయువుతో అంతమవుతుంది.

పరమాణువు ముఖ్య ధర్మాలు

1) పరమాణు పరిమాణం: వేలన్సీ ఆర్బిటాల్, కేంద్రకాల మధ్య ఉండే దూరం. దీన్ని ఆంగ్‌స్ట్రాం (Aº) ల్లో కొలుస్తారు.

2) అయనీకరణ శక్మం: వాయుస్థితిలో ఉన్న పరమాణు బాహ్య ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావాల్సిన కనీస శక్తిని అయనీకరణ శక్మం అంటారు. దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్ లేదా కి.కేలరీ. మోల్ లో కొలుస్తారు.

3) ఎలక్ట్రాన్ ఎఫినిటీ: వాయుస్థితిలో తటస్థ పరమాణువు భూస్థాయిలో ఉన్నపుడు ఒక ఎలక్ట్రాన్‌ను చేరిస్తే విడుదలయ్యే శక్తినే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్‌లలో కొలుస్తారు.

4) రుణ విద్యుదాత్మకత: సమయోజనీయ బంధంలోని ఒక పరమాణువు ఎలక్ట్రాన్ జంటను తనవైపు ఆకర్షించుకునే సామర్థ్యాన్ని రుణ విద్యుదాత్మకత అంటారు. దీన్ని పాలింగ్ స్కేల్‌తో కొలుస్తారు.

5) ధన విద్యుదాత్మకత: ఎలక్ట్రాన్‌లను కోల్పోయి, ధనాత్మక అయాన్‌గా మారడాన్ని ధన విద్యుదాత్మకత అంటారు.

    


                         Technical Terms (సాంకేతిక పదజాలం)

1. పరమాణుసంఖ్య: పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య లేదా పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య (Z) అంటారు.

2. పరమాణు భారం లేదా పరమాణు ద్రవ్యరాశి సంఖ్య: పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం సంఖ్యను పరమాణు ద్రవ్యరాశి సంఖ్య (A) అంటారు.

3. వేలన్సీ: పరమాణువులో బాహ్య కక్ష్యలోని ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యను వేలన్సీ అంటారు. బంధంలో పాల్గొనే ఈ ఒంటరి ఎలక్ట్రాన్లనే వేలన్సీ ఎలక్ట్రాన్లు అంటారు.

4. ఎలక్ట్రాన్ విన్యాసం: పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏవిధంగా ఏ ఆర్బిటాళ్లలో నిండి ఉన్నాయో తెలిపేదే ఎలక్ట్రాన్ విన్యాసం.

5. ఆర్బిటాల్: కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యత ఉన్న ప్రాంతాన్ని పరమాణు ఆర్బిటాల్ అంటారు.

6. ఆక్సీకరణం: ఒక సమ్మేళనానికి ఆక్సిజన్‌ను కలపడం లేదా సమ్మేళనం నుంచి హైడ్రోజన్‌ను తీసివేయటాన్ని ఆక్సీకరణం అంటారు.

7. ఆక్సీకరణి: ఒక సమ్మేళనాన్ని ఆక్సీకరణం చేయడానికి ఉపయోగించే కారకాన్ని ఆక్సీకరణి అంటారు.

8. క్షయకరణం: ఒక సమ్మేళనానికి హైడ్రోజన్‌ను కలపడం లేదా సమ్మేళనం నుంచి ఆక్సిజన్‌ను తొలగించడాన్ని క్షయకరణం అంటారు.

9. క్షయకరణి: ఒక సమ్మేళనాన్ని క్షయకరణం చేయడానికి ఉపయోగించే కారకాన్ని క్షయకరణి అంటారు.

10. పరమాణు పరిమాణం: పరమాణు కేంద్రకం నుంచి చిట్టచివరి ఆర్బిటాల్‌కు ఉన్న దూరాన్ని పరమాణు పరిమాణం అంటారు.

II నీల్స్ బోర్ విస్తృత ఆవర్తన పట్టిక: మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా నీల్స్ బోర్ విస్తృత ఆవర్తన పట్టికను నిర్మించాడు. పట్టికలోని నిలువు వరుసలను 'గ్రూపు'లనీ, అడ్డు శ్రేణులను 'పీరియడ్'లనీ అంటారు. ఆవర్గన పట్టికలో 18 గ్రూపులు, 7 పీరియడ్ లు ఉన్నాయి. అన్ని మూలకాలను వాటి పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలో అమర్చడం జరిగింది. ఆవర్తన పట్టికలో ఎడమ నుంచి కుడికి పోయిన కొద్దీ ఒక మూలకం పరమాణు సంఖ్య కంటే దాని తరువాత మూలకం పరమాణు సంఖ్య ఒక యూనిట్ పెరుగుతుంది. ఒక మూలకం ఎలక్ట్రాన్ విన్యాసానికి దాని ముందు మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం కంటే ఒక ఎలక్ట్రాన్ అధికంగా ఉంటుంది. ఇలా ఆ పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ ను 'భేదపరచే ఎలక్ట్రాన్' అంటాం.

బ్లాకులుగా వర్గీకరణ : ఆవర్తన పట్టికలో మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా 4 బ్లాకులు ఉన్నాయి. ఒక మూలకంలో భేదపరిచే ఎలక్ట్రాన్ 's' ఉపకర్పరంలోకి పోతే ఆ మూలకాన్ని s బ్లాకులో చేర్చడం జరుగుతుంది. ఇదే విధంగా మిగిలిన మూడు p, d, f బ్లాకులు ఆవర్తన పట్టికలో చూపించడం జరిగింది. 's' బ్లాక్ ఎడమవైపు, 'p' బ్లాక్ కుదివైపు, 'd' బ్లాక్ s, p బ్లాక్ లకు మధ్యగానూ ఉన్నాయి. శక్తి స్థాయి క్రమానుసారంగా 'f' బ్లాక్ ను అమర్చినట్లయితే, ఆవర్తన పట్టిక చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి ఈ బ్లాక్ ను ఆవర్తన పట్టిక కింది భాగంలో ప్రత్యేకంగా చూపుతారు. ఎలక్ట్రాన్ విన్యాసాలు ఆధారంగా మూలకాలను అమర్చితే నాలుగు బ్లాక్ లు ఏర్పడటమే కాకుండా బాహ్యకర్పరంలో ఒకే రకం ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకాలు అన్నీ గ్రూపు అని పిలిచే ఒక నిలువు వరుసలో ఉంటాయి. ఒకే గ్రూపు మూలకాలన్నిటికీ ఒకే విధమైన రసాయన ధర్మాలుంటాయి.

గ్రూపులుగా వర్గీకరణ : బాహ్య కర్పరంలోని 's' ఆర్బిటాల్ లో ఒక ఎలక్ట్రాన్ గల (ns1) మూలకాలను 'I గ్రూపు మూలకాలు' అంటాం (ఉ.హైడ్రోజన్, ఆల్కలీ లోహాలు). బాహ్య కర్పరంలోని 's' ఆర్బిటాల్ లో రెండు ఎలక్ట్రాన్ లు గల (ns²) మూలకాలను 'II గ్రూపు మూలకాలు' అంటారు (ఉ.క్షార మృత్తిక లోహాలు). బాహ్యకర్పరంలో మూడు ఎలక్ట్రానులు, 's' లో రెండు, 'p' లో ఒకటి (ns² p1) 'III గ్రూపు మూలకాలు' అంటాం. ఇదే విధంగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది ఎలక్ట్రానులు వరసగా ఉన్న మూలకాలను IV, V, VI, VII, 0 గ్రూపు మూలకాలు అంటాం.

III. ధర్మాల ఆధారంగా వర్గీకరణ

జడవాయు మూలకాలు : ఆవర్తన పట్టికలో '0' గ్రూపుకు చెందిన మూలకాలను జడవాయువు మూలకాలు అంటారు. అవి: హీలియం-2, నియాన్-10, ఆర్గాన్-18, క్రిప్టాన్-36,జినాన్-54 మరియు రేడాన్-86.

ప్రాతినిధ్య మూలకాలు : ఆవర్తన పట్టికలో 's', 'p' బ్లాకు మూలకాలను ప్రాతినిధ్య మూలకాలంటారు. అవి: కొన్ని లోహాలు, అన్ని అలోహాలు, అర్ధలోహాలు.

పరివర్తన మూలకాలు : ఇవి 'd' బ్లాకు మూలకాలు.

అంతర్ పరివర్తన మూలకాలు : ఇవి 'f' బ్లాకు మూలకాలు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again