పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 16, 2014

శాతవాహన అనంతర యుగం

శాతవాహన అనంతర యుగం  
శాతవాహన సామ్రాజ్యం అస్తమించిన తరువాత ఆంధ్రదేశంలో చిన్న చిన్న రాజ్యాలు స్థాపితమయ్యాయి. సామంత మాండలిక ప్రభువులు తమ పాలనా ప్రాంతాల్లో స్వతంత్రులయ్యారు. అలాంటి సామంత రాజుల్లో ఇక్ష్వాకులు, పల్లవులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు ముఖ్యులు. వారి చరిత్ర విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
                                          ఇక్ష్వాకులు 
      ఇక్ష్వాకులు విజయపురి రాజధానిగా 75 సంవత్సరాలు ఆంధ్రదేశాన్ని పాలించారు. వీరిని శ్రీ పర్వతీయ ఆంధ్రులని, ఆంధ్రభృత్యులని పురాణాలు పేర్కొంటున్నాయి. క్రీ.శ. 225 ప్రాంతమంతా ఇక్ష్వాకు రాజ్యాన్ని శ్రీ చాంతమూలుడు స్థాపించినట్లు తెలుస్తోంది. ఈయన మహాసేన విరూపాక్షపతి భక్తుడు. అగ్రిహోత్ర, అగ్నిష్టొమ, అశ్వమేధ యాగాలు చేశాడు. అనేక బంగారు నాణేలను, నాగళ్లను, ఆవులను, భూమిని దానం చేసినట్లు తెలుస్తోంది. 

వీరపురుషదత్తుడు
      ఇతడు చాంతమూలుడి కుమారుడు. వీరపురుషదత్తుడి కాలాన్ని ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావించవచ్చు. బౌద్ధుల భూమిగా ఆంధ్రదేశాన్ని కీర్తించారు. రాణులు అంతఃపుర స్త్రీలు పోటీపడి బౌద్ధమత సంస్థలకు దానధర్మాలు చేశారు. నాగార్జున కొండలో ఉన్న మహాచైత్యాన్ని పునరుద్ధరించారు. హీనయానులకు బుద్ధగయలా, మహాయానులకు నాగార్జున కొండ పుణ్యక్షేత్రమై దూరదేశాలనుంచి యాత్రికులను ఆకర్షించింది. రాజ భాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ అనేక బౌద్ధ నిర్మాణాలు చేసింది. ఆమె తామ్రపర్ణి, కాశ్మీర, గాంధార, తోసలి, అపరాంత, వంగ, వనవాస, యవన ప్రాంతాల్లో బౌద్ధమత ప్రచారం చేసింది. బౌద్ధ భిక్షువులకు అన్ని వసతులతో కూడిన చతుశ్శాలను నిర్మించింది. సింహళ విహారంలో బోధి వృక్ష వేదికను, దేవగిరిపైన ప్రార్థనా మందిరాన్ని, పూర్వశైలమున తటాకాన్ని నిర్మించింది. ప్రపంచంలోని బౌద్ధ సన్యాసులు, ప్రచారకులు, గురువులు వేలసంఖ్యలో నాగార్జునకొండ బౌద్ధక్షేత్ర సందర్శనకు వచ్చేవారు. అక్కడ మహావినశైలీయులు, బహుశుతీయులు, మహీశాసకులు మొదలైన బౌద్ధ శాఖీయులు నివసించేవారు. విదేశీయుల కోసం సింహళ విహారాన్ని నిర్మించారు. వీరపురుషదత్తుడు ఉజ్జయిని రాజకుమారి రుద్రభట్టారికను, తన మేనత్తల ముగ్గురు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. 
ఎహువల చాంతమూలుడు
ఇతడు వీరపురుషదత్తుడి కుమారుడు. ఇతడి సోదరి కొడబలిసిరి నాగార్జున కొండపై ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించింది. ఇతడి సేనాని ఎలిసిరి కుమారస్వామికి సర్వదేవాధివాసం నిర్మించాడు. రాకుమారుడైన రుద్రపురుషదత్తుడు పుష్పభద్రుడనే పేర శివాలయం నిర్మించాడు. ఇతడి కాలం నుంచి శాసనాల్లో సంస్కృత వాడకం ప్రారంభమైంది. చాంతమూలుడి తరువాత అతడి కుమారుడు రుద్ర పురుషదత్తుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడి శాసనాలు గురజాల, నాగార్జున కొండల్లో దొరికాయి. ఇతడే చివరి ఇక్ష్వాకు రాజు.

ఇక్ష్వాకుల పరిపాలన, సంస్కృతి
ఇక్ష్వాకులు దేశాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్ర పాలకులుగా మహాతలవరులు, మహాసేనాపతులు, మహాదండనాయకులను నియమించారు. విదేశీ వ్యాపారంవల్ల విశేషమైన ధనాన్ని ఆర్జించారు. ఆంధ్ర సంస్కృతి విదేశాల్లో వ్యాపించింది. బంగారం, సీసం నాణేలు వ్యాప్తిలో ఉండేవి. కృష్ణా, గుంటూరు, గోదావరి మండలాల్లో సింహలాంఛనమున్న వీరి నాణేలు లభించాయి. ఇక్ష్వాకు వంశస్థాపకుడైన చాంతమూలుడు వైదిక మతం అనుసరించాడు. వీరపురుషదత్తుడు మొదట వైదిక మతానుయాయి. తర్వాత మేనత్తలు, భార్యల ప్రోద్భలంతో బౌద్ధమతాన్ని ఆదరించి, పోషించాడు. విదేశాల నుంచి భక్తులు పారావత మహావిహారం, చైత్యాలయం చూడటానికి వచ్చేవారు. బోధి వృక్షారాధన ఉండేది. బౌద్ధమత విజృంభణ వల్ల జైనమతం మరుగునపడింది. కాపాలిక జైనంవల్ల ఈ మతం ప్రజాదరణను కోల్పోయింది. తిథి, వార, నక్షత్రాలతో కూడిన పంచాంగం ఉండేదని జైనమత గ్రంథమైన 'ధర్మామృతము'లో పేర్కొన్నారు. నాగార్జున కొండ, వేంగి, ధాన్యకటకం ప్రసిద్ధ విద్యాపీఠాలుగా ఉండేవి. ఏలేశ్వర క్షేత్రం ప్రముఖ వైదిక విద్యాకేంద్రంగా ఉండేది. 
                                                                       
 బృహత్పలాయనులు: కృష్ణానది ఉత్తరముఖ ద్వారంలో ఉన్న ప్రాంతాన్ని బృహత్పలాయనులు పాలించారు. జయవర్మ అనే ఏకైక రాజు పాలించినట్లు కొండముది తామ్రశాసనం ద్వారా తెలుస్తోంది. వీరి రాజధాని కోడూరు. జయవర్మ బ్రాహ్మణ మతాభిమాని. ఆయన ఇష్టదైవం మహేశ్వరుడు. కూడూర హారంలోని పంతూర గ్రామాన్ని బ్రహ్మదేయంగా 8 మంది బ్రాహ్మణులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తదనంతరం ఈ రాజ్యాన్ని శాలంకాయనులు ఆక్రమించారు.

శాలంకాయనులు: కృష్ణా తీరానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేంగి కేంద్రంగా శాంతిని పునరుద్ధరించి దక్షిణంగా తమ అధికారాన్ని విస్తరించినవారు శాలంకాయనులు. శాలంకాయన అనేది గోత్రనామం. వీరు బప్పభట్టారక పాదపద్మాలను ధ్యానిస్తూ, పితృపితామహ వ్రపితామహులను తమ శాసనాల్లో వర్ణించారు. వీరు చిత్రరధస్వామి భక్తులు, వృషభ లాంచనులు ఈ రాజ్యస్థాపకుడు విజయదేవవర్మ. ఏలూరు ప్రాకృత శాసనం వేయించాడు. ఈ వంశంలో అశ్వమేధ యాగం చేసినవాడు విజయదేవ వర్మ ఒక్కడే. వేంగిపుర చిత్రరధస్వామి భక్తుడై కూడా పరమ మహేశ్వరుడిగా వర్ణించుకున్నాడు. తరువాత ముఖ్యమైన రాజు హస్తివర్మ. పెదవేగి శాసనం హస్తివర్మను 'సమరావాప్తవిజయ' గా వర్ణించింది. అలహాబాద్ శాసనం ప్రకారం క్రీ.శ.343లో గుప్తచక్రవర్తి అయిన సముద్రగుప్తుడు హస్తివర్మను ఓడించినట్లు తెలుస్తోంది. తరువాత ముఖ్యమైన రాజు విజయనందివర్మ. ఈయన పరమ భాగవతుడు. గుంటుపల్లిలోని బౌద్ధారామ విహారాలకు దానధర్మాలు చేశాడు. పెదవేగి శాశనం వేయించాడు. శాలంకాయనుల్లో చివరివాడు విజయస్కందవర్మ. 
                                                               
సంస్కృతి: తూర్పు దేశాలకు ఆంధ్ర సంస్కృతిని వ్యాపింపజేశారు. శాలంకాయనులు బప్పభట్టారక పాదభక్తులమని చాటుకున్నారు. కాంచీపుర బౌద్ధగురువులను ఆదరించారు. ఆంధ్ర బౌద్ధమతాచార్యుల్లో ఆర్యదేవుడు, బావ వివేకుడు గణనీయులు. శాలంకాయనులు బుద్ధదత్తుడనే సింహళ పండితుడిని వారి రాజ్యానికి ఆహ్వానించి, ఆదరించి బౌద్ధమత ప్రచారం కోసం బర్మాకు పంపారు. బుద్ధదత్తుడు, బుద్ధఘోషుడు బర్మాలోని ఐరావత నదీ పరీవాహ ప్రాంతంలో బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసినట్లు శశవాలంకారం అనే బౌద్ధమత గ్రంథం ద్వారా తెలుస్తోంది. శాలంకాయనులు వైదిక బ్రాహ్మణ మతస్థులైనా అన్ని మతాలను సమానంగా చూశారు. 
  
ఆనంద గోత్రికులు:   ఆనంద గోత్రికులు కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని పాలించారు. రాజధాని కందరపురం. తమను త్రికూట పర్వాదీపులుగా చెప్పుకున్నారు. వీరిలో కందర రాజు పల్లవరాజు నుంచి ధాన్యకటకం గ్రహించి, అమరావతి స్తూప రక్షణ భారం వహించినట్లు తెలుస్తోంది. ఇతడు మొదట బౌద్ధం, తరువాత వైదికమతాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. ఇతడు చేజెర్ల శిలాశాసనం వేయించాడు. అత్తివర్మ గోరంట్ల తామ్రశాసనం వేయించాడు. ఆయన వంకేశ్వరుడి భక్తుడు, శైవుడు. అత్తివర్మను శాసనంలో హిరణ్య గర్భోద్భవ అని వర్ణించారు. దామోదరవర్మ 14 మంది బ్రాహ్మణులకు కంగూర గ్రామదానం అగ్రహారంగా ఇస్తూ, మట్టెపాడు శాసనం వేయించాడు. ఈయన అనంతరం రాజ్యాన్ని విష్ణుకుండినులు ఆక్రమించారు. 
                                                       
విష్ణుకుండినులు:శాతవాహన సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన రాజవంశంలో విష్ణుకుండిన వంశం పేర్కొనదగింది. క్రీ.శ. 5, 6 శతాబ్దాల్లో పాలించిన విష్ణుకుండినులు ఆంధ్రదేశ సంస్కృతికి ఎనలేని సేవచేశారు. వీరి కులదైవం శ్రీపర్వతస్వామి. వీరి చరిత్రకు రెండో విక్రమేంద్రవర్మ వేయించిన చిక్కుళ్ల శాసనం, ఇంద్రవర్మ వేయించిన రామతీర్థం శాసనం, మూడో మాధవవర్మ వేయించిన పొలమూరు, ఈపూరు శాసనాలు ముఖ్యమైన ఆధారాలు. విష్ణుకుండిన వంశస్థాపకుడు ఎవరనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. 


మొదటి గోవిందవర్మ:  ఇతడు ఇంద్రపాలనగర్ తామ్ర శాసనం వేయించాడు. బౌద్ధమతానుయాయి. ఇతడి భార్య పరమ మహాదేవి బౌద్ధమతాభిమాని. ఆమె పేరున ఇంద్రపురిలో చాతుర్దశౌర్య సంఘ బిక్షువులకు మహావిహారం నిర్మించారు. ఈ విహార పోషణకు ఆయన పెణ్కపఱ గ్రామం ఇచ్చాడు. హైదరాబాద్ నగర సమీపంలోని చైతన్యపురిలో మూసీనది తీరాన లభించిన ప్రాకృతశాసనం ఆయన పేరుమీద వెలసిన విహారం గురించి తెలియజేసింది. ఆ కాలంలో ఇంద్రపురి పరమ మహాదేవి విహారం, చైతన్యపురి గోవిందరాజ విహారం, పణిగిరి, గాజులబండ, తిరుమలగిరి, వర్థమాన కోట ప్రాంతాల్లోని బౌద్ధారామ విహారాలు ప్రసిద్ధి చెందాయి. 
                                                                       
ఇంద్రభట్టారకవర్మ: ఇతడు అగ్రహారాలను దానం చేశాడు. ఘటికల పేరున అనేక విద్యా కేంద్రాలు నెలకొల్పాడు. కీసర సమీపంలో ఉన్న ఘటకేశ్వరాలయం ఇంద్రభట్టారక వర్మ నెలకొల్పిన ఘటికాస్థానమే. బ్రాహ్మణులకు భూములను, అగ్రహారాలను దానంగా ఇచ్చాడు. 
                                                                      
నాలుగో మాధవవర్మ: ఇతడికి జనాశ్రయ అనే బిరుదుంది. రాజధాని బెజవాడ. మాధవవర్మ న్యాయపాలన ఎన్నదగింది. న్యాయం చేకూర్చడంలో కుమారుడిని సైతం శిక్షించడానికి వెనుకాడనివాడు. బెజవాడ దుర్గామల్లేశ్వరుల సేవాతత్పరుడు


సంస్కృతి: విష్ణుకుండినులు సింహలాంఛనులు. వీరి శాసన కడియాలపై ఉన్న రాజముద్రికల్లో లంఘించే సింహం ముద్రించి ఉంది. విష్ణుకుండిన వంశంలోని తొలిరాజులు బౌద్ధమతాన్ని అనుసరించారు. బౌద్ధం రాజాదరణ లేక పతనమౌతున్న కాలంలో వీరు ఆదరించారు. అనేక బౌద్ధారామ విహారాలు నిర్మించారు. రెండో మాధవవర్మ కాలం నాటికి వజ్రయాన బౌద్ధం, బౌద్ధమత ప్రచారకుల దుర్నీతివల్ల బౌద్ధమతం ప్రజాదరణ కోల్పోయాయి. విష్ణుకుండినుల కాలంనాటికి కాపాలిక జైనం వల్ల జైన మతం ప్రజాదరణ కోల్పోయింది. కుమారీలభట్టు అనే ఆంధ్రుడు జైనమహర్షి రచించిన పూర్వ మీమాంస సూత్రాలపై తంత్రవార్తిక మహాబాష్యం రాశాడు. ఇతడు, ఇతడి శిష్యులు వేద విద్యలను వ్యాపింపజేసి, ఎందరో జైనులను వైదిక మతంలోకి మార్చారు. విష్ణుకుండినులు అశ్వమేధ, రాజసూయ క్రతువులు చేసి హిందూమతాన్ని ప్రోత్సహించారు. అమరావతి, వేంగిల్లో వేదాధ్యయనానికి ఘటికలు స్థాపించారు. సంస్కృత భాష రాజాదరణ పొందినట్లు తెలుస్తోంది. పరమమహేశ్వరులైన విష్ణుకుండినులు అనేక శైవ గుహాలయాలు నిర్మించారు. బెజవాడ దుర్గ కొండకు దిగువన అక్కన్నమాదన్న గుహలు, మొగల్రాజపురం, ఉండవల్లి, నెల్లూరులోని భైరవునికొండ గుహాలయాలన్నీ శివుడికంకితమైనవే. ఇంకా ఇంద్రకీల పర్వతం, ఇంద్రపురిలోని ఆలయాలు ముఖ్యమైనవి.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again