పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 08, 2015

భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ

                            సోషల్ కంటెంట్ - డి .ఎస్.సి స్కూల్ అసిస్టెంట్ 2014-15

    బ్యాంకో (Banco), బాంక్వీ (Banque) అనే పదాల నుంచి బ్యాంకు అనే పదం ఉద్భవించింది. దీనికి అర్థం 'బల్ల'. ప్రపంచంలోనే తొలిసారిగా 1157లో 'బ్యాంక్ ఆఫ్ వెనిస్' అనే ప్రాచీనమైన వాణిజ్య బ్యాంకు ఏర్పడింది. అప్పట్లో బ్యాంకులను వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, స్వర్ణకారులు కలిసి నిర్వహించేవారు.

                                                  

 నిర్వచనం: భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం ''కోరిన వెంటనే లేదా మరో సమయంలో చెక్కు, డ్రాఫ్ట్, ఆర్డర్ల ద్వారా లేదా మరోవిధంగా, తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లు స్వీకరించి, ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి లేదా పెట్టుబడి కోసం ఉపయోగించడమే బ్యాంకు వ్యాపారం."

 భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కేంద్ర బ్యాంకును రిజర్వు బ్యాంకు అంటారు. 1934లో రిజర్వు బ్యాంకు చట్టాన్ని రూపొందించారు. 1935 ఏప్రిల్ 1న రిజర్వు బ్యాంకును స్థాపించారు. చివరగా 1949 జనవరి 1వ తేదీన ఆర్‌బీఐని జాతీయం చేశారు.
 20 మంది డైరెక్టర్లు ఉన్న బోర్డు ఆర్‌బీఐని నిర్వహిస్తుంది. బోర్డులో ఒక గవర్నరు, నలుగురు ఉప గవర్నరులు ఉంటారు. ప్రస్తుత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్.

                     

 భారతదేశంలో 'రిజర్వు బ్యాంకు' కేంద్ర బ్యాంకు. ఇది దేశం మొత్తం మీద ద్రవ్య మార్కెట్‌లో అత్యున్నత శిఖరాగ్ర సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఇది 'న్యూస్ లెటర్' అనే పక్ష పత్రికను అధికారికంగా ముద్రిస్తోంది.

మన దేశంలో 4 నాణేల ముద్రణా కేంద్రాలు (టంక శాలలు) ఉన్నాయి. అవి:
1. హైదరాబాద్
2. ముంబయి
3. కోల్‌కతా
4. నొయిడా

  నోట్ల ముద్రణా కేంద్రాలు
  సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ - హైదరాబాద్
  కరెన్సీ నోట్స్ ప్రెస్ - నాసిక్
  ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ - నాసిక్
  బ్యాంక్ నోట్స్ ప్రెస్ - దేవాస్
  ఆధునిక కరెన్సీ నోట్స్ ప్రెస్ - మైసూర్
  సెక్యూరిటీ పేపర్ ప్రెస్ - ఔషంగాబాద్

ఆర్‌బీఐ విధులు

 కరెన్సీ నోట్లను జారీ చేయడం
     మనదేశంలో కరెన్సీ నోట్లు ముద్రించడానికి కేవలం ఆర్‌బీఐకి మాత్రమే గుత్తాధిపత్యం ఉంది. రెండు రూపాయల నోటు నుంచి వెయ్యి రూపాయల నోటు వరకు ఇది ముద్రిస్తుంది.
 మనదేశానికి ప్రామాణిక ద్రవ్యమైన రూపాయిని, దానికంటే తక్కువ నాణేలను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది. దీనిపై ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది.

 ప్రభుత్వ బ్యాంకు
    కేంద్ర ప్రభుత్వానికీ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకూ రిజర్వు బ్యాంకు ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా ఇది ప్రతినిధి, సలహాదారుగానూ పనిచేస్తుంది. ప్రభుత్వ రుణాలను నిర్వహించడం, ప్రభుత్వం తరఫున చెల్లింపులు చేయడంతోపాటు అవసరమైన పరిస్థితుల్లో 3 నెలల కాలపరిమితితో స్వల్పకాలిక రుణాల మంజూరు, అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తుంది.

 బ్యాంకులకే బ్యాంకు
    దేశంలోని అన్ని రకాల బ్యాంకులు ఆర్‌బీఐకి లోబడి పనిచేయాలి. అంటే ఇతర అన్ని బ్యాంకులను ఆర్‌బీఐ నియంత్రిస్తుంది.

    ప్రతి వాణిజ్య బ్యాంకు తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్‌బీఐ వద్ద ఉంచాలి, దీన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై ఎంత వడ్డీని వసూలు చేయాలో  నిర్ణయించడంతోపాటు, వాటిని తనిఖీ చేసి తగిన సూచనలను ఇచ్చే అధికారం కూడా ఆర్‌బీఐకి ఉంటుంది.

విదేశీ మారకపు నిల్వల సంరక్షణకర్త
    మన ద్రవ్యానికి బాహ్య విలువను నిర్వహిస్తూ, విదేశీ బ్యాంకుల పరిశీలన, మారకపు నిల్వల సంరక్షణకర్తగా ఆర్‌బీఐ వ్యవహరిస్తుంది.

                              
అంతిమ రుణదాత
    కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సాధారణ బ్యాంకుల వద్ద ఉండే నగదు నిర్వహణ సౌలభ్యం తగ్గినప్పుడు వాటి నిర్వహణకు ఆర్‌బీఐ రుణాలను ఇస్తుంది. అందుకే దీన్ని అంతిమ రుణదాత అంటారు.

పరపతి నియంత్రణ
    ఆర్‌బీఐ విధులన్నింటి కంటే ఇది అత్యంత ముఖ్యమైంది. వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలను ప్రాధాన్యపరంగా విభజించి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకులకు సూచనలిస్తుంది. అంతేకాకుండా వాణిజ్య బ్యాంకులు మార్కెట్‌లో సృష్టించే పరపతి వల్ల ఎదురయ్యే ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం బారిన పడకుండా స్థిరత్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంది.

వ్యవస్థాపక విధులు
    బ్యాంకు కార్యకలాపాలు కేవలం పట్టణ ప్రాంతంలోనే అధికంగా ఉండకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్‌బీఐ తన శాఖలను విస్తరిస్తుంది. కొన్ని నిర్దిష్ట వర్గాల అవసరాలను తీర్చడానికి ప్రత్యేక ఏజెన్సీలను కూడా నియమిస్తుంది. ఇందులో భాగంగానే వ్యవసాయ రంగాభివృద్ధికి NABARD (1982)ను, పారిశ్రామిక రంగాభివృద్ధికి IDBIను, పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలనిచ్చే ఫైనాన్స్ కార్పొరేషన్లను స్థాపించారు.
 సమాచార సేకరణ, ప్రచురణ, శిక్షణ కళాశాలలు ఏర్పాటు చేసింది.

 ద్రవ్య మార్కెట్‌ను అభివృద్ధిపరచి పరపతిని పెంపొందించేందుకు 1952లో బిల్లు మార్కెట్ పథకాన్ని ప్రారంభించింది.

 ద్రవ్య విధాన సాధనాలు లేదా పరపతి నియంత్రణ సాధనాలు

 మార్కెట్‌లో వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి పరిమాణ, వ్యయాలను రిజర్వు బ్యాంకు కింది విధంగా నియంత్రిస్తుంది.

 బ్యాంకు రేటు విధానం
   ఆర్‌బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలపై విధించే వడ్డీనే బ్యాంకు రేటు అంటారు. ఇది పెరిగితే బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇచ్చే రుణాల రేటును పెంచుతాయి. దీనివల్ల మార్కెట్‌లో ద్రవ్యత్వం తగ్గుతుంది.

అందుకే ద్రవ్వోల్బణ కాలంలో బ్యాంకురేటు పెరుగుతుంది. ప్రతిద్రవ్యోల్బణం కాలంలో బ్యాంకు రేటును తగ్గించడం ద్వారా ఆర్‌బీఐ తన పరపతిని విస్తరిస్తుంది.

 డిసెంబరు 2013 నాటికి బ్యాంకుకు చెందిన వివిధ రేట్లు
 బ్యాంకు రేటు: 8.75%
 సీఆర్ఆర్(CRR): 4%
 ఎస్ఎల్ఆర్ (SLR): 23%
 రెపో రేటు (Repo Rate): 7.75%
 రివర్స్ రెపో రేటు (Reverse Repo Rate): 6.75%
 మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (Marginal Standing Facility): 8.75%

 బహిరంగ మార్కెట్ చర్యలు
     ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్‌లో ప్రజలకు, వాణిజ్య బ్యాంకులకు అమ్ముతుంది. తిరిగి అదే కొంటుంది. ఈ విధానాన్నే బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు.

  ఆర్‌బీఐ అమ్మే సెక్యూరిటీలను బ్యాంకులు కొంటే దాంతో ద్రవ్యం ఆర్‌బీఐ వద్దకు చేరడంతో బ్యాంకుల పరపతి సృష్టి తగ్గుతుంది.

  ఆర్థిక మాంద్యంలో మార్కెట్‌లో పరపతి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆర్‌బీఐ ప్రభుత్వ బాండ్లను కొంటుంది.

 ద్రవ్యోల్బణ సమయంలో మార్కెట్‌లోని అధిక ద్రవ్యాన్ని నియంత్రించడానికి ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది. తద్వారా మార్కెట్‌లో ద్రవ్యం తగ్గి పరపతి నియంత్రించబడుతుంది.

 చర నిల్వల నిష్పత్తి
దీనిలో 2 భాగాలు ఉంటాయి.
1) నగదు నిల్వల నిష్పత్తి (CRR):
చట్టబద్ధంగా వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ నిర్దేశించిన నగదు నిష్పత్తిని కేంద్ర బ్యాంకు వద్ద ఉంచాలి. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి (CRR) అంటారు. ఆర్‌బీఐ వద్ద ఉన్న ఈ CRR కు,  బహిరంగ మార్కెట్‌లో పరపతికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో CRR ను ఆర్‌బీఐ పెంచుతుంది. ప్రతిద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తుంది.

2) SLR (Statutory Liquidity Ratio):
భారత రిజర్వు బ్యాంకు ఆదేశానుసారం ప్రతి వాణిజ్య బ్యాంకు తను సేకరించిన మొత్తం డిపాజిట్లలో కొంత భాగాన్ని నగదు, ప్రభుత్వ సెక్యూరిటీ లేదా బంగారం రూపేణా ఉంచుకోవాలి. ప్రస్తుతం నరసింహం కమిటీ సూచనలకు అనుగుణంగా SLR 23% ఉంది.

 నిబంధనలు పాటించని బ్యాంకులపై రుణాల నిరాకరణ, పెనాల్టీల విధింపు, బాండ్లపై రీ డిస్కౌంట్స్, లైసెన్స్ రద్దు లాంటి చర్యలను ఆర్‌బీఐ తీసుకుంటుంది.
వాణిజ్య బ్యాంకులకు రుణమంజూరులో హామీగా ఉంచుకునే సెక్యూరిటీలను ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కాలంలో మారుస్తుంది.

 వినియోగదారులకు ఇచ్చే రుణాల తిరిగి చెల్లింపును మార్చడం.

 వాణిజ్య బ్యాంకులు
    నిర్ణీత కాలానికి ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి వాటిని క్రమపద్ధతిలో వ్యాపారులు, పౌరులు, పరిశ్రమలకు నిర్ణీత వడ్డీకి రుణంగా ఇచ్చి, ఇతర సేవలను అందించే ఒక వ్యవస్థీకృతమైన ఆర్థిక సంస్థనే వాణిజ్య బ్యాంకు అంటారు.

 వాణిజ్య బ్యాంకులు రెండు రకాల విధులను నిర్వర్తిస్తాయి. అవి
               I. నిధుల సమీకరణ
             II. రుణాలు మంజూరు చేయడం

I. నిధుల సమీకరణ: ద్రవ్యం ఎక్కువగా ఉండి, దాన్ని నిల్వ చేసుకుందామనుకునే వ్యక్తుల నుంచి వివిధ రకాల డిపాజిట్ల ద్వారా డబ్బు సేకరించడం.
 A) పొదుపు డిపాజిట్లు: ప్రజలు తమ వద్ద ఉన్న మిగులు ద్రవ్యాన్ని తమ ఖాతాలో జమ చేసి, అవసరాలకు ఎప్పుడైనా తమ ఖాతా నుంచి ద్రవ్యాన్ని ఉపసంహరించుకునేవే పొదుపు డిపాజిట్లు.
 అయితే ఈ డిపాజిట్లపై వడ్డీ నామమాత్రం (తక్కువ)గా ఉంటుంది.

 B) కరెంటు ఖాతా: ప్రతిరోజు అధిక లావాదేవీలు జరిపే వ్యాపారస్తులు తమ ఖాతాలో అధిక మొత్తాలను జమ చేసి, వెంటనే ఉపసంహరించుకునే ఖాతాను కరెంటు ఖాతా అంటారు. ఈ డిపాజిట్లపై వడ్డీ ఉండదు.


II. రుణాలు మంజూరు చేయడం:
ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను బ్యాంకులు తమ వద్ద కొంత ఉంచుకుని మిగిలిన ద్రవ్యంతో ప్రజలకు వివిధ రకాల రుణాలను ఇస్తాయి. అవి

1) సాధారణ రుణాలు: సాధారణ వ్యక్తులకు హామీతో కొంత ద్రవ్యాన్ని రుణంగా ఇస్తాయి. దాన్ని ఆ వ్యక్తి వడ్డీతో కలిపి చెల్లించాలి.

2) నగదు రుణం: నిర్ణీత హామీతో వ్యక్తులకు రుణం మంజూరు చేసి, వారు ఉపయోగించుకున్న రుణానికి మాత్రమే వడ్డీ విధిస్తే అది నగదు రుణం అవుతుంది.

3) ఓవర్ డ్రాఫ్ట్: సక్రమ ఖాతా నిర్వహించే ఖాతాదారులకు తమ ఖాతాలోని నగదు కంటే అధికంగా ద్రవ్యం అవసరమైనప్పుడు బ్యాంకు తన విచక్షణతో కొంత అధిక సొమ్మును ఇవ్వడమే ఓవర్ డ్రాఫ్ట్. ఈ రుణాన్ని అందరికీ ఇవ్వాలని లేదు, బ్యాంకు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఖాతాదారుడు నిర్ణీత వడ్డీ చెల్లించాలి.

 సహకార గ్రామీణ బ్యాంకులు
    రైతులు పంటలు పండించడానికి అవసరమైన ఆర్థిక అవసరాలను తీర్చడమే ధ్యేయంగా సహకార గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయి. ఇవి రైతులకు కల్పించే రుణ అవసరాలు 3 రకాలు:

1) స్వల్పకాలిక రుణం: విత్తనాలు, ఎరువులు లాంటి తక్షణ అవసరాలు తీర్చుకోవడానికి 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం లాంటి నిర్ణీత కాలానికి ఈ స్వల్పకాలిక రుణాలను రైతులకు మంజూరు చేస్తారు. 2) మధ్యకాలిక రుణాలు: రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, పశువుల కొనుగోళ్ల కోసం సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వ్యవధికి ఈ రుణ సదుపాయాన్ని మంజూరు చేస్తారు.

3) దీర్ఘకాలిక రుణాలు: భూమి అభివృద్ధి పనులకు అధిక మొత్తంలో ద్రవ్యం అవసరమైతే అంటే బోర్లు, పైపులైన్లు పూడ్చడం, ట్రాక్టరు కొనుగోలు, ఆయిల్ లేదా కరెంట్ ఇంజిన్ల కొనుగోలు లాంటి కార్యక్రమాలకు 5 నుంచి 10 ఏళ్లకు మూలనిధి పనిముట్ల సహాయార్థం ఈ రుణాలను ఇస్తారు.

    మన దేశంలో రుణాలు ఇవ్వడంలో సహకార సంస్థలు, భూ అభివృద్ధి బ్యాంకులు ముఖ్య ఏజెన్సీలు. వీటిలో దీర్ఘకాలిక రుణాలను భూఅభివృద్ధి బ్యాంకులు ఇస్తే; మధ్య, స్వల్పకాలిక రుణాలను బ్యాంకులు, సహకార రుణ సంస్థలు కల్పిస్తాయి.

 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎం. నరసింహం కమిటీ సలహాపై ఏదైనా ఒక వాణిజ్య బ్యాంకు ఆధ్వర్యంలో ఒకటి లేదా రెండు జిల్లాల్లో ఏర్పాటు చేశారు.

                          
 నిర్వహణ, ఆర్థిక విషయంలోనూ వాణిజ్య బ్యాంకు వీటికి సహాయం చేస్తుంది. ఇవి వాణిజ్య బ్యాంకులను పోలి ఉన్నప్పటికీ కింది తేడాలు ఉంటాయి. 
0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again