పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 16, 2014

భారత స్వాతంత్య్ర ఉద్యమం - II               బ్రిటిష్ వలస విధానానికి వ్యతిరేకంగా భారతీయులు చేసిన సుదీర్ఘ సమరంలో చివరి మహత్తర పోరాటం క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వారిని దేశం వదలి వెళ్లిపొమ్మని చేసిన ఉద్యమాన్నే క్విట్ ఇండియా ఉద్యమం అంటారు. ఈ ఉద్యమం వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయం దగ్గరపడింది. ప్రపంచదృష్టిని ఆకర్షించిన క్విట్ ఇండియా ఉద్యమానికి ఆంధ్రరాష్ట్రం కూడా తనవంతు తోడ్పాటును అందించింది.

ఆంధ్రలో క్విట్ ఇండియా ఉద్యమం 
               రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొదట జపాన్ చేతిలో బ్రిటన్ పరాజయం పాలైంది. భారతీయులను సంప్రదించకుండానే భారతీయులు, బ్రిటన్ తరఫున యుద్ధంలో పాల్గొంటారని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధ సమయంలో మిత్రపక్షాల సైన్యాలు భారత సైన్యాన్ని అవమానపరిచాయి. మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, యుద్ధంలో బ్రిటన్ ప్రభుత్వానికి భారతీయుల సంపూర్ణ మద్దతు పొందడానికి వచ్చిన క్రిప్స్ రాయబారం వైఫల్యం మొదలైన కారణాలతో క్విట్ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమయింది. ఆంధ్రలో కూడా ఈ ఉద్యమం ఆరంభమైంది.

కర్నూలు సర్క్యులర్: అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 జులై 14న బ్రిటిష్ వారిని దేశం వదలి వెళ్లిపొమ్మని ఒక తీర్మానం చేసింది. దాన్నే క్విట్ఇండియా తీర్మానం అంటారు. 
¤ ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సంఘం 1942 జులై 29న బందరులో సమావేశమై క్విట్ఇండియా ఉద్యమ సన్నా హాలకు ఒక రహస్య సర్క్యులర్‌ను రూపొందించింది. దీన్ని రూపొందించిన వారు కళా వెంకట్రావు.
సర్క్యులర్‌లోని ముఖ్యాంశాలు: నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, పన్నుల నిరాకరణ, రైళ్ల నిలుపుదల, టెలిఫోన్ తీగలు తెంచడం, విదేశీ వస్తువులు, విద్యాసంస్థల బహిష్కరణ మొదలైనవి.

             ఈ రహస్య సర్క్యులర్‌ను అన్ని జిల్లా సంఘాలకు పంపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలపై పోలీసులు దాడిచేసినప్పుడు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రహస్య సర్క్యులర్ ప్రతి పోలీసులకు లభించింది. అందుకే దీన్ని 'కర్నూలు సర్క్యులర్' అంటారు.

బొంబాయి సమావేశం: అఖిల భారత కాంగ్రెస్ సంఘం 1942 ఆగస్టు 8న స్వాతంత్య్ర పోరాటానికి తుదిరూపం ఇచ్చి, క్విట్ఇండియా ఉద్యమం ప్రారంభించాలని తీర్మానించింది. ఈ ఉద్యమం తన జీవితంలో చివరిదని, అందులో విజయమో లేదా మరణమో తప్పదని గాంధీ ప్రకటించారు.

             ఆగస్టు 9వ తేదీ ఉదయమే గాంధీతో సహా ప్రముఖ కాంగ్రెస్ నాయకులందరినీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ ఉద్యమకాలంలోనే అరుణ అసఫ్ అలీ 'హీరోయిన్ ఆఫ్ క్విట్ఇండియా మూమెంట్' అని కీర్తి పొందారు. టంగుటూరి ప్రకాశం, అయ్యదేవర కాళేశ్వరరావు, నీలం సంజీవరెడ్డి తదితర ఆంధ్ర నాయకులను కూడా అరెస్ట్ చేశారు.

ఆంధ్రలో ఉద్యమ స్వభావ స్వరూపాలు: క్విట్ఇండియా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ప్రముఖ ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడంతో నాయకత్వంలేని ప్రజలు హింసాయుత మార్గాలను అనుసరించారు. 

రైల్వేస్టేషన్లపై దాడి: తెనాలి, చీరాల, దుగ్గిరాల, ఒంగోలు మొదలైన ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లపై దాడిచేశారు. తగులబెట్టారు. తెనాలి రైల్వేస్టేషన్‌పై చేసిన దాడి ఆంధ్రదేశమంతా గొప్ప సంచలాన్ని కలిగించింది.

రైలు మార్గాలను విచ్ఛిన్నం చేయడం: గుంటూరు - విజయవాడ, గుంటూరు - తెనాలి, గుంటూరు - మాచర్ల మొదలైన చోట్ల రైలు మార్గాలను విచ్ఛిన్నం చేయడంతో పలు రైలు ప్రమాదాలు జరిగాయి.

పోలీస్ స్టేషన్లు, పోస్టాఫీసులపై దాడి: చీరాల, పాలకొల్లు, అల్లూరు తదితర పోలీస్ స్టేషన్లపై ఉద్యమకారులు దాడులు చేసి, తుపాకులు, లాఠీలను హస్తగతం చేసుకున్నారు. పోలీసులను గాయపరిచారు. గుంటూరులో హిందూ కాలేజీకి చెందిన సుమారు 2000 మంది విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆకివీడు, కళింగపట్నం, పెంటపాడు తదితర ప్రాంతాల్లోని పోస్టాఫీసులపై దాడిచేసి స్టాంపులు, ధనం హస్తగతం చేసుకుని రికార్డులు ధ్వంసం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు: బాపట్ల, చెరుకుపల్లి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు, భీమవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసుపై ఉద్యమకారులు దాడిచేసి రికార్డులను నాశనం చేశారు. తంతి, టెలిఫోన్ సౌకర్యాల విచ్ఛిన్నం: సుమారు 1500 చోట్ల తంతి, టెలిఫోన్ సౌకర్యాలను విచ్ఛిన్నం చేశారు.

శాసనోల్లంఘన ఉద్యమం: హింసాత్మక చర్యలు ఒకవైపు సాగుతూ ఉన్న సమయంలోనే, మరోవైపు శాంతియుతంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి, బందరు, రాజమండ్రి, మదనపల్లి మొదలైన చోట్ల ఉద్యమకారులు బహిరంగ సభలు నిర్వహించారు. పన్నులు చెల్లించరాదని, ప్రభుత్వానికి సహాయపడవద్దని ప్రజలకు ఉద్భోదించారు.     

చెరువు కండ్రిగ, కనపర్తి మొదలైన ఉప్పు కొఠారులపై దాడులు చేశారు. యలమంచిలి, గుంటుపల్లి మొదలైన చోట్ల కాంగ్రెస్ వలంటీర్లు ఉప్పును తయారు చేశారు.

మద్య విక్రయశాలల పికెటింగ్, విదేశీ బహిష్కరణ: పాలకొల్లు, అంకలకోడేరు మొదలైన చోట్ల మద్య విక్రయశాలలను తగలబెట్టారు. గుంటూరు, విజయవాడ, నెల్లూరు మొదలైన చోట్ల మద్యపాన వ్యతిరేక పికెటింగ్‌లు జరిగాయి. విదేశీ వస్తువులను బహిష్కరించారు. విద్యాసంస్థల బహిష్కరణ చురుగ్గా ఆంధ్రరాష్ట్రమంతా జరిగింది.

¤ ఉద్యమకారులు ప్రభుత్వోద్యోగులను రాజీనామా చేయాలని కోరారు. విశాఖపట్నం ఆర్.డి.ఒ., విజయనగరం డి.ఎస్.పి. మొదలైన వారిని రాజీనామా చేయాలని కోరగా, ఉద్యమకారులకు బ్రిటిష్ ప్రభుత్వం కారాగార శిక్ష, జరిమానాలను విధించింది.

¤ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి, భీమవరం, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, రాయలసీమ మొదలైన చోట్ల ఉద్యమంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొని, జైలు శిక్షలు అనుభవించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రాణాలు కూడా త్యాగం చేశారు. రాష్ట్రంలో లాఠీచార్జీలు, కాల్పులు, సామూహిక జరిమానాలు, ఆర్డినెన్స్‌లు మొదలైన వాటి ద్వారా ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసింది.
దారితీసిన పరిస్థితులు

  ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఉద్యమం జాతీయస్థాయిలో ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే..

జపాన్ బ్రిటిషర్లను ఓడించడం: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆగ్నేయాసియాలో బ్రిటిష్ వారిని జపాన్ ఓడించింది. దీంతో బ్రిటన్ భారతదేశాన్ని రక్షించలేదని, దేశం వదిలి పెట్టి వెళ్లిపోవాలని కాంగ్రెస్ బ్రిటన్‌ను కోరింది.

¤ జపాన్ సామ్రాజ్యవాదం భారతదేశ మనుగడకు ప్రధాన ముప్పుగా పరిణమించింది. ఆసియా, ఆసియా వాసులకే అనే నినాదంతో; ఆసియాలో ఉన్న బ్రిటిష్ వలసలన్నింటిపై దండయాత్రలు తప్పవని జపాన్ హెచ్చరించింది. భారతదేశ ప్రజల్లో భయాందోళనలు, బ్రిటిషర్లపై అపనమ్మకం పెరిగాయి.

క్రిప్స్ రాయబారం వైఫల్యం: 1942 మార్చిలో ఇండియా వచ్చిన క్రిప్స్ రాయబార ప్రతిపాదనలు భారతీయుల మనోభావాలను తృప్తి పరచలేదు. రక్షణశాఖను భారతీయులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనను తిరస్కరించారు. స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వడం పరోక్షంగా ముస్లింలీగ్ పాకిస్థాన్ డిమాండ్‌ను బలపరిచినట్లయింది. రెండో ప్రపంచ యుద్ధంలో తనను తాను రక్షించుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్ యుద్ధానంతరం స్వయం ప్రతిపత్తి కల్పిస్తాననడాన్ని కాంగ్రెస్ విశ్వసించలేదు.

¤ రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులను సంప్రదించకుండానే, బ్రిటిష్‌వారు భారతీయులు తమ పక్షాన యుద్ధం చేస్తారని ప్రకటించడం భారతీయుల మనోభావాలను దెబ్బదీసింది. కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ 1939లో రాజీనామా చేసి, బ్రిటిష్ వారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాయి.

¤ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన 1940 మార్చిలో రామ్‌ఘర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో, సంపూర్ణ స్వాతంత్య్రమే తమ అంతిమ లక్ష్యమని, తమకు ఇంకేమీ ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ లక్ష్యసిద్ధికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు ప్రజల్లో ఉత్తే జాన్ని నింపింది.

¤ 1940 ఆగస్ట్ ఆఫర్‌లో లిన్‌లిత్‌గో యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేశాడు. అందులో సైనికశాఖను తన ఆదిపత్యంలో ఉంచు కున్నాడు. భారతదేశంలోని అల్పసంఖ్యాక వర్గాలు ఎటువంటి ఒత్తిళ్లకూ గురి కాకుండా చూస్తామని చెప్పడం, ముస్లింలీగ్ పాకిస్థాన్ డిమాండ్‌కు మద్దతుగా ఆగస్టు ప్రతిపాదనలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి చెందింది.

¤ యుద్ధ సమయంలో మిత్రపక్షాల సైన్యాలు భారత సైన్యాన్ని అవమానపరచాయి. జాతి వివక్ష చూపాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. ఇది భారతీయులను మనస్తాపానికి గురిచేసింది.

¤ యుద్ధకాలంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. ధరలు ఆకాశాన్నంటుతున్నా, బ్రిటన్ పట్టించుకోలేదు. భారతీయ సామాజిక వర్గాలపై పడిన ఆర్థిక భారాన్ని ప్రజలు మోయలేక, దేశం నుంచి బ్రిటిషర్లను నిష్క్రమింపజేయడమే సమస్యకు పరిష్కారమనే అభిప్రాయానికి వచ్చారు.

¤ యుద్ధసమయంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, యుద్ధానంతరం స్వాతంత్య్రం ఇవ్వాలనే డిమాండ్‌తో యుద్ధ సమయంలో బ్రిటన్‌కు బాధ కలిగించకుండా వ్యక్తి సత్యా గ్రహం చేసినా, దానికి బ్రిటన్ నుంచి స్పందన రాలేదు. దీంతో బ్రిటన్‌పై భారతీయులకు నమ్మకం పోయింది.

¤ బ్రిటిష్ ప్రభుత్వ విధానం వల్ల దేశంలో నెలకొన్న అరా చక పరిస్థితుల కంటే, బ్రిటిష్‌వారు వైదొలగేటప్పుడు ఏర్పడే అలజడుల ప్రభావం ఎక్కువగా ఉండదని గాంధీ భావించడం మరో ఉద్యమానికి దారితీసింది.

¤ 'బ్రిటిష్ ప్రభుత్వంపట్ల విధేయత ప్రకటించడం, దేవుడిపట్ల, మానవత్వంపట్ల నేరం చేయడమే' అని గాంధీ పేర్కొన్నారు. విజయమో, వీరస్వర్గమో (డూ ఆర్ డై) అనే పిలుపుతో క్విట్ఇండియా తీర్మానం చేశారు. మరుక్షణమే జాతీయ నాయకులందరినీ జైళ్లకు పంపడంతో ఉద్యమం అనివార్యమైంది. 

క్విట్ ఇండియా గమనం: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బొంబాయిలో 1942 ఆగస్టు 8న సమావేశమై క్విట్ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించింది. బ్రిటిష్ పరిపాలన అంతం కావడం కోసం శాంతియుత పోరాటం చేయాలని పేర్కొంది. ఇందుకోసం భారతీయులు సమకూర్చుకున్న అహింసాయుత బలాన్నంతా ఉపయోగించాలని స్పష్టం చేసింది.

¤ క్విట్ ఇండియా తీర్మానం చేసిన మరుసటి రోజు తెల్లవారే సరికి గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్ట్ చేశారు.

¤ జాతీయ, రాష్ట్ర, జిల్లా, తాలూకాస్థాయి నాయకులందరూ జైళ్లపాలు కావడంతో, ఉద్యమం ఎలా జరగాలో నిర్దేశించడానికి నాయకులు కరవయ్యారు. దీంతో ప్రతీ వ్యక్తీ నాయకుడై, తనకు తోచిన విధంగా వ్యవహరించాడు.

¤ ప్రజలు చెట్లను నరికి, రోడ్లపై వేసి, రాకపోకలకు అంతరాయం కలిగించారు. టెలిగ్రాఫ్, టెలిఫోన్ తీగలను తెంపారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, పోస్టాఫీసులను కాల్చి వేశారు.

¤ మహారాష్ట్రలోని సతారాంలో నానాపాటిల్ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతరంగా పోటీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

¤ కర్ణాటకలోని 200 గ్రామాల్లో ప్రభుత్వ రికార్డులు దగ్ధం చేశారు. అహ్మదాబాద్ పురపాలక సంఘాన్ని ప్రభుత్వం రద్దు చేయగా, ఉద్యోగులు సమ్మెకు దిగారు.
¤ బీహార్‌లోని సుల్తాన్‌పూర్‌లో పోటీ ప్రభుత్వం, ఉత్తర భగత్‌పూర్‌లో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

¤ కలకత్తాలోని తామ్లాక్, నందిగ్రామ్ మొదలైన చోట్ల విద్యుత్ వాహిని అనే జాతీయ సైన్యం ఏర్పడింది. 

¤ అస్సాంలో ప్రజల అవసరాలు తీర్చడానికి క్రాంతిసేన అనే స్వచ్ఛందదళ నిర్మాణం జరిగింది.

¤ పట్టణాలతో పాటు గ్రామాల్లో తిరుగుబాటు విస్తృతంగా జరిగింది. గ్రామాల్లో రైతులు తిరుగుబాటుకు మార్గదర్శకత్వం వహించారు. పలుచోట్ల విద్యావంతులైన యువకులు పాల్గొన్నారు.

¤ బొంబాయి, పుణే, సతారా మొదలైన చోట్ల ఆయుధాల సరఫరా కోసం రహస్య సంస్థలు ఏర్పడ్డాయి. నాయకులు రహస్య జీవితం గడిపారు. అజ్ఞాత నాయకుల కోసం ఉషామెహతా, రామ్‌మనోహర్ లోహియా రేడియోలో వార్తలను ప్రసారం చేశారు.

క్షీణత: బ్రిటిషర్లు మెషీన్‌గన్‌లను ప్రయోగించారు. జైళ్లల్లో చిత్రహింసలు పెట్టారు. గ్రామాల్లో పోలీసు, సైనికుల దౌర్జన్యాలు, గృహదహనాలు చోటుచేసుకున్నాయి. మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు.

¤ సామూహిక జరిమానాలు విధించారు. ప్రభుత్వం రూ.90 లక్షలు జరిమానాల కింద వసూలు చేసింది.

¤ జాతీయ నాయకులందరినీ అరెస్ట్ చేయడంతో ఉద్యమ దిశానిర్దేశం చేసేవారు లేకపోయారు.

¤ బ్రిటిష్ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు జరిపి తక్కువ కాలంలోనే ఉద్యమాన్ని అణచివేసింది.

ఉద్యమ ప్రాముఖ్యం: బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచివేయడంలో విజయవంతమైనప్పటికీ, ఇలాంటిదే మరో హింసాయుత, భారీ ఉద్యమాన్ని ఎదుర్కోవడం కంటే సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చింది. 

¤ ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం వల్ల భారత స్వాతంత్య్ర సమస్య నైతికమైందని సర్వత్రా భావించారు. దీనికి ఉదాహరణగా ఆఫ్రికా నుంచి అలస్కా వరకు, ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న 'ఇండియా సంగతేమిటి?' అని వాల్డెన్ విల్కీ తన గ్రంథం 'వన్ వరల్డ్‌' లో రాశాడు.

¤ భారత్‌లో బ్రిటిష్‌వారు చేసిన అకృత్యాలు ప్రపంచానికి తెలిసిపోయినట్లు పెరల్.ఎస్.బక్ అనే నవలారచయిత్రి తెలియజేయగా, అప్పటి మెక్సికో, చైనా అధ్యక్షులు ఇండియాలో జరిగే సంఘటనలకు బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

¤ సాధారణ వ్యక్తులు అంటే రైతులు, శ్రామికులు మొదలైనవారు స్వచ్ఛందంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఉద్యమ నాయకుల అరెస్టుతో తమంతట తామే దిశానిర్దేశంతో ఉద్యమాన్ని నడిపారు.

¤ త్రివిధ దళాలు, ప్రభుత్వోద్యోగులు ఉద్యమం పట్ల ప్రభావితం కావడం గొప్ప విషయమని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ 'ఇండియా విన్స్ ఫ్రీడం'లో తెలియజేశారు.

¤ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యమ అజ్ఞాత నాయకులకు నైతిక, ఆర్థిక సహాయం అందజేయడం విశేషం. అచ్యుత్ పట్వర్ధన్ పోలీసుల కంటబడకుండా ఉండేందుకు మహిళా పారిశ్రామికవేత్త సుమతి మొరార్జీ రోజుకొక మోటర్‌కారు ఇచ్చారు.

¤ అహింసాయుత మార్గాన్ని ఎంతో కాలం పాటించడానికి గాంధీ సైతం సిద్ధంగా లేడనే వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించేలా చేసింది. అంటే ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ, విప్లవ పంథాలో కూడా ప్రజాపోరాటం నడిపించగల శక్తిగా అవతరించింది.

¤ ఉద్యమ తీవ్రతను బట్టి దేశస్వాతంత్య్రం అనివార్యమయిందనే విషయం స్పష్టమైంది. భారతదేశాన్ని ఇక ఎంతోకాలం తమ గుప్పిట్లో పెట్టుకోలేమని, బ్రిటిష్ నాయకులకు అర్థం అయింది.

¤ స్వాతంత్య్ర ఉద్యమాల్లో ఈ ఉద్యమం హింసాత్మకంగా, నాయకత్వం లేని పోరాటంగా మిగిలింది. జాతీయోద్యమ నాయకులను బ్రిటిషర్లు అరెస్ట్ చేయడంతో, ప్రతివ్యక్తీ తనకిష్టమొచ్చిన రీతిలో ఉద్యమాన్ని నడపటంతో పాటు, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించాడు. ఉదాహరణకు 945 పోస్టాఫీస్‌లు, 318 రైల్వేస్టేషన్లు, 12000 ప్రాంతాల్లో టెలిఫోన్, టెలిగ్రాఫ్ సౌకర్యాలు పూర్తిస్థాయిలో నాశనమయ్యాయి.

¤ ఉద్యమం సఫలం కాకపోయినా, పూర్తి స్థాయిలో విఫలమైందనడానికి వీలులేదు. దానివల్ల భారత స్వాతంత్య్రం కనుచూపుమేరలోకి వచ్చింది. 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again