పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 27, 2014

మలివేద నాగరికత - వివరణ

 
     భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 1000 నుంచి 600 మధ్య మలివేద నాగరికత విలసిల్లింది. ఈ కాలంలో ఆర్యులు గంగా - యమున ప్రాంతాల ఒడ్డుకు చేరుకున్నారు. తెగల పాలన అంతమై విశాల సామ్రాజ్యాలు అవతరించాయి. భరత, పురు తెగల సమ్మేళనమే కురుసామాజ్రం. కురు, పాంచాల, విదేహ, కోసల, కాశీ లాంటి సామ్రాజ్యాలు (రాజ్యాలు) ఉద్భవించాయి. దీన్నే చరిత్రలో రెండో పట్టణీకరణ అంటారు.

 ఆధారాలు
సామవేదం: అత్యంత ప్రాచీనమైన సంగీత గ్రంథం. 'సంగీత వేదం' అని మరోపేరు. సామవేదంలో శ్లోకాలకు రాగాలు కూర్చారు.

యజుర్వేదం: యజ్ఞ, యాగాది క్రతువులు నిర్వహించే విధానాలను శ్లోకాల రూపంలో వివరించారు.


అధర్వణవేదం: ఇది వైద్యశాస్త్ర గ్రంథం. ఇందులో ఆయా జబ్బులు, వాటికి వాడే ఔషధాలు తెలిపారు. భూత, ప్రేత, పిశాచాల లాంటి చెడుశక్తుల వల్ల రోగాలు వస్తాయని, కొన్ని శ్లోకాలు చదివితే అవి పారిపోతాయని విశ్వసించేవారు. అధర్వణ వేదాన్ని 'వైద్యవేదం', 'అనార్యవేదం' అని కూడా పిలుస్తారు.

ప్రతి వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. అవి:
1. వేదసంహిత
2. బ్రాహ్మణాలు
3. అరణ్యకాలు
4. ఉపనిషత్తులు.

బ్రాహ్మణాలు: ఇవి వేదమంత్రాలు, యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణను గద్యరూపంలో వివరిస్తాయి.

అరణ్యకాలు: ఇవి అరణ్యాల్లో, వానప్రస్థాశ్రమంలో నివసించే మానవులు నిర్వహించాల్సిన కర్మకాండలను గురించి తెలియజేస్తాయి. వీటిని తపోవనాల్లో ఉండే రుషులు రచించారు.

ఉపనిషత్తులు: ఉపనిషత్తు అంటే 'గురువు ముందు కూర్చుని శ్రద్ధగా వినడం'. ఇవి మొత్తం 108. వీటిని 'వేదాంతం' అని కూడా అంటారు. ఇవి కర్మకాండలు, జంతు బలులను వ్యతిరేకించేవి. కానీ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాలకు విలువిచ్చాయి.

వేదాంగాలు: ఇవి 6.
1. కల్ప - యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణ తెలిపేది
2. శిక్ష - ఉచ్చారణ
3. నిర్యుక్త - పదాల ఆవిర్భావం
4. ఛందస్సు - వేదమంత్రాల రూపం
5. వ్యాకరణం - క్రమపద్ధతిలో భాషా అధ్యయనం
6. జ్యోతిష్యం - నక్షత్రరాశుల స్థితిగతులు

ఉపవేదాలు: 4
1. ఆయుర్వేదం - వైద్యశాస్త్రం
2. ధనుర్వేదం - విలువిద్య - యుద్ధశాస్త్రం
3. గాంధర్వవేదం - సంగీతశాస్త్రం
4. శిల్పవేదం - భవన నిర్మాణశాస్త్రం

షడ్దర్శనాలు: ఆర్యుల తత్త్వవిజ్ఞానం షడ్దర్శనాల్లో కనిపిస్తుంది. న్యాయ (గౌతమి), యోగ (పతంజలి), సాంఖ్య (కపిల), వైశేషిక (కాణాద) పూర్వమీమాంస (జైమిని), ఉత్తరమీమాంస (బాదరాయణ) మొదలైనవి.
 రాజకీయ వ్యవస్థ
      మలివేద కాలంలో 'రాజ్యం' అనే భావన ఏర్పడింది. రాజులు ఏకరాట్, విరాట్, సామ్రాట్, సార్వభౌమ బిరుదులను స్వీకరించారు. వీరు 'దైవాంశ సంభూతులు'గా కీర్తి పొందారు. అధర్వణ వేదంలో దైవాంశ సంభూతుడిగా ప్రస్తావించిన పరీక్షిత్తు మహారాజు 'కురు సామ్రాజ్యాన్ని' పాలించినట్లు పేర్కొన్నారు. (కురు - ఢిల్లీచుట్టుపక్కల ప్రాంతం. దీని రాజధాని ఇంద్రప్రస్థం - ఢిల్లీ). పరీక్షిత్తు మహారాజు కుమారుడు 'జనమేజయుడు' అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. మలివేద రాజులు రాజసూయ, అశ్వమేధ, వాజపేయ యాగాలు చేసినట్లు చరిత్రలో ఉంది. ప్రజాసంఘాలైన సభ-సమితి ప్రాధాన్యం తగ్గిపోయింది.
  ప్రభుత్వ పరిపాలనలో రాజుకు సహాయ సహాకారాలు అందించడానికి సేనాని, పురోహిత, సంగ్రహిత అనే అధికారులు ఉండేవారు. రాష్ట్రానికి అధికారి శతపథి లేదా స్థపతి. రాజు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించేవాడు. ఉపనిషత్తుల్లో కోశాధికారి - సంగ్రహిత, పన్నులు వసూలుచేసే అధికారి - భాగధుషు, జూద గృహాలను పర్యవేక్షించే అధికారి - అక్షవప, వేటలో రాజుకు సహాయకుడిగా అనుసరించే అధికారి - గోవికర్తన; రాజు ఆస్థానంలో ఉండేది - పాల్లుల. రక్షణాధికారి - జీవగృభ (పోలీస్); గ్రామ అధికారి - ఆధికృత (గ్రామణి) అనే అధికారుల ప్రస్తావన ఉంది. రాజద్రోహానికి విధించేది మరణశిక్ష.

 సామాజిక వ్యవస్థ
      పితృస్వామిక వ్యవస్థ కొనసాగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతమై, వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాయి. చతుర్వర్ణ వ్యవస్థ (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) చోటు చేసుకుంది. రుగ్వేదంలో పురుషసూక్తంలోని 10వ మండలంలో చతుర్వర్ణాల ఆవిర్భవ ప్రస్తావన ఉంది. బృహదారణ్యక ఉపనిషత్, మహాభారతం, మనుస్మృతిలో కూడా చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఉంది. అప్పటి సాంఘికవ్యవస్థలో వర్ణవ్యవస్థ కఠినంగా ఉండేది. వృత్తులు నిర్ణయించడం, వర్ణాశ్రమాల ఆవిర్భవం, అనులోమ వివాహాలకు ప్రాధాన్యం, స్త్రీలు స్వాతంత్య్రాన్ని కోల్పోవడం లాంటివి ప్రస్తావించారు. కులవ్యవస్థ ద్వారా సామాజిక ఆధిపత్యాన్ని చెలాయించడానికి వర్ణాశ్రమాలు ప్రవేశపెట్టారు. ఆశ్రమధర్మాలైన బ్రహ్మచర్యం, గృహస్తు, వానప్రస్థ, సన్యాసం నుంచి శూద్రూడికి మినహాయింపు ఇచ్చారు. అగ్రవర్ణాల ఆధిపత్యానికి ఆశ్రమధర్మాలు కారణమయ్యాయి (ఐతరేయ బ్రాహ్మణం, జబాల ఉపనిషత్‌లో వర్ణాశ్రమ ధర్మాల గురించి విపులంగా వర్ణించారు).

 'గోత్ర' అంటే ఒకేవ్యక్తికి చెందిన వారసులుగా పేర్కొన్నారు. గోత్ర అనే పదం అధర్వణవేదంలో కనిపిస్తుంది. ఒకే గోత్రం వారి మధ్య వివాహాలను నిషేధించారు. బాల్యవివాహాలు మొదలయ్యాయి. అనులోమ, విలోమ వివాహాలు చోటుచేసుకున్నాయి. అనులోమ వివాహం వల్ల జన్మించిన సంతానాన్ని 'సూత' అని; విలోమ వివాహం వల్ల జన్మించిన సంతానాన్ని చండాలురు (నిషాద) అని పేర్కొన్నారు.

       బ్రహ్మ, దైవ, అర్ష, ప్రజాపత్య, గాంధర్వ, అసుర, రాక్షస, పైశాచ, వివిధ వివాహపద్ధతులు చోటుచేసుకున్నాయి. వితంతు పునర్వివాహాలు నియోగ పద్ధతిలో జరిగేవి (భర్త చనిపోయిన స్త్రీకి పిల్లలు లేకపోతే తన భర్త సోదరుడిని వివాహం చేసుకోవచ్చు). బహుభార్యత్వం అత్యధికంగా ఉండేది.

      గార్గి, మైత్రేయి అనే కవయిత్రి వర్గం ఉండేది. 'గార్గి' అనే కవయిత్రి యాజ్ఞవల్క్యుడితో వేదసంవాదానికి దిగిందని బృహదారణ్యక ఉపనిషత్‌లో పేర్కొన్నారు.
 ఆర్థిక వ్యవస్థ
       మలివేద ఆర్యుల వ్యవసాయ పద్ధతుల గురించి తెలిపే గ్రంథం శతపథ బ్రాహ్మణం. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. సంచార జీవితానికి స్వస్తి పలికి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పురావస్తు తవ్వకాల్లో క్రీ.పూ. 1000 నాటికి ఆర్యులు వాడిన ఇనుప పనిముట్లు హస్తినాపురం లాంటి నగరాల్లో లభించాయి. శతపథ బ్రాహ్మణంలో ఏరువాక ఉత్సవాలు జరిపినట్లు పేర్కొన్నారు.

జనకుడికి సీత లభించటం, బలరాముడిని హలాధరుడిగా వర్ణించడం, 24 ఎద్దులతో ఏర్పాటు చేసిన నాగళ్లతో వ్యవసాయం చేయడం లాంటి కథలు మలివేద కాలంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. వరి, గోధుమ, బార్లీ, నూనె గింజలు ప్రధాన పంటలు. వ్యవసాయంలో వినియోగించిన సహజ ఎరువులు సాకృత (పేడ), కరిష్మా (ఆవుపేడ). వీరు మచ్చిక చేసిన జంతువులు ఆవు, ఎద్దు, గొర్రె, మేక, గుర్రం, ఒంటె, గాడిద. గోవును అదితి రూపంగా భావించారు. మలివేదకాలంలో వర్ణించిన నదులు- నర్మద, గండక్, చంబల్. పర్వతాలు - వింద్య పర్వతాలు. ఎరుపు, బూడిదరంగు కుండలు తయారు చేసేవారు. కానీ ఎక్కువగా బూడిద వర్ణపు కుండల (P.G.W. - Painted gray ware) కు ప్రాధాన్యత ఇచ్చారు. మలివేద కాలం చివరినాటికి నాణేల చెలామణి మొదలైంది. వస్తు మార్పిడి విధానం క్రమంగా వెనుకబడింది. నిష్కం - బంగారు నాణెం (రుగ్వేద కాలంలో నిష్కం ఆభరణంగా ఉండేది). శతమాన - వెండినాణెం. కర్షఫణ - రాగి నాణెం. 320 రటలతో సమానమైన బరువున్న నాణెం నిష్క. 20 రటలకు సమానమైంది శతమాన. బృహదార్యణక ఉపనిషత్‌లో ప్రస్తావించిన తూనిక - కొలత 'పాద'. గ్రామీణ ప్రాంతాల వెంట రహదారుల్లో ప్రయాణించే శకటం 'విపాది'.

యజ్ఞయాగాది క్రతువుల్లో జంతు బలులు పెరిగాయి. యజ్ఞయాగాదుల అనంతరం మాంసాన్ని తినేవారు. అతిథులకు గోమాతను వడ్డించేవారు. 'గోఘ్న' అంటే గోవు మాంసాన్ని భుజించిన అతిథి అని అర్థం. నపుంసకులు, అడవి జంతువులు, ఒంటె, ఏనుగు మొదలైనవి బలి ఇవ్వడానికి అనర్హమైనవిగా శతపథబ్రాహ్మణం తెలిపింది. వాజపేయ యాగం లాంటి యాగాన్ని గ్రీకులు కూడా నిర్వహించేవారని హోమర్ పేర్కొన్నారు.

 వేదాలు                        ఉచ్చరించేవారు 
 రుగ్వేదం                              హోత్రా 
 యజుర్వేదం                      ఆధ్వర్యు 
 సామవేదం                       ఉద్గాత్ర 
 అధర్వణవేదం                     బ్రాహ్మణ 



0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again