పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 06, 2015

క్షారమృత్తిక లోహాలు - ధర్మాలు - ఉపయోగాలు


¤ బెరీలియం (Be), మెగ్నీషియం (Mg), కాల్షియం (Ca), స్ట్రాన్షియం (Sr), బేరియం (Ba), రేడియం (Ra) మూలకాలను IIA గ్రూపు మూలకాలు అంటారు. వీటికి క్షారమృత్తిక లోహాలనే పేరూ ఉంది.

                         

¤   వీటిలో రేడియం (Ra) రేడియోధార్మిక మూలకం. ఇది అరుదుగా లభిస్తుంది.

¤  IIA గ్రూపు మూలకాల సాధారణ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం .

క్షారమృత్తిక లోహాల ముఖ్య ఖనిజాలు:
బెరిల్ - [Be3Al2(SiO3)6]

డోలమైట్ - [CaCO3. MgCO3]

కార్నలైట్ - [MgCl2.KCl.6H2O]

బెరైట్ - BaSO4

మాగ్నసైట్ - MgCO3

ఎప్సం లవణం - MgSO4.7H2O

జిప్సం - CaSO4.2H2

¤  మెగ్నీషియం, కాల్షియం మూలకాలు వాటి కార్బొనేట్లు, సల్ఫేట్ల రూపంలో ప్రకృతిలో విరివిగా లభిస్తాయి.

ధర్మాలు: బెరీలియం మిగిలిన క్షారమృత్తిక లోహాల కంటే భిన్నంగా ప్రవర్తిస్తుంది.

¤  బెరీలియానికి ఉండే అధిక ధ్రువణ సామర్థ్యం వల్ల అది కోవలెంట్ సమ్మేళనాలను ఎక్కువగా ఏర్పరుస్తుంది.

¤  Be ద్వంద్వ స్వభావం ఉన్న లోహం. BeSO4 నీటిలో కరుగుతుంది. కానీ, మిగిలిన IIA గ్రూపు మూలకాల సల్ఫేట్లు నీటిలో కరగవు.

¤  Be, దాని లవణాలు జ్వాల పరీక్షను ఇవ్వవు. మిగిలినవి వాటి స్వాభావిక జ్వాల రంగునిస్తాయి.

¤  Be సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. దీని అత్యధిక కోవలెన్సీ 4.

¤  బెరీలియం, అల్యూమినియంతో కర్ణ సంబంధాన్ని ప్రదర్శిస్తుంది.

¤  Be, Al మూలకాలు రెండింటికీ ఒకే EN విలువ (1.50) ఉంటుంది.

¤  గాఢ HNO3 తో Be, Al రెండూ క్రియారహితమవుతాయి.

¤  గాఢ HNO3లో ముంచడం వల్ల ఒక లోహం దాని స్వభావ సిద్ధ రసాయన చర్యాశీలతను కోల్పోవడాన్ని క్రియారాహిత్యం అంటారు.

¤  Be, Al మూలకాల కార్బైడ్లు నీటితో చర్య జరిపి మీథేన్‌ను ఇవ్వటం వల్ల వీటిని మిథనైడ్‌లు అని అంటారు.

¤  IIA గ్రూపు మూలకాల పరమాణు వ్యాసార్ధం, పరమాణు పరిమాణాలు పైనుంచి కిందికి వెళ్లేకొద్దీ పెరుగుతాయి.

¤  IIA గ్రూపు మూలకాల అయనీకరణ శక్తి విలువలు పైనుంచి కిందికి వెళ్లేకొద్దీ (పరమాణు పరిమాణం పెరగడం వల్ల) తగ్గుతాయి.

¤  Be నుంచి Ra వరకూ పరమాణు పరిమాణం పెరుగుదలతో రుణ విద్యుదాత్మక విలువలు తగ్గుతాయి.

¤  IA గ్రూపు (క్షార లోహాలు) మూలకాల ద్రవీభవన, బాష్పీభవన స్థానాల కంటే IIA గ్రూపు (క్షారమృత్తిక లోహాలు) మూలకాల ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు ఎక్కువగా ఉంటాయి.

రసాయన ధర్మాలు
¤ క్షార మృత్తిక లోహాలు అత్యంత చురుకైనవి.

¤ O2తో చర్య: ఈ మూలకాలన్నీ ఆక్సిజన్‌లో మండి ద్విగుణాత్మక సమ్మేళనాలను ఇస్తాయి.

¤ Be మాత్రం మోనాక్సైడ్‌ను ఇస్తుంది.
2 Be + O2→2BeO                

¤ Ba పెరాక్సైడ్‌ను ఇస్తుంది.
Ba + O2→BaO2.                    

మిగిలినవి మోనాక్సైడ్లు, పెరాక్సైడ్లను ఇస్తాయి.

H2తో చర్య: క్షార మృత్తిక లోహాలు హైడ్రోజన్‌తో చర్యలో పాల్గొని (MH2) అనే సాధారణ ఫార్ములా ఉండే హైడ్రైడ్లను ఇస్తాయి. ఈ హైడ్రైడ్ల అయానిక స్వభావం కిందివిధంగా ఉంటుంది.

BeH2 <                       MgH2 < CaH2 < SrH2 < BaH2
(సంయోజనీయ                                      (అయానిక స్వభావం)
స్వభావం)          

హాలోజన్లతో చర్య: క్షార మృత్తిక లోహాలు హాలోజన్లతో చర్య జరిపి MX2 అనే సాధారణ ఫార్ములా ఉండే హాలైడ్లను ఏర్పరుస్తాయి.

¤ నీటిలో వీటి ద్రావణీయత పరమాణు సంఖ్య పెరుగుదలతోపాటు తగ్గుతుంది.

¤  BeF2 చాలా ఎక్కువగా కరుగుతుంది. మిగిలిన గ్రూపు మూలకాల ఫ్లోరైడ్‌లన్నీ నీటిలో కరగవు.

నీటితో చర్య: నీటితో క్షార మృత్తిక లోహాల చర్యాశీలత, వాటి పరమాణు సంఖ్య పెరుగుదలతోపాటు పెరుగుతుంది.

¤  బెరీలియం వేడి నీటితో కూడా చర్య జరపదు. మెగ్నీషియం చల్లటి నీటితో చర్య పరపదు కానీ, వేడి నీటిని విఘటనం చెందిస్తుంది.

Mg + 2H2O →Mg (OH)2 + H2 ↑

¤  మిగిలిన మూలకాలు చల్లటి నీటితో చర్య జరుపుతాయి.

మెగ్నీషియం సంగ్రహణం: మాగ్నసైట్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే లభించే మెగ్నీషియం ఆక్సైడ్ (MgO)ను కార్బన్, క్లోరిన్‌తో చర్యనొందిస్తే MgCl2 ఏర్పడుతుంది. ఈ మెగ్నీషియం క్లోరైడ్‌ను విద్యుత్ విశ్లేషణ చేస్తే Mg లోహం ఏర్పడుతుంది.

ఉపయోగాలు: బెరీలియంను నియాన్ దీపాల్లో ఎలక్ట్రోడుల తయారీకి వాడతారు. Cu ను మిశ్రమ లోహాల తయారీలో వాడతారు.

¤  మెగ్నీషియంను 'మాగ్నాలియం' లేదా 'ఎలక్ట్రాన్' లాంటి మిశ్రమ లోహాల తయారీలో వాడతారు. కొన్ని లోహ నిష్కర్షణల్లో 'డీ ఆక్సిడైజర్‌'గా ఉపయోగపడుతుంది.

¤  కాల్షియంను Be, Cr, Th మొదలైన వాటి తయారీలో; పెట్రోలియం నుంచి సల్ఫర్‌ను వేరుచేయడానికి ఉపయోగిస్తారు.

CaO తయారీ: కాల్షియం ఆక్సైడ్‌ను 'క్విక్ లైమ్' అంటారు. సున్నపు రాయిని భస్మీకరణం చేస్తే, CaO ఏర్పడుతుంది.
CaCO3   CaO +CO2 ↑

¤  సున్నపు రాయిని అధిక ఉష్ణోగ్రతల వద్ద భస్మీకరణం చేస్తే, కాల్షియం సిలికేట్ (CaSiO3) ఏర్పడుతుంది.

¤  సున్నపురాయికి సజల H2SO4ను కలిపి, ద్రావణాన్ని గాఢ పరిస్తే, జిప్సం ఏర్పడుతుంది.

CaCO3 + H2SO4→CaSO4 + H2O + CO2 ↑
CaSO4 + 2H2O  CaSO4 . 2H2O
                                                                  జిప్సం

ఉపయోగాలు: CaO ను మోర్టార్, సిమెంట్, గాజు, కాల్షియం క్లోరైడ్‌ల తయారీకి ఉపయోగిస్తారు.

¤  సున్నపురాయి, బంకమన్నును కలిపి వేడిచేస్తే, 'హైడ్రాలిక్ మోర్టార్' వస్తుంది. దీన్ని విరంజనకారిగా, యాంటీ సెప్టిక్‌గా ఉపయోగిస్తారు.

¤  1 భాగం తడిసున్నం, 3 భాగాలు ఇసుక, నీరు బాగా కలిసి ఉన్న మిశ్రమాన్ని 'లైమ్ మోర్టార్' అంటారు. దీనికి సిమెంట్‌ను కలిపితే 'సిమెంట్ మోర్టార్ అంటారు. ఈ సిమెంట్ మోర్టార్‌ను భవన నిర్మాణాల్లో ఉపయోగిస్తారు.

¤  CaCO3 సిమెంట్, వాషింగ్ సోడా, గాజు తయారీల్లో ఉపయోగిస్తారు.

కాల్షియం సల్ఫేట్: ప్రకృతిలో కాల్షియం సల్ఫేట్ జిప్సం (CaSO4. 2H2O) గా లభిస్తుంది. దీన్ని 120-1300C వరకు వేడిచేస్తే, 'ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్' లభిస్తుంది.

¤  CaSO4.  H2O ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు.

¤ CaSO4 లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను మూసల తయారీలో ఉపయోగిస్తారు.

¤ వైద్యరంగంలో విరిగిన ఎముకలను సరైన స్థానంలో అమర్చడానికి, దంత వైద్యం, ఆట బొమ్మల తయారీలోనూ వాడతారు.

¤  జిప్సంను సిమెంట్ తయారీలో, వడపోత కాగితాలను స్వేదనం చేయడానికి వాడతారు.

జీవశాస్త్రంలో మెగ్నీషియం, కాల్షియంల ప్రాధాన్యం

: జంతు కణాల్లో  అయాన్ల గాఢత ఎక్కువగా ఉంటుంది.

¤  ఫాస్ఫో హైడ్రోలేజ్‌లు, ఫాస్ఫోట్రాన్స్‌ఫరేజ్‌లు లాంటి ఎంజైమ్‌లలో ఉంటుంది. ఈ ఎంజైమ్‌లు ATP చర్యలో పాల్గొని శక్తిని విడుదల చేస్తాయి. , ATP తో సంశ్లిష్టాన్నిస్తుంది.

¤ చెట్లలోని ఆకుపచ్చ పదార్థమైన క్లోరోఫిల్‌లో  ఒక ఘటక పదార్థం.
 : ఎముకల్లో, దంతాల్లో  అయాన్ అపటైట్ [Ca3(PO4)2] రూపంలో ఉంటుంది. దంతాలపై ఉండే పింగాణి పూత - ఫ్లోరాపటైట్ [3Ca3(PO)2.CaF2]

¤  రక్తం గడ్డ కట్టడానికి, గుండె క్రమంగా కొట్టుకోవడానికి, కండరాలు ముడుచుకు పోవడానికి కూడా  అయాన్లు తోడ్పడతాయి.


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again