పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 16, 2014

భారత స్వాతంత్య్ర ఉద్యమం - III


            భారతీయ సైన్యం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ (బ్రిటన్ తరఫున పోరాడుతూ) జపాన్ చేతిలో పట్టుబడింది. ఈ విధంగా బందీలైన భారతీయ యుద్ధ ఖైదీలందరూ, బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత జాతీయసైన్యంగా ఏర్పడ్డారు. భారత జాతీయ సైన్యాన్ని మొదటగా 1942లో మోహన్‌సింగ్ స్థాపించాడు. ఈయన బ్రిటిష్ ఇండియన్ సైన్యంలో ఉద్యోగి. 1942 ఫిబ్రవరిలో సింగపూర్‌ను జపాన్ సైన్యం ఆక్రమించిన తర్వాత, 40,000 మంది భారతీయ యుద్ధ ఖైదీలు జపాన్ వశమయ్యారు. వీళ్లందరినీ మోహన్‌సింగ్‌కు జపాన్ అప్పగించింది. భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమివేయడానికి యుద్ధఖైదీల్లో ఎవరైనా సిద్ధంగా ఉంటే, వారు భారత జాతీయసైన్యం (ఆజాద్ హింద్‌ఫౌజ్)లో చేరవచ్చని మోహన్‌సింగ్ ప్రకటించారు.

ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ (భారత స్వాతంత్య్ర సమితి): ఆగ్నేయాసియా దేశాల్లోని ప్రవాస భారతీయులతో కలిసి, 1942లో టోక్యోలో రాస్ బిహారీ బోస్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పరిచాడు. భారత దేశానికి బ్రిటన్ నుంచి విముక్తి కలిగించడం ఈ సంఘం లక్ష్యం. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తొలి అధ్యక్షుడు రాస్ బిహారీ బోస్.

సుభాష్ చంద్రబోస్: సుభాష్ చంద్రబోస్‌ను తూర్పు ఆసియా ప్రాంతాలకు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఆహ్వానించి బాధ్యతలు స్వీకరించమని కోరింది. సుభాష్ చంద్రబోస్ 1943లో సింగపూర్‌లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ప్రవాస భారతీయులందరూ సుభాష్ చంద్రబోస్‌ను అభిమానంగా 'నేతాజీ' అని పిలిచారు. భారత జాతీయ సైనికులకు ఆయన ఉత్తేజకరమైన 'ఛలో ఢిల్లీ' నినాదాన్ని అందించాడు.

భారతజాతీయ సైన్యం స్వాతంత్య్ర పోరాటాలు: సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 1943లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం సింగపూర్‌లో ఏర్పాటైంది. సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించిన తొలిదేశం జపాన్.

¤ స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం అమెరికా, బ్రిటన్‌లపై యుద్ధం ప్రకటించింది.

¤ టోక్యోలో జరిగిన తూర్పు ఆసియాదేశాల సమావేశానికి (1943 నవంబర్) ప్రభుత్వాధినేత హోదాలో సుభాష్ చంద్రబోస్ హాజరయ్యాడు. ఈ సమావేశంలో తాత్కాలిక ప్రభుత్వానికి అండమాన్ నికోబార్ దీవులను జపాన్ అప్పగించింది. సుభాష్ చంద్రబోస్ అండమాన్ దీవులకు 'షహీద్' దీవులని, నికోబార్ దీవులకు 'స్వరాజ్య' దీవులని నామకరణం చేశాడు.

¤ 1944లో భారత జాతీయసైన్యం బ్రిటిష్ వారితో యుద్ధం మొదలుపెట్టింది. భారత జాతీయ సైన్యం మౌడక్, కోహిమా, ఇంపాల్ ప్రాంతాలను బ్రిటిష్ వారినుంచి ఆక్రమించింది.

¤ జపాన్ నుంచి పొందిన రంగూన్‌ను, భారత్ జాతీయ సైన్యం నుంచి బ్రిటిష్ సైన్యం వశపరచుకోవటంతో, ఆగ్నేయాసియాలో భారత జాతీయ సైన్యం సాగించిన స్వాతంత్య్ర సమరం అంతమైంది.

¤ రంగూన్‌ను బ్రిటిష్ వారు స్వాధీనపరచుకున్న తర్వాత, సుభాష్ చంద్రబోస్ బ్యాంకాక్ చేరుకుని, అక్కడ నుంచి తైపే చేరుకున్నాడు. 1945 ఆగస్టు 18న తైపేలో విమానం ఎక్కాడు. ఆ తర్వాత ఏం జరిగిందో స్పష్టంగా ఎవరికీ తెలీదు. జపాన్ వెల్లడించిన ప్రకటన ప్రకారం, బోస్ ఎక్కిన విమానం అగ్ని ప్రమాదానికి గురై బోస్ చనిపోయినట్లు తెలిసింది.

¤ భారత జాతీయసైన్యం తన లక్ష్యాన్ని సాధించలేక పోయినా పూర్తిగా వైఫల్యం చెందిందనడానికి వీల్లేదు. భారతదేశంలో ఇక ఏమాత్రం తమ సామ్రాజ్యాన్ని కొనసాగించలేమని బ్రిటన్ గుర్తించింది.

భారత జాతీయ సైనికుల విచారణ 
¤ భారత జాతీయ సైనికులను యుద్ధ ఖైదీలుగా బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుంది. యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని భారత జాతీయ కాంగ్రెస్‌తో పాటు, ముస్లింలీగ్, భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదలైన పార్టీలు ముక్త కంఠంతో యుద్ధ ఖైదీలకు మద్దతు పలికాయి. దీంతో ఉద్యమం పాక్షికమైంది కాదనీ, జాతీయమైందనీ అర్థమైంది.

¤ 'రక్తానికి రక్తం', 'శిక్ష పడ్డ ప్రతి యుద్ధఖైదీకి బదులుగా 20 మంది యూరోపియన్లను హతమారుస్తాం' అనే నినాదాలతో ఢిల్లీ నగర వీధుల్లో కరపత్రాలు, పోస్టర్లు వెలిశాయి. యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని సాగుతున్న ఉద్యమం జాతీయ స్థాయిలో ఉధృతమయ్యేసరికి బ్రిటిష్ ప్రభుత్వం సైనికులతో ఉదారంగా వ్యవహరించింది. వారి నాయకులను విచారించడానికి నిర్ణయించింది. భారత జాతీయ సైన్యం 1945 నవంబరులో నాయకులను ఎర్రకోటలో విచారించింది.

¤ బ్రిటిష్ ప్రభుత్వం విచారించిన భారతీయ సైన్యాధికారులు జనరల్ షానవాజ్ ఖాన్, కర్నల్ టి.కె. షెగాల్, కర్నల్ జి.యస్. ధిల్లాన్‌లు. అయితే వీరు ముగ్గురు యాదృచ్ఛికంగా వరుసగా ముస్లిం, హిందూ, సిక్కుమతాలకు చెందినవారు కావడంతో వీరి విడుదలకోసం వివిధ మతస్తులంతా ఏకమయ్యారు.

¤ భారత జాతీయ సైన్య అధికారుల తరఫున తేజ్ బహదూర్ సప్రూ , జవహర్ లాల్ నెహ్రూ, అరుణ్ అసఫ్ అలీ న్యాయవాదులుగా విచారణకు హాజరయ్యారు.

¤ ఆ ముగ్గురికీ బ్రిటిష్ ప్రభుత్వం యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. అయితే వాటిని తిరిగి రద్దు పరిచారు.

భారత నావికుల తిరుగుబాటు (1946): 1946 ఫిబ్రవరిలో బొంబాయిలో 'రాయల్ ఇండియన్ నేవీ'లో పనిచేస్తున్న సైనికులు బ్రిటన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

కారణాలు:
¤ బ్రిటిష్ అధికారులు జాత్యాహంకారాన్ని ప్రదర్శించడం

¤ ఆహారం సరిగ్గా లేకపోవడం

¤ పై అధికారుల చేతుల్లో కిందివారు అనుభవిస్తున్న అవమానాలు.

¤ తిరుగబాటుకు బొంబాయిలో బి.సి. దత్ నాయకత్వం వహించాడు. నావికులకు మద్ధతుగా కమ్యూనిస్ట్ పార్టీ బొంబాయిలో సమ్మెకు పిలుపునిచ్చింది. బొంబాయి తర్వాత కరాచీలో నావికులు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు సందర్భంగా జరిపిన కాల్పుల్లో 200 మంది మరణించారు. దీంతో తిరుగుబాటుదార్లు లొంగకపోతే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేస్తుందని బ్రిటన్ హెచ్చరించింది. సర్దార్ వల్లభాయ్‌పటేల్ మధ్య వర్తిత్వంతో తిరుగుబాటు ఆగిపోయింది.

ఆధునిక భారతదేశ చరిత్రలో కార్మిక ఉద్యమాలు: బ్రిటిష్‌వారు రైల్వేలు, బొగ్గుగనులు, నూలు తదితర పరిశ్రమలు స్థాపించడంతో  పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం ఏర్పడ్డాయి. పరిశ్రమలు బ్రిటిష్‌వారి ఆధీనంలో, స్వదేశీయుల చేతిలో ఉన్నాయి. ఎవరు పరిశ్రమలు స్థాపించినా కార్మికుల దోపిడీయే సర్వ సాధారణమైంది. తర్వాత కాలంలో కార్మిక ఉద్యమాలు ఊపిరిపోసుకున్నాయి.

కార్మిక ఉద్యమ ఆవిర్భావానికి కారణాలు:
¤ భారతీయ కార్మికులు పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, గనులు, తోటలు మొదలైన చోట్ల పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడపడం.

¤ భారతదేశ లేదా విదేశీ యజమానులుగానీ, భారత వలసవాద ప్రభుత్వంగానీ కార్మికుల స్థితిగతులు మెరుగుపరచడంపై దృష్టి పెట్టక పోవడం.

¤ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగక పోవడం, జీవన ప్రమాణాలు మరింత దిగజారడం, దీనిపై యాజమాన్యాలు దృష్టి పెట్టకపోవడం.

¤ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కార్మికుల సహకారం కోసం కొంతమంది జాతీయ నాయకులు కార్మికుల ఉద్యమాలకు మార్గదర్శకత్వాన్ని అందించారు.

¤ 1917 రష్యా విప్లవం, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం కార్మికులలో ఉత్తేజాన్ని నింపాయి.

¤ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కార్మిక సంఘం, కార్మికుల ప్రయోజనాలకు రక్షణ కల్పించడం.

¤ బాల కార్మికులు, మహిళా కార్మికులకు ఎక్కువ పని గంటలు ఉండటం. వీటితోపాటు అనేక ఇతర కారణాలు కార్మిక ఉద్యమాల ఆవిర్భావానికి దోహదం చేశాయి.

¤ ఆధునిక భారతదేశ చరిత్రలో సాగిన కార్మిక ఉద్యమంలో అనేక దశలుఉన్నాయి.

1875-1918 మధ్య దశ: 
¤ కార్మికులతో ఉదారంగా వ్యవహరించాలని శశిపాద బెనర్జీ (భారత శ్రమజీవి), ఎన్.ఎం.లోఖాండి దీనబంధుమిత్ర మొదలైనవారు తమ రచనల ద్వారా కోరారు.
¤ వేతనాలుపెంపు, పని గంటల తగ్గింపు మొదలైన సమస్యలపై కార్మికులు ప్రయత్నాలు చేశారు.

¤ లార్డ్ రిప్పన్ 1881లో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ చట్టాన్ని ప్రవేశపెట్టి బాలకార్మికుల రక్షణకు సంబంధించి నిబంధనలు రూపొందించారు. బాలకార్మికులు రోజుకు 9 గంటల కంటే ఎక్కువ పనిచేయరాదని, ప్రతిదినం గంట విరామం, నెలకు 4 సెలవు రోజులు ఉండాలని ఈ చట్టంలో పేర్కొన్నారు.

¤ లార్డ్ లాన్స్‌డౌన్ 1891లో రెండో ఫ్యాక్టరీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీన్లో స్త్రీలు రోజుకు 11 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని, రాత్రివేళల్లో పనిచేయించకూడదని ఆదేశించారు.

¤ భారత జాతీయ కాంగ్రెస్‌కు, కార్మికులకు మధ్య కొద్దిమేర సదవగాహన ఏర్పడింది. 1899లో భారతీయ రైల్వేల్లో కార్మికుల సమ్మెను తిలక్ సమర్థించగా, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెను నిర్వహించారు.

¤ వివిధ దేశాలకు, బ్రిటిష్ కాలనీలకు తీసుకువెళ్లిన భారతీయ కార్మికుల స్థితిగతులను మెరుగుపరచాలని కార్మికులు ప్రయత్నం చేశారు.

1918-1924 దశ: 
¤ ఈ దశలో పలు కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. 1918లో మద్రాస్‌లో ఏర్పడిన మద్రాస్ కార్మిక సంఘం భారతదేశంలో ఏర్పడిన కార్మిక సంఘాల్లో ప్రథమమైంది. బి.పి.-వాడియా ఈ సంఘం అధ్యక్షుడు. కాలక్రమంలో 1920 నాటికి సమారు 125 సంఘాలు ఏర్పడ్డాయి.

¤ 1920లో దేశావ్యాప్తంగా ఏర్పడిన వివిధ సంఘాలను సంఘటిత పరచడానికి జాతీయస్థాయిలో 'అఖిల భారత కార్మిక కాంగ్రెస్‌'ను (ఏఐటీయూసీ) ఎన్.ఎం.జోషి మొదలైన వారు బొంబాయిలో ఏర్పాటుచేశారు. దీని మొదటి అధ్యక్షుడు లాలా లజపతిరాయ్.

¤ కార్మిక సంబంధిత చట్టాలు రూపొందించడానికి, కార్మిక వర్గ సంక్షేమం కోసం అఖిల భారత కార్మిక కాంగ్రెస్ కార్మిక విధానం పోరాడింది.

¤ మహాత్మగాంధీ 1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించి విజయం సాధించడంతో కార్మికులకు, జాతీయనాయకులకు మధ్య సంబంధాలు పెరగడం ప్రారంభమైంది. దీంతో కార్మికులు సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గ్గొన్నారు.

¤ 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కార్మికులకు రాష్ట్రశాసన సభల్లో ప్రాతినిథ్యం లభించింది.

¤ జవహర్ లాల్ నెహ్రూ, సభాష్ చంద్రబోస్, సీఎఫ్ ఆండ్రోస్, సీఆర్.దాస్ తదితర జాతీయ కాంగ్రెస్ నాయకులు ఏఐటీయూసీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

1924-1935 దశ:
¤ ఈ దశలో కమ్యూనిస్ట్ భావజాల ప్రభావం భారత కార్మికోద్యమంపై పనిచేసింది. కఠినమైన పదజాలం, భాషల వినియోగం, దమనరీతిని తలపించే చర్యలను కమ్యూనిస్ట్‌లు సమ్మెల్లో వినియోగించటంతో కార్మికుల్లో అసంతృప్తి ప్రబలింది.

¤ కార్మిక ఉద్యమంలో భావజాల వైరుధ్యంవల్ల మితవాదులు కార్మికోద్యమాన్ని కమ్యూనిస్ట్టుల నుంచి దూరంగా తీసుకుపోవాలని ఏఐటీయూసీని వదిలి ఆఖిల భారత కార్మిక సంఘం సమాఖ్య (ఏఐటీయూఎఫ్)గా ఏర్పడ్డారు.

¤ 1929 ఆర్థిక మాంద్యం, 1930 శాసనోల్లంఘన ఉద్యమం, కార్మిక సమ్మెల విఫలం, కమ్యూనిస్ట్ పార్టీపైన, ఏఐటీయూఎఫ్ పైన ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఏఐటీయూసీలో తిరిగి ఏఐటీయూఎఫ్ విలీనమైంది.

¤ ఈ దశలో ముఖ్యమైన మరో సంఘటన 1926లో కార్మిక సంఘాల చట్టం (ట్రేడ్ యూనియన్ యాక్ట్) రావడం. ఈ చట్టం ద్వారా కార్మిక సంఘాలకు స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు.

¤ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలపాల నియంత్రణకు 1929 ప్రజారక్షణ చట్టాన్ని, కార్మిక సమస్యల పరిష్కారానికి 1929 వ్యాపార తగాదాల చట్టాన్ని ప్రవేశపెట్టారు.

1935-1947 దశ: 
ఈ దశలో కార్మిక సంఘాల కార్యక్రమాలను పున‌రుద్ధరించారు. సమ్మెల సంఖ్యలో వృద్ధి క‌నిపించింది.

దీనికి దోహదం చేసిన అంశాలు: 
¤ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పలు రాష్ట్రాల్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కార్మిక ఉద్యమంపై సానుభూతిని ప్రకటించాయి.

¤ అంతర్జాతీయ కార్మిక సంఘం కూడా, కార్మికులపై సానుకూల దృక్పథం కలిగి ఉండమని పారిశ్రామిక యాజమానులను ఆదేశించడం.

¤ పలు కార్మిక సంఘాలు కలిసిపోవడం. ఉదాహరణకు ఇండియన్ ట్రేడర్స్ యూనియన్ ఫెడరేషన్, నేషనల్ ట్రేడర్ యూనియన్ ఫెడ్‌రేషన్‌లో కలవడం.

¤ ఈ దశలో రెండో ప్రపంచ యుద్ధం వల్ల భారతీయ పరిశ్రమలకు రక్షణ కలిగింది. విదేశీ వస్తువులను భారతీయ మార్కెట్‌కు సరఫరా చేయడం నిలిపి వేయడంతో భారతీయ పరిశ్రమలు తమ కార్యకలాపాలను బాగా విస్తరించుకున్నాయి.

¤ రెండో ప్రపంచ యుద్ధంవల్ల కార్మికుల వేతనాల్లో పెరుగుదల లేకపోవడంతో కార్మిక ఉద్యమం విస్తరించడమే కాకుండా, కార్మిక సంఘం సభ్యత్వం పెరిగింది.

¤ జాతీయ సర్వీస్ ఆర్డినెన్స్‌ను 1940లో ప్రవేశపెట్టడం ద్వారా కార్మికుల హక్కులకు రక్షణ కల్పించడం జరిగింది.

¤ 1941లో ప్రవేశపెట్టిన అత్యవసర సర్వీసుల నిర్వహణ ఆర్డినెన్స్ ద్వారా సరైన కారణం లేకుండా కార్మికులను తొలగించకూడదని ఆదేశాలు ఇచ్చారు.

¤ రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఏఐటీయూసీ తిరిగి కమ్యూనిస్ట్‌ల ప్రాబల్యంలోకి వెళ్లింది. అది క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి అప్రతిష్ఠపాలైంది.

¤ కమ్యూనిస్ట్‌ల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఏఐటీయూసీకి ప్రత్యామ్నాయంగా జాతీయ కార్మిక సంఘాలన్నీ సంఘటితమై ఐఎన్‌టీయూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్)గా ఏర్పడ్డాయి.

¤ భారతదేశంలో కార్మిక ఉద్యమాల అభివృద్ధిని పరిశీలిస్తే దుర్భర పరిస్థితుల నుంచి తదనంతర కాలంలో వివిధ చట్టాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం ఆరంభమైందని తెలుస్తుంది. దీంతోపాటు కార్మికులు జాతీయోద్యమానికి కూడా తమవంతు సహకారాన్ని అందించారు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again