పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 18, 2014

తూర్పు చాళుక్యులు - I


తూర్పు చాళుక్యులు  - I
             ఆంధ్రదేశ చరిత్రలో సముచిత స్థానమాక్రమించిన తూర్పు చాళుక్య వంశీయులు క్రీ.శ.7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు పాలించారు. బాదామి చాళుక్యుల్లో ముఖ్యుడైన రెండో పులకేశి తూర్పు దక్కన్‌ను (కోస్తాంధ్ర జిల్లాలను) తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుడి సహాయంతో జయించాడు. ఆంధ్ర ప్రాంతానికి రాజప్రతినిధిగా కుబ్జవిష్ణువర్ధనుడిని నియమించాడు. పులకేశి మరణానంతరం వేంగి స్వతంత్ర రాజ్యమయ్యింది. కుబ్జవిష్ణువర్ధనుడే దీనికి మూల పురుషుడు. తూర్పు చాళుక్యుల చరిత్రకు సంబంధించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.

కుబ్జవిష్ణువర్ధనుడు:  ఈయనకు విషమసిద్ధి, మకరధ్వజుడనే బిరుదులున్నాయి. కుబ్జవిష్ణువర్ధనుడి తిమ్మాపుర శాసనం అతడిని పరమ భాగవతుడిగా, విష్ణు భక్తుడిగా వర్ణించింది. అతడి భార్య అయ్యణ మహాదేవి జైన మతాభిమాని. బెజవాడలో కవరూరి గణజైనులకు నెడుంబవసది నిర్మించింది.

గుణగ విజయాదిత్యుడు :    ఇతడు తూర్పు చాళుక్య రాజుల్లో గొప్పవాడు. ఇతడు రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడిని జయించి, రాష్ట్రకూటుల దగ్గర నుంచి వారి సార్వభౌమ చిహ్నాలైన పాళిధ్వజం (సార్వభౌమత్వ చిహ్నం), గంగా యమున తోరణం (గంగా యమున చిహ్నాలు - గంగా యమునపై అధికారాన్ని సూచిస్తాయి) మొదలైనవి గ్రహించాడు. 

సీసలి తామ్ర శాసనం, అద్దంకి శిలా శాసనం వేయించాడు. ఇతడి సైన్యాధిపతి పాండురంగడు పులికాట్ తీరంలో పాండురంగం అనే పట్టణాన్ని నిర్మించాడు. గుణగ విజయాదిత్యుడు బిరుదాంకప్రోలు (బిక్కవోలు) అనే పట్టణాన్ని నిర్మించి అక్కడ చంద్రశేఖరాలయం నిర్మించాడు.

చాళుక్య భీముడు : ఇతడు గోదావరి ఒడ్డున ద్రాక్షారామంలో భీమేశ్వరాలయం కట్టించాడు. సామార్లకోట సమీపంలో చాళుక్య భీమవరం అనే పట్టణాన్ని నిర్మించి అక్కడ భీమేశ్వరాలయం నిర్మించాడు. సమస్త విద్యల్లో ప్రవీణులైన మల్లపను, అతడి కూతురైన చల్లవను పోషించాడు. ఆమెకు గాంధర్వ విద్యా విశారద అనే బిరుదుండేది. ఆమెకు భీముడు అత్తిలి గ్రామాన్ని దానం చేశాడు. ఈయన సామంతుడైన చాత్రపుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గర పార్దేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు.

సాంఘిక పరిస్థితులు  : ఆంధ్ర సంస్కృతి విశిష్టమైంది. సమాజంలో బ్రాహ్మణులకు గౌరవప్రధమైన స్థానముండేది. వారు ఆలయ భూములు, అగ్రహారాల భూములు స్వాధీనం చేసుకుని భూస్వాములుగా రూపొందారు. వారు వేదాధ్యయనం, గ్రంథరచన చేస్తూ క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ రాజుల దగ్గర మంత్రులుగా, సేనానులుగా ఉండేవారు. వైశ్యులు వాణిజ్యం చేసేవారు. వీరి వర్తకశ్రేణిని నకరం అనేవారు. నకర ప్రధాన కేంద్రంగా పెనుగొండ (పశ్చిమ గోదావరి జిల్లా) ఉండేది. 

దీనికి 17 ఇతర కేంద్రాలుండేవి. విదేశీ వాణిజ్యం బర్మా, సయాంలతో జరిగేది. తూర్పు చాళుక్యుల బంగారు నాణేలు బర్మాలో దొరికాయి. సమాజంలో అధిక సంఖ్యాకులైన శూద్రులు వ్యవసాయం మొదలైన వృత్తులు చేసేవారు. చిన్న కులాలు ఏర్పడటం ఈ కాలంలోనే ప్రారంభమయ్యింది. శూద్రులు వ్యవసాయానికే పరిమితమైనా మొదటి నుంచి ప్రత్యేక హక్కులున్న బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాలతో సమాన ప్రతిపత్తి పొందడానికి చేసిన ప్రయత్నాల్లో సఫలీకృతులయ్యారు. ఈ యుగంలోనే పల్నాటి బ్రహ్మనాయుడు వర్ణాంతర వివాహాలను, చాపకూడును, పంచములకు ఆలయ ప్రవేశాన్ని పోత్సహించడం ద్వారా వర్ణ వ్యత్యాసాలను నిరసించిన వీరవైష్ణవ మతాన్ని ప్రచారం చేశాడు. బాల్య వివాహాలు, బహు భార్యత్వం మొదలైన దురాచారాలుండేవి. భోగం స్త్రీలను పోషించడం సంఘంలో అంతస్తుకి చిహ్నంగా ఉండేది. దేవుడి జాతరల్లో రాజుతోసహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేవారు. చేబ్రోలులో మహాసేనుడి జాతర జరిగేది. చేబ్రోలు నుంచి ఉరేగింపుగా బెజవాడ వరకు దేవుడి రథాన్ని 25 మైళ్లు తీసుకువచ్చి అక్కడ రాత్రి ఉంచి మరుసటిరోజు చేబ్రోలుకు తీసుకెళ్లేవారు.

హిందూమతం : వేంగి చాళుక్యులు ప్రాయికంగా వైదిక ధర్మాన్ని అభిమానించారు. పూర్వమీమాంస పద్ధతిని ప్రచారం చేసిన కుమారీలభట్టు ఈ యుగంలోనే జీవించాడు. అతడు ఆంధ్రుడు. వీరు బ్రాహ్మణులకు అగ్రహారాలిచ్చి వేద విద్యలను పోషించారు. ప్రజల్లో హిందూధర్మ సందేశం ప్రచారం కావడానికి పంచమ వేదమైన భారతాన్ని ఆంధ్రీకరింపజేశారు. భక్తి ప్రధానమైన శైవమతం ప్రజల మనసు చూరగొంది. మహాసేనుడు చాళుక్యుల ఇష్ట దైవం. 

శైవంలో అనేక శాఖలుండేవి. దీనిలో ప్రాచీనమైంది పాశుపతం. లకులీశ్వరుడు స్థాపించాడు. తమ ప్రాబల్యం కోసం బలప్రయోగానికి కూడా వెనుకాడేవారుకాదు. ఆంధ్రదేశంలో జైన, బౌద్ధాల విధ్వంసంలో వీరు ప్రధాన భూమికను పోషించారు. వీరి మత ప్రచారం కోసం బెజవాడ, అమరావతిల్లో సింహపరిషత్తులు స్థాపించారు. అలంపురం, ద్రాక్షారామం, శ్రీశైలాలు వీరి కేంద్రాలుగా ఉండేవి. రాజులు శైవ మతాబివృద్ధికి పాటుపడ్డారు. వీరశైవం ఆంధ్రదేశంలో బాగా విస్తరించింది. పండితత్రయంగా ప్రసిద్ధులైన శ్రీపతి, శివలెంకమంచెన, మల్లికార్జునపండితారాధ్యులు ఆంధ్రదేశంలో శైవ విస్తరణకు బాధ్యులు. మల్లికార్జునపండితుడు ద్రాక్షారామ నివాసి. తమిళదేశంలో రామానుజుడు ప్రారంభించిన వైష్ణవ మతం ఆంధ్రదేశంలో వ్యాపించి శైవంతో పోటీ పడింది
.
 జైనమతం  :    ఈ మతం వేంగి చాళుక్యుల కాలంలో రాజాదరణ పొందింది. అమ్మరాజు సర్వలోకాశ్రయ, కటకాభరణ అనే జినాలయాలను నిర్మించి ఒక్కో ఆలయానికి ఒక్కో సత్రం కట్టించాడు. అందులో ఉచిత భోజన సదుపాయం కల్పించాడు. అమ్మరాజు భార్య చామెకాంబ సర్వలోకాశ్రయజిన భవనానికి కలుచుంబుర్రు గ్రామాన్ని దానమిచ్చింది. ఆంధ్రదేశంలో మూల, యాపనీయ, గౌళి, ద్రావిడ సంఘాలుండేవి. జైనులు ప్రభువుల నుంచి దానధర్మాలు గ్రహించి బిక్షగృహాలు, సత్రాలు నిర్వహిస్తూ బీదసాదలకు, నిరాశ్రయులకు సేవ చేసేవారు. కొందరు సారస్వత కృషి జరిపారు. పద్మవ్రభమలదరిదేవుడు కొండకుందాచార్యుడి నియమసారపై తాత్పర్యవృత్తి అనే భాష్యం రాశాడు. ఉగ్రాదిత్యుడు కళ్యాణకారిక అనే వైద్యగ్రంథం రచించాడు. జైనులు ప్రజల బాషలో గ్రంథ రచన చేస్తూ మత ప్రచారం చేశారు. 

ఈ కాలం జైన గురువుల్లో అర్హనందిన్, దిననందిన్ అనేవారు ప్రసిద్ధులు. రాజమహేంద్రవరం, అత్తిలి, బెజవాడ, కొల్లిపాక, వూదూరు మొదలైనవి ముఖ్య జైన కేంద్రాలుగా ఉండేవి. హిందువుల ప్రభావంతో జైనుల్లో వర్ణవ్యవస్థ ఏర్పడింది. మల్లారెడ్డి అనే శ్రావకుడు దైవం ఏకం అనే భావనతో జిన, బుద్ధ, శివ, విష్ణు ఆలయాలు నిర్మించినట్లు బెక్కల్లు శాసనం తెలుపుతుంది. తీవ్రవాద శైవుల ప్రాబల్యంతో జైనం క్షీణించింది. జైనుల్లో పెక్కుమంది సంఘ బహిష్కరణకు భయపడి శైవమతంలో చేరారు. అలాంటివారిలో విశ్వబ్రాహ్మణులు ముఖ్యులు. జైనాలయాలను శైవులు ధ్వంసం చేశారు.

బౌద్ధమతం :    చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధం క్షీణించింది. క్రీ.శ 7వ శతాబ్దంలోనే బౌద్ధమతం క్షీణదశలో ఉన్నదని, దేవతా పూజ ఎక్కువయ్యిందని చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. పెక్కు బౌద్ధారామాలు హైందవ దేవాలయాలుగా మారాయని ప్రతీతి.

విద్య, సారస్వత భాషా వికాసం:  చాళుక్యుల కాలంలో విద్యాభ్యాసం అగ్రహారాలు, ఘటికాస్థానాల్లో జరిగేది. చతుర్దశ విద్యలతోపాటు ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వ అర్థశాస్త్రాల్లో బోధన జరిగేది. వీరు అసనాపురంలో మూల ఘటిక స్థాపించారు. ఈ ఘటికాస్థానంలో కటిశర్మ ఘటికా సామన్యుడని నిడుపర్రు శాసనం తెలుపుతుంది. ఆంధ్రలో చాళుక్య రాజ్యం స్థాపించేనాటికి సంస్కృతం రాజ భాషగా ఉండేది. తెలుగు వాఞ్మయానికి శ్రీకారం చుట్టింది వేంగి చాళుక్యుల కాలంలోనే. చాళుక్య వంశస్థాపకుడైన కుబ్జవిష్ణువర్ధనుడి చేజెర్ల శాసనంలో సగంపైగా తెలుగు ఉంది. 

ఆయన కుమారుడు జయసింహవల్లభుడి విప్పర్ల, మాచెర్ల శాసనాలు తెలుగు శాసనాలు. రేనాటి చోళరాజైన ధనుంజయుడు తొలి తెలుగు శాసనమైన కలమళ్ళ శాసనాన్ని వేయించాడు. గుణగవిజయాదిత్యుడి కాలం ఆంధ్ర కవిత్వ చరిత్రలో ప్రథమ ఘట్టం. మాత్రాగుణ బద్ధమైన దేశీయ చందస్సుతో కవిత్వ రచన ప్రారంభమైంది. గుణగవిజయాదిత్యుడి సైన్యాధిపతి పండరంగడి అద్దంకి శాసనంలో తరువోజ వృత్తం ఉంది. గుణగని సీసలి శాసనంలో ప్రాసతోకూడి చంపకమాలా వృత్తముంది. తర్వాత కొద్దికాలానికే వేసిన కందుకూరు, ధర్మవరం శాసనాల్లో సీస పద్యాలున్నాయి. యుద్ధమల్లుడి కాలం ఆంధ్రభాషా చరిత్రలో మరో ముఖ్య ఘట్టం. ఈయన మధ్యాక్కరలతో నిండి ఉన్న బెజవాడ శాసనం వేయించాడు. రాజరాజనరేంద్రుడి కాలంనాటికి తెలుగు భాషా స్వరూప పరిణామం పూర్తయ్యింది. ఆదికవిగా ప్రసిద్ధుడైన నన్నయ అతడి ఆస్థాన కవే. నన్నయ రాజరాజనరేంద్రుడి కోరిక మేరకు ఆంధ్రమహాభారత రచనకు పూనుకున్నాడు. ఆది, సభా పర్వాలు రచించాడు. నన్నయకు మహాభారత రచనలో సహాయం చేసిన నారాయణభట్టు అనే కవికి రాజరాజనరేంద్రుడు నందపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. రాజరాజనరేంద్రుడి ఆస్థానంలో ఉన్న మరో కవి పావులూరి మల్లన. ఆయన క్లిష్టమైన గణితశాస్త్ర సమస్యలు సుభోదకమయ్యేలా తెలుగు పద్యాలుగా రచించాడు. ఆయనకు రాజు నవఖండవాడ అగ్రహారాన్నిచ్చాడు. కవిగాయక కల్పతరువనే బిరుదు ధరించిన అమ్మరాజు ఆస్థానంలో మాధవభట్టు, పోతనభట్టు, భట్టదేవుడు అనే కవులుండేవారు. వారిలో భట్టదేవుడు కవి చక్రవర్తి బిరుదాంకితుడు. జైనులైన పద్మకవి, రేచనలు తెలుగులో రచనలు చేశారు.


దేవాలయాలు :   తూర్పు చాళుక్యుల నిర్మాణాల్లో పల్లవ చాళుక్య ప్రభావం కనిపిస్తుంది. అమ్మరాజు రాజమహేంద్రవరం (రాజమండ్రి) అనే నూతన నగరాన్ని నిర్మించాడు. నరేంద్ర మృగరాజుగా పేరుగాంచిన రెండో విజయాదిత్యుడు 108 నరేంద్ర మృగేశ్వరాలయాలు నిర్మించాడు. గుణగ విజయాదిత్యుడు బిక్కవోలులో రాజరాజేశ్వర, గోలింగేశ్వర, చంద్రశేఖర దేవాలయాలను నిర్మించాడు. యుద్ధమల్లుడు బెజవాడలో కార్తికేయ దేవాలయాన్ని నిర్మించాడు. చాళుక్య భీముడు సామర్లకోట, ద్రాక్షారామ, చేబ్రోలులో భీమేశ్వరాలయాలు నిర్మించాడు. పంచారామాల్లోని భీమవరం, పాలకొల్లు, అమరావతి ఆలయాలు చాళుక్యుల నిర్మాణాలే. అలంపురంలో నవబ్రహ్మ ఆలయం, సంగమేశ్వర్, కడమలకాల్వ, మహానంది ఆలయాలు నిర్మించారు. 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again