పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 17, 2014

బ్రిటిష్ పాలనలో భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలు - III


               నేటి భారత రాజ్యాంగానికి మూలాధారం 1935 భారత ప్రభుత్వ చట్టం. మన రాజ్యాంగంపై ఇది ఎక్కువ ప్రభావం చూపింది. ప్రత్యేకంగా తొలిసారిగా భారతదేశ ప్రతినిధులతో దీర్ఘాలోచనలు చేసి ఈ చట్టాన్ని రూపొందించారు. అతి తక్కువ కాలంలో, కష్టపడి రూపొందించిన చట్టం ఇది. ప్రజల నుంచి వ్యతిరేకత పొందిన చట్టంగా కూడా 1935 భారత ప్రభుత్వ చట్టానికి ప్రత్యేకత ఉంది. 

1935 భారత ప్రభుత్వ చట్టం తేవడానికి దారితీసిన పరిస్థితులు; చట్టం ముఖ్యాంశాలు; గుణదోషాలు; 1919, 1935 చట్టాల మధ్య పోలికలు; తేడాలు మొదలైన విషయాల గురించి ఇప్పుడు విశదంగా తెలుసుకుందాం. 

1935 భారత ప్రభుత్వ చట్టం తేవడానికి దారితీసిన పరిస్థితులు: 1919 మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు లోపభూయిష్టం. భారతీయులకు ఏ విధంగా లాభం చేకూర్చలేదు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. దీంతో భారతీయులను తృప్తిపరిచేందుకు మరోసారి సంస్కరణలు అవసరమయ్యాయి.

సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం: 1920-22 మధ్య గాంధీ అడుగుజాడల్లో జరిగిన సహాయ నిరాకరణోద్యమం భారతీయులను స్వాతంత్య్ర సమరంవైపు ఉత్తేజితులను చేసింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం 1919 మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను సమీక్షించి, భారతీయులకు నూతన రాజ్యాంగ సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు 1927లో సైమన్ కమిషన్‌ను నియమించింది. 

భారతీయులెవ్వరూ లేని ఈ శ్వేతజాతి సైమన్ కమిషన్, తమకు న్యాయం చేయదని భావించి, భారతీయులు దీన్ని బహిష్కరించారు. కమిషన్ నియామకాన్ని ఖండిస్తూ, దేశమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అప్పటి భారత రాజ్య కార్యదర్శి బర్కన్‌హెడ్ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయవలసిందిగా, భారత నాయకులకు సవాల్ విసిరారు. భారతీయులు ఈ సవాల్‌ను స్వీకరించి, 1928లో మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో రాజ్యాంగ ముసాయిదా తయారుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులను సంతృప్తి పరచాలంటే రాజ్యాంగ సంస్కరణలు ఆవశ్యకమయ్యాయి.

1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశం: 1929లో జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 'సంపూర్ణ స్వరాజ్య' స్థాపనే తమ లక్ష్యమని, దాని సాధనకు 1930లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని (ఉప్పు సత్యాగ్రహం) భారతీయులు చేపట్టారు. ప్రజలు అసంఖ్యాకంగా పాల్గొన్న ఈ ఉద్యమం విజృంభించిన తుఫాను కెరటంలా యావత్భారతావనిని ముంచెత్తింది. దీన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో సంస్కరణలు ఒక భాగం.

¤ 'విభజించి పాలించు' అనే సిద్ధాంతాన్ని అమలు చేయడంలో భాగంగా భారతీయ సమాజం నుంచి ముస్లింలనే కాకుండా, ఇతర అల్పసంఖ్యాక వర్గాలను వేరు చేసేందుకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టాలని బ్రిటిషర్లు నిర్ణయించారు.

సైమన్ కమిషన్ నివేదిక అమలు: భారతీయులెవ్వరూ లేని సైమన్ కమిషన్ ఏకపక్ష నివేదిక ఇచ్చింది. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దుచేసి, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలని, కేంద్రంలో శాసనసభకు బాధ్యత వహించే మంత్రిమండలిని ఏర్పాటు చేయాలని నివేదిక పేర్కొంది. దాన్ని అమలు చేయాలని బ్రిటిషర్లు నిర్ణయించారు. 

రౌండ్ టేబుల్ సమావేశాలు: సైమన్ కమిషన్ నివేదికను భారతీయులు తిరస్కరించినా, దాని ఆధారంగా రాజ్యాం గాన్ని రూపొందించడానికి ఆ నివేదికపై చర్చించేందుకు 1930 - 1932 మధ్య లండన్‌లో 3 రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగాయి. వీటిలో చర్చించిన అంశాల ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందింది.

1935 భారత ప్రభుత్వ చట్టం - ముఖ్యాంశాలు: సమాఖ్య (ఫెడరల్) ప్రభుత్వం ఏర్పాటు: బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాలను కలిపి ఫెడరల్ ప్రభుత్వంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ పాలిత రాష్ట్రాలన్నీ సమాఖ్య ప్రభుత్వంలో అంతర్భాగమవుతాయి. సమాఖ్యలో చేరే స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి. అయితే సమాఖ్య ప్రభుత్వంలో చేరడానికి స్వదేశీ సంస్థానాలు ఆసక్తి కనబరచకపోవడంతో ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు జరగలేదు.

అధికార విభజన: పరిపాలనా అంశాలను మూడు జాబితాలుగా విభజించారు. అవి కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు. మిగిలిన పరిపాలనా అంశాలు (అవశిష్ట) గవర్నర్ జనరల్ అధీనంలో ఉంటాయి. గవర్నర్ జనరల్ తన విచక్షణ మేరకు వాటిని కేంద్రానికి లేదా రాష్ట్రానికి కేటాయించవచ్చు.

గమనిక: ప్రస్తుతం, అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందుతాయి.

ఫెడరల్ కోర్టు ఏర్పాటు: 1935 భారత ప్రభుత్వ చట్టం సమాఖ్య న్యాయస్థానం ఏర్పాటుకు వీలు కల్పించింది. కేంద్రానికి, రాష్ట్రాలకు లేదా రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది. 

1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1937లో ఢిల్లీలో ఫెడరల్ కోర్టు ఏర్పాటైంది. ఇదే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుగా మారింది.

కేంద్రంలో ద్విసభా విధానం: గత చట్టం మాదిరి, కేంద్రంలో ద్విసభా విధానం ఏర్పడింది. ఇందులో ఎగువ సభను రాజ్యసభ అని, దిగువ సభను సమాఖ్య శాసనసభ అని అంటారు.

¤ ఎగువ సభకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే, దిగువ సభకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి.

¤ ఎగువ సభ శాశ్వత సభ కాగా, దిగువ సభ కాలపరిమితి అయిదేళ్లు.

ప్రత్యేక నియోజకవర్గాలు: ఈ చట్టం ద్వారా సిక్కులు, యూరోపియన్లు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు (1909 చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు.)
కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు: ద్వంద్వ ప్రభుత్వం ప్రకారం కేంద్ర పరిపాలనా అంశాలను రెండు భాగాలుగా చేశారు. అవి ప్రభుత్వాధీన (రిజర్వ్‌డ్), శాసనసభ అధీన (ట్రాన్స్‌ఫర్డ్) అంశాలు. రక్షణ, విదేశీవ్యవహారాలు, ఆర్థికశాఖ మొదలైన ప్రాధాన్య శాఖలు గవర్నర్ జనరల్ (వైశ్రాయ్) తన కార్యనిర్వాహక మండలి సహాయంతో నిర్వహించారు. ట్రాన్స్‌ఫర్డ్ జాబితాను గవర్నర్ జనరల్ అధీనంలోని భారతీయ మంత్రిమండలి నిర్వహించేది.

కేంద్రంలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం: ఈ చట్టం ద్వారా కేంద్రంలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. అంటే గవర్నర్ జనరల్ అధీనంలోని భారతీయ (శాసనసభ నుంచి ఎన్నుకున్న) మంత్రిమండలి శాసనసభకు బాధ్యత వహించాలి. వీరు శాసనసభ విశ్వాసాన్ని కోల్పోతే రాజీనామా చేయాలి. గవర్నర్ జనరల్ నేతృత్వంలోని కార్యనిర్వాహకమండలి శాసనసభకు బాధ్యత వహించదు. 

రాష్ట్రాల్లో పూర్తిస్థాయి బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు: ఈ చట్టం రాష్ట్రాల్లోని పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని రద్దుచేసి పూర్తిస్థాయి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ చట్టం ద్వారా ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్ర పరిపాలనా శాఖలన్నిటినీ రాష్ట్ర శాసనసభలకు బాధ్యత వహించే భారతీయ మంత్రులకు ఇచ్చారు. అంటే రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలను రద్దుచేసి అన్ని శాఖలూ భారతీయులకే ఇచ్చారు. భారతీయ మంత్రులందరూ శాసనసభకు బాధ్యత వహించడంవల్ల దీన్ని పూర్తిస్థాయి బాధ్యతాయుత ప్రభుత్వం అంటారు.

రాష్ట్రాల్లో ద్వంద్వ శాసనసభ ఏర్పాటు: కేంద్రంలో ఉండే ద్వంద్వ శాసనసభ విధానం రాష్ట్రాల్లో కూడా ఏర్పాటైంది. అవే శాసనసభ, శాసనమండలి (లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్). అయితే 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ విధానాన్ని ఏర్పాటుచేశారు. అవి మద్రాస్, బొంబాయి, కలకత్తా, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం.

¤ రిజర్వ్‌బ్యాంక్ ఏర్పాటు, ఫెడరల్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును ప్రతిపాదించింది.

¤ గవర్నర్, గవర్నర్ జనరల్ అధికారాలను విస్తృతపరిచారు. శాసనాలను ఆమోదించడం, తిరస్కరించడం, పునఃపరిశీలనకు పంపడం, ఆర్డినెన్స్ జారీచేయడం, వీటోద్వారా రద్దుచేయడం మొదలైన అధికారాలను గవర్నర్, గవర్నర్ జనరల్‌లకు కల్పించారు.

1935 భారత ప్రభుత్వ చట్టం - సమీక్ష: స్వదేశీ రాజులెవ్వరూ సమాఖ్య ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించకపోవడంవల్ల సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. సమాఖ్యలో రాష్ట్రాలు చేరడాన్ని తప్పనిసరి చేశారు. అయితే స్వదేశీ సంస్థానాలు చేరడం వారి ఇష్టానికి వదలివేశారు. సమాఖ్య ప్రభుత్వంలో లోపాలుండటంవల్ల 'కీత్' అనే రచయిత దీన్ని 'అక్రమ సమాఖ్య' గా పేర్కొన్నారు. 

¤ గవర్నర్, గవర్నర్ జనరల్‌లకు విస్తృత, నిరంకుశ అధికారాలను కల్పించడంవల్ల భారతీయ మంత్రిమండలి కేంద్ర, రాష్ట్రాల్లో చేసిన శాసనాలను తిరస్కరించడం, వీటోచేయడం వంటివి చేశారు. దీంతో రాష్ట్రాల్లో స్వపరిపాలన (పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం) ఒక కంటితుడుపు చర్యగా మిగిలిపోయింది.

¤ ఫెడరల్ కోర్టు ఏర్పాటైనా, న్యాయ నిర్వహణలో ఇది ఇంగ్లండ్‌లోని ప్రీవీకౌన్సిల్‌కు లోబడి పనిచేయడం, ప్రజాస్వామ్య విధానానికి, సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది.

¤ ప్రత్యేక నియోజకవర్గాలను ముస్లింలకే కాకుండా ఇతర వర్గాల వారికి కూడా విస్తృత పరచడంద్వారా మన దేశ ఐక్యతను ఈ చట్టం శాశ్వతంగా బలిచేసింది.
జాతీయ నాయకుల స్పందన: ఈ చట్టంలో లోపాలుండటంతో దేశంలోని అన్ని వర్గాలవారు దీన్ని వ్యతిరేకించారు. జాతీయవాదుల ఆశల్ని, ఆకాంక్షల్ని తృప్తిపరచకపోవడంవల్ల జాతీయ నాయకులు కిందివిధంగా స్పందించారు.

¤ ''ఈ చట్టం బలమైన బ్రేకులుండి, ఇంజిన్‌లేని యంత్రంలాంటిది'' - జవహర్‌లాల్ నెహ్రూ

¤ ''ఈ చట్టం పైకి ప్రజాస్వామ్యయుతంగా కనిపించినా, లోలోపల అంతా బూటకమే'' - మదన్‌మోహన్ మాలవ్య

¤ ''ఇది పూర్తిగా కుళ్లిపోయిన చట్టం, ఏ మాత్రం అంగీకార యోగ్యం కాదు'' - మహ్మద్ ఆలీ జిన్నా

చట్టం ప్రాముఖ్యం: చట్టంలో లోపాలున్నా, భారత రాజ్యాంగ చరిత్రలో దీనికి ప్రత్యేకత ఉంది. నేటి భారత రాజ్యాంగ నిర్మాణానికి ఇది ముఖ్యప్రాతిపదికగా నిలిచింది.

¤ సమాఖ్య రాజ్యాంగానికి ఈ చట్టం తొలిసారిగా రూపకల్పన చేసింది. అందుకే స్వాతంత్య్రానంతరం స్వదేశీ సంస్థానాలు, భారతదేశంలో విలీనమయ్యేందుకు వీలుకల్పించింది. 

¤ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన స్వపరిపాలనావ్యవస్థ ఆధునిక రాజ్యాంగానికి మార్గదర్శకమైంది.

రాజ్యాంగ సంస్కరణలు - ఎన్నికలు:  1892 భారత శాసనసభల చట్టంలో మొదటిసారిగా ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు. పరోక్ష ఎన్నికలు జరిగాయి. 1919 భారత ప్రభుత్వ చట్టం, ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తెచ్చింది. స్త్రీలకు ఓటుహక్కు కల్పించింది.

రాజ్యాంగ సంస్కరణలు - భారత రాజ్య కార్యదర్శి: 1858 భారత ప్రభుత్వ చట్టం భారత రాజ్య కార్యదర్శి (సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా)ని, ఆయనకు సహాయం చేసేందుకు 15 మంది సభ్యులతో కూడిన ఇండియన్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేసింది. వీరికి జీతభత్యాలు భారతదేశ నిధులనుంచే ఇచ్చేవారు. అయితే 1919 భారత ప్రభుత్వ చట్టం భారత రాజ్య కార్యదర్శి, ఆయన సలహామండలి వేతనాలను ఇంగ్లండ్ దేశ నిధుల నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. అదే 1935 భారత ప్రభుత్వ చట్టం రాజ్యకార్యదర్శి సలహామండలిని రద్దుచేసి, సలహాదారులను నియమించింది. 


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again