పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 23, 2014

ద్రవ్యం, బ్యాంకింగ్ (Money and Banking)


        ప్రాచీనకాలంలో వస్తువులకు బదులుగా వస్తువులనే మార్పిడి చేసుకునేవారు. దీన్నే వస్తుమార్పిడి పద్ధతి లేదా బార్టర్ సిస్టమ్ అంటారు. చైనా మొదటిసారిగా కాగితం ద్రవ్యాన్ని ముద్రించి చలామణిలోకి తెచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యం వినిమయ సాధనంగా ఉపయోగపడుతోంది.


ద్రవ్యం: మార్పిడి మాధ్యమంగా, విలువల కొలమానంగా అందరి అంగీకారం పొంది ఉపయోగపడేదే ద్రవ్యం.

ద్రవ్య విధులు (Functions of Money):
1. వినిమయ మాధ్యమం: ఒక వస్తువుకు బదులు వేరొక వస్తువు పొందడానికి ద్రవ్యం నిర్వహించే విధి వినిమయ మాధ్యమం.

2. విలువల కొలమానం: అన్ని వస్తువుల విలువను కొలిచే కొలమానం ద్రవ్యం. వస్తుసేవల విలువను ద్రవ్యం రూపంలో చెప్పడాన్ని ధర అంటారు.

3. భవిష్యత్తులో చెల్లింపుల కొలమానం: రుణాల చెల్లింపునకు స్థిర మాధ్యమంగా ద్రవ్యం ఉపయోగపడుతుంది.

4. మూల్యనిధి లేదా విలువల నిధి: భవిష్యత్తు చెల్లింపుల కోసం ద్రవ్యం నిల్వ చేసుకోవడం అనేది ద్రవ్యం నిర్వహించే నాలుగో విధి.

ద్రవ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

1. న్యాయాత్మకమైన టెండరు ద్రవ్యం: ప్రభుత్వం జారీచేసే కరెన్సీ న్యాయాత్మకమైన ద్రవ్యం. ఇది చట్ట సమ్మతమైంది (Legal Tender Money). చెల్లింపుల మాధ్యమంగా అందరి అంగీకారం పొందుతుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ (కేంద్ర బ్యాంక్) జారీచేసే కరెన్సీ అంతా న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం ఉదా: రూ.10, రూ.100 నోట్లు.
2. ఐచ్ఛిక ద్రవ్యం (Optional Money): ఇది చట్ట సమ్మతి ద్రవ్యం కాదు. ఇది నమ్మకం, విశ్వాసంపై ఆధారపడి అంగీకారం పొందుతుంది. చెక్కులు, డ్రాఫ్ట్‌లు, డిబెంచర్లు, షేర్లు మొదలైనవి ఇచ్ఛాపూర్వక ద్రవ్యానికి ఉదాహరణ. ఇవి ద్రవ్యాన్ని పోలి ద్రవ్యం నిర్వహించే విధులను నిర్వహిస్తాయి. కాబట్టి వీటిని సమీప ద్రవ్యం (Near Money) అనికూడా అంటారు.

1. చెక్: తన అకౌంట్ నుంచి కొంత సొమ్మును జారీ చేయాల్సిందిగా ఖాతాదారు బ్యాంకుకిచ్చే ఆజ్ఞే చెక్. అకౌంట్‌లో తగినంత సొమ్ము ఉన్నప్పుడే చెక్ చెల్లుబాటు అవుతుంది.

2. డ్రాఫ్ట్: వీటిని బ్యాంకులు జారీచేస్తాయి. వ్యక్తుల వద్ద నుంచి ద్రవ్యాన్ని తీసుకుని కొంత కమీషన్‌పై వారికి అంత ద్రవ్యానికి డ్రాప్ట్ జారీచేస్తాయి. ఇవి తప్పకుండా అంగీకారం పొందుతాయి.

3. బాండ్‌లు: అప్పు తీసుకున్న వ్యక్తి బేరర్‌కు కొంత నిర్ణీత కాలం తరువాత ఆ రుణ మొత్తానికి నిర్ణీత వడ్డీని కలిపి తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేసే కాగితపు పత్రమే బాండ్.

4. డిబెంచర్: కంపెనీలు, సంస్థలు ఒక నిర్ణీత వడ్డీతో వీటిని జారీచేస్తాయి.

5. బ్యాంక్ కార్డులు: ఎంపిక చేసిన కొంతమంది ఖాతాదారులకు బ్యాంకులు ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల సదుపాయాన్ని కలుగజేస్తున్నాయి. ఇదికూడా ఐచ్ఛిక ద్రవ్యమే.

6. బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్: అమ్మకందారుడు తనకు పంపిన వస్తువులు చేరిన తర్వాత కొనుగోలుదారుడు వాటి బిల్‌ను అంగీకరిస్తూ సంతకం పెట్టి తిరిగి అమ్మకందారుడికి పంపేదే బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్. ద్రవ్యం అనుకున్న సమయం లోపల చెల్లింపవుతుంది. అమ్మకందారుడు ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్‌ను బ్యాంకులో తనఖా పెట్టి కొంత సొమ్మును రుణంగా పొందవచ్చు.

7. హుండీలు: ప్రాంతీయభాషలో లేదా జాతీయభాషలో రాసిన బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్‌లనే హుండీలని అంటారు.
రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank)  
భారతదేశంలో కేంద్ర బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ పేరుతో పిలుస్తారు. 1935లో రిజర్వ్ బ్యాంక్‌ను స్థాపించారు. ఇది బ్యాంక్‌లకు బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ముఖ్య ఆశయం 'ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలుపరచడం'.

రిజర్వ్ బ్యాంక్ విధులు:

1. కరెన్సీ నోట్లు జారీ చేయడం: రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే ముఖ్య విధి కరెన్సీ నోట్ల ముద్రణ, జారీచేయడం. రూపాయి నోటు/ నాణెం, అంతకంటే తక్కువ నాణాలను మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ జారీచేస్తుంది. (రెండు రూపాయలు ఆపైన కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెడతారు. 1 రూపాయి అంతకంటే తక్కువ కరెన్సీపై కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది.)

2. ప్రభుత్వ బ్యాంక్: ఆర్.బి.ఐ. భారత ప్రభుత్వానికి బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. ప్రభుత్వానికి ప్రతినిధి, సలహాదారు, అంతిమ రుణదాత రిజర్వ్ బాంక్.

3. బ్యాంకర్లకు బ్యాంకు (Supreme Bank): దేశంలోని వాణిజ్య బ్యాంకులన్నింటిని నియంత్రించే అధికారం ఆర్.బి.ఐ.కి ఉంది. ఇది దేశంలోనే అత్యున్నత బ్యాంక్. బ్యాంకింగ్ వ్యవస్థకే దీన్ని 'APEX Bank' (శిఖరాగ్ర బ్యాంక్)గా పిలుస్తారు. దేశంలో సి.ఆర్.ఆర్., ఎస్.ఎల్.ఆర్.ను నిర్ణయిస్తూ వాణిజ్య బ్యాంకుల పరపతిని నియంత్రిస్తుంది (Credit control).

4. విదేశీ మారకపు నిల్వలకు సంరక్షణకర్త (Custodian): భారతదేశ విదేశీ మారక నిల్వలను రిజర్వ్ బ్యాంకు సంరక్షిస్తుంది. రూపాయి బాహ్య విలువను కాపాడుతుంది (నిర్వహిస్తుంది).

5. పరపతి నియంత్రణ (Credit control): వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలను నియంత్రిస్తుంది. ఈ విషయంలో ఆర్.బి.ఐ. వాణిజ్య బ్యాంకులకు తగిన సూచనలందిస్తుంది.

6. వ్యవస్థాపక విధులు (Organisation functions): ఆర్.బి.ఐ. కేంద్ర బ్యాంకు స్థాయిలో వివిధ రంగాల అవసరాలను తీర్చడానికి ప్రత్యేక ఏజెన్సీలను నియమిస్తుంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి నాబార్డ్ (NABARD జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు)- 1982 జూలై 12న ; పరిశ్రమల అభివృద్ధికి IDBI(భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు)- 1964 జులైలో ఏర్పడ్డాయి. దేశంలో వ్యవసాయ పరపతికి నాబార్డ్ ఎపెక్స్ బ్యాంక్‌గాను, పారిశ్రామిక పరపతికి ఐ.డి.బి.ఐ. అపెక్స్ బ్యాంకుగాను వ్యవహరిస్తాయి.
వాణిజ్య బ్యాంకులు (Commercial Banks)
 ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి, వారి నుంచి డిపా జిట్లను స్వీకరిస్తూ; అవసరమైన వాటికి పరపతి సమ కూరుస్తూ దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న ద్రవ్య సంస్థలు వాణిజ్య బ్యాంకులు.
వాణిజ్య బ్యాంకుల ముఖ్య విధులు:

I. డిపాజిట్ల స్వీకరణ: వాణిజ్య బ్యాంకులు ప్రజల నుంచి 3 రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి.

1. నిర్ణీత డిపాజిట్ ఖాతా: ప్రజలు కొంత నిర్ణీత సమయానికి బ్యాంకులో ద్రవ్యాన్ని జమ చేస్తారు. వీటిమీద బ్యాంకు వడ్డీరేటు చెల్లిస్తుంది. డిపాజిట్ చేసిన కాలవ్యవధినిబట్టి వడ్డీ రేటు ఉంటుంది (ఎక్కువ కాలానికి డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు కూడా ఎక్కువ).

2. పొదుపు ఖాతా: వీటిమీద కూడా వాణిజ్య బ్యాంకులు వడ్డీని చెల్లిస్తాయి. కానీ, ఈ వడ్డీ నిర్ణీత డిపాజిట్లపై చెల్లించే దానికంటే తక్కువ.

3. ప్రస్తుత ఖాతా/ కరెంట్ డిపాజిట్: అధిక మొత్తాల్లో వ్యక్తులు తరచూ జమ చేస్తూ, ఉపసంహరించుకునే వీలున్నవి. వీటిమీద ఎలాంటి వడ్డీ ఉండదు.

II. రుణాల మంజూరు

1. సాధారణ రుణాలు: వ్యక్తుల నుంచి బ్యాంకు హామీ ఉంచుకొని కొంత సొమ్మును రుణంగా వారి ఖాతాకు జమచేస్తుంది. ఆ మొత్తానికి వడ్డీ వసూలు చేస్తుంది.

2. నగదు రుణాలు: హామీ చూపిన వ్యక్తులకు కావలసిన ద్రవ్యాన్ని వారి ఖాతాకు జమచేసి అందులో నుంచి వారు ఉపసంహ రించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ వసూలు చేస్తుంది.
3. ఓవర్ డ్రాఫ్ట్: వ్యక్తుల ఖాతాలో ఉన్న సొమ్ము కంటే ఎక్కువ మొత్తంలో వ్యక్తులు ఉపసంహరించుకునే సదుపాయం. ఎంతో నమ్మకం ఉన్న ఖాతాదారులకు మాత్రమే బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తుంది.

4. బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్‌లో డిస్కౌంట్‌లు ఇవ్వడం: వ్యక్తులు తమ వద్ద ఉన్న Bills of exchange లు వాణిజ్య బ్యాంకుల వద్ద తనఖాపెట్టి కొంత సొమ్మును రుణంగా పొందే సదుపాయం.

      ఈ విధులే కాకుండా బ్యాంకులు తమ ఖాతాదారులకు మరికొన్ని సేవలందిస్తాయి. డ్రాఫ్ట్‌లను ఇవ్వడం; షేర్లు బాండ్లు కొనడం - అమ్మడం; లాకర్ సదుపాయం; ట్రావెలర్ చెక్కులను జారీ చేయడం, తదితరాలు.
 సహకార గ్రామీణ బ్యాంకులు
       వ్యవసాయదారుల పరపతి అవసరాలను తీర్చే ఉద్దేశంతో ప్రభుత్వం సహకార గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేసింది.

వ్యవసాయదారులకు 3 రకాల రుణాలు అవసరం.

1. స్వల్పకాలిక రుణాలు (ఒక సంవత్సర కాలపరిమితి): విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటివి కొనడానికి రైతులకు అవసరమైనవి స్వల్ప కాలిక రుణాలు.

2. మధ్యకాలిక రుణాలు (ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలపరిమితి): పశువులు, వ్యవసాయ పనిముట్లు కొనడానికి కావాల్సినవి మధ్యకాలిక రుణాలు.

3. దీర్ఘకాలిక రుణాలు (ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితి): భూమిని అభివృద్ధి చేయడానికి, అదనపు భూమిని కొనడానికి, భారీ వ్యవసాయ యంత్రాలను (ట్రాక్టర్, మోటారు లాంటివి) కొనడానికి; పాత రుణాలను తీర్చడానికి వ్యవసాయదారులకు దీర్ఘ కాలిక రుణాలు అవసరమవుతాయి.
        భారతదేశంలో వ్యవసాయ రుణాలు అందించడంలో సహకార సంస్థలు, భూ అభివృద్ధి బ్యాంకులు ముఖ్యమైన ఏజెన్సీలు. సహకార సంస్థలు వ్యవసాయదారులకు స్వల్పకాల, మధ్యకాల పరపతి సౌకర్యాన్ని కల్పిస్తాయి. భూ అభివృద్ధి బ్యాంకులు దీర్ఘకాల రుణాలను మంజూరు చేస్తాయి. భారతదేశంలో సహకార సంస్థలను 3 అంచెల్లో, భూ అభివృద్ధి బ్యాంకులను 2 అంచెల్లో ఏర్పాటు చేశారు.
a. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు: ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటై రైతులకు ప్రత్యక్షంగా రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. చిన్న, సన్నకారు రైతులకు రుణ సహాయం చేస్తాయి. ఇది సహకార పరపతి వ్యవస్థల 'చిట్టచివరి స్థాయి'లో (Lower level ) పని చేస్తుంది.

b. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు: వీటినే సహకార కేంద్ర బ్యాంకులు అని కూడా పిలుస్తారు. ఇవి జిల్లా స్థాయిలో పనిచేస్తాయి. ఇవి ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు రుణాలిస్తాయి. ఈ బ్యాంకులు రాష్ట్ర సహకార సంఘాలకు - ప్రాథమిక సహకార సంఘాలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తాయి.

c. రాష్ట్ర సహకార బ్యాంకులు: రాష్ట్ర సహకార బ్యాంకు సహకార వ్యవస్థకు అపెక్స్ బ్యాంకుగా (Apex Bank) వ్యవహరిస్తుంది. దీనికి వ్యవసాయదారులతో (ప్రజలతో) ప్రత్యక్ష సంబంధం ఉండదు. (అంటే ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించదు. అలాగే ప్రత్యక్ష రుణాలు ఇవ్వదు). రిజర్వు బ్యాంకు, నాబార్డ్‌ల నుంచి రుణాలను తీసుకొని కేంద్ర సహకార బ్యాంకులకు నిధులను సమకూరుస్తుంది. వాటి పనితీరును పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంకు ఆర్.బి.ఐ., నాబార్డ్, జిల్లా ప్రాథమిక సహకార సంస్థలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది.

1. ప్రాథమిక భూ అభివృద్ధి బ్యాంకులు: ఇవి వ్యవసాయదారులకు దీర్ఘకాలిక రుణాలను ప్రత్యక్షంగా అందచేస్తాయి. ఇవి జిల్లా స్థాయిలో ఉంటాయి. ప్రభుత్వం నుంచి, రాష్ట్ర భూ అభివృద్ధి బ్యాంకుల నుంచి నిధులను సమకూర్చుకుంటాయి.
2. రాష్ట్ర భూ అభివృద్ధి బ్యాంకులు: ఇవి రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. ప్రాథమిక భూ అభివృద్ధి బ్యాంకులకు ఆర్థిక సహాయం చేయడమే వీటి లక్ష్యం.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు  
       ఎం.నర్సింహం కమిటీ సూచనల ప్రకారం మనదేశంలో 1975 అక్టోబరు 2వ తేదీన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను నెలకొల్పారు. ఇవి సహకార బ్యాంకులకు అనుబంధ సంస్థలుగా, ప్రత్యామ్నాయ సంస్థలుగా పనిచేస్తాయి. ఇవి దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలను అతి తక్కువ వడ్డీరేట్లకు సమకూరుస్తాయి.

వాణిజ్య బ్యాంకులకు - ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు మధ్య ముఖ్య వ్యత్యాసాలు:

వాణిజ్య బ్యాంకులు 
1. ఇవి దేశవ్యాప్తంగా విస్తరించిఉన్నాయి (సంఖ్య ఎక్కువ).
2. అన్ని వర్గాల వారికి రుణాలు ఇస్తాయి (పారిశ్రామిక వేత్తలకు, వ్యవసాయదారులకు, వ్యక్తులకు).
3. వడ్డీరేటు ఎక్కువ.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 
1. ఇవి కొన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయి (సంఖ్య తక్కువ).
2. వ్యవసాయ రంగానికి మాత్రమే అంటే రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తి పనులవారికి మాత్రమే రుణాలు ఇస్తాయి.
3. వడ్డీరేటు తక్కువ.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again