పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

ప్రభుత్వరంగ సంస్థలు


                  యు.ఎస్.ఎ.లో 1929లో స్టాక్‌మార్కెట్ పతనంవల్ల 1930నాటికి ప్రపంచమంతా ఆర్థిక మాంద్య ప్రభావానికి గురైంది. ఆర్థిక మాంద్య పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వ పెట్టుబడులు అవసరమని జె.ఎం.కీన్స్ భావించారు. ఆనాటినుంచి అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ స్వభావం, అభివృద్ధి స్థాయులతో సంబంధం లేకుండా ఉత్పత్తి, పంపిణి కార్యకలాపాల్లో ప్రభుత్వ పాత్ర, ప్రభుత్వ రంగ ప్రాధాన్యం పెరిగింది.

ప్రభుత్వ రంగం :  ఏ సంస్థ మూలధనంలోనైనా ప్రభుత్వానికి 51% లేదా అంతకంటే అధికంగా వాటాలుంటే అలాంటి వాటిని ప్రభుత్వరంగ సంస్థలు అంటారు. పారిశ్రామిక, వ్యవసాయ, విత్త, వాణిజ్య సంస్థల్లో ప్రభుత్వ యాజమాన్యం, నిర్వహణే ప్రభుత్వరంగం అని ఆర్థికవేత్త హెన్సన్ నిర్వచించాడు.
ప్రభుత్వరంగ సంస్థల లక్ష్యాలు 

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ బ్యూరో ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యాలను పేర్కొంది. అవి:
1. ఆర్థికాభివృద్ధిని సాధించడం.
2. పారిశ్రామికీకరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం.
3. ఆర్థికాభివృద్ధికి అవసరమైన విత్త వనరులను సమీకరించడం. 
4. ఆర్థిక, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
5. పెరుగుతున్న జనాభాకు ఉపాధి అవకాశాలను కల్పించడం.
6. చిన్నతరహా పరిశ్రమలు, అనుషంగిక పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడం.
7. ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతుల ప్రత్యా మ్నాయాలను సాధించడం.
8. ఏకస్వామ్య ధోరణులను నివారించడం. 

             ఈ లక్ష్యాలను సాధించడానికి భారతదేశంలో 1948 పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు అవకాశం ఏర్పరచారు. 1956 పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగానికి పెద్ద పీట వేశారు.

ప్రభుత్వరంగ సంస్థల వృద్ధి :   భారతదేశ పారిశ్రామికీకరణలో ప్రభుత్వ రంగం పాత్ర అత్యంత కీలకమైంది. స్వాతంత్య్రానికి ముందు రైల్వేలు, తంతి తపాలా, ఓడరేవులు, ఆయుధ కర్మాగారాలు, విమానాల తయారీ ప్రభుత్వ యాజమాన్యంలో నడిచేవి. 

             1951 నుంచి 2008-09 నాటికి ప్రభుత్వరంగ సంస్థల సంఖ్య, పెట్టుబడుల వివరాలు కిందివిధంగా ఉన్నాయి.

            


 March 31, 2010 నాటికి కేంద్ర ప్రభుత్యరంగ సంస్థల్లో మొత్తం పెట్టుబడి 
రూ. 5,79,920 కోట్లు          
                                                                    
 2007-08 ఆర్థిక సంవత్సరంలో 160 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్నాయి. వీటి మొత్తం లాభం రూ.91,083 కోట్లు. 53 ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. 

అత్యధిక నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు:
     2009 - 2010లో
1. Air India    2. MTNL     3. BSNL
4. Hindhustan Photo film manufeturing company Ltd

  2010 - 11లో
  1. MTNL   2. BSNL     3. Hindustan Photo film corporation
4. Fertilizer corporation of India

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 2010 - 11లో అత్యధిక లాభాలు  ఆర్జించిన సంస్థలు:       

       1. O.N.G.C.- Oil and Natural Gas Corporation
       2. N.T.P.C. - National Thermal Power Corporation
       3. IOC
       4. NMDC
       5. BHEL

ఉపాధిలో ప్రభుత్వ రంగం వాటా

           2005 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగంలో 180 లక్షల మంది ఉపాధి పొందారు. మొత్తం ప్రభుత్వ రంగ ఉపాధిలో 51% మంది ప్రభుత్వ పరిపాలన, సామాజిక, వ్యక్తిగత సేవల్లో ఉపాధి పొందారు. 49% శ్రామిక జనాభా కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల యాజమాన్యంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపాధి పొందింది.
నికర దేశీయ ఉత్పత్తిలో వాటా 

           1950-51లో నికర దేశీయోత్పత్తిలో ప్రభుత్వ రంగ సంస్థల వాటా 7.5%. 1993-94 నాటికి 23.6%నికి పెరిగింది. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తర్వాత 2005-06 నాటికి 21.7% తగ్గింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు :     2007-08 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ రూ. 98,664 కోట్లు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో రూ.1,22,919 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించారు. 

2011 - 12 మొదటి త్రైమాసికంలో 13.44 బిలియన్ అమెరికన్ డాలర్లు FDI లు వచ్చాయి.

సేవారంగం, టెలికాం, నిర్మాణం, డ్రగ్స్, ఫార్మా, విద్యుత్ రంగాలకు అధిక FDI లు వచ్చాయి.

                                        ప్రభుత్వ సంస్థల వర్గీకరణ
            భారతదేశంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వహిస్తున్నాయి. వ్యవస్థా పూర్వకంగా ప్రభుత్వరంగ సంస్థలను కింది విధంగా వర్గీకరించారు.

శాఖాపరమైన సంస్థలు: కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ శాఖల ఆధీనంలో పనిచేస్తున్నాయి. వీటికి అవసరమైన ఆర్థిక వనరులను బడ్జెట్ ద్వారా కేటాయిస్తారు. వీటి ఆదాయం ప్రభుత్వ ఖజానాలో జమచేస్తారు. ఈ సంస్థలకు ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఆడిట్ నిర్వహిస్తారు. ఇవి పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటాయి. ఉదాహరణకు రైల్వేలు, తపాల, రక్షణ పరిశ్రమలు.

కార్పొరేషన్లు: కార్పొరేషన్లను ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పాటుచేస్తారు. వీటికి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తారు. ప్రతి సంస్థ నిర్వహణకు ప్రభుత్వం డైరెక్టర్ల మండలిని నియమిస్తుంది. ప్రభుత్వ సంస్థలు సంబంధిత మంత్రి నియంత్రణకు లోబడి ఉంటాయి.

ఉదాహరణకు ఎల్.ఐ.సి., స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 

ప్రభుత్వ కంపెనీలు: కంపెనీల చట్టం ప్రకారం జాయింట్ స్టాక్ కంపెనీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కంపెనీలు అంటారు. వీటిలో ప్రభుత్వానికి అత్యధిక వాటాలు ఉంటాయి. లేదా ఏకైక వాటాదారుగా ఉంటుంది. ప్రభుత్వానికి కనీసం 51% కంటే తక్కువగా వాటా ఉండకూడదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఉదాహరణకు హిందూస్థాన్ మెషీన్ టూల్స్, హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.

ప్రభుత్వ రంగ సంస్థలు - లోపాలు - సమస్యలు:  భారతదేశంలో ఆర్థికాభివృద్ధి సాధనలో కీలకపాత్ర వహిస్తున్న ప్రభుత్వ రంగంపై అనేక విమర్శలు ఉన్నాయి. కొన్ని సంస్థలు తప్ప మిగతావన్నీ నష్టాల ఊబిలో కూరుకుని పోయాయి. 1993-94 నాటికి 94 సంస్థలు లాభాల్లో ఉంటే 74 సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. 1995-96 నాటికి నష్టాల్లో ఉన్న సంస్థల సంఖ్య 101కి పెరిగింది. 2008 నాటికి 53 ఉన్నాయి.

ధరల విధానం: ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేస్తున్న వస్తు-సేవల ధరలను నిర్ణయించడానికి లాభాల గరిష్ఠీకరణ సూత్రాన్ని పాటించడం లేదు.
ఉత్పాదకశక్తి అల్ప విని యోగం: ప్రభుత్వ రంగ సంస్థలు తమ అవస్థాపిత శక్తిని వినియోగించుకోలేకపోతున్నాయి.

అధిక సిబ్బంది: ప్రభుత్వ రంగ సంస్థల్లో అధిక సిబ్బంది పనిచేస్తున్నారు. ఉన్న మానవ వనరులనూ సమర్థంగా వినియోగించుకోవడంలేదు. శ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎలాంటి చర్యలను చేపట్టడం లేదు.

అతి మూలధనీకరణ: సంస్థలు తమ మూలధనంపై సముచితమైన రాబడిని ఆర్జించలేకపోతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో విపరీతమైన జాప్యం, యాజమాన్య నిర్వహణలో అసమర్థత, పరిశ్రమల స్థాపన, నిర్వహణలో రాజకీయ జోక్యం, లోపభూయిష్టమైన నియంత్రణలు, ఉద్యోగుల్లో జవాబుదారీతనం లోపించడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు 1991 నాటికి ప్రజల అవసరాలకు తగిన సౌకర్యాలను కల్పించలేక నష్టాల ఊబిలో కూరుకుపోయాయి.

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్థిక సంస్కరణలు:    1991 పారిశ్రామిక విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరులో మార్కెట్ పరమైన క్రమశిక్షణను సాధించడానికి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాను ఉపసంహరించుకోవడాకి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఎంచుకుంది.

పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు:
1. ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం.
2. వ్యూహాత్మకంకాని పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులను సేకరించి ఆరోగ్యం, విద్య, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కల్పనకు మళ్లించడం.
3. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలకు భవిష్యత్తులో వనరులను కేటాయించకుండా నిరోధించడం.
4. ప్రభుత్వ రుణ భారాన్ని తగ్గించుకోవడం. 

రంగరాజన్ కమిటీ :పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సూచించడానికి 1992 నవంబరులో రంగరాజన్ అధ్యక్షతన పెట్టుబడుల ఉపసంహరణ కమిటీని నియమించారు.

కమిటీ సిఫార్సులు:
¤ కీలక రంగాల్లో ప్రభుత్వం తన వాటాను 51%నికి తక్కువ కాకుండా పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించాలి.

¤ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో 74% వరకు ఈక్విటీని విక్రయించుకోవచ్చు.

¤ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలుగా మార్చాలి. 

             రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు 1996 ఆగస్టులో జి.వి. రామకృష్ణ అధ్యక్షతన పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ కమిషన్ ప్రభుత్వరంగ సంస్థలను కోర్ పరిశ్రమలు, నాన్‌కోర్ పరిశ్రమలు అని విభజించి, కోర్ పరిశ్రమల్లో 49% వరకు వాటాను ఉపసంహరించుకోవచ్చని పేర్కొంది. 
             1999 మార్చి 16న ప్రభుత్వ రంగ సంస్థలను వ్యూహాత్మక సంస్థలని, వ్యూహాత్మకంకాని సంస్థలని వర్గీకరించి, వ్యూహాత్మక పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగించరాదని నిర్ణయించారు. వ్యూహాత్మకంకాని పరిశ్రమల్లో 49% వరకు పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగించవచ్చు. 

             1992 నుంచి 1999-2000 వరకు పెట్టుబడుల ఉపసంహరణ ఒకే విధంగా ఉండేది. 1999-2000లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కొనసాగించడానికి ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేశారు.   

1991-92 నుంచి 2007-08 వరకు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం రూ. 51,609 కోట్లను సమీకరించుకుంది. 2011-12 లో 40,000 కోట్ల రూపారయలు లక్ష్యం కాగా లేవలం 14,000 కోట్లు మాత్రమే ఉపసంహరించింది. 

నవరత్నాలు :     1997లో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు కార్యకలాపాల నిర్వహణలో ఆర్థికపరంగా, వాణిజ్యపరంగా స్వయం ప్రతిపత్తి కల్పించడానికి నవరత్న హోదాను ప్రభుత్వం ప్రకటించింది. పరిశ్రమలకు నవరత్న హోదాను క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది. నవరత్న హోదా ఉన్న పరిశ్రమలు రూ.1000 కోట్ల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చు పెట్టుకోవచ్చు. మొదటిసారిగా తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా కల్పించారు. అవి:

     1. I.O.C. 
     2. H.P.C.L.
     3. B.P.C.L.
     4. O.N.G.C.
     5. I.P.C.L.
     6. N.T.P.C.

1998లో G.A.I.L, M.T.N.L. కు నవరత్న హోదా కల్పించారు.

            I.P.C.L. లో ప్రభుత్వ వాటాను రిలయన్స్‌కు, V.S.N.L. ను TATA కంపెనీకి విక్రయించడం వల్ల ఈ రెండు సంస్థలు నవరత్న హోదా కోల్పోయాయి. 

           ప్రభుత్వం B.E.L., H.A.L., Power Finance, నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్, National Mineral Development Corporation, Power Grid Corporation Of India, Rural Electrification Corporation, National Aluminium Company,  Shipping Corporation Of India, Coal India Limited లకు నవరత్న హోదా కల్పించింది. 

            నవరత్న హోదా పొందిన ప్రభుత్వరంగ సంస్థలకు కాకుండా, సాధారణ లాభాలను ఆర్జిస్తున్న మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థలకు మినీ నవరత్న హోదా కల్పించారు. మినీ నవరత్న హోదా ఉన్న సంస్థలు రూ. 500 కోట్ల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చుపెట్టవచ్చు. నవరత్న హోదా ఉన్న సంస్థలను మినీ నవరత్న-1, మినీ నవరత్న-2 అని వర్గీకరించారు. గడిచిన మూడు సంవత్సరాల్లో ఏ సంవత్సరమైనా కనీసం 30 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించిన ప్రభుత్వరంగ సంస్థలను మినీనవరత్న-1 అంటారు. మినీరత్న-1 48 సంస్థలు, మినీరత్న- 2  15 మెత్తం 63 సంస్థలు ఉన్నాయి.

"మహరత్న" కంపనీలను   2009 లో ప్రవేశ పెట్టారు.
అర్హతలు :
1) 3 సంవత్సరాలు లాభం సాదిస్తూ ప్రతిసంవత్సరం నికర లాభం రూ.5,000 కోట్లు ఉండాలి.

2) నికర ఆస్తులు - రూ.15,000 కోట్లు ఉండాలి.

3) సంవత్సర టర్నోవర్  రూ. 25,000 కోట్లు

ప్రస్తుతం  5 సంస్థలకు మహారత్నహోదా ఉంది. అవి
1) ONGC  2) NTPC  3) SAIL  4) IOCL   5) CIL

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again