పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 17, 2014

బ్రిటిష్‌పాలనలో భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలు - II


           భారతదేశంలో బ్రిటిష్‌వారు 1773 నుంచి 1858 వరకు చేపట్టిన రాజ్యాంగ సంస్కరణల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 1861 నుంచి 1935 వరకు బ్రిటిషర్లు చేపట్టిన రాజ్యాంగ సంస్కరణల గురించి తెలుసుకుందాం.

1861 శాసనసభల చట్టం
1861 శాసనసభల చట్టాన్ని ప్రవేశ పెట్టడానికి కారణాలు: భారతీయ విద్యాధికులకు, ప్రముఖలకు ప్రభుత్వంలో పాల్గొనాలని, ప్రజలకు కావలసిన విధంగా పరిపాలనా సంస్కరణలు చేయాలనీ కోరిక పెరిగింది.

¤   1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ప్రజల అవసరాలకు, ఇష్టాలకు అనుగుణంగా ప్రవర్తించాలని ఆంగ్లేయులు గ్రహించారు. 

¤   రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా శాసనాలు చేసే అవకాశాలు లేకపోవడం, రాష్ట్రాలకు కావలసిన శాసనాలన్నీ బెంగాల్ గవర్నర్ జనరల్-ఇన్- కౌన్సిల్ చేయడం.

¤ ప్రత్యేకంగా శాసనాలు చేయడానికి సభ అవసరం ఏర్పడటం.

¤   ఈ విధంగా శాసనాలు చేయడానికి ఒక సభ అవసరం అనిపించి, అందులో భారతీయులకు స్థానం కల్పించేందుకు 1861 లో బ్రిటన్ పార్లమెంట్ నూతన చట్టం చేసింది. అదే 1861 శాసనసభల చట్టం.

ముఖ్యాంశాలు : ప్రత్యేకంగా శాసనాలు చేయడానికి మద్రాస్, బొంబాయి, బెంగాల్ రాష్ట్రాల్లో విధానపరిషత్ (లెజిస్లేటివ్ కౌన్సిల్)లను, కేంద్రశాసనమండలి (సెంట్రల్ కౌన్సిల్)ని ఏర్పాటు చేశారు. గతంలో గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్ శాసనాలు చేసేది. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం శాసనాల కోసం ప్రత్యేకంగా రాష్ట్రాల్లో, కేంద్రంలో కౌన్సిల్ ఏర్పాటు చేశారు. 

¤   రాష్ట్రాలు, కేంద్రం చేసే శాసనాల అమలుకు గవర్నర్ జనరల్ ఆమోదం అవసరం.

¤ గవర్నర్ జనరల్‌కు 'వీటో' అధికారాన్ని ఉపయోగించి, ఏ శాసనాన్నయినా రద్దు చేసే అధికారం ఉండేది. 

¤   అత్యవసర సమయాల్లో శాసనమండలి ప్రమేయం లేకుండానే ఆర్డినెన్స్ (ప్రత్యేక రాజశాసనాలు) చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఉండేది. 

¤   కేంద్ర, రాష్ట్ర శాసనమండలిలో సగంమంది అనధికార సభ్యులకు అవకాశం కల్పించారు. ఇందులో భారతీయులకు అవకాశం కల్పించారు. 

¤   పోర్ట్‌ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం గవర్నర్ జనరల్ కార్యనిర్వాహకమండలి సభ్యులకు పరిపాలనా శాఖలు కేటాయించారు. 

¤   గవర్నర్ జనరల్ కార్యనిర్వాహకమండలిలో సభ్యుల సంఖ్యను 4 నుంచి 5 కు పెంచారు. 

గవర్నర్ జనరల్‌కు నూతన రాష్ట్రాలు, వాటి శాసనమండళ్లను ఏర్పాటు చేసే అధికారం కల్పించారు.

చట్టం ప్రాముఖ్యం:
1) వికేంద్రీకరణ ప్రారంభమైంది. అంటే రాష్ట్రప్రభుత్వాలకు శాసనాలను చేసే అధికారాలు ఇచ్చారు.

2) శాసనసభల్లో మొదటిసారిగా భారతీయులకు ప్రాధాన్యం లభించింది.

3) కార్యనిర్వాహకమండలిలో సభ్యులకు పరిపాలనాపరమైన శాఖలు కేటాయించడంవల్ల పరిపాలనా సామర్థ్యం పెరిగింది.

4) గవర్నర్ జనరల్ అధికారాలను విస్తృతం చేశారు. రాష్ట్ర, కేంద్ర శాసనాలను వీటో చేసే అధికారం అతడికి కల్పించారు.

1892 భారత శాసనసభల చట్టం: 1885 లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత శాసనమండలిలో భారతీయుల ప్రాతినిధ్యం పెంచాలని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో 1892 భారత శాసనసభల చట్టం వచ్చింది.

ముఖ్యాంశాలు : కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో అనధికార సభ్యుల సంఖ్యను పెంచారు. అంటే భారతీయులకు ప్రాతినిధ్యం పెరిగింది. 

¤   మొదటిసారిగా ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు (పరోక్ష ఎన్నిక విధానం). దీని ప్రకారం కేంద్ర శాసన సభ్యులను ప్రాంతీయ (రాష్ట్రాల) శాసనసభ్యులు, ప్రాంతీయ శాసన సభ్యులను స్థానిక సంస్థలైన జిల్లాపరిషత్‌లు, మున్సిపాలిటీలు, యూనివర్సిటీ సెనేట్లు ఎన్నుకుంటాయి.

¤   భారతీయ శాసనసభ్యులు అంటే అనధికార సభ్యులకు ప్రశ్నలు వేసే అధికారం, బడ్జెట్‌ను చర్చించే హక్కు ఇచ్చారు. కానీ, బడ్జెట్‌పై ఓటు వేసే హక్కులేదు.

చట్టం - సమీక్ష :  ఫిరోజ్‌షా మెహతా ఈ చట్టాన్ని ''చాలీచాలని అన్నంతో బిక్షమెత్తుకొని జీవించే బిక్షగాడి జీవితం వంటిది'' అని అభిప్రాయపడ్డాడు.
కారణం శాసనమండళ్లలో అనధికార సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది. కేంద్ర శాసనమండలిలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం లేదు.

¤   బడ్జెట్ రూపకల్పనలో భారతీయులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. ప్రశ్నలు అడిగినా, అనుబంధ ప్రశ్నలు అడిగే అవకాశంలేదు. అందుకే మదన్ మోహన్ మాలవ్య ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించే నిరంకుశ విధానానికి తొడ్పడేదని అభిప్రాయపడ్డారు. 

¤   లోపాలున్నప్పటికీ తొలిసారిగా 'ఎన్నికల' విధానాన్ని ప్రవేశపెట్టడం, ప్రభుత్వ విధానాలను చర్చించడం ద్వారా ప్రజాస్వామ్య విధానాలను బలపరచడంలో ఈ చట్టం వీలు కల్పించింది.

1909 మింటో-మార్లే సంస్కరణలు లేదా 1909 భారతప్రభుత్వచట్టం:  ఈ సంస్కరణలు అప్పటి వైశ్రాయ్ మింటో-2, భారతరాజ్య కార్యదర్శి మార్లే ఆధ్వర్యంలో రూపొందాయి. అందుకే వీటిని మింటో-మార్లే సంస్కరణలు అంటారు.

సంస్కరణలకు దారితీసిన పరిస్థితులు :
¤   1892 భారత శాసనసభల చట్టం భారత జాతీయ కాంగ్రెస్ నాయకులను అసంతృప్తికి గురిచేయడం. 

¤   లార్డ్‌కర్జన్ చేసిన బెంగాల్ విభజన వల్ల శక్తివంతమైన స్వదేశీ ఉద్యమం కొనసాగడం. 

¤ అతివాదులను, మితవాదులను వేరుచేసి జాతీయోద్యమాన్ని అణగదొక్కడానికి మితవాద వర్గాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించడం.

¤   ముస్లింలకు ఎన్నికల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలని ముస్లింలీగ్ డిమాండ్ చేయడంతో, దీన్ని అవకాశంగా తీసుకొని విభజించు పాలించు విధానంలో భాగంగా ముస్లింల డిమాండ్‌ను తీర్చాలనుకోవడం.

చట్టంలోని ముఖ్యాంశాలు: ప్రాంతీయ శాసనసభల్లో అనధికార సభ్యులసంఖ్యను అధికార సభ్యుల సంఖ్య కంటే పెంచారు. కేంద్ర శాసన మండలిలో కూడా అనధికార సభ్యుల సంఖ్యను పెంచారు. కానీ, అధికార సభ్యులసంఖ్య మెజారిటీగా కొనసాగింది. 

¤   కేంద్ర, రాష్ట్ర శాసనసభల అధికారాలను విస్తరించారు. అదనపు ప్రశ్నలు వేసే అధికారం, బడ్జెట్‌పై చర్చ, అందులో మార్పులు చేసే అధికారం, ఓటువేసే అధికారాన్ని కూడా భారతీయులకు కల్పించారు. 

¤   ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటుచేశారు. అంటే కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో ముస్లింలకు కొన్ని నియోజకవర్గాలను కేటాయిస్తే ముస్లిం ఓటర్లే వారిని ఎన్నుకుంటారు. 

¤   కేంద్రం, రాష్ట్ర కార్యనిర్వాహక మండలిలో (గవర్నర్ జనరల్, గవర్నర్) భారతీయలకు ప్రాతినిధ్యం కల్పించారు. మొదటిసారిగా కేంద్ర కార్యనిర్వాహకమండలిలో నియమితుడైన భారతీయుడు ఎస్.పి. సిన్హా. ఆయనకు న్యాయశాఖ కేటాయించారు.

చట్టం-సమీక్ష :   ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం, తర్వాతి చట్టాల్లో సిక్కులు, క్రైస్తవులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు దారితీసింది. ఇలా మత ప్రాతిపదికపై ఏర్పడిన ప్రత్యేక నియోజకవర్గాల పర్యవసానమే పాకిస్థాన్ ఆవిర్భవానికి మూలమైంది.

¤ మత ప్రాతిపదికపై నియోజకవర్గాలు ఏర్పడకపోతే, విభేదాలను పరిష్కరించుకోవడం సులభంగా సాధ్యమయ్యేదని మహాత్మాగాంధీ అభిప్రాయపడ్డారు.

¤   ''ఉవ్వెత్తున లేచిన జాతీయ తరంగాలకు, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను అడ్డుకట్టగా ఉపయోగించిన బ్రిటిష్‌వారు రాజకీయ లబ్ధి సాధించారు'' అని కె.ఎం. మున్షీ అభిప్రాయపడ్డారు. 

¤   కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో అనధికారిక సభ్యులకు ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ, వారు చేసిన శాసనాలను 'వీటో' చేసే అధికారం గవర్నర్లు, గవర్నర్ జనరల్స్‌కు ఉండేది. అందుకే 'కూప్‌లాండ్' అనే రచయిత ఈ చట్టాన్ని బ్రిటిష్‌వారికి అనుకూలమైందని వర్ణించాడు. 

¤   భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ చట్టాన్ని ''వస్తువుకు బదులు దాని ప్రతిబింబాన్ని ఇచ్చేదిగా ఉంది'' అని వ్యాఖ్యానించాడు. కారణం హిందూ, ముస్లిం వర్గాలుగా ప్రజలను విభజించి, అల్పసంఖ్యాకులకు అత్యధిక స్థానాలు ఇవ్వడం, అనధికార సభ్యులను స్వతంత్రంగా వ్యవహరించకుండా ఆంక్షలు విధించడం.

1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటేగ్-చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు:    ఈ చట్టం అప్పటి భారత రాజ్యకార్యదర్శి మాంటేగ్, వైశ్రాయ్ చెమ్స్‌ఫర్డ్ ఆధ్వర్యంలో రూపొందాయి. అందుకే వీటిని మాంటేగ్-చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు అంటారు.

సంస్కరణలకు దారితీసిన పరిస్థితులు :
¤   1909 మింటో-మార్లే సంస్కరణలు భారతీయులను తృప్తిపరచక పోవడం
¤ 1916 లో మితవాదులు, అతివాదుల కలయిక జరిగి, స్వపరిపాలన కోసం హోంరూల్ ఉద్యమం ప్రారంభించడంతో భారతీయులను కొంతమేరకు సంతృప్తి పరచాల్సిరావడం.

¤   ముస్లింలీగ్‌తో సంప్రదించకుండానే, 1911 లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దుచేయడంతో, బ్రిటిష్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని భావించి, ముస్లింలీగ్, కాంగ్రెస్‌తో కలసి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడింది. దీంతో ముస్లింలను సంతృప్తి పరచాల్సిరావడం. 

¤   స్వపరిపాలన వస్తుందనే ఆశతో మొదటి ప్రపంచ యుద్ధంలో (1914-1918) భారతీయులు, బ్రిటిష్‌వారికి మద్దతునివ్వడం దానికి అనుగుణంగా భారతీయులను తృప్తిపరచాలనుకోవడం. 

¤   1917 మాంటేగ్ ప్రకటన : బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా భారతదేశంలో స్వపరిపాలనా సంస్థలను అభివృద్ధిచేసి, దశలవారీగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడమే తన లక్ష్యం అని భారత రాజ్యకార్యదర్శి మాంటేగ్ ప్రకటన చేశాడు. పై కారణాలతో 1919 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. అందులోని ముఖ్యాంశాలను గమనిస్తే... 

¤   భారత రాజ్యకార్యదర్శి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా), అతడి కౌన్సిల్ సభ్యుల జీతభత్యాలు ఈ చట్టం ద్వారా ఇంగ్లండ్ నిధుల నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటివరకూ భారతదేశ నిధుల నుంచి ఇచ్చేవారు. 

¤   లండన్‌లో 'భారత హై కమిషనర్' అనే నూతన ఉద్యోగ పదవిని నియమించారు. ఈయన వైశ్రాయ్ ఆధ్వర్యంలో పనిచేస్తూ, భారత ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటాడు. ఈయన లండన్‌లో భారత విద్యార్థుల క్షేమం చూడటం మొదలైన విధులు నిర్వహిస్తాడు. 

¤   రాష్ట్రాల్లో ద్వంద్వ పరిపాలనను ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పరిపాలనా శాఖలను రెండు విభాగాలుగా చేశారు. అవి.. 

¤   ప్రభుత్వాధీన శాఖలు (రిజర్వ్‌డ్) 

¤   శాసనసభ అధీన శాఖలు (ట్రాన్స్‌ఫర్డ్)

¤   ప్రభుత్వ అధీనశాఖలు : ఆర్థిక వ్యవహారాలు, శాంతిభద్రతలు, నీటిపారుదల, వార్తాపత్రికలపై అజమాయిషీ మొదలైనవి. 

¤   శాసనసభ అధీనశాఖలు: స్థానిక స్వపరిపాలన, వైద్యం, విద్య, వ్యవసాయం మొదలైనవి 

¤   రాష్ట్ర పరిపాలన సాగించడానికి గవర్నర్‌కు కార్యనిర్వాహక మండలితోపాటు, కొత్తగా మంత్రివర్గం ఏర్పడింది. ఈ మంత్రిమండలి శాసనసభ్యులతో ఏర్పాటైంది. 

¤   ద్వంద్వ పరిపాలన ప్రకారం ప్రభుత్వాధీన శాఖలు (రిజర్వ్‌డ్) గవర్నర్ కార్యనిర్వాహకసభ అధీనంలో, శాసనసభ అధీనశాఖలు గవర్నర్ ఆధ్వర్యంలోని మంత్రిమండలి అధీనంలో ఉంటాయి. 

¤   రాష్ట్రాల్లో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. అంటే గవర్నర్ అధీనంలోని మంత్రిమండలి శాసనసభకు బాధ్యత వహించాలి. వీరు శాసనసభ విశ్వాసాన్ని కోల్పోతే రాజీనామా చేయాలి. అదే గవర్నర్ అధీనంలోని కార్యనిర్వాహకమండలి సభ్యులు శాసనసభకు బాధ్యత వహించరు. ఇలా గవర్నర్ అధీనంలోని మంత్రిమండలి మాత్రమే బాధ్యత వహించడం వల్ల దీన్ని పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం అంటారు. 

¤   మొదటిసారిగా ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. 

¤   అధికారాల బదలాయింపు కేంద్రం నుంచి రాష్ట్రాలకు జరిగింది. భారత ప్రభుత్వ పరిశాఖలను రెండు విభాగాలుగా విభజించారు. యావద్భారత దేశానికి వర్తించే విషయాలను కేంద్రవిషయాలుగా, రాష్ట్రాలకు వర్తించే విషయాలను రాష్ట్ర విషయాలుగా విభజించారు. 

¤   కేంద్రంలో ద్విసభా విధానాన్ని (దిగువసభ, ఎగువసభలను) ప్రవేశపెట్టారు.
దిగువసభకు శాసనసభ అని, ఎగువసభకు రాజ్యసభ (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్) అని పేరు. దిగువసభ కాలపరిమితి మూడేళ్లు. ఎగువసభ కాలపరిమితి ఆరేళ్లు. గవర్నర్ జనరల్ ఈ సభలను సమావేశ పరచడం, ప్రసంగించడం, సమావేశాలను ఆపడం, రద్దు చేయడం వంటి అధికారాలను కలిగి ఉండేవాడు.

¤   గవర్నర్ జనరల్, గవర్నర్లకు విస్తృత అధికారాలు కల్పించారు. గవర్నర్ జనరల్ ఆమోదం లేనిదే ఏ బిల్లు చట్టం కాదు. ఆయనకు వీటో అధికారం ఉండేది. రాష్ట్రాల్లో గవర్నర్లకు మంత్రిమండలి, సలహామండలి సభ్యుల సలహాలను తోసిపుచ్చి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండేది. బదిలీ చేసిన శాఖను, రిజర్వ్‌డ్ శాఖగా మార్చగలరు.

1919 భారత ప్రభుత్వ చట్టం - సమీక్ష :  రాష్ట్ర స్థాయిలో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానం విజయవంతం కాలేదు. కారణం కార్య నిర్వాహక మండలి సభ్యులకు, మంత్రిమండలి సభ్యులకు మధ్య సఖ్యత లేకపోవడం. ఉదా: వ్యవసాయ శాఖ మంత్రికి నీటి సరఫరా చేసే అవకాశం లేదు. దీనివల్ల పంటలు నాశనమయ్యేవి. 

¤   రిజర్వ్‌డ్ శాఖలు నిర్వహించే కౌన్సిలర్లు ఆంగ్లేయ ఉద్యోగవర్గం. వీరు భారతీయ మంత్రులను చిన్న చూపు చూస్తూ భారతీయ మంత్రుల సలహాలు, ఆదేశాలను పాటించేవారు కాదు. 

¤   ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రవేశపెట్టినా, ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనేక అర్హతలు, నిబంధనలు ప్రవేశపెట్టి పరిమితం చేశారు. 

¤   ఈ చట్టం మొదటిసారిగా స్త్రీలకు ఓటు వేయడానికి హక్కు కల్పించింది. ఇది శుభపరిణామం. 

¤   శక్తిమంత రాజకీయ పార్టీలు ఉన్నచోట్ల ద్వంద్వ పరిపాలన విజయవంతం అయింది.ప్రజలకు విద్యా సౌకర్యాలు, రైతులకు శిక్షణ మొదలైనవి కల్పించారు.

¤   ఈ సంస్కరణలు విమర్శలకు గురైనప్పటికీ, బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనా గమనంలో వీటిని ముఖ్యమైన మజిలీగా చెప్పవచ్చు. 

¤   ఈ చట్టం ద్వంద్వ ప్రభుత్వ విధానం ద్వారా దేశంలో మొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని స్థాపించింది. ఇదే నేటి పార్లమెంట్ విధానానికి ఆధారం.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again