పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 01, 2015

రాబడి - వ్యయం


             దేశంలోని పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వీటిలో అతి ముఖ్యమైనవి మూడు. అవి:

                  1) దేశ సంరక్షణ
                  2) శాంతి భద్రతల పరిరక్షణ
                  3) సామాజిక వస్తు సేవల అందుబాటు

           వీటన్నింటిని సమర్థంగా నిర్వహించడానికి ప్రభుత్వానికి 'రాబడి' అవసరం. దీన్ని ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల రూపంలో సమకూర్చుకుంటుంది. ఇలా వచ్చిన రాబడి ద్వారా ప్రభుత్వం నిర్వహించే కార్యకలాపాల వల్ల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఇందులో పన్నులు చెల్లించనివారిని లబ్ధిదారుల నుంచి వేరుచేయడం సాధ్యం కాదు. కాబట్టి పౌరులందరికీ వాటి మీద సమాన హక్కులుంటాయి.

 ఉదా: దేశ రక్షణ, పోలీసు సేవలు, ఉచిత విద్య, ఆరోగ్య పరిరక్షణ మొదలైనవి.

¤ ప్రజలకు సంబంధించి వివిధ రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చేసే ఖర్చును 'వ్యయం' అంటారు

1. ప్రభుత్వ రాబడి
                  ప్రజల ఖర్చును భరించడానికి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. దీనికోసం ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా దేశ పౌరుల నుంచి డబ్బు వసూలు చేస్తోంది. దీన్నే ప్రభుత్వ రాబడి అంటారు.
ప్రభుత్వ రాబడి - సమకూర్చుకునే విధానాలు:
                  ప్రభుత్వం 'రాబడి'ని రెండు రకాలుగా సమకూర్చుకుంటుంది. అవి:
                  ఎ) పన్ను రాబడి (Tax Revenue)
                  బి) పన్నేతర రాబడి (Non - Tax Revenue)

ఎ) పన్ను రాబడి: ప్రజా వస్తుసేవలను ఉపయోగించడానికి వ్యక్తి లబ్ధితో సంబంధం లేకుండా చేసే నిర్బంధ చెల్లింపులను 'పన్నులు' (Taxes) అంటారు. ఈ పన్నులను రెండు రకాలుగా వర్గీకరించారు.


   

i) ప్రత్యక్ష పన్నులు: (Direct Taxes): పన్ను తొలి, తుది ప్రభావాలు ఒకరి మీదే ఉంటే దాన్ని ప్రత్యక్ష పన్నులు అంటారు. మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నులు అధికం.
ఉదా: ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, ఆస్తి పన్ను.

                

                       

ii) పరోక్ష పన్నులు: పన్ను తొలిభారం ఒకరిపైనా, అంతిమ భారం మరొకరిపైనా ఉండే పన్నులను పరోక్ష పన్నులు అంటారు. దీనిలో పన్నుభారాన్ని బదిలీ చేయడానికి వీలుంటుంది. సాధారణంగా వస్తువులు, సేవలపై ఇలాంటి పన్నులను విధిస్తారు.
ఉదా: కస్టమ్స్ సుంకాలు, ఎక్సైజ్ సుంకాలు, అమ్మకపు పన్ను, సేవా పన్ను, వినోదపు పన్ను లాంటివి.

                 


¤¤¤ పన్ను చెల్లింపులో Quid - Pro - Quo ఉండదు. అంటే పన్ను చెల్లింపునకు సమాన ప్రతిఫలాన్ని పొందలేం.

పన్నుల్లో రకాలు:
A) కేంద్ర పన్నులు: కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడిని నేరుగా పొందుతుంది.                

(i) ప్రత్యక్ష పన్నుల ద్వారా వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, ఎస్చీట్స్ పన్ను, బహుమతి పన్నులు.

                      

(ii) పరోక్ష పన్నుల ద్వారా వస్తువుల ఎగుమతి, దిగుమతులపై కస్టమ్స్ సుంకం మొదలైనవి.

B) రాష్ట్ర పన్నులు: రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధించి, వసూలు చేసుకుంటుంది.

                         

(i) ప్రత్యక్ష పన్నుల్లో వృత్తి పన్ను, ఆస్తి పన్ను, భూ రాబడులు, ఇంటిపన్ను, స్టాంపు ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొదలైనవి.

(ii) పరోక్ష పన్నుల్లో ప్రస్తుతం వస్తు అమ్మకపు పన్ను, టర్నోవర్ పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ పన్నులు (మందులపై పన్ను, మత్తు పానీయాలపై పన్ను), సినిమా, మోటారు వాహనాలపై పన్ను, విద్యుత్ సర్‌ఛార్జీ ఉన్నాయి.

ప్రజలపై విధించే పన్నులను కింది విధంగా విభజించవచ్చు.
A) అనుపాత పన్ను: ఆదాయపు అంచెలతో సంబంధం లేకుండా ఆదాయానికి అనుపాతంగా పన్ను విధిస్తే అదే అనుపాత పన్ను అవుతుంది.
ఉదా: రూ.50,000 పైన ఉన్న ఆదాయంలో 10% పన్ను అనుకుంటే రూ.70,000 ఆదాయం ఉన్న వ్యక్తి రూ.2000 పన్ను కట్టాల్సి వస్తుంది. అదే రూ.1,00,000 ఆదాయం ఉండే వ్యక్తి రూ 5,000 పన్ను కట్టాలి.

B) పురోగామి పన్ను: ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగితే దాన్ని పురోగామి పన్ను అంటారు.
ఉదా: రూ.50,000 మించిన ఆదాయం ఉన్నవారికి అంటే రూ.50,000 నుంచి రూ.70,000 మధ్య ఆదాయం ఉండే వ్యక్తికి 20%, రూ.70,000 నుంచి లక్ష రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తికి 30% పన్ను విధించడం. ఇందులో రూ.70,000 సంపాదించే వ్యక్తి రూ.4000, లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి రూ. 15000 పన్ను కడతారు. ఇందులో ఆదాయాన్ని బట్టి పన్ను విధిస్తారు. అయినప్పటికీ ఇలాంటి పన్ను ధనికులకు భారం అవుతుంది.

C) తిరోగామి పన్ను: ఈ రకమైన పన్నులో తక్కువ ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తులు కొనే వస్తువులపై ఎక్కువ పన్ను; ఎక్కువ ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తులు కొనే వస్తువులపై తక్కువ పన్ను విధిస్తారు. ఈ విధానం తక్కువ ఆదాయం ఉండే వ్యక్తులను అలాంటి వస్తువులు కొనకుండా నిరుత్సాహపరుస్తుంది. ఇలాంటి పన్ను మన దేశంలో ప్రాముఖ్యాన్ని పొందలేదు.

బి) పన్నేతర రాబడి:  ప్రభుత్వ రాబడుల్లో సింహభాగం పన్ను రాబడులే అయినప్పటికీ పన్నేతర రాబడిని కూడా కొంతవరకు పరిగణించాల్సి ఉంటుంది. అవి:
          1. వాణిజ్య రాబడులు అంటే ప్రభుత్వ సంస్థలు (రైల్వేలు, పోస్టాఫీసులు, విద్యుత్ వినియోగం, టోల్‌ ఫీజులు) ప్రజలకు చేసే సేవలకు ప్రతిఫలంగా వారి నుంచి నేరుగా రాబట్టే వసూళ్లు.

          2. ప్రభుత్వం రుణం ఇచ్చినప్పుడు వచ్చే వడ్డీలు

          3. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్లు.

         4. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం
  
          5. దేశీయ, విదేశీయ రుణాలు

          6. లోటుద్రవ్యం, ద్రవ్యోత్పత్తి

          7. జరిమానాలు, ఫీజులు, ఎస్చీట్స్ లాంటి పరిపాలనా రాబడులు.

ఎస్చీట్స్(Escheats): వ్యక్తి /వ్యక్తులు వారసులు లేకుండా మరణించినప్పుడు అతడి/వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దీన్నే 'ఎస్చీట్స్' అంటారు.
1. ప్రభుత్వానికి వచ్చే పన్నేతర రాబడుల్లో ముఖ్యమైనవి వడ్డీలు (రాష్ట్రాలకు, రైల్వేలకు ప్రభుత్వం ఇచ్చే రుణాలపై వచ్చే వడ్డీ).

2. పన్నేతర రాబడిలో అధిక వాటా డివిడెండ్లు, లాభాల నుంచి వస్తుంది.

పన్ను విధింపు వల్ల వచ్చే లాభ నష్టాలు:  వస్తువుపై పన్ను విధిస్తే దాని మార్కెట్ రేటు (Market Price) పెరుగుతుంది. అంటే పన్ను రేటు పెరిగితే కొనుగోలుదారుడికి భారం పెరుగుతుంది. దీనికోసం అతడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాడు. వ్యక్తుల వ్యక్తిగత ఆదాయంపై పన్ను పెంచితే ఎగవేతకు ప్రయత్నిస్తారు. దీని వల్ల పన్నులు కట్టేవారి సంఖ్య క్రమంగా తగ్గి, ప్రభుత్వ రాబడి తగ్గుతుంది. ఈవిధంగా పన్ను ఎగవేతకు ప్రయత్నించడాన్ని 'పన్నుపరిధి' (లెవల్ ఆఫ్ కాంప్లయన్స్) అంటారు. కాబట్టి పన్నురేటుకూ, పన్ను పరిధిలోకి వచ్చేవారి సంఖ్యకు మధ్య రుణాత్మక సంబంధం ఉంటుంది. ఉదాహరణకు మత్తు పదార్థాలపై పన్ను పెంచితే దాని వాడకం తగ్గుతుంది. అదే అత్యవసర మందుల ధరను పెంచితే పేదల ప్రాణాలతో చెలగాటమాడినట్లవుతుంది. కాబట్టి లాభ నష్టాల దృష్ట్యా పన్నులో హెచ్చుతగ్గులు ఉండాలి.

2. ప్రభుత్వ వ్యయం: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే ఖర్చును ప్రభుత్వ వ్యయం అంటారు. మూలధన ఆస్తుల తయారీ దృష్ట్యా ప్రభుత్వ వ్యయం రెండు రకాలు. అవి:

1. రెవెన్యూ లేదా రాబడి వ్యయం: ప్రభుత్వ దైనందిన వ్యవహారాల్లో భాగంగా సాధారణ, ఇతర సేవలకు అయ్యే వ్యయాన్ని 'రెవెన్యూ వ్యయం' అంటారు. ఈ వ్యయం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి కొత్త ఆస్తులు సృష్టించడం జరగదు. తిరిగి ఈ వ్యయాన్ని ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం అని రెండు రకాలుగా విభజించవచ్చు.

ఎ. ప్రణాళిక వ్యయం: ఇందులో కేంద్ర ప్రణాళిక వ్యయం, రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం భాగాలుగా ఉంటాయి.

బి. ప్రణాళికేతర వ్యయం: ఇందులో వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయం, పించన్లు, సాధారణ పరిపాలన మొదలైన అంశాలు ఉంటాయి. ఇందులో వడ్డీ చెల్లింపులకు అధిక భాగం ఖర్చు చేస్తారు.

¤¤¤ రెవెన్యూ వ్యయంలో ప్రణాళికా వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం ఎక్కువగా ఉంటుంది.

2. మూలధన వ్యయం: ప్రజల భవిష్యత్ దృష్ట్యా ప్రయోజనాత్మక స్థిర వ్యయాన్నే మూలధన వ్యయం అంటారు.
ఉదా: జాతీయ రహదారులు, జల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమలు మొదలైనవి.
                సాధారణంగా యుద్ధ సమయంలో దేశరక్షణ కోసం చేసే వ్యయం మూలధన వ్యయమైతే, శాంతి సమయంలో సైన్యాన్ని పోషించడానికి చేసే వ్యయం రెవెన్యూ వ్యయం అవుతుంది.

               ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికా దృష్ట్యా దీన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు.

ఎ. అభివృద్ధి వ్యయం: మొత్తం వ్యయంలో ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడితే భవిష్యత్ దేశ ఆర్థికాభివృద్ధికి అది ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని అర్థం.
ఉదా: సాంఘిక, సామాజిక ఆర్థిక సేవలు, అభివృద్ధి నిమిత్తం రాష్ట్రాలకు ఇచ్చే సహకారం.

బి. అభివృద్ధేతర వ్యయం: ఎక్కువ ఖర్చు అభివృద్ధేతర వ్యయానికి కేటాయిస్తే దీర్ఘకాలికంగా ఫలితాలిచ్చే మూలధన ఆస్తులను తయారు చేసుకునే స్థితిలో ఆ ప్రభుత్వం లేదని అర్థం.
ఉదా: వడ్డీ చెల్లింపులు, రక్షణ మొదలైనవి.

¤ ధనాన్ని ఖర్చుపెట్టడంలో ప్రభుత్వం సాంఘిక ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ప్రభుత్వ వ్యయం వల్ల ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొందాలి. కాబట్టి ప్రభుత్వం అభివృద్ధి, అభివృద్ధేతర వ్యయాల్లో సమతౌల్యం సాధించాలి, దాంతో ప్రభుత్వ ఆదాయ, వ్యయానికి మధ్య సమతౌల్యం ఏర్పడుతుంది. దీనికోసం ప్రభుత్వ బడ్జెట్ లోటు లేదా మిగులు బడ్జెట్‌గా ఉండకూడదు.

బిట్స్ 

1. ప్రభుత్వం ప్రజల నుంచి రాబట్టే రాబడిలో ప్రధాన పాత్ర పోషించేది-
జ: పన్ను రాబడి

2. ప్రభుత్వం ప్రజలకు చేసే వ్యయంలో దేనికి అధిక ప్రాధాన్యం ఇస్తే అది భవిష్యత్ అభివృద్ధి ప్రాతిపదికగా భావించవచ్చు?
జ: అభివృద్ధి వ్యయం

3. 'ప్రభుత్వ రాబడికి ప్రధాన వనరులు పన్నులే' అని భావిస్తే కిందివాటిలో వేటి ద్వారా ప్రభుత్వం అధిక రాబడిని ఆర్జిస్తోంది?
జ: ప్రత్యక్ష పన్నులు

4. ప్రతి సంవత్సరం దేశంలోని వ్యక్తులందరూ తమ ఆదాయంపై ప్రభుత్వానికి 'వ్యక్తిగత ఆదాయ పన్ను' చెల్లిస్తారు. దీన్ని ఏ ప్రభుత్వం నిర్ణయిస్తుంది?
జ: కేంద్ర ప్రభుత్వం

5. ప్రభుత్వానికి వచ్చే పన్నేతర రాబడిలో అధిక వాటా దేని నుంచి వస్తుంది?
జ: డివిడెండ్లు

6. వ్యక్తి ఆర్జించే ఆదాయం పెరుగుతూ ఉంటే పన్నురేటు కూడా పెరుగుతుంది. దీన్ని ఎలా పిలుస్తారు?
జ: పురోగామి పన్ను

7. ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ -
జ: సంపద పన్ను

8. గృహోపకరణాలు, వాణిజ్య సముదాయాలకు ఉపయోగించే విద్యుత్ పై ప్రస్తుతం విధిస్తున్న 'విద్యుత్ వాడకపు పన్ను' (Sur charge) ను విధించే అధికారం ఎవరికి ఉంది?
జ: రాష్ట్ర ప్రభుత్వం

9. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టేది-
1) శాంతి భద్రతల పరిరక్షణ     2) దేశ సంరక్షణ     3) సామాజిక వస్తు సేవలు     జ: పైవన్నీ

10. కిందివాటిలో ప్రభుత్వం పొందే రాబడిలో పన్నేతర రాబడికి చెందింది ఏది?
1) విదేశీ రుణాలు        2) ద్రవ్యం ముద్రణ         3) ప్రభుత్వ ఆస్తుల అమ్మకం       జ: పైవన్నీ  

11. మనదేశంలో ఎక్కువగా ప్రాబల్యం పొందని పన్ను ఏది?
జ: తిరోగామి పన్ను

12. మూలధన వ్యయానికి ఉదాహరణ -
జ: యుద్ధం జరిగే సమయంలో సైన్యంపై చేసే వ్యయం

13. 'లెవల్ ఆఫ్ కాంప్లయన్స్' అంటే ఏమిటి?
జ: పన్ను భారంతో వాటిని చెల్లించే వ్యక్తుల సంఖ్య తగ్గడం

14. ఆస్తిపన్నుకు ఉదాహరణ -
జ: సంపద పన్ను

15. పరోక్షపన్ను అంటే ఏమిటి?
జ: పన్ను విధింపు తొలి ప్రభావం ఒకరిపై, మలి ప్రభావం మరొకరిపై ఉండటం.

16. 'అమ్మకపు పన్ను' దేనికి సంబంధించిందిగా చెప్పవచ్చు?
జ: పరోక్ష పన్ను

17. ఆదాయపు అంచెలతో సంబంధం లేకుండా ప్రభుత్వం విధించే పన్ను ఏది?
జ: అనుపాత పన్ను

18. ప్రభుత్వం వృద్ధులకు చెల్లించే 'వృద్ధాప్య పించన్' అనేది ఏ వ్యయం అవుతుంది?
జ: రాబడి, రెవెన్యూ వ్యయాలు

19. ప్రభుత్వం చేసే మూలధన వ్యయానికి ఉదాహరణ -
జ:నీటి ప్రాజెక్టుల నిర్మాణం

20. ప్రభుత్వం వైద్యమందులపై విధించే 'ఎక్సైజ్ సుంకం' అనేది ఏ రకమైన పన్ను?
జ: పరోక్ష పన్ను

21. ప్రభుత్వ రాబడిని ఆ ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో ఖర్చు చేయడంలోని ముఖ్య ఉద్దేశం?
జ: సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చేయడం

22. Quid - Pro - Quo అంటే ఏమిటి?
జ: పన్ను చెల్లింపునకు సమాన ప్రతిఫలాన్ని పొందలేకపోవడం

23. భారత రైల్వేల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం -
జ: పన్నేతర రాబడి

24. ప్రస్తుత పరిస్థితుల్లో రెవెన్యూ వ్యయంలో అధిక భాగం దేనికి వెచ్చిస్తున్నారు?
జ: వడ్డీ చెల్లింపులు

25. ప్రభుత్వానికి అత్యధికంగా రాబడిని తెచ్చేది-
జ: పన్నులు

26. రాష్ట్ర ప్రభుత్యానికి సమకూరే రాబడిలో ప్రధాన పాత్ర పోషించేది-
జ: అమ్మకం పన్ను

27. 'ఇంటిపన్ను, భూ రాబడి' పన్నులను ఏ ప్రభుత్వం విధిస్తుంది?
జ: రాష్ట్రప్రభుత్వం

28. 'కేంద్రపన్ను' కు ఉదాహరణ-
జ: కార్పొరేషన్ పన్ను

29. ప్రభుత్వం 'భారీ పరిశ్రమ'లను నిర్మించడం ఏ వ్యయం కిందికి వస్తుంది?
జ: మూలధన వ్యయం

30. దేశరక్షణ, పోలీసులకు ప్రభుత్వం వెచ్చించే వ్యయాన్ని ఏమంటారు?

జ: అభివృద్థేతర వ్యయం




0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again